19 మే, 2011

రొటీనే బెస్ట్

రొటీన్ లైఫ్ కి భిన్నం గా నాలుగు రోజులు బయటకి వెళ్ళినప్పుడే రొటీన్ లైఫ్ గొప్ప తనం తెలుస్తుంది .వారం రోజులపాటు ట్రైనింగ్ ప్రోగ్రాం కి నామినేట్ చెయ్యడం తో లక్నో రావలసి వచ్చింది .విశాల మైన ప్రాంగణం లో వూరి చివర తోటల మద్య అందం గా నిర్మితమైన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ .మువ్వన్నెల జెండా రెప రెప లాడుతూ ఆహ్వానం పలుకుతుంది .సివిల్ సర్వీసు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సవుకర్యాలు అద్బుతం గా వుంటాయి .ఎసి రూం ,టీవి ,ఇంటర్నెట్ సవుకర్యం తో కంప్యూటర్ ,సాయంత్రం ఊరులోకి వెళ్ళాలంటే ఎసి బస్సు ,వేళకి మంచి భోజన సదుపాయాలు ,కొత్త అల్లుణ్ణి చూసుకునట్టు గా మేపుతారు . యివ్వన్ని ఎందుకు చెపుతునానంటే యిన్ని సదుపాయాలు వున్నా, ఆఫీసు పని వత్తిడి లేక పోయినా రెండు రోజులు పోగానే యింటి ద్యాస మొదలవుతుంది .పొద్దున్నే వాకింగ్ కి వెళ్తుంటే మామిడి చెట్ల మీద కూర్చుని ప్రశాంతం గా రాగాలు పలుకుతూ కోయిల ,దాని పాటకి అనుగుణం గా పురి విప్పి నాట్యం ఆడే నెమళ్ళు,మంద్రం గా నా సెల్ ఫోన్ లో నే రికార్డు చేసుకున్న నాకిష్టమైన పాటలు వింటూ రెండు రోజులు బానే గడిచి పోయాయి .దేశం మొత్తం మీదనుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారులు ప్రతి వాడు చెవి కి సెల్ ఆనించి ఆదేశాలు యివ్వడమే గాని ఆస్వాదించే వాళ్ళే కనబడలేదు .నాకు రెండు రోజులు ఆస్వాదించే టప్పటికి హైదరాబాద్ లో నా ఇల్లు నావాళ్ళు ,స్నేహితులు , ఆ రణగొణ ధ్వనుల ట్రాఫ్ఫిక్ లో కార్ డ్రైవింగ్ ,యివన్నీ గుర్తు కొచ్చాయి .మూడో రోజు వాకింగ్ కి అంతవరకు అంత అందం గా వినిపించిన కోయిల కంఠం చెవికోసిన మేక అరుపు లా వినిపించింది .నాట్య మయూరి కాస్త దారికి అడ్డం వచ్చే అడ్డ గాడిదలా కనిపించింది .నేనెప్పుడు సెల్ లో మ్యూజిక్ ఆన్ చేసినా వూరు మారినా మనిషి మారునా పాటే రాసాగింది .యింక వొక్క రోజు ఎలాగో గడిపేస్తే ఈ ట్రైనింగ్ అయిపోయి ఆది వారం హైదరాబాద్ చేరుకోవచ్చు .అలసి పోయిన గజ ఈత గాడు కను చూపు మేరలో వొడ్డు కని పిస్తే లేని శక్తి ని పుంజుకుని వడ్డు కి యీదే విధం గా ఈ అరణ్య వాసాన్ని ముగించే కార్య క్రమం లో వున్నా .ఈ ట్రిప్ లో నాకు అర్ధం అయ్యిందేంటంటే మన రొటీన్ జీవితమే అన్ని విధాల బెస్ట్ , ఊరికే విసుకున్టాము గాని నాలుగు రోజులు బయటకు వచినప్పుడే దాని విలువ తెలుస్తుంది .కొత్తొక వింత పాత వొక రోత కొంతకాలమే మళ్ళి మన పాతే మనకు నచ్చుతుంది .నిజ జీవితం లో కూడా కుటుంబ వ్యవస్థ తో విసుగు పుట్టి న చపల చిత్తుడికి ప్రియురాలి కంఠం సెల్ ఫోన్ లో కోయిల పాట లాగే వినిపించినా కొన్ని రోజులు పోగానే గార్ధబ స్వరం లా వినిపిస్తుంది {అప్పటికే రెండు నెలలుగా నెలకి అయిదు వేలు సెల్ బిల్లు రావడం వల్ల }ఆ తర్వతా ఆమె చేసినా బ్రహ్మ నందం స్టైల్లో హలో హలో ఏంటో సిగ్నల్ కట్ అయిపోతోంది అంటూ పెట్టేయ్యడమే జరుగు తుంది .ఏతా వాతా నే చెప్పేదేమంటే రోజు ఆప సోపాలు పడుతూ వుద్యోగం లేదా యింటి పనులు చేసుకునే వాళ్ళు ఛి ఛి వేదవ రొటీన్ జీవితం విసుగొస్తోంది అనుకోకుండా దాన్ని ఆస్వాదిస్తూ చేసుకోవడమే ఉత్తమం .నువ్వు చెప్పే దాక తెలిదు మరి అనుకోకండి . వొంటరి గా నా గదిలో కుర్చునప్పుడు నా మనసులో యిప్పుడు వచ్చిన భావాలకి అక్షర రూపమే గాని ఎవరి అనుభ వాలు వాళ్ళవి .హమయ్య యిప్పుడు గుండెల్లో బెంగ తీరింది .

8 మే, 2011

100%లవ్ 50% marks



మొదటి సగం బావుంది .రెండో సగం సాగింది .ఎప్పుడు మొదటి స్తానం లోనే ఉండాలనుకునే హీరో ,ఊరినుంచి కాలేజీ లో జాయిన్ అయిన హీరో మరదలు మొదట్లో చదువులో వెనక బడినా తర్వాత మొదటి స్తానానికి వచ్చెయ్యడం ,ఆపైన వేరెవరో మొదటి స్తానానికి వస్తే యిద్దరు కుమ్ముక్కై వాణ్ణి ప్రేమ పేరు తో టైం వేస్ట్ చేయించి మళ్ళి మొదటి స్తానం కొట్టేయడం .ఎప్పుడు పార్టీ యివ్వని హీరో ఆ రోజు పార్టీ యిచ్చ్చే సందర్భాన్ని పురస్కరించుకుని మరదలి తో అతని వివాహాన్ని అందరికి తెలియ పరిచడానికి ముందు ,మాట వరసకి మరదలు ''బావ ఆ అజిత్ గాన్నినేను ఎంతో డిస్త్రుబ్ చేస్తే కూడా కేవలం నీకంటే రెండు శాతం తక్కువ తెచ్చుకుని మొదటి స్తానం కోల్పోయాడు లేకుంటే వాడె గ్రేట్ '' అనగానే వుక్రోశానికి పోయి నా గొప్పతనం వల్ల అది రాలేదన్న మాట అంతా నీ గొప్ప తనం వల్లేనా? అజిత్ గాడే గ్రేట్ అన్న మాట మా యింట్లో తిండి తిని వేరే వాణ్ణి పోగుడుతావ గెట్ అవుట్ అంటూ విడి పోతారు .యింక రెండో సగం లో హీరో కంపెనీ నష్టాల బాట లో వుంటే మరదలు తన తెలివి తేటలతో గట్టేక్కించి చివరికి బావని పెళ్లి చేసుకోవడం యిది టూకి గా కధ .
నాగ చైతన్య నటనా పరం గా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు . అయితే ఎంసెట్ లో మొదటి రాంకర్ ప్రైవేటు కాలేజీ లో ఎలా చదువుతాడో సుకుమార్ కే తెలియాలి ?ఐటం సాంగ్ మానియా సుకుమార్ ని వదిలినట్టు లేదు .అయితే ఆ పాటకి జనాల నుంచి స్పందన కూడా బానే వుంది .యింక నాగ చైతన్య తన తాత పాటకి నాన్న పాటకి స్టెప్స్ వెయ్యడం కూడా బానే పండింది .అయితే హీరో చుప్పనాతి వాడి లాగ , అసూయా పరుడు లాగ ప్రొజెక్ట్ చెయ్య బడడం ఎక్కువయ్యింది . ఆఖర్న కూడా యితరుల గొప్పతనం మనస్పూర్తి గా వప్పుకునట్టు చూపించలేదు , ఏదో తాగేసి వప్పుకునట్టు గా చూపించారు . యూత్ ఎలా రిసివ్ చేసుకున్తారన్న దాని మీదే ఈ సినిమా విజయం ఆధార పడి వుంది .