మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
31 అక్టో, 2008
ఇలా ఉండి ఉంటే?
పొద్దున్నే traffic లో మెల్లిగా కదులుతోంది నా కార్ ఇంతలొ సిగ్నల్ గ్రీన్ పడడం తో ఊపు అందుకుంది. నా ముందు RTCబస్ దాని ముందు ఓ స్కూటరిస్ట్, రెడ్ పడడం తో స్చూటేరిస్ట్ తన బండి sincere గా ఆపేసాడు కానీ బస్ డ్రైవర్ దాట్టేద్దమన్న తాపత్రయం లో scooterist ని డీ కొట్టేసాడు. బస్ చక్రాలు అతని తల మీదనుంచి వెళ్లి పోయి రోడ్ అంతా రక్తమయం. నా కళ్ళముందే జరిగిన ఈ సంఘటన నుంచి తేరుకునే లోపు ఇంకో అద్బుతం జరిగింది.రక్తపు మడుగు లోంచి ఆ వ్యక్తీ మాములు గా లేచి దుమ్ము దులుపుకుని RTCడ్రైవర్ తో ఏంటయ్యా సిగ్నల్ పడినప్పుడు చూసుకుని ఆపొచ్చు గా ఎందుకంత తొందర అంటే సారీ బాబు తప్పయి పోయింది అంటున్నాడు డ్రైవర్.నా కళ్ళని నేనే నమ్మలేక పోతున్న.ఇంకొంచెం దూరం వెళ్ళానో లేదో ఒక వ్యక్తిని ఎవరో గుండాల లా వున్నారు కత్తులు పట్టుకుని తరుముతూ గుండెల్లో పొడిచేసి తాపి గా నడుచు కుంటూ వెళ్లి పోయారు. రక్తపు మడుగులో పడి పోఇన ఆ వ్యక్తీ కూడా తాపి గా లేచి ప్యాంటు షర్టు దులుపుకుని వెళ్లి పోయాడు.నేను వెంటనే tv9 వాళ్ళకి ఫోనే చేశా విషయం చెపుదామని వాళ్ళు మీరు మా స్క్రోల్లింగ్ చూడటం లేదా తిరుమల గర్భ గుడి లోంచి మాటలు వినిపిస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి మానవులేవ్వరు కూడా 80 ఏళ్ళు వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో చావరని వరమిచ్చేసారు అన్తే కాదు ప్రపంచం లో నేర ప్రవుర్తిని ప్రరదోలడానికి ఇక నుంచి ఆడ మగ ఎవరికైనా సెక్స్ కొరికలు కేవలం 25 నుంచి ముప్పయ్ ఏళ్ళ మధ్యలోనే అదికూడా కేవలం భార్య భర్తా మద్య మాత్రమే కలిగేలా వరం ?(శాపం) ఇచ్చేసారు అని ఫోనే పెట్టేసాడు.ఆఫీసు కి వెళ్ళానో లేదో మా బాస్ రూమ్ లోంచి మంద్రం గా గాయత్రీ మంత్రం వినిపిస్తోంది. అదేంటి ఎప్పుడు పోర్నో సైట్స్ బ్రౌస్ చేస్తూ వుండే బాస్ ఆలోచిస్తూ అడుగు పెట్టగానే pl కం ఇన్ రండి కూర్చోండి అంటు ఇంటర్కం లో తన స్తేనో గాయత్రీ ని పిలిచి ఒక్కసారి రాగలరా అంటు మర్యాదగా పిలిచాడు. అసలు మా బాస్ ఆడవాళ్ళని ఎప్పుడు వెటకారం గా పిలవడమే గానిఅందులో తన స్తేనో ని ఏంటి రాత్రి అంటు పిలిచేవాడు ఆమె excuseme సర్ అంటే ఐ mean ఏంటి గాయత్రీ అనబొఇ అంటు వెకిలిగా మాటల్డే ఆయనే ఈయన? గాయత్రీ లోపలికి రాగానే అమ్మ గాయత్రీ ఇకనుంచి నా ఛాంబర్ తలుపులు ఓపెన్ చేసే పెట్టండి ఆడ అయిన మగ అయిన ఇక నుంచి నాకు సమానమే ఎవరైనా ఎప్పుడైనా రావొచ్చు secrecy ఏమి అవసరం లేదు ఆఫీసు టైం అయిపోగానే వెంటనే వెళ్లి పోవచ్చు ఇక నుంచి నో లేట్ నైట్ dictations.స్వామి ఏంటి నీ లీల నిజమేనా ఇక అందరు 80 దాక గుండె జబ్బులు కాన్సర్ లు షుగర్ లు bp లు ఏమి లేకుండా ఇంతలొ బాస్ రూమ్ లో టీవీ లో హైదరాబాద్ నాంపల్లి లో బొంబ్లాస్ట్ ఆ దృశ్యాలు లైవ్ లో coverage చేస్తూ మా ప్రతినిధి జాకీర్ ఓవర్ to జాకీర్.ఇక్కడ దృశ్యాలు భయంకరం గా వున్నాయి నా వెనకనే విడిపోయిన శరీర భాగాలు ఎక్కడ పడితే అక్కడ అంటు చెప్పుకు పోతున్నాడు అతని వెనక జనం అవయవ భాగాలు మళ్ళి అతుక్కు పాయి ఎవరి మానాన్న వాళ్ళు వెళ్లి పోతున్నారు, నాకు నోట మాట రాలేదు అంటే స్వామి ,రోగాలే కాకా కత్తులు బాంబులు కూడా ఏవి చెయ్యలేవన్న మాట.ప్రపంచం తీరు తెన్నులే మరిపోఇన క్షణం .స్వామి కల్కిఅవతారం ఎత్తేలోపు ప్రపంచం నాశనం అయిపోతుందని ఈ నిర్ణయం తిసుకున్నాడ?. ఇంకెక్కడా పేపర్ లో మానభంగాలు ,murder లు ఆటన్కవాదుల విద్వాంసాలు, అంటు భూతద్దం పెట్టి వెతికినా కనబడవ్. టీవీ లో క్రైమ్ టైం షో లు ఉండవ్. అంటే స్వామి మనిషి సోమరి పోతుల ఉండకుండా పనిచెయ్యడం కోసం ఆకలి దప్పికలు నొప్పి బాధ అలాగే వుంచి లైఫ్ కి guarentee ఇచ్చాడు , అలాగే సమాజం లో ఆడవాళ్ళ బద్రత కోసం సెక్స్ నీ restrict చేసి పడేసాడు. గోవింద నీ లీలలు అమోఘం అద్బుతం .గోవింద ,గోవింద ,రవి ,రవి ,ఇదేంటి గోవింద శబ్దం లో రవి మల్లి రవి రవి ఒక్కసారి వొళ్ళంతా కుదిపిన భావన ఏంటి ఆఫీసు కి టైం అవుతుంటే ఈ మొద్దు నిద్ర మాశ్రీమతి పిలుపు, అంటే ఇంతసేపు నేను చూసింది కల?అయ్యో ప్రపంచం ఇలా వుండి వుంటే?
26 అక్టో, 2008
దీపావళి కి డబ్బు తగలెయ్యడం అవసరమా?
దీపావళి ఒక్కరోజు వెలిగించే డబ్బు తో కాశి లో ఉన్నా వాళ్ళందరికీ సంవస్తరం మొత్తం ఉచితం గ విందు భోజనం పెట్తోచుట.అంటే కాశి లోనేనా వేరే వుల్లో పెట్ట లేమా అంటే కాశి లో జటరగ్ని అన్నపూర్ణ వల్ల నార్మల్ గ వుంటుందని దాన్ని ప్రామాణికం గ తీసు కోవడం జరిగింది. ఇంతకీ అసలు పాయింట్ కి వస్తే మనం చినప్పతి నుంచి ఏ కోణం లో దేన్నైనా చూస్తా మో అదే అలవాటు అవుతుంది.మా నాన్నగారు దీపావళి కి ముందే మీరు టపాసులు కొనుక్కుంతనంటే ఇచ్చేదనికన్న ఆ డబ్బులు దాచుకుంతనంటే రెట్టింపు ఇస్తా ననేవారు.ఒక్క రోజు temptation ని తట్టుకుంటే మీ చేతి లో బోల్డు డబ్బు దాంతో మీరు మంచి వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్పేవారు.నేను అప్పట్లో స్థిత ప్రజునున్ని కాబట్టి ఆ రాత్రి నిభాయించు కోవడం తో తెల్లారి నా దగ్గర బోల్డు డబ్బు వుండేది. తమ్ముడు , చెల్లి టపాసుల రూపం లో తగలేసుకోవడం తో బిక్కం మొహం వేసుకుని దీపావళి తర్వాత రోజు నుంచి నా చుట్టూ తిరిగే వారు, అన్నా ఏదన్నా కొని పెట్టారా అని. ఆ ఆననందమే వేరు, దిబ్బు దిబ్బు దీపావళి మల్లి వచ్చే నాగుల చవితి అని దివితిని నెల మీద కొట్టి తీపి తిని దేవుడి ముందు ప్రమిదలు అమ్మ వెలిగిస్తూ ఉంటే అరుగు మీద పెట్టడం.అదే అలవాటు మా పిల్లలకి చెయ్యడం తో ఈ దీపావళి కి మా అబ్బాయి కి టపాసుల బదులు సోనీ ప్లే స్టేషన్ (7000)కొన్నా కిలం వదిలినా ఫలం దక్కిందని సంతో శిస్తుంటే వాళ్ళ మమ్మీ ఆఫీసు నుంచి వస్తు 5000 టపాసులు తెచ్చేసిన్డి దీపావళి రోజు calculations వుండకూడదని .లోకో భిన్న రుచి అంటే ఇదేనేమో. పిల్లల కళ్ళలో ఆనందానికి వెల కట్టలేం అంటుంటే ఆ ఆనందం నా సోనీ వల్ల? తను తెచ్చిన క్రాకెర్స్ వల్ల?
24 అక్టో, 2008
బకరా
బకరా
ఓ చెలి నీ కటాక్ష విక్షానాల కోసం బైక్ లో పెట్రోల్ తగలేసి నీ కాలేజీ bus పక్కన ప్రాణాలు పణంగా పెట్టి కట్ లు కొట్టి lov లెటర్ నీ చేతిలో పెట్టి నీకు దాహం వేసినప్పుడు కొబ్బరి బొండం కొనిపెట్టి అది తాగక ఇంక దాహం అంటే కూల్ డ్రింక్ తెచ్చి పెట్టి హోటల్ కి వెళ్ళినప్పుడు బిల్లు వచ్చే టైం కి నువ్వు washbasin కి పోఇన ప్రతిసారీ బిల్లు కట్టి మాల్స్ లో మరిన్ని కొనిపెట్టి నువ్వు వేరే వాళ్ళ బైక్ ఎక్కినప్పుడు కజిన్ అని నమ్మ బట్టి ఈ రోజు నువ్వు NRI పెళ్ళికొడుకు తో పెళ్లి అని చెప్ప బట్టి నాకు అర్దమయ్యిన్డి బకర అంటే ఏంటో.
ఓ చెలి నీ కటాక్ష విక్షానాల కోసం బైక్ లో పెట్రోల్ తగలేసి నీ కాలేజీ bus పక్కన ప్రాణాలు పణంగా పెట్టి కట్ లు కొట్టి lov లెటర్ నీ చేతిలో పెట్టి నీకు దాహం వేసినప్పుడు కొబ్బరి బొండం కొనిపెట్టి అది తాగక ఇంక దాహం అంటే కూల్ డ్రింక్ తెచ్చి పెట్టి హోటల్ కి వెళ్ళినప్పుడు బిల్లు వచ్చే టైం కి నువ్వు washbasin కి పోఇన ప్రతిసారీ బిల్లు కట్టి మాల్స్ లో మరిన్ని కొనిపెట్టి నువ్వు వేరే వాళ్ళ బైక్ ఎక్కినప్పుడు కజిన్ అని నమ్మ బట్టి ఈ రోజు నువ్వు NRI పెళ్ళికొడుకు తో పెళ్లి అని చెప్ప బట్టి నాకు అర్దమయ్యిన్డి బకర అంటే ఏంటో.
21 అక్టో, 2008
కూడలి లో కాకా హోటల్
నిషిగంధ గారి బ్లాగ్ చూసి ప్రేరణ పొంది నేను కూడలి లో పాతిక రోజుల క్రితం ఒక కాకా హోటల్ పెట్టు కున్న.ఈ కూడలి లో ఒక పక్క నిషిగంధ, సుజాత , కొత్తపాళి ఇంక ఎందరో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ పెట్టుకుంటే అక్కడకి రోజు ఎంతొ మంది వచ్చి విందారగించి పోతున్నారు.కనీసం విన్దారగించాక కిళ్లీ కోసమన్నారాక పోతారా అని వాళ్ళ హోటల్ లో నా paradise పాన్ లాంటి అభిప్రాయాలూ వదిలి వెళ్తున్నా.ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా నా బ్లాగ్ దారి ఆటో ఇటో ఎటో వైపు.ఎవరన్నా రచయితా కి తన రచనల్ని చదివి సుచనలిచ్చేపాఠకులు దొరికితే ప్రసవ వేదన మర్చి పోయి బిడ్డను హత్తుకునే తల్లిలా మారి పోతాడు. అటువంటి పాఠకుల కోసం నిలువెల్ల కనులై ఈ రవి వేచేనులే.ఈ నాటి ఈ గరిబు కాకా పోడు నవాబు .అప్పుడు కాకా హోటల్ స్థానం లో నేను ఫివె స్టార్ హోటల్ పెట్టుకుంటా.ఆ రోజు వస్తుందంటావా గోపాలం శంకరాభరణం శంకర శాస్త్రి డైలాగ్ గుర్తు వస్తోంది.ఏమో ఏ కూడలి లో నో జల్లెడలోనో నా కాకా హోటల్ చూసి రుచి చూసి మళ్ళి మళ్ళి రాక పోతారా నా కాకా హోటల్ బాబాయి హోటల్ అంట ఫేమస్ కాక పోతుందా?
18 అక్టో, 2008
భవిష్యత్తులో భంధాలు
ఆధునిక సౌకర్యాలు పురాతన అనుభంధాలు రెండు కలిసి జీవిస్తే భవిష్యత్తు లో ఉండబోయే సంభాషణలకి వుహ రూపం ఈ కధనం.అన్నయ్య గారు ఎండన పడి వచ్చారు కొంచెం చల్లటి బీర్ తిసుకురమ్మన్తరెంతి?అబ్బే వద్దమ్మా ఇప్పుడే మీ వదిన ఇంట్లో ఇచ్చింది మళ్ళి ఏం తాగుతాను?వుర్కొండి అన్నయ్యగారు మీకు ఒకటే మొహమాటం పోనీ కొంచెం సోడా లో కలుపుకు తాగండి.నీ మొహం మండా సోడా లో బీర్ ఏవితే అక్కడ పెట్టి అఘోరించు మేము ఏదో వొకటి తాగుతాం నువెల్లి కొంచెం నంచుకోవడానికి ఆవకాయ తీసుకురా.ఏంట్రా విశేషాలు మీ అబ్బాయి కోడలు ఈ వారం అన్నా us నుంచి వెబ్ కాం లో మాట్లాడారా?ఏంటో ర మా అబ్బాయి పరిస్తితి తల్చుకుంటే చాల భాధ గ వుండి,మా కోడలు ఎప్పుడూ ఒరేయి రాం నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకునే రోజు ఎప్పుడూ రా అని ఒకటే నస ట.వారాంతపు సెలవల్లో కూడా వాణ్ణి ప్రశాంతం గ బతకనికుండా వయాగ్రా నువ్వు వేసుకుంటావా మా కొలీగ్ కి ఇచేయ్యమంటావా అంటే వాడు నీ దుంపతెగ ఇక్కడే ఇచ్చి చావ్వే మళ్ళి వాడేవడికో ఎందుకు ఇప్పుడున్న సంత చాలకనా అని చస్తున్నాడట అనుకో.యీ రోజుల్లో దేన్ని నమ్ముకోలెం ర ఒక్క మన బ్లాగ్ నీ తప్ప నే వుంటారా ఇంటికెళ్ళి నా బ్లాగ్ లో కృష్ణ రామ అంటు రాసుకోవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)