13 డిసెం, 2009

ఎదురు చూపు


ఉరుకుల పరుగుల సాగి పోయే నా జీవితం లోకి
ఎవరో రావాలి యి హృదయం కరిగించాలి
యి తీగను సవరించాలి అని పాడుకుంటూ గడిపేస్తుంటే
గ్రీష్మం లో చినుకులా , వసంత కోయిల లా వచ్చావు
నీ సంక్షిప్త సందేశాలతో మబ్బు పట్టిన మనసుకి
కొత్త కాంతి ని నింపావు .
నా సెల్ ఎప్పుడు కుయ్యి అన్నా నీ సందేశమే అనుకున్నా
స్పందించి నా సంతోషాన్ని పంచుకునే లోపే
భాద్యతలు వేళ్ళని ఫైల్ మీదకే గాని
సెల్ మీదకి పోనియ్యలేదు ,నా స్పందన నీకు తెలియనివ్వ లేదు
నేను నీ భావాలకి బానిసని ,అని చెప్పుకోలేక పోయిన ప్రేమ పిపాసిని
నా నుంచి స్పందన కరవై నీవు మూగ పోయావు , మెల్లిగా పక్కకి వెళ్లి పోయావు .
నా సెల్ కుయ్యి మన్న ప్రతిసారి నువ్వే అనుకున్నా, చూసే సమయాన్ని ఇవ్వలేక
నువ్వు వెళ్ళిన సంగతి తెలియకున్నా .నువ్వు వున్నావనే అనుకున్నా .
మొన్న నే అలసి పోయిన నా మనసుకు లేపనం నీ సందేశాలే కనుక చూస్తే
అందులో అన్ని వ్యాపార సందేశాలే కాని నాకు కావలసిన గ్రీష్మం లో చినుకు కనబడ లేదే?
తప్పు తెలుసుకుని వెంటనే నీకు సందేశం పంపితే,ఇక మోడు చిగురించదని
గూడు చేదిరిందని , సందేహాల మద్య సందేశాలకి తావు లేదని శరాఘాతం లా తగిలిన నీ సందేశం .
బతుకు సమరం లో బండి లాగే బాటసారి కి ప్రేమ వ్యక్తం చేసే సమయం ఏది?
తుమ్మెద పలకరించ లేదని పూవు మకరందం మానుతుందా ?
సూర్య కిరణం తాకలేదని కలువ పువ్వు వాడుతుందా?
సమయం ఇవ్వలేదని ప్రియ నేస్తం సందేశాలని ఆపుతుందా?
రేపటి నీ సంక్షిప్త సందేశం కోసం నా సెల్లు నా కళ్లు రెండు ఎదురు చూస్తూనే వుంటాయి .
కుయ్యి మని వింటే బాధని దూరం చేసేస్తాయి .
మళ్ళి జీవితం లోకి వసంతం వస్తుందని ,
సందేశాల పల్లకి నీ మోసుకుంటూ తెస్తుందని
ఏ సందేహం లేకుండా ఎదురు చూసే
నీ ప్రియ నేస్తం ఎదురు చూపు .

27 నవం, 2009

ఆర్య 2 అంతంత మాత్రమే


నిన్న ఆర్య 2 ప్రిమియర్ షో కి వెళ్ళడం జరిగింది . నా కైతే సినిమా నిరాశ పరిచింది .ఆర్య లో ఉన్నంత గ్రిప్ యి సినిమాలో లేదు . కధ టూకీగా ఇద్దరు అనాధలు స్నేహితులు . వాళ్ళలో వొకన్ని గొప్పింటి వాడు దత్తత తీసుకుందామని వస్తే ఆర్య త్యాగం చేసి స్నేహితుడికి ఆ అవకాశం ఇప్పిస్తాడు .ఆ అవకాశం పొందిన అజయ్ , అర్యని ఎప్పుడు శత్రువు లాగే భావిస్తాడు .పెద్ద అయ్యాక అజయ్ కంపని లోనే జాయిన్ అయ్యి ఇద్దరు వొకే అమ్మాయిని ప్రేమించడం , వోకల్ల మీద వోకల్లు కుయుక్తులు పన్నుకుని ఆమె ప్రేమని పొందడానికి ప్రయత్నించడం ., వొక సందర్భం లో ఆర్య రాయల సీమ factionist అయిన హీరోయిన్ తండ్రి దగ్గరకి వెళ్లి , ప్రత్యేకమైన పరిస్తితుల్లో ఆమెని పెళ్లి చేసుకుని కుడా స్నేహితుడి కి ఆమెని అప్పగించి సాక్రిఫైస్ చెయ్యడానికి సిద్ద పడి , మళ్ళి కుయుక్తి పన్ని అజయ్ మీద ద్వేష భావం ఏర్పరచి హీరోయిన్ ని తన దాన్ని గా చేసుకోవడం .
ఏంటో డైరెక్టర్ తికమక కి గురి అయ్యి ప్రేక్షకుల్ని కూడా దానికి గురి చేసాడేమో అని పించింది . కాసేపు హీరో ని సైకో గా చూపిస్తూ మళ్ళి కాసేపు మంచి వాడి గా చూపిస్తూ , climax లో కూడా తనని చంపడానికి అజయ్ ప్రయత్నించినట్టు హీరోయిన్ అనుకునేలా చెయ్యడం హీరో పాత్రని ఎలివేట్ చెయ్యదు .డాన్సులు చాల కష్ట పడి చేసాడు అల్లు అర్జున్ .రింగా రింగా పాట కాంట్రవర్సీ ని చేరపడనికేమో సినిమాలోలిరిక్ కొంత మార్చారు .గుత్తి తీసేసి కంచే అని పెట్టారు . బ్రహ్మానందం ని యి మద్య ఊరికే పెట్టుకుంటున్నారు గాని హాస్యం పండించడానికి మంచి పాత్రని ఇవ్వటం లేదు . యి సినిమాలో కూడా అంతె .నవదీప్ , అర్జున్ ఇద్దరు విలన్ లాగే బిహావ్ చేస్తారు . ఇంక బొమ్మ గుడ్డ కప్పిన కార్ నడపడం అది హీరోయిన్ ని ఏదన్నా అన్నవాడి వెంట పడడం అస్సలు పండలేదు . వోకో సారి విసుగ్గా అని పిస్తుంది ఇంకా అవదేంటి అని .ఓవర్ అల్ గా ఆర్య 2 అంతంత మాత్రమే .యూత్ దయ తలిస్తే గట్టేక్కొచ్చు .

25 నవం, 2009

ఎవరి కోసం ఎవరు ?


యి రోజు ఆఫీసు లో స్టాఫ్ చాల లేట్ గా పదకొండు దాటాక వచ్చారు నిన్న election డ్యూటీ కి వెళ్ళిన వాళ్ళంతా .అందులో ఎక్కువ మంది ఆడవాళ్లే .కారణం తెలుసున్నా గాని అధికార రీత్యా ఎందుకు ఆలస్యం అయ్యింది అని అడిగా (muster మాత్రం ఇంకా క్లోజ్ చెయ్యలేదు ) ఎప్పుడు సౌమ్యం గా హుందాగా వుండే ఆ అమ్మాయి లో ఆవేశం కట్టలు తెంచుకుంది .సర్ ఎన్నికల డ్యూటీ ని మాత్రం ఇక నుంచి ఆడవాళ్ళకి వెయ్యకండి (నిజానికి నా ప్రమేయం లేకుండా కింద వాళ్ళే పంపేసారు ,ఎన్నికల సంఘం నుంచి అవే పేర్లు డ్యూటీ వేస్తూ వచ్చేసాయి ) నిన్న పొద్దున్న అయిదు గంటలకి వెళ్ళిన వాళ్ళం evm లు స్టేడియం లో అంద జేసి ఇంటికి జేరే సరికి అర్దరాత్రి దాటి పోయింది .పొద్దున్న మా వారు ప్యాక్ చేసి ఇచ్చిన సాండ్ విట్చ్ తోనే రోజంతా గడప వలసి వచ్చింది .టోలి చౌకి పోలింగ్ కేంద్రం లో నే వొక్క దాన్నే ఆడ ఆమెని .తినడానికి తిండి లేదు , తాగడానికి నీళ్ళు లేవు , బాత్రూం కి వెళదామంటే ఆ సౌకర్యం కూడా లేదు .పోనీ డబ్బులు ఇచ్చి బయట కొనుక్కున్దామంటే అన్ని బంద్ .విధులు నిర్వహించే మేము కాసేపు ఆపేసి వొకరి తర్వాత వోకరన్న పోయి అరటి పళ్ళు కొనుక్కుని వద్దామనుకున్నా బురఖాలు వేసుకుని ఆడవాళ్ళ పెద్ద que లు అక్కడ agents మా ఆడవాళ్ళ వేలు మగ వాళ్ళు పట్టుకోకూడదు మీరే చుక్క పెట్టాలని కదల నివ్వ లేదని చెప్పింది .సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టించారు మేము ఎలా ఉన్నామో అని మా కుటుంబ సబ్యుల ఆదుర్దా రాత్రి వరకు అంటూ కళ్ళలో నీళ్ళు పెట్టుకుని చెప్పింది .
కనీస వసతులు కూడా కల్పించ లేదు రాష్ట్ర ప్రబుత్వం .అర్దరాత్రి స్టేడియం నుంచి ఆడవాళ్ళూ తమ ఇళ్ళకి ఏ ట్రాన్స్పోర్ట్ provide చెయ్యక పొతే ఎలా వెళతారు? రెండు బ్రెడ్ ముక్కలతో ఉదయం నుంచి అర్దరాత్రి దాక బాత్ రూం కి కూడా పోకుండా , కుటుంబ సబ్యుల తో కుడా కాంటాక్ట్ లో లేకుండా , ఇంటికి తిరిగి రావడానికి ట్రాన్స్పోర్ట్ లేకుండా ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునే కార్య క్రమం లో భాగస్వాములు అయిపోవాలి .
ఎన్నికల agent గా వున్న వాళ్ళకి పార్టీ లు వోక్కోకరికి అయిదు నుంచి పది వేలు ఇచ్చారట . వాళ్ళు వంతుల వారి గా డ్యూటీ లు చేసి చక్కగా తిని వచ్చేవారు .వోకో అభ్యర్ది 50 లక్షలకి తక్కువ ఖర్చు పెట్టలేదు .ఇంత ఖర్చు పెట్టి రేపు చేతులు ముడుచుకు కుర్చోడు కదా.అంటే రేపటి ఆయన సుఖం కోసం , కొన్ని వందల మంది ఉద్యోగులు యి రోజు కష్ట పడాలి . రేపు అదే ప్రజా ప్రతినిధి మీటింగ్స్ లో అధికార్లని బండ బూతులు తిడుతున్నా భరించాలి .ఇక్కడంతా ఎవరి కోసం ఎవరు పని చేస్తున్నారో అర్ధం కాదు .
మిగత స్టాఫ్ కూడా అదే టైం కి వచ్చి వాళ్ళు పడ్డ బాధలు చెప్పుకున్నారు .ఇంతకీ మా ఆఫీసు లో అలా బాధ పడ్డ ఆమె వొక సిట్టింగ్ సీనియర్ ఏం ఎల్ ఏ కోడలు .ఆమె దుఖం ఆపుకోలేక సర్ నెక్స్ట్ టైం మీరు మమ్మల్ని యి డ్యూటీ నుంచి తప్పించక పొతే మా మావగారు కేంద్ర మంత్రి నుంచి సిఫారసు చేయిస్తా నన్నారు అనేసింది .నిజమే సరైన సదుపాయాలు వున్నాయని నిర్దారించు కున్నాకే యి సారి మా స్టాఫ్ ని రిలీవ్ చెయ్యాలని నిర్ణ ఇంచుకున్నా .

22 నవం, 2009

పొరుగింటి పుల్లకూర


నిన్ననే 2012 సినిమా చూసా. మూడు రోజుల్లోనే వెయ్యి కోట్లు పైగా వసూల్ చేసిందంటే ఆశ్చర్యం వేసింది .భూకంపం వస్తుంటే కార్ దుసుకుంటూ పోతూ వుంటుంది .ఆ కార్ వున్న ప్రాంతం తప్ప మిగత చోట్ల భూమి చీలి పోతూ వుంటుంది .రోడ్ రెండు గా చీలి పోయి అఘాధం లా వస్తే హీరో కార్ ని జుంప్ చేసి అవతల పక్కకి తీసుకు పోతాడు .ఇంక చిన్న విమానం లో పారి పోయే సన్నీ వేసాల్లో లాజిక్ అన్న పదం ఉండనే వుండదు . ఇలాంటి హెలికాఫ్టర్ లో రైల్ ని చేజ్ చేస్తోనో , విలన్ గ్యాంగ్ హీరో ని చేజ్ చేస్తోనో , బాలకృష్ణ , చిరంజీవి ల సినిమాల్లో వస్తే తెలుగు ప్రేక్షకులు వెర్రి వెదవల్ల కన బడుతున్నారు ,చెవిలో పువ్వులు పెట్టుకుని చూడాలి ఇలాంటి తెలుగు సినిమాలు అనుకుంటూ reject చేస్తాం .
అదే విదేశీయులు కోట్లు కుమ్మరించి ఇదే సన్నివేశాన్ని తెరకెక్కిస్తే నోరు వెల్ల బెట్టి చూస్తాం .వొక పక్క తమ్మారెడ్డి భరద్వాజ లాంటి దర్శకులు తెలుగు లో దమ్మున్న మగాళ్ళు లేరు అని statements ఇచేస్తారు .దశావతారం లో కమల్ థీమ్ కి దీనికి తేడ నాకు పెద్దగా కని పించలేదు .ఎటొచ్చి యీ సినిమా విడుదల కి ముందు గానే నిజంగా యుగాంతం జరగ బోతోందా అంటు టీవీ లలో చర్చలు ,sms లు అంటు పిచ్చ హైప్ ఇచ్చివీలై నన్ని ప్రింట్స్ తో రిలీజ్ చేసుకుని డబ్బంతా మొదటి వారం లోనే రాబట్టు కోవడం యీ మద్య మొదలైన కొత్తట్రిక్ .యీ మద్య మీరు గమనిస్తే విడుదల కి ముందే ఏదో వొక కాంట్రవర్సి రగులుస్తూ , ఆ సినిమాకి విపరీతమైన ప్రచారం కల్పిస్తూ ,మాగ్జిమం ప్రింట్స్ తో విడుదల చేస్తే చాలు మొదటి వారం లో నే పైసా వసూల్. దియేటర్ లోకి జనాల్ని రప్పించడానికి ఇదో కొత్త పద్దతి .సినిమా బావుంటే ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది లేదంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి మొదటి వారం లో నే వచేస్తాయి .మగధీర నుంచి రేపు రాబోయే ఆర్య 2 దాక ఇలా వివాదాల లోకి లాగడమే .
ఇంకో జోక్ ఏంటంటే ఇన్ని కోట్లు పబ్లిసిటీ కి ఖర్చు పెట్టి 2012 ని విడుదల చేస్తే అదే సమయానికి హైదరాబాద్ లో 2010 అని ఇంకో సినిమా విడుదల చేస్తే చాల మంది confuse అయ్యి దానికి వెళ్లి బకరా అయిన వాళ్ళు వున్నారు . అసలు యీ సినిమాకి వెళ్ళడమే పెద్ద బకరా .యీ సినిమా చూడడమే పెద్ద స్టేటస్ సింబల్ గా తయారయ్యింది పిల్లలలో , దాంతో పెద్దలు కూడా తయారు .వొక్క ముక్కలో చెప్పాలంటే ఇది పొరుగింటి పుల్ల కూర . తెలుగు లో లాగే అక్కడక్కడ తండ్రి కూతురు సెంటిమెంట్ , విడిపోయిన ప్రియుడి సెంటిమెంట్ లాంటివి కూడా దట్టించారు .
అనట్టు ఇప్పుడే తెలిసిన వార్త నిజంగానే కలియుగం 2090 లో అంతం కాబోతోంది .అయితే ఇది రాసిన నాకు గాని చదివే మీకు గాని దాని వాళ్ళ జరిగే నష్టం సున్నా .ఎందుకో ప్రత్యేకం గా నేను చెప్పాలా?

15 నవం, 2009

మేకింగ్ అఫ్ ''విలేజ్ లో వినాయకుడు''







వెయ్యి మాటల ద్వార చెప్ప గలిగేది వొక్క ఫోటో తో చేపోచ్చని అనిపించి'' విలేజ్ లో వినాయకుడు'' షూటింగ్ ఫొటోస్ ఇక్కడ పెడుతున్నా . సినిమా చూసిన వాళ్ళకి ఏ సీన్ లో ఫోటోసో వెంటనే స్ఫురణకు వస్తాయి .మీలో కొంతమందైనా యి సినిమా చూసి మీ విలువైన అభిప్రాయం తెలియ బరిచే దాక ఇలానే వాయించ దలచు కున్నా .కొంచెం పెద్ద హృదయం చేసుకుని , సుజాత గారి లా చూసేసి కామ్ గా వుండకుండా రాయో , పువ్వో విసిరేయ ప్రార్దన .