22 డిసెం, 2010

పుస్తక ప్రదర్శనలో నా మస్తకం లో కలిగిన ఆలోచనలు

ఈ రోజు అనుకోకుండా నేను ,ఆలోచనా తరంగాలు శర్మ గారు ,మరో అజ్ఞాత ఆడ బ్లాగరు వారి భర్త హైదరాబాద్ లో జరుగుతున్న పుస్తక ప్రదర్సన సందర్శించడం జరిగింది .అజ్ఞాత ఎందుకంటె ఆమె కి తన పేరు వెల్లడించడం ఇష్టం లేదు కాబట్టి .సాయంత్రం అయుదవుతోన్డి ,వర్కింగ్ డే అవడం తో జనం పల్చ గానే వున్నారు .అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రితం వెళ్లి ఆ ఆనందాన్ని బ్లాగ్ లో పంచుకుంటూ రాసిన పోస్టింగ్ ఆ తరవాత కొంతమందికి అది నచ్చక జరిగిన రచ్చ బ్లాగ్ లోకం లో సీనియర్స్ కి విదితమే . అందుకే ఈ సారి ఏమి రాయ కూడా దనుకున్నా.అయితే కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల రాయక తప్పడం లేదు .ఎంటర్ అవుతూనే మన ఈ తెలుగు స్టాల్ కేసి అడుగులు పడ్డాయి .అక్కడ తాడేపల్లి గారు చూడడం తోటే సాదరం గా ఆహ్వానించి నా బ్లాగ్ పేరు అక్కడ డిస్ప్లే లో ఉంచిన (ఆ రోజు విచ్చేసిన బ్లాగర్స్ )లిస్టు లో రాయించారు .నాతొ పాటే వున్నా శర్మ గారిని , అజ్ఞాత బ్లాగర్ ని వారికి , పక్కనే వున్నా భార్గవ రాం కి పరిచయం చేశా.కాసేపు మాట్లాడు కున్నాక వొక సారి తిరిగేసి వస్తాం అని మేము బయలు దేరాం . శర్మ గారు రామకృష్ణా మటం వారి స్తాల్లోంచి కొన్ని ఆద్యాత్మిక పుస్తకాలు , వోశో వారి స్టాల్ నుంచి ది సీక్రెట్ అన్న పుస్తకం కొనుక్కున్నారు .ఆయన పుస్తక పాటనాసక్తి ని అభినందించ లేకుండా ఉండలేను .అలాగే అజ్ఞాత బ్లాగర్ భర్త కుడా మొత్తం నాలుగు వేలు పెట్టి వివిధ పుస్తకాలు తీసుకున్నారు .ఎవరైతే పుస్తకాలు బాగా చదువు తారో వారు తప్పకుండా మంచి వాదా పటిమ కలిగి ఉంటారని వారిరువురు వివిధ సబ్జక్ట్స్ మీద చేసుకున్న చర్చ వలన నాకు అర్ధం అయ్యింది .నేను మాత్రం పిల్లలకి గేమ్స్ సి డి లు తీసుకున్నా .సరే అలా వొక గంట తిరిగి మళ్ళి ఈ తెలుగు స్టాల్ కి వచ్చాము . అప్పటికి దీప్తిధార భాస్కర రావు గారు వేరే ఇంకో లేడీ బ్లాగర్ తో ముచ్చటిస్తూ కని పించారు .నేనే వారి దగ్గరికి వెళ్లి నన్ను శర్మ గారిని పరిచయం చేసుకున్నాక ఏంటి ఈ మద్య ఎక్కువగా రాయడం లేదంటే నేను ఏమి రాసిన అదొక కాంట్రవర్సి అవుతోందని ఇంతకు ముందు రెండేళ్ళ క్రితం యిదే పుస్తక ప్రదర్సానకి వచ్చి రాసిన దాంతో మొదలయిన అగ్గి ఇంకా సెగలు గక్కుతోనే వుందంటే గతం వదిలెయ్యండి యిప్పుడు ఎవరి మానాన వారు రాసుకుంటే మంచిదని సలహా ఇచ్చి ఆ లేడీ బ్లాగర్ పేరు వారి వివరాలు రాసుకోవడం లో నిమగ్నమయ్యారు .రాసుకోవడం పూర్తీ అయ్యాక ఆమెని మీ ఫోటో తీసుకుని ప్రచురిస్తే అభ్యంతరమా?అని అడిగితె ఆవిడ మొహమాట పడుతూ అటు యిటు గా తల వుపితే మీరు కూడా కూర్చోండి అంటూ పక్కన వున్న రెండు చైర్లు చూపించారు ,శర్మ గారు కొంచెం మొహమాట పడుతూ అబ్బేయిప్పుడు ఫోటో ఎందుకండి అంటుంటే మీకు ప్రాబ్లం అయితే మీరు పక్కకి రండి అనివినగానే ఇద్దరి ఫోటోలు బ్లాగ్ లో ఉన్నాక యింకా దాపరికం ఏముందండి అంటూ శర్మ గారిని అనడం తో మా ముగ్గురి ని తన నికాన్ కెమెరా లో భందించి ఆ లేడీ బ్లాగర్ తో కేనిగే స్టాల్ కి వడి వడి గా అడుగులు వేస్తూ వెళ్లి పోయారు .నాకు కొంచెం ఆశ్చర్యం గానే అనిపించింది .రోజు తన బ్లాగ్ లో ఈ పుస్తక ప్రదర్సన గురించి కవర్ చేస్తున్న ఆయన అసలు ఆలోచనా తరంగాలు అన్న వొక బ్లాగ్ ఉందా అనట్టు మొహం పెట్టినప్పుడే నాకు సందేహం కలిగింది .ఆయన పెద్దగా మా ఉనికిని పట్టించుకోలేదని ఆయనకీ మా మీదా అంత ఆసక్తి లేదని .నా సందేహం యింటికి రాగానే నిజం అయ్యింది ఆయన రాసిన ఆరవ రోజు విశేషాలు చూసాక , అందులో ఎక్కడా మా ప్రస్తావనే లేదు .ఫోటో తో బహుత్ దూర్ కి బాత్ .లేక బ్లాగ్ లోకం లో కూడా అధిష్టానం అనుమతి అవసరమా ?ఏది ఏమైనా బ్లాగ్ లోకం లో గ్రూపుల ప్రభావం చాలానే వుందని అది వారు రాసే రాతల పైన కూడా పడుతుందని మరొక్క సారి రుజువయ్యింది .

17 డిసెం, 2010

నాగవల్లి వి నక్క వాతలే



చంద్రముఖి పులి ని చూసి నాగవల్లి నక్క వాతలు పెట్టుకునట్టు గా వుంది సినిమా చూసాక . స్వేక్వేల్స్ అచ్చిరావని మరో సారి నిరూపించ బడింది .చంద్రముఖి సినిమా తర్వాత ఏమవుతుందన్న ఆసక్తి కలగ జేస్తే నాగ వల్లి లో అంతా ఉహించ తగ్గదే .చంద్ర ముఖి ప్రియుణ్ణి రాజు చంపే కదే సగం సినిమా .అది ఎలాగు చంద్రముఖి లో చెప్పెసిందే దాన్నే ఇందులో వివరం గా చూపించారు .మిగతా కధ చంద్రముఖి నూట ముప్పై ఏళ్ళుగా గుహలలో బతికి వున్న ఆ రాజుని వొక అమ్మాయి మీద ఆవహిన్చి చంపెయ్యడమే .పాత సినిమాలో కధ లోని సన్నీ వేశాలని కధ గమనం లో తేడా రాకుండా వాడుకున్న విధానం మెచ్చుకో తగ్గదే . ఉదాహరణకి చంద్రముఖి సినిమాలో ఆఖర్న ముప్పై అడుగుల పాము వెళ్లి పోతూ కధ ముగిస్తే ఈ సినిమాలో అదే పాము వొక ఇంట్లోకి వెళుతూ కధ మొదలవుతుంది .మొదటి సగం బానే వున్నా మిగతా సగం ఆసక్తి రేపదు . క్లైమక్ష్ లో నూట ముప్పై ఏళ్ళ రాజు ముసలి పాత్రలో వెంకటేష్ చేసిన నృత్యం బఫూన్ లా వుండి అపహాస్యం పాలయ్యింది . జనాలు నవ్వుకున్నారు . అలాగే కధ సీరియస్ గా అవుతునప్పుడు వందనాలు అంటూ వెంకటేష్ ని ఉద్దేశించి శరత్బాబు కుటుంబ సబ్యులు పాడే పాట కూడా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది . చంద్రముఖి సినిమాలో హాస్యం , మంచి పాటలు యి సినిమాలో మిస్ అయ్యాయి .చంద్రముఖి లో మంచం ఎత్తే సీన్ లాగే ఈ సినిమాలో కూడా మంచం వరకు వచ్చి నా చంద్రముఖి ఆవహించిన ఆమె శాండలేర్ ని యెగిరి పట్టుకుని లాగి వెంకటేష్ మీద విసరడం ప్రేక్షకులు ఊహించని సన్నీ వేశం .వోవర్ ఆల్ గా చంద్రముఖి సినిమా ఆద్యంతం ఆసక్తి ని రేపి ప్రేక్షకులకి వినోదాన్ని యిస్తే నాగవల్లి ఆద్యంతం ప్రేడిక్తబుల్ గా వుండి కొండక చోట విసుగుని తెప్పిస్తుంది . చంద్రముఖి నాగలోకం అయితే నాగ వల్లి నక్క సో నక్క కి నాగ లోకాని కి వున్న తేడా వుంది .వోపిక వుంటే వొక సారి మోహ మాట పడొచ్చు .అవురా అవురా నో హౌల హౌలా నో తేల్చుకోడానికి .

10 డిసెం, 2010

నిన్నటి నా నువ్వు

Clipart Illustration of a Silhouetted Woman Walking Away Towards A Bursting Sunset
కొన్నాళ్ళకి ఈ స్నేహం చెదిరి పోవచ్చు
ఈ ప్రేమ పారి పోవచ్చు
జ్ఞాపకాల్లో మిగిలిపోవచ్చు
నాకన్నా మెరుగైనవాళ్లు వచ్చి నిన్నుమురిపించొచ్చు
నేను నీతో మాట్లాడే ఆ సమయం శూన్యం గా నిశబ్దం లో వుండి పోవచ్చు .
మెసేజ్ లతో నిద్రలేపిన అరుణో దయాలు వివర్ణ మయ్యి గాయాలు రేపోచ్చు
మాటలు కలిపిన మధ్యన్నాలు మసకబారి పోవచ్చు
కలిసి నడిచిన సాయం సమయాలు వొంటరి గా నడిచే నన్ను చూసి నిట్టుర్చొచ్చు
నువ్వు నీ కొత్త స్నేహ భందాలతో తెగిపోయిన ఈ భందాన్ని పట్టించు కోక పోవచ్చు
నిన్నటి నా నువ్వు ,రాబోయే రేపటి కి పరాయి దానివి అయిపోతు ఈ రోజు కి సెలవు తీసుకోవచ్చు
నీ కొత్త పరిచయాల ఆనందపు కిల కిలారావాల లో నా ఆక్రోసపు మూగ వేదన వినిపించక పోవచ్చు
కాని వొంటరి గా నిసిరాతిరి నిశబ్దం లో నిండు పౌర్ణమి ని చూస్తూ నీ పెదవుల పై విరిసే ఆ చిరునవ్వే సాక్ష్యం
నువ్వు నన్ను మరువలేవని నీ జీవితపు డైరీ లో నే నీ విలువైన జ్ఞాపకాన్నని
మళ్ళి మనం యి జీవితం లో కలవ లేక పోవచ్చు
భాద్యతల బతుకు జట్కా బండి లో వేరే గమ్యాల్లో సాగి పోవచ్చు
కాలగమనం లో కరిగి పోవచ్చు
కాని నీ జీవితపు అతి మధుర ఘట్టాల అరుదైన క్షణాల్లో
నా విలువైన భాగస్వామ్యం ఉందన్న ఆనందం నా సొంతం
నిన్ను తల్చుకున్న మరు క్షణం శ్రావణ మేఘాలై వర్షించే
నా కన్నిల్లే సాక్ష్యం. సెలవ్ నేస్తం .

27 నవం, 2010

ఆరంజ్ పుల్లన


కొంతకాలమే ప్రేమిస్తాను జీవితాంతం ప్రేమించమంటే కుదరదు . ఎవడన్న అలా చెబుతుంటే అది వట్టి ట్రాష్ .ఇది హీరో ఆలోచనా విధానం .
తనకు నచ్చిన నలుగురి లో ఎవర్ని ప్రేమించాలో చిట్టిలు వేసుకుని స్నేహితురాళ్ళతో ఆ చిట్టిలు తీయించి నిర్ణయం తీసుకోవాలనే హీరోయిన్ .
వీళ్ళిద్దరి మద్య ప్రేమ ,ఆమె తన పదో ప్రేమికురాలని ,తన ప్రేమ మినిమం ఆయుస్ష్హు వొక రోజు నుంచి మాగ్జిమం మూడువందల ఎనభై రోజులు అని హీరో ఆమెకి చెపుతాడు . ఎక్కువ కాలం ప్రేమిస్తే ఎదుటి వాళ్ళలో లోపాలు కనిపిస్తాయని ఆ లోపేజంపు జిలాని అయిపోవాలని లేకపోతె అబద్దాలు చెపుతూ ప్రేమని బతికించు కోవాలని చెపుతుంటాడు .యిన్ని చెప్పే హీరో ఆఖర్ని ఆమెతోనే జీవితం గడపాలని నిర్ణయం తీసుకునే బలమైన కారణాలు ఏమి చూపలేదు అలాగని ఆమె తోనే వుండి పోతా అని గట్టి గా చెప్పలేదు . యి విధం గా భాస్కేర్ ఏమి చెప్పదల్చుకున్నాడో తనకే క్లారిటి లేక ప్రేక్షకులని కూడా అయోమయానికి గురి చేసాడు .
నిన్న సినిమా మొదటి షో అయ్యి అవ్వగానే చిరంజీవి డైరెక్టర్ భాస్కర్ ని పిలిచి కుక్క బూతులు తిట్టాడని అభిజ్న వర్గాల బోగట్ట .''ఎందుకురా బొమ్మరిల్లు లాంటి నా ఇంట్లోంచి నలభై కోట్లు పరుగు పెట్టించి నా కంట్లో ఆరంజ్ జూసు పోసావు ని యమ్మ ఛి ఛి బూతులు వచ్చేస్తున్నాయి అసలే సుడి బావుంటే ఉప ముఖ్యమంత్రి కావలిసిన వాణ్ణి .మగధీర లో వచ్చినదంతా మటాష్ చేసేసావు కదరా ?దిఫ్ఫరెంట్ లవ్ స్టొరీ అంటే కామోసు అనుకున్నా ఈ షార్ట్ టర్మ్ లవ్ ఎంట్రా ఎదవా ?అన్డుకనేనారా నీ బొమ్మరిల్లు తర్వాత షార్ట్ టర్మ్ సక్సెస్ ని గమ్యం గా పెట్టుకుని నన్ను వో రేంజ్ లో ఆడుకున్నావు ?ఈ తొక్కలా సినిమాకి వందరోజులు ఆస్ట్రేలియా లో దొబ్భించుకోవాలా ?'' అంటూ ఆవేశ పడ్డాడు .
భాస్కర్ చెప్పే పాయింటు లో నిజం వున్నా ఎవరికి వాళ్ళు యిల షార్ట్ టర్మ్ లవ్ స్త్రోరి లతో సరిపెడితే కుటుంబ వ్యవస్థ ఏమి కాను ?జీవితం లో ప్రేమతో పాటు భాద్యతలు కూడా వుంటాయి పిల్లలు వాళ్ళ బాద్యతలు తీసుకోకుండా నాకు నచ్చినంత కాలం ప్రేమించి యింకోకర్ని చూసుకుంటా అంటే'' భాస్కర్ అనాధ ఆశ్రమాలు '' ఎక్కువవుతాయి లోకం లో .
యింక సినిమా విషయానికి వస్తే మొదటి పది నిమిషాలు జెనిలియా ఏమి మాట్లాడుతోందో వినపడ నంత గా కయ్యి కయ్యి మని అరుస్తూ డ్డబ్బింగ్ చెప్పించారు .బ్రహ్మానందం ని సరి గా వాడుకోలేదు .ప్రకాష్ రాజ్జ్ పరిస్తితి అంతే హీరో చేత ఫ్లాష్ బ్యాక్ చెప్పించాదానికే పరిమితము అయి పోయాడు .యి సినిమాకి ప్లస్సు పాటలే .అవీ లేకపోతె సినిమా''పులి '' అయిపోయేది .కారు హెడ్ లైట్ వేసుకుని చీకట్లో హైవే మీద నడపడం లో వున్న బద్రత ఆ లైట్స్ లేకుండా ఎదురు వచ్చే వాహనాల లైట్స్ మీద ఆధారపడి నడిపితే ఎలా ఉండదో అల్లాగే జీవితాంతం ప్రేమించాలంటే ఎదురు లైట్స్ మీద ఆధార పడి బండి నడపడం అని భాస్కర్ భావం . పాపం వున్నంతలో చరణ్ బానే చేసినా డాన్సుల్లో విరగ దీసే స్టెప్స్ మాత్రం లేవు .జెనిలియా ని బొమ్మరిల్లు హాసిని భూతం యింకా వదల లేదు .ఇంతకూ ముందు దాదాపు యిదే ఆలోచన తో వేణు లయ తో స్వయంవరం అనే సినిమా వచ్చింది అయితే అందులో హీరో జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా పెళ్లి చేసుకోను అంటాడు .ఇంకో సినిమా వెంకటేష్ , సౌందర్య తో కొంతకాలం ప్రేమించుకుని పెళ్ళిచేసుకుని అప్పుడు నచ్చక పొతే విడి పోదాం అని వొప్పందం తో వచ్చింది . ఆ రెండు విజయం సాధించాయి కారణం అల్టిమేట్ గా వొక మనసుకు వొకరు అని గట్టి గా చెప్పడం . ఆరంజ్ లో అదే లోపించింది ఆఖర్న కూడా దర్శకుడు ఆ మాట నొక్కి వక్కాణించా కుండా అయోమయం లో వదిలేసాడు .అందుకని అయ్యో ఆదివారం లోపు ఆరంజ్ చూడలేక పోయామే అని బాధ పడకుండా ఇంకో నెలలో జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ సినిమాని ఆరంజులు వలుచుకుంటూ యింట్లోనే చూడడం ఉత్తమం .

30 అక్టో, 2010

కృష్ణ కాంత్ పార్క్ లో కృష్ణ లీలలు



జీవితం నిస్తారం గా సాగి పోతోంది అనుకున్న ప్రతిసారి జీవితం లో వసంతాలు నింపడానికి వసంత కోకిల లా ఎవరో వొకరు వచ్చి తమ సౌరభాలు వెదజల్లి మళ్ళి జీవితం లో సారం నింపి నిష్క్రమించడం నా విషయం లో పరిపాటే .అలా అనుకోకుండా ఆమె నా జీవితం లోకి ప్రవేశించింది .వొకసారి అసుర సంధ్య వేళ ఆఫీసు పని ముగించుకుని ఇంక ఇంటికి బయలుదేరా డానికి సిద్ద పడుతుంటే లోపలకి రా వచ్చా ?అంటూ వొక అందమైన ఆమె వాళ్ళ అబ్బాయి తో సహా నా చాంబర్ డోర్ ఓపెన్ చేసి అడుగుతోంది .నేను ఆమె అందానికి అప్రతిభుడనై తల అడ్డం గా నిలువు గా వుపేస్తూ కూర్చోమని సైగ చేశా .నా ఉద్యోగ రీత్యా ప్రబుత్వ పరంగా అవ్వ వలసిన తన పని కోసం నా దగ్గరకి వచ్చినట్టు ఆమె మాటల్లో గ్రహించా , కాని అప్పటికే మా స్టాఫ్ అంతా వెళ్లి పోయి నేను మా ప్యూను మిగిలాం ఆఫీసు మొత్తానికి .అలాంటి సమయం లో వేరెవరైనా అయివుంటే రేపు ఆఫీసు టైం లో వచ్చి కలవండి అని చెప్పేసి వెళ్లి పోవడం సహజం ఎందుకంటె పొద్దుట నుంచి పని చేసి సాయంత్రానికి ఎనర్జీ లెవెల్స్ పడి పోయి వుంటాయి . అటువంటిది ఈమెని చూడగానే ద్విగున్నికృత ఉత్సాహం వచ్చేసి వొక్క పదినిమిషాల ముందు వచ్చి వుంటే మీ పని యి రోజే అయిపోయి వుండేది . రేపు పొద్దున్నే ఫస్టు అవర్ లో వచ్చేసి మీకు రావలిసింది మీరు తీసుకోవచ్చు అన్నా (రేపు కూడా చూడొచ్చు అన్న ఉద్దేశం ?)
అబ్బే లేదండి నా వ్యాపార పనులతో నేను మళ్ళి రావడం వీలు పడదు మా స్టాఫ్ ని పంపుతా కొంచెం సాయం చెయ్యండి అంటే వో యస్స్ రేపు పంపండి అన్నా .ఆమె మీ కబ్యంతరం లేక పొతే మీ సెల్ నెంబర్ ఇస్తారా అంటే మీ సెల్ నంబర్ చెప్పండి మిస్సేడ్ కాల్ ఇస్తా సేవ్ చేసుకోండి అన్నా (నేను కూడా సేవ్ చేసుకోవచ్చు కదా).అంటే ఆ మర్నాడు ఆమె పని చేసేసాక ఆమె నా సెల్ కి చేసి మీ లాంటి వాళ్ళు ఇంకా ప్రబుత్వ అధికారులు గా వుండ బట్టే ప్రజల పనులు ఇబ్బంది లేకుండా అవుతున్నాయి అంటే నేను భలే వారే అది మా కర్తవ్యమ్ అంటూ సినిమా డైలాగు కొట్టి ఎప్పుడన్నా అవసరం పడి నప్పుడు గుర్తు పెట్టుకోండి అన్నా .మిమ్మల్ని వొక్క సారి చుసిన వాళ్ళు ఎప్పటికి మర్చి పోరు అంది . అది పొగడతో తిట్టో అర్ధం కాక అంతా మీ అభిమానం అంటూ పెట్టేసా .యిది జరిగి రెండు నెలలు అయ్యింది .నా పని వత్తిడిలో ఈ విషయం ఇంతటి తో మర్చి పోయా .మొన్న హటాత్తు గా సెల్ మోగితే ఆమె పేరు తో కాల్ కని పిస్తోంది .వెంటనే ఫోన్ ఎత్తి ఆమె ని పేరు తో బాగున్నారా అన్నా .దానికే ఆమె ఆనంద పారవశ్యం అవుతూ నన్ను మీరు బానే గుర్తు పెట్టు కున్నారు అంది .''మర్చి పోయే పెర్సానాలిటి యా మీది ''మనసులో మాట సర్రున బయటకి వచ్చేసింది ,.దానికి ఆమె నెగటివ్ గా రీయక్ట్ అవకుండా థాంక్స్ అండి చిన్న పని మీద మిమ్మల్ని డిస్ట్రబ్ చేశా అంటూ తన పని చెప్పడం నేను సాయంత్రానికి చేసెయ్యడం చక చకా జరిగి పోయాయి . ఈ నే పద్యం లో ఆమె అదే రోజు మూడు నాలుగు సార్లు ఫోన్ చెయ్యడం చేసిన ప్రతి సారి కాల్ డురేషణ్ పావుగంట చొప్పున పెరగడం'' మీరు పని పడినప్పుడే కాకుండా ఉత్తప్పుడు కూడా చేస్తూ వుంటే నా మీద పని వత్తిడి తగ్గి మరింత బాగా పని చేస్తానేమో'' అని నే ననడం ఆ పిదప రోజుకి రెండు సార్లు ''సెల్ లో సొల్లు '' ప్రోగ్రాము మొదలవ్వడం జరిగి పోయాయి .ఆ సొల్లు లో బయట పడిన ఎన్నో కధలలో మొదటి కధ ఈ కృష్ణ కాంత్ పార్క్ లో కృష్ణ లీలలు .మా వొప్పందం ఏంటంటే మేము ఎప్పటికి మళ్ళి జీవితం లో కలుసు కోకూడదు కేవలం సెల్ లోనే టచ్ లో వుండాలి అప్పుడే కుటుంబ వ్యవస్థ కి భంగం కలగ కుండా , ఏ విధమైన ఆర్దిక , హార్దిక పరమైన సంబంధ భాందవ్యాలు లేకుండా అంతరాత్మ తో సంభాషించు కునట్టు గా వుండి పోవాలి .
సరే యింక కధ లోకి వస్తే ఆమె కి రోజు సాయంత్రం ఆ పార్క్ కి వాక్ కి వెళ్ళడం రివాజు . అక్కడే తనకి ఎంతో అందమైన అబ్బాయిలు (టీవి సీరియల్స్ లో వేసే వాళ్ళు )పరిచయాలు పెంచు కోడానికి వేమ్పర్లు ఆడే వాళ్ళు . పరిచయం అయిన పది నిమిషాలకే ఈమె తనకి పెళ్లి అయ్యిందని యిద్దరు పిల్లలని నిజం చేప్పేసేది .అయినా గాని వాళ్ళు వదలకుండా వెంట పడటానికి కారణం ఈమె అందం తో పాటు ఈమె స్వయం గా నడుపుకుంటూ వచ్చే హోండా కార్ కూడా కొంత కారణం అయి ఉండొచ్చు . వాళ్ళలో చాల మంది యింకా జీవితం లో సెటిల్ అవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే .వీళ్ళ తో పాటు జీవితం లో బాగా సెటిల్ అయి పోయి బాగా డబ్బు సంపాయించి దాన్ని ఎర గా చూపి అందమైన అమ్మాయిలకి వల వేసి ఎంజాయి చేద్దామనుకునే బాపతుయింకో రకం .మరో రకం వయసు మీద పడ్డా కలర్ తో కవర్ చేసి పవర్ లేక పోయినా కళ్ళతోనే స్కాన్నింగ్ చేసేసి ఇంటికెళ్ళి భక్తీ టీవి చూసే రకం .ఎవర్తి బకిరి దొరుకుతుందా దాన్ని సినిమా నిర్మాత కి ఎర గా వేసి అసిస్టంట్ డైరెక్టర్ స్తాయి నుంచి డైరెక్టర్ స్తాయికి ఏది గి పోదామా అని చూసే కృష్ణ నగర్ బాచ్చి కుర్రాళ్ళ తో అలరారుతూ వుంటుంది ఆ పార్క్ .అక్కడకి రోజు ఈమె వచ్చే సమయానికే యింకో ఆమె కూడా వస్తుంది .చూడ గానే పవిత్ర భావం స్తానే అపవిత్ర ఆలోచనలు వచ్చేలా టైటు ట్రాక్ సూటు వేసుకుని కాసేపు పరిగెడుతూ కాసేపు నడుస్తూ కాసేపు వివిధ బంగిమల్లో ఎక్సరసైజు లు చేస్తూ అందరి ద్రుష్టి తన మీద పడేలా చేసుకుంటుంది .మా సెల్లు మిత్రురాలు రిజెక్ట్ చేసిన కేయన్ డి డే టూలు ఆమె వెనక వెళ్ళే వారు . ఏ వోక్కరు కూడా రెండు రోజులు దాటి ఆమె తో కని పించే వారు కాదు .ప్రతి మూడు రోజులకి జోడి మారి పోతూ వుండడం తో సెల్ మిత్రురాలికి ఉత్సుకత పెరిగి తన మిత్రున్ని విషయం ఏంటో కని పెట్ట మని పురమాయించింది .అతను రెండు రోజుల తర్వాత నీరసం గా వచ్చి విన్న వించిన విషయం ఏంటంటే అందరు తమ ఆరోగ్యాలు కాపాడుకోవటానికి వస్తుంటే ఈమె తన విలాసాలకి శరీర విన్యాసాలతో ఆకర్షించి వాళ్ళని పబ్బులకి డబ్బులు దోబ్బించి జబ్బులు అంటించి ఆఖర్న వోరేయి కాకిలా కలకాలం బతికే కంటే హంస లా నాలా ఆర్నెల్లు బతకరా అంటే వాళ్ళు గుండెలు జారి పోయి డాక్టర్ సమరాల దగ్గరకి వెళ్లి జీవన సమరం కోసం పోరాడుతుంటే ఈమె మళ్ళి అగ్నికి ఆహుతయ్యే కొత్త మిడత కోసం అన్వేషిస్తూ పార్క్ లోకి అడుగు పెడుతూ వుంటుంది .ఆమె అందిట వోరేయి రాచ పినుగా వొంటరి గా పోదురా నాతొ పాటు వందమంది నన్నా తీసుకు పోతా నీ నంబర్ అరవై అయిదు అని . యివన్నీ ఆ మిత్రు రాలు చెపుతూ ''నాకు వొక్క ముక్క అర్ధం కాలేదు నన్ను ఇష్ట పడే నా మిత్రుడు ఆ రోజు నుంచి ఎందుకు కనబడటం లేదు ?ఆమెతో నడక కోన సాగించిన వాళ్ళు యందుకు అలా పినుగుల్లా తయారవుతున్నారు ?కృష్ణకాంత్ పార్క్ లో నడిచే వాళ్ళంతా ఏనుగుల్లా వుండే వాళ్ళు పినుగుల్లా అవడానికి నడకే కారణమా ? '' అంటూ ప్రశ్నలు సంధిస్తూ వుంటే తనకి వొక టే సలహా చెప్పా రేపటి నుంచి నువ్వు ఆ పార్క్ కి నడక కి పోకు మీ మిత్రుడి ని కరిగి పోయే జ్ఞాపకం లా మరచి పో అని .ఆ క్షణమే మరింత స్తిరం గా నిర్ణయించుకున్నా మా ఇద్దరి మద్య ఉన్న ఎప్పటికి కలవ కూడ దన్న వోప్పందాన్ని మరింత గట్టిగా దృడం గా అమలు చేసి తీరాలని .