11 డిసెం, 2011

ఏ సెల్లు పలికినా


మరి యింత బిజీ అయిపొయింది జీవితం .మనసులో భావాలకి అక్షర రూపం యివ్వలేనంతగా?అసలు పని వత్తిడి లో అందమైన భావాలకి అవకాశం ఎక్కడ ?వుద్యోగం లో కొన్ని ముఖ్య మైన పోస్ట్స్ చేస్తునప్పుడు మనకంటూప్రైవేటు సమయంవుండదు .కార్ లో డ్రైవ్ చేస్తూ కూడా యియర్ ఫోన్ లో మాట్లాడుతూ ఆదేశాలు యిస్తూ వుండాలి .ఏవి నిరుడు కురిసిన హిమసముహాలు అని పిస్తూ వుంటుంది .అప్పట్లో మన మనసుని ఆహ్లాద పరిచిన స్నేహితుల గొంతు సెల్ లో వినిపించినా యిది వరకులా మాట్లాడే అవకాశం ఉండక ముక్త సరిగా మాట్లాడి నేను మళ్ళి చెయ్యనా అంటుంటే ఆ కోయిల యింకొక మనసుని రంజింప చెయ్య దానికి ఎగురు కుంటూ వెళ్లి పోదా ?ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తు కొస్తున్నాయి .ఈ తెలుగు బ్లాగర్స్ దినోత్సవం సందర్భంగా కొంత సమయం కేటాయించి నిద్ర బోతున్న నా బ్లాగులో నా మనసులో భావాలూ రాసి కొత్త చలనం తీసుకోద్దామనే యి ప్రయత్నం .నేను యింతకు ముందు రాసుకున్న నిన్నటి నా నువ్వు లో లా సమయం కేటాయించా లేక పోవడం తో మనసులో భావాల్ని ప్రేరేపించ గలిగే స్నేహితులు వసంత కోకిలలు అయిపోయారు .సరే యింక ఆఫీసు విషయానికి వస్తే అదేంటో నా రూం లోకి రాగానే మా స్టాఫ్ సెల్ల్స్ మోగుతూ వుంటాయి .నేను ఫైల్ లోంచి తల ఎత్త కుండానే గమనిస్తూ వుంటా వాళ్ళ ప్రతిక్రియల్ని .ఎంతైనా సెల్లాలజి లో నిష్ణాతున్ని కదా .వాళ్ళ హావ భావ విన్యాసాల తో అవతలి పక్క మాట్లాడు తున్నది యింటి వాళ్ళా ?పక్కింటి వాళ్ళా ?స్నేహితులా ?కాంట్రాక్తర్లా అన్నది తెలుస్తూనే వుంటుంది .మొన్నొక సారి నలుగురు స్టాఫ్ (యిద్దరు ఆడ యిద్దరు మగ )నా రూం లో వాళ్ళ వాళ్ళ ఫైల్స్ తీసుకుని నిల బడ్డారు .అందులో వోకతని సెల్ వచ్చిన రెండు నిమిషాలకే మోగితే అన్నా యితని సెల్ మోగకుండా నా రూం లోంచి వెళ్ళిన నాడు మొత్తం ఆఫీసు అందరికి గ్రాండ్ మినర్వాలో లంచ్ యిస్తానని .అంతే కాకుండా యింకో పెళ్లి కాని అమ్మాయి ఫైల్స్ తో నిలబడి వుంటే అన్నా ఎప్పుడు కూడా తన సెల్ నా రూం కి వచ్చినప్పుడు మోగలేదు అని అభినందించా ( మోగ వలసిన ఈ అమ్మాయి సెల్ ఫోన్ ఎప్పుడు మూగ బోయి వుంటుంది ,అని మనసులో అనుకుంటూ ),మిగతా ముగ్గురు వెళ్లి పోయారు ఆమె ఫైల్స్ చూస్తుంటే ఆమె అసహనం గా కదలుతుంటే అడిగా ఎనీ ప్రోబ్లం ?అని సార్ అది అది నా సెల్ వైబ్రాటార్ మోడ్ లో వుంటుంది అంది .అదేంటి మీ డెస్క్ లో వున్న మీ సెల్ విబ్రేట్ అయితే మీరిక్కడ ప్రతిస్పందిస్తున్నారు అంటే నా చుడిదార్ కి పోకెట్స్ వున్నాయి సార్ అంటే యింకేలా react కావాలో తేలిక వొకే క్యారీ ఆన్ అనేసి ఫైల్స్ చూడడం లో నిమగ్నం అయిపోయా .కాని నా చెవులు ఆమె మాటల సారాన్ని గ్రహించేస్తున్నాయి ఖర్మ .మీ ఆవిడా వుంటే నాకేంటి వచ్చి తీరుతా మనిద్దరి మద్య వున్నది కేవలం స్నేహమే అని ఆమె కి కూడా తెలీని అంటోంది నేను అవతల ఫోన్ లో ఎవరి తోనో మాట్లాడు తున్నా అనుకుని .యింత పిరికి వాడివి ప్రేమించానని ఎందుకు మబ్య పెట్టావ్ నా మానాన్న నేను పెళ్ళిచేసుకుని హాయ్ గా వుండే దాన్ని గా అంటోంది కళ్ళలో కన్నీటి పొరలు .అప్పుడని పించింది ఏ సెల్లు సొల్లు వినినా ఎమ్మున్డి గర్వ కారణం ప్రతి సెల్లు పర పీడా ప్రేమాని తత్త్వం అని .కావాలనుకున్నది దొరకదు దొరికిన దాన్ని కావాలనుకోడు జీవితం అంతా మరిచికల్ని విచకలా భావించి ఎడారి ఎండలో మృగతృష్ణ లో నీటిని తోడే వృధా ప్రయత్నమే . నిరంతర అన్వేషణ లో ఆఖరి మజిలి ఎక్కడో మరి . ఆమె విషాద ప్రేమ కధ తెలుసుకోవాలనే కుతూహలం వున్నా అధికారపు యినప తెరలు అడ్డు పడి నేను కరెక్ట్ చేసిన డ్రాఫ్ట్ తీసుకుని రండి ఏవన్నా డ వుట్స్ వుంటే అడగండి అన్నా .ఆమె లో మళ్ళి అసహనం మొదలయ్యి యిబ్బంది గా కదులుతూ సారీ సార్ అంటూ ఫైల్ తీసుకుని బయటకి అడుగులు వేసింది .బయట పెద్ద గొంతు తోనే అరుస్తోంది ''నే వచ్చి తిరతా గో టు హెల్ '' అని .ఆ సాయంత్రం రాబోయే ప్రళయానికి సూచిక గా బయట ఉరుములు నా కిటికీ అద్దం లోంచి కని పిస్తున్నాయి .ఆమె కధని ఎప్పటికన్నా తెలుసుకుని రాస్తానేమో ?
http://ravigaru.blogspot.com/2010/12/blog-post.html





24 సెప్టెం, 2011

మల్లీశ్వరి కాదు


యింతకు ముందు వొక పోస్ట్ లో రాసాను''కరణంమల్లిస్వరేనా ?''అని కరణం మల్లీశ్వరి పేరు తో నా సెల్ కి కాల్ వచ్చిందని . ఆమె నిజం గా మల్లిస్వరో కాదో అని అనుమానిస్తూనే ఆమె పని చేసి పెట్టానని .ఆమె ఆమె కాదో అవునో ప్రోబ్ చెయ్యాలని .అంతటి తో ఆ విషయం మర్చి పోయా పని వత్తిడి వాళ్ళ యింక ద్రుష్టి సారించలేదు .అనుకోకుండా ఆఫీసు పని మీద మొన్న గురువారం ఢిల్లీ వెళ్ళ వలసి వచ్చింది . వెళ్ళిన పని వొక పూటలోనే అయిపోవడం తో పాలిక బజార్ లో తిరుగుతూ కరణం మల్లీశ్వరి నెంబర్ గుర్తుకు వచ్చి ఆమె కి సంక్షిప్త సమాచారం పంపా . అయాం అట్ ఢిల్లీ అని . ఎందుకంటె యింతకు ముందు ఆమె రెండో సారి కాల్ చేసి ఈ సారి ఢిల్లీ వస్తే మా యింటికి రండి అని ఆహ్వానించింది .నేనుకున్నది ఏంటంటే ఆమె వెంటనే కాల్ చేసి మా ఇల్లు ఫలానా ప్లేస్ లో వుంది మీరు రండి అని ఆహ్వానిస్తుందని . కాల్ లేదు నా సందేశానికి స్పందన లేదు .మా మిసెస్ కజిన్ వొక ఆమె నుంచి ఢిల్లీ ఎప్పు డెల్లారు ? హవె అ గుడ్ టైం అని సందేశం వచ్చింది .యింకో ఫ్రెండ్ మీరు ఢిల్లీ వెళ్ళినా మా దిల్లు లోనే వున్నారని .ఇదేంటి యిలా జనాలందరికీ మన ఢిల్లీ ట్రిప్ ఎలా తెలిసిందా అని చూసుకుంటే అంతకు ముందు వినాయక చవితి శుభాకంక్షల సందేశాన్ని కరణం మల్లీశ్వరి తో పాటు మరి కొంత మంది మిత్రులకి పంపా . మళ్ళి అదే మేస్సజ్ ఓపెన్ చేసి నా ఢిల్లీ సందేశం పంపితే అది మొత్తం అందరికి వెళ్లి పోయింది .నిన్న ఢిల్లీ నుంచి వచ్చేసి నా పని లో పడి పొతే , యిప్పుడే కరణం మల్లీశ్వరి సెల్ నెంబర్ నుంచి ఫోన్ చేసి హిందీ లో మీరెవరు ఢిల్లీ లో వున్నాను అని సందేశం వచ్చిందని అడిగింది .హమ్మ వెతక బోయిన తీగ కాలికి దొరికిందని నేను కూడా నేనెవరో చెప్పకుండా మీ స్నేహితున్ని కూడా గుర్తు పట్టలేరా ?అని గాలి లో బాణం వేసా . యింతకీ మీరెవరు అన్నా . అంతే కావలిసిన సమాధానం వచ్చేసింది . తన పేరు ఫలానా రెడ్డి(అంటే ఆమె పేరు ఫలానా రెడ్డి అని కాదు గోప్యత కోసం ఎస్ తో మొదలయ్యే మూడు అక్షరాల పేరు ని రాయలేదు )అని తెలుగు అమ్మాయినని చెప్పి మీరెవరో చెప్పండి అంది .అంతే నండి సాయం కావలిసి వచ్చినప్పుడు నా పేరు తో సహా ఉద్యోగ వివరాలు చెపుతారు పని అయిపోయాక కనీసం ఆ నెంబర్ కూడా సేవ్ చేసుకోరు . యిక నుంచి నేను మీ అజనభి కభి అల్విద నా కహేనా అని పెట్టేసా .యింక పొడిగిస్తే తాళం తప్పి పక్క దారి పట్టొచ్చని . . యింతకీ నా కర్దంయ్యింది ఏంటంటే ఈ ఫలానా రెడ్డి విశాఖ పట్నం లో పని చేస్తోంది ఆమె కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావాలి .కరణం మల్లీశ్వరి పేరు తో చేసినప్పుడు ఆమె అడిగిన సాయం చేసినప్పుడే యిలా ఫలానా రెడ్డి మంచి క్రీడాకారిణి హైదరాబాద్ లో వుంటే ఆమె కి తగిన గుర్తింపు వస్తుంది అందుకు ఆమెని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించండి అంటే చూద్దాం లెండి అని ఊరుకున్నా . యిప్పుడు ఆమె ఫోన్ లో తన పేరు చెప్పగానే అర్ధం అయ్యిపోయింది ఈ కరణం మల్లిస్వరే ఫలానా రెడ్డి అని . అయితే ఆమె నా నెంబర్ డిలీట్ చేసెయ్యడానికి బహుశా నేనుకునే కారణం ఆమే కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు మీరు కరణం మల్లీశ్వరి కాదని నాకు తెలుసు లెండి , ఆమె వాయిస్ ని నేను నెట్ లో విన్నాను మీ యిద్దరి గొంతులకి పొంతన లేదు మీకేమి కావాలో చెప్పండి అంటే లేదండి హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తా అప్పుడు నమ్ముదురు అని పెట్టేసింది . కని పెట్టేసానని డిలీట్ చేసి ఉండొచ్చు .
ఫైనల్ గా నే చెప్పేదేమంటే సెల్ లో నేను ఫలానా అని చెప్పే ప్రతి వాళ్ళు ఫలానా కాక పోవచ్చు మనం వాళ్లే అనుకుని ఉబ్బి తబ్బిబు అయిపోయి బ్రమల్లో ఉండకుండా , సెల్ లో అయినా చాట్ లో అయినా వారి చాటు మాటు విషయాల్ని కని బెట్టక పొతే ముందు మన తెర చాటు విషయాలు వాళ్ళు కని బెట్టేసి మనం వాళ్లతో మాట్లాడుతున్నది వాళ్లతో సహా ఏ టీవి నైన్ లోనే మన కుటుంబ సబ్యులతో సహా అందరు వినే అవకాశం ఎప్పుడు వుంటుంది . తస్మాత్ జాగర్త .

17 సెప్టెం, 2011

అవధూతలు వుంటారు

మొన్న ఏదో పని మీద అమలాపురం వెళ్ళవలసి వచ్చింది .ఎప్పటి నుంచో మా సీనియర్ సహచరుడు వొక ఆయన అక్కడికి వెళ్లి నప్పుడు వీలుంటే దగ్గరలో ఐనవల్లి దగ్గర మూలపోలం అని వొక వూరు వుంది అక్కడ వెంకన్నబాబు అని వొక స్వామి వున్నారు మనిషిని చూడగానే మనసులో వున్నది చెప్పేస్తారు .మీరనుకున్తున్నది అవుతుందో లేదో కూడా చెప్పేస్తారు .ప్రయత్నించండి అన్నారు .యిది చెప్పి కూడా నాలుగేళ్ళ పైన అయిపొయింది .మేము వెళ్ళిన పని తొందరగా అయిపోవడం తో ఆ పని అవడం లో సహకరించిన పెద్ద మనిషిని యధాలాపం గా అడిగా మూలపోలం ఎక్కడో తెలుసా అని పెద్ద ఆశలు ఏవి పెట్టుకోకుండా . ఎందుకంటె అంతకు ముందే మా కార్ డ్రైవర్ ని అడిగితె తెల్ల మొహం వేసాడు .వెంటనే ఆయన సార్ నేనెప్పుడో యిరవై రెండేళ్ళ క్రితం వెళ్ళా మీకభ్యంతరం లేక పొతే నేను వస్తా అంటే మా ఫ్యామిలీ తో పాటే ఆయన కూడా డ్రైవర్ కి దారి చూపిస్తూ మద్యలో కనుక్కుంటూ చివరికి మద్యాన్నం మూడు గంటలకి వారింటికి చేరు కున్నాము .శనివారం , ఆదివారం ,మంగళవారం మాత్రమె ఆయన స్వామి ఆవాహన పొంది పూజా పీటం లో ఆహుతుల మనసులో ప్రశ్నలకి సమాధానం చెపుతారు . ఆ రోజు మంగళవారం అవడం తో అప్పటికే హాల్ నిండా వొక యాభై మంది దాక కుర్చుని వున్నారు .నా విసిటింగ్ కార్డు పంపడం తో కొంతసేపటి తర్వాత మా కుటుంబాన్ని ప్రత్యేకం గా వేరే గదిలో కూర్చో బెట్టారు .అక్కడ గొప్పతనం మన హోదా దీ కాదు వేంకటేశుని అనుగ్రహమే అని తర్వాత నాకు అర్ధంఅయ్యింది .ఆ గది లోకి కూడా యింకో మూడు నాలుగు కుటుంబాలు (చుట్టుపక్కల గ్రామాల్లో ప్రముఖులు )వచ్చి చేరాయి .అక్కడ గదిలో గోడలకి వేలాడదిసిన స్వామి ఫోటోల పక్కన పసుపుబట్టలతో వున్న యియన ఫోటోలు కూడా కని పిస్తే మా శ్రీమతి ఉండబట్టలేక ఏంటో వీళ్ళంతా దేవుడి తో సమానం గా ఫోటోలు పెట్టేసుకుంటారు వీళ్ళు కూడా దేవుడంతా గొప్ప వాళ్ళని అనుకుంటారా అని మెల్లగా అంది .టైం అప్పటి కే అయిదయింది . అయన బయటకు రాలేదు . నా కేమో రాజముండ్రి వెళ్లి గౌతమి పట్టుకోవాలి ట్రైన్ మిస్సవుతుందేమో అని భయం .చివరికి అయిదు ఇరవైకి పొట్టి గా చామన చాయ కలర్ తో పసుపు బట్టలతో సాధారణ వ్యక్తీ లా అనిపించే వ్యక్తీ వచ్చారు .అందరు ఆయన కి నమస్కరించి ఆశ్వేర్వచనం పొందు తుంటే నన్ను నేను పరిచయం చేసుకుని ఎప్పటి నుంచో రావాలనుకుంటే యిప్పటికి కుదిరిందని చెప్పా . దానికి ఆయన చిరునవ్వుతో స్వామి అనుకున్నప్పుడే అనుసంధానం చేస్తారు మీరు లోపల పూజా మందిరం లో ప్రశ్నకి సమాధానం విని వెళ్ళండి అన్నారు .యింక ఏమైతే అది కాని ట్రైన్ మిస్ అయితే మిస్ అవని విని వెళదామని ఆగాము . అక్కడ పూజ మందిరం లో వెంకటేశ్వర విగ్రహం అమ వారి విగ్రహాలు చక్క గా దండలతో అలంకరించ బడి వున్నాయి .అక్కడి వాత వరణం లో కూడా ఏదో శక్తి వున్న అనుభూతి కల్గింది.ముందుగా మమ్మల్ని పూజా మందిరం లోకి పిలచి తీర్దం యిచ్చారు . వెనకే మిగతా వాళ్ళు కూడా వచ్చి చేరారు . కొద్ది సేపటికే ఆ గది ఇరుకు గా మారి చిన్నప్పటి తోపులాటకి సిద్దం గా మారింది .యింకా హాల్ లో జనం మేమెప్పుడు బయట కోస్తామా వాళ్ళు దూరోచ్చని చూస్తున్నారు .యింతలో ఆయన కళ్ళు మూసుకుని దండం చేత్తో పట్టుకుని తన ఎదురు గా వున్న ఆమెతో ''ఏమి ఆశించి వచ్చావు స్వామి దగ్గరకి ?అనారోగ్యం తో బాధ పడుతున్న నీ కొడుకు ఆరోగ్యం గురుంచి వచ్చావా ?యింకా నలుగురు డాక్టర్లు మారాక తగ్గుతుంది . పూర్వ జన్మ ప్రారబ్దం అనుభవిస్తున్నాడు .సహనం వహించు నే చూసుకుంటా వెళ్లిరా '' అనగానే ఆమె ఆనంద భాస్పాలో కళ్ళ నిళ్లో తెలీని స్తితి లో తుడుచుకుంటూ ముందుకు జరిగింది . ఆమె వెనక వచ్చిన అతనికి నీ వ్యాపార విషయం లో ఆందోళన చెందకు ఆరు నెలల్లో అంతా సద్దుకుంటుందని చెప్పడం జరిగింది .
అలా జనం వోకర్ని వొకరు తోసుకుంటూ ఆయన ముందుకు వస్తుంటే ఆయన వాళ్ళకేసి చూస్తూ మనసులో మాటని చదువుతూ పరిష్కారం చెపుతున్నారు .యింక నా వంతు వచ్చింది .స్వామి శక్తి రూపమా ?విష్ణు రూపమా ?అని ఆలోచిస్తున్నావు (నా బుర్రలో ఈ సందేహం ఎప్పటి నుంచో వుంది స్వామికి శుక్ర వారం అభిషేకం చెయ్యడం లో అర్ధం శక్తి రూపమే అని )ఆది శక్తి శివ శక్తి రెండు నేనే .నీ పూజలు అలాగే కోన సాగించు .నీ మంచి మనసు ,ఇతరులకి సహాయ పడే గుణాన్ని బట్టే నీకు ఉద్యోగం లో మార్పు వచ్చింది .అందులో మంచే జరుగుతుంది . నీకు డిసెంబర్ రెండో వారం లోపు పదోన్నతి వస్తుంది .వెళ్లి రా . అని చెపుతుంటే నా కళ్ళలో ఆనంద భాష్పాలు జల జలా రాలాయి .ఎందుకంటె నేను నోరు తెరచి ఆయనని ఏమి అడగ లేదు . అదికాక యి విషయాలు యిన్కేవరి తోనూ చర్చించలేదు . అందుకే వొక విధమైన ట్రాన్స్ లోకి వెళ్లి పోయి బయటకు వచ్చా . మా శ్రీమతి విషయం లో కూడా నీ దగ్గర మోసపురితం గా వొకడు డబ్బు తీసుకున్నాడు అది నీకు మార్చి లో వస్తుందని చెప్పినప్పుడు ఆశ్చర్య పోవడం ఆమె వంతయ్యింది . ప్రస్తుతం ఆ వివాదం కోర్టు లో నడుస్తూ మా కనుకూలం గా తీర్పు వచ్చింది .ఆయన గురించి మా తో పాటు వచ్చినాయన ద్వార మరిన్ని విషయాలు తెలుసు కున్నాము . ఆయన చాలా ఏళ్ళ క్రితం నుంచే అవధూత లా వ్యవహరిస్తున్నారని బ్రహ్మ చారి లా వుంటూ తన దగ్గరికి వచ్చే వాళ్ళ యితి భాధలు తీరుస్తున్నారని చెప్పాడు .అయితే ఆయన శిష్య గణం కొంత అతి గా వ్యవహరిస్తున్నరేమో అని పించింది .వొక పక్క యియన ప్రశ్న సమాధానం చెపుతూ వుంటే గట్టి గా అరుస్తూ జనాల్ని కంట్రోల్ చెయ్యడం , మాట్లాడడం వంటివి చెయ్యడం జనాలు పళ్ళెం లో వంద అయిదు వందల నోట్లు వెయ్యగానే తీసి బిందె లాంటి హుండీ లో వెయ్యడం వంటివి .అవధూతల దగ్గర శిష్యగణం వారి మహిమల్ని ధన రూపం లోకి మారుస్తూ వుంటారేమో ?
ఈ ట్రిప్ లో నాకర్ధమయ్యింది ఏమిటంటే అవధూతలు అక్కడక్కడ యింకా వున్నారు వాళ్లతో అనుసంధానం అయ్యే సమయం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు .మరి అంతవరకూ మేర నంబర్ కబ్ ఆయే గా అనుకోవడమే .

17 ఆగ, 2011

నిజం గా కరణం మల్లిస్వరేనా ?

http://im.in.com/connect/images/profile/s_profile3/Karnam_Malleswari_65.jpg
నిన్న పొద్దున్నే ఆఫీసు కి వెళ్లి సీట్ లో కూర్చున్నానో లేదో సెల్ మోగింది .ఏదో తెలీని నంబర్ . అప్పటికి యింకా బిజీ కాక పోవడం తో ఎత్తా .అవతలి పక్కనుంచి ఆడ గొంతు .నేను కరణం మల్లిస్వరినండి మీ హెల్ప్ కోసం చేశా అని వినిపించింది .ఇప్పుడున్న సెల్ టెక్నాలజీ లో మగ గొంతు ని కూడా ఆడ గొంతుకు గా మార్చి మాట్లాడించడం సాధ్యమే కాబట్టి నేను మామూలు గా చెప్పండి అన్నా . . నా స్పందనకి ఆశ్చర్య పోయిన ఆమె నేను వోలిమ్పిక్ విజేతనండి అంది .
ఏమో లెండి కాక పొతే నేను బకరా అవ్వడం ఎందుకు , చెప్పండి ఏమి చెయ్యాలి అన్నా .వాళ్ళ తల్లి దండ్రులు యింక కొంత మంది కుటుంబ సబ్యులకి అత్యవసరం గా ఏదో సాయం కావాలంటే వివరాలు తీసుకుని మళ్ళి కొంత సేపటికి పని అయిపోయిందని చెపితే ఆమె చాలా సంతోషం గా మీకు ధన్యవాద్ అంది . అదేంటి మీరు తెలుగమ్మాయి కదా మీ భాష నార్త్ వాసన కొడుతోంది అన్నా . చినప్పటి నుంచి ఢిల్లీ లో శిక్షణ తీసుకోవడం తో తన తెలుగు కు తెగులు వచ్చిందని చెప్పింది .వాళ్ళది ఆముదాల వలసని ప్రస్తుతం ఎఫ్ సి అయి లో పని చేస్తూ ఢిల్లీ లోనే ఉంటున్నానని చెప్పింది .ఆమె మంచి మాటకారి సెల్ లోనే యిద్దరం పావు గంట హస్కు వేసుకున్నాం.వోలిమ్పిక్ మెడల్ తర్వాత అత్యంత ఆనందం పొదింది యీ క్షణమే ,అత్యవసర పరిస్తితులలో నా తల్లి దండ్రుల అవసరాన్ని తీర్చారు . అంటే భలే వారే నేను సైతం వోలిమ్పిక్ విజేత కి సాయ మొకటిని ఆహుతిచ్చా అన్నా . ఈసారి ఢిల్లీ వస్తే మా యింటికొచ్చి మా ఆతిద్యం స్వీకరించండి అంది . నేను కూడా హైదరాబాద్ వస్తే మీ ఆతిద్యం స్వీకరిస్తా అన్నా .దానికామె నవ్వేసి హైదరాబాద్ వస్తే ముందు సుబ్బిరామి రెడ్డి గారు వదలరు అయినా కూడా మీకు ధన్యవాదములు అంటూ ఫోన్ పెట్టేసింది .
యింతకీ ఆమె నిజం గా కరణం మల్లిస్వరేనా ?ఈ రోజు మళ్ళి చేసి చెక్ చేద్దామనుకున్నా గాని వీలు చిక్క లేదు . యింకో సారి ఫోన్ చేసి రాధ గారు వున్నారా అండి అని సెల్ లో అడిగితె లేదండి నేను కరణం మల్లిస్వరినండి అంటే వొకే కాదండి సుధ ని అంటే నే గొంతు లో పచ్చి వెలక్కాయ , చూడాలి ఏమవుతుందో ?

11 ఆగ, 2011

కొత్త పరిచయాలు -కొత్త విషయాలు


ఈ మద్య వుద్యోగం లో పోస్టింగ్ మారి మరింత బాద్యత పెరగడం తో బ్లాగ్ వైపు ద్రుష్టి సారించలేక పోతున్నా . అయితే ఈ రోజు మెయిల్ చెక్ చేస్తుంటే వొక అజ్ఞాత మీ బ్లాగ్ లో మీ కధానికలు లేక వేల వేల బోతోందంటే స్పూర్తి పొంది యిది రాస్తున్నా .వొక పది నెలల క్రితం వొక ఆమె ప్రభుత్వ పని రీత్యా నన్ను కలవడం జరిగింది .ఆమె కి ముప్పై అయిదేళ్ళ దాక ఉండొచ్చు .పొట్టి గా వున్నా తెల్ల గా బొద్దు గా అందం గానే వుంది .వాళ్ళ అబ్బాయిని కూడా వెంట బెట్టుకుని రావడం తో నిర్భయం గా కూర్చో మన్నా .ఆమె ప్రభుత్వ కార్యాలయాలు మూసేసే టైం కి రావడం తో నేను మా ప్యూను తప్ప మిగతా సిబ్బంది లేరు . ఆమె తన సమస్య చెప్పుకున్నాక పరిష్కారం చేసి స్టాఫ్ వెళ్లి పోవడం తో మర్నాడు ఉదయం మళ్ళి రావాల్సి వుంటుంది అని చెప్పా .ఈ మద్యలో ఆమె హావ భావ విన్యా సాలలో ఉత్సాహం ఉత్సుకతఎక్కువ గా కని పించాయి .(మరి నా చూపులు కూడా అపబ్రంసము చెంది ఉండ వచ్చు ). తన సొంత విషయాలు ఆమె చెప్పడం మొదలెట్టా గానే వాళ్ళ అబ్బాయి మమ్మీ పోదాం పోదాం అంటూ వొకటే నస .(వాళ్ళ నాన్న గారు యిచ్చిన ట్రైనింగ్ ఏమో).యింక చేసేది లేక వస్తానండి మళ్ళి రేపు రావడం కుదరదు మా కంపని స్టాఫ్ ని పంపుతా మీ సెల్ నంబర్ యిస్తే మీకు ఫోన్ చేసి పంపుతా అంటూ నా నంబర్ తీసుకుంది .అదిగో అలా మొదలయ్యింది కొత్త పరిచయం .పని అయిపోయాక థాంక్స్ అని ఫోన్ చేసి పెట్టేస్తే అక్కడి తో కధ కంచి కే అనుకున్నా ,మళ్ళి పది రోజులకి తనే మళ్ళి ఫోన్ చేసి ఏమండీ గుర్తు పట్టరా అంటే ఆమె పేరు తో పిలిచి మిమ్మల్ని వొక్క సారి చుసిన వాళ్ళు ఎవరన్న మరిచి పోతారా అన్సా .దానికామె అబ్బా నా పేరు తో సహా గుర్తు పెట్టుకున్నారు అంది .(ఆమె చేసిన రోజే నంబర్ సేవ్ చేసానని ఆమె కి తెలీదని నేననుకోను . )తనకేదో మళ్ళి సాయం కావాలంటే చేసి పెట్టా .అది మొదలు రోజు పదకొండు గంటలకి మిస్సేడ్ కాల్ యిచ్చేది .మనం చెయ్యగానే గంట వాయించేది .తను చేస్తే బిల్ ఎక్కువయితే వాళ్ళ ఆయన స్కాన్ చేస్తాడని చెప్పేది .తన ద్వార నాకు తెలిసిన కొత్త విషయాలు ఏంటంటే కృష్ణ కాంత్ పార్క్ లో వాకింగ్ కి వెళితే బకరా గాళ్ళు ఎక్కువ అని .తనని చూసి పెళ్ళికాని వాళ్ళ నుంచి పెళ్ళయిన వాళ్ళు కూడా చొంగలు కార్చుకున్టారని .ఎలాగో అలాగా పరిచయం పెంచుకుని పది నిమిషాల్లో సెల్ నంబర్ అడగ గానే యివిడ కూడా ధారాళం గా ఇచ్చేసేది .అలా నంబర్ తీసుకున్నా వాళ్ళలో టీ వి సీరియల్ హీరో లు విలన్లు , అప్కమింగ్ హీరో లు , వ్యాపార వేత్తలు వుండే వారు .అదేంటి అలా నంబర్ ఇచ్చేసారు అంటే నాదెం పోయింది వొక గంట సోది వాగుతాడు నెల అయ్యాకా బిల్లు చూసుకుని వాడే మానేస్తాడు అనేది .నాకర్ధం అయ్యింది ఏంటంటే వాళ్ళు నఖ శిఖ పర్యంతం ఈమె అందాల్ని వర్ణిస్తూంటే ఈమె రాణి లాగ ఫీల్ అయ్యి వాళ్ళని మాట్లాడ నిచ్చేది ఎవడన్న నాలాంటి వాడు సూక్తి ముక్తావళి మొదలెడితే వుంటానండి మా వాడు వచ్చే టైం అయ్యింది అని కట్ చేసేది , మళ్ళి చేస్తే మాత్రం బిజీ అని వచ్చేది .ఈ బకరాల లో వొక బకరాప్రైవేటు బ్యాంకు లోమాంచి ఉద్యోగం చేసుకుంటూ వుండే బ్రాహ్మిన్ బ్రహ్మ చారి .రోజు గంటల తరబడి సెల్ లో సొల్లు,కాళ్ళు అరిగి పోయేలా పార్క్ లో నడక .రేపు నా బర్త్ డే అందుకే వాకింగ్ కి రాను అంటే ఈ బకరా మర్నాడు డైమోండ్ రింగ్ కొని వాళ్ళింటికి వెళ్లి ఆమె వేలికి స్వయం గా తొడిగి కాలింగ్ బెల్ మొగ గానే గజ గజా వణికి ఆ వచ్చిన వాడి చేతిలో కూడా గిఫ్ట్ వుండి , వాడు నోరు విప్పే లోపే మా కజిన్ అని పరిచయం చేసినా గ్రహించ కుండా వెళ్లి పోయి మళ్ళి అయిదు నిమిషాలకే ఫోన్ చేసి నా గిఫ్ట్ నచ్చిందా అని అడిగితె, ఆ ఆ మళ్ళి మాట్లాడతా మా కజిన్ వున్నాడు అని చెప్పి కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్ళని కర్చీఫ్ తో తుడుచుకుని మర్నాడు మళ్ళి మామూలే .ఆది వారం పొద్దునే ఈమె వేరే యింకో వ్యక్తీ తో కలిసి మాంసం దుకాణానికి వెళ్ళిన సమయం లో ఈ బ్రహ్మ చారి బకరా ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగితె ఫలానా మాంసం దుకాణం లో అని చెప్ప గానే యీ క్షణమే నిన్ను చూడాలని వుంది అంటూ రెక్కలు కట్టుకుని వాలి పోయి పక్కనే యింకో వ్యక్తీ వున్నా కూడా అదేమీ పట్ట నట్టు గా ఆ సంచి యిలా యియ్యి అంటూ యింటి వరకు మోసుకొచ్చే వాడు .ఆ పక్కనున్న వ్యక్తీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ తోడూ గా మాంసం దుకాణానికి వస్తు ఉంటాడు ఆది వారం, నువ్వు బ్రాహ్మిన్ కదా యిలా ఈ సంచి మోస్తూ రాకు ఎవరన్న చూస్తే బావుండదు అని అంటే అమాంతం ఆ సంచి లోంచి పచ్చి మాంసం ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుని నమిలి మింగేసి చాలా యిప్పు డన్న నా ప్రేమని నమ్ము తావా ?యింక చాలు మీ ఆయన్ని వదిలేసి వచేయ్యి మొన్న నేను నీ దగ్గర దాచిన పది లక్షలు పట్టుకుని ఏ అస్సామో వెళ్లి హాయి గా కాపరం చేసుకుందాం ఎవరు గుర్తు పట్టరని యిత గాడి ప్రపోసల్ .ఆ తర్వాత ఇతను ఎప్పుడు చేసినా మీరు డయలు చేసిన నంబరు మరోసారి చూసుకోండి అనే వచ్చేది . (అదే ఆమె రింగ్ టోన్ గా పెట్టుకుందని యితనికి తెలిదు ). ఎప్పుడు యింటికి వెళ్ళినా ఎవరో వొక గెస్ట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ బహుమతులు పట్టుకుని కూర్చుని వుండేవారు .ఇతను తాగుడు కి బానిస అయి పోయి ఉద్యోగానికి సరిగా వెళ్లక వున్న వుద్యోగం వూడి పోయి ఈమె యింటికి వెళ్లి నా డైమొండు డబ్బులు యిచ్చేయ్యి అని అడిగితె నీకు నిజం గా నా మీద ప్రేమ వుంటే ఆ రెంటిని మన ప్రేమకి గుర్తు గా వదిలేసి నా జీవితం లోంచి వెళ్లి పో అని వెర్రి వెదవ ని చేసి పంపేసింది .
కొంత మంది ఆడవాళ్ళకి ఎప్పుడు తమ అందాన్ని పొగిడే మగాళ్ళు కావాలి , మళ్ళి వాళ్ళు కొంత కాలమే .మళ్ళి కొన్నాళ్ళు పోయాక మళ్ళి యింకో కొత్త మగాళ్ళు పరిచయం అవ్వాలి .మరిన్ని బహుమతులు తేవాలి .అసలు ఆరెంజ్ డైరెక్టర్ భాస్కర్ కూడా ఈమె భాదితుడయ్యాక కధ రివెర్స్ చేసి సినిమా తీసాడా అని పించింది .అయితే ఆమె కి నా కు గత ఆరు నెలలు గా సెల్ సంభంధాలు తెగి పోయాయి .ఎందుకంటె రేపు నా బర్త్ డే మీకు సెల్ లో దొరకను అని ఆమె అనడమే నా మౌనానికి కారణ మేమోతెలిదు .జూన్ లో తన బర్త్ డే కి బకరా గాడు డైమండు యిచ్చా డని తను చెప్పిన విషయం నేను యింకా మర్చి పోలేదు కాబట్టి .