27 నవం, 2010

ఆరంజ్ పుల్లన


కొంతకాలమే ప్రేమిస్తాను జీవితాంతం ప్రేమించమంటే కుదరదు . ఎవడన్న అలా చెబుతుంటే అది వట్టి ట్రాష్ .ఇది హీరో ఆలోచనా విధానం .
తనకు నచ్చిన నలుగురి లో ఎవర్ని ప్రేమించాలో చిట్టిలు వేసుకుని స్నేహితురాళ్ళతో ఆ చిట్టిలు తీయించి నిర్ణయం తీసుకోవాలనే హీరోయిన్ .
వీళ్ళిద్దరి మద్య ప్రేమ ,ఆమె తన పదో ప్రేమికురాలని ,తన ప్రేమ మినిమం ఆయుస్ష్హు వొక రోజు నుంచి మాగ్జిమం మూడువందల ఎనభై రోజులు అని హీరో ఆమెకి చెపుతాడు . ఎక్కువ కాలం ప్రేమిస్తే ఎదుటి వాళ్ళలో లోపాలు కనిపిస్తాయని ఆ లోపేజంపు జిలాని అయిపోవాలని లేకపోతె అబద్దాలు చెపుతూ ప్రేమని బతికించు కోవాలని చెపుతుంటాడు .యిన్ని చెప్పే హీరో ఆఖర్ని ఆమెతోనే జీవితం గడపాలని నిర్ణయం తీసుకునే బలమైన కారణాలు ఏమి చూపలేదు అలాగని ఆమె తోనే వుండి పోతా అని గట్టి గా చెప్పలేదు . యి విధం గా భాస్కేర్ ఏమి చెప్పదల్చుకున్నాడో తనకే క్లారిటి లేక ప్రేక్షకులని కూడా అయోమయానికి గురి చేసాడు .
నిన్న సినిమా మొదటి షో అయ్యి అవ్వగానే చిరంజీవి డైరెక్టర్ భాస్కర్ ని పిలిచి కుక్క బూతులు తిట్టాడని అభిజ్న వర్గాల బోగట్ట .''ఎందుకురా బొమ్మరిల్లు లాంటి నా ఇంట్లోంచి నలభై కోట్లు పరుగు పెట్టించి నా కంట్లో ఆరంజ్ జూసు పోసావు ని యమ్మ ఛి ఛి బూతులు వచ్చేస్తున్నాయి అసలే సుడి బావుంటే ఉప ముఖ్యమంత్రి కావలిసిన వాణ్ణి .మగధీర లో వచ్చినదంతా మటాష్ చేసేసావు కదరా ?దిఫ్ఫరెంట్ లవ్ స్టొరీ అంటే కామోసు అనుకున్నా ఈ షార్ట్ టర్మ్ లవ్ ఎంట్రా ఎదవా ?అన్డుకనేనారా నీ బొమ్మరిల్లు తర్వాత షార్ట్ టర్మ్ సక్సెస్ ని గమ్యం గా పెట్టుకుని నన్ను వో రేంజ్ లో ఆడుకున్నావు ?ఈ తొక్కలా సినిమాకి వందరోజులు ఆస్ట్రేలియా లో దొబ్భించుకోవాలా ?'' అంటూ ఆవేశ పడ్డాడు .
భాస్కర్ చెప్పే పాయింటు లో నిజం వున్నా ఎవరికి వాళ్ళు యిల షార్ట్ టర్మ్ లవ్ స్త్రోరి లతో సరిపెడితే కుటుంబ వ్యవస్థ ఏమి కాను ?జీవితం లో ప్రేమతో పాటు భాద్యతలు కూడా వుంటాయి పిల్లలు వాళ్ళ బాద్యతలు తీసుకోకుండా నాకు నచ్చినంత కాలం ప్రేమించి యింకోకర్ని చూసుకుంటా అంటే'' భాస్కర్ అనాధ ఆశ్రమాలు '' ఎక్కువవుతాయి లోకం లో .
యింక సినిమా విషయానికి వస్తే మొదటి పది నిమిషాలు జెనిలియా ఏమి మాట్లాడుతోందో వినపడ నంత గా కయ్యి కయ్యి మని అరుస్తూ డ్డబ్బింగ్ చెప్పించారు .బ్రహ్మానందం ని సరి గా వాడుకోలేదు .ప్రకాష్ రాజ్జ్ పరిస్తితి అంతే హీరో చేత ఫ్లాష్ బ్యాక్ చెప్పించాదానికే పరిమితము అయి పోయాడు .యి సినిమాకి ప్లస్సు పాటలే .అవీ లేకపోతె సినిమా''పులి '' అయిపోయేది .కారు హెడ్ లైట్ వేసుకుని చీకట్లో హైవే మీద నడపడం లో వున్న బద్రత ఆ లైట్స్ లేకుండా ఎదురు వచ్చే వాహనాల లైట్స్ మీద ఆధారపడి నడిపితే ఎలా ఉండదో అల్లాగే జీవితాంతం ప్రేమించాలంటే ఎదురు లైట్స్ మీద ఆధార పడి బండి నడపడం అని భాస్కర్ భావం . పాపం వున్నంతలో చరణ్ బానే చేసినా డాన్సుల్లో విరగ దీసే స్టెప్స్ మాత్రం లేవు .జెనిలియా ని బొమ్మరిల్లు హాసిని భూతం యింకా వదల లేదు .ఇంతకూ ముందు దాదాపు యిదే ఆలోచన తో వేణు లయ తో స్వయంవరం అనే సినిమా వచ్చింది అయితే అందులో హీరో జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా పెళ్లి చేసుకోను అంటాడు .ఇంకో సినిమా వెంకటేష్ , సౌందర్య తో కొంతకాలం ప్రేమించుకుని పెళ్ళిచేసుకుని అప్పుడు నచ్చక పొతే విడి పోదాం అని వొప్పందం తో వచ్చింది . ఆ రెండు విజయం సాధించాయి కారణం అల్టిమేట్ గా వొక మనసుకు వొకరు అని గట్టి గా చెప్పడం . ఆరంజ్ లో అదే లోపించింది ఆఖర్న కూడా దర్శకుడు ఆ మాట నొక్కి వక్కాణించా కుండా అయోమయం లో వదిలేసాడు .అందుకని అయ్యో ఆదివారం లోపు ఆరంజ్ చూడలేక పోయామే అని బాధ పడకుండా ఇంకో నెలలో జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ సినిమాని ఆరంజులు వలుచుకుంటూ యింట్లోనే చూడడం ఉత్తమం .

30 అక్టో, 2010

కృష్ణ కాంత్ పార్క్ లో కృష్ణ లీలలు



జీవితం నిస్తారం గా సాగి పోతోంది అనుకున్న ప్రతిసారి జీవితం లో వసంతాలు నింపడానికి వసంత కోకిల లా ఎవరో వొకరు వచ్చి తమ సౌరభాలు వెదజల్లి మళ్ళి జీవితం లో సారం నింపి నిష్క్రమించడం నా విషయం లో పరిపాటే .అలా అనుకోకుండా ఆమె నా జీవితం లోకి ప్రవేశించింది .వొకసారి అసుర సంధ్య వేళ ఆఫీసు పని ముగించుకుని ఇంక ఇంటికి బయలుదేరా డానికి సిద్ద పడుతుంటే లోపలకి రా వచ్చా ?అంటూ వొక అందమైన ఆమె వాళ్ళ అబ్బాయి తో సహా నా చాంబర్ డోర్ ఓపెన్ చేసి అడుగుతోంది .నేను ఆమె అందానికి అప్రతిభుడనై తల అడ్డం గా నిలువు గా వుపేస్తూ కూర్చోమని సైగ చేశా .నా ఉద్యోగ రీత్యా ప్రబుత్వ పరంగా అవ్వ వలసిన తన పని కోసం నా దగ్గరకి వచ్చినట్టు ఆమె మాటల్లో గ్రహించా , కాని అప్పటికే మా స్టాఫ్ అంతా వెళ్లి పోయి నేను మా ప్యూను మిగిలాం ఆఫీసు మొత్తానికి .అలాంటి సమయం లో వేరెవరైనా అయివుంటే రేపు ఆఫీసు టైం లో వచ్చి కలవండి అని చెప్పేసి వెళ్లి పోవడం సహజం ఎందుకంటె పొద్దుట నుంచి పని చేసి సాయంత్రానికి ఎనర్జీ లెవెల్స్ పడి పోయి వుంటాయి . అటువంటిది ఈమెని చూడగానే ద్విగున్నికృత ఉత్సాహం వచ్చేసి వొక్క పదినిమిషాల ముందు వచ్చి వుంటే మీ పని యి రోజే అయిపోయి వుండేది . రేపు పొద్దున్నే ఫస్టు అవర్ లో వచ్చేసి మీకు రావలిసింది మీరు తీసుకోవచ్చు అన్నా (రేపు కూడా చూడొచ్చు అన్న ఉద్దేశం ?)
అబ్బే లేదండి నా వ్యాపార పనులతో నేను మళ్ళి రావడం వీలు పడదు మా స్టాఫ్ ని పంపుతా కొంచెం సాయం చెయ్యండి అంటే వో యస్స్ రేపు పంపండి అన్నా .ఆమె మీ కబ్యంతరం లేక పొతే మీ సెల్ నెంబర్ ఇస్తారా అంటే మీ సెల్ నంబర్ చెప్పండి మిస్సేడ్ కాల్ ఇస్తా సేవ్ చేసుకోండి అన్నా (నేను కూడా సేవ్ చేసుకోవచ్చు కదా).అంటే ఆ మర్నాడు ఆమె పని చేసేసాక ఆమె నా సెల్ కి చేసి మీ లాంటి వాళ్ళు ఇంకా ప్రబుత్వ అధికారులు గా వుండ బట్టే ప్రజల పనులు ఇబ్బంది లేకుండా అవుతున్నాయి అంటే నేను భలే వారే అది మా కర్తవ్యమ్ అంటూ సినిమా డైలాగు కొట్టి ఎప్పుడన్నా అవసరం పడి నప్పుడు గుర్తు పెట్టుకోండి అన్నా .మిమ్మల్ని వొక్క సారి చుసిన వాళ్ళు ఎప్పటికి మర్చి పోరు అంది . అది పొగడతో తిట్టో అర్ధం కాక అంతా మీ అభిమానం అంటూ పెట్టేసా .యిది జరిగి రెండు నెలలు అయ్యింది .నా పని వత్తిడిలో ఈ విషయం ఇంతటి తో మర్చి పోయా .మొన్న హటాత్తు గా సెల్ మోగితే ఆమె పేరు తో కాల్ కని పిస్తోంది .వెంటనే ఫోన్ ఎత్తి ఆమె ని పేరు తో బాగున్నారా అన్నా .దానికే ఆమె ఆనంద పారవశ్యం అవుతూ నన్ను మీరు బానే గుర్తు పెట్టు కున్నారు అంది .''మర్చి పోయే పెర్సానాలిటి యా మీది ''మనసులో మాట సర్రున బయటకి వచ్చేసింది ,.దానికి ఆమె నెగటివ్ గా రీయక్ట్ అవకుండా థాంక్స్ అండి చిన్న పని మీద మిమ్మల్ని డిస్ట్రబ్ చేశా అంటూ తన పని చెప్పడం నేను సాయంత్రానికి చేసెయ్యడం చక చకా జరిగి పోయాయి . ఈ నే పద్యం లో ఆమె అదే రోజు మూడు నాలుగు సార్లు ఫోన్ చెయ్యడం చేసిన ప్రతి సారి కాల్ డురేషణ్ పావుగంట చొప్పున పెరగడం'' మీరు పని పడినప్పుడే కాకుండా ఉత్తప్పుడు కూడా చేస్తూ వుంటే నా మీద పని వత్తిడి తగ్గి మరింత బాగా పని చేస్తానేమో'' అని నే ననడం ఆ పిదప రోజుకి రెండు సార్లు ''సెల్ లో సొల్లు '' ప్రోగ్రాము మొదలవ్వడం జరిగి పోయాయి .ఆ సొల్లు లో బయట పడిన ఎన్నో కధలలో మొదటి కధ ఈ కృష్ణ కాంత్ పార్క్ లో కృష్ణ లీలలు .మా వొప్పందం ఏంటంటే మేము ఎప్పటికి మళ్ళి జీవితం లో కలుసు కోకూడదు కేవలం సెల్ లోనే టచ్ లో వుండాలి అప్పుడే కుటుంబ వ్యవస్థ కి భంగం కలగ కుండా , ఏ విధమైన ఆర్దిక , హార్దిక పరమైన సంబంధ భాందవ్యాలు లేకుండా అంతరాత్మ తో సంభాషించు కునట్టు గా వుండి పోవాలి .
సరే యింక కధ లోకి వస్తే ఆమె కి రోజు సాయంత్రం ఆ పార్క్ కి వాక్ కి వెళ్ళడం రివాజు . అక్కడే తనకి ఎంతో అందమైన అబ్బాయిలు (టీవి సీరియల్స్ లో వేసే వాళ్ళు )పరిచయాలు పెంచు కోడానికి వేమ్పర్లు ఆడే వాళ్ళు . పరిచయం అయిన పది నిమిషాలకే ఈమె తనకి పెళ్లి అయ్యిందని యిద్దరు పిల్లలని నిజం చేప్పేసేది .అయినా గాని వాళ్ళు వదలకుండా వెంట పడటానికి కారణం ఈమె అందం తో పాటు ఈమె స్వయం గా నడుపుకుంటూ వచ్చే హోండా కార్ కూడా కొంత కారణం అయి ఉండొచ్చు . వాళ్ళలో చాల మంది యింకా జీవితం లో సెటిల్ అవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే .వీళ్ళ తో పాటు జీవితం లో బాగా సెటిల్ అయి పోయి బాగా డబ్బు సంపాయించి దాన్ని ఎర గా చూపి అందమైన అమ్మాయిలకి వల వేసి ఎంజాయి చేద్దామనుకునే బాపతుయింకో రకం .మరో రకం వయసు మీద పడ్డా కలర్ తో కవర్ చేసి పవర్ లేక పోయినా కళ్ళతోనే స్కాన్నింగ్ చేసేసి ఇంటికెళ్ళి భక్తీ టీవి చూసే రకం .ఎవర్తి బకిరి దొరుకుతుందా దాన్ని సినిమా నిర్మాత కి ఎర గా వేసి అసిస్టంట్ డైరెక్టర్ స్తాయి నుంచి డైరెక్టర్ స్తాయికి ఏది గి పోదామా అని చూసే కృష్ణ నగర్ బాచ్చి కుర్రాళ్ళ తో అలరారుతూ వుంటుంది ఆ పార్క్ .అక్కడకి రోజు ఈమె వచ్చే సమయానికే యింకో ఆమె కూడా వస్తుంది .చూడ గానే పవిత్ర భావం స్తానే అపవిత్ర ఆలోచనలు వచ్చేలా టైటు ట్రాక్ సూటు వేసుకుని కాసేపు పరిగెడుతూ కాసేపు నడుస్తూ కాసేపు వివిధ బంగిమల్లో ఎక్సరసైజు లు చేస్తూ అందరి ద్రుష్టి తన మీద పడేలా చేసుకుంటుంది .మా సెల్లు మిత్రురాలు రిజెక్ట్ చేసిన కేయన్ డి డే టూలు ఆమె వెనక వెళ్ళే వారు . ఏ వోక్కరు కూడా రెండు రోజులు దాటి ఆమె తో కని పించే వారు కాదు .ప్రతి మూడు రోజులకి జోడి మారి పోతూ వుండడం తో సెల్ మిత్రురాలికి ఉత్సుకత పెరిగి తన మిత్రున్ని విషయం ఏంటో కని పెట్ట మని పురమాయించింది .అతను రెండు రోజుల తర్వాత నీరసం గా వచ్చి విన్న వించిన విషయం ఏంటంటే అందరు తమ ఆరోగ్యాలు కాపాడుకోవటానికి వస్తుంటే ఈమె తన విలాసాలకి శరీర విన్యాసాలతో ఆకర్షించి వాళ్ళని పబ్బులకి డబ్బులు దోబ్బించి జబ్బులు అంటించి ఆఖర్న వోరేయి కాకిలా కలకాలం బతికే కంటే హంస లా నాలా ఆర్నెల్లు బతకరా అంటే వాళ్ళు గుండెలు జారి పోయి డాక్టర్ సమరాల దగ్గరకి వెళ్లి జీవన సమరం కోసం పోరాడుతుంటే ఈమె మళ్ళి అగ్నికి ఆహుతయ్యే కొత్త మిడత కోసం అన్వేషిస్తూ పార్క్ లోకి అడుగు పెడుతూ వుంటుంది .ఆమె అందిట వోరేయి రాచ పినుగా వొంటరి గా పోదురా నాతొ పాటు వందమంది నన్నా తీసుకు పోతా నీ నంబర్ అరవై అయిదు అని . యివన్నీ ఆ మిత్రు రాలు చెపుతూ ''నాకు వొక్క ముక్క అర్ధం కాలేదు నన్ను ఇష్ట పడే నా మిత్రుడు ఆ రోజు నుంచి ఎందుకు కనబడటం లేదు ?ఆమెతో నడక కోన సాగించిన వాళ్ళు యందుకు అలా పినుగుల్లా తయారవుతున్నారు ?కృష్ణకాంత్ పార్క్ లో నడిచే వాళ్ళంతా ఏనుగుల్లా వుండే వాళ్ళు పినుగుల్లా అవడానికి నడకే కారణమా ? '' అంటూ ప్రశ్నలు సంధిస్తూ వుంటే తనకి వొక టే సలహా చెప్పా రేపటి నుంచి నువ్వు ఆ పార్క్ కి నడక కి పోకు మీ మిత్రుడి ని కరిగి పోయే జ్ఞాపకం లా మరచి పో అని .ఆ క్షణమే మరింత స్తిరం గా నిర్ణయించుకున్నా మా ఇద్దరి మద్య ఉన్న ఎప్పటికి కలవ కూడ దన్న వోప్పందాన్ని మరింత గట్టిగా దృడం గా అమలు చేసి తీరాలని .

27 అక్టో, 2010

నూట ఎనిమిది అంబులన్స్ వెనక లాజిక్

అత్యవసర పరిస్తితిలో ప్రాణాలు కాపాడ డానికి ఆపద్భాంధవుడిలా వచ్చే అంబులన్స్ కి ఆ నూట ఎనిమిది నంబర్ కేటాయించడం వెనక వొక అంతర్యం వుంది .అదేంటంటే మీరు పుట్టిన సంవత్సరం (ఆఖరి రెండు అంకెలు ),మీ ప్రస్తుత వయసు లోంచి రెండు సంవత్సరాలు తీసేసి ఆ రెండు కలపగా వచ్చే సంఖ్యే నూట ఎనిమిది .ఉదాహరణకి మీరు పుట్టిన సంవత్సరం 74 , మీ ప్రస్తుత వయసు 36 రెండు కలిపితే 110 అందులోంచి రెండు తీసేస్తే 108 .యిది ఆశ్చర్య కరం గా ఏ వయసు వాళ్ళకైనా వర్తిస్తుంది .మీ వయసు తో ప్రయత్నించండి .ఈ లెక్క ఏ వయసు వారు చేసినా ఆన్సర్ తప్పు రాదు గాని వయసులో తప్పు చేస్తే మాత్రం అదే 108 లో ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచిస్తూ పడుకుంటే , కుటుంబ సబ్యులు మాత్రం వీడు పొతే యెంత వస్తుంది?పోక పొతే యెంత ఖర్చు అవుతుంది ?వీడు ఆయాస పడుతున్నది ఆవేశం తో తప్పు చేశా ?అంటూ లెక్కలు వేసుకుంటూ వుంటారు .ఏ లెక్క అయినా తపచ్చు ఏమో గాని ఈ నూట ఎనిమిది లెక్క ఎప్పుడు తప్పు కాదు .

2 అక్టో, 2010

రోబో మిస్ కాకండి

ఇప్పుడే రోబో చూసి వచ్చాం .ఓవర్ అల్ గా సినిమా టెక్నికల్ మార్వేల్ .మొదటి హాఫ్ ప్రేక్షకులు స్పెల్ బౌండ్ అయి చూస్తారు .సెకండ్ హాఫ్ లో అక్క డక్కడ అతి అయినా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వము .మర మనిషికి మేదస్సు మాత్రమె వునప్పుడు ఎలా బిహావ్ చేస్తుంది , మేదస్సు కి మనస్సు తోడైతే ఎలా మారి పోతుంది , ఆ మనస్సు తో పాటు వినాశనం చెయ్యాలన్న చిప్ జోడిస్తే కలిగే విపరీత పరిణామాలే టూకీగా కధ .ఇప్పటికే కధ అందరు రాసేసారు కాబట్టి దాని జోలికి పోవడం లేదు .రజని రోబో గా బాగా చేసాడు .ఐశ్వర్య కి జీన్స్ అంత నటనకి అవకాశం లేక పోయినా ఉన్నంత లో బానే చేసింది .రోబో ఏ పుస్తకాన్ని అయినా కళ్ళముందు తిప్పుకుని మొత్తం అంతా గ్రహించేయ్యడం ,హెయిర్ కట్టింగ్ సలూన్ లో టెలిఫోన్ డైరెక్టరీ మొత్తం స్కాన్ చేసి అక్కడ ఇద్దరి కస్టమర్స్ కి పేరు చెపితే అడ్రెస్స్ నెంబర్ చెప్పడం (ఆ సీన్ లో చాలా కాలానికి దేవదాస్ కనకాల కని పించారు ), క్లిష్ట సాద్యమైన డెలివరీ కేసు డాక్టరు చెయ్యడానికి వెనకాడుతుంటే రోబో సునాయాసం గా నొర్మల్ డెలివరీ జరిగేలా చెయ్యడం ,ఐశ్వర్య ఎగ్జామ్స్ కి సమాధానాలు బయట నుంచి మైక్రో ఫోన్ ద్వార చెపుతుంటే ప్రొఫెస్సొర్స్ వచ్చి యిక్కడ ఎం చేస్తున్నావంటే అబద్దం చెప్పడం రాని రోబో నిజం చెప్పడం వంటివి బానే పేలాయి . అయితే ఐశ్వర్య ని రోబో పెళ్లి పీటల నుంచి ఎత్తు కొచ్చే టప్పుడు కార్ చేజింగ్ ఎక్కువయ్యింది .
మా దగ్గర వున్నా అతి ముఖ్యమైనది నీ దగ్గర లేదు అని రజని సహాయకులు హేళన చేస్తే రోబో అదేంటి నాకు కావలి అంటూ రజని ని అడిగితె అవే ఫీలింగ్స్ అంటాడు రజని . సినిమా ఆఖర్న రోబో అదే సహాయకులతో మీ దగ్గర వున్నది నాకు రావడం వల్లే యిన్ని అనర్దాలు జరి గాయి మానవులందరికీ ఈ కుళ్ళు , ద్వేషం , అసూయా వంటి రెడ్ చిప్ లేకుండా వుంటే ప్రపంచం లో శాంతి ఉండేదని సందేశాత్మకం గా శంకర్ ముగించడం బావుంది .పిల్లలకి పెద్దలకి నచ్చే చిత్రమని ఘంటా పదం గా చెప్పొచ్చు . మా పిల్లలు మళ్ళి దసరా సెలవల్లో రెండో సారికి రెడీ అవుతున్నారు . రెండో రోజు సినిమా టికెట్ కే మన పరపతి వాడవలసి వచ్చింది ఇంకా దసరా సెలవల్లో ఇంకెంత డిమాండ్ వుంటుందో యి సినిమాకి .ప్రపంచం మొత్తం మీద రెండు వేల దియేటర్స్ కి పైగా విడుదలయ్యి మొదటి పది రోజులు అన్ని షో లకి టికెట్స్ బుక్ అయి పోయినప్పుడు కళానిధి మారన్ ఖర్చు పెట్టిన నూట నలభై కోట్లు వారం రోజుల్లోనే వచ్చేసి మిగత అంతా లాభమే .
ఇంకా నష్ట పోయింది ఎవర్రా అంటే అభిషేక్ బచ్చనే ఎందుకంటె పెళ్లి అయ్యాక ఐశ్వర్య అభిషేక్ కి కూడా అన్ని ముద్దులు పెట్టి వుండదు రజనికి పెట్టినన్ని . అందుకేనేమో రోబో పెద్ద హార్డింగ్ అమితాభ్ ఇంటిముందు ముంబై లో పెడితే రాత్రి కి రాత్రి తియ్యిన్ చేసాడుట బిగ్ బీ . మొత్తానికి ప్రపంచ సుందరి పెళ్లి అయ్యాక అత్త వారింట్లో రోబో కాదని నిరూపించింది యి సినిమాలో అందాలూ ఆరబొసి .జయ భాధురి కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఉండొచ్చు అది వేరే విషయం .

18 సెప్టెం, 2010

ఎవరికి ఎవరు కాపలా?



అందంగా ,అమాయకం గా కలుపుగోలుతనం గా వుండే సుధ నా జీవితం లో ఆరు నెలల క్రితం ప్రవేశించ నంత వరకుజీవితం క్రమ పద్దతి లో సాగి పోయేది .అసలు ఆమె తో పరిచయమే ప్రళయం లో జరిగింది .రోజు వాకింగ్ లో ఎదురు పడినప్పుడు సెల్ లో మాట్లాడుకుంటూ క్రీగంట చూసు కోవడమే గాని , ఎప్పుడు మాట్లాడే సందర్భం రాలేదు . అది కాక ఎప్పుడు ఇద్దరం చెవిలో సెల్ పెట్టుకుని వొక నిర్దిష్టమైన ప్రదేశం లో ఎదురు పడడమే గాని పొద్దునే ప్రక్రుతి అందాలూ ఆస్వాదిస్తూ చుట్టుపక్కల పరికిస్తూ తీరికగా నడవడం రాని కుదురు లేని మనుషులమే . నడక కూడా తప్పని సరి వొక పని అన్నంత హడావిడిలో సాగి పోతూ వుంటాము . ఆమె కనబడని రోజు ఏదో వెలితి అంతే అంత వరకే .వొక రోజు బయలుదేరు తుంటేనే చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి .అంతకు ముందు రెండు రోజులు క్యాంపు వెళ్ళడం వల్లా రోజు హరి మీద విల్లు పడ్డా సరే వెళ్లి తీరాలని తీర్మానించు కుని వడి వడి గా అడుగులేస్తూ నడుస్తున్నా .ఇంతలో నేను తను ఎదురు పడే బ్రిడ్జి వచ్చింది , సరిగ్గా మద్యలో క్రాస్ అవుతాము .అంత దూరం లో ఆమె ఎదురు గా వస్తోంది ,నా గుండె వేగం గా కొట్టు కుంటోంది ,ఫర్ చేంజ్ ఇద్దరం సెల్ మాట్లాడ కుండానే వస్తున్నాం . ఇంతలో వాన ఎక్కువైంది .ఇద్దరం వొకే సారి అక్కడకి దగ్గర లోని వొక చిన్న షెల్టర్ కి పరి గేత్తాం . అక్కడ కేవలం ఇద్దరు మాత్రమె నిల బడ టానికి చోటు వుంది . చుట్టూ పక్కల జన సంచారం లేదు . అప్పుడప్పుడు వెళ్ళే వాహనాలు తప్ప .నల్లటి మబ్బులు దట్టం గా కమ్ముకుని చీకటి ఆవరించి నట్టు గా వుంది . ఇరుకు స్తలం లో నా మోచెయ్యి ఆమె నడుముకు తగలడం యద్రుచ్చికమే అయినా వెంటనే సారీ అన్నా . ఆమె ముఖం లో భావము కన బడ నీకుండా వర్షం తగ్గేలా లేదు అని స్వగతమో? సమాధానమో?అర్ధం కాకుండా నర్మ గర్భంగా అని వూరు కుంది .అవునండి అంత కంతకు ఎక్కువవుతోంది .చూస్తుంటే ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు అని మాట కలిపెసా .అంతే అది మా మద్య ప్రణయానికి , ప్రళయానికి నాంది వాచకం అని అప్పుడు తేలీ లేదు .ఆమె మాట్లాడుతుంటే మాటలు గంగా ప్రవాహం లా అలా కట్టలు తెంచుకుని ప్రవహిస్తూ మనల్ని ఆనంద డోలికల్లో ముంచేస్తాయి . అరగంట లోనే ఆమె నేనెప్పటి నుంచో తెలుసునట్టు గా ఎన్నో విషయాలు మాట్లాడేస్తోంది .తను అనుకున్న పని రోజు అవ్వాలంటే నేను తనని ఫలానా ప్లేస్ లో క్రాస్ చెయ్యాలి అని మనసులో అనుకుంటూ వాకింగ్ కి బయలు దేరేదట ,నేను తను అనుకున్న ప్లేస్ లో ఎదురు పడితే పని అయ్యేదట .నాకు తెలిసిన వాళ్ళే కాకుండా తెలియని వాళ్ళు కూడా వాడుకోవడం మొదలెట్టరన్నమాట ?అంటే అదేంటండి మనం గత సంవత్సర కాలం గా ముఖ పరిచయం వున్న వాళ్ళమే గా యిన్నాలకి యి వర్షం పుణ్యమా అని మాట కలిసింది అంటూ చొరవ గా మాట్లాడేస్తుంటే ఆమె అందానికో మాటకారి తనానికో నేను వొక శ్రోత లా వుండి పోయా , ఇంతలో వాన వెలిసింది .మాటల్లో మా ఇంటికి రెండు వీదుల అవతల వున్న అపర్ట్మెంట్స్ లోనే వాళ్ళు ఉండేదని తెలిసింది , ఇద్దరం నడుస్తూనే మాట్లాడుకుంటున్నాం .ఇంతలో వాళ్ళ అపార్ట్మెంట్ రావడం తో వుంటానండి అని వెళ్లి పోతుంటే ఉంటానని వెళ్లి పోతారెంటి ? అందామనుకునే లోపే ఏంటి డియర్ లేట్ అయ్యింది అని ఏదో మగ గొంతు విని పిస్తే విరమించుకున్నా .వాళ్ళ అయనఅనుకుని .అది మొదలు మా పరిచయం లత లా అల్లుకు పోయి వట వృక్షం అవడానికి ఆరు నెలల కంటే ఎక్కువ పట్టలేదు .యిప్పుడు వాళ్ళ యింటికి వాకింగ్ అవగానే ఆమె తో పాటే వెళ్లి కాఫీ తాగి వాళ్ళ ఆయన యింకా నిద్ర పోతుంటే కాసేపు హస్కు వేసి వచ్చే అంత చనువు వచ్చేసింది . హఫ్కోర్స్ అయన లేనప్పుడు కూడా .మేము మాట్లాడుకొని సబ్జక్ట్స్ అంటూ ఏమి ఉండేవి కావు .ఆమె సాధారణ గృహిణి అయినా అన్ని విషయాల మీద తగినంత అవగాహన వుండడం ఆమె కలుపు గోలుతనం మా యిద్దరిని మరింత దగ్గర చేసింది .అలా అని మేము హద్దులు దాటలేదు , పరిదుల్లోను ఉండలేదు .మొత్తానికి తప్పు మాత్రం చెయ్యలేదని ఘంటా పదం గా చెప్పా గలను .అయితే కాలం అలానే సాగి పోదు కల నిజమై ఆగి పోదు .
ఆమె కున్న మంచి గుణమో ?చెడ్డ గుణమో ఏమాత్రం కొంత పరిచయం వున్నా వాళ్ళింటికి భోజనానికి పిలిచి తన వంటలతో వాళ్ళని మరింత మెప్పించడం తన అందం తో వాళ్ళని కవ్వించడం .వాళ్ళు సొంగ కార్చుకుంటూ సొల్లు కబుర్లు చెబుతూ తన అందాన్ని పొగుడుతుంటే గుంభనం గా నవ్వు కోవడం .హద్దు మీరితే నాకు సెల్ చేసి వాళ్ళు వెళ్ళే దాక నాతోనే మాట్లాడడం .అడుసు తొక్కనేల కాలు కడగా నేలా అని నేను మందలిస్తే తొక్కితే గాని తెలవదు గా అంటుంది . అంత తొక్కి రిస్క్ తీసుకోవడం ఎందుకు వాళ్ళని మీ వారు వునప్పుడే రమ్మనొచ్చు గా అంటే వాళ్ళని టీజ్ చెయ్యాలంటే మా ఆయనెందుకు అడ్డం అంటుంది . అదికాక వాళ్ళ ఆయనకి చెప్పే భోజనానికి పిలుస్తుంది ఆమె .నా వాదన ఏంటంటే అందరు నా అంత మంచి వాళ్ళు (చేతకాని వాళ్ళు ?)వుండరు సుధ నువ్వు టీజ్ చేస్తే భోజనం చేసి చెయ్యి కడుక్కు వెళ్లి పోవడానికి నీ చున్ని కి చెయ్యి తుడుచుకుని ''వాట్స్ నెక్స్ట్ ?'' ఏంటి యీ భోజనం చెయ్యడానికి వచ్చాననుకున్నవా అంటూ ముందుకు వస్తే ?
నా గురించి ఏమను కుంటున్నావ్?నా మీద నీకు నమ్మకం లేదా?ఆమె సమాధానం
నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. నువ్వు అందర్నీ గుడ్డి గా నమ్మేస్తావ్. ఎప్పుడో బొక్క బోర్లా పడతావ్, నా హెచ్చరిక .
సరే నీకు తప్పు చేసే ఉద్దేశం లేక పొతే వొక పని చెయ్యి నువ్వు భోజనానికి పిలిచిన వాడు రాగానే నాకు మిస్సేడ్ కాల్ యియ్యి . నేను నీకు కాల్ చేస్తా నువ్వు రాంగ్ నెంబర్ అని అలానే ఓపెన్ లోనే పెట్టేసి నీ సంభాషణ కోన సాగించు నాకు అర్ధం అవుతుంది అక్కడ తప్పు జరుతోందో లేదో? నా సూచన .
అబ్బ నీ అనుమానం పెను భూతం .అలాగే కాని అంటూ వాళ్ళవూరి అతను వస్తే నా ప్రయోగం మొదలెట్టాము .అతను కూర్చుని మాట్లాడే ప్రతి మాట నాకు విని పిస్తోంది .అబ్బ ముప్పై ఏళ్ళు వచ్చినా నీలో బింకం సడల లేదే .అంటున్నాడు .ఈమె వుర్కో మావా నువ్వు మరీను కాఫీ తాగుతావా ?అడిగింది . పాలు తాగు తానూ యిస్తావా ?అంటున్నాడు .ఈమె కిల కిలా నవ్వుతోంది .తర్వాత రెండు నిముషాలు మౌనం గాజుల చప్పుడు నా గుండె వేగం గా కొట్టు కుంటోంది .ఏం జరుగు తోంది అక్కడ ? నాకు తెలియాలి . యిద్దరు అక్కడనుంచి బెడ్ రూం కి వెళ్లి పోయారా?బుర్ర పరి పరి విధాల ఆలోచిస్తోంది . యిప్పటి కిప్పుడు వాళ్ళింటికి వెళ్లి తలుపు కొడితే నిజం బయట పడుతుంది గా ?
ఇంతలో కాఫీ తీసుకో మావా , ఏంటి పేపర్ చదవడానికా మా యింటి కోస్తా? తన గొంతు . హమయ్య అంటే తను వంటింటి లోకి వెళ్లి కాఫీ కలిపి పట్టు కొస్తే అతను పేపర్ చదువు తుండడం తో వచ్చినా నిశబ్డమే కాని వారిద్దరూ నిశబ్దాన్ని చేదించడం లేదన్న మాట . నా మనసు కి ఊరట , అయినా నా కెందుకు యీ వ్యాకులత వాళ్ళ హబ్బి అక్కడ ఆఫీసు లో హాయి గా పని చేసుకుంటుంటే నేను నా ఆఫీసు లో పని మానుకుని టెన్షన్ పడుతున్నాను?ఎందుకు నాకి పోస్సేసివే నెస్?ఆరు నెలల క్రితం ఆమె ఎవరో ?
ఉండ మంటావా ?వెళ్లి పోమంటావ?అడుగు తున్నాడు మావ .
చెయ్యి తీసి మాట్లాడు మావ నేన్నింకా చిన్న పిల్లనే అనుకుంటున్నావా ?మీ పిల్లలు ఎదురు చూస్తూ వుంటారు మళ్ళి వద్దువులే వెళ్ళు అంటూ ఆమె గొంతు .
వెళ్ళిపోయాక ఏం బాబు నీ అనుమానం తీరిందా అంటూ తన ఆరా . యిది జరిగిన రెండు రోజులకే మళ్ళి అసలే అమ్మాయి విషయం లో అపఖ్యాతి పాలయి టీవి లో కూడా వచ్చిన పొలిసు ఇన్స్పెక్టర్ని భోజనానికి తీసుకుని వాళ్ళ కజిన్ వస్తుందని చెపితే నాకింకా కోపం నషాళానికి అంటింది . యిప్పుడు గొట్టం గాడు భోజనానికిఎందుకు ?యీవంకన నీకు కూడా దగ్గరయ్యి నిన్ను టీ వి కి ఎక్కిన్చాడానికా ?ఎందుకు అందరి తోనూ విచ్చల విడి గా వుంటావ్?ఎందుకు అందర్నీ కవ్వించి ఆనందం పొందు తావు?నువ్వొక వేసవి లో చలి వేన్ద్రనివి . ఎవడికి దాహం వేస్తె వాడు వచ్చి దాహం తీర్చుకుని పోవచ్చు . అంటూ వాళ్ళింటికి వెళ్లి గట్టి గా అరిచేసా . మేమిద్దరమే వున్నాం . తను మాత్రం సంయమనం కోల్పోలేదు .
నీతో మాట్లాడితే కలుపు గోలు తనం వేరే వాడి తో మాట్లాడితే విచ్చల విడి తనం ?నీకు దాహం తీరిస్తే ఇంట్లో ఫ్రిడ్జ్ బయట వాడికి తీరిస్తే చలి వెంద్రం .అయినా నేను కలవిడి గా లేక పోయి వుంటే అసలు మనిద్దరి మద్య బందం ఏర్పడేదా ?అయినా ఏంటి ఆరు నెలల లోనే అది పత్యం ?యెంత కాలం సెల్ ఫోన్ లో కాపలా పెట్టి నమ్మకాన్ని పెంపొందించు కుంటావ్?ఆడది తలచుకుంటే సెల్ ఫోన్ లో సంభాషణలు అనుమానం రాకుండానే చేస్తూ సైగలతో ప్రియున్ని బెడ్ రూం కి తీసుకెళ్ల గలదు .అప్పుడేం చేస్తావ్ .?మా ఆయనే ననేప్పుడు నిల దీసే సాహసం చెయ్యలేదు అటు వంటింది యింకా ఏదో అంటోంది అప్పటికే నేను లేచి లిఫ్ట్ కేసి నడిచి కిందకి దిగుతున్నా బాధ తప్త హృదయం తో . కింద వాచ్మన్ రేడియో లో పాటలు వింటున్నాడు .
ఎవరికి ఎవరు కాపలా?. భంధాలన్ని నీకెలా? భంధాలన్ని నీకెలా?
తనువుకు ప్రాణం కాపలా మనిషికి మనసే కాపలా
తనువును వదిలి తరలే వేళా మన మంచే మనకు కాపలా ,
కంటికి రేప్పే కాపలా కలిమికి ధర్మం కాపలా
కలిమి సర్వము తొలగిన వేళ పెట్టినదేరా గట్టి కాపలా
ఎవరి ప్రేమకు నోచని వేళ కన్నీరే రా నీకు కాపలా
ఇంతవరకు మీరు విన్న యీ పాట యింటికి దీపం ఇల్లాలే లోనిది .అనోన్సుర్ చెపుతోంది .
అవును ఎవరికి ఎవరు కాపలా యింటికి దీపం ఇల్లాలే భారం గా యింటి వైపు నడక సాగించాను .