20 అక్టో, 2013

అతడు , ఆమె , ఇల్లు , ఈగ

 
 



 ఆమె కి అర్ధం కాని భాష ప్రేమ .  అతనికిమాత్రం తెలిసిన భాష ప్రేమే . వారిద్దరిని కలిపింది ఆ ఇల్లు . వాళ్ళిద్దర్నీ విడదీసింది వొక ఈగ . ఆమె కి ఏ మగాడితో కూడా  ఆరు నెలలు దాటి'' స్నేహం '' చెయ్యడం యిష్టం వుండదు . ఆ ఆరునెలల్లో ఆమే ప్రపంచం అన్నంత   బ్రాంతి లో పడేసి ,మళ్ళి  బయట ప్రపంచం లో యింకొకన్ని వెతుక్కుంటూ   వుంటుంది. ఈ ఆరు నెలల్లో ఆమె చుట్టూ పిచ్చోడై తన పనులన్నీ మానుకుని తిరిగిన  వ్యక్తీ అసలు తనెందుకు నిర్లక్ష్యం చెయ్యబడ్డా డో అర్ధం కాక జుట్టు పీక్కుని   రోడ్ల మీద పిచ్చోడై తనలో తనే మాట్లాడుకుంటూ   నిషీధి  లో  కలిసి పోవాల్సిందే . అది యింతవరకు జరుగుతున్నా రివాజు . అలా ఆరుగురు బకరాలు అయ్యాకా ఆమె  జీవితంలోకి వచ్చిన వాడే అతను . వాళ్ళ ఆయన ద్వారా ఆమె పరిచయం , ఆయన లేనప్పుడు కూడావచ్చే  అంత గా గట్టి పడి పోయింది అతి త్వరలోనే . ఆమెదేమో  కామ భావం . అతనిదేమో ప్రేమ భావం . ఏమి ఆశించకుండా వొకరి భావాలు వొకరు పంచుకుంటూ , కష్ఠ సుఖాలు చెప్పుకుంటూ స్వాంతన పొందడం అతని అభిమతం . కట్టే కాష్టం లోకి వెళ్ళిపోయే లోపు వీలైనంత మందితో సుఖాన్ని పొంది వాళ్ళని కష్టాలలోకి నెట్టడం  యీమె నైజం .
   ఆమె జీవితం కంచె లేని పొలం లాంటిది . భర్త అనే కంచె వున్నా లేనట్టే . రోడ్డు మీద వెళుతున్నా ఏ గేదైనా ఏపుగా పెరిగిన పంటని చూసి టెంప్ట్ అయితే పైరగాలికి తల ఊపుతూ ఆహ్వానించే అట్టు వుంటే ఏ గేదన్నా ఎందుకు ఆగుతుంది? వెళ్లి కడుపు నిండా మేసి, రేపటికి సరిపడాకూడా   మేసేసి తర్వాత నెమరు వేసుకుందా మనుకుంటే ,పొలానికి కొత్త గేదె కనబడ గానే ఈ గేదేకి ముళ్ళు గుచ్చి  తరిమేస్తుంది . అయితే అతను  భావకుడు కాబట్టి ఈ పొలాన్ని ఆ పైర గాలిని ఆస్వాదించి గట్టు మీదే నిలబడి కంచెని సరి చెయ్య బోయి బొక్క బోర్లా పడ్డాడు .
మొదటి సంవత్సరం యీమె అతన్ని తన దార్లోకి తెచ్చు కోవదానికే సరి పోయింది . రెండో సంవత్సరం అతను  పూర్తిగా ఆమె మోహం  లో పడి  పోయి శ్లేష్మం  లో పడ్డ ఈగ లాగ బయటకు రాలేక ఆవస్త పడుతుంటే , మూడో సంవత్సరం ఆమె కి మొహం మోత్తి  ఇతన్ని పట్టించు కోవడం మానేసి , కొత్త బకరా అన్వేషణలోపడి  పోయింది . ఈ అకారణ తిరస్కారం తట్టుకోలేక అతను, మీ మొహం చూడడం యిష్టం లేదు మాయింటికి రావొద్దు అన్నా ఏ వొక్క రోజన్నా మారక పోతుందా అని వెళ్తున్నాడు . వెళ్ళిన దగ్గర నుంచి యితని ఉనికిని కుడా పట్టించు కోకుండా పేపర్ చదువుకోవడం లేదా టీవి  చూస్తూ జోకు లేక పోయినా నవ్వు కొవదమ్. ఇతను మాట కలుపు దామని ఎంటండి ఈరోజు విశేషాలు ? అంటే ఏం లెవ్ . అంటూ మళ్లీ  టీవి చూడ్డం . ఏం తిన్నారు పొద్దున్నా అంటే, గుర్తు లెదు. పోనీ రాత్రికి ఏం వండుకుంటారు అంటే తెలిదు .యిది పెడసరి సమాధానాలు. యిలా తట్టుకోలెంత కోపం వచ్చేలా చేసి ఆ కోపం లో అతను  మొన్నా ఆ ఎదురింటి ఆయన షార్ట్స్ వేసుకుని వచ్చి కూర్చుని  మీ వారు యింకా రాలేదా అండీ , అంటే రాలేందండి వచ్చేస్తారు కూర్చోండి అన్నారు అదే నేను అడిగితె నాకు తెలిదంటారు ?
అవున్రా నా యిష్టం నీ కిష్టమైతే కూర్చో లేకపోతె పో, అసలు మా యింటికి రాకు , వోరేయి డాడీ కి ఫోన్ చేసి దరిద్రం పోతోంది యింక యింటికి రమ్మని చెప్పు . అన్నాకూడా   అతను  అవమానాన్ని దిగ మింగి మీరు కోపం లో వునట్టు వున్నారు నేను మళ్లీ  వస్తా అంటూ కళ్ళలోనీళ్ళు   తుడుచుకుంటూ పోయిన సంఘటనలు  కోకొల్లలు .
అయితే యీమె రెండో భాదితుడు రహస్య రోగం ఏదో వచ్చి ఆరునెలల క్రితం పోయాడు . అయితే పోయే ముందు యీమె మీద పగతో రగిలి పోవడం తో వీళ్ళు  యిప్పుడు ఉంటున్న  యింట్లో ఈగ గా పుట్టి  యీమె వేస్తున్న వేషాలు
 చూస్తూ మూగగా రోదిస్తూ అవకాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు .
యీమె యింటికి ఏయే మగాళ్ళు వచ్చినా సాయంత్రం భర్త రాగానే ఫలానా వాళ్ళు వచ్చి యింత సేపు కూర్చుని వెళ్ళారని చెప్పడం తో యీమె ఎవరు వచ్చినా తప్పు చెయ్యదు కాబట్టే ధైర్యం గా తనకి చేబుతోందన్న పిచ్చి భ్రమ లో తనని తను మభ్య పెట్టుకుని వుండే వాడు భర్త . నిజం  తెలిసిన ఈగ , యీమె నైజం తెలిసిన అతను ప్రేమించిన కారణం గా   మౌనం గా వుండే వారు .
వొక రోజు మధ్యాన్నం అతను  ఆమె యింటికి వెళ్ళాడు . ఆమెవొకత్తె ఉంది . మూడ్ లో వునట్టు వున్ది. నవ్వుతూనే  తీసిన్ది. ఆశ్చర్య పోవడం యితని వంతయ్యింది . మంచి నీళ్ళు , కాఫీ లాంటి మర్యాదలు మానేసి చాలా కాలం అయ్యింది కాబట్టి ఊరికే కుర్చుని యిక్కడ పని మీద వచ్చి మిమ్మల్ని చూసి పోదామని యిలా వచ్చాను అన్నాడు అతను . కొత్త గా ఏమి వుంది చూడటానికి ఆమె సమా ధానమ్. అది తిట్టో లేక ముందుకి వెళ్ళ మన్న సందేశమో అర్ధం కాక అతను  మౌనం గా వున్నాడు . గ్రిల్ వేసి వున్నా వీధి తలుపు తీసే   ఉంది , దగ్గర గా వస్తే అవతలి వాళ్ళకి  యిద్దరూ బానే కని  పిస్తారు . ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా యింట్లో ఈగ ఉర్ఫ్ మాజీ ప్రియుడు ఆమె కంటి మీదకి స్పీడ్ గా వచ్చి బలం గా కను గుడ్డుని డీ కొట్టి తనువూ చాలించాడు . ఆ దెబ్బకి ఆమె కను గుడ్డు యెర్ర గా అయిపోయి కన్ను ముసుకు పోయి రెప్ప తెరవ లేని స్తితిలో అతను  ఆమె దగ్గరా గా వచ్చి తన చేత్తో ఆమె రెప్పని తెరుస్తూ నోటి తో కంటి ని ఊదు  తున్నాడు . ఆ సందర్భంగా శరీరం లోని చాలా బాగాలు దగరగా వచ్చి తాకుతున్న విషయాన్నీ అతను  గమనించక పోయినా అతని మెదడు గ్రహించి యివ్వ వలసిన సంకేతాలు యివ్వ వలసిన వాటికి యిచ్చేస్తోంది . అతను  కంటి ని వుదేసాక పంటి ని ఉదా సాగాడు మరింత దగ్గర గా వచ్చి . రెండు కళ్ళు నాలుగు అయ్యి , నాలుగు పెదాలు రెండు అయ్యాయి . పరిసరాలు స్పురణకి  రాలేదు యిద్దరకి . మూతులు కలిసాక చేతులు కూడా  కలిసాయి . . యింతలో యిది సంసారులు వుండే కొంపా సాని కొంపా?అన్న అరుపు తో యిద్దరు విడి పోయి వెనక్కి తిరిగి చుస్తే  ఫ్లాట్స్ లోని ఆడవాళ్ళూ చేతిలో కుంకుమ భరణి తో శుక్రవారం పూజ కి పిలుద్దామని వచ్చి యిక్కడ జరుగుతున్నా పూజ ని చూసేసారు . అతను  సిగ్గు తో  గ్రిల్ తీసుకుని బయటకు వెళ్లి పోయాడు . వొక పది రోజులు కష్టం మీద సెల్ కి చెయ్య కుండా ఆగాడు . పదకొండో రోజు చేస్తే మీరు డయల్ చేసిన నెంబర్ సరి చుసుకొండని వస్తోంది . యింక ఉండ  బట్ట లేక వాళ్ళు వున్న  ఫ్లాట్స్ కి వెళితే టు లెట్ బోర్డు వేలాడుతోంది గేటు కి . వాచ్మన్ ద్వారా అర్ధం అయిన విషయం ఏంటంటే ఆమె తెలివిగా భర్తకి చెప్పి  ఈ ఊరి వాతావరణం తనకి పడటం లేదని వేరే ఊరికి బదిలీ చేసుకుని వెళ్లి పోయారని . వెళ్ళే ముందు చెప్పలేదు ,  కనీసం నంబర్ కుడా యివ్వలెదు. ఏ విచ్చల విడి తనం తనని ప్రమాదం లోకి   నేడుతుందని చెప్పాడో ,వేరే మగాళ్ళతో జాగర్త అని చెప్పాడో , శకునం చెప్పేబల్లి కుడితి లో   పడి  నట్టు అందరు బానే వున్నారు అతనే ఏమి చెయ్య కుండానే ఎన్నో నిందలు మోసాడు మౌనంగా . మూడేళ్ళ నుంచి పెన వేసుకున్నా భంధం తుఫాన్ తాకిడికి నెల కూలిన వృక్షం లా అయిపొయింది . ఆమె ఇల్లు అయితే ఖాళి చేసింది గాని తన దిల్లు మాత్రం ఖాళీ చెయ్యలేక పోతోంది యెంత ప్రయత్నం చేసినా .
 భవిష్యత్తులో ఆమె యిటువంటి ప్రమాదాల బారిన పడకుండాఅతను ఆమె భర్త కి విన్నపం తో కూడిన విజ్ఞాపన మెయిల్ చేసాడు ఈ కింది విధం గా .
మిత్రమా నా జీవితం నుంచి మీ అకాల నిష్క్రమణ నా లో తీరని వేదనకి గురి చేసింది . ప్రతి కలయిక  వొక విడిపోవడానికి నాంది వాచకం అని తెలుసు గాని అది యింత త్వరగా వచ్చి యింత చేదు  గా నిష్క్రమిస్తుందని కలలో కుడా అనుకోలేదు .. స్వతహా గా తను చాలా మంచిది కాని బలహినతలకి అతీతురాలు మాత్రం కాదు . మీరు కంచె లా వుండి రక్షించ వలసినది పోయి, ఎవరి మంచి చెడ్డలకి  వాళ్ళే భాద్యులు అని మీ భాద్యతని తప్పించుకుంటే  ఎలా ?తోటకూర దొంగ తనం చేసినప్పుడే దండించి వుంటే ఈ రోజు వొక గజ దొంగ అయ్యేది కాదు కదా?ఎక్కడో నెల్లూరు లో మీ స్నేహితుడు శీను ఫ్రెండ్  సోమేశ్వర రావు ని ఏ  ముఖ పరిచయం తో మూడు నెలలు మీ యింట్లో పెట్టుకుని ఉంచు కున్నారు?మీరు ఆఫీసు కి వెళ్లి పోయాక పని , పంగు లేని వాడు యింట్లో వొంటరిగా వయసులో వున్న శ్రీమతి తో ఊరికే బాతా ఖాని కె   పరిమితం అవుతాడని ఎలా సరి పెట్టు కుంటారు ?మొదటి రోజు కాఫీ తాగుతారా అండీ  అని అతిధి ని సంభోధించిన శ్రీమతి మూడు రోజులకే యింకో కప్పు కాఫీ తాగరా అలిసి పోయి ఉంటావు అంటూ చనువు గా మాట్లాడి తే అర్ధం వాళ్ళిద్దరి మద్య పెరిగిన సన్నిహిత్యానికి సూచిక   కాదా ? మీ దగ్గర మాత్రమె ఉండ  వలసిన అతిధి సెల్ నెంబర్  ఆమె సెల్ లోకి వచ్చి  గంటలు గంటలు సెల్ ఎంగేజ్ వచ్చినప్పుడు అది జరుగుతున్న వుపద్రవానికి సంకేతం కదా?మీ బండి మీదే వాళ్ళిద్దరూ మీ చుట్టాల ఆవిడని కూడా  ఎక్కించుకుని ముగ్గురి తో సహా హీరోహోండా  మీద మీ ముందే వెళుతుంటే  దానర్ధం?నువ్వు బయటకి వెళ్ళినప్పుడు చీర కట్టు కోకు చుడిదార్ వేసుకో అని అతిధి మీ ముందే ఆదేశాలు జారి చేస్తునప్పుడైనా మీరు ఆపక పోవడం మీ అన్యాప దేసమైన అంగీకారం కదా?పోనీ యిలా వోకల్లతో బండి ఆగ లేదు కదా యింతకు ముందు ఆ తర్వాతా ఆ బండి నడిపే చోదకుడు మారాడు గాని మిగతా దంతా సేమ్ టు   సెమ్  కాదా?యివన్ని చెప్పడం లో నా ఉద్దేశం కనీసం భవిష్యత్తులో అన్నా ఆమె ప్రమాదాల బారిన పడకుండా కుటుంబ వ్యవస్తలో ఆనందం గా ఉండాలనే గా . నా ప్రేమని పణం  గా పెట్టి కొవొత్తులా కరిగి   శాశ్వతం గా దూరం అయ్యి ఆమెని కాపాడు కోవడమే నా ఉద్దేశం . తను ఎక్కడ వున్నా మీతో సుఖం గా వుంటే చాలు . ఈ మూడేళ్ళలో తన తో గడిపిన కొన్ని మధుర జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ గడిపేస్తా . మీరు , తను యిక్కడ వున్న ఆఖరి రోజులో మీ యింటికి వచ్చినప్పుడు యెంత త్రునికరణ తో   తిరస్కరించినా , తన మీద వున్న  అవాజ్య మైన ప్రేమతో మీ యింటికి వస్తూ  నేను వంద అడుగులు వేస్తె తను కనీసం వొక్క అడుగు అన్నా వెయ్యదా అన్న దింపుడు కళ్ళెం ఆశ తో  చివరి వరకు ప్రయత్నించా . కాని అణువణువు నా మీద ద్వేష భావం నింపుకున్న ఆమెకి నా పిలుపు ఎడారిలో కోయిల పాట అయిపొయింది . నన్ను వీడి పోయింది . మీకు మళ్ళి ఆ కొత్త ప్రదేశం లో కొత్త స్నేహితులు దొరకొచ్చు కాని వాళ్ళని మాత్రం మీ ఆఫీసు కె పరిమితం  చెయ్యన్ది. యింటికి తెచ్చి ఆమె ని పరీక్షలకి గురి చెయ్యకన్ది. ఆమె కున్న బలహీనతల రీత్యా ఆమె  మళ్లీ వోడిపోతుంది .. యిష్టం గా వొడి పోతుంది ఆ తర్వాత వచ్చేకష్టాల
గురించి ఆలో చించదు . కంచె లా వుండండి . కంచే చేను మెయ్య డానికి సహకరించేలా ఉండకండి . మళ్ళి మనం ఈ జీవితం లో ఎప్పటికి కలవ లేక పోవచ్చు కాని పౌర్ణమి నాటి చంద్ర బింబం  చూసినప్పుడు అటు పక్క నుంచి తను కూడా  చూస్తూ ఆస్వాదిస్తూ ఈ వేదవ ఏ ఆడ పిల్లకి హిత భొదలు చేస్తూ తిట్లు తింటున్నాడో అని బృకుటి ముడి వడిస్తూ నా గురించి వొక్క నిమిషం ఆలోచిస్తే చాలు ఆ తరంగాలు నాహృదయాన్ని   ఆహ్లాద పరుస్తాయి . సెలవ్ .
 
 మెయిల్ అందుకున్న ఆమె భర్త లాప్టాప్ మూసేసి ఆలోచిస్తూ యింటి దారి పట్టాడు .
బయట పార్కింగ్ లో మాల్ లోమొన్ననే  పరిచయం అయిన తెలుగు అబ్బాయి  కార్  కని  పించింది . యింట్లో అడుగు పెడుతుంటే ఆ అబ్బాయి , ఆమె పక్క పక్కన కుర్చుని కాఫీ తాగుతుంటే  వొక ఈగ ఆమె కంటి చుట్టూతిరుగు తుంటే ''త్వరగా తలుపు వేసేయ్యి''అంటోంది ఆమె .అతను   ఆశ్చర్యం గా చూస్తున్నాడు . భర్త అప్పుడే గుమ్మం ముందు కొచ్చాడు . అయితే ఆఖరి మెయిల్ రాసేసి అతను  అనంత వాయువుల్లో కలిసి పోయిన విషయం భర్త భార్యలకి బహుసా ఎప్పటికి తెలియక పోవచ్చు .అతను అప్పుడే ఈగ గా పుట్టేసాడా ?