10 ఆగ, 2015

చాగంటి అయ్యో యేమిగంటి ?


Image result for chaganti pravachanam on shankara bharanam
చాగంటి వారి ప్రవచనాలు విని ఆస్వాదించి అభిమానులుగా మారిన వేలాది టీవి ప్రేక్షకుల్లో నేనోకన్ని . సరస్వతి పుత్రులు , ప్రవచన చక్రవర్తులు అనడం లో కించిత్తు సందేహం లేదు . అయితే అనుకోకుండా ఈ రోజు ఆఫీసు నుంచి వచ్చాక కాఫీ తాగుతూ టీవి ఆన్ చేస్తే వొక ఛానల్ లో శ్రీనగర్ కాలనీ లో సత్యసాయి నిగామాగం నుంచి లైవ్ లో ఆయన ప్రవచనం ప్రసారమవుతోంది . ఆహ ఏమి నా భాగ్యము అనుకుంటూ సౌండ్ పెంచి వింటున్నా .
''రాముడు మర్నాడు పట్టాభి సేకానికి సంసిద్ధుడు అవుతూ తండ్రి మాట నిలబెట్టడం కోసం అరణ్య వాసానికి వెళ్ళవలసి వస్తే రెండిటిని సమంగా స్వీకరిస్తూ  కార్యోన్ముఖుడై వెళ్ళిపోతాడు . గురు శిష్య సంభందాన్ని తెలిపే ఉదాత్త కావ్యం శంకరా భరణం . ఆ నాటి బాల శంకరం (తులసి) తన తల్లి (మంజుభార్గవి) తో కలిసి ఈనాడు వేదిక మీద నర్తిస్తుంటే కన్న తండ్రి (దర్శకుడు విశ్వనాధ్)ఎదురుగా వీక్షిస్తూ  ఆనంద భాష్పాలు  రాలుస్తుంటే  యిదొక అద్బుతమైన రోజులా నా జీవితం లో నిలిచి పోతుంది .శంకర శాస్త్రి  సంగీతానికి యెంత ప్రాధాన్యం యిస్తారో కూతురు పెళ్లి చూపు లప్పు డే  తెలుస్తుంది .అయన ఆర్దిక పరిస్తితి సహకరించక పోయినా స్నేహితుడి ప్రోత్సాహం తో పెళ్ళిచూపులకి సరే అంటాడు . అక్కడ అపశృతి పాడిన కూతురి చేత ఆరోహణ అవరోహణ చెప్పిస్తాడు . యిలా సినిమా కధ ని  ప్రవచనం లా చెప్పేస్తూ మద్యలో రామాయణ మహాభారతల ఘట్టాలతో పోలుస్తూ సాగి పోతోంది . పైగా మూడు రోజులనుంచి ఈ శంకరా భరణం సినిమా ముప్పై ఆరు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ప్రవచనాలు సాగి పోతున్నాయట . నాకు మంచి విందు భోజనం లో పంటి కింద రాయి వచ్చిన అనుభూతి కలిగింది .
మొన్ననే ఆయన ప్రవచనాల స్పూర్తి తో అరుణాచలం వెళ్లి అర్దరాత్రి గిరి ప్రదక్షిణ చేస్తే నేను మా సహచరులు ముగ్గురి తో కలిపి కేవలం నలుగురం మాత్రమె వున్నాము . మద్యలో ఆయన ప్రవచిచినట్టు గానే వూర  కుక్కలు కొంత దూరం వచ్చి వెనక్కి పొయెవి. అంతే గాని గుంపులు గుంపులు గా కాదు కదా కనీసం  నర  సంచారం లేదు . యింద్ర కీలాద్రి పర్వతం చూట్టూ  విజయవాడ  రోడ్ల మీద తిరిగితే ఎలా వుంటుందో అలాగే తిరువన్నామలై లో కూడా అనిపించిన్ది. అయితే అగ్ని లింగం అభిషేకానికి గర్భగుడిలో కుర్చునప్పుడు బయట వాతా వరణం తో సంభంధం  లేకుండా వేడి గా వుండడం భగవత్ నిదర్శనమ్. అయితే చాగంటి వారి ప్రవచనం విని వెళ్ళిన  వాళ్ళకి కొంత నిరాశ కలగడం సహజం . వారి ప్రవచనం లో కొంత అతిశయోక్తి ఉంటుందేమో అని పిస్తోంది . యిన్నాళ్ళు దైవ సంభంద విషయాల పైనే ప్రవచించిన  వారు యిప్పుడు కొత్తగా హిట్ సినిమాల మీద ప్రవచించడం వాటికి సందర్భోచితం గా రామాయణ మహాభారత ఘట్టాల్ని జోడించడం  అంత అభిలషణీయం కాదు . నేను టీవి చూస్తునప్పుడు  అప్పుడే ఆ గదిలోకి వచ్చిన మా అబ్బాయి డాడి  రేపు బాహుబలి గురించి కూడా   చెబుతారా? అంటూ తన గది లోకి వెళ్లి పోయాడు . ఏమో ఆలోచిస్తే శ్రీమంతుడు , బాహుబలి సినిమాల్లో కూడా వారు ప్రవచించ దగ్గ సన్నివేశాలు చాలానే వున్నాయని పించింది . వొక కన్నతల్లి తన చనుబాలని తన సొంత కొడుకు తో పాటు పెంచిన కొడుకు కి స్తన్యం యిచ్చి బాహుబలి అని నామ కరణం  చెయ్యడం యెంత ఉదాత్తమైన సన్నీ వేషం . అలాగే కామం మనిషిని మరణానికి గురి చేస్తుందన డానికి నిదర్శనం గా శంకారాభరణం బలాత్కార సన్నీ వేషాన్ని వుదహరిచ లేదనే అనుకుంటున్నా . ప్రేమతో కూడిన కామం గమ్యానికి అడ్డం వచ్చినా తప్పులేదని బాహుబలి నిరూపించాడు అంటూ ప్రవచిన్చలేమో ?అమ్మో మళ్ళి ఈ విషయం'' అన్నపూర్ణ సుంకర వీడియో ''(తెలుగు సినిమాల మీద) లాగ వివాదాస్పదం  కాదు గదా ?
అయినా చాగంటి వారి అభిమాని గా శంకరాభరణం శంకర శాస్త్రి  గారిభాషలో  '' తాళం తప్పుతోందయ '' అనడం లో తప్పు లేదు గా?


9 మే, 2015

రెడ్ సిగ్నల్


  ''మీ రోగం తగ్గిందా?మీ వైరస్ పోయిందా?చాలా కాలం పాటు మీరు బ్లాగ్ లో ఏమి రాయక పొతే పోయారేమో ?అనుకున్నాం (బ్లాగ్ లోంచి అనుకుంటా )''మొన్నొక రోజు ఆఫీసు లో ఏదో మీటింగ్ లో వుంటే వొక బ్లాగ్ అభిమాని ఫోన్ . అబ్బే అంతా వొకే నో ప్రోబ్లం , య య అంతకంటే స్టాఫ్ ముందు ఏమి మాట్లాడ లేక పోయా . అయి విల్ కాల్ యు బ్యాక్ అనడం తప్ప  . అంటే ఆమె లా ఆలోచిస్తూ'' పాపం కాలాల ఎనకాల రవిగారు వుండేవారు . కాల గర్భం లో కలిసిపోయారు . అందుకే ఆయన కలం మూగ బోయింది '' అనుకునే అందరికి తెలియ పరచడం కోసమన్నా కొంచెం తీరక తీసుకుని బ్లాగ్ బండిని ముందుకు నడిపించాలని యిలా ఈరోజు ముందుకు వచ్చా .
బ్లాగ్ లో భాగోతాలు తెలుసుకునే సమయం చిక్కటం లేదో లేక అంతకు మించిన భాగోతాలలో ములిగి పోయానో నాకే తెలిటం లెదు. లేక వోకరిది ప్రేమ .'వేరొకరిది మోసం ఆ పైన విరహం యెంత సేపు యివే కధలు అందరి వ్యధలు .
మనకోసమే కన్నీరు నింపే ప్రియురాలు అనుకుంటే మనీ కోసమే పన్నీరు కురిపించే జవరాలు ,కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మనం యిచ్చే వరాలు వాటి పర్యవసానాలు , అసలు ఎందుకు ఈ వ్యసనాలు ?హాయ్ గా ఆసనాలు వేసుకుంటూ గుండె నిండా గాలి పీల్చుకుని గుండె  ధైర్యం తో బతకక . బ్లాగ్ లో వొక యోగి అద్యాత్మికత తో ఆనందం పొందుతూ వొక్కసారి గా విరహ గీతాలు పాడుకుంటూ పాడు వాడు అయిపోగా లేంది నేను కాసేపు సుధ నుంచి బయట పడి  వేరే వ్యధల్ని రాయలేనా?.
 ఏమో రాయలేనేమో ?ప్రతి రచయితకి బుర్రలో కొన్ని పాత్రలు ఎప్పటికి స్తిర నివాసం ఏర్పరుచుకుని వాటి చుట్టూ పరిబ్రమింప చేసుకుంటాయి . అందుకే బూజు పట్టిన సుధని బయటకు తియ్యడమా లేక నా కంప్యూటర్ కి పట్టిన బూజు ని అలాగే వదిలేయ్యడమా ?అలా సాగి పోతున్న నాలోనా, ఇదేంటి యిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది ఇదేం  మాయో?
సిగ్నల్ పడడం  తో కార్ కి బ్రేక్ పడింది నా ఆలోచనల తో పాటూ . యేవో రెండు కళ్ళు నన్ను తిక్షణం గా చూస్తునట్టు మనసు చెపితే తల పక్కకి పెట్టి చూసా .   కార్ పక్కన ఆగిన బైక్ వెనకాల ఆమె నాకేసి చూస్తూ వొక చిరునవ్వు కూడా పడేసింది . నాకు నవ్వాలో నవ్వ కూడదో అర్ధం కాని స్తితిలో నవ్వి నవ్వనట్టు వొక నవ్వు పడేసా . అంటే తన సెల్ లో వొక ఫోటో తీసేసుకుని వెళ్లి పొయిన్ది. క్రేజీ  అనుకుంటూ నేను కూడా రయ్యిమని దూసుకు పోయా . సుధా వాళ్ళ యింటి ముందు నుంచి పోతుంటే ,చత్త కుండీ చూడగానే ఆగి పోయే మున్సిపల్ బండి లా నా కార్ ఆగి పొయిన్ది. సరే చాల కాలం అయ్యిందని వాళ్ళింటికి వెళ్లి బెల్ కోట్టా . ఆశ్చర్యం మొట్ట మొదటి సారి యింట్లో వొంటరి గా దర్శనం యిచ్చింది ఎవరు లేకుండా . పలకరింపులు  అయ్యయో లేదో బాత్ రూం లోంచి ఫ్లష్ లాగిన శబ్దం .
తట్టుకోలేకా ఎవరు అన్నా ?
 అబ్బా నీకింకా ఈ బుద్ది  పోలేదా ?రమేష్ అన్నయ్య  మా వారి స్నేహితుడు . రెండు రోజులు ఈ ఊర్లో పని వుంటే వచ్చాడు .
అన్నయ్యా ?స్నేహితుడా ?మీ వారు వున్నప్పుడు అన్నయ్యా  లేనప్పుడు స్నేహితుడా?
ఎహే నోర్ముసుకో నాకు మూడ్ వునప్పుడు స్నేహితుడు లేనప్పుడు అన్నయ్య  . అయినా నీ లాగ సిగ్నల్ దగ్గర అమ్మాయిల్ని చూసుకుంటూ సొంగ కార్చుకునే రకం మాత్రం కాదులే .
 నేను సిగ్నల్ దగ్గర సొంగ కార్చు కోవడం ఏంటి?
ఆమె తన ఐ ఫోన్ లో ఎవరో అమ్మాయి పేస్ బుక్ లో నేను కార్ లో సిగ్నల్ దగ్గర పళ్ళు యికిలిస్తున్న ఫోటో  పెదాల నుంచి సొంగ కారు తునట్టు గా వున్నది చూపించింది . ఆ ఫోటో కింద సిగ్నల్ పడినా అమ్మాయిని చూస్తూ ముందుకు పోక ట్రాఫిక్ జాం చేసిన సొంగబాబు అని రాసి వున్ది. దానికి అప్పుడే ముప్పై లైక్స్ . కిందేమో ఇలాంటి ఎదవలు అన్ని చోట్లా వుంటారు . వీళ్ళ కళ్ళకి గుర్రానికి కట్టినట్టు కడితే పక్క చూపులు చూడరు అంటూ కామెంట్స్ .
నాకు నవ్వాలో ఏడవాలో తెలిలేదు . ఆమె అంతట ఆమె నవ్వి నా ఫోటో తీసేసుకుని దానికి చక్కగా సొంగ తగిలించి బైక్ మిద నుంచే పేస్ బుక్ లో పోస్ట్ చేసేసుకుని తమాషా చుస్తొన్ది. అది ట్రేండింగ్ లో చూసేసి సుధా అప్పుడే రెచ్చి పోతోంది . ఏవిటి ఈ విపరీత ధోరణి ?మగాడికి రక్షణ లేకుండా పోతోంది ఆదునిక యుగం లో . యింతలో నా సెల్ మోగింది . ఎవరోఆడ   గొంతు .'' నేను ఇన్స్పెక్టర్ రాగిణి మాట్లాడుతున్నా షి  టీం కెల్లి నువ్వు జరా నీ కార్ దగ్గరకైతే రా సిగ్నల్ దగ్గర పోరిలకి బీట్ కొడతావ్? అయిదు నిమిషాల్లో రాకుంటే నీ ఆడి యెడ వుంటాదో  ఎరుకనా ?''
''ఆడనే వుండక్కా గిప్పుడే వస్తున్నా మస్తు పైసల్ తోని'' అని సెల్ పెట్టేసి నా బాచ్ మేట్ ఎస్పీ శిఫాలి కి ఫోన్ చేసి  విషయం అంతా చెప్పా . ఆమె నవ్వుని ఆపుకుంటూ మా వాళ్ళు చివరికి నిన్ను కూడా  వదలటం లేదన్న మాట సరే నువ్వు కార్ దగ్గరికి వెళ్ళు అని అభయం యిచ్చింది . అప్పటికే కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చి'' జల్ది పదివేలు యిచ్చి కేసు లేకుండా చూసుకోరి మాడం కేసు రాస్తే ఖేల్ ఖాతం'' అంటున్నాడు .
యింతలో షకీలా లా వున్న రాగిణి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ఎవరో అమ్మాయిని నా కాళ్ళ మీద పడేసి ''సార్ కి మాఫ్ చెయ్యమని అడుగు పెద్ద ఆఫీసర్ ని గిట్లా బద్నాం చేసి ఫోటోలు పెడతావ్ నీ య .''. బూతుని మింగేసి బూట్ల మీదకి తోసింది . నేను ఆమెని ''ఛి ఛి ఎవరీమె ఇదేంటి ?'' అంటూ ఆమె కేసి చూసి షాక్ తిన్నా . ఆమె కొన్ని నిమిషాల క్రితం సిగ్నల్ దగ్గర బైక్ మీద కుర్చుని నవ్వినామే . పేస్ బుక్ లో నా ఫోటో ని పెట్టినామే .
''ఛి ఛి సిగ్గులేదు ఎందుకు చేసావి పని ''. (ప్రేమనగర్ లో నాగేశ్వర రావు స్టైల్లో  అడిగా ). ఆమె నన్ను చనువు గా జబ్బ పట్టుకుని పక్కకి తీసుకు వెళ్లి చెవిలో మెల్ల గా'' ఈ పోలీసులే డబ్బులకోసం యిలా చేయిస్తారు . మీరు కుడా గవర్నమంట్ లో పొజిషన్ లో వున్నారు కాబట్టి కధ  అడ్డం తిరిగింది . నాకు రెండువేలు బొక్క . వాళ్ళకి యెనిమిది.'' అంటూ చక చకా చీకటిలో కలిసి పొయిన్ది. దూరం గా కానిస్టేబుల్ నా కార్ డోర్ తీసి నిలబడి వున్నాడు . పైనుంచి సుధా వాళ్ళ ఆయన స్నేహితుడు వుర్ఫ్ అన్నయ్య భుజాలు భుజాలు రాసుకుంటూ మేడ  పైనుంచి చూస్తున్నారు .
షకీలా ఉరఫ్ రాగిణి మత్తు కళ్ళతో ఎస్పి గారికి చెప్పకండి సార్ మీకు దావత్ యిస్తాను అంటోంది .
కార్ స్టార్ట్ చేసుకుని యింటి ముఖం పట్టాను . సిగ్నల్ రెడ్ చూపిస్తోంది . పక్కన బైక్ ఆగింది . మనసు ఎవరో నన్ను చూసి నవ్వుతునట్టుగా చెబుతోంది . అయినా నా కళ్ళు మాత్రం రెడ్ మీదే గ్రీన్ కోసం ఆత్రం గా. పక్క కార్ వాడిని ఆమె సెల్ లో భందించడం నా దృష్టిని దాటి పోలేదు . రెడ్ సిగ్నల్ నిజం గా రెడ్ సిగ్నల్.


28 సెప్టెం, 2014

అదే రాగం అదే రోగం

 

ఆ రోజు నువ్వు అందరి ముందు చేసిన ఘోరమైన అవమానం తో యిన్నాళ్ళ భంధం ముగిసింది ,యింక నేను స్వేచ్చా జీవిని  అనుకుంటూ బయట కొచ్చా . కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టి నట్టు గా వున్ది. నా సెల్లు  యిదివరకులా బిజీ టోన్  రావడం లెదు. అందరికి అందుబాటులోకి వచ్చేసా . అందరి ముందు నువ్వు చేసిన అవమానం గుర్తుకు వచ్చినప్పుడల్లా నీ మీద అసహ్యం ,కసి పెరిగి నీ ఆలోచనల్ని నా బుర్రలోంచి చెరిపేసి పదిరోజులు అప్పుడే గడిపేసా . యింక ఎప్పటికి నువ్వు నా డైరీ లో వొక పాత పేజి గా నే వుండి  పోతావని బలంగా నమ్మా . ఎప్పటిలాగే వాకింగ్ కి వెళుతూ మీ యింటి ముందు చూస్తే  యింటికి తాళం . కార్ కూడా   లేదు . అంటే యింత అవమానం చేసినందుకు నీలో యింత కూడా పశ్చాతాపం లేదనీ , నువ్వు కుటుంబ సబ్యులతో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి మీ వూరు వెళ్లి పోయావని అర్ధం అయ్యిన్ది. అసలు ఆ సంఘటన జరిగిన వెంటనే నువ్వు సారీ చెపుతూ ఫోన్ చేస్తావని ఆశించడం లోనే నేను నిన్ను యెంత గుడ్డి గా నమ్మానో అర్ధం అయ్యిన్ది. అమలిన  మైన ప్రేమ  అంటే అడిగిన వెంటనే అన్ని అవసరాలు తీర్చేసి ,మూసుకు  కూర్చుని  అనవసర వ్యక్తుల గురిచి గాని, వారు ఎందుకు వస్తున్నారని గాని, ఆరా తియ్యకుండా ఉండడమే అని కొత్త నిర్వచనం తెలియ జెసావు. రోజు కనీసం వొక అరగంట అయినా ప్రత్యక్షం గా కలిసి మాట్లాడ కుండా  ఉండలేని ఈ దౌర్భాగ్యపు అలవాటు నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా . సెల్ ఎప్పుడు మోగినా నీదేనేమో అన్న బ్రమలోంచి వాస్తవం లోకి వస్తున్నా. నీ ఆలోచనల మద్య పనులు  అన్యమనస్కం గా నే చేసుకుంటుంటే ,నీ పనుల మద్య కూడా  మాటవరసకి నేను గుర్తు రానప్పుడే నా కర్దమయ్యిన్ది. నీదొక బిజినెస్స్ డీల్ అని. అక్కడ పాత్రలు అవే వుంటాయి పాత్ర దారులు మారుతూ కాల  గర్భం  లో కలిసి పొతారు. నువ్వు మాత్రం నిరంతరం సాగి పోయే వైతరణి నదిలా మరింత పాపుల్ని జమ చేసుకుంటూ వుంటావు . నీకు చీమ కుట్టినట్టు కుడా వుండదు . నా కంటే ముందు అయిదుగురు యిదే బాట పట్టారని తెలిసినప్పుడు కూడా ఛ ఛా  నిజమైన ప్రేమ వోదిడుడుకుల్ని తట్టుకుని నిలబడుతుందని అనుకున్నా. అసలు అక్కడ వున్నది ప్రేమ కాదు బిజినెస్స్ అన్నాక చివరికి ఎవరి కైనా అదే గతి కదా. ఈ మనసు ఎందుకు అది తెలుసు కోక  వ్యాకులత పడుతోంది? ఏదో ఆశ . వొక చిన్న ఫోన్ కాల్ ఈ బాధని పోగొట్టేసి ఎడారి లో వసంతం తీసుకు వస్తున్దని. వొక వేళ వచ్చినా మళ్ళి  నాలుగు రోజులు పోయాక  నీ బిజినెస్స్ డీల్స్ చూసి మనసు తట్టుగో గలదా?
 ఛి ఛి ఈ పెంట ఆలోచనల్ని దూరం గా పెట్టి బుద్దిని ఆద్యాత్మికంగా సక్రమ మైనా మార్గం లో పెట్టాలి అనుకుంటూ భక్తీ ఛానల్ పెట్టా . అందులో వొక ప్రముఖ ప్రవచన బ్రహ్మ ని మక్కి కి మక్కి కాపి కొట్టి తన ఆదాయ మార్గానికి వెసులు బాటు కల్పించు కోవాలని మాగంటి భోగేశ్వర రావు(గురువు గారు చాగంటివారికీ  కిక్షమాప్పనల తో))  అనే ఆయన ఖర్మ పునర్జన్మ అనే విషయం మీద ప్రవచిస్తున్నరు. ఒరిజినల్ బ్రహ్మ గారు  చెప్పిన దాన్నీ అచ్చులు హల్లులు మార్చి లైవ్ లో మేనేజ్ చెస్తున్నరు. అధర్మ బద్దమైన వాటి నీడ కూడా  మన మీద పడ కూడదు . పర స్త్రీ వ్యామోహం లో పడి ,జీవిత చరమాంకం లో భార్య పిల్లల చేత కూడా  అసహ్యించు  కో బడి ,యింకా కూడా  ఆ పర స్త్రీ మీదా వ్యామోహం పోకా వచ్చే జన్మ లో ఆమె యింటి కుక్కా గా పుడతాడు . యింతలో ఆయన చెబుతూ చెబుతూ తోడ మీదా గట్టి గా చరుచుకున్నారు . అంతే '' ఎంట్రా భోగు యింకా రాలేదే?నాలుగు ఊర్లలో ప్రవచనాలు అయ్యాక బోల్డు బట్టలు నగలు పట్టుకుని   దసరా కి మా యింటికి వస్తానన్నావు గా? రా రా '' లైవ్ లో ఎవరో ఆడ గొన్తు. అరె ఎక్కడో విన్న గొంతులా వుందే  అనుకుంటున్నా . మాగంటి వారు కంగారు పడుతూ యిలా కుడా ఆడవాళ్లు కైపు గా మాట్లాడినా మనం నిబ్బరం గా వుండాలి అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ జేబులో వున్నా సెల్ ఫోన్ ని ఆప దానికి ప్రయత్నం చేస్తున్నాడు . యింతలో మళ్ళి '' హోయి హోయి దీనికే కైపు అంటే మరి రేపు ఇక్కడికి వచ్చాక యింకేమంటావురా '' ?ఆప కుండా అదే తెలిసిన గొంతు సెల్ ఫోన్ లో
యింక భోగేశ్వర రావు మంచి నీళ్ళు  తాగే మిష తో తెర  వెనకకి పోయి'' నీ యమ్మ కడుపు మాడా .  యింత దాకా నాకింది చాల దుటే ?ప్రతి వూరి లో పెంట తీసుకు వచ్చి నీ వొడిలో పోయ్యాలా?నోరుమూసుకుని పెట్టు అవతల లైవ్ ప్రోగ్రాం ''అంటూ  మూతి తుడుచుకుంటూ మళ్ళి  కెమెరా ముందుకు వచ్చారు .  నా మనసు మాత్రం ఆ గొంతు మీదే వుంది ఎక్కడో బాగా పరిచయం వున్నా గొంతే . యింతలో నా సెల్ మోగింది మా కజిన్ నీ అర్జెంటు గా హాస్పిటల్ లో అయిసియు లో పెట్టారంటే అకడకి పరిగెత్తా. వాడికి ఆక్సిజెన్ పెడుతుంటే వాడి సెల్ యితర వస్తువులు నాకిచ్చారు పట్టుకొమ్మని . యింతలో వాడి సెల్ మోగింది . ''యిష్టమైన కష్టం '' అని డిస్ప్లేకని  పిస్తోంది . వాళ్ళ వైఫ్ అయి ఉంటుందనుకుని ఎత్తా . నేను హలో అనకుండానే అవతల నుంచి ''ఎరా దసరా కి సరదా గా గడుపుదాము బోల్డు బట్టలు నగలు తెస్తనన్నావు గా రా రా . నీ కోసం యిక్కడ పరదాలు తీసి సరదాలు ఎదురు చూస్తున్నాయి ''
మళ్ళి  నిందాకా మాగంటి మైక్ లో వినిపించిన వాయిస్.  నాకు బాగా చిర పరిచితమై చితిమంటల దాక తీసుకు వెళ్ళిన వాయిస్ . యింకోకడ్ని వైతరణి  నదిలో ముంచడానికి అయి సి యు దాక తీసుకు వచ్చిన వాయిస్ . ఎస్ అదే నా తాజా మాజీ ప్రేమికురాలి వాయిస్ . అంటే వొక్క రోజు నాతొ కూడా  మా కజిన్ వచ్చి పది నిముషాలు కుర్చుని మజ్జిగ తాగిన పాపానికి నాకు తెలీకుండానే వాణ్ణి  కూడా  ముగ్గు లోకి దింపి రగ్గు కప్పిందన్న మాట (అయి సి యు లో అని కవి భావం ). నేను సెల్ కట్ చేశా డాక్టర్ వచ్చి పెదవి విరిచేశాడు . లాభం లేదండి మా ప్రయత్నాలు మేము యెంత చేసినా అయన స్పందించటం లెదు. మీరు ఆఖరి సారి ఏమన్నా చెప్పాలంటే చెప్పు కొండి అన్నాడు . యింతలో అతని సెల్ మోగడం తొందర లో అతని స్పీకర్ ఆన్ అవడం వొకే సారి  జరిగాయి . ''ఎరా డాక్టర్ ఎప్పుడు ఆ రోగుల గోలేనా ?ఈ భోగుల గోల కూడా  చూడరా.  రా రా . . డైమండ్ సెట్ తొక్కా అన్నావు'' . ఆదే  రాగం అదే రోగం . డాక్టర్ కంగారు గా ముందుకు సాగి పోయి శూన్యం  లో కలిసి పోయాడు . నేను అయి సి యు లో మా కజిన్ దగ్గరకి వెళ్లి చెవిలో వోరేయి నీ'' యిష్ట  మైన కష్టం'' యిప్పుడే చచ్చి పోయిందని కబురొచ్చిన్ది. అన్నా.  అంతే  అతని లో మళ్లి  అతని అవయవాలు అన్ని  జవసత్వాలు పుంజుకుని స్పందించడం ప్రారం భించాయి. డాక్టర్లు ఆశ్చర్యం తో నోర్లు వెల్ల బెట్టారు . ఆ తారక మంత్రం ఏమిటో చెప్పు బాబు వొక డాక్టర్ అడిగాడు .  అదే రాగం అదే రోగం మంత్రం మాత్రం రహస్యం అంటూ నా కార్ వైపు వడి వ డి  గా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నా . యింతలో సెల్ మోగింది . అపరిచిత నెంబర్(ఆమెది డిలీట్ చేసేసాగా). ఎత్త  గానే రా రా అంటూ అదే రాగం . మీరు డైలు  చేసిన నెంబర్ ఎప్పటికి మీ సెల్ యెత్తదు . అంటూ కట్ చేశా . ''ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరు సుఖ పడాలి సుఖ రోగాల బారిన పడకనా'' ఏదో కే ఎస్ ప్రకటన అనుకుంటా ఎఫ్ ఏం రేడియో లో . (సర్వే జనా సుఖినో భవంతు )

3 ఆగ, 2014

ఎవరి వల్ల ?



   నేను చాలా కాలమ్  క్రితం వొక పోస్ట్ రాసాను . నేను నా వైరస్సు అంటూ. వొక సంవత్సరం పైనే గడిచి పోయింది హెపటైటిస్ వైరస్సు నాలో డిటెక్ట్ అయ్యి. అది మెల్లిగా లివర్ మీద తన ప్రభావం చూపించ సాగింది . పైకి ఏవి లక్షణాలు కనిపించక పోయినా వైరల్ లోడ్  లక్ష నుంచి యిరవై ఎనిమిది లక్షలకి పెరిగి పొయిన్ది. వొక హృదయ కాలేయ నిపుణుడి    దగ్గరికి వెళితే, మీరు వెంటనే ఈ వైరస్సు కి ప్రస్తుతం  అందుబాటులో వున్న పెగ్ ఇంటర్ఫెరాన్  ఇంజక్షన్ వారానికి వొకటి చొప్పున తీసుకుంటూ , రిబావారిన్ మాత్రలు రెండు పూటలా వెసుకొవాలి. లేకపోతె మీరు త్వరలో  మీ తనువులోకి కొత్త లివర్ ని తెచ్చ్చు కోవాలి అన్నాడు . బలాత్కారం బలవంతం అయినప్పుడు చేసేది ఏమి వుంది అని నేను మానసికం గా యుద్దానికి సన్నద్ధం అయిపోయి ఫలానా రోజు మొదలెడదామని ఆరు నెలలకి సరి పడ మందులు (రెండు లక్షలు ) ఆర్డర్ చెయ్యడం కుడా జరిగి పొయిన్ది. యింక రెండు రోజుల్లో మొదలెట్టాలి అనగా వొక స్నేహితుడి సలహా మీద గ్లోబల్ హాస్పిటల్ లో ప్రముఖ హేపటాలజిస్ట్ డాక్టర్ ధర్మేష్ కపూర్ గార్ని కలిసి యిలా ఇంజక్షన్ ట్రీట్ మెంట్ మొదలెట్టా బోతున్నా అని చెప్పా. ఈ ట్రీట్ మెంట్ లో ఏభై శాతం రోగుల్లో మాత్రమే వైరస్సు పోతుంది అయితే భయంకర మైన సైడ్ ఎఫెక్ట్స్ . నెట్ లో హెప్ సి క్లబ్ అని కుడా వొకటి వుంది . వాళ్ళ సాధక భాధకలు అందులో చదివితే ఎవరు ఈ ట్రీట్ మెంట్ కి సహసించరు. అలా అని శత్రువు యింట్లోనే వున్నదని తెలిసాక నేను నా అందాల రాక్షసి అంటూ కాపరం చెయ్యలేము కద. అప్పుడే ఆ డాక్టర్ మీరిప్పుడే తొందర పడకండి అమెరికా లో రోజుకోక్కసారే మాత్ర  వేసుకుని పన్నెండు వారాలలో పూర్తయ్యే మందు కని పెట్టారు . అది మన ఇండియా కి యింకా రాలెదు. వోకో మాత్ర వెయ్యి అమెరికన్ డాలర్స్ . అంటే మొత్తం ట్రీట్మెంట్ కి సుమారు గా యాభై లక్షలు పైన అవుతుంది . అయితే ఆ కంపని ఇండియా లో క్లినికల్ ట్రైల్స్ కి కావలిసిన వ్యక్తుల్ని అంటే వైరస్సు లక్షల లో వుండాలి లివర్ మాత్రం పూర్తీ గా పాడవ కూడదు . వ్యక్తీ మాత్రం రోగిష్టి వాడిలా వుండ  కూడదు . దీనికి మీరు అంగీకరిస్తే ఉచితం గా మీకు ట్రీట్ మెంట్ యిస్తాం . మీరు మొత్తం మూడు నెలలు మా పర్య వేక్షణ లో  వుంటారు . తొందరగా మీ నిర్ణయం చెపితే వాళ్ళు మీకు  రక్త పరిక్షలు చేసి  మీరు వాళ్ళనుకున్న పరిధి లోకి వస్తే ట్రీట్ మెంట్ మొదలెడతారు అన్నారు . అంటే నేను వాళ్ళ గూనియా పిగ్ అన్న మాట . అయితే ఆ మందు గురించి నేను నెట్ లో విస్తృతం గా చదవడం వాళ్ళ ఓకే అన్నాను . ఈ ప్రక్రియ అంతా అవడానికి రెండు నెలలు దాక పట్టింది . 
     
ఈ  ట్రీట్ మెంట్ మొదలు పెట్టె లోపు తిరపతి వెళ్లి స్వామి దర్శనం చేసుకుందామని వెళితే అక్కడ ఆయన అభిషేక దర్శనం తో పాటు యింట్లో పెట్టి పూజ చేసుకునే నారాయణ సాలి గ్రామాలూ లభించాయి .  వొక పూజారి యిచ్చారు . రోజు శ్రద్దగా తులసి ఆకులతో పంచామృతాల తో అభిషేకం చేసుకుంటే మన బాగోగులు ఆ నారాయణుడే చూసుకుంటాడని నిశ్చింతగా ఉండమని చెప్పడం తో అప్పటి నుంచి యింట్లో పూజా మందిరం లో పెట్టి శ్రద్దగా అభిషేకం చేస్తూ అ తీర్ధం సెవిస్తున్నా. నేను గ్లోబల్ హాస్పిటల్ కి వెళ్ళిన రోజు యిరవై ఎనిమిది లక్షలు వున్న వైరస్సు రెండు నెలల తర్వాత అంటే కిందటి నెల జూలై మూడో తారిఖు వాళ్ళు మొట్ట మొదటి టాబ్లెట్ యిచ్చిన రోజు నాలుగు లక్షల ఎనభై వేలకి పడి పొయిన్ది. ఈ రెండు నెలల్లో నేను ఆ వైరస్సు కి సంభందించి ఏ ట్రీట్ మెంట్ మొదలు పెట్ట లెదు. మరి వైరల్ కౌంట్ ఎలా పడింది?సరే అది పక్కన పెడితే నేను ఆ మాత్ర వారం  రోజులు వేసుకున్నాక చుస్తే అసలు వైరస్సే లెదు. పోయిందే ఇట్స్ గాన్ . అయినా గాని పన్నెండు వారాలు ఆ మందు వాడాలని చెప్పారు . యింతకీ ఆ మందు పేరు'' సోఫోస్ బువిర్ ''. బ్రాండ్ నేమ్'' సోవాల్ది ''(గి  లీడ్  కంపెనీ). దాంతోపాటు  రిబవరిన్ 200 మిల్లిగ్రామ్స్  అయిదు టాబ్లెట్స్ వెసుకొవలి.ఈ శతాబ్దపు  అద్బుతమైన ఆవిష్కరణ గా ఈ మందుని చెప్పు కోవచ్చ్చు . మన దేశం లో కూడా  లక్షలాది మందికి ఈ హెప్ సి వైరస్సు  వుంది . అయితే రోగ లక్షణాలు బయటకి కన  బడవు కాబట్టి ఎవరు పట్టించు కోరు . అది లివర్ ని మొత్తం పాడు  చేసాక గాని డాక్టర్ అవసరం రాదు అయితే ఈ లోపు జరగా వలసిన నష్టం జరిగి పొతున్ది. అప్పుడు లివర్ మార్పిడి తప్ప మరో మార్గం లెదు. అయితే ఆ శ్రీనివాసుడి దయ వల్ల  నాకు సరైన సమయం లో సరైన మందు దొరకడం తో బతికి పోయా . 
 యింతకీ ఆ వైరస్సు పోయింది సాలిగ్రామ అభిషేక తీర్దం తోనా ?లేక ఈ కొత్త గాకని  పెట్టిన అమెరికా మందు తోనా?
వొక వేళా  ఆ మందు తోనే అంటే మరి మందు తీసుకోక ముందు ట్రీట్ మెంట్  మొదలెట్టే రోజుకి యిరవై నలుగు లక్షల వైరల్ కౌంట్ ఎలా పోయింది?యండమూరి నవల లోలా రోగం నయం అయింది క్షుద్ర విరుగుడు వల్లా ?సైన్స్ అభివృద్ధి చెందడం వల్లా?ఎవరి వల్లా?

ఆ మందు ఎలా పని చేస్తుంది అంటే ,వైరస్సు అంటే వొక  ఆర్ యెన్ ఏ . అదిరొజూ  కొన్ని  వందలు గా విడి పోతూ మరిన్ని వైరస్సు లను సృష్టిస్తూ లివర్ మీద దాడి మొదలుపెడుతుంది .  . ఈ సోఫోస్ బువిర్ ఆ వైరస్సు విభజన ని అడ్డుకుంటుంది . వొక వైరస్సు జీవిత కాలం అయిదు రోజులు . సో అయిదు రోజుల లో చాలా భాగం తుడిచి పెట్టుకు పోతుంది .  . యిది ఇండియా లో కూడా  త్వరలో లభ్యం అయ్యేఅవకాశం  వుంది.  అయితే రేట్ విషయం లోనే గొడవ వస్తోంది . యిక్కడ దిన్ని బ్రాండ్ నేమ్ తో కాకుండా వెయ్యి రూపాయలకి వొక టాబ్లెట్ అమ్మెలా చర్చలు జరుగు తున్నాయి . అందువల్ల ఎవరన్నా హెప్ సి భాదితులు వుంటే యింకో ఆరు నెలలు వోపిక పడితే ఈ మందు ఇండియా లో కూడా  అందు బాటులోకి వస్తున్ది. ఈ లోపు సాలిగ్రామ అభిషేక తీర్ధంఉండనే  వుంది . 

22 జూన్, 2014

అక్షరించి అర్నేల్లు

                                             
అక్షరించి అర్నేల్లు అయిపొయాయి . యిదివరకు క్రమం తప్పకుండా బ్లాగ్ లో మేధో స్కలనం చేస్తూ బాధని సంతోషాన్ని పంచుకునే వాణ్ణి . యిప్పుడు ఏదో తెలీని నిర్లిప్తత . మనుషుల అవసరాల బట్టి సెల్ లో సోల్లులు . అవసరం తీరగానే అయ్ విల్ కాల్ యు బ్యాక్ సందేశాలు .మళ్ళి అవసరం దగ్గరపడ   గానే మిస్సుడ్ యు అల్ దీజ్ డేస్ అన్న సందేశాలు . లోకం పోకడ తెలిసిన వాడెవ్వడు రొచ్చులోపడడు . అల్టిమేట్  గా అల్ మైటీ కరెక్ట్.
 మొన్న కుటుంబం తో తిరపతి దర్శనానికి వెళ్ళినప్పుడు విఐపి ఎల్ వన్ బ్రేక్ లో డాలర్ పేరు తో గుర్తింప బడే దళారి పూజారి ఆడవాళ్ళ నడుముల మీద చెయ్యి వేసి గడప దాక వెళ్లి దర్శనం చేసు కొండమ్మా అంటూ వత్త డం చూసాక ఈ వికారానికి ప్లేస్ , టైం  ఏమి లెవ్ ఎప్పుడు అవకాసం వస్తే అప్పుడే .  అది బస్సులో కావచ్చు ,రష్ లో కావచ్చు ,సాక్షాత్తు  గర్భగుడిలో కుడా . కావొచ్చు.
ఆ దర్శనం ప్రత్యేకత ఏంటంటే  కేవలం మన కుటుంబం మాత్రమె స్వామి ముందు వుండే గడప దగ్గర  నిలబడితే మన ముందే స్వామికి హారతి యిచ్చి ,మనకి తీర్దం యిస్తారు. ఆ డాలర్ ఎవరన్నా వి ఐపి  లు వస్తే గుడి బయట వుండే టీవి కేమేరాల్ని ద్రుష్టి లో పెట్టుకుని వాళ్ళ పక్కనే నడిచే టీవి కండూతి పరుడనే అనుకున్నా గాని సకల వికార వల్లభాన్ అని అప్పుడే తెలిసిన్ది. యిత గాడికి మద్రాస్ లో రెండో సెటప్ కుడా వునట్టు తర్వాత తెలిసిన్ది.
 మా వెనక టిటిడి ప్రోటోకాల్ మనిషి వుండడం తో మాతో మర్యాద గానే వున్నాడు అది వేరే విషయం .. యింతకీ చెప్పోచేదేమంటే లిప్త కాలం దర్శించుకునే భక్తుడి కే ఆ స్వామి మీద భక్తీ భావం కాని ఎప్పుడు అక్కడే వుండే ఆ పోజర్లకి (పూజార్లకి ),సెక్యురిటి వాళ్ళకి భక్తీ స్తానం లో రక్తి భావాలూ .
 ఆ మర్నాడు శుక్రవారం  స్వామి అభిషేకం  సంతృప్తి కరం గా చూసుకుని కింద అలివేలు మంగమ్మ దర్శనం చేసుకున్నాక, అక్కడి పూజారి రెండు సాలి గ్రామాలు యిచ్చి యింట్లో పూజా మందిరం లో పెట్టుకుని క్రమం తప్పకుండా అభిషేకం చేసుకుని నైవేద్యం పెట్ట మన్నాడు . నేను క్యాంపు లు వెళ్ళే రోజులు తప్ప మిగత రోజుల్లో అది పాటిస్తున్నా . అయితే కొంత మంది మిత్రులు సాలి గ్రామం యింట్లో పుజిస్తునప్పుడు చాల నియమ నిష్టలు పాటించాలని , ఏ వొక్క రోజు మిస్ కాకుండా పూజించాలని చెబుతున్నారు . సాలి గ్రామం అంటే నేపాల్ లో గండకి నదిలో దొరికే నల్లని శిలలు . వాటి లోపల సాక్షాతూ లక్ష్మి నారాయణుడే చక్రం రూపం లో ఉంటాడని ప్రతితి. నా కిచ్చిన శిల లో వొకటి రెండుగా విడి పోయి అందులో చక్రం స్పష్టం గా కని పిస్తోంది . అయితే వజ్ర అనే వొక కీటకం అందులో దూరి అలా చేక్కుతుందని ,తులసి దళం తో పూజ చెయ్యడం శ్రేయస్కరం అని నెట్ లో చదివాను .

అప్పటి నుంచి నాలో ఎన్నో సందేహాలు . మనకి అవకాసం వుండిన రోజులన్నీ తప్పకుండా పూజ చేసి మిగత రోజుల్లో అంటే ఊర్లో లేని రోజుల్లో అలా వదిలేస్తే అపచారమా?
ఎక్కడ సాల గ్రామా పూజ జరుగుతూ వుంటుందో అక్కడి నుంచి కొన్ని యోజనాల దాక  ఆ సత్ఫలితం ఉంటుందన్నది నిజమేనా?
గర్భ గుడిలో వికారాలు ప్రదర్శించిన పూజారి కి దోషం ఉండదా ?అతడు ఎప్పటి లాగే స్వామి పూజకి అర్హుడా ?
స్వామి పూజ చేస్తున్దబట్టే అతని పాపాలు ,పాపల్ని ముట్టుకున్నా అంట కుండా ఉన్నాయా ?
ఎవరి కర్మానుసారం  వారి జీవితం వెళ్ళవలసిందే గాని దాన్ని కొత్తగా మనం ఈ జన్మలో మార్చుకోవడం ఉండదా?
ఏంటో ప్రేమాత్మకం నుంచి ఆద్యాత్మికం లోకి నా పయనం ప్రస్తుతమ్.