17 డిసెం, 2011

ఆమె తోటి మాటుంది





సుధ అలాచేస్తుందని అనుకోలేదు .తెలిసిన దగ్గరనుంచి మనసు కకా వికలం అయిపొయింది .ప్రాణ స్నేహితుడని పరిచయం చేస్తే వెంకట్ కూడా చివరికి నా పరోక్షం లో ఆమె యింటికి వెళ్లి , ఛి ఛి తలచుకుంటేనే చాలా కోపం గా , కసి గా వుంది . అసలు తప్పంతా నాది ఏదో ఆఫీసు పని మీద వెంకట్ హైదరాబాద్ పొద్దున్నే వచ్చి మధ్యాన్నం వెళ్ళిపోతానంటే , నేనే అనవసరం గా నా ఫాక్టరీ కి వస్తే అక్కడినుంచి సుధా వాళ్ళింటికి వెళ్లి లంచ్ చేద్దాం అన్నా .తీరా తను ఫోన్ చేసిన టైం కి ఫ్యాక్టరీ తనిఖి కి అధికారులు వస్తున్నారంటే వీలు పడక యింకో సారి వెళదామని చెప్పేసా . తీరిక చిక్కాక సుధ కి ఫోన్ చేస్తుంటే ఎత్త లేదు . ఎన్ని సార్లు చేసినా స్పందన లేదు .అలా ఎప్పుడు జరగదు ,నా కాల్ కోసమే వేచి వుండే దానిలా ఎప్పుడు వొకటి రెండు రింగ్స్ లోపే ఎత్తేస్తుంది . అలాంటిది ?భర్త పిల్లలు వెళ్ళిపోగానే యింట్లో పనులు చేసుకుంటూ నాకు తీరిక దొరికినప్పుడు సెల్ చేస్తే మనస్పూర్తిగా ప్రేమ పూర్వకం గా మాట్లాడేది .కొంప తీసి తనకేమి కాలేదు గదా .మనసు ఏదో కీడు ని సంకిస్తోన్డి . కీడెదో నాకే అని క్షణం లో నాకు తెలిలేదు .
పాపం వెంకట్ కి సుధ వాళ్ళింట్లో లంచ్ ప్రోమిస్స్ చేశా , ఫాక్టరీ లో పని వల్ల కనీసం కలవడం కూడా పడ లేదు అనుకుంటూ తన సెల్ కి ఫోన్ చేశా ఆశ్చర్యం రింగ్ పోతున్నా మీరు మాట్లాడ దాల్చిన కస్టమర్ ప్రస్తుతం స్పందించడం లేదు అనే వస్తోంది .అవును మరి వేరే చోట స్పందిస్తున్నప్పుడు యిక్కడ ఎందుకు స్పందిస్తాడు .మనసు పరి పరి విధాల పోతోంది .కొంప తీసి నేను లేకుండా వాడు సుధ వాళ్ళింటికి భోజనం వంక తో పోలేదు కదా ?. ఆలోచన వచ్చిన మరు క్షణం వాళ్ళ యిద్దరి సెల్ల్స్ కి నా సెల్ల్స్ ద్వారా ఆపకుండా కొట్టడం మొదలెట్టా .వొక వేళ నే అనుకున్నదే జరిగితే యింట్లో యింత సేపు సెల్ల్స్ మోగుతున్నా తీయ్యక పొతే పక్కింటి పిన్ని గారో వచ్చి తలుపు కొట్టి వీళ్ళు హద్దులు దాట బోతే అవరోధం కల్పించక పోతుందా అన్న చిన్న ఆశ .
చివరికి సుధ ఎత్తింది ''హలో ఏంటబ్బా నువ్వు రాలేదు పాపం వెంకట్ వొక్కడే స్వీట్స్ పట్టుకుని వచ్చాడు ,'' అంతే నా గుండె పగిలింది ఏం చెపుతోందో కూడా అర్ధం కావటం లేదు . నా కు పరిస్తితి అర్ధం అయ్యింది .వెంకట్ సంగతి నాకు బాగా తెలుసు మంచి వాడే కాని రెచ్చ గొట్టే పరిస్తితుల్ని ఎదుర్కొని మరి పునితుడిలా వచ్చే అంత మంచివాడు మాత్రం కాదు . సుధ కూడా స్వత హాగ మంచిదే గాని మంచి తనం మగాడు ముందు అడుగు వేసే వరకే అంతే తర్వాత అతనికే అంకితం అయిపోయేంత మంచి తనం . నా లో వుండే చొరవ ఆమె లోని మంచి తనమే గా రెండేళ్ళ క్రితం మమ్మల్ని దగ్గరికి చేర్చింది .అయితే మేము తప్పు చేసేసామని గాని చెయ్యలేదని గాని చెప్పలేని అయోమయ స్తితి లో ఉన్నామని మాత్రం చెప్పగలను . అయోమయపు అద్వాన్న స్తితికి కారణం ఆమె ప్రేమ మూర్తో లేక కామ మూర్తో తెలుసుకునే వరకు ముందుకి పోకూడ దన్న నా నిర్ణయమే గావచ్చు .
రెండేళ్ళ క్రితం అర్జెంటు గా ఆడిట్ ఎకౌంటు లో మా చార్టెడ్ ఎక్కవంటంట్ సంతకం అవసరం పడి వాళ్ళింటికి వెళ్ళా .ఆదివారం కావడం తో అతన్ని యిబ్బంది పెట్టడం యిష్టం లేక .కాఫీ కప్పుతో అతని భార్య గా సుధ అక్కడే నాకు పరిచయం .మనిషి ని చూడగానే నే అందగత్తె అని తీర్మానించక పోయిన చక్కటి శరీర సౌష్టవం తో ఆకర్శ నీయం గా వుండే చురుకైన పిల్ల అని మాత్రం చెప్పక తప్పదు .ఆమె ని పరిచయం చేసిన రెండు నిమిషాలకే మా ఆడిటర్ కి సెల్ రావడం తో సార వన్ మినిట్ అంటూ మెట్లెక్కి పైకి వెళ్ళాడు . గదిలో మేం యిద్దరమే నా యిబ్బంది గమనించి ఆమె మాటలు కలిపింది . ''యీయన ఎప్పుడు యింతే నండి యింట్లో వున్నా లేనట్టే ఎప్పుడు సెల్ కి అంకితం ,ఏమి వండాలో కూడా నేను సెల్ లోనే అడుగుతా'' అంటూ పక పకా నవ్వింది .
ఆమె చొరవ , మాట్లాడే విధానం చూసి ముచ్చటేసి ''అంతే నండి అంతా సెల్ బతుకులు అయి పోయాయి , అందుకే మా ఆడిటర్ గారు సెల్ లో కూడా దొరకరన్న మాట , సారి మీ నంబర్ తీసి కూడా పెట్టుకోవాలి కనీసం మీ ద్వారా అన్న వారి తో మాట్లాడం సులభం'' అన్నా మాట కలుపుతూ ,.
సారి దాక ఎందుకండి యిప్పుడే తీసుకోండి అంటూ తనే చొరవగా నా చేతిలోంచి నా సెల్ తీసుకుని రింగ్ చేసి సేవ్ చేసుకోండి సుధ అని చెప్పి మరి యిచ్చింది .అప్పుడు రెండు సార్లు కూడా వేళ్ళు తగలడం యాదృచ్చికమే అనుకున్నా . .మా ఆడిటర్ రావడానికి అరగంట పైనే అయ్యిందని అతను వచ్చి చెప్పేదాకా నాకు తెలీనే లేదు . అరగంట లో యిద్దరి లోను చొరవ ఎక్కువే కాబట్టి చాలా విషియాలు మాట్లాడు కుంటూనే కళ్ళతో మరెన్నో విషియాలు చెప్పుకున్నాం .
మీరు నవ్వితే చాలా బావున్నారు అనేంత చొరవ అరగంటలో వస్తుందా అంటే అప్పటి కాల మాన పరిస్తుతల బట్టి ఉంటాయని చెప్పక తప్పదు .
''నేను నవ్వక పోయినా కూడా బానే ఉంటా వనే వాళ్ళు కూడా వున్నా రండోయి '' అంది తను నవ్వుతూ .
''అంటే వాళ్ళు మీ మోము మీద ద్రుష్టి పెట్టలేదని అర్ధం'' నోరు జారానని నాలుక కర్చుకున్నా ఎలా స్పందిస్తుందో అని భయ పడుతూ .
''పోనీ లెండి కనీసం మీరన్న మోము మీద మాత్రమె ద్రుష్టి పెట్టారు'' అంది
నే స్పందించే లోపే మా ఆడిటర్ ''సారీ అండి మిమల్ని వెయిట్ చేయించాల్సి వచ్చింది , సుధా సార్ కి కాఫీ ఇచ్చావా? ''అని అడిగాడు .
''కాఫీ తో పాటు మీరొచ్చే దాకా కంపెనీ కూడా యిచ్చా'' అంది . ఆమె తెగువ గల మగువ అనుకోవాలో ?లేక భార్య భర్త మద్య వున్న అవగాహనా అనుకోవాలో తెలిలేదు క్షణం లో .
నేను కార్ లో వస్తోంటేనే మెస్సేజ్ పంపింది ''థాంక్స్ ఫర్ యువర్ కంప్లిమేంట్ ''అని .అమ్మో నేర జానే మనం తగ్గ కూడదని నేను కూడా ''సుధ చేతి కాఫీ కి కరిగానా రెండో సారి అడగడం మరిచానా ?'' అని పంపా .
''మీ ఆతిద్యం కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే వుంటాయి '' తన స్పందన
''మీ తలపులతో తలుపు త్వరలోనే ఎప్పుడో కొడతాను '' నా సమాధానం .
''సేఫ్టి ఫస్ట్ స్పీడ్ నెక్స్ట్'' అని తను యిలా మొదలైన మా పరిచయం రోజు కి కనీసం గంట అన్నా మాట్లాడుకునే స్తితి కి వెళ్లి పోయింది . వొక రోజు తనే భోజనానికి పిలిచింది వాళ్ళ ఆయన వూళ్ళో లేని రోజు . నేను తట పటా ఇస్తూనే వెళ్ళా .
తను చీరలో చాలా అద్బుతం గా వుంది . కొసరి కొసరి దగ్గర గా వుండి మరి వడ్డించింది .
'' మీ హబ్బి చాలా అదృష్ట వంతుడు చక్కటి విందు భోజనం రోజు అన్నా ''
''ఆస్వాదించి అభినందించే వాళ్ళకి భోజనం పెట్టడం నాకు ఆనందం అంది ''. దానిలోని విస్తృత అర్ధం రెండేళ్లలో యిప్పటికి అర్ధం అయ్యింది . రోజు భోజనం అయిపోగానే వెంటనే రాలేక పోవడానికి ఆమె సాన్నిహిత్యం లో చేతులు ప్రేమ పూర్వకం గా పట్టుకుని తన గతం లో పెళ్ళయ్యాక యింకో వ్యక్తీ తో జరిగిన ప్రేమ కధ , అతను దాన్ని కామకధ గా మార్చిన వైనం , దాంతో తను యిప్పటికి గిల్ట్ ఫీల్ అవుతూ ,. తను ఏదో చెబుతుంటే నా చేతులు అపబ్రమ్సం చెంద బోతుంటే
అసలు '' ప్లేటోనిక్ లవ్ మీద మీ అభిప్రాయం ఏవిటి ?మగాళ్ళు శరీరాన్ని కాక మనసుని ప్రేమించ లేరా ?ఆడ మగ మద్య ఎలాంటి సంభందమైన గమ్యం చివరికి సెక్స్ కి మాత్రమె దారి తీస్తుందనే మా అయన వాదన తప్పు అని నిరూపించా లేనా ?''సూటి గా బాణం లాదూసుకొచ్చిన ప్రశ్న కి శరీరం లో నా భాగాలు మళ్ళి నా స్వాధీనం లోకి వచ్చాయి చేతులు కట్టుకుని వివేకానందుడి లా పెట్టుకుని'' చూడు సుధా యిప్పుడు యిక్కడ మనిద్దరం మాత్రమె వున్నాం .క్షణికావేశం లో తప్పు చేస్తే వచ్చే సుఖం కన్నా ఇలాంటి విపత్కర పరిస్తితులలో కూడా తప్పు చెయ్య కుండా మీ గుమ్మం బయట అడుగు పెట్టినప్పుడు వచ్చే ఆనందం మిన్న నా లెక్క లో అదే ప్లాటానిక్ లవ్'' అన్నా
అంతే ఆమె కళ్ళల్లో ఆనంద భాష్పాలు వెంటనే నన్ను గట్టి గా హాగ్ చేసుకుని నా అన్వేషణకి ఆఖరి మజిలి నువ్వే అంటూ అలా వుండి పోయింది .
డైలాగు అయితే వివేకానందుడి రేంజ్ లో కొట్టినా అప్పటి భంగిమలో మళ్ళి నాలో రాక్షసుడు విజ్రుమ్బించి నా లో యింకో కోణం కనబడ కుండా యింక వుంటానురా థాంక్స్ ఫర్ ఎవెర్య్ థింగ్ అని నుదుట మీద బుగ్గ పెట్టుకుని బయటకు వచ్చేసా . అది మొదలు ఆమె లో నా మీదా మరింత ఆరాధన భావం కలిగి తన జీవితం లో జరిగిన అన్ని సంఘటనలు , జీవితం లో ప్రవేశించిన మగాళ్ళు అందులో పరిధిని దాటిన వాళ్ళు దాటని వాళ్ళు యిలా మొత్తం చెప్పేసింది .రోజులు గడుస్తున్న కొద్ది ఆమె మీద కూడా నాకు ప్రేమ పెరిగి పోయి అది కాస్త పోసేస్సివే నెస్ గా మారి పోయింది .అదుగో అప్పుడు పుట్టిన వొక వేదవాలోచనే వెంకట్ గాన్నిపరిచయం చెయ్యాలనుకోవడం . నా ఆలోచన ఏంటంటే ఈమె ప్లేటోనిక్ లవ్ కేవలం నాతోనేనా ?గతం లో వాడుకున్న పురుష పుంగవులు వస్తే మళ్ళి వాళ్ళకి విందు భోజనాలతో కొసరి కొసరి వడ్డించి వాళ్ళ ఆయన మాటని నిజం చేస్తూ క్లై మా క్స్ కి తీసుకేలుతుందా ? విషయం నిర్ధారణ చేసుకోవడానికే నా అంతరంగిక మిత్రుడు వెంకట్ సహాయం కోరా .అతనికి మా యిద్దరి విషయం ఎప్పుడో చెప్పా.
''నిన్ను కేవలం ఆమెని పరిక్షిన్చాడానికే పరిచయం చేస్తున్నా , నీ అంత నువ్వు చొరవ చూపకుండా ఆమె నీ పరిచయాన్ని తీరాలకి తీసుకు వెళుతుంది అని తెలుసు కోవడమే నా అభిమతం .యింతకు ముందు యాదృచ్చికం గా పరిచయం చేసిన మా కసిన్ తో ఆమె ఫోన్ లో సరస సల్లాపాలు సాగించిన విషయం వాడు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను .వాడికి మా యిద్దరి మద్య వున్న భందం తెలీక నాలుగయిదు సార్లు మాట్లాడి బాస్ మీ ఫ్రెండ్ రకమే అంటే అది నిర్దారించు కోవడం కోసమే నేను ప్రవేశ పెట్టిన బ్రహ్మాస్త్రం నువ్వు '' అని ముందే చెప్పా, మొత్తం మీ యిద్దరి మద్య ఏమి జరిగినా నాకు తు తప్పకుండా తెలియాలి అన్నా .అలా పరిచయం అయిన వెంకట్ తను కూడా రోజు ఫోన్ లో గంట సేపు మాట్లాడే స్తితికి వచ్చేసాడు . సుధా వాళ్ళింటికి యిద్దరం కలిసి రెండు సార్లు భోజనానికి కూడా వెళ్లాం . అప్పుడు ఆమె కొసరి కొసరి యిద్దరికీ వడ్డించిన తీరు .ఆమె లోని ప్రేమ మూర్తి ని చూపినా ,చీర కట్టుకున్న తీరు ,సాంబార్ పడినప్పుడు వెంకట్ బట్టల్ని గుడ్డ తో తుడిచిన తీరు లో తేడా కొట్తోచినట్టు కనిపించింది . తర్వాత ఆమె మాట తీరు లో కూడా కొంత రెచ్చ గొట్టే తత్త్వం తో వునట్టు వెంకట్ చెప్పాడు .ఇలాంటి వాతావరణం లోనే మొదటి సారి వెంకట్ నేను రాక పోయినా తను వొక్కడే వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాడు రోజు . తర్వాత వాళ్లిదరి సెల్ల్స్ ఎత్తక పోవడం చాలా సేపటి తర్వాత సుధ ఎత్తి వెంకట్ భోజనానికి వచ్చాడని అతనికి భోజనం పెట్టడం లో బిజీ గా వుండడం తో ఎత్త లేదని చెప్పడం జరిగింది . నేను వెంటనే వెంకట్ కి సెల్ యియ్యి అని మాట్లాడితే బాస్ నువ్వు రాలేక పోతున్నవని చెప్పాక నే వచ్చా ,నువ్విచ్చిన పని ముగించా మీ కజిన్ చెప్పింది కరెక్ట్ నే నీ ఫ్యాక్టరీ కి వచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేస్తా అంటూ కోడ్ బాష లో చెప్పి పెట్టేసాడు .
అంటే అంటే యిన్నాళ్ళుఆమె చుట్టూ నే కట్టు కున్న ఆశా సౌధాలు వెంకట్ చేసిన భూకంపానికి పేక మెడల్లా కూలి పోయాయా?తను నన్ను ప్లేటోనిక్ లవ్అంటూ వెర్రి వెదవని చేసిందా? వెర్రి యింకా వుంది ?నా లో ఉక్రోషం ,ఉద్రేకం పెల్లుబికాయి . సుధకి సెల్ కొట్టా హలో అనగానే'' అయిపోయిందా''? అన్నా తను మాత్రం తొట్రు బాటు లేకుండా'' అయిపొయింది నీకు అన్ని చెపుతానులే'' అంటూ ములుగుతు, ఉండనా? అంది కోపం తార స్తాయికి వెళ్లి ఫోన్ పెట్టా వంటే చంపేస్తా నాకు తెలియాలి అక్కడ ఏం జరుగు తోందో అన్నా . ఆమె సెల్ అలాగే ఓపెన్ గానే వుంది . గదిలో ఫ్యాన్ శబ్దం , మిగతా అంతా నిశబ్దం మద్యలో మద్యలో ఆమె మూలుగులు యింక నా వల్ల కాలేదు సెల్ కట్ చేసి అలా శూన్యం లోకి చూస్తూ వుండి పోయా .పదినిమిషాల తర్వాత ఆమె నుంచి ఫోన్ . నేను ఎత్తలేదు ఆపకుండా పది సార్లు చేసి ఊరుకుంది .
కొంత సేపటికి వెంకట్ నా ఫ్యాక్టరీ కి వచ్చాడు .అతని మొహం లో అనిర్వచమైన ఆనందం కని పిస్తోంది ,
వస్తూనే నా చేతులురెండూ కళ్ళకి అద్దుకుంటూ చాలు బాస్ ఈ జన్మ కి ఈ ఆనందం చాలు
మాటలలో వర్ణించ లేను , యింత గొప్ప ఆనందం ఆమె ద్వారా పొందడానికి కారకుడ వైన నీ ఋణం
ఎప్పటికి తీర్చు కోలేను . సంవత్సరం క్రితం ఆమె ఎవరో నేను ఎవరో అటువంటిది క్షణం క్రితం అన్ని మరిచి
ఆమె నేనై నేనే ఆమె అయి సంపూర్ణం గా ఆమె అర్పించుకున్న తీరు నభూతో న భవిస్యత్తు
అదే మాట తనకి కూడా చెప్పి వస్తున్నా ఏ జన్మలోని భందమో చాలు యి జన్మకి .తను చెప్పుకుంటూ పోతున్నాడు . నా మెదడు మొద్దు బారి పోయింది . యింతలో ట్రైన్ టైం అవడం తో అతను వెళ్లి పోయాడు
ఫోన్ చేశా కొంత సేపటికి పిక్ అప్ చేసి సారీ బాత్రూం లో వున్నా లేట్ అయ్యింది అంది . కోపం నషాళానికి అంటింది .
''నా వోక్కడి తోనేనా ప్లేటోనిక్ లవ్ ?మిగతా వాళ్ళందరితో టైటానిక్ లవ్ ?గంగా నది అనుకున్నా కాదే ?
మురికి గుంట వని నిరూపించు కున్నావ్ ?ప్రతి వేదవ వచ్చి అందులో వత్తిడి తగ్గించుకుని మరి పోతున్నాడు .''
నా మాట పూర్తీ అయ్యేలోపే జస్ట్ షట్ అప్ అంటూ ఫోన్ పెట్టేసింది .
నాలో కూడా ఉక్రోషం పెరిగింది .ఏంటిది నిబ్బద్దత లేదు మనిషిలో ?
ఎవరు పడితే వాడితో ?రాత్రి వరకు మా మద్య కమ్యూనికేషన్ లేదు .
ఫ్యాక్టరీ నుంచి వస్తూ వాళ్ళ యింటి ముందు ఆగాను .మనసులో ద్వైది భావం .
వెళ్ళనా వద్దా ?పోనీ ఫోన్ అన్నా చెయ్యనా ?కార్ లోంచే వాల్లింటిని చూస్తుంటే
అనిపించింది .అసలు ఆమెని శాసించే హక్కు నా కెక్కడిది?
ఈ రెండేళ్లలో ఆమె ఏ నాడు నా నుంచి ఏమి తీసుకోలేదు. యిద్దామని ప్రయత్నించినా కూడా .
అసలు తను ఎవరి దగ్గరనుంచి ఏమి ఆశించదు, ఎవరు వచ్చినా కాదనదు?
యునివేర్సాల్ లవ్ .తనంత గా తను ఎవర్ని ప్రోత్సహించదు, వచ్చి ముందుకు పొతే ఆపదేమో?
విసుగొచ్చి వెళ్లి పోయా అక్కడనుంచి . పొద్దున్నే లేచిన దగ్గరనుంచి మళ్ళి ఆమె చుట్టే ఆలోచనలు .
ఫ్యాక్టరీ లో పని మీద శ్రద్ద చుపెట్టలేక పోతున్నా .ఏమన్నా సరే సుధ దగ్గరికి వెళ్లి
తాడో పేడో తేల్చు కోవలసిందే అనుకుంటూ వాళ్ళింటి వైపు కార్ పోనీచ్చా వొక పక్క మా వాచ్మన్
తుమ్ముకుంటూ గేటు తీసాడు ,ఎడం కన్ను వొకటే అదురు తోంది రాబోయే ప్రమాదానికి సూచిక గా
(.యింకా వుంది ) యి కధలోని పాత్రలు కేవలం కల్పితాలు
ఎవరినన్నా పోలినట్టు వాళ్ళు భావిస్తే అవి వారి స్వీయ అనుభవాల గానే పరిగణించ గలరు )



11 డిసెం, 2011

నిన్నిలా లేదే

నిన్నిలా లేదే
మొన్నలా లేదే
రోజిలా ఎందుకే
నిన్నిలా నా కే కొత్త గా చూపే
వెళిలా ఎందుకే
నువ్విలా నాలో నేనిలా నీలో
లీనమయి పోయేందుకే
నా గుండె నా అదుపు తప్పి
నా కనులు నీ వైపు తిప్పి
నా మనసు నీ తోటి కలిపి
నేనే నీలో నిలువెల్లా కలిసి
నీ పెదవి లో నవ్వు చూపి
,మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో వున్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండా చేసి
యిది ప్రేమా అనుకుంటూ అడుగేసాన నేనేనా
నినూ నేనే ఏవేవో అడిగేసానా నిజమేనా
మొన్న ఆఫీసు కి వెళుతుంటే ఎఫ్ ఏం లో వినిపించిన దగ్గరనుంచి ఈ పాట చాల హంట్ చేస్తోంది .
కొత్త గా ప్రేమలో పడిన ప్రేమికుడి మనసులో భావాల్ని చక్క గా చెప్పారు .its my లవ్ స్టొరీ లోది ఈ పాట
http://musicmazaa.com/telugu/audiosongs/movie/Its+My+Love+Story.html

ఏ సెల్లు పలికినా


మరి యింత బిజీ అయిపొయింది జీవితం .మనసులో భావాలకి అక్షర రూపం యివ్వలేనంతగా?అసలు పని వత్తిడి లో అందమైన భావాలకి అవకాశం ఎక్కడ ?వుద్యోగం లో కొన్ని ముఖ్య మైన పోస్ట్స్ చేస్తునప్పుడు మనకంటూప్రైవేటు సమయంవుండదు .కార్ లో డ్రైవ్ చేస్తూ కూడా యియర్ ఫోన్ లో మాట్లాడుతూ ఆదేశాలు యిస్తూ వుండాలి .ఏవి నిరుడు కురిసిన హిమసముహాలు అని పిస్తూ వుంటుంది .అప్పట్లో మన మనసుని ఆహ్లాద పరిచిన స్నేహితుల గొంతు సెల్ లో వినిపించినా యిది వరకులా మాట్లాడే అవకాశం ఉండక ముక్త సరిగా మాట్లాడి నేను మళ్ళి చెయ్యనా అంటుంటే ఆ కోయిల యింకొక మనసుని రంజింప చెయ్య దానికి ఎగురు కుంటూ వెళ్లి పోదా ?ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తు కొస్తున్నాయి .ఈ తెలుగు బ్లాగర్స్ దినోత్సవం సందర్భంగా కొంత సమయం కేటాయించి నిద్ర బోతున్న నా బ్లాగులో నా మనసులో భావాలూ రాసి కొత్త చలనం తీసుకోద్దామనే యి ప్రయత్నం .నేను యింతకు ముందు రాసుకున్న నిన్నటి నా నువ్వు లో లా సమయం కేటాయించా లేక పోవడం తో మనసులో భావాల్ని ప్రేరేపించ గలిగే స్నేహితులు వసంత కోకిలలు అయిపోయారు .సరే యింక ఆఫీసు విషయానికి వస్తే అదేంటో నా రూం లోకి రాగానే మా స్టాఫ్ సెల్ల్స్ మోగుతూ వుంటాయి .నేను ఫైల్ లోంచి తల ఎత్త కుండానే గమనిస్తూ వుంటా వాళ్ళ ప్రతిక్రియల్ని .ఎంతైనా సెల్లాలజి లో నిష్ణాతున్ని కదా .వాళ్ళ హావ భావ విన్యాసాల తో అవతలి పక్క మాట్లాడు తున్నది యింటి వాళ్ళా ?పక్కింటి వాళ్ళా ?స్నేహితులా ?కాంట్రాక్తర్లా అన్నది తెలుస్తూనే వుంటుంది .మొన్నొక సారి నలుగురు స్టాఫ్ (యిద్దరు ఆడ యిద్దరు మగ )నా రూం లో వాళ్ళ వాళ్ళ ఫైల్స్ తీసుకుని నిల బడ్డారు .అందులో వోకతని సెల్ వచ్చిన రెండు నిమిషాలకే మోగితే అన్నా యితని సెల్ మోగకుండా నా రూం లోంచి వెళ్ళిన నాడు మొత్తం ఆఫీసు అందరికి గ్రాండ్ మినర్వాలో లంచ్ యిస్తానని .అంతే కాకుండా యింకో పెళ్లి కాని అమ్మాయి ఫైల్స్ తో నిలబడి వుంటే అన్నా ఎప్పుడు కూడా తన సెల్ నా రూం కి వచ్చినప్పుడు మోగలేదు అని అభినందించా ( మోగ వలసిన ఈ అమ్మాయి సెల్ ఫోన్ ఎప్పుడు మూగ బోయి వుంటుంది ,అని మనసులో అనుకుంటూ ),మిగతా ముగ్గురు వెళ్లి పోయారు ఆమె ఫైల్స్ చూస్తుంటే ఆమె అసహనం గా కదలుతుంటే అడిగా ఎనీ ప్రోబ్లం ?అని సార్ అది అది నా సెల్ వైబ్రాటార్ మోడ్ లో వుంటుంది అంది .అదేంటి మీ డెస్క్ లో వున్న మీ సెల్ విబ్రేట్ అయితే మీరిక్కడ ప్రతిస్పందిస్తున్నారు అంటే నా చుడిదార్ కి పోకెట్స్ వున్నాయి సార్ అంటే యింకేలా react కావాలో తేలిక వొకే క్యారీ ఆన్ అనేసి ఫైల్స్ చూడడం లో నిమగ్నం అయిపోయా .కాని నా చెవులు ఆమె మాటల సారాన్ని గ్రహించేస్తున్నాయి ఖర్మ .మీ ఆవిడా వుంటే నాకేంటి వచ్చి తీరుతా మనిద్దరి మద్య వున్నది కేవలం స్నేహమే అని ఆమె కి కూడా తెలీని అంటోంది నేను అవతల ఫోన్ లో ఎవరి తోనో మాట్లాడు తున్నా అనుకుని .యింత పిరికి వాడివి ప్రేమించానని ఎందుకు మబ్య పెట్టావ్ నా మానాన్న నేను పెళ్ళిచేసుకుని హాయ్ గా వుండే దాన్ని గా అంటోంది కళ్ళలో కన్నీటి పొరలు .అప్పుడని పించింది ఏ సెల్లు సొల్లు వినినా ఎమ్మున్డి గర్వ కారణం ప్రతి సెల్లు పర పీడా ప్రేమాని తత్త్వం అని .కావాలనుకున్నది దొరకదు దొరికిన దాన్ని కావాలనుకోడు జీవితం అంతా మరిచికల్ని విచకలా భావించి ఎడారి ఎండలో మృగతృష్ణ లో నీటిని తోడే వృధా ప్రయత్నమే . నిరంతర అన్వేషణ లో ఆఖరి మజిలి ఎక్కడో మరి . ఆమె విషాద ప్రేమ కధ తెలుసుకోవాలనే కుతూహలం వున్నా అధికారపు యినప తెరలు అడ్డు పడి నేను కరెక్ట్ చేసిన డ్రాఫ్ట్ తీసుకుని రండి ఏవన్నా డ వుట్స్ వుంటే అడగండి అన్నా .ఆమె లో మళ్ళి అసహనం మొదలయ్యి యిబ్బంది గా కదులుతూ సారీ సార్ అంటూ ఫైల్ తీసుకుని బయటకి అడుగులు వేసింది .బయట పెద్ద గొంతు తోనే అరుస్తోంది ''నే వచ్చి తిరతా గో టు హెల్ '' అని .ఆ సాయంత్రం రాబోయే ప్రళయానికి సూచిక గా బయట ఉరుములు నా కిటికీ అద్దం లోంచి కని పిస్తున్నాయి .ఆమె కధని ఎప్పటికన్నా తెలుసుకుని రాస్తానేమో ?
http://ravigaru.blogspot.com/2010/12/blog-post.html





24 సెప్టెం, 2011

మల్లీశ్వరి కాదు


యింతకు ముందు వొక పోస్ట్ లో రాసాను''కరణంమల్లిస్వరేనా ?''అని కరణం మల్లీశ్వరి పేరు తో నా సెల్ కి కాల్ వచ్చిందని . ఆమె నిజం గా మల్లిస్వరో కాదో అని అనుమానిస్తూనే ఆమె పని చేసి పెట్టానని .ఆమె ఆమె కాదో అవునో ప్రోబ్ చెయ్యాలని .అంతటి తో ఆ విషయం మర్చి పోయా పని వత్తిడి వాళ్ళ యింక ద్రుష్టి సారించలేదు .అనుకోకుండా ఆఫీసు పని మీద మొన్న గురువారం ఢిల్లీ వెళ్ళ వలసి వచ్చింది . వెళ్ళిన పని వొక పూటలోనే అయిపోవడం తో పాలిక బజార్ లో తిరుగుతూ కరణం మల్లీశ్వరి నెంబర్ గుర్తుకు వచ్చి ఆమె కి సంక్షిప్త సమాచారం పంపా . అయాం అట్ ఢిల్లీ అని . ఎందుకంటె యింతకు ముందు ఆమె రెండో సారి కాల్ చేసి ఈ సారి ఢిల్లీ వస్తే మా యింటికి రండి అని ఆహ్వానించింది .నేనుకున్నది ఏంటంటే ఆమె వెంటనే కాల్ చేసి మా ఇల్లు ఫలానా ప్లేస్ లో వుంది మీరు రండి అని ఆహ్వానిస్తుందని . కాల్ లేదు నా సందేశానికి స్పందన లేదు .మా మిసెస్ కజిన్ వొక ఆమె నుంచి ఢిల్లీ ఎప్పు డెల్లారు ? హవె అ గుడ్ టైం అని సందేశం వచ్చింది .యింకో ఫ్రెండ్ మీరు ఢిల్లీ వెళ్ళినా మా దిల్లు లోనే వున్నారని .ఇదేంటి యిలా జనాలందరికీ మన ఢిల్లీ ట్రిప్ ఎలా తెలిసిందా అని చూసుకుంటే అంతకు ముందు వినాయక చవితి శుభాకంక్షల సందేశాన్ని కరణం మల్లీశ్వరి తో పాటు మరి కొంత మంది మిత్రులకి పంపా . మళ్ళి అదే మేస్సజ్ ఓపెన్ చేసి నా ఢిల్లీ సందేశం పంపితే అది మొత్తం అందరికి వెళ్లి పోయింది .నిన్న ఢిల్లీ నుంచి వచ్చేసి నా పని లో పడి పొతే , యిప్పుడే కరణం మల్లీశ్వరి సెల్ నెంబర్ నుంచి ఫోన్ చేసి హిందీ లో మీరెవరు ఢిల్లీ లో వున్నాను అని సందేశం వచ్చిందని అడిగింది .హమ్మ వెతక బోయిన తీగ కాలికి దొరికిందని నేను కూడా నేనెవరో చెప్పకుండా మీ స్నేహితున్ని కూడా గుర్తు పట్టలేరా ?అని గాలి లో బాణం వేసా . యింతకీ మీరెవరు అన్నా . అంతే కావలిసిన సమాధానం వచ్చేసింది . తన పేరు ఫలానా రెడ్డి(అంటే ఆమె పేరు ఫలానా రెడ్డి అని కాదు గోప్యత కోసం ఎస్ తో మొదలయ్యే మూడు అక్షరాల పేరు ని రాయలేదు )అని తెలుగు అమ్మాయినని చెప్పి మీరెవరో చెప్పండి అంది .అంతే నండి సాయం కావలిసి వచ్చినప్పుడు నా పేరు తో సహా ఉద్యోగ వివరాలు చెపుతారు పని అయిపోయాక కనీసం ఆ నెంబర్ కూడా సేవ్ చేసుకోరు . యిక నుంచి నేను మీ అజనభి కభి అల్విద నా కహేనా అని పెట్టేసా .యింక పొడిగిస్తే తాళం తప్పి పక్క దారి పట్టొచ్చని . . యింతకీ నా కర్దంయ్యింది ఏంటంటే ఈ ఫలానా రెడ్డి విశాఖ పట్నం లో పని చేస్తోంది ఆమె కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావాలి .కరణం మల్లీశ్వరి పేరు తో చేసినప్పుడు ఆమె అడిగిన సాయం చేసినప్పుడే యిలా ఫలానా రెడ్డి మంచి క్రీడాకారిణి హైదరాబాద్ లో వుంటే ఆమె కి తగిన గుర్తింపు వస్తుంది అందుకు ఆమెని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించండి అంటే చూద్దాం లెండి అని ఊరుకున్నా . యిప్పుడు ఆమె ఫోన్ లో తన పేరు చెప్పగానే అర్ధం అయ్యిపోయింది ఈ కరణం మల్లిస్వరే ఫలానా రెడ్డి అని . అయితే ఆమె నా నెంబర్ డిలీట్ చేసెయ్యడానికి బహుశా నేనుకునే కారణం ఆమే కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు మీరు కరణం మల్లీశ్వరి కాదని నాకు తెలుసు లెండి , ఆమె వాయిస్ ని నేను నెట్ లో విన్నాను మీ యిద్దరి గొంతులకి పొంతన లేదు మీకేమి కావాలో చెప్పండి అంటే లేదండి హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తా అప్పుడు నమ్ముదురు అని పెట్టేసింది . కని పెట్టేసానని డిలీట్ చేసి ఉండొచ్చు .
ఫైనల్ గా నే చెప్పేదేమంటే సెల్ లో నేను ఫలానా అని చెప్పే ప్రతి వాళ్ళు ఫలానా కాక పోవచ్చు మనం వాళ్లే అనుకుని ఉబ్బి తబ్బిబు అయిపోయి బ్రమల్లో ఉండకుండా , సెల్ లో అయినా చాట్ లో అయినా వారి చాటు మాటు విషయాల్ని కని బెట్టక పొతే ముందు మన తెర చాటు విషయాలు వాళ్ళు కని బెట్టేసి మనం వాళ్లతో మాట్లాడుతున్నది వాళ్లతో సహా ఏ టీవి నైన్ లోనే మన కుటుంబ సబ్యులతో సహా అందరు వినే అవకాశం ఎప్పుడు వుంటుంది . తస్మాత్ జాగర్త .

17 సెప్టెం, 2011

అవధూతలు వుంటారు

మొన్న ఏదో పని మీద అమలాపురం వెళ్ళవలసి వచ్చింది .ఎప్పటి నుంచో మా సీనియర్ సహచరుడు వొక ఆయన అక్కడికి వెళ్లి నప్పుడు వీలుంటే దగ్గరలో ఐనవల్లి దగ్గర మూలపోలం అని వొక వూరు వుంది అక్కడ వెంకన్నబాబు అని వొక స్వామి వున్నారు మనిషిని చూడగానే మనసులో వున్నది చెప్పేస్తారు .మీరనుకున్తున్నది అవుతుందో లేదో కూడా చెప్పేస్తారు .ప్రయత్నించండి అన్నారు .యిది చెప్పి కూడా నాలుగేళ్ళ పైన అయిపొయింది .మేము వెళ్ళిన పని తొందరగా అయిపోవడం తో ఆ పని అవడం లో సహకరించిన పెద్ద మనిషిని యధాలాపం గా అడిగా మూలపోలం ఎక్కడో తెలుసా అని పెద్ద ఆశలు ఏవి పెట్టుకోకుండా . ఎందుకంటె అంతకు ముందే మా కార్ డ్రైవర్ ని అడిగితె తెల్ల మొహం వేసాడు .వెంటనే ఆయన సార్ నేనెప్పుడో యిరవై రెండేళ్ళ క్రితం వెళ్ళా మీకభ్యంతరం లేక పొతే నేను వస్తా అంటే మా ఫ్యామిలీ తో పాటే ఆయన కూడా డ్రైవర్ కి దారి చూపిస్తూ మద్యలో కనుక్కుంటూ చివరికి మద్యాన్నం మూడు గంటలకి వారింటికి చేరు కున్నాము .శనివారం , ఆదివారం ,మంగళవారం మాత్రమె ఆయన స్వామి ఆవాహన పొంది పూజా పీటం లో ఆహుతుల మనసులో ప్రశ్నలకి సమాధానం చెపుతారు . ఆ రోజు మంగళవారం అవడం తో అప్పటికే హాల్ నిండా వొక యాభై మంది దాక కుర్చుని వున్నారు .నా విసిటింగ్ కార్డు పంపడం తో కొంతసేపటి తర్వాత మా కుటుంబాన్ని ప్రత్యేకం గా వేరే గదిలో కూర్చో బెట్టారు .అక్కడ గొప్పతనం మన హోదా దీ కాదు వేంకటేశుని అనుగ్రహమే అని తర్వాత నాకు అర్ధంఅయ్యింది .ఆ గది లోకి కూడా యింకో మూడు నాలుగు కుటుంబాలు (చుట్టుపక్కల గ్రామాల్లో ప్రముఖులు )వచ్చి చేరాయి .అక్కడ గదిలో గోడలకి వేలాడదిసిన స్వామి ఫోటోల పక్కన పసుపుబట్టలతో వున్న యియన ఫోటోలు కూడా కని పిస్తే మా శ్రీమతి ఉండబట్టలేక ఏంటో వీళ్ళంతా దేవుడి తో సమానం గా ఫోటోలు పెట్టేసుకుంటారు వీళ్ళు కూడా దేవుడంతా గొప్ప వాళ్ళని అనుకుంటారా అని మెల్లగా అంది .టైం అప్పటి కే అయిదయింది . అయన బయటకు రాలేదు . నా కేమో రాజముండ్రి వెళ్లి గౌతమి పట్టుకోవాలి ట్రైన్ మిస్సవుతుందేమో అని భయం .చివరికి అయిదు ఇరవైకి పొట్టి గా చామన చాయ కలర్ తో పసుపు బట్టలతో సాధారణ వ్యక్తీ లా అనిపించే వ్యక్తీ వచ్చారు .అందరు ఆయన కి నమస్కరించి ఆశ్వేర్వచనం పొందు తుంటే నన్ను నేను పరిచయం చేసుకుని ఎప్పటి నుంచో రావాలనుకుంటే యిప్పటికి కుదిరిందని చెప్పా . దానికి ఆయన చిరునవ్వుతో స్వామి అనుకున్నప్పుడే అనుసంధానం చేస్తారు మీరు లోపల పూజా మందిరం లో ప్రశ్నకి సమాధానం విని వెళ్ళండి అన్నారు .యింక ఏమైతే అది కాని ట్రైన్ మిస్ అయితే మిస్ అవని విని వెళదామని ఆగాము . అక్కడ పూజ మందిరం లో వెంకటేశ్వర విగ్రహం అమ వారి విగ్రహాలు చక్క గా దండలతో అలంకరించ బడి వున్నాయి .అక్కడి వాత వరణం లో కూడా ఏదో శక్తి వున్న అనుభూతి కల్గింది.ముందుగా మమ్మల్ని పూజా మందిరం లోకి పిలచి తీర్దం యిచ్చారు . వెనకే మిగతా వాళ్ళు కూడా వచ్చి చేరారు . కొద్ది సేపటికే ఆ గది ఇరుకు గా మారి చిన్నప్పటి తోపులాటకి సిద్దం గా మారింది .యింకా హాల్ లో జనం మేమెప్పుడు బయట కోస్తామా వాళ్ళు దూరోచ్చని చూస్తున్నారు .యింతలో ఆయన కళ్ళు మూసుకుని దండం చేత్తో పట్టుకుని తన ఎదురు గా వున్న ఆమెతో ''ఏమి ఆశించి వచ్చావు స్వామి దగ్గరకి ?అనారోగ్యం తో బాధ పడుతున్న నీ కొడుకు ఆరోగ్యం గురుంచి వచ్చావా ?యింకా నలుగురు డాక్టర్లు మారాక తగ్గుతుంది . పూర్వ జన్మ ప్రారబ్దం అనుభవిస్తున్నాడు .సహనం వహించు నే చూసుకుంటా వెళ్లిరా '' అనగానే ఆమె ఆనంద భాస్పాలో కళ్ళ నిళ్లో తెలీని స్తితి లో తుడుచుకుంటూ ముందుకు జరిగింది . ఆమె వెనక వచ్చిన అతనికి నీ వ్యాపార విషయం లో ఆందోళన చెందకు ఆరు నెలల్లో అంతా సద్దుకుంటుందని చెప్పడం జరిగింది .
అలా జనం వోకర్ని వొకరు తోసుకుంటూ ఆయన ముందుకు వస్తుంటే ఆయన వాళ్ళకేసి చూస్తూ మనసులో మాటని చదువుతూ పరిష్కారం చెపుతున్నారు .యింక నా వంతు వచ్చింది .స్వామి శక్తి రూపమా ?విష్ణు రూపమా ?అని ఆలోచిస్తున్నావు (నా బుర్రలో ఈ సందేహం ఎప్పటి నుంచో వుంది స్వామికి శుక్ర వారం అభిషేకం చెయ్యడం లో అర్ధం శక్తి రూపమే అని )ఆది శక్తి శివ శక్తి రెండు నేనే .నీ పూజలు అలాగే కోన సాగించు .నీ మంచి మనసు ,ఇతరులకి సహాయ పడే గుణాన్ని బట్టే నీకు ఉద్యోగం లో మార్పు వచ్చింది .అందులో మంచే జరుగుతుంది . నీకు డిసెంబర్ రెండో వారం లోపు పదోన్నతి వస్తుంది .వెళ్లి రా . అని చెపుతుంటే నా కళ్ళలో ఆనంద భాష్పాలు జల జలా రాలాయి .ఎందుకంటె నేను నోరు తెరచి ఆయనని ఏమి అడగ లేదు . అదికాక యి విషయాలు యిన్కేవరి తోనూ చర్చించలేదు . అందుకే వొక విధమైన ట్రాన్స్ లోకి వెళ్లి పోయి బయటకు వచ్చా . మా శ్రీమతి విషయం లో కూడా నీ దగ్గర మోసపురితం గా వొకడు డబ్బు తీసుకున్నాడు అది నీకు మార్చి లో వస్తుందని చెప్పినప్పుడు ఆశ్చర్య పోవడం ఆమె వంతయ్యింది . ప్రస్తుతం ఆ వివాదం కోర్టు లో నడుస్తూ మా కనుకూలం గా తీర్పు వచ్చింది .ఆయన గురించి మా తో పాటు వచ్చినాయన ద్వార మరిన్ని విషయాలు తెలుసు కున్నాము . ఆయన చాలా ఏళ్ళ క్రితం నుంచే అవధూత లా వ్యవహరిస్తున్నారని బ్రహ్మ చారి లా వుంటూ తన దగ్గరికి వచ్చే వాళ్ళ యితి భాధలు తీరుస్తున్నారని చెప్పాడు .అయితే ఆయన శిష్య గణం కొంత అతి గా వ్యవహరిస్తున్నరేమో అని పించింది .వొక పక్క యియన ప్రశ్న సమాధానం చెపుతూ వుంటే గట్టి గా అరుస్తూ జనాల్ని కంట్రోల్ చెయ్యడం , మాట్లాడడం వంటివి చెయ్యడం జనాలు పళ్ళెం లో వంద అయిదు వందల నోట్లు వెయ్యగానే తీసి బిందె లాంటి హుండీ లో వెయ్యడం వంటివి .అవధూతల దగ్గర శిష్యగణం వారి మహిమల్ని ధన రూపం లోకి మారుస్తూ వుంటారేమో ?
ఈ ట్రిప్ లో నాకర్ధమయ్యింది ఏమిటంటే అవధూతలు అక్కడక్కడ యింకా వున్నారు వాళ్లతో అనుసంధానం అయ్యే సమయం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు .మరి అంతవరకూ మేర నంబర్ కబ్ ఆయే గా అనుకోవడమే .