13 ఏప్రి, 2013

ఆ, హా, ల మద్య హాలాహలం అయ్యే ప్రేమ




అతనో భావకుడు .తనదైన ప్రపంచం లో విహరిస్తూ తన భావాలకి తగ్గ అమ్మాయి ఎప్పటికైనా తారస పడక పోతుందా అని చకోర పక్షిలా ఎదురు చూస్తూ వుండే వాడు .. అంటే తమ యిరువురి మద్య ఏ అరమరికలు లేకుండా అన్ని పంచుకుని ,అతని కోసమేశ్వాసించి ,అతని ఆలోచనలతోనే నిద్ర లేచి ,అతని తలపులతో నిద్రించే  ఆ అమ్మాయి కోసం అతని నిరీక్షణ ఫలించిందా అనట్టు గా జీవితం లోకి వచ్చి కొన్నాళ్లపాటు ఆ బ్రాంతిని కలగ చేసి , ఆ మత్తులోఅతను  వుండగా అన్ని విధాలా లబ్ది పొంది ,మత్తు వదిలే సమయానికి అతని చిత్తు చేసి వొక తన్ను తన్ని వెళ్లి పోతున్నారు . వాళ్ళు నిష్క్రమించిన దగ్గర నుంచి అతను కోలుకుని మళ్ళి మామూలు మనిషి అవ్వడానికి కొన్నేళ్ళు పట్టేది . యిలా ప్రతి సారి వొడి పోతూ కొత్త ఉదయం వైపు సాగి పోవడం అతనికి అలవాటే .కానీ ఈ సారే  అతను  యింకా మామూలు మనిషి కాలేక పోతున్నాడు . దానికి కారణం అమెరికా నుంచి వచ్చి ఆర్నెల్ల లోనే అతన్ని పూర్తీ గా తన వశం  చేసుకుని , వొక ఆటఆడుకుని యింకవెళ్లి పోయే ముందు వొక్క తన్ను తన్నిచక్కా పోయిన ఆమె . అలా అని ఆమె ఏమి జగదేక సుందరి కాదు . వొక సారి చూసి నాలుగు సార్లు కళ్ళుతిప్పు కోవచ్చు . చాట్ లో భావాలూ కలవడం తో ఇండియా వచ్చినప్పుడు అతను  ఆమె ని కలిసాడు . ఆమె కళ్ళలో ఆరాధన ,  చుట్టూ  పక్కల పరిసరాలని కుడా మర్చి పోయి అతని కళ్ళలోకి కి చూస్తూ గంటలు గంటలు అతని తో సంభాసించేది . ఏమి ఆశించకుండా .అతను కూడా ఆమె ఆరాధనకి మంత్రం ముగ్డుడయాడు . తన అన్వేషణకి ఆఖరి మజిలి తనే అని గట్టి గా నమ్మాడు . తమ మద్య అరమరికలు లేని సంభాషణలు చాలానే జరిగాయి వాళ్ళ శృంగార  విషయాలతో సహా . మనసులో ఏ వికారము లేనప్పుడు అన్ని సంభాషణలు వొక లాగే వుంటాయి . అయితే అన్ని రోజులు వొక లాగే వుండవు . వొక రోజు ఏకాంతం లో ఆమె యింట్లో రాత్రి పొద్దు పోయే దాక వొక విషయం మీద తర్కిన్చుకున్తుండగా ఆమె కూర్చున్న భంగిమ అతనిలో వికారపు ఆలోచనల్ని లేపింది .. ఆ విషయం యిరువురికి తెలుస్తోంది .అతను పక్కకి జరగడం యిష్టం లేక చర్చని మధ్యలోనే ఆపేసి యింక నేను వెళతాను బాగా పొద్దు పోయింది అని లేచాడు . ఆమె అతని చెయ్యి పట్టుకుని ఆపింది వద్దు ఈ రోజు యిక్కడే భోజనం చేసి వెళ్ళండి ప్లీజ్ . ఆమె అభ్యర్ధన కంటే ఆమె చేతిలోని వెచ్చటి స్పర్శ కి ఆగి పోయాడు . అదే అతను  చేసిన తప్పు అని ఆ క్షణం అతనికి తెలిదు . హార్దిక మైన ఈ భంధం లో మలినమైన భావాలకి తావు లేదని తను నమ్మాడు . చూసే కోణం మార్చుకుంటే చాలను కున్నాడు .. అందుకే సరే అని వప్పుకున్నాడు . తను అప్పటికప్పుడు  వంట మొదలెట్టింది . వంటింట్లో అతను  కూడా సాయం చేస్తునాడు . వంటిల్లు చిన్నది కావడం తో యిద్దరు నిలబడి పని చేస్తున్నప్పుడు అనుకోకుండా అతని మేడలో గోలుసుకి ఆమె జడ తగిలి కొక్కెం పట్టుకుంది . అది తీయడానికి చాలా టైం పట్టింది . ఆ టైం లో యిరువురి  సాన్నిహిత్యం , ఏకాంతం  శారీరక అవసరాన్ని ప్రేరేపించాయి . పది నిమిషాలు ప్రపంచాన్ని మర్చి పోయి కుక్కర్  విజిల్  తో యిలోకం లోకి వచ్చారు .
 అప్పటికి కధ కంచికి చేర లేదు కాని కంచె దాటి పోయింది . ముందు అతనిలో విజ్ఞత మేలుకుంది . సర్రున తలుపు తీసుకుని బయటకు వెళ్ళ బోయాడు . ఆమె అతన్ని వారిస్తూ తలుపు వేసేసింది . నోరు మూసేసింది .(చేత్తో కాదు ). అతను  మాత్రం శిల  లాగ స్పందించకుండా అలాగే నిలబడ్డాడు . ఆమె లో అహం దెబ్బ తింది  . వెంటనే అతన్ని వదిలేసి ఏడుపు లంకించుకుంది . మీరు కుడా యిలా నీచం గా సాధారణ మగాడి లాగ  ప్రవర్తిస్తారు అనుకోలేదు . మీ మీద నమ్మకం తో ఇండియా లో చుట్టాల్ని చూసి వస్తానని మా వారి తో సహా అందరికి చెప్పి ఇక్కడికి వస్తే , మీరు చెయ్య బోయిన పని ఏంటి? యిప్పుడు ఏ మొహం పెట్టుకుని నేను మా వారి దగ్గరకు వెళ్ళను ? మా తల్లి దండ్రులకి , చుట్టాలకి బట్టలు కొనడానికి , నా రిటర్న్ ఫ్లైట్ కి డబ్బులు పంపమని ఈ చేత్తో మెయిల్ ఎలా కొట్ట గలను ?అమలిన ప్రేమికుడి గా మిమ్మల్ని నమ్మి వస్తే కిళ్ళి నమిలినట్టు నన్ను నమిలేసి వుసేస్టారా?

అతని కాళ్ళ క్రింద భూమి కంపించినత్తయింది . యిప్పుడు ఏమి జరిగి పోయిందని ఆమె అంత పెద్ద పెద్ద మాటలు అంటోంది ? అమెరికాలో శృంగారం అంటే యింతేనా?కొద్దిలో విజ్ఞత మేలుకుంది కాబట్టి ప్రమాదం తప్పి పోయిందని తను అనుకుంటుంటే మలినం అయి పోయాయని తను అంటున్దేంటి? ముందు చూస్తుంటే తనకి యేవో ఆర్ధిక పరమైన సమస్యలు వునట్టు వున్నాయి . అవి తీరిస్తే ఆమె కుదుట పడొచ్చు . సారీ అనుకోకుండా కొంత హద్దు మీరాను ముందు మీ ఆయనకి మెయిల్ కొట్ట  కుండా నీకు కావలిసిన వన్ని  నేను చూసుకుంటా యిది గో నా ఎటిఎం కార్డు దాని పాస్ వర్డ్.  నువ్వు వెళ్ళే దాక నీతోనే ఉంచుకో . మనం ఎప్పటి లాగే మాములు గా మాట్లాడుకుంటూ ఉందాం సరేనా .
 ఆమె అయిష్టం గానే అతని కార్డు తీసుకుంది .అతను మౌనం గా భోజనం ముగించి సెలవు తీసుకున్నాడు . ఆశ్చర్యం  రాత్రుళ్ళు మూడు దాక సెల్ లో సొల్లు కొట్టే ఆమె ఆ రోజు ఎందుకో మిస్సెద్  కాల్ యివ్వలేదు . అతను కుడా చేసే సాహసం చెయ్యలేదు . మర్నాటి నుంచి సెల్ లో మెస్సేజెస్ మాత్రం వస్తున్నాయి బ్యాంకు వాళ్ళనుంచి ఫలానా షాప్ లో యింత డెబిట్ అయ్యిన్దంటు .అత ను చేస్తుంటే ముక్త సరిగా అయిష్టం గా మాట్లాడుతోంది . ఏవి నిరుడు కురిసిన హిమ సమూహాలు ?ఎంటింది హార్దిక పరమైన భంధం కాస్త ఆర్దిక పరం గా మారి పొయిన్దె. ఆమె అమెరికా వెళ్లి పోయే రోజు రానే వచ్చింది . ఆ  రోజు అనుకోకుండా(ఆమె ప్రేరణ తో ) జరిగిన ఆ చిన్న విషయం తమ మద్య భంధాన్ని యింత విషమం చేస్తుందని అనుకోలేదు . మళ్ళి  వొక్క సారి కుడా తన మొహం అతనికి చూపించలేదు . ప్రతి రోజు క్రమం తప్పకుండా డెబిట్ సందేశాలు తప్ప తన నుంచి చిన్న సందేశం కూడా రాలేదు . ఎయిర్పోర్ట్ కి మాత్రం రమ్మంది బహుసా కార్డు యివ్వదానికేమో . కాని అతని  చిన్న గుండె గాల్లోకి యెగిరి పోతున్న  అతని ప్రాణాన్ని చూస్తూ ఆమె జ్ఞాపకాల్ని మనసులో పదిల పరుచుకుంటూ వెను  దిరిగె అంత గట్టిది కాదని , కళ్ళలో  సుడులు తిరిగే ఆ సునామిని ఆపుకోవడం అతని తరం కాదని అర్ధం అయ్యి వీడ్కోలుకి వెళ్ళలేదు .
 అమెరికా వెళ్లి పోయాక ఆమె ధోరణి యింకా మారి పోయింది . ఫోన్ చేస్తే ఏంటి చెప్పు అని మరో నిమిశానికే యింక యింకేంటి అంటూ తమ మద్య మాటలు కరువై మనసు ఎడారి అయి వొక అక్షరపు వాన చినుకు కుడా పడనప్పుడు  , మరిచికాలని వీచికల లా భావించి అతను మళ్ళి  తప్పు చేసాడని అర్ధం చేసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు .ఏ ప్రేమికుల మద్య మాటల్లో యింకేంటి అని వచ్చిందో అప్పుడే అవతలి వాళ్ళ ద్రుష్టి పక్కకి  పోయిందని సంకేతం వచ్చి నట్టే .  యింకో సత్యం కుడా భోధ పడింది ముందుగా ఎవరు అవతలి వారి ముడ్డి మీద తన్ని పోరా / పోవే అన గలుగు తారో వాళ్ళ ఇగో సంతృప్తి చెంది హాయ్ గా ఏమి జరగనట్టే  వాళ్ళ దైనందిన జీవితం గడి పెస్తారు . ఎవరైతే తన్నించు కుంటారో వాళ్ళు మాత్రంస శేష జీవితం అంతా మోస పోయిన భావం తో మదన పడి ఆరోగ్య పరం గా ఆర్ధికం గా కూడా నష్ట పోయి కుమిలి కుమిలి జీవిస్తూ వుంటారు . అవతలి వాళ్ళు మాత్రం హార్దిక పరమైన భంధాన్ని ఆర్దిక పరం గా మార్చుకున్నందుకు ఆనంద పడుతూ మరో కొత్త బకర  కోసం అన్వేషణ మొదలెడతారు . అందుకే  ఆర్దిక , హార్దిక సంభంధాల మద్య ప్రేమ హాలాహలం అవుతోంది .