24 జులై, 2010

మర్యాద తప్పిన రామన్న

http://movies.bharatfamily.com/movienews/images/movies/1276164346Maryada-Ramanna.jpg

ఇప్పుడే మర్యాద రామన్న చూడడం జరిగింది .రాజమౌళి ఆడియో విడుదల చేసినప్పుడే కధ హింట్ ఇవ్వడం తో ప్రేక్షకులు మానసికం గా హింస లేని రాయలసీమ కధకి సంసిద్దులై రావడం , సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకుల్ని కధనం లో విలీనం చెయ్యడం ,కీరవాణి సంగీతం ,సునీల్ నటన ,తెలుగమ్మాయిలా అందం గా కనిపించే సలోని యి సినిమాని విజయ పంధాలో నడిపిస్తాయనడం లో సందేహం లేదు .కధకి బ్యాక్ డ్రాప్ ఫ్యాక్షన్ అయినా మిగతా సినిమాల్లో లా తోడ కొట్టడాలు , రక్తం చిన్దిన్చాదాలు వుండవు .టూకీగా కధ చెప్పుకోవాలంటే హీరో నాన్న , హీరోయిన్ బాబాయిని చంపితే ఆ బాబాయి కూడా హీరో నాన్నని చంపేస్తాడు .దాంతో సునీల్ ని వాళ్ళ అమ్మ దూరం గా ఎక్కడో హైదరాబాద్ లో చినప్పటి నుంచి అతనికి యి ఫ్యాక్షన్ గొడవలతో సంబంధం లేకుండా పెంచుతుంది .హీరోయిన్ తండ్రి ,అన్నలు మాత్రం ఎప్పటికన్నా శత్రు శేషం ఉంచమని అతన్ని కూడా చంపాలని ఎదురు చూస్తూ వుంటారు .సునీల్ కి ఆస్తి గా వొక డొక్కు సైకిల్ తప్ప ఏమి వుండదు .తల్లి కూడా పోవడం తో బాబాయి పెంచుతాడు .వొక రోజు పోస్ట్ లో అతని తల్లి కి అయిదెకరాల పొలం కోర్ట్ తీర్పు ప్రకారం ఆమె కి ధారాదత్తం అయినట్టు పాస్ బుక్ తీసుకోడానికి ఆ వూరి ఏం ఆర్ వో ఆఫీసునుంచి లెటర్ రావడం తో ఎర్రగుంట్ల రైల్లో బయలుదేరతాడు .ఆ పొలం అమ్ముకుని ఆటో ట్రాలీ కొనుక్కోవాలని అతని ఆలోచన .ఆ రైల్లో సలోని పరిచయం .అందమైన భావాలకి గీతల రూపం లో చిత్రాలు గియ్యడం ఆమె అభి రుచి .ఆ పుస్తకాన్ని ఆమె రైల్లో మరచి పొతే సునీల్ తీసుకుని ఆమెకి ఇచ్చేలోపు రైలు ఎర్రగుంట్ల దాటి పోతుంది .అయితే సునీల్ పొలం అమ్మడానికి ఆ వూళ్ళో పెద్దమనిషి సాయం కోసం వెళితే అతనే హీరోయిన్ ఫాదర్ .అంతే కాకుండా ఇన్నాళ్ళు ఎవర్ని చంపడానికి ఎదురు చూస్తున్నారో అతనే సునీల్ అని కూడా వాళ్ళకి తెలిసి పోతుంది .అయితే ఆపెద్దాయనకి తల్లి లాంటి తన ఇంట్లో అతిధి మర్యాదలు మాత్రమె జరగాలని రక్తం మాత్రం గడప బయటే అని ఆచారం గా పెట్టుకుంటూ కొడుకులకి కూడా అదే ఆదేశిస్తాడు .సునీల్ కి యి విషయం తెలిసి పోవడం తో ప్రాణ రక్షా నార్దం అతిధి మర్యాదలు అయిపోయి నాక కూడా పొలం చూద్దాం రా అన్నా కూడా రాకుండా కింద పడి నడుం విరిగినట్టు నాటకం ఆడి మరికొన్ని రోజులు అక్కడే తిష్ట వేస్తాడు .అదంతా సలోని మీద ప్రేమతో నే అని వాళ్ళ బావ (బ్రహ్మాజీ )ఆటపట్టిస్తూ ఉంటాడు .సలోని కి వాళ్ళ బావతో పెళ్లి చెయ్యాలని పెద్ద వాళ్ళు అనుకున్తునప్పటికి వాళ్ళిద్దరికీ ఇష్టం వుండదు .తను మరిన్ని రోజులు వుండడం కోసం వాళ్ళిద్దరికీ నిశ్చితార్దం జరిగేలా సునీల్ ఏర్పాట్లు చేస్తాడు . అందులో ఆమెగీతలలో దాచుకున్న భావాల్ని కాబోయే భర్త ఎలా వుండాలను కుంటోన్దో పాట రూపం లో పాడడం తో ఆమె సునీల్ నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది .అయితే ఆ గీతల లోని భావాన్ని అప్పుడే గ్రహించిన బావ తన మనసు మార్చుకుని నిశ్చితార్దానికి సిద్దం అవుతాడు . గుళ్ళో నిశ్చితార్దం పెట్టి తద్వారా బయటకు వచ్చిన సునీల్ ని చంపెయ్యలని హీరోయిన్ తండ్రి అన్నల ప్లాన్ .క్లైమాక్స్ లో మళ్ళి మగధీర బ్రిడ్జ్ ని వదలలేదు రాజమౌళి .సునీల్ ప్రాణ భయం తో పరిగెడుతూ వుంటే హీరోయిన్ అతనికి యి చెక్క దాటి ఆ బ్రిడ్జే మద్యలోకి వెళ్లి చెక్క తీసేస్తే వాళ్ళు అందుకోలేరని ఇద్దరం పారి పోవచ్చని చెపితే సునీల్ ఆ చెక్క దాటుకుని వెళ్లి ఇప్పటికే నా కోసం మీరు శ్రమ తీసుకుని వచ్చారు ఇంకా ఎందుకని తను అటు వెళ్ళ గానే చెక్క లాగేస్తే ఆశ్చర్య పోవడం సలోని వంతు .సునీల్ తనని ప్రేమించాడనే అనుకుంటుంది , ఇంతలో ఆమె తండ్రి అన్నలు వచ్చి ఇంకో చెక్క వేసి ఆ బ్రిడ్జ్ మధ్యకు వెళ్లి అతన్ని చంపాలని ప్రయత్నించడం తో తండ్రి కి చెపుతుంది తను సునీల్ ని ప్రేమించానని చంపోద్దని .అప్పుడు సునీల్ నటన అద్బుతం . తనంత తానుగా చెక్కని వేసి విలన్స్ కేసి నడుస్తూ ఇంత అందమైన అమ్మాయి ప్రేమించిందని తెలిసాక పారి పొతే ఆ ప్రాణానికి విలువ లేదంటూ చెప్పిన డైలాగు ప్రేక్షకులకి కంట తడి పెట్టిస్తుంది .విలన్సు కొడుతున్నా కూడా హీరోయిన్ చెయ్యి పట్టుకుని అల్లాగే తన్నులు తినడం . హీరోయిన్ అతన్ని రక్షించడం కోసం చెయ్యి విదిలించుకుని బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దుకేయ్యడం సునీల్ కూడా వెంటనే దూకి ఆమెని రక్షించడం,తండ్రి కూడా పగని వదిలి ప్రేమకి ఆమోదం తెలపడం తో కధ సుఖాంతం అవుతుంది .
పాటల పరం గా తెలుగమ్మాయి ,రాయే రాయే రాయే సలోని బావున్నాయి . సునీల్ స్టెప్స్ కి విజిల్స్ పడ్డాయి .నలభై ఏళ్ళుగా పాడుతున్న ఎస్ పి కి మొదటి సారి గా గానం బాలుగారు అని వెయ్యడం సముచితం గా అనిపించింది (నా రవిగారు లాగ ?)మొత్తానికి యి సినిమా కుటుంబ సమేతం గా వెళ్లి ఆనందించ తగ్గ సినిమా . ఈ మద్య విడుదలైన తెలుగు సినిమాలు (శుభప్రదం ,ఝుమ్మంది నాదం , స్నేహగీతం వగైరా ) బాక్స్ ఆఫీసు దగ్గర పల్టి కొట్టడం , దగ్గరలో పెద్ద సినిమాల పోటి లేక పోవడం తో మర్యాద రామన్న హిట్ అవడం కష్టమేమి కాదేమో . .యిది నిజం గా చిన్న బడ్జెట్ తో తీసిన పెద్ద సినిమానే . కంగ్రాట్స్ టు రాజమౌళి .కొస మేరుపెంటంటే సినిమా అయిపోయాక టైటిల్సు వేస్తూ ఆ సినిమా షూటింగ్ షాట్స్ (మగధీర లా గే )చూపిస్తుంటే ప్రేక్షకులు అలాగే నిలబడి అయ్యేదాకా వుండి చూసి ఆస్వాదించడం .
ఇది పోస్ట్ చేసాక యి సినిమా 1923 లో వచ్చిన అవర్ హాస్పిటాలిటి కి మక్కి కి మక్కి కాపి అని నిర్దారించుకుని నోరు వెల్ల బెట్టా . అందుకే టైటిలు మర్యాద తప్పిన రామన్న గా మార్చేసా .

13 జులై, 2010

ఆడాళ్ళు వట్టి మోసగాళ్ళే

http://janeheller.mlblogs.com/woman_hitting_man.jpg

మగాళ్ళు వట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏంటో తెలీదే అంటూ యి మద్య వచ్చిన గోలీమార్ లో పాట గీతామాధురి పాడింది రోజు ఆఫీసు కి వేల్తునప్పుడు ఎఫ్ ఏం రేడియో లో ఊదర గోడుతుంటే చిరాకేసి దానికి పేరడీ గా ఆడవాళ్ళ మీద రాసిందే యి పాట .సరదాగా తీసుకుని నవ్వుకోడానికే గాని నేను ఎవర్ని దృష్టిలో పెట్టుకు రాసింది కాదని మనవి . వొకవేళ ఎవరన్న ఆ పాట వినక పోయి వుంటే ముందు గా ఆ పాట విని యి పెరడిని ఆస్వాదించ గలరు ,

ఆడాళ్ళు వట్టి మోసగాళ్ళే
ప్రీమంటీ ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచి పోతారే
ఈమె కూడా యింతే
ఆడవాళ్ళ వళ్ళంతా తిమ్మిరె
మాలాగా ఏదో వొకటి కట్టుకుని గమ్మునున్దరే
వళ్ళంతాబంగారు మలాము కోరు కుంటారే
ఈమె కూడా యింతే

కాస్తంత రుచి కరమైన వంట కోరుకుంటాం
ప్రేమతో వడ్డిస్తే పొంగి పోతాం
ఆడవాళ్ళ టీవి ల సీరియళ్ళ గోల యెన్ టో
పక్కింటి వాళ్లతో బాతాఖాని లేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో
మీకు ఇబ్బంది లేకుండా బార్ లో మింగి వచ్చినా
డబ్బు తగలేసుకుని బయట చచ్చినా
మీరింతే ఛి చిచి ఈమె కూడా యింతే

మూడ్ లేదన్నా సద్దుకున్టాము
రేపు చూసుకుందామని అన్నా బ్లాగింగు లో పడతాము
ఆడాళ్ళ మైండ్ ఏంటో మనసేంటో మాటెన్ టో లోపలేంటో ఏమో
అడిగినవన్నీ కొన్నా ఆకాసమంతా తెచ్చి ఇచ్చినా
మీరింతే చిచ్చీ యీమే కూడా యింతే

10 జులై, 2010

బ్లాగర్ వైరాగ్యం

http://www.carlosfran.com/wp-content/uploads/2008/01/blogar-cansar.jpg

బ్లాగింగు మొదలెట్టిన కొత్తలో బ్లాగర్ కొత్త పెళ్ళికొడుకు తో సమానం .పగలు రాత్రి తేడాలేకుండా ఎప్పుడు బ్లాగ్ మీదే ద్యాస .ఎప్పుడు ఎప్పుడు రాసేద్దమా ఎప్పుడెప్పుడు కామెంట్స్ చూసేద్దమా ?అన్న ఆత్రమే .కొత్త బిచ్చగాడు పొద్దెర గడని అర్దరాత్రి అపరాత్రి కూడా ,జీవిత భాగస్వామి ఎవోయి కొంచెం పడుకోడానికి రావొచ్చు గా ?అన్నా కూడా అబ్బ ఇవాల్టికి నన్ను వదిలెయ్యండి పని వుంది అని రెచ్చి పోయి రాసేసిన రోజులు కూడా వుంటాయి .కాలం గడుస్తున్న కొద్ది మన బ్లాగ్ లో ఏమి చెత్త రాసినా కూడా వా వా అనే వంది మాగతులు కూడా తయారవుతారు .మనకి తెలీకుండానే వొక వర్గానికి కొమ్ము కాస్తూ ఆ వర్గాన్ని నొప్పించకుండా వ్యతిరేక వర్గాన్ని రెచ్చ గొడుతూ రాస్తూ ఉంటాము .కొన్నాళ్ళకి రాయడానికి సబ్జక్ట్స్ అన్ని అయిపోతాయి .బ్లాగ్ తో పెళ్లి అయ్యి సంవత్సరం దాటి పోతుంది .మొదట్లో వున్న మోజు తగ్గి పోతుంది .యి రెండు సంవత్సరాలలో బ్లాగ్ కి దగ్గరవడం వల్ల ఇంట్లో వాళ్ళకి దూరం అవుతాము.మొదట్లో వున్న ఉదృతి స్తబ్తత గా మారు తుంది .బ్లాగ్ లో రాసేదిచదివి వుహించుకున్న రూపాలు వాస్తవం లో శాపాలు గా మారతాయి .వాస్తవం కన్నా వుహే బావుంటుంది .యి లోపు ఆఫీసు లో శ్రద్దగా పని చెయ్య కుండా బ్లాగ్ లో రాసుకున్టున్నరన్న విషయం పైదాకా పోతుంది.దాంతో పైవాడు వేరే ఊరికి ట్రన్స్ఫెర్ చేస్తాడు (గవర్నమెంట్ లో అయితేనే ).ప్రైవేటు లో వుద్యోగం వుడుతుంది .కళ్ళకి జోడు ,ఇంట్లో వాళ్ళకి కొత్త తోడూ కూడా రావొచ్చు .అప్పటికి కళ్ళు తెరుచుకో బడి బ్లాగోదయం అవుతుంది .వైరాగ్యం పుట్టుకొస్తుంది .పని పాట లేని వాళ్ళు మాత్రమె బ్లాగింగు చేస్తారని చేతినిండా పని వున్న వాడు బ్లాగ్ మొఖం చూడడని పోస్టింగ్స్ రాసుకుని స్వేదబిందువులు తుడుచుకుని నిర్వేదం లో పడిపోతాం .యి స్టేజి లన్ని దాటుకొచ్చిన అనుభవజ్ఞులైన బ్లాగర్లకి యిది ప్రసూతి వైరాగ్యం అని అర్ధం అవుతూనే వుంటుంది .ఛి యిక జన్మలో భర్తని దగ్గరికి రానిచ్చేది లేదని మంగమ్మ శపధం చేసిన ఇల్లాలు మళ్ళి రెండో కాన్పు కి కూడా అలానే అంటుంది .యిది అంతే కొన్నాళ్ళు యి వందమంది కోసం ఏమిటి నా సమయం వృధా చేసేది అన్న నిర్వేదం తో బ్లాగ్ అంటే మొహం మొత్తి దూరం గా జరుగు తాము .మళ్ళి ఎవరో మిత్రులు ఫోన్ చేసి మళ్ళి బ్లాగుల్లో యుద్దాలు మొదలయ్యాయి చూసావా అనగానే సాయంత్రం ఆరు దాటగానే కల్లు పాకకి పరిగెత్తే తాగుబోతులా , కంప్యూటర్ ని చూడగానే స్వామి రారా బ్లాగోత్తమ పురుషా రా రా అని పిలుస్తున్నట్టు గా భావించుకుని రంగం లోకి దిగి పోతాం .మళ్ళి చర్విత చరణమే .నే చెప్పేదేమిటంటే యిదొక వ్యసనం అని వచ్చాకే తెలుస్తుంది తెలిసాక పెద్ద గా చేసేది ఏమి వుండదు యిదొక వ్యసనం అని పోస్ట్ రాసుకోవడం తప్ప .ఎటొచ్చి పెళ్ళయిన కొత్తలో ఉన్నంత ముద్దు ముచ్చట ఆ తర్వాత రోజుల్లో ఎలా తగ్గి పోతూ అప్పుడప్పుడు లోకి వెళ్ళిపోతుందో బ్లాగ్ లో రాతలు కూడా అదే పందాని అనుసరిస్తాయి .యిది కాలం తెచ్చే మార్పే కాదంటారా? .

1 జులై, 2010

తిరుమల లో కుంగిన స్వామి విగ్రహం ?


యి రోజు ఆఫీసు లో బిజీ గా పని లో వుంటే తిరుమల లో స్వామి కి పూజాదికాలు నిర్వహించే పూజారి గారు స్వామి ప్రసాదం తీసుకుని నా రూం కి వచ్చారు .యెంత బిజీ లో వున్నా ఆయన వచ్చినప్పుడు కనీసం పది నిమిషాలన్న ఆయనకీ కేటాయించి ఆద్యాత్మిక విషయాలు మాట్లాడు కోవడం రివాజు .మిగత స్టాఫ్ ని తర్వాత రమ్మని ఆయనతో మాట్లాడుతుంటే విచార వదనం తో కనిపిస్తే విషయం ఏంటని అడిగితె తెలిసిన నిజం వింటే నాకే వొళ్ళు గగ్గురు పుట్టింది .
విషయం ఏంటంటే తిరుమల గర్భ గుడిలో వున్న స్వామి విగ్రహం వొక అడుగు మేర కిందకి కుంగి పోయింది .అంతే కాదు విగ్రహం చుట్టూ వొక ఇంచ్ మేర నీళ్ళు ఊట లా వూరి ఉంటున్నాయి .స్వామి విగ్రహం కింద లోతుగా ఆకాశ గంగ ప్రవహిస్తోందని తెలిసింది .ఇప్పుడు ఆ విగ్రహాన్ని వొక అడుగు మేర లేపడానికి మల్ల గుల్లాలు పడుతున్నారట .ఎందుకంటె అదో పెద్ద ప్రక్రియ .మూడు నెలల పాటు గర్భ గుడిలో పూజ పునస్కారాలు వుండవు .ముందు గా స్వామి విగ్రహం లోని శక్తిని కలశం లోకి ఆహ్వానించి , ఆ కలశ ముఖం గా వొక వెయ్యి ఎనిమిది హోమాలు గుడి చుట్టూ పెట్టి పూజాదికాలు నిర్వహించాలి .యి లోపు గణపతి స్తపది ద్వార మాత్రమె విగ్రహాన్ని అడుగు మేర పైకి లేపాలి .యివన్నీ బ్రహ్మోత్సవాల లోపు చెయ్యడం అసాద్యం కనక యిప్పుడు ఏమి చెయ్యాలో తేలిక ఆలయం లో ముఖ్యులు తలలు పట్టుకు కూర్చున్నారని సమాచారం .ఇదేదో రాబోయే చెడుకు సూచనగా భావించోచ్చా?అని అడిగితె అయ్యా ఇప్పుడు అర్చకులలోనే కుమ్ములాట మొదలయ్యింది మిరాసి వ్యవస్థ కొనసాగాలని , కాంట్రాక్టు పద్దతి లోనే వుండాలని రెండు వర్గాలుగా చీలి పోయి దేవుడిని శ్రద్దగా పట్టించుకోక పోవడం తో అరిస్టమే ఖాయం అని పిస్తోంది అంతే కాదు 2012 సంవత్సరానికి స్వామి సగానికి పైగా కిందకి కుంగి పోతారని అదే యుగాన్తానికి నాంది అని కళ్ళ లో నీళ్ళు వత్తు కుంటూ చెపుతున్నాడు . యిలోపే బయట అసహనం గా వెయిట్ చేస్తున్న సందర్శకులు , వి ఐ పీ లు లోపలకి రావడం తో అయన సెలవు తీసుకుని భారం గా కదిలారు . నేను చేష్ట లుడికి మౌనం గా మాన్పడి పోయాను .ఇంకా నయం ఏ tv9 వాడికో యి సమాచారం చేరి వుంటే కుంగిన వెంకన్న అంటూ పొద్దుట నుంచి రాత్రి దాక ఊదర గొట్టి వుండే వాడు . అయినా తిరుమల పెద్దలు కూడా యి విషయం బయట ఎక్కడా పొక్క కుండా జాగర్త పడుతున్నట్టు అభిజ్న వర్గాల బోగట్టా .