10 ఫిబ్ర, 2012

నాతొ కలిసి చస్తావా నేస్తం ?

ఎక్కడున్నావు రెండేళ్ళ క్రితం నువ్వు తనకి 
రెండేళ్ళ తర్వాత తన దగ్గర ఉంటుందా నీ ఉనికి 
వుహించావా ఎప్పుడన్నా వొక్క క్షణం 


  ప్రేమ పోరాటం లో పడి మరిచావా ఈ ప్రశ్నని?
కట్టుకున్నావ్ కదూ నీ కళ్ళకి పట్టుగంతల్ని?


శాశ్వతమనుకుంటున్నావా నువ్విక్కడ 
అదే నిజమైతే, నీ ముందరివాళ్ళంతా ఎక్కడ?
నీవు పోయిన మరుక్షణం 
నిన్ను మర్చి పోతుంది నీ నేస్తం
నీకు నచ్చినా నచ్చకున్నా
ఇదే భయంకర చేదునిజం

కనీసం ఇప్పుడైనా కళ్ళుతెరవవా మరి 
  ప్రేమా వద్దు నీ మనసూ వద్దు 
ఈ రెంటినీ వదిలిచూడు ఒకసారి
నేనన్నది నిజమేనని అంటావప్పుడు
ఎన్నడూ వినని నాదం వింటావప్పుడు
ఆసుపత్రులలో హోరున టెస్టులు
నడిరోడ్డున దిక్కు లేని సోదర శవాలు
మనకి కూడా అన్టుకుందేమో అన్న భయాలు
ప్రేత గుండెల శ్రోతల జీవితాలు యింక చాలు 
నాతొ కలిసి చస్తావా మనిద్దరికీ మేలు .
(ఆలోచనా తరంగాల శర్మ గారికి క్షమాప్పనలతో ) 

5 ఫిబ్ర, 2012

తియ్యని యిబ్బంది ?

 
 
 
 వొక రచయితకి       రొటీన్ కి భిన్నం గా ఏదన్నా రాద్దామనుకుంటే అక్షరం ముందుకు వెళ్ళదు  .అదే మనసులో ఏదో ప్రేమ భావమో , బాధో కలిగితే అక్షరాలూ వెల్లువలా పొంగుతుంటాయి . . అంటే ప్రేరణ కలిగించేది మనసులో అంతర్లీనం గా వున్న అలజడే గాని రాసేద్దమన్న తపన యెంత మాత్రం కాదు .ప్రియురాలు ప్రేమ కురిపిస్తూ వుంటే  వేరే వ్యాపకాల అవసరం పడదు . అదే ఆమె త్రునికరిస్తే  ఆ బాధ  అక్షర రూపం లో వేద జల్లడానికి యిదొక వేది క .. బహుశా గొప్ప వాళ్ళ గొప్ప రచనల వెనక వున్న రహస్యం యిదే నేమో ?రిజేకషన్  తట్టుకోలేని సున్నిత స్వభావులకి  యిదొక అవుట్ లేట్ . రచయితలూ ఎప్పుడు వాస్తవం లో జివిన్చకుండా ఊహల్లో విహరిస్తూ వుంటారు . తమ వుహలకి దగ్గర గా ఎవరన్న తారస పడితే తమ కలల రాజ కుమారి గా వుహించేసుకుని , వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెంచేసుకుంటారు , కొన్నాలకి కలల రాజకుమారి వేరే కళలు కంట బడి నా గాని మొదట్లో నొచ్చుకున్నా వాళ్ళని వదులు కోలేని దౌర్భాగ్య స్తితి లోకి నెట్ట బడి , తన కలలు చంపుకుని ఆమె కళలకి తన సహకారం అందిస్తూ ఆమె సుఖమే తన సుఖం అనుకుంటూ  ముసుగు వేసుకుని వొక  ఫేసిలి టేతర్ (బ్రోకర్ అన్న పదం ప్రేమికుడికి బావుండ దని) గా మిగిలి పోతాడు .ప్రియురాలు కూడా యితనితో తెగ తెంపులు  చేసుకోదు .  ఆమెకి కూడా ఎక్కడో వొక మూల  ప్రేమ ఉండొచ్చు లేదా జాలి ఉండొచ్చు లేదా లాంగ్ టర్మ్ ఫిస్కల్  పొలసి  కావచ్చు .యిదొక విష వలయం  శ్లేష్మం లో పడ్డ ఈగ లాగ బయట పడటం కష్టమే సుమా .ఉమర్ ఖయ్యం టైం లో బ్లాగులు  లేక బార్ కి వెళ్లి  ఉంటాడు .యిది అదే నేమో తెలీడం లేదే  తెలుసు నో లేదో తెలీడం లేదే  అలా నాదని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో  అని పాడుకుని సరి పెట్టుకొవాలో లేదో యిదో తియ్యని  యిబ్బందని వురుకోవాలో ?

31 జన, 2012

చాలు చెలి

        
నిశ్చలం గా సాగుతున్న నా జీవితం లోకి 
నిశబ్దం లా వచ్చావ్   ప్రేమ పెంచుకుని  
లత లాగ అల్లుకు పోతుంటే గుండె కోత కి గురిచేస్తూ
మరిన్ని పాదులని దరి చేర్చావు   
వొకటే కదా అనుకుని సర్దుకు పోతుంటే నీ చపల బుద్ది తో  
మరిన్ని పెంచేసావు .నాలోని ప్రేమని తున్చేసావు 
నేను పోదలలలో వొక పాదు గా వుండడం యిష్టం లేక  
అల్లుకోడంఆపేస్తాను .నన్ను కోల్పోయావన్న విషయం గ్రహించాకుండానే 
వాడి పోయి వీడి పోతాను .యిక్కడి తో ఆగి పోతాను .
నీ జ్ఞాపకాల పొరలలో గుర్తుకొచ్చి చూసుకుంటే 
నీకు మిగిలేవి అలనాటి మన మదుర స్మృతులే 
అయినా అది మరిపించ డానికి  , నిన్ను మురిపించడానికి 
నీ కెప్పుడు సిద్దం నీ కొత్త స్నేహితులు .
మార్పు నీ జీవితం లో వొక కూర్పు  
అది చూస్తూ కూడా ప్రేమించ డానికి లేదు నాకు వోర్పు
అనుక్షణం ప్రమోదాల కోసం ప్రమాదాల అంచున పయనించడం 
నీకే సాద్యం .
ప్రమాదాల మద్య ప్రమోదం వెత్తుకోవడం నా కసాద్యం .. 
నువ్వొక నిరంతర సుఖాన్వేషి 
నేనొక ప్రేమ పిపాసి 
రెండు సమాంతరాలు 
నా పయనం నీతో యింక చాలు 
యింకో కొమ్మ మీద వాలు  
వేరే వాళ్లతో యధా విధి గా నీ ఆనందం గ్రోలు ..


24 జన, 2012

మళ్ళి మొదలయ్యింది

 
  మొన్న వొక మిత్రుడు ఫోన్ చేసి నువ్వు రాసే కధ లోని పాత్రలన్నీ నా నిజ జీవితం లోకి నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి .నువ్వు రాసినట్టే నా జీవితం లోకివొక రాధ వచ్చి వలపులు పంచి లతలాగా అల్లుకు పోతూ వుంటే యింకో రాజు రావడం తో నా పాదుకు నీళ్ళు పొయ్యడం మానేసింది . మళ్ళి నా లతలు చిగురించి నా పాదు అల్లుకునేలా మంచి ముగింపు నివ్వు నీ కధకి ప్లీజ్ అంటూ అభ్యర్ధించాడు .
        నాకు నమ్మ బుద్ది కాలేదు.చినప్పుడేప్పుడో చూసిన కల్పన  సినిమా లో అనుకుంటా అల్లు రామలింగయ్య కధలు రాసుకుంటుంటే అతని ముందు పాత్రలు ప్రత్యక్షమయ్యి అతని తో వాదనకి దిగుతుంటాయి . అలాగా నేనేదో ఊహించి కధ రాస్తే అచ్చు అలాగే వేరే వూళ్ళో వున్న స్నేహితుడికి అవడం ఆశ్చర్యం అయినా అతని తృప్తి కోసం అలా ముగిసింది కధ కి ముగింపు గా మళ్ళి మొదలయ్యింది రాస్తున్నా . మరి యిది రాసాక వాళ్ళిద్దరి మద్యసయోధ్య కుదిరి  మోడు చిగురిస్తే మంచిదే .
       సుధ నెంబర్ తీసేసాక కష్టం మీద రెండు రోజులు గడిపా . దానికే నాకు రెండేళ్ళు అయినట్టు గా  అనిపించింది .తను ఈ రెండు రోజుల్లో ఎప్పు డన్నా ఫోన్ చెయ్యక పోతుందా అని ఆశిస్తూ ప్రతి అడ్డమైన అపరిచిత నంబర్ల ఫోన్లు ఎత్తే వాణ్ణి .వొక అమ్మాయి గొంతు సుధ లాగే వుంది .
ఏమండీ మీతో నేను రెండు నిమిషాలు మాట్లాడొచ్చా ?అడుగుతోంది .
రెండేళ్ళు మాట్లాడుకున్నాం యింకో రెండు నిమిషాలే గా కానీయ్యండి అన్నా 
మీకు ఎప్పుడన్నా అర్జెంటు గా డబ్బులు అవసరం పడి  చేతిలో డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు ?
మీ దగ్గరే తీసుకుంటా. రుణాను బందం తో మీరే పత్ని గా వస్తారని ,
క్షమించండి సార్ నేను ఐ సి ఐ సి ఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా మీకేమన్నా లోఅన్ కావాలేమో అని  ఫోన్ చేశా అంది .నేను ఐ సి అని ఫోన్ పెట్టేసా . ఈ అమ్మాయి పిచ్చి లో పడి ఎవరు ఫోన్ చేసినాఆమె నేమో అని పిస్తోంది . అయినా నా పిచ్చి గాని కొత్త అనుభందాల గుభాలిమ్పుల్ని ఆస్వాదించే ఈ సమయం లో మోడు వారిన పందిరి ఎందుకు గుర్తుకు వస్తుంది .తీగకు పందిరి కావలె గాని తెలుసా నువ్వే పందిరని ?
కార్ యింటి వైపు సాగుతోంది , యిది వరకు రోజుల్లో వాళ్ళింటి వైపు సాగేది .
చీకటి లో కారు చీకటి లో కాలమనే పడవలో లోకమనే యేరు లో ఏ దరికో ? ఏ భువికో ?
యింతలో సెల్ మోగడం తోతీసా .వొక్క సారి వెయ్యి తంత్రువులు మోగినట్టు గా
ఏంటి బంగారం ?మర్చి పోయావా ?ఏంటి రెండు రోజులనుంచి ఫోన్ లేదు ?ఊర్లో లేవా ?
ఏ గొంతు కోసం నేను పరితపించానో,ఏ గొంతు వేరే వాళ్ళకి కూడా స్పందిస్తోందని బాధ పడి వదిలేసుకున్దామని నిర్ణయించు కున్నానో , ఏ గొంతు స్వరం తో రెండేళ్ళు గా గంటలు గంటలు శృతి కల్పిశృతి తప్పానో అదే గొంతు నాకు నిదట్లో కూడా జోల పాడె గొంతు యిక శాశ్వతం గా నాకు మూగ బోయిన్దనుకున్నా ఆ గొంతు పలకరించిన ఆనందం లో నా గొంతు మూగ బోయింది .కళ్ళలో ఆనందా శ్రువులు , మాట రాని మౌనం .
 ఎంట్రా కోపం వచ్చిందా ?ఏంటోరా  అందర్నీ ప్రేమించే తత్త్వం నాది . ఎవర్ని నొప్పించ లేను , వొక్క సారి రాకూడదా కాఫీ తాగి వెళొచ్చు చూసి  కూడా ఎన్నో ఏళ్ళు  అయినట్టు వుంది తన ధోరణి లో తను చెప్పుకుంటూ పోతోంది .
నాలో ఈ రెండు రోజులనుంచి దాచుకున్న దుక్కం వెల్లువలా పెల్లుబికి వస్తుంటే ఆపు కోవడం కష్టం అయ్యి పైకే ఏడ్చేసా .ఆడ కైనా మగ కైనా ఔట్లెట్ కన్నీరే అయినప్పుడు ఆపుకోవడం దేనికి ?
ఏంటి బంగారం అంత సెన్సిటివ్  ?టెక్  ఇట్ ఈజీ రా యింట్లో మాట్లాడుకుందాం ఎదురు చూస్తూ ఉంటా సరేనా ?అంటుంటే ఉ అండం తప్ప యింకేమి అనలేక పోయా .తన మీద వున్న కోపం అంతా ప్రేమ పూర్వకం గా ఆమె పలకరించే టప్పటికి గాలికి యెగిరి పోయింది .
వాళ్ళింటికి వెళ్ళే టప్పటికి తను పిల్లలు వున్నారు . వాళ్ళు బెడ్రూం లో హోమేవోర్క్ చేసుకుంటుంటే మేము డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చుని కాఫీ  తాగుతూ వుంటే మునిపటి లాగ  కళ్ళలోకి చూస్తూ అడిగింది . ఈ రెండు రోజులు మాట్లాడకుండా ఎలా వున్నావు ?
     ఏముంది సుధా టైం దొరికితే నీతో మాట్లాడడం, లేకపోతె నీ గురించే మాట్లాడం  ఈ వలయం నుంచి నే బయట పడలేక పోతున్నా ,నీ నంబర్ డిలిట్ చేసేసా కాబట్టి  నా స్నేహితుడి తో నీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ గడిపేసా వాడు విసుకున్నా సరే .
   యింతలా అనుక్షణం  నా గురించి ఆలోచించే వ్యక్తీ నా జీవితం లో ప్రవేశించడం నా అదృష్టం  తన స్పందన యింకా పూర్తీ కానే లేదు తన సెల్ మోగింది .. హా రమేష్ తను వచ్చారు యిద్దరం మాట్లాడుకుంటున్నాం మన మద్య జరిగిన వన్ని చెప్పెసానులే .ఆ అన్నీను తను వత్తి పలుకుతోంది .
    యిదివరకులా నాకు కోపం రావటం లేదు .బాధే సౌక్యమనే  భావన రానిస్తున్ననేమో ? తను నిజం చెప్పేసింది కాబట్టి మోసం చెయ్యటం లేదన్న భావమో ?తను తప్పు చేశా అన్న నిజం చెప్పేస్తే ఆ తప్పు నా లెక్క లో తప్పు కాదేమో ?ఏమో ఆ భావం మొత్తానికి తను ఆ రమేష్ తో నా ముందే  మాట్లాడుతున్నా నేను ఆమె మోములో ఆనందాన్నే గ్రోలుతున్నా  గాని యిది వరకులా నా లో రాక్షసుడు విజ్రుభించటం లేదు . తను కూడా నా మొహం లో ప్రసాంతత ని చూసి  యిరవై నిమిషాలకే వుంటాను రా మళ్లీ మాట్లాడుతా అంటూ సెల్ పెట్టేసి నా కేసి తిరిగి అబ్బో గొప్ప మార్పే మీలో అంటూ మెచ్చు కోలు గా చూస్తోంది .అయినా యింత దూరం  వచ్చే సాక మారక చస్తామా ?ఇప్పుడున్న వాళ్ళు తప్ప మరింక కొత్త వాళ్ళు ఎడ్ అవకుండా దేవుణ్ణి ప్రార్ధించడం తప్ప .మన మనసులోనే బాధ వుంటుంది  చూసే కోణం మార్చుకునప్పుడు  ఆ బాధ అదే పోతుంది .యింతకు ముందు నే వచ్చినప్పుడు రమేష్ తో సెల్ మాట్లాడితే మనసు సహించేది కాదు దాంతో కోపం , బాధ ఉక్రోషం అన్ని కలిగేవి .యిప్పుడు నేను చూసే కోణం మార్చుకుని ఆమె మాట్లాడుతుంటే నేను కుడా లాక్కుని మాట్లాడడం తో నాలో వ్యతిరేక భావం పోయింది .మళ్లీ ఎప్పటిలాగే ఆమె నవ్వుతు మాట్లాడుతోంది .నేనుకూడా ఆమె నుంచి ఏమి ఆశించటం లేదు కాబట్టి మళ్లీ మామూలు పరిస్తితులు మొదలయ్యి మళ్లీ మా యిద్దరి మద్య  అలా మొదలయ్యింది .
        మాటల మద్యలో తను చెప్పింది రమేష్ నేలాఖరకి ఇక్కడకి వచ్చి తన పని అయ్యేదాకా వుండి అప్పుడు పోతాడని . మళ్లీ నా మనసులో అలజడి . ముందుంది నాకు అగ్ని పరీక్ష అప్పుడు కూడా యిలాగే నవ్వుతూ వాళ్ళిద్దర్నీయింట్లో వదిలేసి వీడ్కోలు పలక గలనా ? అంత ఎత్తుకు ఎదిగానా ? లేక తను నాతొ స్నేహం కంటిన్యూ చెయ్యడానికి నే వేసుకున్న ముసుగా?కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి .

8 జన, 2012

అలా ముగిసింది ?

                  
 
                     రోజులో కొంత సమయాన్ని సుధ తో సరదాగా సెల్లు కబుర్లు చెప్పుకుంటూ కొత్త ఉత్సాహం పొంది రోజంతా తాజా గా వుండడం అలవాటయ్యి పోయి , గత నాలుగు రోజులు గా తనతో మాట్లాడక మనసంతా గజి బిజీ గా తయారయ్యి  యింక ఉండ బట్ట లేక   మార్నింగ్ వాక్ కి వెళుతూ వాళ్ళింటికి వెళ్లి తనని వొకసారి చూసి పోదామని తలుపు కొట్టా. ,అప్పటికే ఎనిమిది దాటింది .నిద్ర మత్తులో లేచి తలుపు తీసింది .తను ఏదో అనే లోపే నేనే సారీ అండి మీ తాజా  కొత్త మిత్రుడు యిపాటికే మిమ్మల్ని సెల్ చేసి నిద్ర లేపి వుంటాదనుకుని వచ్హా అన్నా .అన్నానో లేదో ఆమె సెల్ మోగడం ఆమె దాన్ని చెవిలో పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళడం వొకే సారి జరిగి పోయాయి .వాళ్ళ హబ్బి యింక బెడ్ రూం లో పడుకునే వున్నాడు .నేనే అక్కడ సోఫాలో కూలబడి ఆమె యెంత ఆనందం గా ఆ ఫోన్ లో మాట్లాడుతుందో గమనిస్తున్నా .యింతకు ముందైతే వంటింటి దాక వెళ్లి ఆమె కాఫీ పెడుతుంటే మాట్లాడుకోవడం రివాజ్.యిప్పుడు కనీసం కూర్చొన్డని    కూడా అనకుండా గజేంద్ర మోక్షం లో శ్రీహరి లా సిరికిన్చేప్పాడు టైపు లో వెళ్లి పోయింది .మాటల బట్టి కొత్త వలస కొత్త స్నేహితుడని అర్ధం అవుతోంది . ఆయనా గాని కన్ఫం చేసుకోవడానికి అతని సెల్ కి కొట్టా యధా విధి గా ''మీరు కాల్ చేస్తున్న కస్టమర్ మీ మాజీ కస్టమర్ తో బిజీ గా వున్నారు '' అని అనిపించింది .యిరవై  నిముషాలు అయినా ఆమె వంటింట్లో సొల్లు కబుర్లే గాని బయటకు రావడం లేదు .వాళ్ళ  ఆయన గురక పెట్టి మరి నిద్ర పోతున్నాడు .అదృష్ట వంతుడు నిద్ర లేని నిసి  రాత్రులు నాకు  బారెడు పొద్దెక్కినా గురక పెట్టె పట్ట పగళ్ళు శ్రీవారికి . కొన్ని జాతకాలు  అంతే.
''అదేంటి రా యింకా చూపించు కాలేదా ?ఈ రోజే వెళ్లి చూపించు కో అసలే ఈ మద్య కళ్ళు  తిరుగు తున్నాయి అంటున్నావ్ ?''(అండి నుంచి రా కి ఎదిగి పోయేంత దగ్గర అయ్యారని ఆమె మాటలలో అర్ధం అవుతోంది,ఎవరి రోగం ఎవరికి అంటూ కుందో ఖర్మ )ఆమె మాటలే విని పిస్తున్నాయి
''జర్నీ సినిమా బావుందా ?అయితే ఈ రోజే మా ఆయనని తీసికెళ్ళమని చెపుతా  నువ్వు చూసింది ప్రతిది నేను చూడవలసిందే . ఎంతైనా మనిద్దరం కడ దాక జర్నీ చెయ్యవలసిన వాళ్ళం కదా ?''అంటూ విరగ బడి నవ్వుతోంది. (యింతకీ కడ దేర్స్తున్నది ఎవరు ?)ఆమె కిటికీ కి ఆనుకుని అలా సెల్ లో మాట్లాడు తోందే గాని నా ఉనికిని అస్సలు పట్టించు కోవడం లేదు . కనీసం కాఫీ పెట్టడానికి పొయ్యి కూడా వెలిగించడం లేదు .
ఇలాంటి త్రునికరణ భావం నేనెపుడు చూడ లేదు వెళ్ళిన అయిదు నిమిషాల్లోనే వేడి వేడి కాఫీ తో యిద్దరికీ తీసుకొచ్చి డైనింగ్టేబుల్ దగ్గర కళ్ళలో కళ్ళు బెట్టి మరి మాట్లాడేది .దూరం పెరిగిందనుకున్నా  గాని అక్కడ
ఆఘాదమే   వుందని అప్పుడే తెలిసింది .ఈ అవమానం భరించడం నా వల్ల కాలేదు . సోఫా లోంచి లేచి గుమ్మం వైపు రావడం ఆమె చూస్తూనే వుంది . తలుపు తీసుకుని లిఫ్ట్ నొక్కడం కూడా ఆమె కి కనిపిస్తోంది . కాని అవెం పట్టనట్టు తన కబుర్లలో పడి పోయి కనీసం నన్ను ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదు . ఆమె నవ్వు నన్ను పోరా అని ఎక్కిరించి నట్టు అయ్యింది .నీకు అవతలి వ్యక్తీ అంత యిష్టం అయినంత మాత్రాన యింటికొచ్చిన  నీ నిన్నటి వ్యక్తీ ని అంత గా గాయ పరచాలా ?నీ జర్నీ లో నేనుకూడా కొంత కాలం తోడూ గా వచ్చాను గా ?ఏమన్నా గాని ఈ మానసిక వ్యధ భరించడం కష్టం అయిపోతోంది .భగవంతుడే ఏదన్నా పరిష్కారం చూపిస్తే బావుండును .స్నానం చేసి పూజ లో కూర్చున్నా .అష్తోత్రాలు  సహస్రాలు అయిపోయాయి . కళ్ళు మూసుకుని అలా చాలా సేపు కూర్చున్నా .నా సమస్యకి వొక పరిష్కారం గోచరించింది .వెంటనే లేచిమేమిద్దరం ఆదివారపు సాయంత్రాలు వెళ్ళే గుడి కి వెళ్లి యిద్దరం కలిసి చదివే అన్నపూర్ణా స్టకం , లింగాష్టకం చదువుకుని  దర్సనం అయ్యాక గుళ్ళో కూర్చుని ''గుడ్ బై   ఫర్ ఎవెర్'' అని మెస్సేజ్ తన నెంబర్ కి పంపి  సెల్ తీసుకుని సుధ నంబర్, వాళ్ల ఆయన నెంబర్ డిలీట్ చేసేసా .ఎప్పుడు పేరు చూసి డైల్ చెయ్యడమే గాని నంబర్ గుర్తు పెట్టుకునే అలవాటు ఎప్పుడో పోయింది . నాకేమో అపరిచితుల నంబర్ నుంచి వచ్చే కాల్స్ అటెండ్ అయ్యే అలవాటు లేదు . అసలు యిప్పటి ఆమె మానసిక స్తితిలో ఆమెంతట ఆమె నాకు ఫోన్ చేసే అవకాశమే లేదు . వుండి వుంటే ఫోన్ చేసి కనీసం అలా వెళ్లి పోయారెంటి ? అని అన్నా అడిగి వుండేది . నేనే ఎప్పుడన్నా మనసు వుండ బట్టలేకఈ నాలుగు రోజుల్లో  ఆమె కి చేస్తే  అప్పుడు కూడా ఎంగేజే  అది విని మనసు బాధ పడటం   . సో యిప్పుడు ఆ పరిస్తితి లేదు కాబట్టి నా గ్రహస్తితి ఏమన్నా మారి మళ్లీ ఎప్పటి లాగ నేను  హ్యాపీ గా హాయ్ గా జోకులు వేస్తూ నా దైనందిన జీవితం గడుపు తానని నా ఆశ .యింటి  కొచ్చి గార్డెన్ లో మొక్కలకి నీళ్ళు  పోస్తున్నా . బయట మందార పూలు విచ్చు కోవడానికి సిద్దం గా వుండి అందం గా రేకలు ఊపు తున్నాయి  . కనకాంబరాలు  గాలికి తలలు ఊపుతూ నా నిర్ణయాన్ని సమర్దిస్తునట్టు గా అనిపించింది . రోజు పోస్తున్నానిన్నిలా లేదే మొన్నిలా లేదే అనిపించింది . అవును మరి ఎలా వుంటుంది ఆ టైం లో కూడా సెల్ లో ఆమె తో సొల్లు కొడుతూ ఈ ప్రక్రుతి అందాలూ పట్టించుకుంటే గా ?
                               ''రమేష్ గాన్ని వదిలేసావెంట్రా ? ''
సాయిబాబా బండి  తోసుకుంటూ అదే టైం లో వచ్చి బిక్షాటన చేసే భార్య భర్త  వాళ్ల పిల్లాడి తో అంటున్నారు .
అవును సుధది  వాళ్ల ఆయనది తీసేసా  గాని ఆ రమేష్ దే తియ్య లేదు గా ? రేపు టెంప్ట్ అయ్యి వాడి నంబర్ కి కొట్టి అదిఎంగాజ్ లో వుంటే మళ్లీ ఈ వేదన మొదలేగా . వెంటనే భగవంతుడి కి ధన్య వాదాలు చెప్పి అది కూడా తీసేసా .నంబర్లు అయితే తీసేసా, మనసులోంచి తీసేయ్య గలనా ?అలా ముగుస్తుందా మళ్లీ అలా మొదలవుతుందా ?కాలమే నిర్ణయించాలి .(అంతులేని కధ )
(మళ్లీ తొక్క లాగ ఆఖర్న కధ అని ముక్తాయింపు వొకటి అనుకుంటే నేనేం చెయ్యలేను  )