30 డిసెం, 2012

మిధునం వొక మేధోమధనం




మిధునం యిప్పుడే సెకండ్ షో చూసి రాస్తున్నా .
అతికష్టం మీద స్కూల్ లో చదువుతున్న మా అబ్బాయిని వొప్పించి
భార్య భార్తలం యిరువురం ఈ సినిమాకి వెళ్ళాం .సినిమా అయిపోయి వస్తుంటే
మా శ్రీమతి సినిమా హాల్ నుంచి యింటికి కార్ డ్రైవ్ చేస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది ,
చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకుని .అచ్చు అలాగే ముచ్చ టించు కునేవారు అని .
అది చూసి మా అబ్బాయి కుడా మమ్మీ యింత మంచి సినిమాకి నిన్ను వెళ్ళకుండా చేసి వుంటే చాల బాధ పడే వాణ్ణి అన్నాడు .
దానికి ప్రతిగా ఆమె ఈ సినిమాని మా ఆఫీసు లో అందర్నీ చూడ మంటా అంటూ కళ్ళు తుడుచుకుంది .
ఇద్దరే పాత్రలతో సినిమాని ఎక్కడా బోర్ కొట్ట కుండా తీయడం పెద్ద సాహసమే .నాకు తెలిసి మాతృదేవోభవ తర్వాత కళ్ళు చేమర్చింప చేసిన సినిమా యిదే .
తల్లిదండ్రులను ప్రేమించే ప్రతి వ్యక్తీ వాళ్లతో కలిసి చూడవలసిన సినిమా .తనికెళ్ళ భరణి జన్మ ధన్యః .
మరచిపోయిన ఆకాశవాణి అలనాటి ప్రారంభ సంగీతం , బాలానందం పాట , పాలు చేలు మ్యూజిక్ ,వార్తః సృయంతం అంటూ సంస్కృత వార్తలు చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి .
అయితే బాలుగారు ప్రారంభంలో కొంచెం మోతాదుకి మించిన నటన ప్రదర్శించినా తర్వాత సద్దుకుని పాత్రలో ఇమిడి పోయారు .లక్ష్మి కాక యింకేవర్ని ఆ పాత్రలో వుహించుకోలేము .భరణి గారికి హృదయపూర్వక అభినందనలు.

16 డిసెం, 2012

ముగిసిన భంధం

    


    ఆమె కి నాకు మద్య ఇదివరకటి ప్రేమ భావం లేదు .నే ను   యింట్లో అడుగు పెట్టినప్పుడు   కళ్ళలోఇదివరకటి  మెరుపు యిప్పుడు కాన రావడం లేదు .భర్త ఉనికిని మర్చి పోయి కూడా  ఎదురు వచ్చి రండి రండి అంటూ ఆహ్వానించిన అలనాటి రోజులనుంచి ,బెల్ కొట్టిన పదినిమిశాలకి కూడా వంటింటిలోంచి వచ్చి గడియ తీయని నేటి రోజులకి యెంత మార్పు .దానికి నా  నోటినే నిందించు కోవాలేమో?ప్రేమ చిగురు తొడిగి న కొత్తల్లో అంతా అద్బుతం గా తను వొక దేవత లాగకని పిస్తుంది .మొగ్గలు తొడిగి ముగ్గులోకి దిగే వరకు బానే వుంటుంది .ఆ తర్వాతే అసలు కధ మొదలవుతుంది .తనలో యిదివరకు కనిపించని లోపాలు కనబడతాయి .వాళ్ళింటికి ఏ అతిధులు వచ్చినా  నాకు  అనుమానమే .నవ్వుతు మాట్లాడుతూ చొరవ చూపిస్తే నా లో అసహనం .ఆ అసహనం మనసులో ఉంచుకుని వుంటే పరిస్తితి యింతవరకు వచ్చేది కాదేమో?వెంటనే వున్నవి లేనివి ఊహించుకుని ఆమె ని మానసికం గా వేధించడం తోనా  మీద విసుగు మొదలయ్యి అది అసహ్యం గా పరిమాణం చెందింది .కుర్చుని వేడి కాఫీ తో ముచ్చటించుకున్నా ఉదయాలు నేడు ఎదురు పడిన రెండు నిమిషాలకే భయంకరమైన వాగ్యుద్దలకి దారి తీస్తుంటే యింక మంచినీళ్ల కే దిక్కు లేదుకాఫీ లు ఎక్కడ . పోనీ అలాగని వెళ్ళడం మానేయొచ్చు  గా మనసు ప్రశ్న .ఏమో ఏదో వొక ఉదయం శుభోదయం అయ్యి ఇదివరకటి రోజులు రావా అని చిన్ని ఆశ .విరిగిన మనసు ని అతికే పరికరాలు లేనప్పుడు విధి బలీయం అని తప్పుకున్నా ఆమె మధుర జ్ఞాపకాలతో గడిపేసి వుండే వాడినేమో? .
ఎప్పటి లాగే మనసు వద్దని చెబుతున్నా కాళ్ళు  ఆటే లాగడం తో వాళ్ళింటికి వెళ్ళాను. .వచ్చిన అతిధి తో ఆమె నవ్వుతు మాట్లాడుతూ కాఫీ తాగుతూ మాట్లాడు తోంది .అతిధి కాఫీ తా గడం కంటే ఆమె అందాల్ని కళ్ళతో జుర్రుతూ చాలా  సన్నిహితం గా కూర్చున్నాడు .,మొదట్లో నేను  కుర్చునట్టు .ఏదైతే  నేను  చూసి  తట్టుకోలేనో  అదే సన్నివేశం యిప్పుడు  నా  ఉనికిని గుర్తిస్తూ అతిధి కొంచెం జరిగాడు గాని ఆమెలో యింత కుడా మార్పులేదు , పై పెచ్చు యిలా ఆస్వాదిస్తూ కాఫీ తాగి ఎనాల్లయ్యిందో  అంటోంది అతిధితో . గుండెల్లో బాధ తన్నుకోస్తున్నా అదిమి పెట్టి కొంచెం గ్రిల్ తలుపు తీస్తారా  ?అన్నాను . . ముభావం గానే తలుపు తీసి కాఫీ  తేవడానికి వంటిట్లోకి వెళ్ళింది .అతిధి మొహం లో విజయ గర్వం తను యింతకు ముందు వచ్చినప్పుడు ఆ సాన్నిహిత్యం లో నే ను  వుండేవాన్ని  యిప్పుడు ఆ స్థానాన్ని  అతిధి ఆక్రమించాడు . రేపెవరో అనుకుంటుంటే ఆమె వచ్చి కాఫీ  బల్ల మీద పెట్టింది . మనసు చివుక్కు మంది యిది వరకు వేళ్ళతో పలకరిస్తూ స్పర్శించిన ఆ కప్ యెంత దూరం అయిపొయింది ?మళ్ళి అతిధి ,ఆమె తమ కబుర్లలో ములిగి పోయారు నా   ఉనికిని ప్రశ్నిస్తూ .
కొత్తవాళ్ళు తప్ప  పాతవాళ్లు మీకు యిష్టం ఉండరనుకుంటానా  ప్రశ్నకి ఆమె లో ఆవేశం కట్టలు తెంచుకుంది .అవును కొత్తొక వింత పాత వొక రోత  మీరు కుడా యింకో కొత్తవాళ్ళని చూసుకుని మమ్మల్ని వదిలి పొండి  అంటూ రెండు చేతులు జోడించింది .
అలా పోలేకే కదా మీచూరు  పట్టుకుని వెళ్ళాడు తున్నా. గుండెల్లో తిష్ట వేసావు ,యెంత తిట్టినా వదలలేక పోతున్నా .
అది ప్రేమ కాదు నీ వ్యామోహం , అది తీరిన రోజు నీలో ఈ ఆవేశం వుండదు తీ రనప్పుడే నీలో ఈ ఆక్రోశం ఆమె సమాధానం .
మరి తీర్చేయ్యి పోతా అన్నానో  లేదో ఆమె చెయ్యి నా  చెంప మీద దాక వచ్చి ఆగి పోయింది .అతిధి ముందు చాల అవమానం గా అనిపించింది . యిద్దరం వునప్పుడు యింత కన్నా ఘోరం గా తిట్టుకున్నా రోజులు వున్నాయి . అలాంటిది అతిధి వున్నాడనే  ఆమెలో ఈ ఆవేశం .యింతలో అతిధి కల్పించుకుని సార్ మమ్మల్ని వొక అరగంట వొంటరి  గా వదిలెయ్యండి   చాలా  మాట్లాడు కోవాలి  అన్నాడు .ఆమె అతిధి ని వారిస్తుందేమో  అనుకుంటే లోపలి కి వెళ్ళిపోయింది.  నా లో ఆవేశం కట్టలు తెంచుకుంది .యిక్కడ వున్నవాళ్ళు చాలదా ?లోపల యింకెవరు ఉన్నారే లం .. అంటూ అరిచాను .
 .అవునురా నువ్వు పరిచయం అయిన దగ్గరనుంచి నా బతుకు అదే అయ్యింది రా ఎవరు వచ్చినా   అలాగే  అంటున్నారు అంటూ ఏడ్చుకుంటూ  గా బాల్కని లోకి పరిగెత్తి వొక్క ఉదుటున దుకేసింది .అతిధి బాల్కనీ కిందకి చూస్తూనే రక్తం మడుగులో వున్న  ఆమెని చూస్తూనే అమ్మో హత్య హత్య అంటూ అరుస్తున్నాడు .నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది .ఆమె ఆత్మహత్య చేసుకుంటే దాన్ని హత్య గా చిత్రికరిస్తున్నాడు అతిధి .మొత్తం ఫ్లాట్ లో వున్నా జనం అంతా  కింద పోగయ్యారు .ఎవరో పోలీసులకి ఫోన్ చెయ్యండి అంటున్నారు . అతిధి నే నే  ఆమెని కిందకి తోసేసి చంపేసినట్టు ప్రొజెక్ట్   చేస్తున్నాడు .యింతలో పోలీసులు ఐదో అంతస్తుకి వస్తున్న  అలికిడి వినిపించింది .లేవండి లేవండి అంటూ అరుస్తున్నారు . లేవండి బారెడు పోదేక్కినా యింకా నిద్రేనా వాకింగ్ కి పోరా అంటూ అరుస్తున్నారు . నేను  కళ్ళు తెరచి చుస్తే ఎదురుగా శ్రీమతి కుదుపుతూ నన్ను  నిద్ర లేపుతోంది . అమ్మో యిది కలా ? నిజమై వుంటే తన జీవితం ఎమై  పోయేది ?అసలు ఈ భందాలని అవసరమా ?మొదలో తుదిలో ఎప్పుడో వదిలెయ్య వలసినవే గా ?మద్యలో ఎందుకు ఈ వెతలు ?యిది యిచ్చే సుఖం కంటే దాంతో పాటే వచ్చే కష్టాలే ఎక్కువ .ఎట్  వాట్ కాస్ట్ ?వాట్ ఫర్ ?యివన్ని అవసరమా? ఈ రోజు నుంచి కొత్త ఉదయం స్వాగతం  పలుకు తోంది అనుకుంటూనేను   వాకింగ్ కి బయలు దేరాను  . కళ్ళు తెలీకుండానే ఆమె యింటి వైపు నడిపిస్తున్నాయి . ఆఖరి సారి తనని చూసి వెళ్లి పోదామని వాళ్ళింటికి వెళితే ముందు గదిలో ఆమె భర్త  లాప్టాప్ లో పనిచేసుకుంటూ నవ్వుతు విష్ చేసాడు .అతనికి ఎదురుగా వున కుర్చీలో కుర్చుని తను లేవలేదా అండి  అని అడిగాను . . అదే యిదివరకు నేను   రాగానే భర్త లోపలకి  వెళ్లి మీ ఫ్రెండ్ వచ్చారు లేవవోయ్ అంటూ తన పనిలో నిమగ్నం అయిపోయేవాడు . ఈ రోజు కొత్త గా లేదండి అలిసి పోయింది పడుకుంది అంటే సరే వస్తానండి అని నేను  లేవ  బోతుంటే వొక నిమిషం కూర్చోండి మీతో మాట్లాడాలి అంటూ లాప్టాప్ పక్కన పెట్టి
చూడండి  గత కొన్ని రోజులు గా గమనిస్తున్నా మీరిద్దరూ  యిది వరకులా లేరు మీ కొట్లాటలు తారా స్తాయికి వెళ్లి పోయాయి .అయిన దానికి కాని దానికి కూడా   కసురుకున్తున్నారు . మొదట్లో మీ భందం ఉక్కు  గొలుసులా  గా దృడం గా  వుండేది .అప్పట్లో మీ యిద్దరిది  ఏమి ఆశించని స్నేహమే.  అది ఆ స్తాయి దాటి ముందుకు పోతున్న కొద్ది ఆమె మీద మీ అధిపత్యం పెరిగి ఆమె స్వేచ్ఛని  ని హరించే స్తాయికి వచ్చేసింది .ఎవరు వాళ్ళ స్వేచకి  భంఘం కలిగితే సహించరు . మీ మద్య యిపుడు సన్నటి దారపు భంధం కుడా లేదు . అది ఎప్పుడో తెగి పోయింది . మీరిద్దరూ ఆ ఆరోగ్యకరమైన స్నేహం స్తానంలో వుండి  పోయి వుంటే ఈ పరిస్తితి వచ్చేది కాదు . యిది మరింత ముదిరి మీ రిరువురి జీవితాలు నాశనం కాకుండా ఫుల్ స్టాప్ పెడితే రెండు కుటుంబాలు  బాగు పడతాయి . యింతకంటే చెప్పడానికి ఏమిలేదు అంటూ ముగించాడు . నాకు  ఆ క్షణం లో ఆమె భర్త గీతోపదేశం చేసిన కృష్ణుడి లాగే కనబడ్డాడు . ఎంతటి ఔనత్త్యమ్ .యింకేవరన్న అయివుంటే నానా యాగి చేసి అవమాన కరమైన రీతిలో సాగనంపి వుండే వారు . ఆమె భర్త చేతులు పట్టుకుని నను క్షమించండి ,యింకేప్పుడు మీకు ఇబ్బంది  కలగ  చెయ్యను .నా పరిధులు దాటినా మాట వాస్తవమే .నేను నేటి నుంచి తన గతం లోకి వెళ్లి పోయి మీ భవిస్యత్తు బద్రం గా ఉండేలా చేస్తా అంటూ వేనక్కి తిరిగి పోయా . నా కల , యియన మాటలు నా పరిధుల్ని గుర్తు చేయొచ్చు గాని ఆమె మీద వున్న  ప్రేమని చంప లేవు .తను నిద్ర లేచి నా ఫోన్ యింకా రాలేదేమిటా అని ఎదురు చూస్తూ ఉంటుందేమో? మూగబోయిన కోయిల ఆమె సెల్ అన్న విషయం ఆమె భర్త బహుసా చెప్పాడేమో?లిఫ్ట్ శబ్దం అయి వచ్చిన పద ధ్వనులు నావే అనుకుంటూ ఆమె గుమ్మం వరకు వచ్చి నిరాశ గా సోఫాలో కూల బడో చ్చేమో ?నేను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే వూరు వెళ్లి పోయానన్న చిన్న అబద్దం కొన్నాలకి నా జ్ఞాపకాలని ఆమెలో చేరిపెయ్యచ్చేమో గాని , నిశిరాతిరి నిశబ్దం లో తరంగాలలో వచ్చిన ఆమె పలకరింపులు ,మనస్సునిస్సత్తువ  గా అయినప్పుడు ఆమె యిచ్చిన  హాస్యపు గుళికలు ,మరెన్నో  మనసులో నిక్షిప్తమై పోయే  వెలకట్టలేని లేని మధురానుభూతులు మోసుకుంటూ ఈ బాధని నేను తప్పకుండా అధిగమించా గలను . 

31 అక్టో, 2012

ఆవేశం లో నిజం కక్కేసిన మంచు విష్ణు


  1. దేని ని కైనా రెడీ లో బ్రాహ్మల పై వున్నా అబ్యానతరకర సన్నివేసాలని తీసెయ్యాలని నిరసన వ్యక్తం చెయ్యడానికి మోహన్బాబు యింటికి వెళ్తున్న బ్రహ్మణ సమాక్య కార్యకర్తల్ని గుండాలతో దాడి చేయించిన మంచు విష్ణు , ఆ విజువల్స్ టివి లో చూస్తూ కూడా , పొగరు గా మా యింటి మీదకి వస్తే తాట తీస్తా , యిక్కడ గాజులు తోడిగించుకుని కూర్చోలేదు అంటూ ఆవేశ పడి పోయాడే గాని యిందులో బ్రాహ్మల మనో భావాలకి అభ్యంతరం గా వున్నా సన్ని వేసాలని తొలగిస్తాం , బాధ పెట్టి నందుకు క్షమించండి అనడం పోయి , సినిమా ని సినిమా గా చూసు ఎంజాయ్ చెయ్యాలి గాని అంటూ పిచ్చి పిచ్చి గా మాట్లాడాడు . అంతకు ముందు రోజు ''మొహం'' బాబు విరాళాల కోసం నా దగ్గరికి తిన గా వస్తే యిచ్చే వాడిని కదా ఈ గొడవ దేనికి అంటూ కించ పరిచే వ్యక్యాలే చేసాడు .గాని అరె నిజమే వొక వర్గం మనో భావాలు దెబ్బ తీసే విధం గా చేశామే అన్న పశ్చాతాపమే లేదు . పైగా ఏం పిక్కుంటారో పిక్కోన్డి టైపు లో మాట్లాడాడు .తప్పు చేసినప్పుడు తప్పయ్యిందని వొప్పుకుని దాన్ని సరిదిద్దు కుంటే సరి పోయే దానికి ఆ సినిమాలో బ్రహ్మణ కుర్రాడు మీదకి వస్తే నీ చేత కూడా తన్నులు తినడానికి గాజులు వేసుకు కూర్చో లేదు యిక్కడ అనట్టు గానే వుంది వాళ్ళ ప్రతి క్రియ .థర్డ్ పార్టీ ఎవరు ఆ సినిమా చూసినా ఆ కులం వాళ్ళని కించపరచడం స్పష్టం గా కని పిస్తూనే వుంటుంది .పదిహేన్నెల్ల క్రితం మలయాళం లో వచ్చిన కధనే మక్కి కి మక్కి కాపీ కొట్టి తిసామే గాని యిందులో మేం సొంతం గా జోప్పించింది ఏమి లేదని ఆవేశం లో నిజం కక్కేసాడు మంచు విష్ణు .

    అంటే ఈ గొడవలు జరగా బట్టి తమ సినిమా కాపీ అన్న విషయం బయట పడింది గాని లేకపోతె కదా మాటలు పాటలు ప్రేక్షకులు మోహన్బాబు అండ్ ఫ్యామిలీ అని వేసుకుని వుండే వారు . పైగా తిరపతి వెళితే అక్కడ ప్రధాన అర్చకులు చాల కలం తర్వాత వొక మంచి కుటుంబ కదా చిత్రం చూసామని అస్వీరదించి పంపారట .పాపం రమణ దిక్షితులకి స్వామి వారి సేవకే టైం దొరకటం లేదంటే ఇలాంటి సినిమాలని చూసి మల్లి అస్వీర దించడం వొకటి .

    పైగా సినిమా విడుదలైనా యిన్ని రోజులకి నిరసన వ్యక్తం అంటే దిని వెనక ఎవరున్నారో త్వరలో బయట పెడతా అంటూ వ్యాక్య నించాడు .నేను సినిమా మొదటి రోజే చూసి  అదే రోజు చెప్పా బ్రహ్మల ను కించపరిచేవి గా వున్నాయి సన్నీ వేసాలని .యిప్పటి కైనా వాళ్ళు అహం వీడి  క్షమాప్పన వేడుకుని అబ్యంతర సన్నీ వేషాలు తీసేస్తే పేర్లు , విశ్రాంతి , శుభం అన్నా మిగులు తాయి .

25 అక్టో, 2012

బ్రాహ్మల్ని కించపరచడానికి'' దైనికనా రెడీ''




దైనికైనా రెడీ సినిమాకి కావాలని సెన్సార్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి  క్లియరెన్స్ యివ్వకుండా జాప్యం చేస్తున్నారని నిర్మాత

మోహన్ బాబు గగ్గోలు పెడితే ఏంటో అనుకున్నా గాని ఈ సినిమా చూసాకా ఆవిడ  అబ్యంతరాలు పెట్టడం లో అర్ధం వుందని పించింది . మొత్తం పంతొమ్మిది కట్స్ చెపితే దెబ్బలాడి బలవంతం గా బయటకు తెప్పించుకునట్టు గా వుంది . సినిమాలో ఎక్కువ భాగం బ్రాహ్మల్ని  సంభావన కోసం సొంగ కార్చుకుంటూ దేనికైనా రెడీ అనట్టు గా చూపించారు అదే డైలాగు బ్రహ్మానందం తో కూడా  చెప్పించారు . ఎన్నాళ్ళు  వాళ్ళని తిండి పోతుల్లగా , డబ్బుకు కక్కుర్తి పడే వాళ్ళలా చూపిస్తూ అదే హాస్యం అనుకోమనినవ్వు కొమంటే నవ్వుల పాలు అయ్యేది ఆ నిర్మాతలే . ఈ సినిమాలో కుడా చికెన్ ముక్కని , మటన్ ముక్కని ఆబగా బ్రాహ్మలు తిన్తునట్టు చూపించి వారిని యధా విధి గా అపహాస్యం చేసారు .యిదే విధం గా వేరే యే  కులం వారి మనోభావాలను దెబ్బతీస్తూ చూపిస్తే ఈ పాటికి ఆ సినిమా రీళ్ళని  నడి  రోడ్డుమీద తగల బెట్టి వుండే వారు . మంచితనం , సంస్కారం సబ్యత చేతకాని తనం గా అయిపోయాయి .అదే నిమ్నజాతి  కులాల మీద డైలాగు పక్కన బెట్టి వారి నాయకుల  విగ్రహం చూపించి  ఆ కాలని  వాళ్ళు దొంగలు గా చూపిస్తేనే పెద్ద గొడవ అయ్యింది.  యిందులో  బ్రహ్మాన స్త్రీ గా వేసిన పాత్రతో యింటికి ఎవరు వచ్చినా అచ్చు మా ఆయన లానే వున్నారు అంటూ డబ్బు కోసం వెకిలి గా ప్రవర్తించేలా చూపించి మకిలి హాస్యం గా మలిచారు . ముద్ద పప్పు ఆవకాయ నెయ్యి  వేసుకుని తినేస్తా అని హీరో చేత డైలాగులు చెప్పించారు .బ్రహ్మాన స్త్రీ తో మా ఆయనకి తెలిస్తే నీ గు పగిలి పోద్ది అని చెప్పించి మళ్లీ  బ్రహ్మానందం తో ఏం పగిలి పోద్ది అని రెట్టించి హీరో చేత నీ గుబ పగిలి పోద్దని ఆవిడా గారి ఉద్దేశం అని చెప్పించారు .యిలా చెప్పుకుంటూ పొతే చాలానే వున్నాయి . అదే మళ్లీ  రాజుల కులం లో టివి దర్పం అంటూ ఆ కులాన్ని పొగిడారు .లోకువ గా వున్నా వాళ్ళని చుస్తే మొట్ట బుద్దని , సినిమా ఇండస్ట్రీ లో సగానికి పైగా వుండి వాటి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున బ్రాహ్మాల్ని మళ్లీ  అదే సినిమాల్లో వెకిలి హాస్యం తో అపహాస్యం చేస్తున్నా కిమ్మనే వాడె వుండడు పోనీ లెద్దూ  మన కెందుకు వాళ్ళ పాపాన వాళ్లే  పోతారు  అని సర్దుకు పోయే తనం  తో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ వుండడం తో ఇలాంటి హాస్యం పేరు తో అపహాస్యం చేసే సినిమాలు వస్తూనే వుంటాయి . పోనీ సినిమా ఏమన్నా నా కళా ఖండమా  అంటే డీ , రెడీ ని కలిపి తీసిన కాపీ సినిమా .అక్కడక్కడ బ్రహ్మనందంవల్ల  పేలిన జోకులు తప్ప పనులు మానుకుని చూసే సినిమా మాత్రం కాదు . వొక నెలలో ఎలాగు టివి లో వచ్చేసే సినిమానే .

23 అక్టో, 2012

మారే హృదయం




మారే హృదయం

 యెదలో అభయం

ఏదో విధం అయోమయం

తరచూ దానికి గాయం

అయినా సిద్దం మర్నాడు ఉదయం

తప్పేంటో వోప్పేంటూ   తెలిసేలా లేదేమిటో

గమ్యం కాదని తెలిసినా అటు పయనమేమిటో

పశ్చాతాప్పం  ఆవిరి అయిపోతున్నదేమిటో

తన మాటైనా తను  వొకసారి విన దేమిటో

కొంచెం యిష్టం  కొంచెం కష్టం

చివరికి తనకే నష్టం

హృదయ స్పందన మారిపోతున్నది మాత్రం స్పష్టం

పడలేదంటూనే  పడుతూ వుంటే ఆగంటూ అగంటూ   ఆపేదెలా

యిది జరిగిందేప్పుడో ఎద అడిగిన్దేప్పుడో ?

ఏదో విధం అయోమయం

యెదలో భయం

హృదయం మళ్ళి భారం