17 నవం, 2016

మళ్ళి పుట్టిన ఆ రోజు

Image result for man looking moon
        రాబోయే శనిత్రయోదశి నుండి నీ జీవితం ఒక్క కుదుపుతో మార్పుకి గురవుతుంది . మిత్రుడు సహోద్యోగి శర్మ ఫోన్ లో చెప్పాడు. మంచి మార్పా లేక ?
కుదుపు మాత్రం చేదు గుళిక మార్పు మాత్రం మంచికే .
అప్పుడు నమ్మలేదు కానీ యిప్పుడు సందేహం లేదు . ఆ శని వారం యిప్పుడు తలచుకుంటే మనసు క కా వికలము అవుతుంది.
ఆ రోజు ఎప్పటి లాగే ఉదయాన్నే వాకింగ్ చేస్తూ మా ఫ్లాట్ లో కొత్తగా అద్దెకి దిగిన యువ జంట యింటికి వెళ్లి బెల్ కొట్టాను . ఆమె తలుపు తీసింది మ్యాక్సీ లో . అంతకు ముందు రోజే కిటికీ తలుపులు పట్టక దోమలు వస్తున్నాయని కంప్లైంట్ చెయ్యడం తో శనివారం కార్పెంటర్ ని పట్టుకుని చేయించొచ్చు అన్న సదుద్దేశం తో అక్కడకి వెళ్లడం జరిగింది.ముందు గా పని అంచనా కోసం వెళ్ళా.ఆమె నేను  క లి సి లోపలకి వెళ్ళాము .
" ఈ రోజు శని త్రయోదశి యిప్పుడేస్నానం చేసి బాత్ రూమ్ లోంచి వచ్చా అంటోంది".నా గుండె ఝల్లు  మంది '
ఆమె బాత్ రూమ్ లోంచి స్నానం చేసి వచ్చా అన్నందుకు కాదు శనిత్రయోదశి అని గుర్తు చేసినందుకు . శర్మ వార్నింగ్ గుర్తుకు వచ్చింది. ఆ పది నిమిషాల్లో కిటికీలు చూసి వెళ్లి పోయే దానికి ఇంతలా  గాభరా పడాలా అని అనునయించు కున్నా.  మూడు గదుల్లో కిటికీలు చూపించాక బెడ్ రూమ్ లో ఫ్యాన్ కూడా ప్రాబ్లెమ్ ఇస్తోంది అనడం తో అక్కడకి వెళ్ళాను. తాను వెనకగా వచ్చింది. యిపుడు పర్వాలేదండి వేసవి లో యిబ్బంది అవుతుంది .అంది . యింతలో నా ద్రుష్టి గోడ మీద క్యాలెండరు మీద పడింది. వాళ్ళిద్దరి పెళ్లి ఫొటోస్ తో తయారు చేసిన క్యాలెండరు. యిద్దరు చూడ ముచ్చటగా వున్నారు అన్నాను . నిజానికి ఆమె అంత  బావుండదు సన్నగా కొంచెం ఎత్తు  పళ్లతో గట్టిగా మాట్లాడితే ఒక టిబి పేషెంట్ లా ఉంటుంది. నేను ఎప్పుడయితే చూడ ముచ్చట గా వున్నారు అన్నానో ఏడుపు లంకించు కుంది . కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. నా  కేమో పై ప్రాణాలు పైనే పోయాయి. అరెరే ఊరుకోండి ఎందుకు ఏడుస్తున్నారు యిప్పుడు ఏమైయింది అని అన్నా . ఎవరన్నా అప్పుడు మమ్మల్ని చుస్తే నేనేదో అఘాయిత్యం చేస్తే ఆమె ఏడుస్తున్నట్టు గా వుంది పైగా యింట్లో ఎవరు లేరు. దానికి సమాధానం గా ఆమె మేము చూడటానికే ముచ్చట గా ఉంటాము పెళ్లి అయ్యి ఏడాది అయినా ఏ ముచ్చటా మా మధ్య లేదు . అయన ఈ మంచం మీద పడుకుంటే నేను హాల్లో సోఫాలో పడుకుంటాను . అయ్యో అదేంటి పాపం అన్నా . పాపం కాదు ఆయనలో లోపం ,నా పాలిటి శాపం . పైగా ఈ విషయం ఎవరికన్నా చెపితే విషం తాగి ఆత్మా హత్య చేసుకుంటా అని బెదిరించాడు . దాంతో మింగ లేక కక్కా  లేక ముసుకు కూర్చున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది . నా  కేం చెయ్యాలో పాలు పోకా ఆమె భుజం . మీద తట్టి ఊరుకోండి విషయం లేక పోయినంత మాత్రాన విషం అంటే ఎలా ఈరోజుల్లో ఏదన్నా సాధ్యమే అన్నా.
ఆమె దగ్గర గా వచ్చి నా ఎద  మీద తల పెట్టుకుని  నడుము చుట్టూ చెయ్యి వేసి స్వాంతన పొందుతోంది . నాకు మతి పోయింది నేను కలలో కూడా ఆమె అలా వాటేసుకుంటుందని ఊహించలేదు.   ,మెల్లిగా ఆమె చేతులు విడదీస్తూ ఊరుకోండి అన్ని సద్దుకుంటాయి అంటూ అనునయిస్తున్నా. ఇంతలో ఆమె వుండండి బయట తలుపు వేసొస్తా అంటూ గిర్రున వెళ్లి తలుపు వేసి మళ్ళీ  బెడ్ రూమ్ లోకి రావడం లిప్త కాలం లో జరిగి పోయాయి. ఈ సారి ఎదురుగా బాగా దగ్గర గా వచ్చి పన్నెండు లక్షలు ఖర్చుపెట్టి మా నాన్న పెళ్ళిచేసాడు , మళ్ళీ  యింకో పెళ్లి అంటే అయన వల్ల కాదు. కష్టమో నష్టమో యింకా అంతా  యీయన తోనే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మళ్ళీ  వాటేసుకుంటూ నేను అందం గా లేనా అంటూ కళ్ళలో కళ్ళు పెడుతూ అడిగింది. నా పరిస్థితి కుడితి లో పడ్డ ఎలుక లా అయ్యింది. గొంతు పెగలటం లేదు . ఆమె యెంత బక్కగా వున్నా నా మనసు అపభ్రంశం చెందే సూచనలు మొదలయ్యాయి. ఆమె ధోరణి లో ఆమె చెప్పుకుంటూ పోతోంది. పెళ్ళయ్యాకా యింత  వరకు ఏమి కోన లేదు నాకు ఏమి కొనాలన్నా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆమె అనుమతి తోనే  కొనాలి . ఆమె ఎందుకు రా అనవసరపు ఖర్చు అంటే యింక  అంతే . కనీసం ఒక మంచి సెల్ ఫోన్ కూడా లేదు అంటూ యింకా దగ్గర గా హత్తుకుంటోంది. టాపిక్ మారిస్తే ఫలితం ఉంటుందేమో అని అవును మీ సెల్ నెంబర్ యిస్తే అపుడప్పుడు మిమ్మల్ని వోదార్చిచ్చు గా అన్నా. ఐడియా ఫలించింది . యిస్తాను గాని మీ పేరు సుధా అని పెట్టు కుంటా అంటూ పట్టు సడలించి బెడ్ మీద వున్న  సెల్ తీసుకుని నా నెంబర్ కిఅడిగి మిస్డ్ కాల్ యిచ్చింది. హమ్మయ్య అనుకుని మీరు బయట తలుపు తియ్యండి యింక  వెళతాను ఎవరన్నా వస్తే తప్పు గా అనుకుంటారు అన్నా . అంతే  ఆమె ముఖ కవళికలు మారి పోయాయి. కదలకుండా అలాగే మౌనం గా నించుంది. ఆమె భావం నా కు అర్ధం కావటం లేదు. రీజెక్ట్డ్ ఫీలింగ్ తో ఉందా?లేక తాను అందం గా లేను కాబట్టే  వొదిలేశాడని కోపం గా ఉందా ?అబ్బా ఈ భయంకర పరిస్థితి నుండీ ఎప్పుడు బయట పడదామా అని వుంది. సమాజం లో వున్నత మైన స్థితి లో ఉండి ,మంచి కుటుంబం ,హోదా యివన్నీ గుర్తుకు వచ్చాయి . యిప్పుడు గాని ఎవరన్నా తలుపు కొడితే ?నేనుఅంత వరకే  ఊహించా అంతకు మించి న  ఉపద్రవం వేచి ఉందని అప్పుడు నాకు తెలీలేదు .
 మళ్ళీ ఆమె  ఏడుపు లంకించు కుంది . అయ్యో ఊరుకోండి అంటూ ఆమె భుజం తట్టి అనునయించా బోయా
.ఛీ ముందు వంటి మీద చెయ్య తియ్యండి , ఏదో పెద్దవారని బాధ చెప్పుకుంటే వళ్ళు తడుము తారా ?అంటూ ప్లేట్ ఫిరాయించింది. నా కాళ్ళ కింద భూమి పగిలినట్టు అయ్యిండి. కళ్ళు బైర్లు గమ్మాయి.
 అయ్యో మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు నా ఉద్దేశం అది కాదు . అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని అన్నా. ఆమె యింకా ఏడుస్తోనే వుంది. నాకేం చెయ్యాలో పాలు పోలేదు. ఆమెని అల్లాగే వదిలేసి వెళ్లి పొతే నేను తప్పు చేసినట్టు అవుతుంది అలాగని ఉందామంటే అర్జంట్గా మా స్టాఫ్ తో శనివారం కదా అని బయట ఇన్స్పెక్షన్ కి ప్లాన్ చేశా వాళ్లంతా వెహికల్ తీసుకుని  అరగంట లో వచ్చే సమయం అయిపోతోంది .
ఏంటో భగవంతుడా నా కి శిక్ష ఈమె చుస్తే మానసిక రోగి లాగ వుంది ఓకే నిమిషం ఒకోలాగా ప్రవర్తిస్తోంది. ఏమయితే అది అయ్యిందని ఆమెకాళ్లు పట్టుకుని అమ్మా  నను క్షమించు బుద్ది గడ్డి తిని అలా చేశా నన్ను క్షమించు దయ చేసి తలుపు తియ్యి పోతా  అంటూ అభ్యర్ధించా . వసు దేవుడు గాడిద కాళ్ళు పట్టుకోవడం అంటే ఇదేనేమో. మొత్తానికి కళ్ళు తుడుచుకుంటూ తలుపు తీసింది బతుకు జీవుడా అని బయట పడ్డా. అక్కడితో ఆ విషయం మర్చి పోయా .
 ఒక రెండు రోజులు పోయాకా కార్తీక పౌర్ణమి రాత్రి సత్యనారాయణ వ్రతం చేసుకుని ప్రసాదం తీసుకుని అప్పుడే సోఫాలో కూర్చుని ఉంటే సెల్ మోగింది . నెంబర్ చుస్తే మా ఫ్లాట్ లో కొత్తగా అద్దెకి వచ్చిన యువజంట లో యువకుడు. హలో అన్నా .
  మీరెక్కడ వున్నారు .
యింట్లో, కానీ బయటకు వేళ్ళ బోతున్నా, నా మనసేదో కీడు శంకిస్తుంటే అన్నా.
మేము మీ యింట బయటే వున్నాం తలుపు తియ్యండి అన్నాడు .
అదేంటి గొంతులో గౌరవం లేదు దెబ్బలాడటానికి వచ్చినట్టే వుంది . తలుపు తీస్తే యింకో గూండాలా వున్నా మరో వ్యక్తి తో వచ్చి రావడం తోనే  నీకు బుద్ది  లేదా మ్మా ఆడవాళ్ళ చెయ్యి పట్టుంటావా ?డోర్ లాక్ చేస్తావా?సెల్ నెంబర్ ఆమెది నీకెందుకు?యిప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం . పిలు మాడం  ని అంటూ అరుస్తున్నారు. నాకు మెదడు మొద్దు బారి పోయింది. ఇదేంటి అనుకోని ఈ ఉపద్రవం?అసలు జరిగిందేంటి? వీళ్లు  మాట్లాడుతున్నదేంటి?ఇన్నేళ్ల నా జీవితం లో ఎక్కడా ఒక్క మచ్చ లేకుండా బతికితే ఈ అభియోగాలు ఏంటి?అసలు గొంతు పెగలటం లేదు . అతి కష్టం మీద కూర్చోండి నేను చెయ్య పట్టుకోవడం ఏంటి?డోర్ లాక్ చెయ్యడం ఏంటి ?అసలు అలా ఏమి జరగ లేదు .
 నువ్వు యిలా చెప్పవ్ . ముందు ఆ ఫ్లాట్ కి రా అక్కడ అందరి ముందు నిజం చెప్పిస్తాం అంటూ దగ్గర గా వస్తున్నారు. యిప్పుడు వీడు సంసారానికి పనికి రాడని  చెప్పింది అంటే భర్త విషం తాగి చస్తాడు .పోనీ తప్పయ్యిందనంటే ఘోరమయిన నింద మోసినట్టు అవుతుంది. అక్కడకి వెళితే నిజం చెప్పక తప్పదు. వీడు  చచ్చి మళ్ళి  ఆమె ఆత్మ హత్య అంటే శుభకరమైన యింట్లో యిదంతా అవసరమా? ఇంతలో గూండాలాగా వున్నవాడు మేడ  మీదకి పోయి మాడం , మాడం అంటూ పైకి పోయాడు. తాను పిల్లాడికి చదువు చెప్పడం లో తలుపు వేసుకుని ఉండడం తో వీడి అరుపులు వినబడలేదు. నేను తేరుకుని ఆగు నేనే వస్తా బట్టలు మార్చుకుని అంటూ పైకి వెళ్ళా. క్లుప్తం గా శ్రీమతికి జరిగింది చెప్పా. తాను చాలా సూక్ష్మ గ్రాహి ,కూల్ గా ఉంటుంది కాబట్టి కిందకి వచ్చి పదండి నేను ఫ్లాట్ కి వస్తా మీ ఆవిడా ఏం చెబుతుందో వింటా  అంటూ వాళ్ళ తో వెళ్ళింది.
అసలు ఏమి జరుగు తోంది భగవాన్ కార్తీక పౌర్ణమి రోజు వ్రతం చేస్తే ఇదా దాని ఫలం?ఏమో వ్రతం చేశా కాబట్టే యింకా యిలా జరిగిందేమో?లేకపోతె హింసాత్మకం గా మారీ  తే యెంత అప్రతిష్ట . తనకి తెలుసు ఇన్నేళ్ల మా వైవాహిక జీవితం లో ఎప్పుడు ఇలాంటి చపల  చిత్తపు పనులు చెయ్యలేదని . నా లో వున్న  లోపం ఎదుటి వాళ్ళ జీవితం లో అనవసరమైన ఆసక్తి ప్రదర్శిండమే అని . అంతే  అంత వరకే .
తాను అరగంట లో వచ్చింది ఆ సమయం నాకు ఆరు యుగాలు గా అనిపించింది.
వస్తూనే నేను నిన్ను నమ్ముతాను యిన్నేళ్ళనుంచి చూస్తున్నాను కాబట్టి కానీ ఆ  అమ్మాయికి అంతలా పని కట్టుకుని నీ మీదే ఎందుకు చెప్పాలి ?చూస్తే ఇమ్మటూరెడ్ కిడ్ లా వుంది . లాక్ చెయ్యడం చెయ్యి పట్టుకోవడం వంటివి ఆమె విషయం లో జరిగే ఆస్కారం తక్కువే. అయినా జనం ఆడపిల్ల చెప్పిందే నమ్ముతారు కాబట్టి ఇక నుంచైనా ఎదుటి వాళ్ళ విషయాల్లో ఆసక్తి చూపకుండా యింట్లోనే ట్రేడ్ మిల్ మీద మ్యూజిక్ వింటూ వాకింగ్ చేసుకో.
నా కళ్ళలో నీళ్లు ఆగ లేదు ఎన్ని సత్యనారాయణ వ్రతాలూ కిందటి జన్మలో చేసుంటే యింత గొప్పజీవిత భాగస్వామిని యిచ్చాడు ఆ దేవుడు.
వాళ్ళని ఈ మంత్  లోనే ఖాళీ చేసేయ్య మన్నా తాను చెప్పి మేడ  మీదకి వెళ్లి పోయింది .
?మౌనం లో కార్తీక పౌర్ణమి బింబాన్ని చూస్తూ ఆద్యాత్మికం గా అంత  ఎత్తుకు ఎదగ గలనా ?ఆలోచిస్తున్నా. ఇంతలో సెల్ మోగింది . శర్మ . ఎత్తలా  వద్దా