29 జన, 2009

ప్రమదా వనం లో చర్చించ వలసినంత అవసరమా?


అసలు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు.ప్రమదా వనం లో చర్చించు కోడానికి దోసల పిండి తో గారెలు ఎలా చెయ్యాలి?ఆవకాయ ఎండి పొతే నీళ్ళు పోసి భూజు రాకుండా ఎలా వుంచుకోవాలి?100 రూపాయల చీరని వెయ్యి రూపాయలుగా ఎలా చూపించు కోవాలి లాంటి ఎన్నో ఇంటరెస్టింగ్ సబ్జక్ట్స్ వుండగా,సమాజం లో కొద్దో గొప్పో ఉన్నతమైన స్థితి లో ఉండి నా మానన నేను ఏదో నిషి గారి ని చూసి ప్రేరణ పొంది , బ్లాగ్ తయారుచేసుకుని అప్పుడప్పుడు రాసుకుని పోతుంటే ,వల్లెవరి వో తొక్కల దోసలు పొగడ లేదని లేదా చేసిన వంటకానికి వంకలు పెట్టామని మనసులో పెట్టుకుని , ప్రతి దానికి కువిమర్శలు చేసి వాడు వెధవ వేదవన్నర వెదవ అని తిన్నది అరిగేదాకా ఆయాస పడి తిట్టుకుని, కూడలి లోంచి వాడి బ్లాగ్ తీసెయ్యాలని మంగమ్మ సపధాలు అవసరమా?అంత కూడలి లోంచి తిసేయ్యవలసింత కూడని పని నేనేం చేసాని సదరు వ్యక్తులు తెలియబరుస్తారా?నా ఒక్కడి బ్లాగే అలా అవడం తో needle of suspicion ఎవరైనా చేసి ఉంటారేమో అనే అనిపించింది?అరుణం గారు రాసినదానికి నేను ఇచ్చిన కామెంట్ ఏంటో కూడా ఇదే బ్లాగ్ లో పెట్టానే. అది ఆ రాతలోని విషయానికి సంభందిన్చిందే గాని వేరే ఏమి కాదు కదా? ఆయినా కంద కి లేని దురద కత్తి పిటకు దేనికి?అలాగే నచ్చని వాళ్ళవి కూడలి లోంచి తీసెయ్యి అంటూ చిన్న పిల్లలా మారము చేస్తే '' చివరకు మిగిలేది '' మనం మన వందిమాగతులు అది ఎప్పటికి కాబోదు అందమైన వనం. అసలు పోల్ conduct చేస్తే తెలిసి పోతుంది నా బ్లాగ్ వుంచాలో కూడలి లోంచి తీసెయ్యాలో?కూడలి కన్నా వేగంగా ఆల్మోస్ట్ రాసిన వెంటనే చూపించే googletelugu బ్లాగ్స్ చాల వున్నాయి. నా కోడి కుయ్యక పొతే లోకానికి తెల్లవారదు అనుకునే అంత అజ్ఞానం లో వివేన్ గారు ఉండరని నా నమ్మకం.పక్క వాద్య గాళ్ళ సన్నాయి నొక్కులకి మొహమాటపడి అప శ్రుతులు పలికిన్చరనే విశ్వాసం. చూద్దాం ఏం జరుగు తుందో.ప్రస్తుతానికి బెనిఫిట్ అఫ్ డౌట్ ఇస్తూ నా బ్లాగ్ లో జరిగిన దానికి సాంకేతిక లోపాలేకారణం అని నమ్ముతూ ఏ కోతులు నా కిష్కింద లోకి రాలేదని నమ్ముతూ ఫిబ్రవరి 1 దాక వేచి చూస్తా ఇలాగే.శ్రీధర్ గారు మీ no నా దగ్గర లేక పోవడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యలేక పోయా. no దొరికే టైం కి చెయ్యి జారి పోయి ఇన్ని మలుపులు తిరిగి నేనీ react అవ్వ వలసిన పరిస్తితి వచ్చింది.గమనించ గలరు.

28 జన, 2009

కుల్లుమోతు కోతి


గత నాలుగు రోజులుగా నా బ్లాగ్ visit చేసిన బ్లాగర్స్ గమనించే వుంటారు అందమైన templetes తో ఆహ్లాదం గా వుండే నా బ్లాగ్ కొన్ని కుల్లుమోతు కోతుల వల్ల ''upgrade to pro today'', bandwidth exceeded అంటూ ముఖ్యమైన places లో అతుక్కుని కని పించడం తో పాటు నా పేజి templete కూడా చెరిపేశారు.ఇదంతా కూడా నిర్మొహమాటం గా అభిప్రాయాలూ వెల్ల బుచ్చడం, వాళ్ళ బ్లాగ్స్ లో నా కు నచ్చనవి ఎత్తి చూపడం తో సద్విమర్శల్ని సహృదయం తో స్వ్వీకరించే గొప్ప మనసు లేక ఇలా సాంకేతిక దాడులకి పాల్పడడం. ఆయినా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. పోనీ నేను templete మారుద్దమన్న కూడా అది మార్వా నివ్విడం లేదు.ముంబై దాడుల్లో ముష్కరలు తాజ్ హోటల్ అందాల్ని నాశనం చేసి ఉండొచ్చు గాక దానికి ఉన్నా డిమాండ్ ని మాత్రం ఏమి చెయ్యలేరు కదా.అందు చేత హోటల్ మీద కుళ్ళు తో నల్ల పైంట్ కొట్టినంత మాత్రాన లోపల సరుకు రుచి గా వుంటే బాబాయి హోటల్ కి కూడా డిమాండ్ వుంటూనే వుంటుంది.ఒక మనిషి లో సంస్కారం విమర్శలకి ప్రతిస్పందించిన విధానం లోనే తెలిసి పోతుంది.అందరు ఆకాశానికి ఎత్తేసే వాళ్ళే కావాలను కుంటే ,నా బ్లాగు నా కామెంటు అని రెండూ తనే రాసుకుని మిగతావి reject చేస్తే సరి.నేను మాత్రం తాటాకు చప్పులకి భయ పడి రాయడం ఆపను , ఇదే బ్లాగ్ ని బూత్ భంగ్ల గా మార్చినా సరే రాస్తూనే వుంటా ''నన్నపలేవ్ బొమ్మాలి ఆపలేవ్ '', అఘోరిలని రప్పించైనా నీ ఆటలు కట్టిస్తా బొమ్మాలి . అయ్యా అది విషయం ''ఎవరో గాయం రగిలించారు వేరవరో దానికి బలి అయినారు'' అంటూ పాడుకుంటూ రాసుకుంటూ పోతా.

25 జన, 2009

అరుంధతి సినిమాలో లోపాలు


ఈ రోజే అరుంధతి సినిమా చూడడం జరిగింది.ఇప్పటికే సమిక్షలలో సినిమాని ఆకాశానికి ఎత్తెయ్యడం వల్ల హై expectations తో చూడడం తో కొంత అసంతృప్తి కి లోనవడం జరిగింది. అందుకే ఇంక సమిక్షించకుండా నేను కని పెట్టిన లోపాలే రాస్తాను. మొట్టమొదటి పెద్ద లోపం ఏంటంటే జేజమ్మ ఎముకలతో చేసిన కత్తి లాంటి ఆయుధం పని చెయ్యాలంటే ,ఆ పశుపతి ప్రేతాత్మ ఎవరినైనా అవహించినప్పుడే పని చేస్తుందని ఆ ఆయుధం ఇస్తునప్పుడే అఘోరి (లేదా ఆ ఋషి) చెపుతాడు. కానీ క్లైమాక్స్ లో అరుంధతి ఆ ప్రేతాత్మ నే పొడిచినట్టు చూపుతారు.అలాగే పశుపతి కొంత సేపు వేరే మనుషుల మిద అవహిస్తూ మాట్లాడి, మళ్ళి నాశనం అయిపోయిన తన పాత రూపం లో ఎలా వస్తాడో?అలాగే పకిర్ ని ప్రేతాత్మ చంపేసినట్టు గా నీళ్ళలో ములిగి పోయినట్టు గా చూపించి మళ్ళి బతికోచినట్టు గా చూపిస్తారు.
ఒక సీన్ లో 9999 నెంబర్ కార్ రైల్ గేటు దగ్గర పట్టాల మీద ఇరుక్కు పొఇ రైల్ డీ కొట్టాక మండి పోయి నట్టు గా చూపించారు మళ్ళి నెక్స్ట్ సీన్ లో అదే కార్, no తో సహా అదే ,అరుంధతి ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్తునట్టు చూపిస్తారు.ఇంకో లోపం ఏంటంటే అరుంధతి ఆయుధం గా మారడం కోసం చని పోయే సీన్ లో వున్నా ముసలి అఘోరి కి అప్పటికే 70 ఏళ్ళు ,రెండో అరుంధతి మళ్ళి పుట్టి అదే రూపం లో రావడానికి 80 ఏళ్ళు పట్టినట్టు గా కధలో అర్ధం అవుతుంది అంటే ఆ ముసలాయన వయసు 150 అనుకోవాలా?ఈ సినిమా రెండు ప్రేతాత్మ ల పగ గా చెప్పుకోవచ్చు.50 కోట్లు దాక వసూల్ చేయొచ్చు అంటున్నారు ?అంత సీన్ నాకైతే కనబడలె . ఆ రోజుల్లోనే పాపం విటలచార్య ఇంత కంటే మంచి మాయల మరాటి సినిమాలు తీసినా మీడియా exposure అప్పట్లో లేదు కాబట్టి వసువుల్లలొ వెనక బడి వుండొచ్చు.కలదన్నవి కలవో ? లేవో?గాని వాటి పేరు చెప్పుకుని బాగు పడిన వారి లిస్టు లో యండమూరి తర్వాత శ్యాం ప్రసాద్ రెడ్డే (నిర్మాత) అని చెప్పుకోవచ్చు.

22 జన, 2009

ఇదేం దిక్కుమాలిన ఆలోచన?


మొన్న చదివిన న్యూస్ ఐటెం చాల ఆశ్చర్యం కల్గించింది.ముంబై లో హత మైన terrorists కి సంభందించిన వస్తువులు అంటే వాళ్ళు వాడిన బాగ్స్ ,జాకెట్స్, creditcards మొదలైనవి ముంబై పోలీసులు వేలం పాట లో పెడతారట.దాని ద్వారా వచ్చిన డబ్బుని దాడిలో మృతి చెందిన వాళ్ళ సంక్శేమానికి వాడతారట?ఇది ఇండియానా? పాకిస్తానా?వాళ్ళేమన్నా స్వతంత్రం కోసం పోరాడి మరణించిన దేశ భక్తులా?అంత కన్నా ఆ terrorists ల దాడి లో మరణించిన వాళ్ళ వస్తువుల్ని వేలం వేస్తె కొంత లో కొంత గౌరవమ్ గా వుండేది. ఇలా ఉగ్రవాదుల వస్తువులు వేలానికి పెడితే దావూద్ ఇబ్రహీం వచ్చి పాట బాగా పెంచి బోల్డు డబ్బు కురిపిస్తాడని ముంబై పోలిసుల ఆలోచనా?వొళ్ళు కాలి వోకదేడుస్తుంటే ఏదో కాలి ఇంకోడు ఏడ్చాడట అట్లా వుండి తమ వాళ్ళు పోఇన దుఖం తాలూకు కన్నీటి చారలు ఇంకా చేరగనే లేదు అప్పుడే ఇలాటి దిక్కుమాలిన పనులతో ఉగ్రవాదుల్ని హీరో లు గా చేసే పనులోకటా?.ఇలా ఉగ్ర వాదుల డ్రాయర్లు , బనిన్లు వేలం వేసే బదులు మదర్సాల్లో అనుమానితుల డ్రాయర్లు, బనిన్లు వూడ దిసీ నాలుగు ఝాడిస్తే కొంతైనా ఉగ్రవాదాన్ని అరికట్టచ్చేమో.

19 జన, 2009

ఇంతకీ వున్నట్టా?లేనట్టా?


కాలేజీ సెలవల్లో మా కజిన్ వాళ్ళ వూరు వెళ్లి పది రోజులు గడిపి రావడం అప్పటి నా అలవాటు. అలాగే ఆ సెలవలకి హైదరాబాద్ నుంచి వాళ్ళ వూరికి ట్రైన్ లో బయలు దేరుతునప్పుడు నాకు తెలిలేదు ఒక కొత్త అనుభూతికి(?) ఆ సెలవలు నాంది వాచకం పలుకు తాయని.ఆ వూరు కోనసీమ అందాల్ని సంతరించుకున్న ఆహ్లాద కరమైన వూరు.పచ్చటి పంట పొలాలు . సాగి పోయే సెల యేరు, ఊరి మద్య లో గుడి. తెలవారు జామునే మేలుకో శ్రీరామ అంటు బాలమురళి కృష్ణ గానం తో నిదుర లేచే ఆ పల్లె.కల్మషం లేని చిరునవ్వులతో పొలం పనులకి సాగి పోయే పల్లె ప్రజా అందులో అందమైన అగ్రహారం లో ఉండే విశాలమైన భవంతి లో మా కజిన్ వాళ్ళ ఇల్లు.ఇవే నా అనుభూతులు ఆ రాత్రి నేను మా కజిన్ ఊరి చివర పోలలోకి వెన్నెల వ్యాహలి కి వెళ్ళే వరకు.మా వాడికి నే వచ్చా నంటే పండగే వెన్నెల లో పంటపొలాల అందాల్ని ఆస్వాదించే మిష తో నన్నేసుకుని ఇంటి నుంచి బయట పడితే ''భక్త క బీరు '' సినిమా చూసుకోవచ్చని.వెళుతూ వెళుతూ దార్లో రెండు బీరు కాయలు కొనుక్కుని కాలవ గట్ల మీద కుర్చుని బీర్లు ఎర్లయ్యేదాకా తాగడం తాగి తానూ మూడో సారి భగ్న ప్రేమికుడు ఎలా అయ్యాడో వాగడం ఇది రాత్రి చర్య (పాపం సమించు గాక> దిన చర్య కి వ్యతిరేకార్ధము లో తీసుకొన వలెను) ఆ రాత్రి కూడా అలానే జరుగు తోంది. సమయం అర్దరాత్రి 11 గంటల 40 నిముషాలు.చుట్టూ పక్కల నర సంచారం లేదు .బీరు తాగక నరుడు వానరుడు కాబట్టి మా ఇద్దర్ని నరుల జాబితాలో వేసుకోలేదు.చుట్టూ నిశబ్దం.మా వాడు వాగుతున్నా నేను నా మైండ్ లాక్ చేశా కాబట్టి నిశబ్డమే. ఇంతలొ ఆ నిషబ్దాన్ని చేదిస్తూ ఒక అమ్మాయి నవ్వు. ఇదేంటి ఇంత అర్దరాత్రి వున్నది మేమిద్దరమే ఆ ఆడ నవ్వు ఎక్కడ నుంచి?మా వాడు వాగడం ఆపేసి చెవులు రిక్కరించి ఆ శబ్దం వచ్చిన దిశగా చెవి పెట్టాడు ఉష్ ఉష్ అంటు.మళ్ళి అదే నవ్వు చుట్టూ పక్కల జన సంచారమే లేదు అర్దరాత్రి వూరు నిద్ర పోతున్న వేళ ఒక ఆడపిల్ల నవ్వు పొరలు పొరలు గా కవ్విస్తూ విని పిస్తున్న నవ్వు.ఒరేయి ఎవరో అమ్మాయి నవ్వు నీకు వినుపిస్తోండ మా వాడు నా చెవిలో గుస గుస. ఆ వెన్నెల రాత్రి ఆస్వాదించే చల్ల గాలి లో ఈ పిల్ల నవ్వు వల్ల చమటలు పడుతున్నాయి, భయనికా?అమ్మో ఒక్కసారి భయం మనసులో వచ్చేస్తే అంత వరకూ అందం గా ఆహ్లాదం గా అనిపించినవి కూడా భయోత్పాతం కలిగిస్తాయి.పిల్ల గాలికి అంతవరకు తలలూపిన వరి చేలు ఆహ్లాదకరం గా కని పిస్తే ,ఆ క్షణం లో రాంగోపాల వర్మ సినిమాల్లో తలలూపే దెయ్యాల లా కనిపిస్తున్నాయి.మా వాడు మొండి ధైర్యం తెచ్చుకుని రారా అ నవ్వు వచ్చే దిక్కు గా పోయి చుద్దామంటే నా లో ఉన్నా భయ్యన్ని ఉత్సుకత డామినేట్ చెయ్యడం తో సరే అని ముందుకి వెళ్ళాం.ఈ సారి నవ్వుతో పాటు మాటలు వినిపిస్తున్నాయి.అబ్బ వద్దు మావా నికస్సలు సిగ్గులేదు ఒక 20 ఏళ్ళ అమ్మాయి గొంతు (ఇరవయ్యో అరవయ్యో ఎవడికి తెలుసు ధైర్యం కోసం అలా ఉహించా)సిగ్గు పడితే జీవితం లో కొన్ని విలువైనవి పోగొట్టు కొవాలే మగ గొంతు.(అబ్బ veedi double meaning padu gaanu , philosopy తో pada godutunnadu. ధైర్యం techhukovadam కోసం చేస్తున్న alochanale అవి). ఆ మాటలు akkdaki కొంచెం duram లో ఉన్న padu badina bhavanti నుంచి vastunnattu గా grahincham.melliga akkda కి cherukuni talupulu లేని కిటికీ lonchi chuste నిజంగానే ఒక 20 ఏళ్ళ అందమైన పల్లె పడుచు, బలిష్టం గా వున్న ఒక 25 ఏళ్ళ యువకుడు ప్రేమాయణం లో ములిగి వున్నారు. పిడకల వేట లా మేమెందుకు మద్యలో అని కిటికీ కింద కుర్చుని వాళ్ళ మూలుగులు వింటున్నాము, మా వాడు ఒరేయి ఇది ఎవరో ఎలాగన్నా కని పెట్టి తీరాలి బయటకు రాగానే ఫాలో అవుదాం అంటూ నా చెవిలో గుస గుస లాడాడు.నేను బుర్ర వూపి వాళ్ళ ములుగులకి సరి పడ చర్యల్ని మనసు లో వుహించుకుంటూ ఆవేశ పడుతున్నా(ఇదంతా ఇంకా నాలో మిగిలి వున్న bhayanni పోగొట్టు కొనుటకై నేను పడుతున్న ఆవేదనగానే పరిగనించ వలెను )కొంచే సేపటకి కెవ్వున కేక .అబ్బా ఆమెది కాదండి మా వాడిది.ఎందుకంటె అల్లంత దూరాన ఆమె వంటరి గా నడుచుకుంటూ వెళ్లి పోతోంది.పక్కన కేక పెట్టించినవాడు(మా వాణ్ణి)కనబడలేదు.ఇదేంటి అంత ధన్ ధన్ productionsa వాడు కనబడటం లేదు?భయం పోవడానికి నే వేసిన కుళ్ళు జోకు. మా వాడు నవ్వలేదు వురుకుల పరుగుల మీద ఆమెని అనుసరిస్తున్నాడు. ఆమె గాలి లో తేలి పోతోందా అనట్టు నడుస్తూ వెళ్లి పోతోంది,కాళ్ళు వెనకకి వుంటాయి దెయ్యలకి జగన్మోహిని సినిమాల్లో విటలచార్య ఉవాచ గుర్తొచ్చి చుద్దామంటే చీర కప్పెయ్యడం తో కనబడటం లేదు.ఆమె అలా నడుస్తూ రోడ్ మలుపులో వున్న స్మశానం నుంచి కనబడడం మానేసింది. చుట్టూ పక్కల ఏమి ఇల్లు కూడా లేవు. అంటే ఆమె ఆమె ఇంక ముందుకి ఆలోచించే ధైర్యం చెయ్యలేక గబ గబ ఇంటికొచ్చి కూల baddam ఇద్దరం.మా వ్వాడు aparadha parishodhana aapaledu మళ్ళి రెండో రాత్రి కూడా అదే భక్త క బీరు సినిమా అర్దరాత్రి jagan mohini సినిమా.నే naite వాణ్ణి titti posa voreyi safe గా మళ్ళి నన్ను హైదరాబాద్ పోనియరా ఇంక చాలని.మర్నాడు మా వాడు ఓబులేసు అనే ఆ ఊరి కాటి కాపర్ని కదిపి (అంటే మందు తో kudipi అని)ఆ padu badda bhavanti విషయం adigite వాడు అయ్యా baboi ఆ టైం లో వెళ్లి batiki బయట పడ్డ వాళ్ళు మీరే. chala కాలం kritam kulalu varaina ఒక yuva జంట akkda reguler గా kalusukuni premanu panchukuntu anubhutulni ఆస్వాదించే వేళ అమ్మాయి taaluku పెద్దలు వేట kodavallato ati daarunam గా champesi , వాళ్ళ premani ardantaranga muginchadam తో వాళ్ళ aatmale రోజు అదే సమయానికి వచ్చి సరసాలడుకుని వెళ్లి పోతాయట.నా kaite py pranalu pyne poyayi . baboi yenta gandam gadichindani. so deyyalu unnayanna మాట? ఆ prashanaki samadhanama అనట్టు రెండు రోజుల tarvata తెలిసిన ఇంకో వార్తా ఓబులేసుని పోలీస్ లు అరెస్టు చేసారు పాదు బడ్డ భవంతి లో వ్యభిచారం cheyyistunna నేరం mida.నాకు నవ్వాలో yeda valo తెలిలేదు. cha ఈ aadhunika yugam లో కూడా yenta verri వెధవల్ని చేసాడు. సర్లేరా ఈ శుభ సందర్భం లో ఈ రాత్రికి మళ్ళి భక్త క బీరు అదే స్పాట్ లో మా కజిన్ గాడి ప్రొపొసల్ కాదన లేక పోయా.సమయం మళ్ళి రాత్రి 11 40. ఏంట్రా మీ ఫ్రెండ్ ఇంకా నవ్వదెమ్?ఇద్దరం పగల బడి నవ్వుకున్తున్నాం . కొంచెం సేపటికి నిశబ్దం రాజ్యమేలింది. ఆ నిషబ్దాన్ని చేదిస్తూ గాలిలోంచి teralu తెరలు గా kavvinche అదే నవ్వు. మళ్ళి అదే భవనం.అదే డైలాగ్ నీకు సిగ్గు లేదు మావా.వెళ్లి చూసి దెయ్యలున్నాయని నిర్దారించు కోవాలా?పరిగెత్తి పారి పోయి అమ్మాయి , customer అనుకుని దెయ్యం గియ్యం జానతా నై అనుకోవాలా? మా వాడు శ్రీ అంజా నేయం ప్రసంనన్ జ నేయం అంటూ బండి స్టార్ట్ చెయ్యడం వరకే నాకు గుర్తు తర్వాత ఇంటికి ఎలా వచ్చామో ఆ పరమాత్ముడికే ఎరుక. మర్నాడు నేను హైదరాబాద్ తిరుగు ప్రయాణం కట్తానని వేరే చెప్పక్కరలేద్దుగా. ఇంతకీ దెయ్యాలు ఉన్నట్టా?లేనట్టా?ఆ ఊరి పేరు ఇంతకీ పెద్దాపురం.ఈ కదా జరిగాకే మా వాడు జనాల్ని ప్రోత్సహించి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఊరి మొదట్లో నెల కొల్పడం జరిగింది.ఇంకా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అనట్టు గా ఈ కధ చదివాక వున్నట్ట లేనట్టా తెల్చవలసిన్డి నేటిజేనులే .

15 జన, 2009

అరుణ గారు తొలగించిన నా కామెంట్స్


అరుణ గారు ముందుగా అభినందనలు ఒక sensetive టాపిక్ ని ఎంచుకుని ఎక్కడా పరిధి దాట కుండా చక్కగా చర్చించారు.మగాడు వరైటి కోరుకుంటూ తనకు తారస పడిన ఆడవాళ్ళతో ముసుగు కప్పుకునే మాట్లాడతాడు పైకి వోప్పుకోకపోయిన.అయితే నూటికి 90 మంది ముందుకి వెళ్ళరు పరువు ప్రతిస్తలకి భయపడి.అయితే aprochable అన్న ది confirm అయితే అందులో 50 మంది తెగిస్తారు.కానీ ఆ ''పని'' అవకుండా అందుకు ప్రయత్నిస్తూ పొందే ఆనందం ఆ పని అయిపోయాక వుండదన్న సత్యం, మనసులో guilt భావం కలిగి నప్పుడు మాత్రమే అర్ధం అవుతుంది. సో ఆ guilt ని కవర్ చేసుకుందుకు భార్య పిల్లల మిద ఇదివరకటి కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాడు.సో మీ కధ లో లా అన్ని విడాకులకి దారి తియ్యక పోగా ఒక కొత్త మలుపుకి నాంది వాచకం గా కూడా జరగొచ్చు. ఇది ఇంకో కోణం.సరే ఇంక ఆ ''పని'' టైం విషయానికి వస్తే ఒక సినిమాలో అల్లు రామలింగయ్య రావు గోపాలరావు తో అనుకుంటా ''అయ్యా ఇప్పుడు అబ్బాయి గారి శోభనానికి పెట్టిన ముహూర్తానికి కరెక్ట్ గా పని ముగించాలా?లేక పొతే పని మొదలెట్టాల?మద్యలో ఉన్నా పరవాలేదా?''అని అడుగుతాడు. ఇంకో సినిమాలో ఆలి ఒక వ్యభిచారి ని గంట కి యెంత అంటే 500 అంటుంది. అరగంట కెంత అంటాడు ,250 అంటుంది.పావుగంట కెంత?పది నిమిషాలకెంత?పోనీ మూడు నిమిషాలకెంత?అంటు బేరా లాడుతాడు.. సో 11 నిముషాలు రచయిత స్వీయ అనుభవం గా భావించొచ్చు. అది మనిషి మనిషికి భాగ స్వామి ఇచ్చే ప్రోత్సహం మీద ఆధార పడి vuntudannady అనుభవాలు నేర్పే పాఠం.మొత్తానికి ముసుగు వేయొద్దు మనసు మీద అన్న శిర్షిక మీ కధ కి అచ్చు గుద్దినట్టు సరిపోతుందని నా అభిప్రాయం.

14 జన, 2009

''మస్కా '' కి మొహమాట పడొచ్చు

ఈ రోజు రిలీజ్ అయిన మస్కా సినిమా మొదటి రోజే అనుకోకుండా చూడడం తటస్తిన్చిన్డి.సో రివ్యూ రాద్దామని పించి రాసే చిన్న ప్రయత్నం.సినిమా చూసి బయటకు రాగానే టీవీ మైక్ లు కనబడగానే కేక, సూపర్. వందరోజుల సినిమా.,సూసిన కొద్ది సుడాలని పిస్తన్దన్డి లాంటి ఉపమానాలు ఏమి రావు గాని,ఒకసారి మొహమాట పడొచ్చు.స్టొరీ రొటీన్ స్టొరీ.ఫాక్షన్ సినిమా మాత్రం కాదు.హీరో చదువు ఇంటర్ వరకే.ఉద్యోగం సజ్జోగం లేకుండా ఏ us లో జాబ్ చెయ్య బోయే అమ్మాయినో లవ్ లో పడేసి శేష జీవితం హాయ్ గా గడి పెద్దామనే ఆలోచన.ఈ ఆలోచనతోనే మంజు(సీమ)అనే అమ్మాయికి us వీసా రాగానే ఆమెని బుట్టలో పడయ్యడానికి ,ఫోనే లో తన లవర్ తో మాట్లాడుతున్నట్టు గా నీ కోసం నాకెంతో ఇష్టమైన సిగరెట్ , మందు మానేసాను, ఇప్పుడు us కి వెళ్ళడం మాత్రం మానలేను అంటు భగ్న ప్రేమికుడిలా నటిస్తాడు.మంజు కి ఇలాంటి వాణ్ణే ప్రేమించాలని ఆలోచన వునట్టు గా ఫ్రెండ్స్ తో చెపుతున్నప్పుడు హీరో(రామ్), అతని స్నేహితుడు సునీల్ వినడం తో అల ప్లాన్ చేసి దగ్గర అవుతాడు.అయితే మంజు కి తన లవ్ స్టొరీ అంతా కేంబ్రిడ్జి లో చదువుకున్తునప్పుడు జరిగిందని , తన లవర్ ఫోటో (అది అనుకోకుండా దొరికిన ఫోటో)కూడా చూపిస్తాడు.ఒక రోజు mmts ట్రైన్ లో వెళ్తునప్పుడు మంజు ఐ లవ్ యు అని రామ్ కి చెప్పెదమనుకునే సమయానికి ఈ ఫోటో లో అమ్మాయి వాళ్ళ పక్కన వచ్చి కుర్చున్తున్డి.ఆమె హన్సిక.ఇక అక్కడ నుంచి త్ర్యంగులర్ లవ్ స్టొరీ.సమాంతరం గా కేంద్రం లో ఖాలీ అయిన ఒకే ఒక మంత్రి పదవి కోసం తీవ్రం గా ప్రయత్నించే ఇద్దరు ఫ్యాక్షనిస్ట్ MP లు .ఇందులో ఒక MP కి పుట్టిన అక్రమ సంతానం హన్సిక , సక్రమ సంతానం మంజు.ఇది ఢిల్లీ లో ప్రెస్ ముందు నిరూపించి ఆ MP కి మంత్రి పదవి రాకుండా చెక్ పెట్టాలని చూసే రెండో MP.పదవి రావడం కోసం అవసరమైతే అక్రమ సంతానమైన సొంత కూతుర్ని కూడా చంపెయ్యాలనే తండ్రి.చివరకి కనువిప్పు కలిగి పదవి కంటే కుటుంబమే ముఖ్యమని కనువిప్పు. ఇది స్టొరీ.రామ్ డాన్స్ లు చాల critical స్టెప్స్ వేసి బాగా చేసాడు. అయితే నటనలో మొత్తం పవనకల్యన్ కనిపిస్తున్నాడు.రామ్ ఈ విషయం లో జాగర్త పడాలి.సునీల్ హాస్యం ముఖ్యం గా విదేశాల్లో వేసుకున్న గెట్ అప్ శివాజీ సినిమాలో రజనీకాంత్ నీ తెల్లగా చూపించిన విధం గానే సునీల్ నీ కూడా తెల్లగా మళ్ళి ఆఫ్రికా నీగ్రోల వైవిద్యం గా చూపడం బావుంది.బ్రహ్మ నందం పాత్ర నిడివి తక్కువ హాస్యం కూడా తక్కువే.రెండో హీరోయిన్ సీమ అంగ ప్రదర్శన , విపరీతమైన స్కొర్పిఒ చేజ్ లు ,ఒక్కడే వందమందిని చితక కొట్టడం. గాలిలో లేచి దభేల్ మని గుద్దుకున్న సుమోల లోంచి కూడా పుట్టలో నాగన్న ల లా విలన్ గ్యాంగ్ బయటకొచ్చి మళ్ళి చేజ్ లు చెయ్యడం ఇవన్ని మాస్ కోసం అని సరి పెట్టుకోవాలేమో? పాటలు సో సో .టీవీ anchor ఝాన్సీ , నరేష్ హీరో అన్నా వదినలుగా బానే చేసారు.ఈ సినిమాలో కొత్తగా అంకెల భాషని కూడా కోడ్ langauge గా గయ్యాళి ఝాన్సీ కి అర్ధం కాకుండా రామ్, నరేష్ వాడుకోవడం కొత్త కాన్సెప్ట్.ఓవర్ అల్ గా మస్కా కి పండుగ టైం లో మొహమాట పడొచ్చు వేరే ఏ ఇతర ముఖ్యమైన పనులు లేకపోతేనే.

11 జన, 2009

దక్షిణాది లోనే బెస్ట్ .

గత అయిదు రోజులుగా అస్సాం ఆఫీసు పని మిద వెళ్ళడం తో అక్కడ శక్తి pithala లో ముఖ్యమైన కామక్య ఆలయం దర్శించడానికి వెళ్ళడం జరిగింది.అంతకు ముందు రోజే మేము బస చేసిన ప్రాంతానికి దగ్గర లోనే సైకిల్ బాంబు పేలి ముగ్గురు చని పోయారు.అందు చేత రష్ తక్కువ వుంటుందిలే అన్న ఉద్దేశం తో ఉదయం 7 గంటలకి వెళితే అప్పటికే జనరల్ క్యూఁ కొండవీటి చేంతాడంత వుంది.మా కాబ్ డ్రైవర్ ని అదేంటి అస్సాం లో వాళ్ళకి బాంబు భయం లేదా ?బాంబు పేలినా ఛా అవతలకి పో అంటు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంటే వాడు సర్ ఇంట్లో వున్నా చచ్చే టైం వస్తే ఎవడు ఆపలేడు, అది కాక నిత్యం బాంబులు పేలితే పనులాపుకుని చస్తారా?అన్నాడు . ఆలోచన విధానం లో మారుతున్న భారతం నాకు కని పించింది.చావుకి భయ పడేది లేదు ,మనం ఉన్నంతవరకు అది మన దరి చేరదు. అది వచ్చినప్పుడు మనం ఎలాగు వుండం.ఇంతకీ అసలు విషయానికి వస్తే ఆ గుడిలో కూడా మూడు రకల క్యూఁ లు కని పిస్తాయి. జనరల్ , ఆర్మీ వాళ్ళకోసం ఇంకోటి, 100 రూపాయిల ది మరొకటి.మనకి దక్షిణాది లో గుళ్ళల్లో అమ్మవారంటే నల్లటి నిండైన విగ్రహం కళ కలడుతూ చూడడం అలవాటు.మనం గంట రెండు గంటలు వంద రూపాయిల క్యూఁ లో నిలబడి తీరా లోపలికి వెళితే అక్కడ చిన్న గుప్పెడు సైజు లో అమ్మవారి విగ్రహం దానిమీద పూల దండలతో మరింత చిన్నరుపమ్ కని పిస్తుంది.అక్కడ నుంచి ఇంకొంచెం లోపలకి మెట్లు దిగి కిందకి వెళితే చీకట్లో దండలతో అలంకరించిన గోయ్యలాంటి ప్రదేశం నీళ్ళు వురుతూ కని పిస్తుంది, అక్కడఅమ్మ వారి యోని భాగం పడిందని స్టల పురాణం. దక్ష యజ్నం లో శివుడికి జరిగిన అవమానానికి సతీ దేవి ఆత్మాహుతి చేసుకుంటే శివుడు ఆమె శవాన్ని భుజం మీద వేసుకుని శివతాండవం చేస్తూ ప్రళయ రుద్రం చేస్తుంటాడు. ఆ ప్రళయం ఆగి పోవడానికి విష్ణువు సుదర్శన చక్రం తో అమ్మ వారి శరీరాన్ని ఖండించడం జరుగుతుంది. అవి మొత్తం 51 bhagaలు గా విడి పోయి దేశం లో వివిధ ప్రాంతాలలో పడి పోయి శక్తి pitalu గా రూపాంతరం చెందాయి. అందులో యోని భాగం అస్సాం లో gauhaty లో పడిందని ప్రతీతి.అక్కడ నేను గమనించింది ఏంటంటే కార్ పార్కింగ్ దగ్గరనుంచే పూజారులు ఎదురు పడి బేరం కుదుర్చు కుంటారు. వాళ్ళే వెళ్లి వంద రూపాయల టికెట్స్ తెచ్చి , గుళ్ళో మన టర్న్ వచ్చే టైం కి లోపలికి వచ్చి అస్సామీ లేదా బెంగాలీ యాస లో సంస్క్ర్తుతం లో కామక్య దేవి కి వందనం అని చెప్పిస్తారు.ఇలా ప్రతి భక్తు డికి kanisam మూడు నిముషాలు తీసుకున్నా వంద మంది ని క్లియర్ చెయ్యడానికే అయిదు గంటలు సమయం పట్టేస్తున్డి.అక్కడ కూడా మన తిరుపతి లో లా గబ గబ లాగేస్తే మొత్తం రోజు అంతా వేచి చూసే వాళ్ళని కూడా మూడు గంటల లో ముగించేయోచ్చు. కానీ వాళ్ళ మీదే బతుకుతున్న వందలాది పూజారుల కుటుంబాలు,వీధిన పడతాయి.అంతే కాదు ఆ ఆలయ ఆవరణ లోనే మేక పిల్లల్ని, పావురాలని బలి ఇస్తుంటారు.ఇవన్ని చూసాక మన దక్షిణాది గుళ్ళలోనే కళ కళ లాడే దేవత మూర్తులు కొలువు తీరి వున్నారని గర్వం గా చెప్పుకో వచ్చు.వైష్ణవ దేవి గుళ్ళో కూడా ఇలా చిన్న గానే వుంటాయి. కాబట్టి మొదటి సారి నార్త్ లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకి వెళ్ళే వాళ్ళు ఇవి దృష్టి లో పెట్టుకుంటే అంత డిసప్పాయింట్ అవ్వరు.