14 జన, 2013

అర్ధంకాని హాలాహలం




నిన్ను మరిచిపోయి కొత్త  రొటీను  మొదలేడదమన్నా,

 వీలు పడక శూ న్యం లా మిగిలి పోతున్నా .

ఆలోచనల అంతరంగాల్లో అలా నిక్షిప్తిం అయిపోయవని యిప్పుడే తెలుస్తోంది .

ఈ కొద్ది సమయం లోనే అలా ఎలా వెళ్ళి  పోయావు హృదయంత రాలలోకి ?

నీకు భౌతికంగా దూరం అవ్వగాలిగా గాని , మానసికం గా అంతలా  పెనవేసుకు పోయావని ఆలస్యం గా

తెలుసుకున్నా.

ముందే మేలుకుని వుంటే నీ తప్పుల్ని కూడా  వొప్పులు గా చూసే లా ఎదిగి వుండే వాణ్ణి .

యింత బాధని మోస్తూ ,నీ స్మృతుల్ని నెమరేసుకుంటూ అలుపెరగని బాటసారిలా ముందుకు సాగావలసిందే నా ? .

 కళ్ళలో పెల్లుబుకుతున్నా కన్నీళ్ళని  కంటి రెప్పలకే పరిమితం చేసి ,మనం నడిచిన బాటలో

యిప్పుడు నేను వొంటరిగా నీ మాటల్ని గుర్తుచేసుకుంటూ యెంత కాలం నడవగలను?

వసంత కోకిల లా నువ్వు వచ్చి ఆనందం పంచి వెళ్లి పొతే ,మిగిలిపోయిన కాలాన్ని వసంతం లా గడపడం నా వల్ల

అవుతుందా?

మనం నడిచిన అదే బాట  , అదే అందమైన ప్రక్రుతి , ఎప్పుడు ఎదురు పడే ఆ అందమైన  మననుషులు

నీ పరోక్షం లో యింత వికృతం గా విసుగ్గా కనిపిస్తున్నారు అదేంటో ?

అసలు హాయ్ గా సాగిపోతున్న నా జీవితం లోకి అనుకోని అతిధి లా ఎవరు  రమ్మానారు ?

నా ప్రేమలో పరిపక్వత చూడ కుండా ఎవరు పోమ్మానారు?

యిలా అర్దాంతరంగా అర్ధం చేసుకోకుండా వెళ్ళిపోతే 

చేతికొచ్చిన పంట కి చీడ పట్టినట్టు కాదా?

పీడా వదిలిందని ప్రస్తుతం అనుకున్నా

 రేపు ప్రేమ తెలుసుకుని నువ్వు వచ్చినా

 నేను నీ నిన్నలలో కలిసి పోనా ?

వొక కన్నీటి బిందు వన్నా  వచ్చి నీ కళ్ళలో నా ప్రేమని తెలిపిందా ?

వదిలి పోయిన బాధకి వచ్చిన ఆనంద బాష్పలా ?

అర్ధం కాని అమృతం నువ్వూ

అర్ధం అయిన హాలాహలం నేను .

13 జన, 2013

ఆమెని అంతగా ప్రేమించానా ?



  1. మనసు లేని దేవుడు మనిషికేందుకో  మనసిచ్చాడు

    మనసు మనసును వంచన చేస్తే ,కనులకేందుకో నీరిచ్చాడు .
    రైన్బో ఎఫ్ ఏం లో వస్తున్నా ఆ పాట వింటూ కార్ డ్రైవ్ చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళు పెల్లుబికి దారి  మసక బారింది .కళ్ళముందు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన మెదులుతోంది .ఆ సంఘటన పరిణామం యింత తీవ్రం గా ఉంటుందని అప్పుడు తెలిలేదు.దాని ఫలితమే నాకి గుండె పిండేసే బాధ .మా యింటికి మీ రెప్పుడు రాకండి . తనకి ఫోన్ చెయ్యకండి , ఏదన్నా పని వుంటే నేనే మీతో మాట్లాడతాను అంటూ ఆమె భర్త అన్న  మాటలు నా చెవిలో యింకా ప్రతిధ్వని స్తునే వున్నాయి .యిదేదో రెండు రోజుల్లో సమసి పోయే సమస్య కోపాలు పోయాక అన్ని సద్దుకున్టాయనుకున్నా  గాని మరింత ముదిరి వుభయులు నాతొ సంభందాన్ని శాశ్వతం గా తెగతెంపులు చేసుకుంటారని కలలో కుడా అనుకోలేదు . ముఖ్యం గా ఆమె నా స్నేహితుడికి కాల్ చేసి మరి వార్నింగ్ లాగ మీ వాడికి చెప్పండి మా ఇంటి కి వచ్చినా  , ఫోన్ చేసినా ,యితరత్రా ఏమి రాసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించ మన్నారు అని చెప్పడం/ నేను యిన్నాలు వాళ్ళ కుటుంబం లో వొకన్ని అన్న నమ్మకాన్ని సడలించింది
    .    వెంటనే వాళ్ళ సెల్ నంబర్లు డిలీట్ చేసేసాను .నంబర్లు అయితే తియ్య గలిగాను గాని యిన్నల్లా అనుభందాన్ని మాత్రం తియ్యలేక పోతున్నాను .ప్రతి రోజు దేశం లో ఎక్కడున్నా కనీసం రోజుకు మూడు సార్లన్న తనతో మాట్లాడకుండా ఈ రెండేళ్ళు ఎప్పుడు లేదు .అలాంటిది ఈ రోజు తో అప్పుడే డబ్బై రెండు గంటలు గడిచాయి తనని చూడక, తనతో మాట్లాడక .వాళ్ళ యింటిముందు నుంచి వాకింగ్ ముగించుకుని వస్తుంటే కాళ్ళు  ముందుకు సాగడం లేదు . గుండె పిండేసి నట్టుగా వుంది . వొక్కసారి   తను బాల్కని లోంచి చూసి చిరునవ్వుతో ఆహ్వానం పలక క పోతుందా అని చిన్ని ఆశ . కాని వుహ వేరు వాస్తవం వేరు .ఆర  వేసిన బట్టలు జాలిగా ఊగుతూ టాటా  చెప్పడమే గాని కుటుంబ సబ్యులజాడ మాత్రం కాన రాదు .యిప్పుడు తనని కోల్పోయన్నన్న బాధ యింత తీవ్రం గా ఉంటుందని తెలిస్తే ఆ రోజు నేను అలాగ ఆమె అతిధితో ఎగ్జిబిషన్క్కి  నేను వేలోద్దని అన్నా వెళ్లిందని కలిగిన బాధని దిగమింగుకునే వాణ్ణి అంత  యాగి చెయ్యకుండా.కోల్పోయి నప్పుడే దేని విలువన్నా తెలిసేది .
    .ఆ రోజు మధ్యాన్నం తను పిల్లలే వున్నా రనుకుని వాళ్ళింటికి వెళ్లి పరుష పద జాలం తో ఆమెని నిందిస్తున్నా అలా వెళ్ళినందుకు .అనుకోకుండా లోపల బెడ్ రూమ్ లో పడుకున్న భర్త రక్త సంభందికురాలు వీసా వీసా వచ్చి యిక్కడ నీకేం పని ?అని అడిగేసరికి గతిలేని పరిస్తితులలో తప్పించుకుందుకు నేను వాళ్ళకి అప్పుగా యిచ్చిన మొత్తం యిస్తానంటే వచ్చానని చెప్పడం మరింత పొరపాటు అయ్యింది .అరగంట లో మీ డబ్బు మీ యింటికి వచ్చి  యిచ్చేస్తాం , మీరు దయ చెయ్యండి అన్న ఆమె అన్నంత పని చేసింది .భర్త తో సహా వచ్చి యిచ్చేసి భంధాన్ని తెమ్పెసుకునివెళ్లి పోయారు .ఆమె మీద వున్న  అవాజ్యమైన ప్రేమవల్ల  ఆమె భవిష్యత్తులో ఏ ఊబి లోను పడకూడదనే  సదుద్దేశం తోనే ఆమె విచ్చలవిడి తనాన్ని కట్టడి చేసే ప్రయత్నమే తప్ప యిందులో నా స్వార్ధం ఏమి లేదు .నాది కేవలం వ్యామోహం అయ్యుంటే ఈ బాద్యత నేను నెత్తి మీద వేసుకుని ఈ రోజు వాళ్ళకి ఎందుకు దూరం అయిపోతాను ?అపుడున్న కోపం లో పోనీ ఎహే ఏబాదర  బంది  లేకుండా యిక నుంచి హాయ్ గా ఉండొచ్చు అనుకున్నా గాని ఆమె మీద ప్రేమ నివురు గప్పిన నిప్పు లా గుండెల్లో నిక్షిప్తమై పోయి వుందని యిప్పుడే తెలుస్తోంది .పొద్దున్నే  ఆమె మాటల ఇంధనాన్ని మనసులో నింపుకుని సాయంత్రానికి మళ్ళా వెళ్లి చిరునవ్వుల సోయగాన్ని గుండెల్లో పంపుకుని ఆనందం గా మర్నాటికిస్వాగతం  పలికే నేను నేడు మనసు ఎడారిలా మారి స్వాతి చినుకు వర్షపు చుక్క కోసం ఎదురు చూసే ముత్యపు చిప్పలా ఎదురు చూస్తున్నా .ప్రతీ  శనివారం  క్రమం తప్పకుండా ఆమె భర్త తో సహా శివాలయానికి వెళ్ళితే నాస్తికుడైన భర్త బయటే వుంటే యిద్దరం లోపల శిలా  ఫలకాలపై ముద్రించిన  అన్నపుర్నాస్టకం , లింగాష్టకం చదువుకుని దణ్ణం పెట్టుకుని రావడం రివాజు .అలాంటిది ఈ శనివారం వొకన్ని వెళ్లి చదువుతుంటే గొంతు దుక్కం తో జీర బోయింది .కళ్ళలో నీళ్ళు  వచ్చి అక్షరాలూ మసక బారి కనిపిస్తున్నాయి . యింతలో కరెంటు  పోయింది . ఆ సంధ్య వెలుతురూ లోనే చదువుతూ ఈ అష్టకం అయ్యే లోపు కరెంటు వస్తే ఆ భగవంతుడు   మా స్నేహాన్ని కోన సాగించమని చెబుతున్నాడని లేక పొతే అది నా మంచికే వదిలెయ్య మంటున్నాడని  భావిస్తూ చదువుతున్నా . యింక ఆఖరి నాలుగు ఫంక్తులు ఉండంగా కరెంటు వచ్చింది ..నా ఆనందానికి అవధులు లేవు . పక్కన తను కూడా  నిలబడి చదువుతున అనుభూతి కలిగింది .అప్పుడే మనసులో అనుకున్నా అయన దయవల్ల మళ్ళి  ఎప్పటిలాగే ఈ స్నేహం కొనసాగితే మరింత అమలినం గా తీర్చి దిద్దాలని. కానీ ఆ అవకాశాలు అంత  గా కని  పించటం లేదు . వాళ్ళసలు వూళ్ళో  వున్నారో పండగకి వూరు వెళ్లి పోయారో కుడా తెలిదు . బహుశా తను వాళ్ళ వాళ్లతో కలిసి మనసార తిట్టుకుంటూ పీడా విరగాడయ్యిందని  సంతోషిస్తూ ఉండొచ్చు .నా అంత  ఫీలింగ్ తనకి వుండి ఉండక పోవచ్చు . వుంటే ఈ పాటికి కనీసం వొక మిస్సేడ్ కాల్ అన్న చేసి వుండేది .తన ప్రపంచం లో నేనూ వొకన్ని అంతే  గాని నేనే తన ప్రపంచం కాదు కదా .యిప్పుడు ఆ స్తానం కుడా లేదు .చాలా అవలీలగా మర్చిపోవచ్చు అనుకునా గాని దూరమైనా కొలది పెరుగును అనురాగం అనట్టుగా మరింతగా తన మీద అభిమానం పెరిగి పోయి రోజులో వొక్క క్షనమన్నా నా గురించి ఆలోచించకుండా ఉంటుందా ?నేను యిలా రోజంతా ఆలోచిస్తుంటే ?అనిపిస్తూ వుంటుంది .మరి కొన్నాళ్ళకి తను లేని తనం బహుసా అలవాటు కావచ్చు  గాని కలుసుకున్న అప్పటి  కంటే యిప్పుడే తను నా గుండెల్లో మరింత తిష్ట వేసింది . తను నా మనసులోనే వుంది , యిదివరకులాగే ఏంటి బంగారం కొంచెంనన్ను పక్కన బెట్టి పని చూసుకో అని చెబుతూనే వుంటుంది .అసలు రెండేళ్ళ క్రితమే ఆయన నన్ను నిలవరించి వుంటే ఈ నాడు నాకి బాధ వుండేది కాదేమో ?కాని జీవితం లో కొన్ని మంచి జ్ఞాపకాలని కోల్పోయి మాత్రం వుండే వాణ్ణి .అనుక్షణం తన అల్లరి చేష్టలే  గుర్తుకు వస్తునాయి . భావాల్ని రాయడానికి విల్లెదంటే ఆగుతాయా ? సముద్రానికి ఆనకట్ట వెయ్యగాలమా?గంగ వెల్లువ కమండలంలోయిముడుతుందా ?ఇప్పటికే జరగ  వలసిన నష్టం ఎలాగు జరిగి పోయింది .పది కాలాల పటు పదిలం గా వుండే ఈ భావా వేశాన్ని ఆపేసి భవిష్యత్తులో నా ప్రేమ వుద్రుతిని  తలచుకునే ఈ అవకాశాన్ని కోల్పోదల్చుకోలేదు .
      ఈ జగమెన్త పగ బూని ఎదిరించినా
    విధి యెంత విషమించి వేధించిన
    నీవే నేనై వుందాములే
    నీ మనసు నా మనసు ఏకమై
    నీ నీడ అనురాగ లొకమై
     మీరింత వరకు విన్నపాట  ఇదాలోకం చిత్రం లోనిది అన్న రేడియో ప్రకటన తో ఈ లోకం లోకి వచ్చా అప్పుడే ఇల్లు వచ్చేసింది .దిల్లు  మూసేసింది .
    (యిది కేవలం వొక భగ్న ప్రేమికుడి హృదయ అవిష్కరనే , యిందులో పాత్రలు  వుహజనితాలు  , భావాలూ పెల్లుబికిన సాక్ష్యాలు ).    

12 జన, 2013

వికసించని చెట్టు



వుజ్జోగం ,సజ్జోగం చెయ్యని చిన్నోడు , పెద్దోడు .ప్రతివాడు ఎమ్చేస్తున్నావ్ ?అనగానే రేలంగి నుంచి హైదరాబాద్ ట్రైన్ ఎక్కి నాలుగు రోజులు ఉద్యోగ ప్రయత్నం చేసినట్టుగా చేసి మళ్ళి వూరు వచ్చేసి  బేవార్స్ గా తిరగడం , తొట్టిగాంగ్ తో గొడవలు పడడం . హీరో అందానికి మాత్రమె విలువనిచ్చి మిగత విషయాలు పక్కన బెట్టి ప్రేమించే హీరోయిన్ .రోడ్ మీద ఎదురు పడిన ప్రతివాడు మనకి పరిచయం వున్నా , లేక పోయినా  ఎదురు ప డినప్పుడు చిరునవ్వు తో వాళ్ళకేసి చూస్తూ ప్రేమ తత్వాన్ని పంచాలే  తప్ప ఏది సీరియస్ గా తీసుకోకుడదని నమ్మే తండ్రి .జీవితం లో సరైన ప్రణాళిక లేకుండా గాలివాటం లో బతికే వాళ్ళని మనుషుల లాగ చూడ కూడదని  నమ్మే హీరోయిన్ తండ్రి .వీటి మద్య జరిగే సంఘర్షణ . ఆఖరికి లూజర్స్ కుడా విజేతలే అన్న ముగింపు . టూ కీ గా యిది కదా . మూడు గంటలు వోపికక గా కూర్చోవాలి .మద్యలో అన్నదమ్ముల సెంటిమెంట్ సీనులు .అగ్రనాయకుల తో సినిమా అంటే గొప్ప గా ఊహించుకుని సినిమా కి వస్తే నిరాశ తప్పదు . కనీసం వోక్కరిలో కుడా హీరో కి
ఉండవలసిన ధీరో ధాత్తమైన లక్షణాలు వుండవు .ఎంతసేపు యిదేంటి తోక్కలగా ఈరోజు యింత మంది అమ్మాయిలు పడిపోతున్నారు పలకరించడమే ఆలస్యం అనుకునే అవలక్షణం తప్ప .
మహేష్ పాత్ర నిడివి ఎక్కువ .నటన పరం గా కొట్టిన పిండి పాత్ర కాబట్టి అవలీలగా చేసేసాడు .సినిమా కొద్దిగా అన్న నడిస్తే తన వల్లే . వెంకటేష్ పాత్రలో ఎమొశానాలిటి ఎక్కువ నిడివి తక్కువ .వయసు కని పిస్తోంది మొఖం లో .మొత్తం గా ఈ సినిమా సీతమ్మ వాకిటికి మాత్రమె పరిమితమై పోయే వికసించని సిరిమల్లె చెట్టు .
ఈ సినిమా మొదటి రోజు మల్టీప్లెక్స్ లో చూడకపోతే లూజర్స్ కింద లెక్క అని పిల్లలు భావిస్తే ఇజ్జాత్ కా సవాల్ అని ఇన్ఫ్లుయెన్స్ వుపయోగించి రాత్రి పదకొండు గంటల షో కి ప్రసాద్స్ లో టికెట్స్ సంపాయించి రెండుగంటల దాక నిద్ర చెడ గోట్టుకు ని చూసిన సినిమా యిది . కాబట్టి పండగలలో టికెట్స్ దొరక లేదని దిగులు పడ వలసిన అవసరం యెంత మాత్రం లేదు .