13 జులై, 2012

మరుజన్మ ఉందా ?

ఈగ సినిమా చూసాక మళ్ళి పునర్జన్మల మీద ఆలోచన మళ్ళింది . .ఈ జన్మలో మనకి సాయం చేసిన వారు , మననుంచి సాయం పొందిన వారు , మనల్ని ద్వేషిస్తున్నవారు , ప్రేమిస్తున్నవారు అందరు కిందటి జన్మ లో లింకులేనేమో అని పిస్తుంది .మొదటి సారి చూసినా కొంతమంది మీదా ఏదో తెలీని అభిమానం పుట్టుకొస్తుంది .యిన్కొంతమందితో ఎప్పటినుంచి పరిచయం వున్నా ఏహ్య భావం తోనే వుంటాం .జీవితం అంతా రుణాను భంధాలతోనే నడుస్తుంది . చని పోయాక కూడా ఈ పగలు ప్రేమలు వెంటాడతాయ ?అది ఏ రూపం లో వున్నా ప్రతిబిమ్బిస్తాయా ?లేదా చని పోయే ముందు బలం గా అనుకుంటూ చని పొతే పునర్జన్మలో అవి సాధించడం కోసమే పుడతామా? .
అసలు ప్రేమ అనేది ఉందా ?కామం అనే గమ్యానికి ప్రేమ అనేది వొక ముసుగేనా ?
ప్రేమకి కామానికి మద్య ఏదన్నా విభజన రేఖ ఉందా ?లేక వొకే మైదానం లో అవి రెండు గమ్యాలా?
యిలా ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ యింటికి వెళుతుంటే వొక్క సారి పెద్ద శబ్దం తో ఈ లోకం లోకి వచ్చా

 నాముందు కారు కింద ఎవరో అమ్మాయి స్కూటర్ తో సహా కింద పడి పోయి వుంది .రక్తం మడుగులో సృహ తప్పి .నేను వొక ఉదుటున కార్ డోర్ తీసుకుని ముందుకి వెళ్ళే లోపు చుట్టూ జనాలు వచ్చి ఆమె చుట్టూ మూగి పోయారు .ఎక్కువ మంది బతికిందో చనిపోయిందో చూడ దానికి వచ్చిన వాళ్ళే గాని చొరవ తీసుకుని సహాయం చేసే వాళ్ళు కనబడలేదు .మరి నువ్వో నా మనసు ప్రశ్నించింది .యిప్పుడు ఈ మెడికో లెగల్ కేసు నెత్తిన పెట్టుకుని పరోపకారి పాపన్నా లా సహాయం చెయ్యడం అవసరమా ?సెల్ తీసి నూట ఎనిమిదికి కొట్టి వివరాలు చెప్పే లోపే తెలిసిందండి ఎవరో యింతకు ముందే చెప్పారు వస్తున్నాం అంటూ సమాధానం విని మనం ఆలోచించే లోపు ఆదుకునే వారు యింకా వున్నారు లోకం లో అని పించింది .
సరే అంబులెన్సు వస్తుంది గా వాళ్ళే చూసుకుంటారు అనుకుంటూ కార్ కేసి అడుగులు వెయ్య బోయా . మనసెందుకో వప్పుకోవడం లేదు మళ్లీ గుంపు లోకి అడుగు పెట్టా . కొంచెం తోసుకుని లోపలి వెళ్ళడం వొక గాలి తిమ్మెర శరీరాన్ని తాకుతూ రోడ్డు మీద పడి మొఖం నిండా కప్పి వున్న ఆమె చున్ని ని తొలగించడం వొకే సారి జరిగింది .నేను ఉత్సుకత తో ఆమె మొఖం కేసి చూసా , నమ్మలేక పోయా మళ్లీ దగ్గర గా వెళ్లి చూసా అంతే నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది .అవును తనే ఎవరి కోసం అయితే నేను గత పది ఏళ్ళు గా కళ్ళలో వత్తులు పెట్టుకుని మరి వెతుకు తున్నానో , ఎవరైతే నా జీవితం లో ప్రేమ మధురిమలని నింపి ఆనందపు అంచులలో మధురామ్రుతాలని పంచి వసంత కోకిల లా వెళ్లి పోయి నా నిన్నలలో కలిసి పోయిన నా స్వప్న సుందరి . తనే వోకప్పటి నా హిమాని .
అందానికి ప్రతి రూపం అయ్యి సయిన మందిరం లో రాజ హంసలా పడుకుని ఎన్నో సార్లు నయనానదం కలిగించిన ఆమె ఈ రోజు నడి రోడ్డు మీద దిక్కు లేకుండా చావు బతుకుల మద్య అసహాయ స్తితిలో కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి . యింతలో అంబులెన్సు వచ్చింది . బాగ్ లో సెల్ ఉందేమో చూడండి వాళ్ళ వాళ్లకి ఫోన్ చెయ్యాలి అంటున్నారు . నేనే వాళ్ళ వాడిని అంటూ అంబులెన్సు లో కూడా అనుసరించా .వాళ్ళు ప్రబుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళ బోతుంటే నేను కార్పోరాట్ ఆసుపత్రికి మళ్ళించా .ఆమె సృహలో లేదు తలకి పెద్ద దెబ్బే తగిలింది . రక్తం యింకా వస్తోంది .హాస్పిటల్ లోకి వెళ్ళ గానే ఆమె ని అయిసియు లోకి తరలించారు .బ్రెయిన్ స్కాన్ తీసి అర్జెంటు గా ఆపరేషన్ చెయ్యాలి ముందు లక్ష రూపాయలు కట్టండి అంటె నా డెబిట్ కార్డు తీసి కట్టేసా . డబ్బు వచ్చాక మీరు ఏమవుతారు ఆమె కి అని అప్పుడు అడిగారు .దారిన పోయే దానయ్య ముందు పని చూడండి డబ్బు వచ్చింది కదా అని అరిచా .అసలు తను పెళ్లి అయ్యాక అమెరికా వెళ్లి పోయిందని చూచాయ గా తెలుసు హైదరాబాద్ ఎప్పుడు వచ్చిందో ?ఎక్కడ ఉంటోందో ?కనీసం వొక ఫోన్ కూడా లేదు మేము విడి పోయాక . తన పెళ్ళికి పిలిస్తే వెళ్లి చెయ్యి కలిపినప్పుడు కళ్ళలో నీళ్ళు తెచ్చుకుని వేళ్ళతో నా అరచేయ్యిని గోకుతూ వీడ్కోలు తీసుకున ఆ స్పర్స మళ్లీ యిలా సృహలేని స్తితిలో అయిసి యు కి వెళుతునప్పుడు నా వేళ్ళతో ఆమె ని తాకినప్పుడు పునరావృత్తం అవుతుందని అనుకోలేదు .
రాత్రంతా అయిసియు బయటే గడిపా .వాళ్ళ వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో ?తెల తెల వారు తుండగా ఆమె ఆపరేషన్ విజయవంతం అయ్యిందని సృహ లోకి రావడానికి యింకొన్ని గంటలు పడుతుందని వొక నిమిషం చూసి రావడానికి అనుమతి యివ్వడం తో లోపలి వెళ్ళా .ప్రశాంతం గా నిద్ర పోతునట్టు గా వుంది .అదే చిరునవ్వు మొఖం .మా యిద్దరి మద్య సన్నీ హితం తారా స్తాయి లో వున్నప్పుడు తను నా చేతిలో చెయ్యి వేసి నిమురుతూ ఈ ప్రేమ యిలా ఎప్పటికి కోన సాగుతుందా ?కాల గమనం లో మనం విడి పోయి ఎవరి జీవన పయనం లో వాళ్ళు సాగి పోతునప్పుడు మన మద్య కనీసం మాటల రాక పోకల్ని అయినా కోన సాగించ గలమా ?అని కళ్ళలో నీళ్ళు పెట్టుకుని అడుగుతుంటే పో పిచ్చి మొద్దు అటువంటి స్తితి మన మద్య ఎప్పుడు రాదు . వొక వేళ వచ్చినా యిద్దరం బలం గా మనసులో వొకరి తో వొకరు మాట్లాడుకోవాలి అనుకుంటే అదే క్షణం సాధ్య పడుతుంది . కలవాల్లాన్నంత బలమైన కోరిక మనసులో కలిగితే మనం కలవకుండా ఆపడం ఎవరి తరం కాదు అని వోదర్చా .కాల గమనం లో ఆమె వుహించినట్టే ఆమె కి వేరే వాళ్లతో పెళ్లి అయిపోవడం తన గతకాలపు స్మృతులు ఎట్టి పరిస్తితుల్లో భర్తకి తెలికుడదన్న ముందు జాగర్త చర్య వల్ల ఆమె ఏ నాడు నా తో ఏ విధమైన సంభందము పెట్టుకోలేదు అంతకు ముందు మేము అన్ని విధాలా హద్దులు మీరినా కూడా .
రాత్రంతా నిద్రలేక పోవడం , యింట్లోకుడా ఎవరో కావలిసిన వాళ్ళకి హాస్పిటల్ సాయం అవసరం అయితే యిక్కడే వుండి పోతున్నా అని చెప్పడం తో వాళ్ల కంగారుని తగ్గించడం కోసం వొక రెండు గంటలు యింటికి వెళదామని యింటి కొచ్హా .మంచం మీద పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది .మెలుకువ వచ్చేటప్పటికి చీకటి అయిపోయి వుంది . అంటె నేను పొద్దుట నుంచి రాత్రి దాక వొళ్ళు తెలీకుండా నిద్ర పోయానా ?మెలుకువ రాగానే హిమాని ని హాస్పిటల్ లో జాయిన్ చేసిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే హాస్పిటల్ కి పరిగెత్తా .అయిసియు లో వాకబు చేస్తే పోద్దునీ సృహ లోకి రాగానే తను వాళ్ల హబ్బి నెంబర్ కి రింగ్ చేస్తే అయిన వచ్చి అగైనిస్ట్ మెడికల్ ఎడ్విజే డిశ్చార్జ్ చేయించుకుని మెరుగైన వైద్య సౌకర్యం కోసం అమెరికా తీసుకు పోతునట్టు చెప్పారని తెలిసింది .మళ్లీ జీవితం లో ఆమెని నేను కలవలేక పోవచ్చు . ఎప్పటికి ఆమెకి తన ప్రాణా పాయ స్తితిలో నేను నా ధర్మం నిర్వర్తిన్చినట్టు తేలిక పోవచ్చు .నేను ఆమె దృష్టిలో కాల గర్భం లో కలిసిపోయిన కా (ప్రే )మికుడిగా మిగిలి పోవచ్చు . అయినా నా గుండె లోతుల్లో ఆమె మీద వున్న చెదరని ప్రేమ ఏవిధమైన గుర్తింపుని కోరుకోవడం లేదు .ఆమె మళ్లీ జన జీవన స్రవంతిలో కలిసిపోయి ఎప్పటి లాగే నవ్వుతు నవ్విస్తూ అప్పుడప్పుడు నన్ను తలచుకుంటే నా కాదే చాలు పదివేలు . ''మరు జన్మ ఉన్నదో లేదో ?మరి అపుడి మమతలేమవుతాయో ?మనిషికి మనసే తీరని శిక్ష దేముడిలా తీర్చుకున్నాడు కక్షా' కార్ స్టార్ట్ చేసి యింటికేసి సాగి పోతుంటే ఎఫ్ ఏం లో పాట. మరి మరు జన్మ ఉందా ?

24 జూన్, 2012

తిండి లో కూడా వివక్షా?

                  అప్పుడే ఆఫీసు నుండి వచ్చా. అప్పటికే తొమ్మిది అవుతోంది .అంతలో సెల్ మోగింది .ఎవరా అని విసుక్కుంటూ తీసా .సినిమా ప్రోడుక్షన్ మేనేజర్ .సార్ బావున్నారా ? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో వెంకటేష్ బాబు మహేష్ బాబు  కాంబినేషన్ లో పెళ్ళిచూపుల  సీన్ వుంది  స్నేహితుడి గా వొక్క రోజు షూటింగ్ రెండు మూడు డైలాగ్స్ కుడా వున్నాయి రాగలరా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ పొద్దున్నే కార్ పంపిస్తాను అన్నాడు .యింతకు ముందు రెండు మూడు సినిమాల్లో వెయ్యడం తో కొద్దో గొప్పో పరిచయాలు ఏర్పడ్డాయి . అయితే ఆ తర్వాత రోజు నేను కచ్చితం గా ఆఫీసు లో అటెండ్ అవ్వవలసిన మీటింగ్ సంగతి గుర్తుకు వచ్చి ఆ ఆఫర్ ని సున్నితం గా తిరస్కరించా .కొంచెం సమయం యిచ్చి చెప్పి వుంటే నటించేవాడినని  యింకో సారి చూద్దామని చెప్పి ఫోన్ పెట్టేసా .ఎంతో  మంది సినిమాలో వొక్కసారి కని  పిస్తే చాలు అని అర్రులు చాస్తుంటే  వచ్చిన అవకాశాన్ని వాడుకోలేని పరిస్తితి . నటన వొక  హాబీ అంతవరకే వుద్యోగం వొక భాద్యత అందులో ప్రబుత్వ అధికారి గా అది భగవంతుడు యిచ్చిన వరం .అరె వొక్క రోజు కుడా లీవ్ పెట్టుకోలేమా అనుకుని మళ్ళి  పెద్ద గీత ముందు నటన చిన్న గీత అనుకుని మర్నాడు పని లో ములిగి పోయా .మీటింగ్ అవ్వగానే ముందు గా మా లంచ్  అయ్యాక కింద స్టాఫ్ ని లంచ్ కి పిలుస్తారు .ఈ వివక్ష అన్ని చోట్ల వ్యాపించి వుంది . నా మూడు సినిమా షూటింగ్ అనుభవాలు గుర్తుకు వచ్చాయి .
       అక్కడ కుడా కార్వాన్ (ఎసి సదుపాయం తో పాటు యితర సౌకర్యాలు అన్ని వుండి షూటింగ్ స్పాట్ లో రెస్ట్ తీసుకోవడానికి పెట్టె బస్సు )కేవలం హీరో హీరోయిన్ లేదా బ్రహ్మానందం  స్తాయి కమెడియన్ కి మాత్రమె .మిగతా వాళ్ళు అంతా అక్కడ దగ్గరలో వేసిన చైర్స్ లో కూర్చో వలసిందే . వోకో సారి అందరికి సరపడా కుర్చీలు వుండవు .అందుకే ఆక్టర్  సహాయకులు కుర్చీలు మోసుకుంటూ తిరుగుతారు .యిక్కడ కూడా  మూడు గ్రూప్స్ గా కూర్చుంటారు ,హీరో ,డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , స్టార్ కమెడియన్ వొక చోట కూర్చుంటే ,కేరక్టర్ అర్తిస్త్స్ ,యితర చోటా మోట నటులు వొక చోట .సాంకేతిక నిపుణులు మరో చోట .యిందులో మొదటి గ్రూప్ కి అరార కొబ్బరి నీళ్ళు ,ఫ్రూట్ జ్యూసులు వస్తే మిగతా వాళ్ళకి టీ మంచి నీళ్ళు  వస్తుంటాయి .యింక భోజనాల దగ్గర అయితే తేడా యింకా కని పిస్తుంది . మొదటి గ్రూప్ కి రెండు మూడు ప్రత్యేకమైన నాన్ వెజ్  తో పాటు అయిటేమ్స్ తో పాటు వడ్డన సదుపాయం వుంటుంది .రెండో గ్రూప్ కి ప్రత్యేకమైన ఐటం వుండనప్పటికి వడ్డన సదుపాయం వుంటుంది . యిక మూడో గ్రూప్ ఎవరికి వారే వడ్డిన్చుకోవాలి .యింక రామారావు గారి హయాములో అయితే అయన తిన్నాకే మిగత వారు  తినాలిట చెయ్యి కడుక్కుందుకు వచ్చినా కూర్చున్న వాళ్ళంతా చేతులు కట్టుకుని నిల బడాలి ట .ఎన్ని సార్లు సెట్ లోకి వస్తే అన్ని సార్లు లేచి నిలబడి నమస్కారం చెప్పాల్సిందే . లేక పొతే వాడి పాత్ర నిడివి తగ్గిపోవలసిందే .అయితే నా విషయం లో ఆ యిబ్బంది ఎదురవ్వ లేదు వేసింది చిన్న నిడివి వున్నా పాత్రలే అయినా నా ఉద్యోగ రీత్యా నాకు అవసరమైన దాని కన్నా ఎక్కువ మర్యాద చేసి కొండక చొ కార్వాన్ లో కుడా విశ్రాంతి తీసుకున్న సందర్భాలు వున్నాయి .
 అయితే నేను షూటింగ్ స్పాట్ లో చూసి బాధపడిన వివక్ష నా మీటింగ్ తర్వాత లంచ్ లో కుడా కనిపించి (కింద స్టాఫ్ ని తర్వాత చెయ్యమనడం )యింకో ఆఫీసర్ తో స్టాఫ్ ని కుడాయిప్పుడే  రమ్మంటే  ?అని నేను అనే లోపే వుర్కోండి సార్  యిప్పుడు మనతో లంచ్ అలవాటు చేస్తే రేపు మనతో కలిసి మందు కొడతా మంటారు . అప్పుడు చనువు పెరిగి చంక ఎక్కుతారు పని ఎలా రాబడతాం?బ్రిటిష్ వాడి పద్దతే కరెక్ట్ ఎక్కడి వాడిని అక్కడే ఉంచాలి ,లేక పొతే తాళం తప్పుతుంది . అంటూ చికెన్ వడ్డించు కోవడానికి  ముందుకు పోయాడు . ఈ వ్యవస్థ మారదు .పైకి ఎదిగిన కొద్ది ఇగో లు పెంచుకోవడమే గాని భుజం మీద చెయ్యి వేసి పని చేసే తత్త్వం ఎక్కడా రాదేమో . అయితే నే విన్నది ఏంటంటే కొల్లివుడ్ (కేరళ లో )లో లైట్ బాయ్ నుంచి హీరో వరకు వొకే చోట కుర్చుని  అందరు అవే ఇటేమ్స్ తింటారని .మరి అన్ని చోట్ల ఈ వ్యవస్థ వస్తే బానే వుంటుంది ముఖ్యం గా ఆఫీషియల్ మీటింగ్స్ లో .

29 మే, 2012

మరి అది ఎప్పుడో ?

 
 
చాలా కాలం నుంచి నెట్ వైపు ద్రుష్టి పెట్టె సమయం  దొరక్క కొంచెం  తాత్కాలిక వియోగం వచ్చింది బ్లాగ్ తో .
ప్రస్తుతం వొక వారం ట్రైనింగ్ ప్రోగ్రాం నిమిత్తం బరోడా రావడం తో కొచెం సమయం చిక్కింది మళ్ళి   బ్లాగ్ దురద తీర్చు కోవడానికి .విశాలమైన కాంపస్ లోఆఫీసర్స్ కోసం నిర్మించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ .ఎదురుగుండా పెద్ద ఉద్యాన వనం .అందులో వాకింగ్ చేద్దామని వుబలాట పడి వెళితే మొహమాట పడి తలకాయ దించుకోవలసిందే .అక్కడా ఆడా మగ వయసుతో సంభంధం లేకుండా బహిరంగం గానే ముద్దు ముచ్చటలో  ములిగి పోయి కని పిస్తారు .యిక్కడ ఏడున్నర అయినా చీకటి పడదు అయినా వాళ్ళకి తేడా పడదు .ఈ గాలి నేల లో ఏమన్నా తేడా ఉందా అని వొక స్నేహితున్ని అడిగితె యిక్కడ ఆడ వాళ్ళు పెళ్ళయ్యాక డరోడా స్టీమర్ లా తయారయ్యి ముద్దు ముచ్చటకి పనికి రాకుండా పోతారు కాబట్టి అదేదో పెళ్ళికి ముందే కానిచ్చేస్తారని అతని ఉవాచ .ఏంటో ప్రపంచం లో కామం కామన్ అయిపొయింది ఈ మద్య అనిపించింది .ప్రతి భంధం  అక్కడికే దారి తీస్తోంది చివరికి .పరిచయం అయిన పది నిమిషాలకే  పదనిసల టాపిక్ లోకి వెళ్లిపోతుంటే లోకం చాలా ఫాస్ట్ అనుకోవలసి వస్తోంది .అక్కడ జంటలు పార్క్ లోంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరి  దోవన వాళ్ళు అపరిచితులు లాగ పోతున్నారు అదేంటో ?ప్రేమ ఎక్కువుంటే అక్కడ కామం వుండదు .కామం మాత్రమే వున్న చోట వాళ్ళ అవసరాలు మాత్రమె వాళ్ళిద్దర్నీ కలిపి ఉంచు తాయి .అవసరాలు తీరవు అని తెలిసిన మరుక్షణం మరో గూటికి చిలక యెగిరి పోవును .అందుకే ఏ ప్రేమికులకైనా మొదట్లో వున్న ఉదృతి , మాటల వెల్లువ రాను రాను తగ్గి పోయి , యింకేంటి యింకేంటి స్తాయి లో ఆగి పోతారు మళ్ళి యింకో కొత్త వాళ్ళు వచ్చే దాక .దీనికి భిన్నం గా నాకు తెలిసిన వొక ఆద్యాత్మిక  ప్రేమికుల కదా రాసుకున్నా .ఆకర్షణ , ప్రేమ , కామం దాటి ఎంతో ఎత్తులో నే చూసిన మరో మరోచరిత్ర . అయితే ప్రచురించ డానికి అతను అనుమతించక పోవడం తో అది కంచికి చేరని కధ గా వుండి పోయింది . ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకానికి  , ఏళ్ళ వెళాల మదిలో రగిలే  అగ్ని జ్వాలకి వున్న తేడా నిజమైన ప్రేమకి కామానికి  మద్యన  వున్న పొంతన .వొక మంచి కధ రాయాలని ఉంది . కామం లేని ప్రేమ కధ .పాత్రలు కళ్ళని దాటి కిందకి రాని కధ .యెంత దూరం లో వున్నా అంత చేరువలో వున్న అనుభూతి కి లోనయ్యే ప్రేమికుల కధ .వుసులాడు  కోకుండానే మాటలకందని మధుర భావాల్ని సొంతం చేసుకున్న ప్రేమికుల కధ .అంతులేని ఆ కధ .వొక రోజు వొకరి కోసం  వొక్క సారి రాయాలని ఉంది . మరి అది ఎప్పుడో ?

6 ఏప్రి, 2012

ఆశించకుండా ఆస్వాదిద్దాం

 

నిన్నటి వరకు  నీతో నడిచిన నా అడుగులు
నేటి తో ఎందుకు మీ యింటిముందు కు  రానని మోరా యిస్తున్నాయి ?
మనసు ముందుకువెళ్ళమంటున్నా  సహకరించాకున్నాయి?
ఎన్నాళ్ళిలా అభిప్రాయ బేధం ?
పిదప ఆమోదం
ఈ మోదం ఖేదం మద్య మన ప్రయాణం ?
మనసుకి గాయం చేసి రెండురోజులు దూరం చేసి
మళ్ళి లేపనం పూసి , మసిపూసి మారేడుకాయ చేసి
లాలించి , మనసుకి మత్తు ని నింపి ,
ప్రేమను పంపి  ,మరిచిపోయిన మమతల్ని తట్టి లేపి
నన్ను నీ ఆట బొమ్మను చేసి ఆడుకుంటావు
కొత్త బొమ్మ రాగానే మళ్లీ మూల  పడేస్తావు
మమతులుడిగిన మనసులాగ
కొమ్మలు విరిగిన మానులాగ
మళ్ళి చిగురులు మోలిచేదాకా ఎన్నాళ్ళి నిరీక్షన ?
ఎన్నాళిలా  మనసు తీగలు సవరిస్తావు ?
మళ్ళి మళ్ళి మురిపిస్తావు
అంతలోనే అశ్రుధారలు కురిపిస్తావు
వద్దు నేస్తం యింతటితో ముగిద్దాం
మనస్పర్ధలకి చరమాంకం పలికిద్దాం
కొత్త భంధాన్ని మొదలెడదాం
ఏమీ ఆశించకుండా ఆస్వాదిద్దాం

4 ఏప్రి, 2012

ఆమె అతన్ని కోల్పోయింది


 

 
రెండేళ్ళ క్రితం వరకు అతనికి ఆమె ఏమీ కాదు .ఈ రెండేళ్ళు మాత్రం అతనికి అన్ని ఆమె .ఆమె కి మాత్రం తన జీవితం లో  .అతను కూడా వొకడు .ఆమె ఏదో వొక రోజు తనని వదిలి వెళ్లి పోతుందని తెలుసు గాని అది యింత త్వర గా వచ్చేస్తుందని అతను ఉహించ లేదు .
నడకలో అనుకోకుండా వొక వర్షం కురిసిన పొద్దున్న చిన్న షెల్టర్ కింద మొదలైన వారి పరిచయం , రెండేళ్ళ తర్వాత అనుకోకుండా వొక వర్షం కురిసిన రాత్రి
మాటల పెను తుఫాన్ లో చిక్కి చిలికి చిలి గాలి వాన లా మారి ప్రళయం లా ముగిసి పోతుందని కల లో కూడా అనుకోలేదు .ఆమె వొక స్వేచ్చా జీవి.ప్రతి నిమిషం ఆనందం గ్రోలాలని , తన ప్రేమామృతాన్ని వీలయినంత  మందికి పంచాలని ,అడిగిన వాడికి ఆనందం యివ్వక పోవడమే పాపమని ,పరిధులు దాటి విహంగం లా విహరించడమే జీవిత పరమావధి అని ప్రఘాడం గా విశ్వసించే గృహిణి.భార్యని అదుపులో పెట్టడం అంటే ఆమె స్వేచ్చకి భంగం కల్గించడమే  అని ,తప్పొప్పులు అన్నవి ఎవరికి వారు నిర్దేసిన్చుకున్నవే తప్ప నిజానికి లోకం లో తప్పొప్పులు రిలటివ్
అని భార్యకి పూర్తీ స్వేచ్చానిచ్చేసిన ఆమె భర్త ,
యిది అతనికి ,  ఆమెపరిచయం తర్వాత అర్ధమైన వాళ్ళ కుటుంబ వ్యవహారం .ఆమె వ్రిసున్ఖలత్వాన్ని ప్రశ్నించ కుండా ఆమె పంచె ప్రేమ లో తన వాటా తీసేసుకుని టాటా చెప్పేసి  మళ్ళి మూడ్ వచ్చినప్పుడు వస్తే వొకే అంతే గాని ఆ ప్రేమకి బానిస అయిపోయి అందులో మునిగి పోయి పోస్సేసివేనేస్స్వల్ల ఆమె కదలికల్ని ప్రశ్నించడం మొదలు పెడితే ప్రళయమే .
 ఆమెని వొక నది లా భావించి సరి గంగ స్నానాలు చేసి ఆనందం గ్రోలాలని అతను భావిస్తే , అప్పటికే అక్కడ వల వేసి చేపలు పట్టుకునే వాళ్ళు , నది వడ్డున లఘు శంక , మూలా శంక లు తీర్చుకుని కడుక్కోవడానికి వచ్చే వాళ్ళు ,రక రకాల మనుషులు ఆ నదిని అపవిత్రం చేస్తూ కని పించారు .అదేంటని ఆమెని ప్రశ్నిస్తే నది అందరిది నీ పని నువ్వు చూసుకుని పో ,కట్టుకున్నవాడికి లేని బాధ నీ కెందుకు ?ఆమె సమాధానం .
 అయినప్పటికీ ఆమె మీద వున్న అవాజ్యమైన ప్రేమతో ఏదో వొక రోజు తను మారుతుందని ,నది ప్రక్షాళన అవుతుందని చకోర పక్షిలా యిన్నాళ్ళు ఎదురు చూస్తే, అందులో మునిగిన వాడు మురికి అవడమే తప్ప తను మారదని మరో సారి నిరూపించింది .ఆ రోజు ఎప్పటి లాగే అతను ఆమె యింటికి వెళితే గత నేళ్ళలుగా వాళ్ళింట్లోనే తిష్ట వేసిన చుట్టం (ఏం పని మీదో అతనికే తెలిదుట )  బారెడు పోదేక్కినా యింకా నిద్ర పోతూనే వున్నాడు . ఆమె యింట్లో పనులు చేసుకుంటూ తలుపు తీసింది .
 ఎవరన్నకొత్త  వ్యక్తులు యింట్లో వుంటే ఆమె మాటల్లో తేడా స్పష్టం గా కని పిస్తుంది .ఎప్పుడు పోతాడా అనట్టు ముభావం గా మాట్లాడుతుంది . ఎంటండి విషయాలు అంటె ఏమి లెవ్, మీ చుట్టం ఎప్పుడు వెళ్తున్నాడు అంటె తెలిదు అంటూ కట్టే కొట్టే తెచ్చే టైపు లో సమాధానాలు వస్తుంటాయి .
దాంతో అతను అసహనానికి గురయ్యి నేను ఎప్పుడు పోతాన అనట్టు మాట్లడతారేం ? ఏమన్నా రాచ కార్యాలు ఉన్నాయా నే వెళ్ళాకా ?కొంచెం వ్యంగం గానే అన్నాడు .
 ఆమె లో కూడా యిది వరకటి సహనం నశించి పోయింది , అవును వున్నాయి నువ్వు పొతే పని మొదలెట్టుకుంటాం గట్టి గానే అరిచింది .
 అలా అడ్డమైన వాళ్ళా తో పనులు మొదలెడితే తెలుగులో లం  తో మొదలయ్యి జ తో అంతం అయ్యే పదం అంటారు అతని సమాధానం .
అంతే ఆమె భద్రకాళి లా మారి పోయి అవునురా నువనుకున్తునట్టు నేను అదే నా యిష్టం , నువ్వేవడురా నన్ను అడగ డానికి ?లం అని తెలిసింది గా యింక వదిలెయ్యి .
రెండేళ్ళ క్రితం తెలిసి వుంటే వెంటనీ వదిలేసి వుండే వాణ్ణి . యిప్పుడు చాలా దూరం వచ్చేసి లతలాగా అల్లుకు పోయాక వదిలెయ్యి అంటె, పాదు పందిరి వొకే సారి పోవాలి  .
ఈ రెండేళ్లలో నీ దగ్గర నేను ఏమి తీసుకున్నానని లం అంటావురా ?అయినా యిప్పుడు అన్నావు కాబట్టి చెపుతున్నా నేను వచ్చే వారం , నీ కళ్ళాముందే  మా యింట్లో సరసాలాడిన రమేష్ వాళ్ళ ఊరుకి పోతున్నా అక్కడ పది రోజులు వాడి తో ఎంజాయ్ చేసి వస్తా ఏం పిక్కున్టవో పిక్కో .
అంత బరి తెగించిన లం ని ఏ మగాడు మాత్రం యేమన గలుగు తాడు కత్తి తీసి పొడి చెయ్యడం తప్ప అతని సమాధానం అయ్యే లోపే ఆమె చేతిలోని గరిటె తో అతని వీపు మీద గట్టి గా రెండు దెబ్బలు వేసింది .అతను సంయమనం పాటించి వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసాడు .వొక గంట కష్టం మీద గడిచిందో లేదో అతనికి ఆమె మీద కోపం పోయి ప్రేమ పెల్లుబికి సెల్ కి చేస్తే ముందు తియ్యలేదు మళ్ళి చేస్తే చుట్టం సెల్ ఎత్తి ఆమె బాత్రూం లో వుందని సమాధానం చెపుతున్నాడు .అతను శబ్దబేది లో నిష్ణాతుడు కాబట్టి చుట్టం తో సంభాషణ పొడిగిస్తూ నా కాగితాలు అక్కడ మర్చి పోయా కొంచెం చూస్తారా అంటె అతను వెదుకుతూ ఆమెని పిల్చి కయతాలంట
అంటున్నాడు దానికామె ఏం కాయతాలు అంటూ చుట్టాన్ని అడుగుతోంది అంటె ఆమె బాత్రూం లో లేదన్నది రుధి అయ్యింది .ఆమెకి ఫోన్ వొక సారి యివ్వండి బాత్రూం లోంచి వచ్చింది కదా అంటె గతి లేని పరిస్తితులలో ఆమె కి ఫోన్ యిచ్చాడు చుట్టం .
ఏంటి అని ఆమె అనేలోపే అతను ఏంటి బాత్రూం నుంచి తుండు గుడ్డతో బయటకు వచ్చేసారా ? చుట్టం వున్న గాని ? యిప్పుడే బాత్రూం అన్నాడు అంతలోనే  చెంగున వచ్చేసారు ?అతను మాట్లడదమనుకున్నది వొకటి ఆవేశం లో మాట్లాడుతున్నది వొకటి . భంధం తెగి పో గుడదని ఆఖరి ప్రయత్నం గా మాట్లడదామనుకుంటే అక్కడి పరిస్తితులు అతన్ని మళ్ళి ఆవేశానికి పూరి గోలి పేలా వున్నాయి . తనేదో బాధలో మౌనం గా ఉంటుందనుకుంటే తన సెల్ మళ్ళి బిజీ నే , రమేష్ సెల్ కూడా బిజీ నే .ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎర్రి పీనుగ ఎవరంటే అతనే .
 ఆమె ఫోన్ లోనే ఆవేశం గా ఊరే లం కొడకా నా జోలికి వచ్చి సతాయిన్చావంటే నీ ఆఫీసు కి వచ్చి రచ్చ రచ్చ చేస్తా , మీ యింటికొచ్చి మీ ఫ్యామిలీ తో మొత్తం చెప్పేస్తా (ఏ మొత్తం ? అసలు వాళ్ళిద్దరి మద్య ఏం జరిగిందని? )అయినా లం ల తో నీకు పనేన్దిరా ?నన్ను లం అన్నవాడు ఆరు నెలలలో పైకి పోతాడు అంటూ ఆవేశం గా ఆంటోంది.
మరి లం ఎన్ని నెలలలో పోతుంది ? అతను కౌంటర్ వేసాడు .ఆమె సెల్ కట్ చేసింది . అతని మనసు కాకా వికలం అయ్యింది .
 వొక భంధం ముగిసి పోయింది . యినుము విరిగితే నిప్పుతో అతికించొచ్చు మనసు నిప్పుల కొలిమి అయి విరిగి పొతే అంటించడం ఎవరి తరం . మళ్ళి వాళ్ళిద్దరూ ఎప్పటికి మాట్లాడుకోలేక పోవచ్చు .వొక వేళ మాట్లాడుకొన్నా ఇదివరకటి ప్రేమ భావం పొంగదు . ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లి వాళ్ళింట్లో వేడి వేడి పొగలు గక్కుతున్న కాఫీ తాగుతూ చెప్పుకున్న ముచట్లు మూగ బారి పోవచ్చు .ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్నో సార్లు సెల్ లో ఆమెని నవ్విస్తూ ఆనంద పరిచిన మధుర క్షణాలు మౌనం గా మారి పోవచ్చు . వొక తెలీని నిశబ్దం మనసంతా ఆవరించి భోరున మౌనం గా రోదిన్చొచ్చు .మనసుని రంజింప చేసిన ఆమె గొంతు జ్ఞాపకాలలో మిగిలి పోవచ్చు .ఈ బాధని కొన్నాళ్ళకి  అధిక మించి అతను   మళ్ళి  జన జీవన స్రవంతి లో కలిసి పోవచ్చు .
 ఆమె మాత్రం పీడా విరగాడయ్యిన్దనుకుని మరింతగా తన పాత , కొత్త మిత్రులతో వ్యవహారాలూ కోన సాగిన్చొచ్చు .రెండేళ్ళ తర్వాత నాలో కూడా ఈ కోరికల ఉదృతి తగ్గి పోతుంది గా అని చెప్పే ఆమె ఈ రెండేళ్ళు మరింత విజ్రుభించొచ్చు . కాని ఆ ఉదృతి తగ్గి పోయిన తరవాత అయినా మనసు పొరల లో సమాధి చేసేసిన అతని జ్ఞాపకాలు బయటకు వచ్చి నప్పుడు ఆమె అనుకుంటుంది ''అతన్ని కోల్పోయానని ''.