12 జులై, 2009

షూటింగ్ విరామం లో యండమూరి తొ


షూటింగ్ విరామం లో యండమూరి పిల్లల్ని puzzeles వేసి చెప్పమనే వారు .అయితే అవి పెద్ద వాళ్ళు కూడా చెప్పగలిగే వాళ్ళు కాదనుకోండి . ఆ సందర్భం లోనే యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల లో తను రాసిన వొక blunder ఏమిటో చెప్పుకొన్దని నన్ను అడిగారు .అదేంటండి అది ఒక కళాఖండం అందులో తప్పు నాకైతే ఏమి కనబడలేదు అన్నా .లేదండి ఆ నవల రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఒక పాఠకుడు ఫోన్ చేసి చెప్పే దాక నేను గమనించలేదు, ఇప్పటికి అది అలా గే వుంచేసా కానీ అది తప్పే అని అదేంటో కూడా చెప్పారు . మన బ్లాగర్లు ఎవరన్నా కని పెడితే చెప్పండి చూద్దాం ఎందుకంటె ఇక్కడ చాల మంది యండమూరి అభిమానులే కాబట్టి , ఇది కూడా చిన్న ఫజల్.చిన్న క్లూ ఏంటంటే అది చెస్ కి సంభందిన్చినదే . యి సందర్భంగా అయన తొ నేను మా అబ్బాయి ,మరో మిత్రుడు నటుడు సాయి మిత్ర తీసుకున్న ఫోటో కూడా మీ కోసం .

1 జులై, 2009

నా సినిమా షూటింగ్ విశేషాలు

వొక ప్రముఖ నిర్మాణ సంస్త మా పిల్లలిద్దర్ని ఏదో ఫంక్షన్ లో చూసి వాళ్ళు తియ్య బోయే సినిమాకి సరిగ్గా సరి పోతారని భావించి మా వెంట పడితే కాదనలేక వోప్పుకోడం జరిగింది .అప్పుడు తెలిసాయి సినిమా కష్టాలు .ముందు గా అగ్రీమెంట్ మీద సంతకాలు ,వోల్వో బస్ లో కొనసీమకి ప్రయాణం , అందమైన గోదారి తీరం లో వున్నా గ్రామం లో APTTDC వాళ్ళ కొత్తగా కట్టిన కాస్ట్లీ హోటల్ లో బస .అంతవరకు బానే వుంది . ఇంక మర్నాడు పొద్దున్నే నాలుగు గంటలకి లేచి ఆరు గంటలకి రెడీ అయ్యి లొకేషన్ కి వెళితే బ్రేక్ ఫాస్ట్ అయ్యాక మేకప్ వేసి షాట్ రెడీ అయ్యేదాకా వోపిక గా అలా కూర్చోవాలి అది గంటలో మొదలవొచ్చు లేదా రోజంతా కూడా వేచి వుండవలసిన స్థితి లో కూడా వుండొచ్చు .lighting arrangements , కెమెరా అంగెల్స్ అన్ని సరి చూసుకుని షాట్ రెడీ అని పిలిచే టైం కి outdoor లో ఎండకి చమటలు కారుతూ మళ్ళి టచ్ అప్ చేసుకుని మీ హవా భావ విన్యాసాలు ప్రకటించాలి .అసలు సినిమా వాళ్ళంటేనే మనకి చెడు అభిప్రాయం అందుకే ముందు వొప్పుకోలేదు కానీ ఇప్పటి తరం లో అంతా చదువుకుని ,decent ఫామిలీస్ నుంచి వచ్చిన డిరెక్టర్లు వొక మంచి విజన్ తో వస్తుండడం తో వోప్పుకోడం జరిగింది .unit అంతా కూడా మంచి వాళ్ళే చాల గౌరవమ్ గా చూసుకున్నారు .మిగతా అర్తిస్త్స్ కూడా చాల వున్నతమైన కుటుంబాలనుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వొక కుటుంబం కలిసి పోయారు .సమస్యంతా కింది సిబ్బంది అంటే మేకప్ మాన్ , లైట్ బాయ్ లాంటి వాళ్ళ తోనే వస్తుంది వాళ్ళ దృష్టిలో సినిమాల్లో వేషాలు వేసే వారంతా approachable అన్న attitude తో కని పిస్తారు . మనం మొదట్లోనే కట్ చేస్తే మన జోలికి రారు లేక పొతే ముప్పే . ఆర్టిస్ట్ లో వొక ఆమెని unit లో వొక వ్యక్తీ మీరు జీన్స్ వేసినప్పుడు బలే అందం గా వున్నారు , మీ సెల్ no ఇస్తారా అని , మీ బాత్రూం వొక సరి వాడుకోవచ్చా అని extralu చేస్తే వెంటనే హైదరాబాద్ పంపేసారు డైరెక్టర్ , ప్రొడ్యూసర్.వాళ్ళ భయాలు వాళ్ళకి వుంటాయి కదా ఎక్కడ అల్లరి అయితే schedules దెబ్బ తింటాయో అని .సో నా అనుభవం లో హాయిగా ఉద్యోగం చేసుకుంటూ వుండడమే బెటర్ , సినిమా సుటింగ్స్ అంటు ఎండనక వాననక అవుట్ డోర్ లో తిరిగే కంటే .ఇంతా కష్ట పడి సినిమా తీస్తే రెండు గంటల్లో దాని భవిష్యత్తు తేల్చేస్తాం మనం .ఇదో పెద్ద గాంబ్లింగ్ .ఇంకో గమత్తైన విషయం ఏంటంటే వొక్క డైరెక్టర్ ప్రొడ్యూసర్ , హీరో కి తప్ప ఇంకెవరికి కధ ఏవిటో తెలీదు , చెప్పరు కూడా . అప్పటి కప్పుడు అర్తిస్త్స్ కి సీన్ వివరించి dialogues ఏమి అనాలో చెప్పి , మానిటర్ లో వొక సారి చూసుకుని ఓకే టేక్ action అని చెప్పడమే తప్ప సినిమా ప్రివ్యూ చూసే దాక దాని కధ కమా మీషు ఇంకెవరి కి తెలిదు . అలాగే లొకేషన్ లో సీన్స్ ఎవరు ఫొటోస్ తీయ కూడదు . వాళ్ళ స్టిల్ photographer మాత్రమే షాట్ లో ఏమి డ్రెస్ లు వాడారో continuity చుసుకుందుకు తీసుకుంటాడు .montage షాట్స్ అంటే బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ వస్తుంటే చూపించే సీన్స్ అన్నమాట .మా పిల్లలు నటిస్తుంటే వాళ్ళకి తోడూ గా వెళ్ళిన నాకు , మిగతా అర్తిస్త్స్ అంతా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు సరదాగా నవిస్తూ మాట్లాడుతుంటే . అయితే డైరెక్టర్ ఎప్పటి నుంచో నన్ను గమనిస్తూ ఫలానా పాత్రకి మిరే బావుంటారు pl అంటు బలవంత పెట్టి మూడు పెద్ద సీన్స్ లో నటింప చెయ్యడం తో నేను కూడా సినిమాల్లో నటించేస అన్న మాట .