28 సెప్టెం, 2014

అదే రాగం అదే రోగం

 

ఆ రోజు నువ్వు అందరి ముందు చేసిన ఘోరమైన అవమానం తో యిన్నాళ్ళ భంధం ముగిసింది ,యింక నేను స్వేచ్చా జీవిని  అనుకుంటూ బయట కొచ్చా . కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టి నట్టు గా వున్ది. నా సెల్లు  యిదివరకులా బిజీ టోన్  రావడం లెదు. అందరికి అందుబాటులోకి వచ్చేసా . అందరి ముందు నువ్వు చేసిన అవమానం గుర్తుకు వచ్చినప్పుడల్లా నీ మీద అసహ్యం ,కసి పెరిగి నీ ఆలోచనల్ని నా బుర్రలోంచి చెరిపేసి పదిరోజులు అప్పుడే గడిపేసా . యింక ఎప్పటికి నువ్వు నా డైరీ లో వొక పాత పేజి గా నే వుండి  పోతావని బలంగా నమ్మా . ఎప్పటిలాగే వాకింగ్ కి వెళుతూ మీ యింటి ముందు చూస్తే  యింటికి తాళం . కార్ కూడా   లేదు . అంటే యింత అవమానం చేసినందుకు నీలో యింత కూడా పశ్చాతాపం లేదనీ , నువ్వు కుటుంబ సబ్యులతో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి మీ వూరు వెళ్లి పోయావని అర్ధం అయ్యిన్ది. అసలు ఆ సంఘటన జరిగిన వెంటనే నువ్వు సారీ చెపుతూ ఫోన్ చేస్తావని ఆశించడం లోనే నేను నిన్ను యెంత గుడ్డి గా నమ్మానో అర్ధం అయ్యిన్ది. అమలిన  మైన ప్రేమ  అంటే అడిగిన వెంటనే అన్ని అవసరాలు తీర్చేసి ,మూసుకు  కూర్చుని  అనవసర వ్యక్తుల గురిచి గాని, వారు ఎందుకు వస్తున్నారని గాని, ఆరా తియ్యకుండా ఉండడమే అని కొత్త నిర్వచనం తెలియ జెసావు. రోజు కనీసం వొక అరగంట అయినా ప్రత్యక్షం గా కలిసి మాట్లాడ కుండా  ఉండలేని ఈ దౌర్భాగ్యపు అలవాటు నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా . సెల్ ఎప్పుడు మోగినా నీదేనేమో అన్న బ్రమలోంచి వాస్తవం లోకి వస్తున్నా. నీ ఆలోచనల మద్య పనులు  అన్యమనస్కం గా నే చేసుకుంటుంటే ,నీ పనుల మద్య కూడా  మాటవరసకి నేను గుర్తు రానప్పుడే నా కర్దమయ్యిన్ది. నీదొక బిజినెస్స్ డీల్ అని. అక్కడ పాత్రలు అవే వుంటాయి పాత్ర దారులు మారుతూ కాల  గర్భం  లో కలిసి పొతారు. నువ్వు మాత్రం నిరంతరం సాగి పోయే వైతరణి నదిలా మరింత పాపుల్ని జమ చేసుకుంటూ వుంటావు . నీకు చీమ కుట్టినట్టు కుడా వుండదు . నా కంటే ముందు అయిదుగురు యిదే బాట పట్టారని తెలిసినప్పుడు కూడా ఛ ఛా  నిజమైన ప్రేమ వోదిడుడుకుల్ని తట్టుకుని నిలబడుతుందని అనుకున్నా. అసలు అక్కడ వున్నది ప్రేమ కాదు బిజినెస్స్ అన్నాక చివరికి ఎవరి కైనా అదే గతి కదా. ఈ మనసు ఎందుకు అది తెలుసు కోక  వ్యాకులత పడుతోంది? ఏదో ఆశ . వొక చిన్న ఫోన్ కాల్ ఈ బాధని పోగొట్టేసి ఎడారి లో వసంతం తీసుకు వస్తున్దని. వొక వేళ వచ్చినా మళ్ళి  నాలుగు రోజులు పోయాక  నీ బిజినెస్స్ డీల్స్ చూసి మనసు తట్టుగో గలదా?
 ఛి ఛి ఈ పెంట ఆలోచనల్ని దూరం గా పెట్టి బుద్దిని ఆద్యాత్మికంగా సక్రమ మైనా మార్గం లో పెట్టాలి అనుకుంటూ భక్తీ ఛానల్ పెట్టా . అందులో వొక ప్రముఖ ప్రవచన బ్రహ్మ ని మక్కి కి మక్కి కాపి కొట్టి తన ఆదాయ మార్గానికి వెసులు బాటు కల్పించు కోవాలని మాగంటి భోగేశ్వర రావు(గురువు గారు చాగంటివారికీ  కిక్షమాప్పనల తో))  అనే ఆయన ఖర్మ పునర్జన్మ అనే విషయం మీద ప్రవచిస్తున్నరు. ఒరిజినల్ బ్రహ్మ గారు  చెప్పిన దాన్నీ అచ్చులు హల్లులు మార్చి లైవ్ లో మేనేజ్ చెస్తున్నరు. అధర్మ బద్దమైన వాటి నీడ కూడా  మన మీద పడ కూడదు . పర స్త్రీ వ్యామోహం లో పడి ,జీవిత చరమాంకం లో భార్య పిల్లల చేత కూడా  అసహ్యించు  కో బడి ,యింకా కూడా  ఆ పర స్త్రీ మీదా వ్యామోహం పోకా వచ్చే జన్మ లో ఆమె యింటి కుక్కా గా పుడతాడు . యింతలో ఆయన చెబుతూ చెబుతూ తోడ మీదా గట్టి గా చరుచుకున్నారు . అంతే '' ఎంట్రా భోగు యింకా రాలేదే?నాలుగు ఊర్లలో ప్రవచనాలు అయ్యాక బోల్డు బట్టలు నగలు పట్టుకుని   దసరా కి మా యింటికి వస్తానన్నావు గా? రా రా '' లైవ్ లో ఎవరో ఆడ గొన్తు. అరె ఎక్కడో విన్న గొంతులా వుందే  అనుకుంటున్నా . మాగంటి వారు కంగారు పడుతూ యిలా కుడా ఆడవాళ్లు కైపు గా మాట్లాడినా మనం నిబ్బరం గా వుండాలి అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ జేబులో వున్నా సెల్ ఫోన్ ని ఆప దానికి ప్రయత్నం చేస్తున్నాడు . యింతలో మళ్ళి '' హోయి హోయి దీనికే కైపు అంటే మరి రేపు ఇక్కడికి వచ్చాక యింకేమంటావురా '' ?ఆప కుండా అదే తెలిసిన గొంతు సెల్ ఫోన్ లో
యింక భోగేశ్వర రావు మంచి నీళ్ళు  తాగే మిష తో తెర  వెనకకి పోయి'' నీ యమ్మ కడుపు మాడా .  యింత దాకా నాకింది చాల దుటే ?ప్రతి వూరి లో పెంట తీసుకు వచ్చి నీ వొడిలో పోయ్యాలా?నోరుమూసుకుని పెట్టు అవతల లైవ్ ప్రోగ్రాం ''అంటూ  మూతి తుడుచుకుంటూ మళ్ళి  కెమెరా ముందుకు వచ్చారు .  నా మనసు మాత్రం ఆ గొంతు మీదే వుంది ఎక్కడో బాగా పరిచయం వున్నా గొంతే . యింతలో నా సెల్ మోగింది మా కజిన్ నీ అర్జెంటు గా హాస్పిటల్ లో అయిసియు లో పెట్టారంటే అకడకి పరిగెత్తా. వాడికి ఆక్సిజెన్ పెడుతుంటే వాడి సెల్ యితర వస్తువులు నాకిచ్చారు పట్టుకొమ్మని . యింతలో వాడి సెల్ మోగింది . ''యిష్టమైన కష్టం '' అని డిస్ప్లేకని  పిస్తోంది . వాళ్ళ వైఫ్ అయి ఉంటుందనుకుని ఎత్తా . నేను హలో అనకుండానే అవతల నుంచి ''ఎరా దసరా కి సరదా గా గడుపుదాము బోల్డు బట్టలు నగలు తెస్తనన్నావు గా రా రా . నీ కోసం యిక్కడ పరదాలు తీసి సరదాలు ఎదురు చూస్తున్నాయి ''
మళ్ళి  నిందాకా మాగంటి మైక్ లో వినిపించిన వాయిస్.  నాకు బాగా చిర పరిచితమై చితిమంటల దాక తీసుకు వెళ్ళిన వాయిస్ . యింకోకడ్ని వైతరణి  నదిలో ముంచడానికి అయి సి యు దాక తీసుకు వచ్చిన వాయిస్ . ఎస్ అదే నా తాజా మాజీ ప్రేమికురాలి వాయిస్ . అంటే వొక్క రోజు నాతొ కూడా  మా కజిన్ వచ్చి పది నిముషాలు కుర్చుని మజ్జిగ తాగిన పాపానికి నాకు తెలీకుండానే వాణ్ణి  కూడా  ముగ్గు లోకి దింపి రగ్గు కప్పిందన్న మాట (అయి సి యు లో అని కవి భావం ). నేను సెల్ కట్ చేశా డాక్టర్ వచ్చి పెదవి విరిచేశాడు . లాభం లేదండి మా ప్రయత్నాలు మేము యెంత చేసినా అయన స్పందించటం లెదు. మీరు ఆఖరి సారి ఏమన్నా చెప్పాలంటే చెప్పు కొండి అన్నాడు . యింతలో అతని సెల్ మోగడం తొందర లో అతని స్పీకర్ ఆన్ అవడం వొకే సారి  జరిగాయి . ''ఎరా డాక్టర్ ఎప్పుడు ఆ రోగుల గోలేనా ?ఈ భోగుల గోల కూడా  చూడరా.  రా రా . . డైమండ్ సెట్ తొక్కా అన్నావు'' . ఆదే  రాగం అదే రోగం . డాక్టర్ కంగారు గా ముందుకు సాగి పోయి శూన్యం  లో కలిసి పోయాడు . నేను అయి సి యు లో మా కజిన్ దగ్గరకి వెళ్లి చెవిలో వోరేయి నీ'' యిష్ట  మైన కష్టం'' యిప్పుడే చచ్చి పోయిందని కబురొచ్చిన్ది. అన్నా.  అంతే  అతని లో మళ్లి  అతని అవయవాలు అన్ని  జవసత్వాలు పుంజుకుని స్పందించడం ప్రారం భించాయి. డాక్టర్లు ఆశ్చర్యం తో నోర్లు వెల్ల బెట్టారు . ఆ తారక మంత్రం ఏమిటో చెప్పు బాబు వొక డాక్టర్ అడిగాడు .  అదే రాగం అదే రోగం మంత్రం మాత్రం రహస్యం అంటూ నా కార్ వైపు వడి వ డి  గా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నా . యింతలో సెల్ మోగింది . అపరిచిత నెంబర్(ఆమెది డిలీట్ చేసేసాగా). ఎత్త  గానే రా రా అంటూ అదే రాగం . మీరు డైలు  చేసిన నెంబర్ ఎప్పటికి మీ సెల్ యెత్తదు . అంటూ కట్ చేశా . ''ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరు సుఖ పడాలి సుఖ రోగాల బారిన పడకనా'' ఏదో కే ఎస్ ప్రకటన అనుకుంటా ఎఫ్ ఏం రేడియో లో . (సర్వే జనా సుఖినో భవంతు )

3 ఆగ, 2014

ఎవరి వల్ల ?



   నేను చాలా కాలమ్  క్రితం వొక పోస్ట్ రాసాను . నేను నా వైరస్సు అంటూ. వొక సంవత్సరం పైనే గడిచి పోయింది హెపటైటిస్ వైరస్సు నాలో డిటెక్ట్ అయ్యి. అది మెల్లిగా లివర్ మీద తన ప్రభావం చూపించ సాగింది . పైకి ఏవి లక్షణాలు కనిపించక పోయినా వైరల్ లోడ్  లక్ష నుంచి యిరవై ఎనిమిది లక్షలకి పెరిగి పొయిన్ది. వొక హృదయ కాలేయ నిపుణుడి    దగ్గరికి వెళితే, మీరు వెంటనే ఈ వైరస్సు కి ప్రస్తుతం  అందుబాటులో వున్న పెగ్ ఇంటర్ఫెరాన్  ఇంజక్షన్ వారానికి వొకటి చొప్పున తీసుకుంటూ , రిబావారిన్ మాత్రలు రెండు పూటలా వెసుకొవాలి. లేకపోతె మీరు త్వరలో  మీ తనువులోకి కొత్త లివర్ ని తెచ్చ్చు కోవాలి అన్నాడు . బలాత్కారం బలవంతం అయినప్పుడు చేసేది ఏమి వుంది అని నేను మానసికం గా యుద్దానికి సన్నద్ధం అయిపోయి ఫలానా రోజు మొదలెడదామని ఆరు నెలలకి సరి పడ మందులు (రెండు లక్షలు ) ఆర్డర్ చెయ్యడం కుడా జరిగి పొయిన్ది. యింక రెండు రోజుల్లో మొదలెట్టాలి అనగా వొక స్నేహితుడి సలహా మీద గ్లోబల్ హాస్పిటల్ లో ప్రముఖ హేపటాలజిస్ట్ డాక్టర్ ధర్మేష్ కపూర్ గార్ని కలిసి యిలా ఇంజక్షన్ ట్రీట్ మెంట్ మొదలెట్టా బోతున్నా అని చెప్పా. ఈ ట్రీట్ మెంట్ లో ఏభై శాతం రోగుల్లో మాత్రమే వైరస్సు పోతుంది అయితే భయంకర మైన సైడ్ ఎఫెక్ట్స్ . నెట్ లో హెప్ సి క్లబ్ అని కుడా వొకటి వుంది . వాళ్ళ సాధక భాధకలు అందులో చదివితే ఎవరు ఈ ట్రీట్ మెంట్ కి సహసించరు. అలా అని శత్రువు యింట్లోనే వున్నదని తెలిసాక నేను నా అందాల రాక్షసి అంటూ కాపరం చెయ్యలేము కద. అప్పుడే ఆ డాక్టర్ మీరిప్పుడే తొందర పడకండి అమెరికా లో రోజుకోక్కసారే మాత్ర  వేసుకుని పన్నెండు వారాలలో పూర్తయ్యే మందు కని పెట్టారు . అది మన ఇండియా కి యింకా రాలెదు. వోకో మాత్ర వెయ్యి అమెరికన్ డాలర్స్ . అంటే మొత్తం ట్రీట్మెంట్ కి సుమారు గా యాభై లక్షలు పైన అవుతుంది . అయితే ఆ కంపని ఇండియా లో క్లినికల్ ట్రైల్స్ కి కావలిసిన వ్యక్తుల్ని అంటే వైరస్సు లక్షల లో వుండాలి లివర్ మాత్రం పూర్తీ గా పాడవ కూడదు . వ్యక్తీ మాత్రం రోగిష్టి వాడిలా వుండ  కూడదు . దీనికి మీరు అంగీకరిస్తే ఉచితం గా మీకు ట్రీట్ మెంట్ యిస్తాం . మీరు మొత్తం మూడు నెలలు మా పర్య వేక్షణ లో  వుంటారు . తొందరగా మీ నిర్ణయం చెపితే వాళ్ళు మీకు  రక్త పరిక్షలు చేసి  మీరు వాళ్ళనుకున్న పరిధి లోకి వస్తే ట్రీట్ మెంట్ మొదలెడతారు అన్నారు . అంటే నేను వాళ్ళ గూనియా పిగ్ అన్న మాట . అయితే ఆ మందు గురించి నేను నెట్ లో విస్తృతం గా చదవడం వాళ్ళ ఓకే అన్నాను . ఈ ప్రక్రియ అంతా అవడానికి రెండు నెలలు దాక పట్టింది . 
     
ఈ  ట్రీట్ మెంట్ మొదలు పెట్టె లోపు తిరపతి వెళ్లి స్వామి దర్శనం చేసుకుందామని వెళితే అక్కడ ఆయన అభిషేక దర్శనం తో పాటు యింట్లో పెట్టి పూజ చేసుకునే నారాయణ సాలి గ్రామాలూ లభించాయి .  వొక పూజారి యిచ్చారు . రోజు శ్రద్దగా తులసి ఆకులతో పంచామృతాల తో అభిషేకం చేసుకుంటే మన బాగోగులు ఆ నారాయణుడే చూసుకుంటాడని నిశ్చింతగా ఉండమని చెప్పడం తో అప్పటి నుంచి యింట్లో పూజా మందిరం లో పెట్టి శ్రద్దగా అభిషేకం చేస్తూ అ తీర్ధం సెవిస్తున్నా. నేను గ్లోబల్ హాస్పిటల్ కి వెళ్ళిన రోజు యిరవై ఎనిమిది లక్షలు వున్న వైరస్సు రెండు నెలల తర్వాత అంటే కిందటి నెల జూలై మూడో తారిఖు వాళ్ళు మొట్ట మొదటి టాబ్లెట్ యిచ్చిన రోజు నాలుగు లక్షల ఎనభై వేలకి పడి పొయిన్ది. ఈ రెండు నెలల్లో నేను ఆ వైరస్సు కి సంభందించి ఏ ట్రీట్ మెంట్ మొదలు పెట్ట లెదు. మరి వైరల్ కౌంట్ ఎలా పడింది?సరే అది పక్కన పెడితే నేను ఆ మాత్ర వారం  రోజులు వేసుకున్నాక చుస్తే అసలు వైరస్సే లెదు. పోయిందే ఇట్స్ గాన్ . అయినా గాని పన్నెండు వారాలు ఆ మందు వాడాలని చెప్పారు . యింతకీ ఆ మందు పేరు'' సోఫోస్ బువిర్ ''. బ్రాండ్ నేమ్'' సోవాల్ది ''(గి  లీడ్  కంపెనీ). దాంతోపాటు  రిబవరిన్ 200 మిల్లిగ్రామ్స్  అయిదు టాబ్లెట్స్ వెసుకొవలి.ఈ శతాబ్దపు  అద్బుతమైన ఆవిష్కరణ గా ఈ మందుని చెప్పు కోవచ్చ్చు . మన దేశం లో కూడా  లక్షలాది మందికి ఈ హెప్ సి వైరస్సు  వుంది . అయితే రోగ లక్షణాలు బయటకి కన  బడవు కాబట్టి ఎవరు పట్టించు కోరు . అది లివర్ ని మొత్తం పాడు  చేసాక గాని డాక్టర్ అవసరం రాదు అయితే ఈ లోపు జరగా వలసిన నష్టం జరిగి పొతున్ది. అప్పుడు లివర్ మార్పిడి తప్ప మరో మార్గం లెదు. అయితే ఆ శ్రీనివాసుడి దయ వల్ల  నాకు సరైన సమయం లో సరైన మందు దొరకడం తో బతికి పోయా . 
 యింతకీ ఆ వైరస్సు పోయింది సాలిగ్రామ అభిషేక తీర్దం తోనా ?లేక ఈ కొత్త గాకని  పెట్టిన అమెరికా మందు తోనా?
వొక వేళా  ఆ మందు తోనే అంటే మరి మందు తీసుకోక ముందు ట్రీట్ మెంట్  మొదలెట్టే రోజుకి యిరవై నలుగు లక్షల వైరల్ కౌంట్ ఎలా పోయింది?యండమూరి నవల లోలా రోగం నయం అయింది క్షుద్ర విరుగుడు వల్లా ?సైన్స్ అభివృద్ధి చెందడం వల్లా?ఎవరి వల్లా?

ఆ మందు ఎలా పని చేస్తుంది అంటే ,వైరస్సు అంటే వొక  ఆర్ యెన్ ఏ . అదిరొజూ  కొన్ని  వందలు గా విడి పోతూ మరిన్ని వైరస్సు లను సృష్టిస్తూ లివర్ మీద దాడి మొదలుపెడుతుంది .  . ఈ సోఫోస్ బువిర్ ఆ వైరస్సు విభజన ని అడ్డుకుంటుంది . వొక వైరస్సు జీవిత కాలం అయిదు రోజులు . సో అయిదు రోజుల లో చాలా భాగం తుడిచి పెట్టుకు పోతుంది .  . యిది ఇండియా లో కూడా  త్వరలో లభ్యం అయ్యేఅవకాశం  వుంది.  అయితే రేట్ విషయం లోనే గొడవ వస్తోంది . యిక్కడ దిన్ని బ్రాండ్ నేమ్ తో కాకుండా వెయ్యి రూపాయలకి వొక టాబ్లెట్ అమ్మెలా చర్చలు జరుగు తున్నాయి . అందువల్ల ఎవరన్నా హెప్ సి భాదితులు వుంటే యింకో ఆరు నెలలు వోపిక పడితే ఈ మందు ఇండియా లో కూడా  అందు బాటులోకి వస్తున్ది. ఈ లోపు సాలిగ్రామ అభిషేక తీర్ధంఉండనే  వుంది . 

22 జూన్, 2014

అక్షరించి అర్నేల్లు

                                             
అక్షరించి అర్నేల్లు అయిపొయాయి . యిదివరకు క్రమం తప్పకుండా బ్లాగ్ లో మేధో స్కలనం చేస్తూ బాధని సంతోషాన్ని పంచుకునే వాణ్ణి . యిప్పుడు ఏదో తెలీని నిర్లిప్తత . మనుషుల అవసరాల బట్టి సెల్ లో సోల్లులు . అవసరం తీరగానే అయ్ విల్ కాల్ యు బ్యాక్ సందేశాలు .మళ్ళి అవసరం దగ్గరపడ   గానే మిస్సుడ్ యు అల్ దీజ్ డేస్ అన్న సందేశాలు . లోకం పోకడ తెలిసిన వాడెవ్వడు రొచ్చులోపడడు . అల్టిమేట్  గా అల్ మైటీ కరెక్ట్.
 మొన్న కుటుంబం తో తిరపతి దర్శనానికి వెళ్ళినప్పుడు విఐపి ఎల్ వన్ బ్రేక్ లో డాలర్ పేరు తో గుర్తింప బడే దళారి పూజారి ఆడవాళ్ళ నడుముల మీద చెయ్యి వేసి గడప దాక వెళ్లి దర్శనం చేసు కొండమ్మా అంటూ వత్త డం చూసాక ఈ వికారానికి ప్లేస్ , టైం  ఏమి లెవ్ ఎప్పుడు అవకాసం వస్తే అప్పుడే .  అది బస్సులో కావచ్చు ,రష్ లో కావచ్చు ,సాక్షాత్తు  గర్భగుడిలో కుడా . కావొచ్చు.
ఆ దర్శనం ప్రత్యేకత ఏంటంటే  కేవలం మన కుటుంబం మాత్రమె స్వామి ముందు వుండే గడప దగ్గర  నిలబడితే మన ముందే స్వామికి హారతి యిచ్చి ,మనకి తీర్దం యిస్తారు. ఆ డాలర్ ఎవరన్నా వి ఐపి  లు వస్తే గుడి బయట వుండే టీవి కేమేరాల్ని ద్రుష్టి లో పెట్టుకుని వాళ్ళ పక్కనే నడిచే టీవి కండూతి పరుడనే అనుకున్నా గాని సకల వికార వల్లభాన్ అని అప్పుడే తెలిసిన్ది. యిత గాడికి మద్రాస్ లో రెండో సెటప్ కుడా వునట్టు తర్వాత తెలిసిన్ది.
 మా వెనక టిటిడి ప్రోటోకాల్ మనిషి వుండడం తో మాతో మర్యాద గానే వున్నాడు అది వేరే విషయం .. యింతకీ చెప్పోచేదేమంటే లిప్త కాలం దర్శించుకునే భక్తుడి కే ఆ స్వామి మీద భక్తీ భావం కాని ఎప్పుడు అక్కడే వుండే ఆ పోజర్లకి (పూజార్లకి ),సెక్యురిటి వాళ్ళకి భక్తీ స్తానం లో రక్తి భావాలూ .
 ఆ మర్నాడు శుక్రవారం  స్వామి అభిషేకం  సంతృప్తి కరం గా చూసుకుని కింద అలివేలు మంగమ్మ దర్శనం చేసుకున్నాక, అక్కడి పూజారి రెండు సాలి గ్రామాలు యిచ్చి యింట్లో పూజా మందిరం లో పెట్టుకుని క్రమం తప్పకుండా అభిషేకం చేసుకుని నైవేద్యం పెట్ట మన్నాడు . నేను క్యాంపు లు వెళ్ళే రోజులు తప్ప మిగత రోజుల్లో అది పాటిస్తున్నా . అయితే కొంత మంది మిత్రులు సాలి గ్రామం యింట్లో పుజిస్తునప్పుడు చాల నియమ నిష్టలు పాటించాలని , ఏ వొక్క రోజు మిస్ కాకుండా పూజించాలని చెబుతున్నారు . సాలి గ్రామం అంటే నేపాల్ లో గండకి నదిలో దొరికే నల్లని శిలలు . వాటి లోపల సాక్షాతూ లక్ష్మి నారాయణుడే చక్రం రూపం లో ఉంటాడని ప్రతితి. నా కిచ్చిన శిల లో వొకటి రెండుగా విడి పోయి అందులో చక్రం స్పష్టం గా కని పిస్తోంది . అయితే వజ్ర అనే వొక కీటకం అందులో దూరి అలా చేక్కుతుందని ,తులసి దళం తో పూజ చెయ్యడం శ్రేయస్కరం అని నెట్ లో చదివాను .

అప్పటి నుంచి నాలో ఎన్నో సందేహాలు . మనకి అవకాసం వుండిన రోజులన్నీ తప్పకుండా పూజ చేసి మిగత రోజుల్లో అంటే ఊర్లో లేని రోజుల్లో అలా వదిలేస్తే అపచారమా?
ఎక్కడ సాల గ్రామా పూజ జరుగుతూ వుంటుందో అక్కడి నుంచి కొన్ని యోజనాల దాక  ఆ సత్ఫలితం ఉంటుందన్నది నిజమేనా?
గర్భ గుడిలో వికారాలు ప్రదర్శించిన పూజారి కి దోషం ఉండదా ?అతడు ఎప్పటి లాగే స్వామి పూజకి అర్హుడా ?
స్వామి పూజ చేస్తున్దబట్టే అతని పాపాలు ,పాపల్ని ముట్టుకున్నా అంట కుండా ఉన్నాయా ?
ఎవరి కర్మానుసారం  వారి జీవితం వెళ్ళవలసిందే గాని దాన్ని కొత్తగా మనం ఈ జన్మలో మార్చుకోవడం ఉండదా?
ఏంటో ప్రేమాత్మకం నుంచి ఆద్యాత్మికం లోకి నా పయనం ప్రస్తుతమ్.

31 డిసెం, 2013

మబ్బు చాటు ప్రేమ



భ్రమల్లో తోసేసేదే ప్రేమా

భ్రమరం లా తిప్పెసేదే ప్రేమా

తిరస్కారాలని కూడా  మన్నించే సంస్కారం నేర్పేదే ప్రేమా

అవమానాల్ని కూడా  హలా హలం లా మింగించేదే ప్రేమా

అనుక్షణం గుర్తుకు తెచ్చేదే ప్రేమా

వియోగం లో కన్నీరే  ప్రేమా

కలయిక లో పన్నీరే ప్రేమా

కోల్పోయి నప్పుడు కలిగే భాదే ప్రేమా

మనసులో కలిగే మరణ వేదనే ప్రేమా

మాట రాని మధుర కావ్యమే ప్రేమా

తోట లోని సుధా పరిమళమే  ప్రేమా

అంతం కాని ఆరంభమే ఈ ప్రేమా

పంతాల మబ్బుల్లో దాక్కున్న రవి కిరణమే  ఈ ప్రేమ


ఓ నెరజాణ అంతరంగం



ఆమె వొక నెరజాణ . తన జాణ తనం తో ఎంతటి మగాళ్ళ నైనా కట్టు బానిసల్లా చెసుకొగలనన్న అతి విశ్వాసం . ఎవర్ని ఆరు నెలలు దాటి కోన సాగించదు . ఆమె కి ఆరు నెలలు దాటితే మొహంమొత్తు  తుంది . పాత చింత కాయ పచ్చడి కంటే కొత్త ఆవకాయ అంటే ఆమె కి యిష్టం . ఈ ఆరు నెలల లో మొదటి మూడు నెలలు ప్రేమ దేవత కి ప్రతి రూపం లా బ్రమింప చేస్తుంది . ఆ మత్తు లో కొత్త ప్రియుడు ములిగి అర మోడ్పు కన్నులతో ఆరాధనా పూర్వకం గా చూడడం మొదలెట్టిన మరు క్షణం సరుకులు , బట్టలు , బంగారం కొనిపింప చేసి , ఆ ప్రియుడు అమ్మో ఏదో కుడుతోంది గట్టిగా అని గ్రహించి మత్తు వదిలే టైం కి అతని తో ఏదో విధం గా గొడవ పెట్టుకుని మళ్ళి మా యింటి మొహం చుస్తే మీ నాన్న నీకు నాన్నే కాడనట్టు అంటూ బూతు తిట్లు తిట్టి వదిలించుకోవడం ఆమె కి రివాజు . అలా అని ఆమె ఏమి అంత  అందగత్తె కాదు . మగాళ్ళని ఆకర్షింప చేసే అంత  వంపు సొంపులు మాత్రం ఆమె సొంతం . అవే ఆమె పెట్టు బడి కూడా . యిలా యిప్పటి దాకా వొక పది మంది దాకా ఆమె జీవితం లో ప్రవేశించి నిన్నలలో కలిసారు . యిద్దరు ముగ్గురు కాల గర్భం లో కుడా కలిసి పోయారు . పది మంది తర్వాత పదకొండో వాడి గా అతను అనుకోకుండా ఆమె జీవితం లో ప్రవేశించాడు . రండి నుంచి రా రా దాకా తొందర గానే ఎదిగి పోయాడు . ఆమె కి ఇష్టమైనవి అన్ని కొని ,యిష్టం లేని సలహాలు చెప్పి కష్టాలు కొని తెచ్చు కున్నాడు . ఆమె యదా  విధి గా ఆరు నెలలు దాట  గానే వదిలించు కునేందుకు విఫల ప్రయత్నం చేసింది . చేస్తోంది . నీకు యింకేమి పని లేదా పొద్దున్నా , సాయంత్రం మా యింటికి వస్తావ్?పోయి నీ  పని చూసుకో .
  నే వెళ్లి పొతే నీ పని నువ్వు చేసుకుంటావా అతని వ్యంగ సమాధానం . యిదే అదనుగా ఆమె ఇతన్ని కొట్టడం అత ను మౌనం గా అప్పటికి వెళ్లి పోయి మళ్లీ  మర్నాడు ఉదయమే యధా విధి గా రావడం .  ఆమె కి యిది కొరుకుడు పడటం లేదు . చూస్తుంటే వీడి ప్రేమ ముదిరి పోయి మొఖం మీదా వుమ్మినా కుడా తుడిచేసుకుని మర్నాడు మళ్లీ  సిద్దం అవుతున్నాడు . ఇలాంటి సిగ్గులేని ప్రేమికుడు ఆమె కి యింత వరకు తారస పడలేదు . అలా అని పోనీ షాప్ కి ఏదో కొంటాడని తీసి కెళితే యిదివరకు లాగ కోనక  పోగా బిల్ వచ్చే టైం కి హలో అంటూ సెల్ పట్టుకుని బయటకు పోతున్నాడు . ఈ విపత్కర పరిస్తితి  లో వున్నా వొక నేరజాణ అంతరంగాన్ని ఆవిష్కరింప చేసే చిన్న ప్రయత్నం .
      ఛి ఈ వేదవ ఎన్ని ప్రయత్నాలుచేసినా చూరు   పట్టుకుని వెళ్ళాడుతున్నాడే  గాని మిగతా వాళ్ళ లా గుడ్ బై చెప్పి పోవడం లెదు.  నా కేమో విస్త్రీ  వాడి నుంచి పక్కింటి వాడు దాక ఎవరు ఆయన కోసం వచ్చినా హాల్ లో దాకా పిలిచి మాట్లాడంఅలవాటు . ఆ మాత్రం చనువు తో వంపు సోంపు కంటికి యింపు గా చూపిస్తేనే కదా ఈ మగ వెధవలు సొల్లు కార్చుకుంటూ పడేది . బయటనే నిల బెట్టేసి తలుపు చాటు గా నిలబడి పంపిచేస్తే  యింక ఈ పల్చటి మాక్సి లు వేసుకుని ఏం లాభం ?సరిగ్గా ఆ ఎదురింటి వాడు ఆయన తో మాట్లాడే వంక తో వచ్చి నన్ను చూసి గుటకలు మింగే టైం కి ఈ దరిద్రుడు వచ్చి అవకాసం చెడ  దొబ్బుతున్నాడు .వీడు  వుండ గా వచ్చినాడికి కాఫీ యిస్తే వాడు కప్పు అందుకుంటూ వెళ్ళు పిసికేయ్యడం చూసి ఆ రోజు నానా రాద్దాంతం చేసాడి చచ్చినాడు . గడ్డివాము దగ్గర కుక్కలా వాడు తినడు  వేరే వాళ్ళని తిన నియ్యడు. కనీసం పొద్దున్నపూట   అన్నావీన్ని  రాకుండా చెయ్య గలిగితే కొత్త వాళ్ళు రావడానికి అవకాసం వుంటుంది . పోనీ మా సొంత వూరు పోయి పాత వాళ్ళని కెలుకు దమన్నా పది నిమిషాలకి వొక సారి సెల్ కొట్టి గంటలు గంటలు హస్కు వేసి అవకాసం చెడ  దొబ్బు తాడు . అందుకే ఈ మద్య వూరువెళ్ళ డానికి ముందు రోజే వాడితో భయంకరమైన గొడవలు పెట్టుకుని సెల్ ఎత్తడం మానేస్తున్నా . ఖర్మ కాలి ఎత్తినా ఎత్తిన నిమిశానికే అమ్మా అది అలా ఉంచ వె నే చేస్తా అంటూ ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతూ వాణ్ణి విసిగించి సెల్ పెట్టేసేలా చేస్తున్నా . వాణ్ణి ప్రతి క్షణం త్రునికరిస్తూ అవమానాలు చేస్తునా మళ్ళి సిగ్గు లేకుండా వచ్చి , నే తప్పు చేసినా సరే వాడె వచ్చి సారీ చెప్పి మా యింటి జన జీవన స్రవంతి లో కలిసి పోతున్నాడు . అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినా  నివ్వదు అన్న చందం లా తయారయ్యింది . యింకో రెండు మూడు ఏళ్ళు గడిస్తే తలుపులు బార్లా తెరిచినా గాని ఎవడురాడు . దీపం  ఉండగానే ఇల్లు చక్క బెట్టు కుందామనుకుంటే పాపం అంటాడు . వీడి సూక్తి ముక్తావళి వినలేక చస్తున్నా . ఎవడన్నా  అతిధి వున్నప్పుడు వీడు వస్తే వెంటనే విసుగు మొఖం పెట్టి వీడు  ఏవి అడిగినా పెడ సరి  సమా దానాలు చెప్పి పళ్ళు పట పటా కొరికి వీడు  వెళ్లి పోయేలా చేస్తే గాని అతిధి ముందుకు కదల లేని పరిస్తితి,క్విట్ ప్రోకో లాంటి ప్రేమల నేటి కాలం లో ప్లాటానిక్ లవ్ లు ఎవరికి కావాలి . నాకిదిస్తే నీ కదిస్తా లేక పొతే వస్తా అంటే చస్తా అంటాడు ఈ వేదవ . వీడికి ఈ సారి కాఫీ లో ఏవిషం  అ న్నా కలిపి యిస్తే పీడా విరగడవుతుంది. ఏదన్నా అంటే వాళ్ళ రోగాలు నీకు వస్తాయి అంటాడుఅంత  వీ పీ లు ఎవరున్నారు యిక్కడ ?అద్దం లో చంద మామని  చూపించి భోజనం అయిన్దనిపించడం మాకు రాదా ?వుండు రేపు వీడురానీ వీణ్ణి   లేపేసే పధకం అమలు పరుస్తా . ఆలోచనలతో నిద్ర పట్టేసింది . మెలుకువ వచ్చేటప్పటికి నా చుట్టూ జనం .ఆయన పిల్లలు నా మీదపడి  ఏడుస్తున్నట్టు గా వున్నారు . పాపం వీడయితే శూన్యం  లోకి చూస్తూ అచేతనుడై పోయాడు . ఎహే మీ ఏడుపులు ఆపండి అందామంటే మాట రావడం లెదు. పోనీ ఆయన్ని పిల్లల్నీ తడదామంటే చెయ్యిశూన్యం లోకి పొతొన్ది. యింతలో నల్లగా భీకర ఆకారం లో యిద్దరు నన్ను ఎక్కడికోలాక్కు  పోతున్నారు.  ఏయ్ ఎవరు మీరు నన్ను వదలండి నేను అడ్డమైన వాళ్ళ తో రాను అవతల నాకు చాలా పనులున్నాయి . ఈ లోకం లో నీ పని అయిపొయింది మిగతా పని పైలోకం లో చేసుకున్డువు గాని రావమ్మా అంటూ లా క్కు పోతున్నారు ,

యింతలో కాలింగ్ బెల్ గట్టి గా మొగుతొన్ది. ఉలిక్కి పడి  లేచి తలుపు తీసి చూస్తే అతను  గులా బీ లతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చిరునవ్వుతో పొద్దున్నే ప్రత్యక్షమ్. యిప్పుడు వాడి మీద కోపం లేదు . కొత్త సంవత్సరం లో అతను ను కూడా  కొత్తగా కనబడుతున్నాడు . క్షణ భంగురమైన ఈ జీవితం లో ఈ ద్వేషాలు అవసరమా?