29 మే, 2010

అనుక్షణికం (ఐదో బాగం )

http://moinansari.files.wordpress.com/2008/07/partners-in-crime-taking-a-break-from-the-killing-orgy-a-sadhu-offers-tea-to-a-policeman-in-ahmedabad-on-saturday-march-02-2002-e28094-reuters-photo.jpg

జీపు
వేగంగా పోలీసు స్టేషన్ వైపు దూసుకు పోతోంది .నా మెదడు మొద్దు బారి పోయింది .అసలు ఆమె ఎవరో నేను హత్య చేసానండం ఏంటో ?, వొక వైపు భార్య పిల్లలతో ఆనందం గా గడప బోతున్నా మా వూరు ట్రన్స్ఫెర్ అవడం ద్వారా అని సంతోషం లో నే వుంటే అనుకోని యి ఉపద్రవం విధి వైపరీత్యం కాక మరేంటి .''ఎనిమిషానికి ఏమి జరుగునో ఎవరుహించెదరు'' దూరం గా వినిపిస్తున్న పాట .
ఏం గురువు గారు మర్డర్ వోకటేనా? రాత్రంతా పాప తో కసా బిసా కూడానా ?జర్దా చేత్తో నలుపుకుంటూ వెకిలిగా చూస్తూ అడుగు తున్నాడు ఇన్స్పెక్టర్ .నేను ఉన్నతాధికారి గా జిల్లాలో క్యాంపు కి వెళితే గెస్ట్ హౌస్ బయట కాపలా గా వుండే ఇన్స్పెక్టర్ కి మర్డర్ కేసు లో ముద్దాయి అంటే యెంత లోకువో .
చూడు మిస్టర్ నాకు హత్య కి ఏమి సంబంధం లేదు నేనింకా మీ ఎస్ పీ స్తాయి అధికారినని గుర్తుంచుకో అన్నా .
అబ్బ చా సారూ మన ఎస్పి రాంక్అంటారా పక్కా గా ఛార్జ్ షీట్ రాసి యిరవై నాలుగు గంటలు పోలీసు కస్టడి లో వుంటే ప్రబుత్వ ఉద్యోగి అయినా సస్పెండ్ అవుతాడని సారు కు తెలీదు పాపం .అంటున్నాడు పక్కన పోలిసుల కేసి చూస్తూ .
నిజమే వాడు చెప్పింది .నేనే యి హత్య చేసానండానికి బలమైన సాక్ష్యం ఉంటేనే మీరు నన్ను అర్రెస్ట్ చెయ్యాలి .గొంతులో నిన్దాకటి దర్పం లేకుండా అన్నా .
అవన్నీ ఎఫ్ అయి ఆర్ లో రాస్తాం లే ముందు స్టేషన్ లో కుడి కాలు పెట్టు అంటూ లోపలి కి తోసాడు .చచ్చే అంత అవమానం గా అనిపించింది . జీవితం లో ఎంతో మందికి సాయం చేశా అటువంటింది నాకేమిటి యి శిక్ష అనుకుంటుండగా రైటర్ కి ఇన్స్పెక్టర్ చెప్పుకుంటూ పోతున్నాడు .రైల్లో వొక ఆడ శవం సుమారు పాతికేళ్ళు ,ముద్దాయి తో కలిసి ప్రయాణం చేస్తుండగా పీక నులమ బడి చంపబడిన స్తితి లో వుండగా ఆమె బాగ్ లో వున్న సెల్ లో ఆఖరి కాల్ ముద్దాయికి చెయ్యబడి వున్నది కూపే లో విరిద్దరే ప్రయనిన్చిరి . యీమే వివరాలు.పేరు తరణి , వయసు పాతిక .రైటర్ రాసుకుంటూ పోతున్నాడు .
తరణి , తరణి ఎక్కడో వినట్టు వుంది పేరు ?ఎక్కడా ఆలోచిస్తుంటే గుర్తు కొచ్చింది సుధ కజిన్ , వాళ్ళ ఇంటికి వచ్చేది అని ఇద్దరు చాల క్లోజ్ అని చెప్పింది . అయ్యో అమ్మాయా? మరి అదేంటి రాత్రి అలా వయ్యారాలు పోతూ లక్ష తక్కువయ్యింది ఆపరేషన్ కి అంటూ అలా మాట్లాడింది ,సుధ కి తెలుసో లేదో ఇమే మర్డర్ అయ్యిందని అయినా ఏంటో యి పెంట గోల నా మెడకి చుట్టుకుంది అనుకుంటుంటే సారూ మీరు సెల్ లోకి వెళ్ళండి ఇంక అంటూ కానిస్టేబుల్ లోపలకి దారి చూపుతున్నాడు , అదేంటి నన్ను ప్రశ్నించి వదిలేస్తా అన్నారు గా అంటుంటే మీరు ఇప్పుడు ముద్దాయి మిమ్మల్ని కోర్ట్ లో ప్రవేశ పెట్టాక న్యాయమూర్తి మిమ్మల్ని రిమాన్డులో కి పంపుతారు అప్పటి నుంచి మీకు బైల్ వచ్చేదాకా రిమాండు ఖైది నే , అంటూ లోపలకి తోసి కటక టాలు వేసేసాడు .అయితే వొక అయిదు వేలు మా సారూ కి కొడితే మీకు గుండె నొప్పి తెప్పిస్తాడు తద్వారా మీరు స్టార్ ఆసుపత్రి లో సి రూం లో దర్జా గా ఉండొచ్చు అంటూ చెవిలో చెప్పి వెళ్లి పోయాడు .నా జీవితం లో చిన్న చితక బహుమతులు తప్ప డబ్బు రూపేణా లంచం తీసుకోలేదు అటువంటిది నేను ఇవ్వడమా? సత్యమే వజయతే ఏమైతే అది కాని అనుకుంటూ చతికిల బడ్డా లోపల .
యింతలో చింపిరి జుట్టు బవిరి గడ్డం తో వున్న సాధువుని కూడా సెల్ లోకి తీసుకు వచ్చి పడేసారు . నా కేసి చూసి తెలుసున్న వాడి లా పలకరింపు గా నవ్వితే నే విసుగ్గా మొహం తిప్పేసుకున్నా .
ఏంటి బంగారం సుదకి విరుగుడు ఇచ్చి పంపాను గా వేయించు కోలేదెం ?అంటూ అడిగాడు .
వొక్క క్షణం బాంబు పడినట్టు అయ్యింది ఎయి ఎవరు నువ్వు ?సుధ నీకెలా తెలుసు ?
నాకన్ని తెలుసు భూత భవిష్యత్ వర్తమానాలు కూడా .గుళ్ళో తను అడిగినప్పుడు అన్ని చెప్పా నీ రాజ యోగం , జైలు యోగం వాటి గురించి నీకు చెప్పే వుంటుంది గా ?
వొక్క సారి గా సాధువు మీద గురి కుదిరింది . ఆపద లో వున్నవాడు గడ్డి పోచనైనా పట్టుకుని వడ్డుకు చేరుకోవాలని ఎలా ఆత్రం పడతాడో అలాగే యి పిచ్చి వాడె నాకేదన్నా తరుణో పాయం చెపు తాడేమో ? అని అడుగు దామనుకుంటూ అసలు మీరెందుకు అర్రెస్ట్ చెయ్య బడ్డారు అని అడిగా .
అంతా పైవాడి లీల మనిద్దరం ఇక్కడ కలవాలని రాసుండడం తో అదే రైల్లో ప్రయాణిస్తున్న నన్ను గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మూటా తో కలిపి జీపులో తీసుకొస్తుంటే మూటా సబ్యులు ఇన్స్పెక్టర్ కి డబ్బులిచ్చి వెళ్ళిపోయారు కేసు కోసం నన్ను లాకొచ్చి ఇక్కడ పడేసారు అని చెప్పుకొచ్చాడు .
స్వామి నేను హత్య చెయ్యలేదు నాకసలు ఆమె ఎవరో కూడా తెలిదు ఏడుస్తూ చెప్పుకున్నా .
నా కంతా తెలుసు .నువ్వేమి కలత చెందకు త్వరలో చిక్కు ముడి వీడుతుంది అసలు హంతకులు పట్టు బడతారు .అంటుంటే నే అయన మాటలకిఅడ్డు తగిలి స్వామి మరి మీసంగతో అంటూ అడిగా ?హేళన గా అడిగానా? అనిపించింది .
పిచ్చి వాడా ఇంకొంత సేపటిలో డిజి వచ్చి విడి పిస్తాడు చూస్తూ వుండు అంటున్నాడు .
బయట పోలీసులు అంతా హడ విడి గా వున్నారు , తలలు పట్టుకు కూర్చున్నారు విషయం ఏంటంటే డి జి గారి టీన్ ఏజ్ అమ్మాయి కనబడటం లేదు విషయం బయటకు పొక్క కుండా వెతకాలని బాస్ ఆజ్న . రోజు కాలేజీ కి లోకల్ ట్రైన్ లో వెళ్ళే అమ్మాయి రోజు ఎప్పటి లాగే కాలేజీ కి వెళ్ళింది గాని తర్వాత ఏమయ్యిందో తెలీదు .ఎక్కడినుంచో ఫోన్ చేసి తను తన ప్రేమికుడితో వున్నానని తన కోసం వెతకొద్దని చెప్పి పెట్టేసిందట . ఇంక అప్పటి నుంచి హడావిడి మొదలయ్యింది .అయిదు నిమిషాలకి వొకసారి పొలిసు బాస్ ఫోనులు ఇంకో అరగంట లో ఆచూకి కని పెట్ట పొతే నక్సలైటు ఏరియా కి బదిలీ చేస్తానని .
ఇంతలో యోగి బిగ్గర గా మీ జి గారి అమ్మాయి ఎక్కడుందో నాకు తెలుసు ఆయన వస్తే ఆయనకే చెవి లో చెపుతా అంటూ అరిచాడు .వెంటనే వాళ్ళ ఇన్స్పెక్టర్ బూతులు తిడుతూ లాఠి పట్టుకుని మీదకొచ్చాడు వాళ్ళ డి ఎస్ పి అతన్ని వారించి వుండు ముందు వాణ్ణి చెప్పని అది నిజమైతే మనకి ప్రమోషన్ , తప్పైతే వాడికి యెన్ కౌంటర్ అంటూ దగ్గరికి వచ్చారు .
నేను కేవలం మీ బాస్ కి మాత్రమె చెపుతాను పైన మీ ఇష్టం అంటే వేరే దారి లేక వాళ్ళు ఆయనకి విషయం చేర వేసారు . పది నిమిషాల్లో ఆయన స్టేషన్ కి వస్తే యోగి చెవిలో ఏదో చెప్పాడు , అయన వెంటనే వెళ్లి పోయి గంటలో ఆనందం గా స్టేషన్ కి వచ్చి స్వీట్స్ పంచి కూతురు దొరికిన ఆనందం లో యోగిని విడిపించి తనతో తీసుకు పోయాడు , యోగి వెళ్తూ వెళ్తూ రాజ యోగం కూడా ఉందిలే నాయన అధైర్య పడకు అంటూ నవ్వుతు వెళ్లి పోయాడు .అతను వెళ్ళిన పది నిమిషాలకే ఇన్స్పెక్టర్ వచ్చి సార్ మీకు ఆరోగ్య పరమైన ఇబ్బందులు వునట్టు అయితే హాస్పిటల్ లో జేర డానికి జి గారు అనుమతిన్చ్చారు కేర్ లో అడ్మిట్ కండి బావుంటుంది అక్కడ అంటూ జీప్ లో తీసుకు పోతున్నారు కేర్ వైపు .
యి యోగి జి కి చెప్ప బట్టే యి సౌలభ్యం అని అర్ధం అవుతోంది అయితే జి కూతురు లేచి పోయింది ఎవరి తో ?మళ్ళి ఇంటికి రావడానికి బలమైన కారణాలు ఏవిటో మాత్రం అప్పుడు నాకు అర్ధం కాలేదు . చిక్కు ముడి విడి పోయి నేను నిరప రాదినని విడుదల చేసిన రోజున అసలు హంతకులు దాని వెనక వున్న కధ తెలిసి అవాక్కవడం నా వంతైంది . వారం రోజులు మాత్రం నేను ఇబ్బంది లేకుండా కుటుంబ సబ్యుల పర్య వేక్షణ లో కేర్ లో కేరేఫ్రీ గా వున్నా .తరణి హత్య వెనక వున్న కారణాలు , వెనక వున్న దుబాయి సూత్రధారులు ,మద్యలో నన్ను యిరికించిన పాత్ర దారులు , జి కూతురు ప్రేమ వ్యవహారానికి దీనికి ఏమిటి సంభంధం తెలుసు కోవాలంటే ఇంకో వారం ఆగాలి మరి .

22 మే, 2010

అనుక్షణికం (నాల్గో బాగం)

http://images.lightstalkers.org/images/872935/01_inraj354b.jpg
ఉదయం ఎనిమిది గంటలకే ఆఫీసు కి రెడీ అయి వెళ్లి పోయా ,సుధ మొహం కుడా చూడాలని లేదు . రాత్రంతా ఆలోచిస్తే అసలు ఈమె హస్తం ఉందేమో? అన్న అనుమానం కూడా కలుగు తోంది .నేను ఆఫీసు కి వెళ్ళే దాక కూడా తను గుడి నుంచి రాలేదు అంటే ఇద్దరు కలిసి కంసాలి దుకాణానికి పోయి సగం సగం పంచుకున్టున్నరేమో ఆ నగ అమ్మేసి నన్ను వెర్రి వెదవని చేసీ .ఇంతలో సెల్ మోగుతోంది సుధా నించే ఎత్తాల ?వద్దా ?అనుకుంటూనే తీసి ఏంటి అన్నా విసుగ్గా .
ఏంట్రా అంత విసుగు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని ఇంటికొస్తే అప్పుడే వెళ్లి పోయావ్ ? అయిదున్నరకి వెళ్లి ధ్వజ స్తంబం దగ్గర ఆ నగ ప్యాకెట్ పెట్ట గానే , పది నిమిషాలకి ఎవరో చిన్న పిల్లాడు వచ్చి తీసుకెళ్ళాడు వాడిని మెల్లి గా అనుసరిస్తూ వెళ్తుంటే వాడు దానిని అప్పటికే టాక్సీ లో ఎక్కేసి అందులో వెయిట్ చేస్తున్న వొక ఆమె కి ఇవ్వ గానే కార్ తుర్రు మంది దుమ్ము లేపుకుంటూ . కనీసం ఆమె ముఖం కూడా చూడ లేక పోయా .నా వల్ల నీకు ఏ విధమైన నష్టం కలగ కూడదని అమ్మ వారి గుడి చుట్టూ నూటెనిమిది అంగ ప్రదక్షణలు చేసీ ఇప్పుడే ఇంటి కొచ్చా అంటుంటే జాలి వేసింది అనవసరం గా యి అమాయకు రాలీని అనుమానిస్తున్ననేమో అని .
సర్లే రెస్ట్ తీసుకో నేను అదెవరో కని పెట్టె పనిలో పడతా అంటూ సెల్ కట్ చేశా .అది అయిన పది నిమిషాలకే మళ్ళి ''వో కవున్ తి'' నుంచి ఫోన్ . సరే మాటల్లో పెట్టి ఎవరో కని పెట్టాలి అని ఎత్తా .
నన్ను కని పెట్టె పని పక్కన పెట్టండి గాని ముందు గా చాల థాంక్స్ నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇంత మంచి గిఫ్ట్ ఎప్పుడూ ఇవ్వలేదు , రుణాను బంధ రూపేణా పశు పత్ని సుతాలయ అంటారు , మనిద్దరి మద్య మరింత రుణ భారం పెరిగి మీ పత్ని గా వచ్చే జన్మ లో పుట్టాలని నా కోరిక , అందుకే దీనితో సరి పెట్టుకుంటే మీ ఇంట్లో పశువు గా పుట్టాలి అందుకే నా చిట్టాలో రెండో ది బ్లాక్ బెర్రీ ఫోన్ , సాయంత్రం తీసేసుకుని అక్కకి ఇచ్చేస్తే , అక్క గుళ్ళో అంద జేస్తుంది అంటుంటే బీ పీ ఫుల్ గా రైజ్ అయ్యింది , నేను తన తో అన్న మాటలు కూడా తెలిసి పోతున్నాయి క్షణాల్లో అంటే ఇద్దరు తోడూ దొంగలేమో .
ఎంటే నేను మీ ఇద్దరికీ అంత ఎర్రి పప్పు లా కని పిస్తాన్నానా? ఏదంటే అది కొని పెట్టేసి నోట్లో యేలు ఎసుకోడానికి , నీ ఇష్టమొచ్చినట్టు చేసుకో ఇంకో సారి ఫోన్ చేసావంటే ఆ పబ్లిక్ బూత్ దగ్గరికి వచ్చి మరి తంతా అంటూ ఆవేశం గా అరిచేసా
వద్దు బంగారం అనవసరం గా అక్కని అపార్దం చేసుకోకు ఇందులో ఆమె పాత్ర అస్సలు లేదు . నువ్వు మరి ఆవేశ పడితే ఇంకో పది నిమిషాల్లో నువ్వు మొన్న రాత్రి అన్నం పెడుతుంటే అమాంతం అక్క మీద పడినభంగిమ ఫోటో నీ టేబుల్ మీద వుంటుంది , అధికారి అక్రమ సంభంధం అంటూ టీ వి లో పోద్దస్తామాను ని ఫోటో చూసుకోవాలంటే నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేసింది .
ఆమె చెప్పినట్టే అరగంటలో మా ప్యూను సార్ మీకు కవర్ అని ఇవ్వడం తోటే చెమటలు పట్టాయి .విప్పి చూస్తే కొంప కొల్లేరు అయ్యే ఫోటో చక్క గా ఇద్దరి మొఖాలు తమకం తో ప్రకాశవంతం గా కని పిస్తున్నాయి .నా పియ్యే బావమరిదికి సెల్ దుకాణం వుంది అతన్ని పిలిచి వొక బ్లాక్ బెర్రీ మనకి యెంత పడుతుంది అంటే తమరి కైతే యేమి పడదయ్య అంటూ చేతులు నలుపు కుంటూ నిల బడ్డాడు అతడి పదోన్నతి ఫైల్ నా టేబుల్ మీద పెడుతూ .
అబ్బ గుర్నాధం నేను అలంటి వాణ్ణి కాదయ్యా కొంత తక్కువ లో ఇమ్మను లాభం తగ్గించుకుని అంతే గాని ఊరికే కాదు నాకు అచ్చి రాదు అన్నా
అబ్బే నా హస్త వాసి చాల మంచిది సార్ నాతొ బోని కొట్టండి మీకు తిరుగు లేదు అంటూ అసలే విసుగ్గా వుంటే మరింత విసిగిస్తున్నాడు . వెంటనే ఫైల్ తీసి రివ్యూ స్టాఫ్ స్త్రెంగ్థ్ బిఫోర్ పుట్టింగ్ అప్ థిస్ ఫైల్ అని రాసి పడేసా .
అరగంట లో బ్లాక్ బెర్రీ ఇరవై వేలు బిల్లు తో గుర్నాధం వచ్చాడు .థట్స్ బెటర్ అని చెక్ రాసి అతని కిచ్చా .సాయంత్రం ఇంటికెళ్ళి సుధ కి ఇచ్చి పొద్దునే గుడి కెళ్ళి ఇచేయ్యమంటే ఆమె ఇంకా చాలురా నా పరువు పోయినా పర్లేదు నువ్వు మాత్రం ఇంక ఏమి ఇవ్వకు తాడో పేడో తేల్చుకుందాం అంది .
చూడు నువ్వు సమస్యని నీ కోణం లోంచి మాత్రమె చూసి మాట్లాడుతున్నావు ఇక్కడ నా పరువు తో పాటు వుద్యోగం కుటుంబ వ్యవస్థ ముడి పడి వున్నాయి కాబట్టే తలొగ్గ వలసి వస్తోంది . అసలు ఆమె ఎవరో అంత ఇంటిమేట్ ఫొటోస్ ఎలా తీసిందో నాకైతే అర్ధం కావటం లేదు ,నీకు బాగా దగ్గరైన స్నేహితులు ఎవరన్న వున్నారేమో గుర్తు తెచ్చుకో మీ ఇంటి కొచ్చేవాళ్ళు ?అని అడిగా .
మా ఇంటికొచ్చేవాల్లంటే వొకప్పుడు నన్ను పెళ్లి చేసుకుందామనుకుని పెళ్లి చేసుకోలేక పోయిన మా బావ ,నా కంటే చిన్నదైనా నాతొ అన్ని పంచుకునే పెళ్ళికోసం ఎదురు చూస్తున్న తరణి , తరణి ద్వార పరిచయమైనాపొలిసు ఇన్స్పెక్టర్ రంగనాథ్ , మేము ఏమి కొత్త వస్తువులు కొనుక్కున్నామా అని అరా తియ్యడానికి వచ్చే మా వదిన . ఇంతే అంది .
వీళ్ళల్లో వొకరో ఇద్దరో కలిసి విడి విడి గానో , జాయింట్ గానో యి బాగోతం నడిపిస్తూ వున్దోచ్చేమో అనుకుంటూ ఆలోచిస్తుంటే అప్పుడే సుధ వాళ్ళ అబ్బాయి టీ వి ఆన్ చేసాడు , కలకాలం ఉండవులే కన్నీళ్ళు , కలతైనా కలలైన కొన్నాళ్ళు అంటూ నా కిష్టమైన పాట వినిపిస్తుంటే బారం గా మెట్లెక్కుతూ నా పోర్షన్ కి చేరుకున్నా .సుధ వాళ్ళ అబ్బాయి చేత డిన్నర్ పంపింది సెల్ లో మెసేజ్ పంపింది ప్రేమని రంగరించి గోరుముద్దలు తినిపించే అదృష్టం చెయ్యి జారి పోయింది కనీసం నేను సైతం నీ ధాతువు కోసం మెతుకు నొక్కటి వండి ఇచ్ఛా అన్న సంతోషం మిగలని అని .
అబ్బ యి ధాతువు యావే తీతువు లా నన్ను పట్టుకుని పీడిస్తోంది యిమేది ప్రేమో కామమో అర్ధం అవటం లేదు పోనీ కామం అనుకుని కోరిక తీర్చేస్తే మొహం మొత్తి వెళ్లి పోవచ్చేమో అని పిస్తుంది లేదా మరింత ముదిరి నా కే కావాలి నువ్వు అనుకుంటూ అనుక్షణం ఆఫీసు లో పని కూడా చేసుకోనీకుండా ఇంటికేప్పుదోస్త్తావు అంటుంటే అదో బాధ . అయినా ఇంక కొన్ని రోజుల్లో యి బంధాలు తెంచుకుని గువ్వలా యెగిరి పోవాలి నా చెలి గూటికే చేరుకోవాలి అని మనసులో నా బార్యని ,పిల్లల్ని గుర్తు చేసుకుంటూ సెల్ లో ఎఫ్ ఏం ఆన్ చేస్తే అందులో'' వూరు మారినా మనిషి మారునా ? మనిషి మారినా మమత మారునా '' అన్న పాట వస్తుంటే నిజమే యి క్షణం బార్య పిల్లలు దూరం గా వున్నారు కాబట్టి అలా అని పిస్తోంది మళ్ళి వాళ్ళ దగ్గరికి వెళితే సుధ గుర్తు రావడం లో ఆశ్చర్యం లేదు అని పించింది .
మర్నాడు లేవడం తోటే మనసంతా ఏదో ఆనందం తో నిండి పోయిన భావన .తెలియ కుండానే మనసులో ఏదో మంచి జరగా బోతోందేమో అని పిస్తోంది . వెంటనే రెడీ అయిపోయి గుడికి వెళ్ళా అప్పటికే పాపం సుధ బ్లాక్ బెర్రీ ఇచ్చేసి అంగ ప్రదక్షిణాలు చేస్తోంది .నన్ను గమనించ లేదు . నేను గుళ్ళోకి వెళ్లి స్వామి నీ ప్రేరణతోనే స్నేహితులు , శత్రువులు అందరు కలుస్తారు , ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో తెలుసుకోలేక చస్తున్నా త్వరలో నాకు ట్రన్స్ఫెర్ వచ్చేలా చూడు తండ్రి అంటూ దణ్ణం పెట్టుకుంటుంటే గంట మోగింది పూజారి శుభం సంకల్ప సిద్ది రస్తు అంటూ దీవిస్తే కళ్ళలోంచి ఆనంద భాస్పలు వచ్చాయి .అదే భగవంతుడికి బక్తుడికి మద్యజరిగే ఆంతరంగిక సంభాషణ వేరే వాళ్ళకి చెప్పినా అర్ధం కాదు , స్వచ్చమైన మనసుతో ప్రార్దించి త్వమేవ శరణం అన్న ప్రతి సారి నాకు సమాధానం దొరికించాడు . ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆఫీసు కి వెళ్లి పోయా . సుధ పాపం పోర్లుతునే వుంది . ఆఫీసు కి వెళ్ళ గానే హెడ్ ఆఫీసు నుంచి ఫాక్స్ నన్ను మా ఊరికి బదిలీ చేస్తూ వేరే వాళ్ళని ఇక్కడకి పోస్ట్ చేస్తూ వచ్చిన ఆర్డర్ అది .ఇంతలో సుధ నుంచి సెల్
వోరేయి నీ కో శుభ వార్త నీ జాతకం గుళ్ళో తెలుగు యోగి గారని ఉద్దండ పండితులు ఆయన భూత భవిస్యత్తు వర్తమానాలతో పాటు గత జన్మ రాబోయే జన్మ కూడా చెప్ప గల దిట్ట వారు కని పిస్తే కాస్త వార్ని వుబ్బేసి (ఆడవాళ్లంటే ఆయనకి అదో ఇది లే )నీ జాతకం చెప్పమన్నా . ఆయన అడిగిన సమయాన్ని లెక్క లోకి తీసుకుని యి జాతకుడికి త్వరలో రాజ యోగం , జైలు రోగం రెండూ పట్ట బోతున్నాయి అన్నారు .నేనింకా వివరాలు అడిగే లోపే ఆయన గాల్లో చేతులు తిప్పుతూ రెండు కను బొమ్మలు పైకెగరేస్తూ శూన్యం లో ఎవరి తోనో ఆవాహ ఆకర్శ వుచ్చాలయ , కవచాలయ అంటూనే గత జన్మ లో అతను నీ భర్త అనుక్షణం నిన్ను అనుమానించి వేదిన్చేవాడు దానికి శిక్ష గా యి జన్మ లో మళ్ళి నీ అంతరంగికుల ద్వార అనుకోని ఉపద్రవం లో పడి జైలు పాలు అయ్యి కొంత మానసిక క్షోభ అనుభ విస్తాడు . అంటూ గాలిలోంచి వీభూతి తీసి దీన్ని అతని మగసిరి మీద నువ్వే పోస్తే దోశ పరిహారం అయ్యి ఉదృతి తగ్గుతుంది అన్నాడు కాబట్టి నువ్వు సాయంత్రం తొందరగా వస్తే ......
ఆ తొందరగా వస్తే ఎంచేస్తావు దీనికంటే డైరెక్ట్ గా వోరేయి నీతో వొక్క రాత్రి గడపాలని వుంది అని వుంటే నీ నిజాయితీ కి సంతోషించి వోప్పుకునే వాణ్ణేమో ఇప్పుడు ఇక్కడకి యెంత పవిత్రం గా వచ్చానో అంత పవిత్రం గాను వెళ్లి పోతా నా భార్య పిల్లల దగ్గరకి , ఈ రాత్రే వెళ్ళిపోతున్నా మా ఊరికి నాకు ట్రన్స్ఫెర్ ఆర్డర్ వచ్చేసింది .ఇంక నీకు నీ అంతరంగికులకి వెయ్యి నమస్కారాలు , నీలో ఎక్కడో కొంత నీతి నిజాయితీ ప్రేమ వుందని నమ్ముతున్నా కాబట్టే చెప్పి వెళుతున్న ఇన్నాళ్ళు వండి పెట్టినందుకు థాంక్స్ హఫ్కోర్స్ సరుకులు నేనే కొన్నాననుకో అంటుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ ఫోనే పెట్టేసింది .సాయంత్రం ఆఫీసు లో ఫేర్ వెల్ పార్టీ అయిపోగానే ఆఫీసు కార్ లో ఇంటికొచ్చా సామాను తీసుకుని స్టేషన్ కి వెళ్ళడానికి .అన్ని సద్దేసుకుని తాళాలు ఇవ్వడానికి కిందకి వెళితే సుధ లేదు వాళ్ళ అబ్బాయి వచ్చి ఆంకుల్ మమ్మీ ఈ యిరవై వేలు మీకిమ్మన్డి సరుకులు బాకీ అని చెప్పమంది అంటుంటే అయ్యో భలే వాళ్ళే మీరేమన్న పరాయి వాళ్ళ బకాయి అనుకోడానికి నువ్వే ఉంచుకుని నీకు కావలిసింది కొనుక్కో అన్నా . లేదంకుల్ తీసుకోక పొతే నా మీద వట్టు అంటూ కూడా చెప్పమంది అన్నాడు సరే అమ్మని పిలు చెప్పేసి వెళ్లి పోతా అంతే మమ్మీ గంట క్రితమే గుడికి వేల్లిన్దంకుల్ మీరు వెళ్లి పోయాకే వస్తానని చెప్పిందంటుంటే కళ్ళలో నీళ్ళు తిరి గాయి యి పిచ్చి మొద్దు నాకర్ధం కాదు చాలా ఆత్మాభిమానం అనవసరం గా సరుకుల మాట ఎత్తి అవమానిన్చానేమో అనుకుంటూ నాకు వీడ్కోలు పలక డానికి వచ్చిన స్టాఫ్ చూడ కుండా కళ్ళు తుడుచుకుంటూ చెయ్యి ఊపు తున్నా .రైలు మెల్లిగా వేగం పుంజుకుంటోంది ప్లాట్ఫారం దాటి వెళ్ళిపోతోంది , ఇన్నాళ్ళు నన్ను దాచుకున్న ఆ వూరు, మమతలు పంచిన మనుషులు ,మెల్లిగా మసక బారి పోతున్నారు .నేను కూడా లోపలి వెళ్ళ బోతూ రైల్ గేటు దగ్గర రెండు కళ్ళు నన్ను గమనిస్తునట్టు గా అనిపించి తేరిపార చూస్తే తనే సుధ వెక్కి వెక్కి ఏడుస్తూ పమిట నోట్లో కుక్కుకుని చెయ్యి ఊపుతూతనే , వొక్క సారి చైన్ లాగి వెనక్కి వెళ్లి నన్ను క్షమించు నేస్తం అని అడగాలని పించింది భారం గా చెయ్యి ఊపుతూ ఆమె మసక బారి పోయే దాక అల్లాగే తలుపు దగ్గరే నిలబడి లోపలకి వెళ్ళా .ఈ గతం అంతా నెమరేసుకుంటూ ఎప్పుడూ నిద్రలోకి వెళ్ళానో నాకే తెలీదు . ఇంతలో నన్ను ఎవరో బలంగా తట్టి లేపుతుంటే మెలుకువ వచ్చింది . కళ్ళు తెరచి చూస్తే ఎదురు గా పోలీసులు యు ఆర్అండర్ అర్రెస్ట్ అంటూ ఇన్స్పెక్టర్ చెయ్యి పట్టుకుని తీసుకు పోతున్నాడు దేనికి అని అడుగు దామనే లోపు ఫస్ట్ ఎసి భోగిముందు అప్పుడే స్త్రేట్చేర్ లో పెట్టి దింపుతున్న శవం గాలికి తొలగిన ముసుగులో ఆ రాత్రి నాతొ పాటే ప్రయాణించి మధ్యరాత్రి వేల్లిపోయిన్దనుకున్న అపరిచిత .రాత్రి మీ ఇద్దరే యీ కూపే లో ప్రయాణించారు ఆమె సెల్ లో ఆఖర్న మీ నెంబర్ వుండడం తో అనుమానం మీద మిమ్మల్ని తీసుకేల్లక తప్పడం లేదు అంటూ చెపుతున్నాడు .
డాడి డాడి అంటూ స్టేషన్ లో నన్ను రిసీవ్ చేసుకోడానికి వచ్చిన పిల్లలు ఏవండి అంటూ భార్య మీరు ఇంటికి వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అంటూ సముదాయించి పొలిసు జీప్ ఎక్కా , రాజ యోగం , జైలు రోగం చెవిలో సుధమాటలు రింగు రింగు మంటున్నాయి అంటే తెలుగు యోగి చెప్పింది జరగా బోతోందా?చేతులారా రేమిడి ని వదులు కున్నానా ? హె భగవాన్ ఏం జరగ బోతోంది ?(అది తెలియాలంటే ఆగాలి మరి)

16 మే, 2010

అనుక్షణికం (మూడో భాగం )


నువ్వేమన్నా (ఏకవచనం లోకి మారి పోయి చాలా కాలం అయ్యింది )ఋష్య శ్రున్గున్ని అనుకుంటున్నావా? పొద్దున్నే కాఫీ కప్పు నా చేతిలో పెట్టి రెండు చేతులు గుమ్మం పైన పెట్టి అభిసారిక లా అడుగుతుంటే నవ్వొచ్చింది .పాపం రాత్రి తన అహం దెబ్బ తిని వుంటుంది ,అంత అందమైన ఆమె ముందు కొస్తే , మందు కొట్టి కూడా చలించకుండా త్రునికరించడం తో .
అబ్బే ఋష్య శృంగున్నో?ఇంద్రున్నో అప్పటి కాల మాన పరిస్తితుల బట్టి వుంటుంది .అప్పుడు అలా అయ్యిందని ఎప్పుడు అలానే అవుతుందని గారంటీ ఇవ్వలేను .బట్ ఎప్పుడు అలా అవ్వాలనే కోరుకుంటాను అంటూ తనని మరింత అయోమయం లో పడేసాను .
ఇంతకీ ఇప్పుడు నన్ను ఉండమంటావ ?వేల్లమన్తవా? అంటూ అదే అభిసారిక భంగిమ లో అడిగింది .
నేను తన దగ్గర గా వెళ్లి గుమ్మం మీద నుంచి ఆమె చేతులు దింపే ప్రయత్నాన్ని తప్పు గా అర్ధం చేసుకుని నన్ను హత్తుకుని అలాగే నిల బడి పొతే ఏంచెయ్యాలో పాలు పోక మెల్లిగా ఆమె చెవిలో నేడు పోయి రేపు రా అన్నా .
దానినే ఆమె అంగీకారం గా తీసుకుని అయితే రేపటికోసం ఎదురు చూస్తూ ఉంటా అంటూ వడి వడి గా వెళ్లి పోయింది .
ఆఫీసు పనిలో బిజీ గా వుంటే సెల్ మోగింది ,ఏదో తెలియని ల్యాండ్ లైన్ నెంబర్ . ఎత్త లేదు , మళ్ళి మోగుతోంది విసుగ్గా హలో అన్నా .ఏంటి సార్ అంత విసుగు ?సుధని గుమ్మం మీద కవ్గిలించుకున్నప్పుడు లేదేం యి విసుగు , ఎవరిదో ఆడ గొంతుకు .
ఎయి ఎవరు నువ్వు ? సుధ ఎవరు ?పిచ్చి పిచ్చి గా ఉందా ?
భయపడకండి నేనేమిtv9 ఏంకర్ కాదు ఇదేమి స్త్రింగ్ ఆపరేషన్ కూడా కాదు .ఆమె భర్త కి మీరు గుమ్మం మీద చేసిన సరస సల్లాపాలు తెలిస్తే ?
గొంతు ఎండి పోతోంది , ఇందాకటి మేకపోతు గాంభీర్యం స్తానే అభ్యర్ధన తో కూడిన స్వరం నువ్వెవరు ?నీకేం కావాలి ?
భయపడకండి సార్ నా చిన్న చిన్న కోరికలు మీరు తీరుస్తున్నంత కాలం మీకేమి నష్టం లేదు .
ప్రస్తుతానికి సాయంత్రం ఆఫీసు నుంచి వేల్తునప్పుడు ఫలానా బంగారం షాప్ లో చాల కాలం నుంచి నేనెంతో ముచ్చట పడి ఆర్డర్
చేయించుకున్న నగ సిద్దం గా వుందని ఫోన్ చేసారు మీరు వెళ్లి బిల్ పి చేసి మీ దగ్గర పెట్టు కొండి నేనెల డెలివరీ చెయ్యాలో చెపుతాను
నాకు కోపం నషాళానికి అంటింది గెట్ లాస్ యు బ్లడీ బిట్చ్, నీలాంటి వాళ్ళని చాల మంది నే చుసా , నా తలలో వెంట్రుక కూడా పీక లేరు , వాళ్ళ ఆయనకి కాక పొతే రంకుమోగుడికి చెప్పుకో నా కేంటి భయం అంటూ కోపం గా ఫోన్ పెట్టేసాను
పెట్టేసాక మనసు అల్ల కల్లోలం గా అయిపొయింది అసలే సుధ తో ఎమోషనల్ టెన్షన్ అనుకుంటుంటే
మద్యలో ఈమె ఎవరో బ్లాక్మైలింగ్ వూళ్ళో ఆడవాళ్ళకి తీరిక ఎక్కువలా వుంది డబ్బు పరపతి ఉన్నవాడిని
బుట్టలో వేసుకోవడమే పరమావధి లా పెట్టుకున్నారు .అదే మా వూళ్ళో అయితే కంప్యూటర్ మీద పడి
బ్లాగుల్లో తోచింది రాసుకుంటూ నచ్చని వాణ్ణి కెలుకుతూ కాలక్షేపం చేసేస్తారు అనుకుంటూ పని మీద ద్రుష్టి పెట్టి యి విషయం మర్చి పోయా , వొక గంట పోయాక మా ప్యూను కవర్ వొకటి తెచ్చి ఎవరో చిన్న అబ్బాయి ఇమ్మానాడని ఇచ్చి పోయాడు . పర్సనల్ అని రాసి వుండడం తో ఆత్రం గా ఇప్పి చూసా అంతే అంత సి రూం లోను చమటలు పట్టాయి ,నా కళ్ళు నమ్మ లేక పోతున్నాయి .ఇదెలా సాద్యం ? ఇంతలో మళ్లీ నా సెల్ మోగింది
నిన్దాకటి ల్యాండ్ లైన్ నంబరే ఎత్తగానే మీ వెంట్రుక నేను పీక లేక పోవచ్చు గాని ఫొటోస్ ని
టి వి నైను ఆఫీసు కి పంపితే మాజీ గవర్నెర్ తివారి ని ఆదర్శం గా చేసుకున్న ప్రబుత్వాధికారి అంటూ రోజంతా మీ ఇద్దరి ఫొటోస్ వివిధ భంగిమల్లో చూపించడం ఖాయం , చూసారు గా మీ ఇద్దరు గుమ్మం మీద వాటేసుకున్న చిత్రాలు .సో మీరు సాయంత్రం డెలివరీ తీసుకున్నారని నిర్ధారించుకున్నాక టి వి వాళ్ళకి ఫొటోస్ పంపే నిర్ణయం మార్చుకుంటా అంటూ నాకు మళ్లీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. నెంబర్ అడ్రెస్స్ చూస్తే కాయాన్ బాక్స్ బీ ఎస్ యెన్ ఎల్ వాళ్ళది .ఇంక చేసేది ఏమి లేక సాయంత్రం ఆమె చెప్పిన షాప్ కి వెళ్లి నిందాకా ఫోన్ లో ఆమె చెప్పిన బిల్ నెంబర్ ఇచ్చి దాని కి బిల్లు ఎతైందని అడిగితె అక్షరాల నలభైరెండు వేలు ప్రపంచం లో అత్యంత ఖరీదైన కౌగిలి ఇదేనేమో . కిమ్మనకుండా డెబిట్ కార్డు తీసి ఇచ్ఛా .క్షణాల్లో నలభైరెండు వేలు డెబిట్ అయినట్టు గా నా సెల్ లో సంక్షిప్త సమాచారం వచ్చింది .నేను ఉండ బట్టలేక బిల్లు లో కరెక్ట్ అడ్రెస్స్ రాసార కొంచెం చెప్పండి అన్నా .దానికి షాప్ యజమాని గుంభనం గా నవ్వుతూ మాడం మా రెగ్యులర్ కస్టమర్ సార్ ఆమె కోడ్ నెంబర్ చెప్పి పంపిన వ్యక్తీ దగ్గర డబ్బు తీసుకుని నగ ఇవ్వడమే మా బాద్యత అంతకు మించి వేరే వివరాలు మాకు కూడా తెలీదు అన్నాడు .
అంటే నాలాంటి బకరాలు చాల మండే ఉన్నారన్న మాట యివిడ గారి దగ్గర''బకరా బంగారం షాప్ ''అని బోర్డు పెట్టుకుంటే సరి పోయేది యి వెదవ అనుకుంటూ ప్యాకింగ్ తీసుకుని ఇంటి కొచ్చా .సాయంత్రం నుంచి సుధ ఆపకుండా కొడుతోంది నా సెల్ కి నాకు చిరాకేసి సైలెంట్ మోడ్ లో పెట్టేసి కూర్చున్నా .ఇంటికి రాగానే నీతో అర్జెంటు గా మాట్లాడాలి లోపాలకి రా అంటూ వాళ్ళింటికి తీసుకు పోయి ఎవరో ఆమె తన సెల్ కి ఫోన్ చేసి మీ పై ఇంటి ఆయన తో నీ భాగోతం ఫొటోస్ తీసానని , ఆయన సాయంత్రం తెచ్చే నగని బాలత్రిపుర సుందరి గుడిలో ధ్వజ స్తంభం కింద కవర్ లో పొద్దున్నే అయిదున్నరకి పెట్టి పోక పొతే ఫొటోస్ దుబాయి పంపుతానని చెప్పిందని భోరుమంది .తన సంసారాన్ని నిల బెట్ట దానికి నేను ఎలాగైనా ఆవిడ అడిగిన నగని తెచ్చి ఇస్తే జీవితాంతం రుణ పడి ఉంటానని గోల .
అసలు దొంగ ముండ ఎవరో నంబర్ నుంచి వివరాలు తెలుసుకు చ్చావు గట్టిగానే అరిచా .
ప్రయత్నం చేసానండి , తెలీలేదు . నాకైతే మా వదిన మీదే అనుమానం , ఎప్పుడు మా ఇంటికొచ్చినా కొత్తవి ఏం కొన్నావు అంటూ వొకటే ఆరా , మీ అయన వూళ్ళో లేక పోయినా ఎవరో వొక మగ తోడూ పైన వున్నారులే పాపం అంటూ వెటకారం ,అయినా యి కష్టాలన్నీ మీకు నా వల్లే నే చచ్చి పొతే మీకు ఏ బాధ వుండదు అంది .
నా గుండెల్లో రాయి పడింది అమ్మో తల్లి ఆ పని మాత్రం చెయ్యకు ఇప్పటికే సగం ములిగా నువ్వు చస్తే పూర్తీ గా ములుగుతా ముందు ఈ నగ గుడికి తీసుకెళ్ళి దాని మొహాన్న కొట్టి అదెవరో కని పెట్టె ప్రయత్నం చెయ్యి . అంతే కాదు కొన్నాళ్ళు మెడ పైకి కూదా రాకు ,ఇక నుంచి నీకు నాకు మద్య నిశ్శబ్దం అంటూ నగ ఆమె చేతిలో పెట్టి మెడ మీదకి పోయా ,అనవసరం గా యి ఉచ్చులో ఇరుక్కున్నా చేసింది లేదు సచ్చింది లేదు గాని దూల మాత్రం తీరింది డబ్బు రూపేణా , ఇది ఇంతటి తో ఆగుతుందని నమ్మకం లేదు అయిన ఇంక రెండు నెలల్లో ట్రన్స్ఫెర్ ఎలాగు వచ్చేస్తుంది అంతవరకూ కాలు జారకుండా వుంటే చ్చాలు ఆ పైన కాలర్ ఎగరేసుకుని పోవచ్చు అనుకంటూ చాల కాలం తర్వాత ఇంటికి ఫోన్ చేసి భార్య పిల్లలతో ఆప్యాయం గా మాట్లాడా ఇంకోన్నాల్లల్లో వాళ్ళ ముందు ఉంటానని ఇన్నాళ్ళు చాల మిస్ అయ్యానని చెప్పా ,ఇన్నేళ్ళ వైవాహిక జీవితం లో అన్ని తను కొనుక్కోవడమే గాని నేను భర్త గా తనకి ఎప్పుడు కొన్నది లేదు . అలాంటిది వొక ముక్కు మొహం తెలీని బజారు ఆడదానికి నగ కొని పంపే దావుర్భాగ్యం పట్టింది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి . పైన ఆకాశం లో జాబిల్లి నక్షత్రాలు వోదారుస్తునట్టు గా అని పిస్తోంది .బట్ట ముళ్ళ కంచే మీద పడింది చిరగ కుండా తీసేసుకుని మా వూరు వెళ్లి పోవాలి అనుకుంటూ నిద్రలో జారుకున్న రేపటి ప్రమాదానికి సిద్ద పడుతూ .

9 మే, 2010

అనుక్షణికం (రెండో భాగం )


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEioHTggaUGhRd44NY1V7wUZXSkDhW9PUD1KuER2r3lEHsJ4_e1jAhkVW7HgFGmPBlbjllfZU26rBMDaKcb6iLma5zGULQFbbP_8O_ewi7qb9IZvYPBpu8V4jKSws7ejbRbiJOduFUC4aMFx/s400/moon-light.jpg

కాఫీ
తో మొదలైన అనుభంధం వాళ్ళింట్లో డిన్నర్ చేసే అంత గా ఎదగడానికి ఎంతో టైం పట్ట లేదు . దానికి సుధ చొరవ కొంత , నా వొంటరి తనం కొంత అని చెప్పుకోవచ్చేమో.తనలో భావోద్వేగాల పాలు ఎక్కువే .ఎన్నాళ్ళో తనలో దాచుకున్న వేదన బయటకు చెప్పుకోవడానికి వొక తోడు కావలి , అప్యాయం గా పలకరించే వొక గొంతు కావాలి .అన్నిటికంటే
ముఖ్యం గా తన బాధ వినే వొక శ్రోత కావాలి .భర్త సంపాదన యావ లో పడి సుదూర తీరాలకి వెళ్లి పోవడం ఆమె కి సుతారము ఇష్టం లేదు .వొక వెన్నెల రాత్రి మేడ మీద భర్త వొడిలో తల పెట్టుకుని మంద్ర స్తాయిలో వినిపించే ముకేష్ పాటలు వింటూ ,భర్త కళ్ళల్లోంచి కనిపించే నిండు జాబిలిని ఆస్వాదిస్తూ ఆనందించాలని తనకి వుండేది .ఆమె భర్త సమయం లో కూడా దుబాయి వెళితే యి ongc లో సంపాయించే దానికి పది ఇంతలు ఎలా సంపాయిన్చోచ్చో చెప్పుకొస్తూ పోతుంటే , నిసి రాతిరి నిశ్శబ్దం లో కళ్ళలోంచి కారిన కన్నీళ్ళు తుడవడానికి ఇన్నాళ్ళకి వొక తోడు , వొక నేస్తం వస్తాడని నేనెప్పుడు అనుకోలేదు అనేది . క్షణం లో భుజం తట్టి వోదార్చడం లో నాలో దురుద్దేశం లేక పోయినప్పటికీ అది భవిస్యత్తు లో విడదీయరాని భంధం (ఆమె దృష్టిలో) అయిపోతుందని నేనప్పుడు అనుకోలేదు .రోజు ఆఫీసు కి వెళ్ళాక వొక గంట పని చూసుకుని ఆమె కి ఫోన్ చెయ్యాలి ఇంకో గంట ఆమె తో మాట్లాడాలి .మళ్ళి లంచ్ టైం లో ఆమె ప్యాక్ చేసిన బాక్స్ లో పదార్దాలని వర్ణిస్తూ ఆమె చేతి వంటని మెచ్చుకుంటూ (నిజం గానే)ఆమె తో మాట్లాడుతూ , మద్య మద్యలో యి ఆనందం కేవలం కొంత కాలమే గా అంటూ ఆమె ఏడుస్తుంటే వోదారుస్తూ , సాయంత్రం ఆఫీసు అయిపోగానే మళ్ళి మేడ మీద కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ (అదే శ్రోత గా వింటూ), మళ్ళి డిన్నర్ వాళ్ళింట్లోనే . నాకే మొహమాటం వేసి నెలకి సరపడ సరుకులు కోనేయ్యడం మొదలెట్టా .మొదట్లో ఆమె అబ్యంతరం పెట్టినా , నన్ను పరాయి వాడు గా అనుకుంటే తేనులే అన్న పాపానికి , తర్వాత నెల నుంచి సరుకుల లిస్టు చేతిలో పెట్టేది .అందులో మగవాళ్ళకి సంభందం లేనివి కూడా ఉండేవి అది వేరే విషయం .అదంతా నా మీద వోచ్చేసిన పోస్సేసివే నెస్ తో చేసేదో లేక నన్ను వుపయోగించుకునేదో?ఇప్పటికి నాకు అర్ధం కాలేదు .వోకో సారి నా వొళ్ళో తల పెట్టుకుని ఎడ్చేసేది రేపు నువ్వు వెళ్లి పొతే ఎలా అంటూ , ఆమె కోసం శని ఆది వారాలు మా వూరు వెళ్ళడం తగ్గించాను ఆఫీసు లో పని వత్తిడి అని ఇంట్లో చెప్పి . ఏంటి మద్య ఎప్పుడు చూసినా మీ సెల్ బిజీ అని వస్తోంది అని కుటుంబ సబ్యులు అడుగు తుంటే గిల్టీ గా అనిపించడం మొదలేడుతోంది .ఇంతకూ ముందు అలా అనిపించేది కాదు . భందమన్న మొదట్లో ఉన్నంత ఉదృతి రాను రాను వుండదేమో .అందులోను రోజు మధ్యాన్నం సెల్ లో మాట్లాడుతూ ఆమె మాటల మద్యలో ''ఆల్ రోడ్స్ లీడ్స్ టు రూం '' అంది . నేను అక్కడకి అది'' రోం'' అని సవరించ బోతే ఆధునిక యుగం లో తను చెప్పిందే కరెక్ట్ అనడం తో తాళం తప్పుతోందని హెచ్చరించా .తన పెళ్లి అయినప్పుడే అపశ్రుతి వచ్చేసిందని ఇప్పుడు కొత్త గా తాళం తప్పేది ఏమి వుందని వాదించింది . సాయంత్రం నేను కావాలనే ఇంటికి వెళ్ళకుండా యెక్క డో బార్ లో కూర్చుని అర్దరాత్రి ఇంటికి చేరా , సెల్ లో నూట మూడు మిస్సేడ్ కాల్స్ అన్ని సుధవే అని వేరే చెప్పక్కరలేద్దు . అంత రాత్రి గేటు తియ్య గానే వొక్క ఉదుటున వచ్చి ఎమైపోయావు ఇక్కడ యెంత కంగారు పడుతున్నానో తెలుసా అంటూ గట్టి గా హత్తుకుని బ్జోరున ఏడ్చేసింది , ఆమె ఆప్యాయతకి క్షణం కరిగి పోయా . అంత రాత్రి కూడా మేడ మీద నా రూం కి భోజనం తీసుకు వచ్చి , నేను కూడా నీ కోసమే తినకుండా కూర్చున్నా అంటూ కొసరి కొసరి వడ్డించింది .నాకు కూడా ప్రేమకి కళ్ళల్లో నీళ్ళు ఆగ లేదు . జన్మ భంధమో ,ఎక్కడో ఎవరికో ముడి వేసి పెడతాడు ముడిని ఎందుకో విడ దీసి పోతాడు భగవంతుడు అన్నా.అంతే విడదీయడానికి వాడెవడు నీ తీపి గురుతులు చాలు నాకు అంటూ అమాంతం ఆమె నా మీద పడి పోయింది .నా చేతులు ఆమె చుట్టూ పెన వేసుకు పోయాయి . ఇంకొక్క క్షణం లో అగ్ని పర్వతం బద్దలయ్యే వుండేది సెల్ లో ఇంటినుంచి మెసేజ్ రాకపోయి వుంటే .
'' యెంత దూరమో మరి అంత చేరువో
శారీరకం గా మనిద్దరం దూరం గా ఉండొచ్చు గాని
మానసికం గా ప్రతీ రాత్రి నా చెంతనే నువ్వు
నీ అర్ధాంగికి చాలు నీ చిరు నవ్వు గుడ్ నైట్ ''
అది చూడగానే విజ్ఞత మేలుకుంది , చేతులు విడి వడ్డాయి .చూడు సుధ మనం ఇంత వరకూ తప్పు చెయ్య లేదు కాబట్టే ఇంత అర్దరాత్రి కూడా నువ్వు వచ్చి భోజనం పెట్ట గలుగు తున్నావు . అదే తప్పు చేసిన మరు క్షణం రేపొద్దున్న కాఫీ కూడా తేలేవు . మీ అబ్బాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేవు . శాశ్వత మైన అమలిన అనుభూతులు కావాలో , జీవిత చరమాంకం లో అయ్యో రోజు అలా చెయ్య కుండా ఉండాల్సింది అనుకునే యి క్షణికమైన ఆనందం కావాలో నువ్వే తేల్చుకో అన్నా .
వెంటనే తన కళ్ళలో అశ్రు ధారలు '' నా జీవితం లో ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం కల్గిన మగాన్ని చూస్తానని అనుకోను అంటూ నా పాదాల్ని చుంబించి వెళ్లి పోయింది .
గొప్ప తనం టైం లో మెసేజ్ పంపిన అర్ధాంగిది గాని నా దేలా అవుతుంది . ఆక్షణం అలా అనిపించింది ఇంకో క్షణం మరోలాఅనిపిస్తుంది . అప్పుడు తప్పు జరగ లేదని ఇంకోసారి జరగదని హామీ ఇవ్వలేనని సుదకి నేను చెప్పలేక పోయా .అనుక్షణికం మనసు మాట వింటుందని గుడ్డి గా నమ్మడమే నే చేసిన పొరపాటు అదే నా గ్రహ పాటు .సుధ తనకి డైమండ్ నెక్లస్ కొనమని అడిగే చనువు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే శని వారం ఏం జరిగిందో తెలుసుకోవాలి అందుకు శనివారం దాక ఆగాలి .

1 మే, 2010

అనుక్షణికం


రైలు వేగంగా గమ్యం వైపు సాగి పోతోంది .నా ఆలోచనల లాగే .ఇన్నాలకి మళ్ళి కుటుంబం తో గడిపే అవకాశం సొంత ప్రాంతానికి బదిలీ అవడం తో .యి సంవత్సర కాలం లో ఎన్నోనేమరేసుకునే మధురాను భూతులు .కొన్ని మరచిపోలేని పీడ కలలు .సుధ ఎమ్చేస్తూ వుంటుందో ?తను గుర్తు వచినప్పుడల్లా గుండె జల్లు మంటుంది .యి పాటికి నా పోర్షన్ లో అద్దెకు వచ్చిన భార్య భర్త తో చెలిమి కలిపేసే వుంటుంది .నా ఆలోచనలు వొక సంవత్సరం వెనక్కి వెళ్లి పోయాయి .
నేను అప్పుడే promotion మీద బదిలీ పై వచ్చి రెస్ట్ హుసే లో వుంటూ ,ఇంటి వేటలో పడిన రోజులు .ఫ్యామిలీ ని తెచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ,ఆఫీసు ఇచ్చే వసతి ని ఇంకో కొలీగ్ కి వదిలేసి నేను అద్దె ఇంటి వేటలో పడ్డా . ఆ వూళ్ళో పోష్ ఏరియా లో వొక అందమైన ఇంట్లో పై పోర్షన్ అద్దెకుందని తెలిసి వెళ్ల, అందం ఆకర్షణ మిళితమైన వొక ఆమె ఎదురు పడి నా వివరాలు తెలుసుకుని అద్దేకివ్వడానికి వోప్పుకుంది . నా వుద్యోగపు హోదా చూసి అన్ని విధాల భవిష్యత్తులో ఉపయోగ పడతానని వోప్పుకుందన్న విషయం ఆ క్షణం లో నాకు తెలీదు .మంచి రోజు చూసి షిఫ్ట్ అవుతానంటే నా రాసి ఏంటి అని అడిగింది .కర్కాటకం అని చెపితే . అరె నాది అదే రాసి ఆ రాసి వాళ్ళకి ఎల్లుండి నుంచి మంచి రోజులు వస్తున్నాయి సో మీరు ఎల్లుండే వచ్చెయ్యండి అంటే అయ్యో ఆ మంచిరోజున యి చెడ్డ వాదేన్డుకండి అన్నా ఆమె reaction చూద్దామని .మీరెలాంటి చెడ్డ పనులు చెయ్యకుండా చూసే బాద్యత నాది అంటూ చిలిపి గా నవ్వింది .
ఇంతకీ మా గార్డియన్ పేరేంటో? అడిగా. సుధా ఐ mean సుధా కుమార్ అంటూ తనకి కుడా పెళ్లి అయిపోయిందని అన్యాపదేశం గా చెప్పింది .నే పై పోర్షన్ లోకి వచ్చిన దగ్గరనుండి నా పనేదో చూసుకుని ఆఫీసు కి పోవడం రాత్రెప్పుడో రావడం శని, ఆది వారాల్లో ఇంటికి వెళ్ళిపోవడం తో మా మద్య పరిచయం పెరిగే అవకాశం లేక పోయింది కరెంటు పోయే ఆ క్షణం వరకు . ఆ రోజు రాత్రి ఎనిమిది ప్రాంతం లో కరెంటు పోయి చాల సేపటి వరకు రాలేదు .నేను ఆరుబయట సిట్ట అవుట్ లో కూర్చుని బీరు పారాయణం చెస్తున్నా. ఇంతలో మెట్లు ఎక్కు తున్న శబ్దం అవడం తో బీరకాయని టవల్ వేసి కప్పేసి కుర్చీ కిందకి తోసేసా, ఆ చీకట్లో ఎవరో ఆడ ఆకారం వస్తునట్టు గా అర్ధం అయ్యి ఎవరది అనే లోపే
సారీ అండీ డిస్త్రుబ్ చేశాను ఇంట్లో కాండెల్ కూడా లేదు , బాబు tution నుంచి ఇంకా రాలేదు , వోక్కదాన్ని భయమేసి అంటూ ఆర్యోక్తి గా ఆగి పోయింది ,భలేవారే కూర్చోండి అంటూ కుర్చీ తెచ్చి వేసా .మీ హబ్బి ఇంకా రాలేదా అన్న ఏదో మాట్లాడాలి కాబట్టి .
తను ఇక్కడ వుండరండి దుబాయి లో పని చేస్తారు .మూడు నెలలకి వొక సారి వచ్చి పదిహేను రోజులు ఉండి వెళ్లి పోతారు . మీరు వచ్చే ముందు రోజే వెళ్లి పోయారు అంటూ మాటలు మొదలెట్టింది .అదేంటి మీరొక్కరే వుంటార బాబు తో నే గమనించ నే లేదు అన్నా. మా అన్నయ్య వాళ్ళు పక్క వీధి లోనే వుంటారు రెండు రోజులకోసారి వస్తూనే వుంటారు అంది .
మీకు జాతకాలు చూడడం వచ్చా అన్నా . ఏదో నండి కొంచెం ప్రవేశం ఉంది . కర్కాటక రాసి వాళ్ళకి ఇప్పుడు చాల మంచి కాలం , వాళ్ళ జీవితం లోకి యి సమయం లో ప్రవేశించే వ్యక్తులు గొప్ప ప్రభావాన్ని చూపుతారు అంది .
నేను వెంటనే మనిద్దరిది కర్కటకమే కాబట్టి నా మీద మీ ప్రభావం ఉంటుందా లేక మీ మీద నా ప్రభావం ఉంటుందా ఆనేసా , ఆంతా బీరు మహిమ నేరం నాది కాదు బీరుది అంటూ మనసుకి సర్ది చెపుతూ , ఏమో నండి ఆ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి అంది
ఆ సమాధానం తో నా లో ధైర్యం మరింత పెల్లుబికిమీరున్న చోట చీకట్లో కూడా కాండెల్ అవసరం పడదు , వెన్నెల్లో పాల రాయి లా మెరుస్తుంటారు అన్నానో లేదో గేటు చప్పుడయ్యింది , మా అబ్బాయి వచ్చి నట్టు వున్నా డండి నే వస్తా అంటూ వెళ్లి పోయింది . నాకు చాలా గిల్టి గా అనిపించి రాత్రంతా నిద్ర కూడా పట్ట లేదు అనవసరం గా బీరు ప్రభావానికి లోనయి పెళ్ళయిన ఆవిడ భయం పోగొట్టు కోడానికి వస్తే పాల రాయి చందమామ అంటూ చీకటే నయం రా బాబు అనుకుంటూ వెళ్లి పోయేలా చేసానేమో?లేదా వాళ్ళ అబ్బాయి రాకుండా వుంటే తను కూడా ఇంకోలా ప్రతి స్పందిన్చేదేమో ?ఏమైనా నేను తొందర పడ్డ ఇన్నాల నుంచి రాముడు మంచి బాలుడు లా వున్నా నాలో రావణ కోణం బయట పెట్టేసానేమో అనుకుంటూ యెప్ప టికో నిద్ర లోకి జారా .కాలింగ్ బెల్ మోగితే లెచా, చూస్తే ఎదురు గా సుధ కాఫీ కప్పు తో ప్రత్యక్షం .ఏంటండి రాత్రంతా నిద్ర పోలేదా?యి రోజునుంచి నేనే మీ మీద ప్రభావం చూపించాలని డిసైడ్ అయ్యి మొదట కాఫీ తో మొదలెడ దామని తెచ్చా అంటూ అందించింది . వోహో రకమే అనుకుంటూ కాఫీ అందుకున్తునప్పుడు ఆమె చేతి వెళ్ళు తగల్చడం యాదృచ్చికం అని మాత్రం అనుకోలేదు . అంతవరకూ వున్నా గిల్ట్ భావం పోయి ఇప్పుడు కొత్త ఆలోచనలు ముసురు కుంటున్నాయి .కొన్ని క్షణాలకి ముందు వొక భావం ఇప్పుడు మళ్ళి వేరే భావం .అనుక్షణికం మనసులో అప్పటి కాల మాన పరిస్తితుల బట్టి మనసులో కలిగే విభిన్న కొనాలని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ కదా గమనం .
excuse మీ యి ట్రైన్ హైదరాబాద్ ఎప్పుడు వేలుతుందండి అంటూ ఎదురు బెర్త్ లో వున్న అందమైన అమ్మాయి పిలుపుతో ఆలోచనల నుంచి బయటకొచ్చి చుట్టూ చూస్తే ఆ ఫస్ట్ ఏ సి కంపార్ట్మెంట్ లో మే మిద్దరమే ఉన్నామన్న విషయం భోధ పడింది .యి క్షణం సుధ మాయం అయి పోయి ఈ అపరిచిత ఆమె స్తానం ఆక్రమించింది . కరెక్ట్ టైం కి వెళితే రేపు పొద్దున్న ఎనిమిదికి , హైదరాబాద్ లో మీరేక్కడకి వెళ్ళాలి ?మొదటి ప్రశ్న కే అంత చొరవ పనికి రాదన్న మనసుని డామినేట్ చేస్తూ అడిగేసా .
కేర్ హాస్పిటల్ కి అండి రేపొద్దున్న మా అన్నయకి బై పాస్స్ ఆపరేషన్ .
అయ్యో అలాగా రేపు నాకు కార్ వస్తుంది మీకు అభ్యంతరం లేక పొతే డ్రాప్ చేసి వెళ్తా అన్నా .
చాలా థాంక్సండి నాకు హైదరాబాద్ కొత్త ఆటో వాళ్ళు మోసం చేస్తారని భయ పడుతుంటే మీరు ఇలా పరిచయం అవడం నా అదృష్టం . మీరెన్ చేస్తూ వుంటారు? చెప్పాకా ఆమె కళ్ళలో ఆరాధనా భావం నే గమనించక పోలేదు .ఇద్దరం కలిసి నేను తెచ్చుకున్న డిన్నర్ షేర్ చేసుకుంటుంటే తన గురించి అంతా చెప్పింది .ఏం బి ఏ పూర్తీ చేసి ఉద్యోగ అన్వేషణ లో వుందని .మీ అన్నయ్య ఆపరేషన్ అయి పోయాక నన్ను వచ్చి ఆఫీసు లో కలవండి నే చూసుకుంటా అన్నా .
అదేంటి ఇప్పటి దాక కొరుక్కు తినేలా చూస్తున్నారు గా తనే అందో నా మనసు అల్లా విందో నాకు అప్పటికి అర్ధం కాలేదు .
మీరు భలే నవ్విస్తూ మాట్లడతారండి రాత్రంతా మెలుకువ గా ఉండి మరి మీతో మాట్లాడాలని ఉంది అండి అపరిచిత . అంటే గుండెల్లో బాంబు పెకినట్టయ్యింది . అదే డైలాగు అలాంటి రాత్రే సుధ కూడా నాతొ అంది . అంటే సుధ లాగే ఈమె కూడా?అమ్మో ఇంకో సారి చచ్చిన బకరా అవకూడదు అనుకుంటూ లేదండి యి రాత్రి నేను ఏ తప్పు చెయ్య దలచుకోలేదు అనేసాక అర్ధం అయ్యింది యెంత తప్పు గా మాట్లాడానో వెంటనే సద్దుకుని అదేనండి నిద్ర పాడు చేసుకుని బాతా ఖాని కొట్టే తప్పు పని అని సరి దిద్దా .
ఆమె కూడా ఛి ఛి మిమ్మల్ని చూస్తే తప్పు చేసే వారిలా కనబడడం లేదు లెండి (పప్పు ముద్దా పోయి పడుకోరా ఆనా?)అయినా రేపొద్దున్న అన్నయకి కట్టడానికి ఇంకా రెండు లక్షలు కావాలీ ఆన్న ఆలోచనలతో వున్న నాకు నిద్రే పట్టదు, ఇంకా వేరే ఆలోచనలు ఏమి వస్తాయి అని నా మొహం లో ప్రతి స్పందనకి ఆత్రం గా ఎదురు చూస్తోంది ,సుధ పరిచయం కాక పోయి వుంటే నెక్స్ట్ దైలోగు యెంత మాటండి రేపు నాతొ పాటు బ్యాంకు కి వచ్చి ఆ రెండు తీసుకుని ఏదో విధం గా తీర్చుకోండి అని వుండే వాడినేమో , దానికి భిన్నం గా గురక శబ్దం విన బడడం తో సచ్చి నాడా సావు గిరాకి అనుకుంటూ ఆమె నెక్స్ట్ కంపార్ట్మెంట్ కి వెళ్లి పోవడం నాకు నిద్ర నటిస్తుండడం తో తెలుస్తూనే ఉంది . ఇంతలో సుధ నుంచి మెసేజ్
క్షణ క్క్షణం మనిద్దరి మద్య పెరిగి పోతున్న దూరం
అపార్దం చేసుకుని వెళ్లి పోతున్న వైనం
ఇక నుంచి మనసులో మాట రాని మౌనం
ఎప్పటికన్నా తెలుస్తుందా నా గుండెల్లోని ఈ వేదనం
మరెప్పటికీ కనిపించని వోకప్పటి నీకు ప్రియమైన ఈ వదనం .
చదివాక మనసు భారం అయిన మాట నిజమే గాని తనది ప్రేమో?అవకాశ వాదమో తెలుసు కోవాలంటే వేచి చూడాల్సిందే మిగతా బాగం కోసం (ఇంకా వుంది) బేతాళుడు మౌన భంగం అవడం తో తిరిగి చెట్టెక్కాడు .