
నిన్న లీడర్ ప్రేమిఎర్ షో కి వెళ్ళడం జరిగింది .శేకర్ కమ్ముల తన ప్రేమ పందాన్ని పక్కన పెట్టి సందేశాత్మకం గా వెళినట్టు గా కని పిస్తోంది .మొదటి సగం బాగా ఎక్కడా బోర్ కొట్ట కుండా తీస్తే రెండో సగం నిడివి ఎక్కువవ్వడం , సందేశాలు ఎక్కువ సరుకు తక్కువ అనట్టు గా తయారయ్యింది . సినిమా కాన్సెప్ట్ అవినీతి ని నిర్మూలించడానికి సి .ఏం అవడానికి హీరో అవినీతి పద్దతి లోనే డబ్బులు ఏం ఎల్ ఏ లకి పంచి సి ఏం అవడం అతని కజిన్ మళ్ళి డబ్బులు పంచి తను సి ఏం అవుదామనుకోడం ఆఖర్న అవినీతి డబ్బును ఏ సి బి దాడుల ద్వార బయటకు తీసి లక్ష కోట్లు దాక పోగు చేసి పీపుల్స్ ఫండ్ తాయారు చేసి ప్రజలకి ఏదన్నా చేద్దామనుకునే టైం కి రాజ కీయ సంక్షోబం వచ్చి ఎలెక్షన్ కి వెళితే హీరో విజయం సాధించడం తో కధ ముగుస్తుంది .దేశం లో బ్లాక్ మనీ చాల ములుగు తోంది దాన్ని బయటకు తీసి ప్రజలకి ఖర్చు పెడితే దేశం బాగు పడుతుందన్నది స్టొరీ లైన్ .మద్యలో తన పదవి కాపాడు కోవడం కోసం ఎక్కువ మంది ఏం ఎల్ ఏ ల సపోర్ట్ వున్నా వొక వర్గ నాయకుడి కూతుర్ని ప్రేమ లో పడేసి (ఇది మోసమే గా) తన పదవి నిలబెట్టుకుంటాడు .యిలా కధంతా పదవిని నిలబెట్టు కోడానికి వేసే ఎత్తులు , కారం చెడు దహన సంఘటన , ఎవరి సత్తా బట్టి వాళ్ళకి వృత్తులు నిర్ణయించడం జరిగిందని , అందులో పుట్టిన వాడు వేరే వృత్తులు పదవులు చేస్తా అంటే కుదరదని పెద్దాయన (కోట) చేత చెప్పించడం వివాదానికి ఆస్కారం వుంది .ఇందులో ఐటెం సాంగ్(?)లో ప్రముఖ ఏంకర్ ఉదయ భాను నర్తించి చీరలలో కాకుండా వలువలు తగ్గిస్తే తను ఎలాఉంటానో చూపింది .కామెడి ఎక్కడా లేదు కనీసం చిరు మంద హాసానికి కుడా .స్పీకర్ స్తానం లో వ్యక్తీ కూర్చోండి ప్లీజ్ సిడవును అనప్పుడు మాత్రం కొద్ది మంది నవ్వారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ని గుర్తు తెచ్చు కుని .అయితే రాణ దగ్గుపాటి నటన మాత్రం బావుంది ఎక్కడా కొత్త వాడన్న బెరుకు కన బడ లేదు .వాచకం విగ్రహం వెనక దన్నువున్నా కారణం గా పది కాలాలు సిని జగత్తు లో వెలగచ్చు . అయితే డాన్స్ లు చూసే అవకాశం యీ సినిమాలో రాలేదు . ఎక్కడ స్టెప్స్ లేవు .ఓవర్ అల్ గా కాలక్షేపం బటాని గా మిగిలి పోతుంది అది వేరే సినిమాలు లేక పోవడం బట్టి .


