30 ఏప్రి, 2011

ఆత్మహత్యల్ని గ్లోరిఫై చేసే రాక్షసి


ఆత్మ హత్య చేసుకునే వాళ్ళ కారణాలు బయట వాళ్ళకి సిల్లీ గా కనబడొచ్చు దాని వెనక వాళ్ళు అనుభవించే మానసిక వేదన ఆపై ఎంతో ధైర్యం తో తీసుకునే ఆ నిర్ణయం అది అమలు చేసే విధానం ,చని పోయే ముందు వాళ్ళు యిన్నాళ్ళు పడ్డ వేదనతో బాటు ఎలా చని పోయారో కూడా చక్కగా చిత్రీకరించి దాన్ని youtube లో వాళ్ళు చనిపోయిన కొద్ది గంటల్లోనే ప్రపంచానికంత తెలిసేలా పెట్టె పాత్రలో ఇలియానా , తన తల్లిదండ్రుల్ని దారుణంగా చంపిన రౌడి మూక మీద పగ తో ప్రొఫెషనల్ కిల్లెర్ గా మారి రౌడి మూకల్ని మట్టు పెట్టె పాత్రలో రానా ,వీళ్ళని పట్టుకునే పొలిసు పాత్రలో సుబ్బరాజు . అనుకోని పరిస్తితుల్లో రానా , ఇలియానా పదిహేను రోజులు వెనిస్ పారిపోవలసి వస్తుంది .తను పదిహేను రోజుల్లో ఆత్మ హత్య చేసుకుంటానని దాన్ని రానా చిత్రీకరించి పెట్టాలని షరతు మీద అతని వెంట వస్తుంది .అంతకు ముందే రానా తన తల్లి చని పోవడం తో ఆత్మ హత్య చేసుకోడానికి నిర్ణయం తీసుకుని దీన్ని చిత్రీకరించడం కోసం మీనాక్షి ని (ఇలియానా )వొక ప్రదేశానికి రమ్మంటే ఆమె ముఖానికి ముసుగు వేసుకుని చిత్రీకరిస్తూ వుంటుంది , కత్తి తో పొడుచుకుని చని పోయే ముందు ముసుగు తొలగడం తో ఆమె తను ప్రేమిస్తున్న మీనాక్షి గా (ఒనె సైడేడ్ లవ్ )గుర్తించి ఆఖరి నిమిషం లో రక్షించమని వేడుకుంటాడు . తన పని చనిపోయే వాళ్ళ బాధల్ని ప్రపంచానికి తెలియ బర్చడమే గాని అతని చావుకు గాని బతుకు కి గాని ఏమి సంభంధం లేదంటూ వెళి పోతుంది .ఈ పదిహేను రోజులు ఐ లవ్వు యు అంటూ తన వెంట బడుతుంటే మగాళ్ళు అయి లవ్ యు అని చెప్పేది ''దాని '' కోసమే అని అంటుంది . దానికి హీరో సమాధానం ''అయి లవ్ యు అంటే అర్ధం నువ్వంటే నా కిష్టమని , బట్టలకి శాపింగులకి డబ్బులు దోబ్బిన్చుకున్తానని ఆ పైన'' అది '' కూడా కావాలని ''అర్ధం చెపుతాడు .పదిహేనో రోజు తను చని పోయే ముందు తన అక్కని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ప్రేమ పేరు తో ఎలా మోసం చేసి వాళ్ళ స్నేహితులకి అప్పగించితే ఆ విషయం మీడియా లో వచ్చి వాళ్ళనాన్న గుండె ఆగి మరణిస్తే అక్క మగాళ్ళని ఎప్పటికి నమ్మకు అంటూ ఆత్మ హత్య చేసుంటుంది వీడియో తీసి .అప్పటి నుంచి తను అలాగే చిత్రీకరిస్తున్నా అంటూ కత్తితో పోడుచుకుంటుంది ,యిది చిత్రీకరిస్తున్న రానా కూడా నువ్వు లేనప్పుడు నేనెందుకు అంటూ తన కంటే ముందే పొడుచు కుంటాడు .యిద్దరు అలా శవాల్లా పడి వుంటే మరో'' మరోచరిత్ర'' అనుకుంటూ ప్రేక్షకుడు కంట తడి పెట్టుకునే సమయం లో సుబ్బరాజు వచ్చి రక్షించడం తో కధ సుఖాంతం అవుతుంది .
మొదటి సగం అప్పుడే ఇంటర్వేల్లా అనట్టు కా సాగి పొతే రెండో సగం వుహించే మలుపులతో మాములు గా సాగి పోతుంది .ఆలి ముమైత్ ఖాన్ హాస్యం సబ్యత పరిధి దాటి వుంటుంది . మొహమాటానికి పొతే కడుపైయ్యింది లే వంటి సంభాషణలతో .భారి కాయం వున్న ఆఫ్రికా యువతి ఆలి మీదకు వస్తుంటే బాబోయి ఆ రెంటి తో సంపెస్తావా అంటూ క్లోజ్ అప్ షాట్స్ .రానా ఇలియానా బాగా చేసారు అయితే రానా భాష లో యాస మార్చు కోవాలి .ఈ సినిమా చూసి ఇంటర్ లో ఫెయిల్ అయ్యి లేదా లవ్ లో ఫెయిల్ అయ్యి ఆత్మ హత్య దిశగా ఆలోచించే యువత ను ఆ ప్రయత్నం లోకి నేట్టగాలిగెంత లా ఆత్మ హత్యని గ్లోరిఫై చేసారు ఈ సినిమాలో . అలా జరిగితే నై తికంగా పూరి దే ఆ బాద్యత , ఎందుకంటె ఎక్కడా కనీసం ఆఖర్న కూడా ఆత్మ హత్య చేసుకునే కంటే ఈ జన్మలోనే కోల్పోయింది సాధిద్దాం లాంటి సందేశాలు లేవు కాబట్టి . మొత్తానికి మేచ్యురుడ్ ప్రేక్షకులు మొహమాట పడ దగ్గ సినిమా నేను నా రాక్షసి .

26 ఏప్రి, 2011

సాయిబాబా మరణం తర్వాతా అనుమానాలే




నేను ఇంతకూ ముందు రాసిన'' దేవుడికే రోగం వస్తే ''పోస్ట్ లో రాసినట్టు గా సాయిబాబా నిర్యాణం తో నాకున్న అనుమానాలు కొన్ని తీరతాయనుకున్నా .కాని సాయిబాబా పార్దివ దేహాన్ని చూసాకా ముక్కున వేలు వేసు కోవడం మన వన్న్తయ్యింది .యిరవై ఎనిమిది రోజులు అయిసియు లో వున్నా , గడ్డం గీసుకునే అవకాశం లేక పోయినా వొక్క అంగుళం కుడా గడ్డం పెరగ లేదు .యింక జుట్టు వొక్క వెంట్రుక కూడా తెల్లది కనబడ లేదు .రోగాలకి అతీతం కాని బాబా కి గడ్డం పెరగడం , జుట్టు తెల్ల బడటం వాటికి మాత్రం మినహాయింపు ఎలా వచ్చింది?లోపలి వెళ్లి అయి సి యు లో చూసి వచ్చిన డాక్టర్ మిత్రుల వల్ల తెలిసిందేమంటే ఆయన మొఖం పిక్కు పోయి శరీరం శుష్కించి ఆస్తి పంజరం లా వుండడం తో పాటు మాసిన గడ్డం తో అసలు బాబా నేనా అనట్టు వుండేవారట .ఆయన చని పోగానే ట్రస్ట్ సబ్యుల వత్తిడి మేరకు ఆయన పార్దివ శరీరానికి ఎమ్బోస్సింగ్ (యిదో కొత్త ప్రక్రియ విదేశాల్లో యిప్పటికి అమలు లో వుంది చనిపోయిన వారి దేహం లో జీవ కళ వుట్టి పడేలా కొన్ని రకాలా కెమికల్స్ వేసి లేపనాలు పూసి మనిషి ప్రశాంతం గా నిద్ర పోతున్న బ్రాంతి కలిగించడం )చేసారని అభిజ్న వర్గాల బోగట్టా .అయితే యింక పని సగం లో ఉండగానే సి ఏం , గవర్నర్ వచ్చేయడం తో ముఖ్హాన్ని, పాదాలని పూర్తీ గా కవర్ చేసేసి మళ్ళి వాళ్ళు వెళ్ళాక పని పూర్తీ చేసి అందంగా తయారు చేసి బయటకు తీసుకు రావడం తో సాయిబాబా జుట్టు నలుపు ప్రకృతి విరుద్దమా ?గడ్డం కూడా నలుపేనా లేకా లోక సహజం గా తెలుపా అన్న విషయాలు నాలాంటి జిజ్ఞాసులు తెలుసుకునే అవకాశం లేక పోయింది .అంతరంగాలలో నిలిచి పోయిన సాయి దివ్యమంగల స్వరూపాన్ని యిప్పటి అలంకరించని పార్దివ దేహం తో జుట్టు తెల్ల బడి , మాసిన గడ్డం తో భక్తులు చూసి తట్టుకోలేరని ట్రస్ట్ సబ్యులు ఈ ఏర్పాటు చేసినట్టు తెలిసింది .అయన పోయిన పదిహేను నిమిషాలకి కర్ణాటక లో మాండవ (?)జిల్లాలో వొక ఆడశిశువు , యింకో పది నిమిషాలకి అదే ప్రాంతం లో (ఎక్కడైతే ప్రేమ సాయి గా పుడతానని బాబా చెప్పే వారో )యింకొకరికి మగ శిశువు పుడితే అప్పుడే ప్రేమ సాయి పుట్టేసారని ప్రచారం జరుగు తోంది .అసలు పిండానికి ప్రాణం పుట్టే ముందే వస్తుందా ?ఫలదీకరణం జరిగానప్పటి నుంచి ఉంటుందా ?వొక ఆత్మ అందులో ప్రవేశించాలంటే పిండ దశ నుంచే ప్రవేసించాలా?ఆఖరి నిమిషం లో దూరితే సరి పోతుందా?హేవిటో సాయిబాబా మరణం లోను అనుమానాలే మరణం తర్వాత అనుమానాలే . కొన్ని ప్రశ్నలకి సమాధానం కాలమే చెప్పాలి .

16 ఏప్రి, 2011

బాబాయి ఆరంజ్ తీన్ మార్


రాంచరణ్ సినిమా ఆరంజ్ యెంత హిట్టో అందరికి తెలిసిందే .స్వయం గా నిర్మాత నాగ బాబు ఆ సినిమా దర్శకుడు భాస్కర్ మీద కోపం బహిరంగంగా నే వెళ్ళ గక్కాడు అంత చెత్త సినిమా తీసినందుకు .అదే కాన్సెప్ట్ తో మళ్ళి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనాల మీదకు వదిలిందే ఈ తీన్ మార్ .ఆ సినిమాకి ఈ సిని మాకి చాలా పోలికలే వున్నాయి .ఆ సినిమాలో మొదటి పది నిమిషాలు జెనిలియా ఏమంటుందో కూడాఅర్ధం కానంత గా అరుస్తూ వుంటుంది .ఈ సినిమాలో కూడా మొదటి పది నిముషాలు పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో కూడా అర్ధంకాదు. డబ్బింగ్ కూడా చెప్పుకునట్టు లేదు అక్కడక్కడా .
యింక స్టొరీ విషయానికి వస్తే ఆరంజ్ లో లాగే హీరో మైక్ నచ్చిన ఆడవాళ్ళని రంగు , రుచి ,దేశం , వొడ్డు పొడుగు , యిలా దేనితోను సంభంధం లేకుండా కొన్నలపాటు ప్రేమించేసి బోర్ కొట్టగానే యింకోకల్లని చూసుకుంటూ ఉంటాడు .అయితే త్రిష తో మాత్రం వొక సంవత్సరం పాటు తిరుగు తాడు .సంవత్సరం అని అంత గట్టి గా ఎలా చెప్పా గలమంటే స్క్రీన్ మీద రెండు నెలల తర్వాత , అయిదు నెలల తర్వాత , సంవత్సరం తర్వాత అంటూ కింద రాసి వస్తూ వుంటుంది .సీను మాత్రం ప్రతి సారి షాపింగ్ కి వెళ్ళడం , త్రిష కురచ బట్టలు కొనుక్కోవడం . అక్కడనుంచి పబ్ కి వెళ్ళడం యివే .యివి కాకుండా యిద్దరి కి లిప్ లాకులు ఎదురు పడిన ప్రతి సారి .ఆ పైన యధా విధి గా వేలాయుధం (మైక్ )మనం విడి పోదాం నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని హాయి గా వుండు అంటూ చెపితే వాకే అని గట్టి గా కవుగిలించుకుని మరో సారి పెదాలు కొరికేసి విడి పోతారు .హీరోయిన్ కి ఎయిర్ పోర్ట్ దాక వచ్చి ఇండియా కి సాగనంపే క్రమం లో వొక పెద్ద మనిషి (పరేష్ రావెల్ )నిజమైన ప్రేమికులకి నిర్వచనం ముప్పై ఏళ్ళ క్రితం మైక్ లాగే వుండే అర్జున్ పాల్వాయి తను ప్రేమించిన అమ్మాయిని యెంత స్వట్చం గా ప్రేమించి పెద్దల్ని ఎదిరించి ఎలా పెళ్లి చేసుకునదో ఫ్లాష్ బ్యాక్ లో చెపుతుంటాడు .అయితే మద్య మద్య లో మైక్ లవ్ స్టొరీ మళ్ళి పాల్వాయి లవ్ స్టొరీ ఏది ఎప్పుడు వస్తుందో తెలుసు కోలే న్నంతగా వస్తూ ప్రేక్షకుల సహా నాన్ని పరీక్షిస్తూ వుంటుంది . ముప్పై ఏళ్ళ నాటి బెల్ బాటం ఫాంటులు , అప్పటి హెయిర్ స్టైలు లో పాల్వాయి పక్కనున్న వాళ్ళే కనిపిస్తారు హీరో మాత్రం జీన్ ప్యాంటు (యిప్పటి స్టైల్లో కుట్టింది ), డేనిం షర్టు వేసుకుని భవిషత్తు దార్సనీకుడి లా కని పిస్తూ ఉంటాడు .వొక చోట అంటాడు కూడా భవి ష్యత్తు లో పెళ్ళికి ముందే అన్ని అయిపోతాయేమో గాని ఇప్పడు మాత్రం ముద్దు పెట్టి ఎంగిలి చెయ్యను అంటాడు బెల్ బాటం స్నేహితులతో . చివరికి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు .
యింక మైక్ త్రిష మీద కోపం తో (తను వేరే వాళ్ళని ప్రేమించిందని )యింకో విదేసి అమ్మాయిని ప్రేమించేస్తాడు .ఆమె ఇండియా చూడాలంటే ఆమె కోసం ఇండియా బయలు దేరతాడు , ఆమె రాక పోయినా సరే (?).ఇండియా వచ్చాక యిద్దరు మళ్ళి కాన బడ గానే కౌగిలింతలు ముద్దులు . వొక పక్క త్రిష ఆమె ప్రేమికుడి తో ఫోన్ లో మాట్లాడుతూ వుంటే ఆ టైం కూడా వేస్ట్ చేసుకోకుండా మైక్ ఆమె ని పట్టేసుకుని వొళ్ళంతా తడిమేస్తూ ఉంటాడు . త్రిష మాత్రం ఎక్కడ తోనగ కుండా చిన్న ములుగు కూడా రానీకుండా తన ప్రస్తుత ప్రియుడి తో అక్కడ ఏమి జరగా నట్టే మాట్లాడుతూ తను వొక రెండు మూడు రోజులు కలవ లేక పోవచ్చని అర్జెంటు పనులు వున్నాయని చెపుతూ ఆ మూడు రోజులు తన మాజీ ప్రియుడి తో పబ్బులకి వెళుతూ టాక్సీ లో తిరుగు తు వుంటుంది .వొక ఆడది తలచుకుంటే మగాన్ని యెంత బకరా చేయోచ్చ్చో? టాక్సీ డ్రైవర్ ఆలి వీళ్ళ సంభాషణలు విని బట్టలు నగలు కొనడానికి వొక బకరా గాడు , పబ్బుల్లో ఎంజాయ్ చెయ్యడానికి ఇంకొకడు అయితే ఆఖరికి ఎవరి తో సెటిల్ అవుతుందో అనుకుంటూ ఉంటాడు . పెళ్లి అయిన మర్నాడు తన భర్త కి విడాకులు ప్రొపోజ్ చేసి వేలయుధం తో యెగిరి పోతా అని చెపుతుంది త్రిష .చివరాఖరకి యిద్దరు కలుస్తారు . అక్కడక్కడ పవన్ కళ్యాణ్ నటన చాలా బావున్నా మిగతా చోట్ల రొటీన్ .త్రిష కురచ డ్రెస్సులు ముద్దు సీన్ లలో పెట్టిన శ్రద్ద నటన మీద కూడా పెట్టి వుంటే బాగుండేది .చాలా చోట్ల పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడో కూడా అర్ధం కానంత గా వున్నాయి అతని సంభాషణలు . మరి యిది డబ్బింగ్ లోపమా ?యింక అర్ధం కాని విదేశీ భాష లో ఎక్కువ సేపు మాట్లాడడం విసుగు తెప్పిస్తుంది .ఆలె ఆలె పాట బావుంది చిత్రి కరణ కూడా .ఈ సినిమాని వొక రేన్జి లో వుహించు కోకుండా ఆరంజ్ కి కోన సాగింపు గా పవన్ కళ్యాణ్ ఆరంజ్ గా భావించుకుని వెళితే గిట్టు బాటవుతుంది . లేక పొతే తీన్ మార్ కాస్తా తీన్ బోర్ అవుతుంది .

3 ఏప్రి, 2011

దేవుడికే రోగం వస్తే ?


గత వారం రోజులు గా సత్య సాయిబాబా ఆరోగ్యం ఆందోళన కరం గా మారి ఆయన అయి సి యు లో వెంటి లెటర్ మీద వున్నారని వినప్పుడు నా మనసులో కలిగిన వివిధ రకాల ఆలోచనలకి అక్షర రూపం యిద్దామని ఈ ప్రయత్నం .అలా అని నేనేమి బాబా భక్తున్నో లేదావిమర్సకున్నో కాదు .ఎంతో మంది భక్తులకి ఆరాధ్య దైవం గా నిలిచి వాళ్ళు అనారోగ్యం తో బాధ పడుతునప్పుడు ఆయన మీద ఉంచిన నమ్మకం తో తిరిగి కోలుకున్న వాళ్ళు నేడు అదే దైవం జీవన పోరాటం చేస్తూ వుంటే యెంత ఆందోళనకి గురవుతారో కదా ?ఆయన ఎవర్ని ప్రార్ధించి ఈ గండం నుంచి బయట పడతారో ?ఆ వయసులో వెంటి లెటర్ నుంచి వీన్ అయ్యి బయట పడడం కేవలం దైవ అనుగ్రహం తోనే సాద్యం .పేస్ మేకర్ అమర్చడం అంటే పెద్ద ఆపరేషన్ .అయి సి యు లోనే చాల రోజులు నిరంతర పర్య వేక్షణలో ఉండాల్సి వుంటుంది .ఆయన దేవుడా కాదా అన్నది పక్కన పెడితే వొక మంచి మానవతా వాది అనంతపూర్ చుట్టుపక్కల తాగు నీరు అందించడం లో అయన చొరవ ప్రశంస నీయం .వొక సారి పుట్ట పర్తి కి అఫీషియల్ గా వెళ్ళినప్పుడు ఆయన నా వద్దకు వచ్చి విభూది యివ్వడం మంచి పని చేస్తున్నారు బంగారం అనడం వరకే నా పరిచయం .పాపం ఈ వయసులో ఆయన శరీరానికి యెంత కష్టమో ?తిండి నిద్ర కూడా వుండవు . నాలో కలిగిన సందేహాలు ఏంటంటే యిన్నాళ్ళు ఆయన జుట్టు అంత నిగ నిగ లాడుతూ నల్ల గా వుండడం ప్రకృతి సహజమా కాదా ?అన్నది యిప్పుడు బయట పడుతుంది .ఎందుకంటె ఆయనున్న పరిస్తితులలో ఆర్టిఫిషియల్ అలంకరణలు అసాద్యం .యింక రెండోది గడ్డం పెరిగి (నలుపో . తెలుపో ) కొత్త రూపు లో ఆయన కని పిస్తార్రు . కాని ఆ ఫోటోలో బయటకు వచ్చే అవకాశాలు తక్కువే .నా చినప్పుడు సాయిబాబా భక్తుల ఇళ్ళలో ఫోటోల నుంచి విబూది రావడం చూసాను .ఆయన మహిమాన్వితుడే కావచ్చు గాని నరుడు గా పుడితే నారాయణుడే నానా భాధలు పడవలసిందేమో ?నిరంతరం నిపుణులైన డాక్టర్స్ పర్య వేక్షణలో ఆయన వుండడం దైవ అనుగ్రహమే . అలా గే యిన్నాళ్ళు తమను కాపాడిన దైవాన్ని కాపాడే అదృష్టం తమకు కలిగిందని అంకిత భావం తో పని చేసే సిబ్బందే ఆయనకు శ్రీ రామ రక్షా.మహనీయులకి సునాయాస మరణమే అంటారు కాబట్టి ఈ పోరాటం లో అయన విజయం సాధిస్తారని నవంబర్ లో తన పుట్టిన రోజును జరుపు కుంటారని ఆశిద్దాం .