18 జూన్, 2013

అవసరాల అనుభందాలు




ఆఫీసు లో బిజి గా పని చేసుకుంటున్నాను . యింతలో సెల్ మోగింది .  అపరిచిత  నంబర్ కావడం తో ఎత్త లెదు. మళ్ళి అయిదు నిమిషాల తర్వాత మోగింది . స్టాఫ్ తో మీటింగ్ . శబ్దాన్ని ఆపడానికి నిశబ్దాన్ని చేదించాను . హలో అన్నానో లేదో అవతల వొక కోమలి'' సార్  నా గొంతు వినగానే గుర్తు పట్టేఅంత సాన్నిహిత్యం ప్రస్తుతానికి మన మద్య లెదు. (అంటే భవిష్యత్తులో తప్పకుండా వచ్చేస్తుందని యీమె నమ్మకం కాబోలు ). కాని నన్ను చుస్తే మాత్రం తప్పకుండా గుర్తు పదతారు. మనిద్దరం చాలా సార్లు తారస పడ్డాం . కాని మాట కలిపే అవకాసం మాత్రం రాలేదు . మీరు అనుమతిస్తే  పది నిమిషాల్లో మీ ముందు వుంటాను ''
      దేనికి?
బహుసా ఆ జవాబు నానుంచి ఆశించక పోవడం తో ఆమె ఖంగు తిని వొక నిమిషం మౌనం వహించిన్ది. అంత కంటే ఉత్సాహం చూపించే అవకాశమే నాకు లేకపోయే . ఎదురు గా నా హావ భావ విన్యాసాలతో మాట్లాడుతున్నది ఆడ మగ చెప్పగలిగే లక్ష్మి లాంటి స్టాఫ్ గుచ్చి గుచ్చి చూస్తుంటే అంత కంటే ఆఫిసిఅల్ గా ఏం మాట్లాడతం ?

 దేనికో ఫోన్ లో చెప్పలెను. మీ విలువైన పది నిమిషాలు నాకిస్తే  మిమ్మల్ని నిరుత్సాహ పరచనని మాత్రం చెప్పా గలను . అది తన మీద తనకి వున్నా నమ్మకమో ?లేకా నా బలహీనత మీదా?(ఆడ వాళ్ళని నిరుత్సాహ పరచ లేక పోవడం)కాదన లేక పోవడం అంటే వేరే అర్ధం లో వస్తుందని అల్లా వాడడం జరిగిందని మనవి.
 
స్టాఫ్ ముందు అంతకంటే పొడిగించడం యిష్టం లేక వొకే అన్నా. మనసులో వుద్విగ్నాన్ని అనుచుకుంటూ గంట సాగిద్దమనుకున్న రివ్యూ మీటింగ్ పది నిమిషాల్లో ముగించి స్టాఫ్ ని నా రూం లోంచి పంపేసి ఎదురు చూస్తూ కుర్చున్నా.  చూపుల కన్నా ఎదురుచూపులే తియన  అనుకుంటూ వుండగా అరగంట గడిచి పోయింది . అప్పుడు అనుమానం వచ్చింది ఎవరో కావాలని నన్ను ఆట పట్టించి గంట సాగ వలసిన మీటింగ్ ని  పది నిమిషాల్లో మమ  అని పించారని .
 యింతలోస్టెనో లోపలి వచ్చి సార్  మీకోసం ఎవరో అమ్మాయి వచ్చి వెయిట్ చేస్తోంది పంపమంటారా అంటూ నా మొఖం లో భావాల కోసం తొంగి చూస్తున్నాడు . నేను అదేదో పెద్ద విషయం కాదన్నట్టు గా మొఖం పెట్టి మినిట్స్
అఫ్ ది మీటింగ్ కొట్టి పట్టుకు రండి , ఆ అబ్బాయినో అమ్మాయినో లోపలి పంపండి అని ఫైల్స్ చూడడం లో ద్రుష్టి పెట్టినట్టు నటించా .

మెల్లగా డోర్ తీసుకుని మే అయి కమిన్ సార్ ?అంటూ వొక అందమైన ముప్పైలోపు వయసులో వుండే వొక ఆమె ప్రవెసించిన్ది. నేను ఫైల్ లోంచి తల ఎత్తకుండానే ప్లీజ్ కమిన్ . అంటూ చైర్ చూపించి నా పనిలో నే వునట్టు గా వొక రెండు నిమిషాలు అయ్యాక చెప్పండి  అని ఆమె ముఖం లోకి చూసి ఆశ్చర్య  పొయా.

అరె మీరా ?మిమ్మల్ని చాలా సార్లు సుధా వాళ్ళు వుండే ఫ్లాట్స్ లో చుసా. నిందాకా  ఫోన్ లో గొంతు విన్నా కుడా ఎప్పుడు మాట్లాడుకోక పోవడం తో మీరనుకోలేదు .

ఏం ఫోనండి?ఆమె గొంతులోంచి బాణం లా దూసుకు వచ్చిన ప్రస్నార్దాకం తో నా మొహం యెర్ర  బడింది . నా తొందర పాటు తనం , ఆ క్షణం లో ఆమె కోసం ఎదురు చూస్తూ ఎదురు గా వచ్చిన ఆమె ని వెనక ముందు చూడకుండా , ఛి ఛి తొందర పాటు చర్య . ఏం మాట్లాడాలో తేలిక మౌనం వహించా.

ఆమె పక పక నవ్వుతూ నా కోసం చాలా ఆత్రం గా ఎదురు చూస్తునట్టు ఉన్నారే ?నన్ను పరిచయం చేసుకోకుండానే
నేనని నిర్ధరించేసుకున్నారే . సరదాగా ఏం ఫోనండి అని మిమ్మల్ని కంగారు పెట్ట క్షమించన్ది. నా పేరు దీపిక. నేను మీ సుధా వాళ్ళ ఫ్లాట్ కిందే  వుంటాను . ఎన్నో సార్లు మీరు ఎదురు పడినా మాట్లాడే అవకాసం రాలేదు . సుధా గార్ని మీ సెల్ నంబర్ అడిగినా లెదన్నారు. మనసుంటే మార్గం అదే ఉంటుందని ప్రయత్నిస్తే దొరికిన్ది. ఇన్నాళ్ళకి
నా ప్రయత్నం ఫలించి మీ పరిచయ భాగ్యం కలిగింది అంటూ ఆప కుండా మాట్లాడేస్తోంది .

అయ్యోఅంత   పెద్ద మాటలు ఎందుకు లెన్ది. ఎవరు ఎప్పుడు పరిచయం అవ్వాలో అప్పుడే అవుతారు , ఏమేమి ఇవ్వాలో అప్పుడే యిస్తారు . అనేసి కొంచెం అతి అయ్యిందేమో అని ఆమె మోహంలో ఎటువంటి మొహా వేశాలు  లేక పోవడం తో హమయ్య అనుకున్నా.
 యింతలో మా స్తేనో పానకం లో పుడక లా వచ్చి సార్  డ్రాఫ్ట్ కరెక్ట్ చేస్తే ఫెయిర్ చేసేస్తా అంటూ నిలబడ్డాడు . ఉత్తప్పుడు పొద్దున్న మీటింగ్ అయితే సాయంత్రానికి కుడా మినిట్స్ రెడీ చెయ్యడు . ఆమెని కోరికేసేలా చూస్తూ బకెట్స్  కార్చే స్తున్నాడు . (మరి మీరు మగ్గులు కారిస్తే మేము బకెట్స్ కార్చొదా సార్  అన్నాడా అని పించింది)

మీరు వెంటనే రెండు సాఫ్ట్ డ్రింక్స్ పంపించండి .  పది నిమిషాలు విసిటోర్స్  ఎవర్ని పంపకండి మీతో సహా .

ఎస్ సార్ . అంటూ వెళ్లి పోయాడు . యిప్పుడు చెప్పండి నేను మీకు ఏ విధం గా ఉప యోగ పడ గలను ?(ఇంగ్లీష్ లో అనడం తో మీనింగ్ సబ్యత గానే వచ్చింది )

సార్ యిప్పుడు మన మద్య జరిగే సంభాషణ మన యిద్దరి మద్య మాత్రమె ఉంచాలి . ముక్యం గా మీ ఫామిలీ ఫ్రెండ్స్ సుధా వాళ్ళకి అస్సలు తెలినివొద్దు . కొన్నిభంధాలు  యెంత రహస్యం గా వుంచుకుంటే అంత రసవత్తరం గా వుంటాయి . ఏమంటారు?అంటూ నా కళ్ళలోకి చూసింది .

ఇప్పటికే వున్నా భంధాలతో తల బొప్పి గట్టి నే వుంటే మళ్ళి  యిదో కొత్త భన్దమా తల్లి అని మనసులో అనుకుంటూ చెప్పండి . అన్న ఏ భావము మొఖం లో కన  బడ నీయ కుండా .
 ఆమె కుర్చీ లోంచి ముందుకు జరిగి టేబుల్  మీద మోచేతులు పెట్టి నా దగ్గర గా మొహం పెట్టి మా వారు అంటూ నోరు విప్పిందో లేదో మా ప్యూను  రెండు గ్లాసుల్లో కోక్ తీసుకు వచ్చి అక్కడే పెట్టాడు .

మీ వారికి ఎప్పటి నుంచి వుంది ఈ జబ్బు ?కోక్ తీసుకోండి అంటూ చెయ్యి చూపించా గ్లాస్ వైపు .

ఆమె నా మొఖం లోకి ఆశ్చర్యం గా చూస్తోంది . యింతలో మా ప్యూను వెళ్లి పోయాడు . అప్పుడు అన్నా మా వాళ్ళకి అనుమానం రాకుండా అలా జబ్బుల గురించి మాట్లాడుతా  లేక పొతే వాళ్ళు మనిద్దరి మద్య ఏదో వుందని అనుకుంటారు .

అమ్మో మీరు చాల జినియుస్ అండి . రాబోయే భంధాల గురించి కుడా ముందే చెప్పేస్తున్నారు ?

ఏం భన్ధమన్ది?
 అదే మనిద్దరి మద్యా ఏదో తెలీని భందం గురించి . అంటూ ఆమె క్రీగంట చూస్తూ ముందుకి వెళ్ళ  మంటారా? అంటూ ఆర్యోక్తి గా ఆగి పోయింది .
 నే వద్దంటే మాత్రం మీరు ఆగుతారా కానీండి  ముందుకు వెళ్లి ఎందుకు వచ్చారో చెప్పండి అని కట్ చేశా . (యింకా వుంది)యింకేం వుంది  అని మీరు పెదవి విరిస్తే  ఆ తప్పు నాది కాదు. కొంచెం వోపిక పట్టి ఆగితే ఈ భంధం ఎక్కడికి దారి తీసిందో తెలుస్తుంది .