మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
19 మే, 2011
రొటీనే బెస్ట్
రొటీన్ లైఫ్ కి భిన్నం గా నాలుగు రోజులు బయటకి వెళ్ళినప్పుడే రొటీన్ లైఫ్ గొప్ప తనం తెలుస్తుంది .వారం రోజులపాటు ట్రైనింగ్ ప్రోగ్రాం కి నామినేట్ చెయ్యడం తో లక్నో రావలసి వచ్చింది .విశాల మైన ప్రాంగణం లో వూరి చివర తోటల మద్య అందం గా నిర్మితమైన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ .మువ్వన్నెల జెండా రెప రెప లాడుతూ ఆహ్వానం పలుకుతుంది .సివిల్ సర్వీసు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సవుకర్యాలు అద్బుతం గా వుంటాయి .ఎసి రూం ,టీవి ,ఇంటర్నెట్ సవుకర్యం తో కంప్యూటర్ ,సాయంత్రం ఊరులోకి వెళ్ళాలంటే ఎసి బస్సు ,వేళకి మంచి భోజన సదుపాయాలు ,కొత్త అల్లుణ్ణి చూసుకునట్టు గా మేపుతారు . యివ్వన్ని ఎందుకు చెపుతునానంటే యిన్ని సదుపాయాలు వున్నా, ఆఫీసు పని వత్తిడి లేక పోయినా రెండు రోజులు పోగానే యింటి ద్యాస మొదలవుతుంది .పొద్దున్నే వాకింగ్ కి వెళ్తుంటే మామిడి చెట్ల మీద కూర్చుని ప్రశాంతం గా రాగాలు పలుకుతూ కోయిల ,దాని పాటకి అనుగుణం గా పురి విప్పి నాట్యం ఆడే నెమళ్ళు,మంద్రం గా నా సెల్ ఫోన్ లో నే రికార్డు చేసుకున్న నాకిష్టమైన పాటలు వింటూ రెండు రోజులు బానే గడిచి పోయాయి .దేశం మొత్తం మీదనుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారులు ప్రతి వాడు చెవి కి సెల్ ఆనించి ఆదేశాలు యివ్వడమే గాని ఆస్వాదించే వాళ్ళే కనబడలేదు .నాకు రెండు రోజులు ఆస్వాదించే టప్పటికి హైదరాబాద్ లో నా ఇల్లు నావాళ్ళు ,స్నేహితులు , ఆ రణగొణ ధ్వనుల ట్రాఫ్ఫిక్ లో కార్ డ్రైవింగ్ ,యివన్నీ గుర్తు కొచ్చాయి .మూడో రోజు వాకింగ్ కి అంతవరకు అంత అందం గా వినిపించిన కోయిల కంఠం చెవికోసిన మేక అరుపు లా వినిపించింది .నాట్య మయూరి కాస్త దారికి అడ్డం వచ్చే అడ్డ గాడిదలా కనిపించింది .నేనెప్పుడు సెల్ లో మ్యూజిక్ ఆన్ చేసినా వూరు మారినా మనిషి మారునా పాటే రాసాగింది .యింక వొక్క రోజు ఎలాగో గడిపేస్తే ఈ ట్రైనింగ్ అయిపోయి ఆది వారం హైదరాబాద్ చేరుకోవచ్చు .అలసి పోయిన గజ ఈత గాడు కను చూపు మేరలో వొడ్డు కని పిస్తే లేని శక్తి ని పుంజుకుని వడ్డు కి యీదే విధం గా ఈ అరణ్య వాసాన్ని ముగించే కార్య క్రమం లో వున్నా .ఈ ట్రిప్ లో నాకు అర్ధం అయ్యిందేంటంటే మన రొటీన్ జీవితమే అన్ని విధాల బెస్ట్ , ఊరికే విసుకున్టాము గాని నాలుగు రోజులు బయటకు వచినప్పుడే దాని విలువ తెలుస్తుంది .కొత్తొక వింత పాత వొక రోత కొంతకాలమే మళ్ళి మన పాతే మనకు నచ్చుతుంది .నిజ జీవితం లో కూడా కుటుంబ వ్యవస్థ తో విసుగు పుట్టి న చపల చిత్తుడికి ప్రియురాలి కంఠం సెల్ ఫోన్ లో కోయిల పాట లాగే వినిపించినా కొన్ని రోజులు పోగానే గార్ధబ స్వరం లా వినిపిస్తుంది {అప్పటికే రెండు నెలలుగా నెలకి అయిదు వేలు సెల్ బిల్లు రావడం వల్ల }ఆ తర్వతా ఆమె చేసినా బ్రహ్మ నందం స్టైల్లో హలో హలో ఏంటో సిగ్నల్ కట్ అయిపోతోంది అంటూ పెట్టేయ్యడమే జరుగు తుంది .ఏతా వాతా నే చెప్పేదేమంటే రోజు ఆప సోపాలు పడుతూ వుద్యోగం లేదా యింటి పనులు చేసుకునే వాళ్ళు ఛి ఛి వేదవ రొటీన్ జీవితం విసుగొస్తోంది అనుకోకుండా దాన్ని ఆస్వాదిస్తూ చేసుకోవడమే ఉత్తమం .నువ్వు చెప్పే దాక తెలిదు మరి అనుకోకండి . వొంటరి గా నా గదిలో కుర్చునప్పుడు నా మనసులో యిప్పుడు వచ్చిన భావాలకి అక్షర రూపమే గాని ఎవరి అనుభ వాలు వాళ్ళవి .హమయ్య యిప్పుడు గుండెల్లో బెంగ తీరింది .
8 మే, 2011
100%లవ్ 50% marks
మొదటి సగం బావుంది .రెండో సగం సాగింది .ఎప్పుడు మొదటి స్తానం లోనే ఉండాలనుకునే హీరో ,ఊరినుంచి కాలేజీ లో జాయిన్ అయిన హీరో మరదలు మొదట్లో చదువులో వెనక బడినా తర్వాత మొదటి స్తానానికి వచ్చెయ్యడం ,ఆపైన వేరెవరో మొదటి స్తానానికి వస్తే యిద్దరు కుమ్ముక్కై వాణ్ణి ప్రేమ పేరు తో టైం వేస్ట్ చేయించి మళ్ళి మొదటి స్తానం కొట్టేయడం .ఎప్పుడు పార్టీ యివ్వని హీరో ఆ రోజు పార్టీ యిచ్చ్చే సందర్భాన్ని పురస్కరించుకుని మరదలి తో అతని వివాహాన్ని అందరికి తెలియ పరిచడానికి ముందు ,మాట వరసకి మరదలు ''బావ ఆ అజిత్ గాన్నినేను ఎంతో డిస్త్రుబ్ చేస్తే కూడా కేవలం నీకంటే రెండు శాతం తక్కువ తెచ్చుకుని మొదటి స్తానం కోల్పోయాడు లేకుంటే వాడె గ్రేట్ '' అనగానే వుక్రోశానికి పోయి నా గొప్పతనం వల్ల అది రాలేదన్న మాట అంతా నీ గొప్ప తనం వల్లేనా? అజిత్ గాడే గ్రేట్ అన్న మాట మా యింట్లో తిండి తిని వేరే వాణ్ణి పోగుడుతావ గెట్ అవుట్ అంటూ విడి పోతారు .యింక రెండో సగం లో హీరో కంపెనీ నష్టాల బాట లో వుంటే మరదలు తన తెలివి తేటలతో గట్టేక్కించి చివరికి బావని పెళ్లి చేసుకోవడం యిది టూకి గా కధ .
నాగ చైతన్య నటనా పరం గా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు . అయితే ఎంసెట్ లో మొదటి రాంకర్ ప్రైవేటు కాలేజీ లో ఎలా చదువుతాడో సుకుమార్ కే తెలియాలి ?ఐటం సాంగ్ మానియా సుకుమార్ ని వదిలినట్టు లేదు .అయితే ఆ పాటకి జనాల నుంచి స్పందన కూడా బానే వుంది .యింక నాగ చైతన్య తన తాత పాటకి నాన్న పాటకి స్టెప్స్ వెయ్యడం కూడా బానే పండింది .అయితే హీరో చుప్పనాతి వాడి లాగ , అసూయా పరుడు లాగ ప్రొజెక్ట్ చెయ్య బడడం ఎక్కువయ్యింది . ఆఖర్న కూడా యితరుల గొప్పతనం మనస్పూర్తి గా వప్పుకునట్టు చూపించలేదు , ఏదో తాగేసి వప్పుకునట్టు గా చూపించారు . యూత్ ఎలా రిసివ్ చేసుకున్తారన్న దాని మీదే ఈ సినిమా విజయం ఆధార పడి వుంది .
30 ఏప్రి, 2011
ఆత్మహత్యల్ని గ్లోరిఫై చేసే రాక్షసి
ఆత్మ హత్య చేసుకునే వాళ్ళ కారణాలు బయట వాళ్ళకి సిల్లీ గా కనబడొచ్చు దాని వెనక వాళ్ళు అనుభవించే మానసిక వేదన ఆపై ఎంతో ధైర్యం తో తీసుకునే ఆ నిర్ణయం అది అమలు చేసే విధానం ,చని పోయే ముందు వాళ్ళు యిన్నాళ్ళు పడ్డ వేదనతో బాటు ఎలా చని పోయారో కూడా చక్కగా చిత్రీకరించి దాన్ని youtube లో వాళ్ళు చనిపోయిన కొద్ది గంటల్లోనే ప్రపంచానికంత తెలిసేలా పెట్టె పాత్రలో ఇలియానా , తన తల్లిదండ్రుల్ని దారుణంగా చంపిన రౌడి మూక మీద పగ తో ప్రొఫెషనల్ కిల్లెర్ గా మారి రౌడి మూకల్ని మట్టు పెట్టె పాత్రలో రానా ,వీళ్ళని పట్టుకునే పొలిసు పాత్రలో సుబ్బరాజు . అనుకోని పరిస్తితుల్లో రానా , ఇలియానా పదిహేను రోజులు వెనిస్ పారిపోవలసి వస్తుంది .తను పదిహేను రోజుల్లో ఆత్మ హత్య చేసుకుంటానని దాన్ని రానా చిత్రీకరించి పెట్టాలని షరతు మీద అతని వెంట వస్తుంది .అంతకు ముందే రానా తన తల్లి చని పోవడం తో ఆత్మ హత్య చేసుకోడానికి నిర్ణయం తీసుకుని దీన్ని చిత్రీకరించడం కోసం మీనాక్షి ని (ఇలియానా )వొక ప్రదేశానికి రమ్మంటే ఆమె ముఖానికి ముసుగు వేసుకుని చిత్రీకరిస్తూ వుంటుంది , కత్తి తో పొడుచుకుని చని పోయే ముందు ముసుగు తొలగడం తో ఆమె తను ప్రేమిస్తున్న మీనాక్షి గా (ఒనె సైడేడ్ లవ్ )గుర్తించి ఆఖరి నిమిషం లో రక్షించమని వేడుకుంటాడు . తన పని చనిపోయే వాళ్ళ బాధల్ని ప్రపంచానికి తెలియ బర్చడమే గాని అతని చావుకు గాని బతుకు కి గాని ఏమి సంభంధం లేదంటూ వెళి పోతుంది .ఈ పదిహేను రోజులు ఐ లవ్వు యు అంటూ తన వెంట బడుతుంటే మగాళ్ళు అయి లవ్ యు అని చెప్పేది ''దాని '' కోసమే అని అంటుంది . దానికి హీరో సమాధానం ''అయి లవ్ యు అంటే అర్ధం నువ్వంటే నా కిష్టమని , బట్టలకి శాపింగులకి డబ్బులు దోబ్బిన్చుకున్తానని ఆ పైన'' అది '' కూడా కావాలని ''అర్ధం చెపుతాడు .పదిహేనో రోజు తను చని పోయే ముందు తన అక్కని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ప్రేమ పేరు తో ఎలా మోసం చేసి వాళ్ళ స్నేహితులకి అప్పగించితే ఆ విషయం మీడియా లో వచ్చి వాళ్ళనాన్న గుండె ఆగి మరణిస్తే అక్క మగాళ్ళని ఎప్పటికి నమ్మకు అంటూ ఆత్మ హత్య చేసుంటుంది వీడియో తీసి .అప్పటి నుంచి తను అలాగే చిత్రీకరిస్తున్నా అంటూ కత్తితో పోడుచుకుంటుంది ,యిది చిత్రీకరిస్తున్న రానా కూడా నువ్వు లేనప్పుడు నేనెందుకు అంటూ తన కంటే ముందే పొడుచు కుంటాడు .యిద్దరు అలా శవాల్లా పడి వుంటే మరో'' మరోచరిత్ర'' అనుకుంటూ ప్రేక్షకుడు కంట తడి పెట్టుకునే సమయం లో సుబ్బరాజు వచ్చి రక్షించడం తో కధ సుఖాంతం అవుతుంది .
మొదటి సగం అప్పుడే ఇంటర్వేల్లా అనట్టు కా సాగి పొతే రెండో సగం వుహించే మలుపులతో మాములు గా సాగి పోతుంది .ఆలి ముమైత్ ఖాన్ హాస్యం సబ్యత పరిధి దాటి వుంటుంది . మొహమాటానికి పొతే కడుపైయ్యింది లే వంటి సంభాషణలతో .భారి కాయం వున్న ఆఫ్రికా యువతి ఆలి మీదకు వస్తుంటే బాబోయి ఆ రెంటి తో సంపెస్తావా అంటూ క్లోజ్ అప్ షాట్స్ .రానా ఇలియానా బాగా చేసారు అయితే రానా భాష లో యాస మార్చు కోవాలి .ఈ సినిమా చూసి ఇంటర్ లో ఫెయిల్ అయ్యి లేదా లవ్ లో ఫెయిల్ అయ్యి ఆత్మ హత్య దిశగా ఆలోచించే యువత ను ఆ ప్రయత్నం లోకి నేట్టగాలిగెంత లా ఆత్మ హత్యని గ్లోరిఫై చేసారు ఈ సినిమాలో . అలా జరిగితే నై తికంగా పూరి దే ఆ బాద్యత , ఎందుకంటె ఎక్కడా కనీసం ఆఖర్న కూడా ఆత్మ హత్య చేసుకునే కంటే ఈ జన్మలోనే కోల్పోయింది సాధిద్దాం లాంటి సందేశాలు లేవు కాబట్టి . మొత్తానికి మేచ్యురుడ్ ప్రేక్షకులు మొహమాట పడ దగ్గ సినిమా నేను నా రాక్షసి .
26 ఏప్రి, 2011
సాయిబాబా మరణం తర్వాతా అనుమానాలే

నేను ఇంతకూ ముందు రాసిన'' దేవుడికే రోగం వస్తే ''పోస్ట్ లో రాసినట్టు గా సాయిబాబా నిర్యాణం తో నాకున్న అనుమానాలు కొన్ని తీరతాయనుకున్నా .కాని సాయిబాబా పార్దివ దేహాన్ని చూసాకా ముక్కున వేలు వేసు కోవడం మన వన్న్తయ్యింది .యిరవై ఎనిమిది రోజులు అయిసియు లో వున్నా , గడ్డం గీసుకునే అవకాశం లేక పోయినా వొక్క అంగుళం కుడా గడ్డం పెరగ లేదు .యింక జుట్టు వొక్క వెంట్రుక కూడా తెల్లది కనబడ లేదు .రోగాలకి అతీతం కాని బాబా కి గడ్డం పెరగడం , జుట్టు తెల్ల బడటం వాటికి మాత్రం మినహాయింపు ఎలా వచ్చింది?లోపలి వెళ్లి అయి సి యు లో చూసి వచ్చిన డాక్టర్ మిత్రుల వల్ల తెలిసిందేమంటే ఆయన మొఖం పిక్కు పోయి శరీరం శుష్కించి ఆస్తి పంజరం లా వుండడం తో పాటు మాసిన గడ్డం తో అసలు బాబా నేనా అనట్టు వుండేవారట .ఆయన చని పోగానే ట్రస్ట్ సబ్యుల వత్తిడి మేరకు ఆయన పార్దివ శరీరానికి ఎమ్బోస్సింగ్ (యిదో కొత్త ప్రక్రియ విదేశాల్లో యిప్పటికి అమలు లో వుంది చనిపోయిన వారి దేహం లో జీవ కళ వుట్టి పడేలా కొన్ని రకాలా కెమికల్స్ వేసి లేపనాలు పూసి మనిషి ప్రశాంతం గా నిద్ర పోతున్న బ్రాంతి కలిగించడం )చేసారని అభిజ్న వర్గాల బోగట్టా .అయితే యింక పని సగం లో ఉండగానే సి ఏం , గవర్నర్ వచ్చేయడం తో ముఖ్హాన్ని, పాదాలని పూర్తీ గా కవర్ చేసేసి మళ్ళి వాళ్ళు వెళ్ళాక పని పూర్తీ చేసి అందంగా తయారు చేసి బయటకు తీసుకు రావడం తో సాయిబాబా జుట్టు నలుపు ప్రకృతి విరుద్దమా ?గడ్డం కూడా నలుపేనా లేకా లోక సహజం గా తెలుపా అన్న విషయాలు నాలాంటి జిజ్ఞాసులు తెలుసుకునే అవకాశం లేక పోయింది .అంతరంగాలలో నిలిచి పోయిన సాయి దివ్యమంగల స్వరూపాన్ని యిప్పటి అలంకరించని పార్దివ దేహం తో జుట్టు తెల్ల బడి , మాసిన గడ్డం తో భక్తులు చూసి తట్టుకోలేరని ట్రస్ట్ సబ్యులు ఈ ఏర్పాటు చేసినట్టు తెలిసింది .అయన పోయిన పదిహేను నిమిషాలకి కర్ణాటక లో మాండవ (?)జిల్లాలో వొక ఆడశిశువు , యింకో పది నిమిషాలకి అదే ప్రాంతం లో (ఎక్కడైతే ప్రేమ సాయి గా పుడతానని బాబా చెప్పే వారో )యింకొకరికి మగ శిశువు పుడితే అప్పుడే ప్రేమ సాయి పుట్టేసారని ప్రచారం జరుగు తోంది .అసలు పిండానికి ప్రాణం పుట్టే ముందే వస్తుందా ?ఫలదీకరణం జరిగానప్పటి నుంచి ఉంటుందా ?వొక ఆత్మ అందులో ప్రవేశించాలంటే పిండ దశ నుంచే ప్రవేసించాలా?ఆఖరి నిమిషం లో దూరితే సరి పోతుందా?హేవిటో సాయిబాబా మరణం లోను అనుమానాలే మరణం తర్వాత అనుమానాలే . కొన్ని ప్రశ్నలకి సమాధానం కాలమే చెప్పాలి .
16 ఏప్రి, 2011
బాబాయి ఆరంజ్ తీన్ మార్
రాంచరణ్ సినిమా ఆరంజ్ యెంత హిట్టో అందరికి తెలిసిందే .స్వయం గా నిర్మాత నాగ బాబు ఆ సినిమా దర్శకుడు భాస్కర్ మీద కోపం బహిరంగంగా నే వెళ్ళ గక్కాడు అంత చెత్త సినిమా తీసినందుకు .అదే కాన్సెప్ట్ తో మళ్ళి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనాల మీదకు వదిలిందే ఈ తీన్ మార్ .ఆ సినిమాకి ఈ సిని మాకి చాలా పోలికలే వున్నాయి .ఆ సినిమాలో మొదటి పది నిమిషాలు జెనిలియా ఏమంటుందో కూడాఅర్ధం కానంత గా అరుస్తూ వుంటుంది .ఈ సినిమాలో కూడా మొదటి పది నిముషాలు పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో కూడా అర్ధంకాదు. డబ్బింగ్ కూడా చెప్పుకునట్టు లేదు అక్కడక్కడా .
యింక స్టొరీ విషయానికి వస్తే ఆరంజ్ లో లాగే హీరో మైక్ నచ్చిన ఆడవాళ్ళని రంగు , రుచి ,దేశం , వొడ్డు పొడుగు , యిలా దేనితోను సంభంధం లేకుండా కొన్నలపాటు ప్రేమించేసి బోర్ కొట్టగానే యింకోకల్లని చూసుకుంటూ ఉంటాడు .అయితే త్రిష తో మాత్రం వొక సంవత్సరం పాటు తిరుగు తాడు .సంవత్సరం అని అంత గట్టి గా ఎలా చెప్పా గలమంటే స్క్రీన్ మీద రెండు నెలల తర్వాత , అయిదు నెలల తర్వాత , సంవత్సరం తర్వాత అంటూ కింద రాసి వస్తూ వుంటుంది .సీను మాత్రం ప్రతి సారి షాపింగ్ కి వెళ్ళడం , త్రిష కురచ బట్టలు కొనుక్కోవడం . అక్కడనుంచి పబ్ కి వెళ్ళడం యివే .యివి కాకుండా యిద్దరి కి లిప్ లాకులు ఎదురు పడిన ప్రతి సారి .ఆ పైన యధా విధి గా వేలాయుధం (మైక్ )మనం విడి పోదాం నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని హాయి గా వుండు అంటూ చెపితే వాకే అని గట్టి గా కవుగిలించుకుని మరో సారి పెదాలు కొరికేసి విడి పోతారు .హీరోయిన్ కి ఎయిర్ పోర్ట్ దాక వచ్చి ఇండియా కి సాగనంపే క్రమం లో వొక పెద్ద మనిషి (పరేష్ రావెల్ )నిజమైన ప్రేమికులకి నిర్వచనం ముప్పై ఏళ్ళ క్రితం మైక్ లాగే వుండే అర్జున్ పాల్వాయి తను ప్రేమించిన అమ్మాయిని యెంత స్వట్చం గా ప్రేమించి పెద్దల్ని ఎదిరించి ఎలా పెళ్లి చేసుకునదో ఫ్లాష్ బ్యాక్ లో చెపుతుంటాడు .అయితే మద్య మద్య లో మైక్ లవ్ స్టొరీ మళ్ళి పాల్వాయి లవ్ స్టొరీ ఏది ఎప్పుడు వస్తుందో తెలుసు కోలే న్నంతగా వస్తూ ప్రేక్షకుల సహా నాన్ని పరీక్షిస్తూ వుంటుంది . ముప్పై ఏళ్ళ నాటి బెల్ బాటం ఫాంటులు , అప్పటి హెయిర్ స్టైలు లో పాల్వాయి పక్కనున్న వాళ్ళే కనిపిస్తారు హీరో మాత్రం జీన్ ప్యాంటు (యిప్పటి స్టైల్లో కుట్టింది ), డేనిం షర్టు వేసుకుని భవిషత్తు దార్సనీకుడి లా కని పిస్తూ ఉంటాడు .వొక చోట అంటాడు కూడా భవి ష్యత్తు లో పెళ్ళికి ముందే అన్ని అయిపోతాయేమో గాని ఇప్పడు మాత్రం ముద్దు పెట్టి ఎంగిలి చెయ్యను అంటాడు బెల్ బాటం స్నేహితులతో . చివరికి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు .
యింక మైక్ త్రిష మీద కోపం తో (తను వేరే వాళ్ళని ప్రేమించిందని )యింకో విదేసి అమ్మాయిని ప్రేమించేస్తాడు .ఆమె ఇండియా చూడాలంటే ఆమె కోసం ఇండియా బయలు దేరతాడు , ఆమె రాక పోయినా సరే (?).ఇండియా వచ్చాక యిద్దరు మళ్ళి కాన బడ గానే కౌగిలింతలు ముద్దులు . వొక పక్క త్రిష ఆమె ప్రేమికుడి తో ఫోన్ లో మాట్లాడుతూ వుంటే ఆ టైం కూడా వేస్ట్ చేసుకోకుండా మైక్ ఆమె ని పట్టేసుకుని వొళ్ళంతా తడిమేస్తూ ఉంటాడు . త్రిష మాత్రం ఎక్కడ తోనగ కుండా చిన్న ములుగు కూడా రానీకుండా తన ప్రస్తుత ప్రియుడి తో అక్కడ ఏమి జరగా నట్టే మాట్లాడుతూ తను వొక రెండు మూడు రోజులు కలవ లేక పోవచ్చని అర్జెంటు పనులు వున్నాయని చెపుతూ ఆ మూడు రోజులు తన మాజీ ప్రియుడి తో పబ్బులకి వెళుతూ టాక్సీ లో తిరుగు తు వుంటుంది .వొక ఆడది తలచుకుంటే మగాన్ని యెంత బకరా చేయోచ్చ్చో? టాక్సీ డ్రైవర్ ఆలి వీళ్ళ సంభాషణలు విని బట్టలు నగలు కొనడానికి వొక బకరా గాడు , పబ్బుల్లో ఎంజాయ్ చెయ్యడానికి ఇంకొకడు అయితే ఆఖరికి ఎవరి తో సెటిల్ అవుతుందో అనుకుంటూ ఉంటాడు . పెళ్లి అయిన మర్నాడు తన భర్త కి విడాకులు ప్రొపోజ్ చేసి వేలయుధం తో యెగిరి పోతా అని చెపుతుంది త్రిష .చివరాఖరకి యిద్దరు కలుస్తారు . అక్కడక్కడ పవన్ కళ్యాణ్ నటన చాలా బావున్నా మిగతా చోట్ల రొటీన్ .త్రిష కురచ డ్రెస్సులు ముద్దు సీన్ లలో పెట్టిన శ్రద్ద నటన మీద కూడా పెట్టి వుంటే బాగుండేది .చాలా చోట్ల పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడో కూడా అర్ధం కానంత గా వున్నాయి అతని సంభాషణలు . మరి యిది డబ్బింగ్ లోపమా ?యింక అర్ధం కాని విదేశీ భాష లో ఎక్కువ సేపు మాట్లాడడం విసుగు తెప్పిస్తుంది .ఆలె ఆలె పాట బావుంది చిత్రి కరణ కూడా .ఈ సినిమాని వొక రేన్జి లో వుహించు కోకుండా ఆరంజ్ కి కోన సాగింపు గా పవన్ కళ్యాణ్ ఆరంజ్ గా భావించుకుని వెళితే గిట్టు బాటవుతుంది . లేక పొతే తీన్ మార్ కాస్తా తీన్ బోర్ అవుతుంది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)