6 అక్టో, 2008

బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీరు

బ్రహ్మి కి పెళ్లై ఏడేళ్ళు అయిపోయింది అందుకే రిమ్మ తెగులు పుట్టింది.భార్యని పట్టించు కోడం మానేసి చాల రోజులై పోయింది.ఆమె కూడా అంతే ఎప్పుడూ laptop పెట్టుకుని తన పనేదో తాను చేసు కుంటూ ఉంటుంది. .బాబు చిన్నవాడు కావడం తో రాత్రి 8 కే నిద్ర పోతాడు. ఇంక బ్రహ్మి రాత్రి రెండు దాక నెట్ మిద పడి ఒకటే చాటింగ్,హిమాని అతని జీవితం లో ఒక నిశి రాత్రి నెటిజెన్ గ rediff chatలో పరిచయం అయి అక్కడి నుంచి యాహూ మెస్సెంగెర్ దాక ఎదిగింది.కానీ అంతకంటే ముందుకి పోలేక పోతున్నాడు ఫోనే నెంబర్ ఇవ్వదు.హైదరాబాద్ లోనే సాఫ్టువేరు ఇంజనీరు తనలాగే ఏ కంపెనీ నో తెలియదు.కానీ ఇద్దరి భావాలూ ఒకటే .భగవంతుడు యెంత అన్యాయం చేస్తుంటాడు,హిమాని ని తన జీవితం లో భార్య గా పెట్టకుండా ఆ పిచ్చి పార్వతిని పడేసాడు.హిమాని చాట్ లో యెంత రొమాంటిక్ గా వుంటుంది.గంటలు నిమిషాల్లా గడిచి పోతాయి.ఏమన్నా సరే తనిచ్చిన హింట్స్ తో రేపు saturday తనని కని pettali . tankbund కి మార్నింగ్ 11 కి వచ్చి 5 మినుట్స్ లో వెళ్లి పోతానని చెప్పింది అంతే అ 5 నిమిషాల లో నేను తానెవరో కని పెట్టి నే వెళ్లి మాట్లాడ గలగాలి.ఏంటో ఉత్సాహం తో నిద్ర పట్టడం లేదు బ్టహ్మికి.తన రెండు నెలల కృషి ఫలించే క్షణాలు దగ్గరి కొచ్చేశాయి.ఎన్నాళ్ళో వేచిన హృదయం దూరం గా రేడియో లో పాట.ట్యాంక్ బండ్ కి పదింటికే వచ్చేసాడు .వేమన విగ్రహం దగ్గర తిష్ట వేసాడు. తాను వస్తుందా వస్తే అందం గా వుంటుందా ఎక్కడకి తీసుకెళ్ళాలి ?ఏంటో ఇంట టెన్షన్ తన పెళ్లి చుపులప్పుడు కూడా ఇంట పద లేదు, ఖర్మ ఇప్పుదేవరన్న చుస్తే?అబ్బ అసలు ఎ వెదవ తెన్సిఒన్స్ లేకుండా నెట్ లో సరదాగా చాట్ చేసుకోవడం లో ఉన్నా హాయి యి రియాల్టీ షో లో లేదేమో అనిపిస్తోంది. కళ్ళ ముందు భార్య బాబు గుర్తో చ్చారు,ఛి వద్దు నే తప్పటడుగులు వెయ్యను బుడి బుడి అడుగులు వేస్తున్న నా బాబు సాక్షిగా అనుకుంటూ కళ్ళలో నిల్లు తుడుచుకుని వెనక్కి దిరిగి పోయాడు.ఆ రాత్రి తన పార్వతి ని దగ్గర గా తీసుకుని ప్రేమ గా మాట్లాడుతుంటే అబ్బ మీరు నెట్ లోనే కదన్దొఇ నిజ జీవితం లో కూడా ప్రేమ ముర్తులే మీ హిమాని సాక్షి గా అంటు పాతవాటి నవ్వుతోంది. అంతే తన పార్వాతే హిమాని .మనసు ఆనందం తో బరువెక్కింది బుడి బుడి అడుగుల బుజ్జిగాడు పడి పోకుండా మంచం ఎక్కుతున్నాడు.

4 అక్టో, 2008

వీసాల కధలు.

పిచ్చి కుదిరితేనే గని పెల్లవదు ,పెళ్లి అయితే గని పిచ్చి కుదరదు .జీవితం లో బాగా సెటిల్ అయితే గాని మంచి సంభందం దొరకదు ఆడ అయిన మగైనా. వయసు అయిపోతోందని జీవితం లో సెటిల్ అవకుండా పెళ్లి చేసుకుంటే నాన్న కొంచెం డబ్బులిస్తే మేము సినిమాకి వెళ్తాం లాంటి పరిస్తితి వస్తుంది.అయితే నేటి పోటి ప్రపంచం లో సెటిల్ అన్నా దానికి కొలమానం ?పెళ్ళికి ముందే ఒక ఫ్లాట్ ,కార్ మినిముం అయి పోయాయి .అవి సంపాయించడం లో వయసు ఆరోగ్యం రెండు కరిగి పోతున్నాయి.అందు చేత ఇదొక విష వలయం వీసాల కధలకి అది నిలయం.

హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.

ఈ మద్య తరచూ పేపర్ లో ఇంటర్నేషనల్ expo exibition fully airconditioned ఈ పేపర్ cutting తీసుకుని వస్తే ఎంట్రీ ఫ్రీ 50% discounts వగైరా లతో భారి advt వస్తున్నాయి . వాటి తో తస్మాత్ జాగర్త, న స్వీయ అనుభవం వివరిస్తా చదివాకా మీ నిర్ణయం మీరు తిసుకోగలరు.మొన్న oct 2 ఫ్యామిలీ తో ఇందిరాపార్క్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ice mega expo కి వెళ్ళాం,అక్కడ వారానికి 7 ధర్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ధర్నా చౌక్ అని పేరు.మీ కళ్ళ ముందు గమ్యం కని పిస్తున్న మీరు వెల్ల లేని పరిస్తితి.జై తొయ్యి అంటు అరుపులు baricades సో మీరు ఉసురంటు 2 km చుట్టూ తిరిగి ఎలా గో అలాగా ఎంట్రీ పాయింట్ కి రీచ్ అవుతారు ఇంక అక్కడ మీ కార్ పార్కింగ్ కోసం మీ వంతూ వచ్చే వరకు వెయిటింగ్ చేసి మీ డ్రైవింగ్ సామర్ద్యాన్ని బట్టి రెండు కార్ల ఇరుకైన సందు లోంచి scratches పడకుండా జాగర్త గ పార్కింగ్ చేసుకుని ఇంకో km నడిచి tkt కౌంటర్ కి వెళితే అక్కడ పేపర్ cutting పట్టు కొచ్చిన జనం తో కౌంటర్ వాడు ఈ cutting మద్యానం 1 గంట వరకే ఇప్పుడు tkt తీసుకోవాల్సిందే అంటదు, ఇంక అంతవరకు వచ్చాక ఎవరు వెనక్కి పోతారు సో rs 45 పెర్ హెడ్ పెట్టి tkt తీసుకుని లోపలికి వెళితే ఒక పక్క నే ac blowers పని చేస్తుంటే రెండో పక్క గాలి రాక ఒకటే సుఫ్ఫోకాషన్.హుమిదితి ఎక్కువై పోయింది.మా మామ గారు వునట్టుండి కుప్ప కూలి పోయారు.వెంటనే ౧౦౮ కి ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వాళ్ళు వచ్చి ఫిర్స్త్ ఎయిడ్ చేసి ఆక్సిజన్ పెట్టక తెప్పరిల్లరు. అక్కడనుంచి యశోద కి తీసి కెల్లా క వాళ్ళు అన్ని టెస్ట్ లు చేసి భారి గ బిల్లు వేసి ఇంకెప్పుడు అల జనాలు భారి గ వుండే గుడారాల లోకి వేల్లోద్దని వెళ్ళిన ప్రనపయము తప్పదని సెలవిచ్చారు .మాకు కీలము వదిలిన పిదప ఫలము దక్కినదని కాదు సంతోషించి ఇంక ఎప్పుడు ఇలాంటి ప్రకటనలకి మోస పోరాడని తెలుసుకున్తిమి గవిన చిట్టా గించ గలరు.

1 అక్టో, 2008

బకరా

ఓ చెలి నీ కటాక్ష విక్షానాల కోసం బైక్ లో పెట్రోల్ తగలేసి నీ కాలేజీ bus పక్కన ప్రాణాలు పణంగా పెట్టి కట్ లు కొట్టి lov లెటర్ నీ చేతిలో పెట్టి నీకు దాహం వేసినప్పుడు కొబ్బరి బొండం కొనిపెట్టి అది తాగక ఇంక దాహం అంటే కూల్ డ్రింక్ తెచ్చి పెట్టి హోటల్ కి వెళ్ళినప్పుడు బిల్లు వచ్చే టైం కి నువ్వు washbasin కి పోఇన ప్రతిసారీ బిల్లు కట్టి మాల్స్ లో మరిన్ని కొనిపెట్టి నువ్వు వేరే వాళ్ళ బైక్ ఎక్కినప్పుడు కజిన్ అని నమ్మ బట్టి ఈ రోజు నువ్వు NRI పెళ్ళికొడుకు తో పెళ్లి అని చెప్ప బట్టి నాకు అర్దమయ్యిన్డి బకర అంటే ఏంటో.

punarjanma

నాలో ఎప్పటి నుంచో జిజ్ఞాస .పునర్జన్మ వుందా?వుంటే దానికి criteria ఎన్టీ?మరణించాక మళ్ళి మానవుడిగానే పుడతారా? ఈ ప్రశ్న లన్నిటికీ సమాధానం గరుడపురాణం లో వుంది.అయితే ఈ పురాణం ఎవరైనా ఆత్మీయులు పోయినప్పుడు తప్ప వుత్తప్పుడు చదవకుడదని అంటారు.మా నాన్నగారు పోఇన సందర్భం లో నే చదవడం తటస్తిన్చిన్డి .అందులో చాల విపులీకరించి మనిషి పోఇన దగ్గరనుంచి మళ్ళి జన్మ ఎత్తే వరకు ఏ ఏ దశలు ఉంటాయో రాసారు.నెట్ లో కూడా దీనికీ సంబందించిన సమాచారం ఇంగ్లీష్ లో వుంది తెలుగు లో నాకు కనబడలేదు.నా blogers లో ఈ సబ్జెక్టు ఎవరికన్నా ఇంట్రెస్ట్ వుండి వాళ్ళకి తెలుసున్న తెలుగు సైట్స్ ఈ సబ్జెక్టు మిద వుంటే ఈ టాపిక్ మిద చర్చించడానికి ఇదే ఆహ్వానం.చచ్చినాడా శుభామ అని ని బ్లాగ్ కొస్తే ఈ చచ్చు topica అంటే వేరే టాపిక్ లోకి వెల్లిపోదాం.మీ ముదమే నాకు సమ్మతము.