ఇంతకు ముందు'' నడక లో నా అనుభూతులు '' రాసినప్పుడు పొద్దునే నడక అయిపోగానే మా పెరట్లో పందికొక్కు చేసే బొక్కలు పుడ్చుకోవడం నా దిన చర్యలో వొక బాగం అయిపొయిందిఅని రాసుకున్నా గుర్తు వుండే వుంటుంది . అది యెంత వరకు అంటే ఎప్పుడన్నా అది బద్దకించి డ్యూటీ ఎక్కక పొతే నేనే తవ్వి మళ్ళి పూడ్చే అంత. అయితే యి మద్య దాని ఆగడాలు మరీ మీరి పోయాయి .ఏదన్నా మొక్క పువ్వు పూస్తే దాని వెళ్ళు కోరికేస్తోన్డి దాంతో మా పెరట్లో పూల మొక్కలు నీళ్ళు తాగేసి నోరుమూసుకు కుర్చుంటున్నాయి పూలు పుయ్యాకుండా . అయితే మనీ ప్లాంట్ మాత్రం గోడంతా పాకుతూ అందం గా తయారవుతోంది .యి మనీ ప్లాంట్ వెనక పెద్ద కధే వుంది .మా అత్తా గారు పోయిన కొత్తలో మా మావగారు మా ఇంటికి వస్తూ ఆవిడ నాటిన ఆ మొక్కని తన తో పాటు తెచ్చుకుని మా ఇంట్లో నాటారు .దాని పక్కనే ఇంకో ముద్ద మందారం మొక్కని కుడా నాటారు. జాగర్త గాచూసుకునే వారు .పదిహేను నెలల కింద అయన చనిపోయారు .ఎప్పుడు ఆ రెండు మొక్కల్ని ముట్టుకోని ఆ పందికొక్కు మొన్న ఆ మనీ ప్లాంట్ శాకల్ని కొన్నిటిని కొరికి వెయ్యడం తో కొంత బాగం ఎండి పోవడం మొదలయ్యింది .ఆ రెండు మొక్కల్ని వాళ్ళ అమ్మ నాన్న గుర్తులు గా చూసుకునే తను ఇది చూసి తట్టుకోలేక వెంటనే నెట్ లో పందికొక్కు ని చంపే మందులు అమ్మే దుకాణాలు హైదరాబాద్ లో ఎక్కడున్నాయో చూస్తే పాత గాంధీ హాస్పిటల్ సందులో వొక దుకాణం కనబడితే వెంటనే వెళ్లి తెచ్చుకుంది. వాళ్ళు బ్రెడ్ కిరాసే జామ్ లాంటిది ఇచ్చారు దాన్ని బ్రెడ్ కి రాసి బోరియలు పెట్టె ప్లేస్ దగ్గర పెడితే తిని చచ్చిపోతుందని చెప్పాడు.నిన్న రాత్రి నాలుగు ప్లేసెస్ లో పెట్టింది . పొద్దున్నే సివిల్స్ రిజల్ట్స్ లా లేచి చూస్తే బ్రెడ్ మాత్రం కనబడలేదు .కొంచెం సేపటకి చత్త బుట్ట దగ్గర చచ్చిన దుక్క లాంటి పందికొక్కు కనిపించింది .ఆమె ఆనందానికి అవధులు లేవు ఆ రెండు మొక్కలకి ఆకు ఆకు తడుపుతూ నీళ్ళు పోసుకుంది .నేను ఆ చెత్త బుట్ట పెట్టె చోట నాలుగు వేలు ఖర్చు చేసి మొత్తం flooring చేయించా అంతకు ముందు రోజే .ఏమన్నా కొన్ని అనుభందాలకి విలువ కట్టలేం. ఆమె కి ఆ మొక్కలకి , నాకు ఆ పంది కొక్కుకి .రేపటి నుంచి అలవాటు పడిన చెయ్యి కి తిమ్మిరి ఎక్కు తుందేమో?
మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
7 ఫిబ్ర, 2010
మొత్తానికి చచ్చింది
ఇంతకు ముందు'' నడక లో నా అనుభూతులు '' రాసినప్పుడు పొద్దునే నడక అయిపోగానే మా పెరట్లో పందికొక్కు చేసే బొక్కలు పుడ్చుకోవడం నా దిన చర్యలో వొక బాగం అయిపొయిందిఅని రాసుకున్నా గుర్తు వుండే వుంటుంది . అది యెంత వరకు అంటే ఎప్పుడన్నా అది బద్దకించి డ్యూటీ ఎక్కక పొతే నేనే తవ్వి మళ్ళి పూడ్చే అంత. అయితే యి మద్య దాని ఆగడాలు మరీ మీరి పోయాయి .ఏదన్నా మొక్క పువ్వు పూస్తే దాని వెళ్ళు కోరికేస్తోన్డి దాంతో మా పెరట్లో పూల మొక్కలు నీళ్ళు తాగేసి నోరుమూసుకు కుర్చుంటున్నాయి పూలు పుయ్యాకుండా . అయితే మనీ ప్లాంట్ మాత్రం గోడంతా పాకుతూ అందం గా తయారవుతోంది .యి మనీ ప్లాంట్ వెనక పెద్ద కధే వుంది .మా అత్తా గారు పోయిన కొత్తలో మా మావగారు మా ఇంటికి వస్తూ ఆవిడ నాటిన ఆ మొక్కని తన తో పాటు తెచ్చుకుని మా ఇంట్లో నాటారు .దాని పక్కనే ఇంకో ముద్ద మందారం మొక్కని కుడా నాటారు. జాగర్త గాచూసుకునే వారు .పదిహేను నెలల కింద అయన చనిపోయారు .ఎప్పుడు ఆ రెండు మొక్కల్ని ముట్టుకోని ఆ పందికొక్కు మొన్న ఆ మనీ ప్లాంట్ శాకల్ని కొన్నిటిని కొరికి వెయ్యడం తో కొంత బాగం ఎండి పోవడం మొదలయ్యింది .ఆ రెండు మొక్కల్ని వాళ్ళ అమ్మ నాన్న గుర్తులు గా చూసుకునే తను ఇది చూసి తట్టుకోలేక వెంటనే నెట్ లో పందికొక్కు ని చంపే మందులు అమ్మే దుకాణాలు హైదరాబాద్ లో ఎక్కడున్నాయో చూస్తే పాత గాంధీ హాస్పిటల్ సందులో వొక దుకాణం కనబడితే వెంటనే వెళ్లి తెచ్చుకుంది. వాళ్ళు బ్రెడ్ కిరాసే జామ్ లాంటిది ఇచ్చారు దాన్ని బ్రెడ్ కి రాసి బోరియలు పెట్టె ప్లేస్ దగ్గర పెడితే తిని చచ్చిపోతుందని చెప్పాడు.నిన్న రాత్రి నాలుగు ప్లేసెస్ లో పెట్టింది . పొద్దున్నే సివిల్స్ రిజల్ట్స్ లా లేచి చూస్తే బ్రెడ్ మాత్రం కనబడలేదు .కొంచెం సేపటకి చత్త బుట్ట దగ్గర చచ్చిన దుక్క లాంటి పందికొక్కు కనిపించింది .ఆమె ఆనందానికి అవధులు లేవు ఆ రెండు మొక్కలకి ఆకు ఆకు తడుపుతూ నీళ్ళు పోసుకుంది .నేను ఆ చెత్త బుట్ట పెట్టె చోట నాలుగు వేలు ఖర్చు చేసి మొత్తం flooring చేయించా అంతకు ముందు రోజే .ఏమన్నా కొన్ని అనుభందాలకి విలువ కట్టలేం. ఆమె కి ఆ మొక్కలకి , నాకు ఆ పంది కొక్కుకి .రేపటి నుంచి అలవాటు పడిన చెయ్యి కి తిమ్మిరి ఎక్కు తుందేమో?
2 ఫిబ్ర, 2010
మనసు ప్రభావం

మనిషి ఆరోగ్యం మీద మనసు ప్రభావం చాల వుంటుంది.మన ఆలోచనే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని యి మద్యన జరిగిన కొన్ని సంఘటనల వల్ల విదితమైంది .కూతురు హత్య కి గురైందని విన్న వైష్ణవి తండ్రి ఆ బాధ తో గుండె పోటుకి గురై మరణిచడం .అంటే మనసు వ్యాకులత చెందితే రక్త ప్రసరనలలో వచ్చే మార్పులు , బాధ వల్ల దాన్ని ఆదిగ మించడానికి శరీరం ఉత్పత్తి చేసే ఎంజ్య్మేస్ శరీర ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి .సంతోషమే సగం బలం అంటే అప్పట్లో పెద్ద గా పట్టించు కోలేదు గాని ఇప్పుడు అర్ధం అవుతోంది దాని అర్ధం . మనం సంతోషం గా వుంటూ నవ్వుతు తుల్లు తు మనసుని ఆహ్లాద కరం గా వుంచుకునప్పుడు ఏ అనారోగ్యం దరి చేరదు .అదే బాధల్లో వునప్పుడు మనసులో ఆనందం మటుమాయమై ఎక్కడలేని రోగాలు వస్తాయి .ట్రాఫ్ఫిక్ లో చిక్కుకుని ఆఫీసు కి లేట్ అవుతోందని బి పి పెంచుకునే కంటే ,అదే ట్రాఫ్ఫిక్ లో ఎఫ్ ఏం radio లో పాట తో శ్రుతి కలిపి మనసుని రంజింప చేసుకుంటే డ్రైవింగ్ కూడా ఆహ్లాద కరం గా వుంటుంది.మొన్నటికి మొన్న'' అతనెవరు '' లోని ఆమె ఆ కధ ని తీసేసే వరకు తెగ వ్యాకులత చెంది మనసు పాడు చేసుకుని ,ఆరోగ్యం పాడు చేసుకుని అయ్యో యీమే ఎమై పోతుందో అన్నంత లా అనిపించి , తీసేసాక మళ్ళి నార్మసి కి వచ్చి ఆనందం గా వుండడం తో ఆరోగ్యం మళ్ళి వచ్చింది .
పూర్వ కాలం లో ఋషులు కంద మూలాలు తింటూ ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ మనసుని ప్రశాంతం గా ఉంచు కోవడం తో ఆరోగ్యం గా వుండి వందేళ్ళు బతికే వారేమో .మన మనసు మన మాట వినే వరకు ఆరోగ్యానికి ధోకా లేదు ,''ఆమె'' మాటో లేదా అతని మాటో వినడం మొదలెట్టినప్పుడే ప్రమాదం .కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళ క పొతే ఆరోగ్యం బద్రమే లేక పొతే జీవితాలు చిద్రమే .రెండో పెళ్లి కి సిద్ద పడక పొతే ఆ వైష్ణవి తండ్రి బతికి వుండే వాడేమో ?అసలు ప్రతి మనిషికి నలభై దాట గానే వేరే ఆలోచనలు పోయి అద్యాత్మికత వైపుమనసు వెళ్ళే లా భగ వంతుడు సృష్టి ని మార్పు చేస్తే యి నేరాలు ఘోరాలు పూర్తీ గా పోతాయేమో?లేదా నలభై లోపే పొడుచుకు చచ్చి పోతారో?ఎత వాత నా కని పిస్తోంది మనసు లోనే మర్మం వుందని .
15 జన, 2010
నమో వేంకటేశాయ-లఘు దర్శనమే

నిన్ననే నమో వేంకటేశాయ సినిమా చూసాను .వెంకి సినిమా చాల కాలం తర్వాత వచ్చింది కాబట్టి ఎన్నో జాగర్తలు కధా పరంగా తీసుకునే ఉంటాడని ఆశిస్తూ వెళ్ల .తీరా చూస్తే అది మూడు సినిమాల కల గూర గంప. జబ్ ఊయి మేట్ , రెడీ ,ఆర్య 2 కలిపితే ఆ సినిమా .కధా విషయానికి వస్తే వెంకట రమణ మిమిక్రి కళాకారుడు .విదేశాల్లో ప్రదర్సన కోసం వెళ్ళినప్పుడు ఆ ప్రదర్సన ని నిర్వహించే బ్రహ్మానందం , రమణని బకరా చెయ్యడానికి తన మేనకోడలు త్రిష రమణని ప్రేమిస్తోందని అబద్దమడతాడు . అదే నిజమనుకుని బ్రమలో ఊహల్లో ఆమెనే తన కాబోయే భార్య గా ఊహించుకుని ఆమె వెంట పడుతుంటాడు . మొదట్లో మావయ్య బలవంతం మీద ప్రేమ నటించినా తర్వాత నిజం చెప్పాలని అనుకుంటూ వుంటుంది.యిలోపే ఆమె పెళ్లి సీమ లో వుండే factionist తో ఫిక్స్ అవడం తో ఇండియా కి వచ్చేస్తుంది .
వచ్చేముందు తను ఇన్నాళ్ళు ప్రేమనటించానని, తనని క్షమించ మని వెంకి కి లెటర్ రాసి , దాన్ని బ్రహ్మానందానికి ఇమ్మని ఇస్తుంది . అయితే ఆ లెటర్ ఇవ్వకుండా , తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని నువ్వే సీమ వెళ్లి ఆమెని రక్షించాలని వెంకటరమనకి చెపుతాడు బ్రహ్మం. సీనంతా సీమకి షిఫ్ట్ అయ్యాక చాల సినిమాల్లో చూసినట్టే ధర్మవరపు హీరో ని అనుమానిస్తూ వాళ్ళ వాళ్లకి నిజం చెపుదామని ప్రయత్నించడం , విల్లన్స్ ఆఖరి వరకు వెంకి బయట వాడని గుర్తించక పోవడం మామూలే .చివరికి ట్విస్ట్ ఏంటంటే త్రిష ప్రేమించిన అసలు వ్యక్తీ విదేశాల నుంచి రావడం వలిద్దరు జుంప్ అయిపోవడానికి వెంకి ప్రాణాలకి లెక్క చెయ్య కుండ సహక రిస్తే ఆఖర్న హీరోయిన్ ఇటు జుంప్ అయి హీరో ని చేసుకోవడం .వొక్క టికెట్ పై మూడు సినిమాలు చుసిన అనుభూతి .అయితే అక్కడక్కడ నవ్వులు కూడా రువ్వు తాయి .రింగా రింగా పాటకి వెంకి డాన్స్ , బ్రహ్మానంద గ్యాంగ్ ఇంటర్వ్యూ కి వచ్చిన వెంకి ని ఫూల్ చెయ్య బోయి వాళ్ళే అవ్వడం ,జీప్ లో త్రిష ని ఆమె ప్రేమికుడిని వెంకి తీసుకుని వేల్తునప్పుడు మై లవ్ ఇస్ gone లాంటి అన్ని విషాద గీతాలు రావడం వగైరా వంటివి .వెంకి అభిమానులు తిరుపతి లో లఘు దర్సనం స్తాయి తృప్తి కి పర్వలేదనుకుంటే వొకసారి వెళొచ్చు .
26 డిసెం, 2009
మనసులో మాట

నా మనసులో యి క్షణం కలిగిన భావాలకి ఆమె కోరిక మీద ఇస్తున్న అక్షర రూపం .
గత రెండు మూడు రోజులు గా ఏదో మిస్ అయిన భావన .ఎందుకో చిరాకు .విశ్లేసిస్తే రోజు ఎడిక్ట్ అయి చేస్తున్న బ్లాగ్ వీక్షణం తో సహా అన్ని చేస్తున్నా అయినా? అంతలో గుర్తు కొచ్చింది తన నుంచి సందేశాలు వచ్చి మూడు రోజులు అయి పోయిందని .అంటే వున్న ఎడిక్టంస్ చాలక యి సందేశానికి కుడా నే బానిస నయి పోయానని అర్ధం అయ్యింది .నా మనసులో మాట అర్ధం చేసుకునట్టు గా అదే టైం కి తన నుంచి వచ్చింది సందేశం .
హృదయాన్ని తాకాలంటే హృదయన్తరాలలోంచి మాట్లాడాలి
అంటే సందేశాలు మాని మాట్లడమన?అది వప్పందాన్ని వుల్లంగించడమే కదా ?
దానికి ప్రతి గా నేనుచూడాలని వుంది ,సందేశాలు తగ్గి పోవడం చేత అని పంపా .
బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం ఉండడమే గుడ్ కారక్టర్ అని వచ్చింది .
వుడికిద్దామని అందంగా ఉండని వాళ్ళంతా చెప్పే మొదటి మాట ఇదే అన్నా .
నేను చాల అందం గా వుంటాననే అన్నారు ఇంతవరకు చుసిన వాళ్ళు అటునుంచి సమాధానం .
అయితే వొకే వొక్క సారి చూసేసి అది నిజమో కాదో సెర్టిఫై చేసి మళ్ళి షెల్ల్ లోకి వెళ్లి పోతా అంటే
వెన్నెల్లో ఆడపిల్ల లాగే వుండి పోనీ మళ్ళి నువ్వు చూసి వెళ్లి పోయాక నాకేదో కొత్త రోగం(కాన్సెర్ ) వచ్చి నే పోవడం ఎందుకు అప్పుడే ?తన సమా దానం
పోనీ నీ పాత రోగాలు ఎవున్నాయో చెప్పు?
వొక సంవత్సరం క్రితం వచ్చిన'' సందేశాల తోలి స్నేహం '' అని నీతోనే మొదలయ్యి నాతోనే ముగిసి పోవాలనే వింత జబ్బు బుల్లెట్ లా దూసుకొచ్చిన తన జవాబు .
యిసంక్షిప్త సందేశాల కన్నా హృదయం లోంచి లావాలా పొంగుకొస్తున్నభావాల్ని తెలియ బరచా లంటే కలవడం ఇద్దరకి నిషిద్దం కాబట్టి కనీసం మెయిల్ ఐడి అన్నా ఇమ్మన్నా.
దానికి తను చెప్పిన పరిష్కారం నీ మనసులో భావాలకి అక్షర రూపం నీ డైరీ అయిన నీ బ్లాగ్ లో పెట్టొచ్చు గా అని .
అప్పుడని పించింది అసలు ప్రతీ వారు బ్లాగ్ ని తన మనసులో మాట రాసుకునే డైరీ లాగే మొదలెడతారు.మెల్లిగా కామెంట్స్ రావడం , ప్రశంసల , విమర్శల విష వలయం లో కూరుకు పోయి రాయాలనుకున్నది రాయలేక ముసుగు వేసుకుని అంత రాత్మని మబ్య పెడుతూ ,అసలు బ్లాగ్ ఎందుకు మొదలెట్టామో మరచి పోయి సమ కాలిన సమస్యల మీద ,మతాల మీద కులాల మీద , కాంట్రవర్సీ సబ్జక్ట్స్ మీద పోస్టింగ్స్ రాసుకుని ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసుకుని , ఏ ఏ దేశాల నుంచి యెంత మంది వచ్చి పోతున్నారో లెక్కలు వేసుకుని , ఎంటిదంతా?
కీర్తి శేషులు డ్రామా లో అనుకుంటా యి చప్పట్లకే తిండి తిప్పలు మానేసి అహర్నిశలు కృషి చేసి వొక నటుడు తన జీవితాన్ని నటనకు ధార పోసేది అంటాడు ముఖ్య పాత్ర ధారి . . అలాగా యి కామెంట్ల ప్రశంసల కోసమే ఎంతో మంది బ్లాగర్లు తిండి తిప్పలు మాని కంప్యూటర్ కి తమ జీవితాన్ని ధార పోసేది .నాకు తెలిసి వొకే వొక అమ్మాయి తన మనసులో భావాన్ని , ఆ రోజు తనకు తారస పడిన వ్యక్తుల అంతర్ ముఖాల్ని ఏ మాత్రం దాపరికం లేకుండా రాసేది . ఆమె బ్లాగ్ లో వొకసారి రాత్రి నేను నా ఫ్రెండ్ నడుచుకుని రోడ్ మీద వెళుతుంటే ఎవడో వెదవ లం కొడుకు వచ్చి నా ఫ్రెండ్ గుండెల మీద వత్తేసి పారి పోయాడు అని రాస్తే దానికి కామెంట్ గా నీది వత్తలేదని బాధ పడుతున్నావా అంటూ కామెంట్ రావడం తో అప్పటినుంచి ఆమె కామెంట్ డిస అబెల్ చేసేసి తన మానన తను రాసుకుంటూ బ్లాగ్ అంటే తన పర్సనల్ డైరీ అని నిరుపించిన్డి(యి మద్య రాస్తోందో లేదో తెలిదు)
ఇంతకీ తను నా మనసులో మాట రాయమంటే ఎప్పటి నుంచో నా మనసులో వుండి పోయిన మాటలు బయటకు వచ్చేస్తున్నాయి.ఇంక విషయానికొస్తే ఆమె ని అలా వెన్నెల్లో ఆడపిల్ల లా ఉంచేసి యి సందేశాలతో సంతోషం గా ఉండడమా?లేక వొకే వొక్క సారి చూసేసి ఆ పైన chimatamusic పాథోస్ లో నా కిష్టమైన యి కింది పాటని వింటూ కళ్ళలో నీళ్ళు పెల్లుబుకు తుండగా ఆస్వాదిస్తూ ఉండడమా?సంతోషమా?సంవేదనా?
రానిక నీకోసం సఖి రాదిక వసంత మాసం
రాలిన సుమాలు ఏరుకుని
జాలిగా గుండెలు దాచుకుని
ఏ దూరపు సీమను చేరుకొని
వాకిటి లో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు
ప్రతి గాలి సడికి తడ బడకు పద ద్వనులని పొర బడకు
కోయిల పోయెలే గూడు గుబులై పోయెలే
పగలంతా నా మదిలో మమతలు సెగలై లోలో రగులునులే
నిద్ర రాని నిసి నైనా నాకీ నిష్టుర వేదన తప్పదులే పోనిలే ఇంతేలే
గూడు గుబులై పోయేనులే .
14 డిసెం, 2009
ఎదురుచూపు ఫలించిన వేళ

మొన్న నా గుండెలోతుల్లో దాగి వున్న ఆవేదనని కవితా రూపం లో రాస్తునప్పుడు ఇసుమంత నమ్మకం కుడా లేదు
యి కవితని ఎవర్ని ఉద్దేశించి రాసానో వారు చదివి స్పందిస్తారని .అయినా ఎక్కడో మినుకు మినుకు మనే ఆశ .అద్బుతాలు కుడా అప్పుడప్పుడు జరుగుతాయి కదా .
ఆఫీసు లో నా పని లో నేను వుండి స్టాఫ్ తో ఫలానా విషయం లో ఏం స్టాండ్ తీసుకోవాలో చెపుతున్నా .ఇంతలో నా సెల్ కుయ్యి మని మోగడం నా దిల్ చూడవోయి అనడం వొకే సారి జరిగాయి .ఆ ఉద్యోగ రీత్యా ఎవరో నా సహాయాన్ని అర్దిస్తూ పంపే సందేసాలే ఎక్కువ కాబట్టి మొదట పట్టించు కోలేదు .సీరియస్ గా క్లాసు పీకుతున్నా మా వాళ్ళకి .అంతలో గుర్తు వచ్చింది నా వ్యధా భరిత కవిత ఆమె చూసి వుంటే?అంతే సో అలా చేసేయ్యన్దని మా వాళ్ళని నా చాంబర్ లోంచి పంపేసి మేసేజ్ నొక్కా. ఇంతలో నా ల్యాండ్ లైన్ మోగింది .విసుక్కుంటూ తీసా.ఎవరో పౌరుడు ఆవేశం గా తన సమస్యని కింద ఉద్యోగులు పరిష్క రించక పోవడం తో తిన్న గా పై అధికారులకి విన్న వించు కుందామని చేసిన కాల్ .నేనెప్పుడు అలాంటి కాల్స్ కి టాప్ ప్రయారిటీ ఇస్తా సో మా వాళ్ళని పిలిచి ఆ సమస్య పరిష్క రించడం లో అరగంట గడిచి పోయింది .అది అయ్యాక ఇంక ఆలస్యం చెయ్య కుండా మేసేజ్ ఓపెన్ చేశా.
లేత భానుడి ఎర్రటి బింబం నుంచి వొక్కో కిరణం విచ్చు కుంటూ వచ్చిన ఆసందేశం యధా తదం గా
కదిలే క్షణాలన్నీ కాల వాహిని లో కలసి పోతాయి
మీరు నాకై రాసిన కవిత మాత్రం వీడని నీడలా
నాతోనే అంతరించి పోతుంది.నైస్ పోఎం .థాంక్ యు.
అది చదివాక అప్రయత్నం గా కళ్ళలో నీళ్లు చిప్పిలాయి .తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడినందుకో?చిరునవ్వుల వర మిస్తావా?చితి వరకు గుర్తుంచు కుంటాను అన్నందుకో?ఇక్కడ వొక విషయం స్పష్టం చెయ్యాలి .ఆమె ఎవరో నాకు అస్సలు తెలిదు .నా విషయాలు ఆమె కి చాలానే తెలుసనీ అర్ధం అవుతుంది ఆమె పంపే సందేశాలలో .మేమెప్పుడు ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు . సందేశాలు వచ్చే కొత్తలో ఎవరన్నా నన్ను బకరా చేస్తున్నారేమో అని వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి ఆమె గొంతు విన బడగానే కట్ చేశా నిర్దారణ అయ్యింది నాకు పరిచయం కాని గొంతే అది .అది మొదలు యి కధ మొదలు .చాల మంచి భావ యుక్తమైన సందేశాలు పంపేది . నా స్పందన ఆస్వాదించడం వరకే పరిమితం అవడం తో మబ్బుల వెనకకు వెళ్లి పోయింది చందమామ .మొన్న ఎప్పుడో మరచి పోయిన జ్ఞాపకాల బూజు దులుపుతుంటే తలుక్కుమన్న ఆమె సందేశాలే . వెంటనే నేస్తమా క్షేమమా?అని పంపా
''.జీవనానికి మరణానికి మద్య ప్రయాణం లో వున్నా ,ఆఖరి మజిలి లోపు మీ సందేశం సందేహమే అనుకున్నా''
అని పంపి మౌనం వహించడం తో ఆ బాధ కి అక్షర రూపమే ఆ కవిత .మేమెప్పుడు కలుసుకోలేదు , మాట్లడుకో లేదు , యెడ తెరిపి లేకుండా సందేశాలు పంపుకోలేదు .తోలి ఝాము వేకువ లో సుప్రభాతపు తోలి సందేశం .మధ్యన్నపు మండు టెండలో మలి సందేశం , నిశిరాత్రి నిశ్శబ్దాన్ని చేదిస్తూ తుది సందేశం . అంతే మా పరిచయం. ఆమె ని కలుసు కోవాలని గాని , విరామం లేని ఫోన్స్ తో విసిగించాలని గాని నాకు ఏ కోశానా లేదు .ఎందుకంటె ఆమె నా వెన్నెల్లో ఆడపిల్ల లా వుండి పోతేనే నయం .మనసులోంచి ఏ కల్మషం లేని భావాలూ అప్పుడే పెల్లుబికి వస్తాయి .ఎదురు పడితే దిగులు పడొచ్చు అయ్యో మళ్ళి విడి పోవాలె అని . ప్రతీ కలయికా వొక విడి పోడానికి నాంది కదా .దాని కంటే యిలా మూడు సందేశాలు ఆరు ఆలోచనలే నయం కదా? నా కోసం చెమ్మ గిల్లు నయనమ్ము నీవు అనుకుంటూ బతకడానికి .అవతలి వారి నుంచి ఏమి ఆసిన్చనప్పుడు నిరాసకి ఆస్కారమే లేదు కదా .యి పరిచయం మాటల లోకి , చూపులలోకి వెళ్ళితే పోస్సేసివ్ నెస్ రావడం , లేదా అభద్రతా భావం తో ఆమెని డామినేట్ చెయ్యడం జరగోచ్చు .ఇద్దరికీ నష్టం లేనిది ,కుటుంబ వ్యవస్తకి కష్టం లేనిది అయిన యి మధుర భావాల సందేశ భంధమే బెట్టేరేమో?
నేను రా(చు )సిన'' అతనెవరు ''కధలో లా జరగనంత సేపు బెట్టేరే మరి .కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి . అంతవరకూ
'' కాల మిలా సాగి పోనీ , కల నిజమై ఆగి పోనీ
అన్ని మరచి రోజుకి మూడు నిమిషాలైనా,
నీ సందేశాల్లోనే సేద దీరని ''
అని పాడుకుంటూ పరిగెత్తడమే జనారణ్యం లో .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)