7 జులై, 2017

లోపలి మనిషి

             
వుద్యోగం ,ఇల్లు ,ఇల్లాలు  అనుకుంటూ బతికా  మొన్నటి దాకా  .    ఎప్పటి కి అలానే ఉంటుందని నమ్మకం గా వుండే వాణ్ణి . ప్రభుత్వం లో ప్రజలకి బాగా  అవసరం పడే హోదా లో వున్న  వుద్యోగం అవడం  చేత రోజు ఎంతో మంది అపరిచితులు  కలుస్తున్తారు. ఫోన్ లో మాట్లాడుతూ వున్తారు.    ఆ రోజు ఆఫీసు కి వెళ్ళిన పది నిమిషాలకే వొక తీయని స్వరం నా హృదయాన్ని తాకింది . ఎంతో  చనువు గా ఎప్పటి నుంచో పరిచయం వున్నా దానిలా   పేరు పెట్టి మాట్లాడేస్తూ మనిద్దరం సివిల్స్ లో  బాచ్   మేట్స్ , ఆ చనువు తోనే నాకి పని కావాలి  చేసి పెట్టు అనడం తో చక చక చేసేసాను . మర్నాడు థాంక్స్ గివింగ్ ఫోన్  ఆ మర్నాడు సెల్ ఫోన్ నంబర్స్ మార్పిడి . అప్పటి నుంచి ఆమె ఎస్ ఏం ఎస్ సందేశాలు . ముందు కేళ్లాలా వద్దా ?అని నా లో  సందేహాలు .. మనకి ఏ దురుద్దేశం లేనప్పుడు స్పందిస్తే పోయేదేముంది పది పైసలు తప్ప అని కొన్ని మీటలు సెల్ లోవి నొక్కి పారేసాను .  వొక అర్ద రాత్రి వాళ్ళ శ్రీమతి పడుకుందని నిర్దారించు కున్నాక . దూరం గా తీతువు పిట్ట అరిచింది రాబోయే ఉప ద్రవానికి సూచనా గా . రాత్రంతా యిరు పక్కల సందేశాలు పోతూనే వున్నాయి భాగ  స్వాముల గురక సాక్షిగా . నాలుగు రోజులు సెల్ వదల కుండా ఆఫీసు లో మాట్లాడం తో నలుగురికి కుడా అనుమానం వచ్చి ఫైల్స్ పెట్టేసి ముసి ముసి గా నవ్వుకుంటూ పోతున్నారు . యిది వరకు రోజుల్లో అయితే అలాగాని పెట్టేసి వెళ్లి పొతే క్విక్ డిస్పోసల్ నా సిద్దాంతం . అంటూ అప్పటి కప్పుడు అందులో విషయాన్ని డీలర్ తో డిస్కస్ చేసి ప్రభుత్వా సమయాన్ని వృధా చెయ్య కూడదు అంటూ ఫైల్ మీద ఆర్డర్స్ పాస్ చేసిన వ్యక్తీని.  , యిప్పుడు ఎవరన్నా ఫైల్ పెట్టి యింకా అక్కడే వుంటే వెంటనే విసుగు కుంటూ నన్ను ఫైల్ క్షున్నం గా చదువు కొనిండి  అంటూ పంపేస్తున్నాను   ''యింక నిన్ను చూడ కుండా వుండడం నా వల్ల  కాదు , నేనిప్పుడే మీ ఆఫీసు కి వస్తున్నా వేడి గాఏదన్నా  సిద్దం గా ఉంచు తాగి పోతా''  అంటూ ఆమె చొరవ గా అనేసి సెల్ పెట్టేసింది . నా గుండెల్లో రైళ్ళు పరిగెదుతున్నయి. అసలు ఆమె ఎలా వుంటుందో ?నా  బాచ్ లో అసలు ఆడ వాళ్ళే లేరు .యీమె ఎవర్ని చూసి ఎవరనుకుని యింత చొరవ తీసుకుంటోందో ?యిలా ఆలోచనల తో సతమవుతూ వుంటే ప్యూను  తలుపు తీసుకుని విసిటింగ్ కార్డు పెట్టేసి వెళ్లి పోయాడు . నళిని నాయక్ , డిప్యూటీ కమీషనర్  అంటూ డిపార్టుమెంటు పేరు అడ్రెస్స్ రాసి వున్ది. గుండె వేగం గా కొట్టుకుంటూ వుంటే బెల్ కొట్టి రమ్మను అన్నా . డోర్ నాక్ చేసి మే అయి కమిన్ ?అంటూ ముగ్ద మనోహరం గా వున్నా వొక ముగ్ద చిరునవ్వుతో నిల బడి వుంది . అప్రయత్నం గా నేను   కుర్చీ లోంచి లేచి నిలబడి ముందుకు వంగి చెయ్యి అందిస్తూ ప్లీజ్  అన్నా'ఆమె కూడా నమస్కారం అంటూ తిరస్కర లక్షణాలు చూపించ కుండా సుతి మెత్త గా నా  చెయ్యి పట్టుకుంది . కళ్ళు కళ్ళు కలిసాయి. మౌనం రాజ్యం ఏలింది .పరోక్షం లో ప్రవాహం లా సాగిన మాటలు ప్రత్యక్షం లోఆనకట్ట లో బందీ అయిన నది లా అయిపోయాయి . నేనే  ఐస్ ని బ్రేక్ చేస్తూ నేను మీరనుకుంటున్న వ్యక్తీ ని కాదనుకుంటా
, నా సీనియర్ వొకరు నా పేరు తోనే వుంటారు బహుసా  నా పేరు చూసి అతననుకొని పొర  బడి వుంటారు  అన్నాడు.
మొదట్లో పొర బడిన మాట వాస్తవమే గాని  తర్వాత మీ మాటలు , మీ సబ్యత నను కట్టి పడేసాయి . పరిచయం అయిన పదినిమిశాలకే మళ్లీ  మనం ఏకాంతం లో ఎప్పుడు కలుస్తున్నాం?అని అడిగే మగ మృగాలు వున్న సమాజం లో మీరు తులసి మొక్క లా కని పించారు . అందుకే మీ కభ్యంతరం లేక పొతే యిది కోన సాగించాలని అనుకుంటున్నాను .
నా  మౌనాన్ని అంగీకారం గా భావించుకుని , వేడి వేడి కాఫీ ని లాగించేసుకుని ,వెళుతూ వెళుతూ మత్తైన ,గమ్మత్తైన చిరునవ్వుని విసిరేసుకుని అప్పటికి సెలవు తీసుకుంది . అప్పటి నుంచి నా జీవతం మొత్తం మారి పోయింది
.'' రేపు  నా పుట్టిన రోజు ,మీకు మాత్రమే లంచ్ మా గెస్ట్ హౌస్ లో ,ఏ వంకలు పెట్టకుండా మీ కార్ ని మీరే డ్రైవ్ చేస్తూ వచ్చెయ్యండి అడ్రెస్స్ ఎస్ ఏం ఎస్ చేస్తున్నా''అంటూ నన్ను   మాట్లాడ నీయకుండా సెల్ పెట్టేసింది.
మర్నాడు శనివారం కావడం తో రిలాటివేలీ ఫ్రీ . అయినా యిప్పుడు అవసరమా?ప్రశాంతం గా సాగిపోతున్న జీవితం లో అడుసు తొక్కనేలా?కాలు కడగ నేలా ?అదేంటి ఈ ఆలోచన?భోజనానికి గా వెళ్ళేది?అక్రమంగా ఆలోచన ఎందుకు? తన ప్రమేయం   లేకుండా తప్పు చేసే ప్రసక్తే లేదు . సో నన్ను నేను పరీక్షించు కోవడం కోసమన్నా వెళ్లి తీరాలి. అనుకుంటూ కారు తీశాను  . అడ్రెస్స్ కని పెట్టడం పెద్ద కష్టం కాలేదు . జూబ్లీహిల్స్ లో లోపలకి  దూరం గా విసిరేసినట్టు జనసంచారానికి సంభంధం లేనట్లుగా వుంది. గేట్ ముందు కు వచ్చి హార్న్ కొడదామనుకునే లోపు ఆమె నే గేట్ తీస్తూ స్వాగతం  పలుకుతోంది. మా వాచ్మాన్  ని వాడి పెళ్ళాం తో సహా సినిమా చూసి హోటల్ లో భోజనం చేసి రమన్నా , సో రాత్రి వరకు మనల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు రండి అంటూ చనువు గా చెయ్యి పట్టుకుని లోపలకి  తీసుకుని వెళ్లి డోర్ వేసేసింది.
 ''ఈ సారీ లో నే ఎలా వున్నాను?''
''వేసుకోనట్టే వున్నారు'' అప్రయత్నం గా  మనసులో మాట బయటకి వచ్చేసి నాలుక కరుచు  కున్నా . అబ్బో మీలో ఈ కోణం కూడా ఉందా?ఎప్పుడు పరిధి దాటి మాట్లాడక పొతే ''పనికి '' రారు అనుకున్నా ఆమె విసురుగా యిచ్చిన ఆ రియాక్షన్ కి ఏమనాలో తేలిక మీ రేమన్న'' పనికి ఆహార పధకం ''పెట్టారా కొంపతీసి?అన్నా. అబ్బో మాటకారి రండి మీ ఆకలి తీర్చాలి కొసరి కొసరి వడ్డిస్తూ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకి దారి తీసింది.
యిద్దరం కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆమె వడ్డించే మిషతో చాలా చోట్ల తాకడం యాదృచ్ఛికమే అనుకోవడం నా శీలానికి శ్రేయస్కరం . ద్రుష్టి పదార్ధాల మీద నిలపడం తో నా ఆకలి తీరుతోంది అదే ఆమె మీద పెడితే ఆకలి పెరుగుతోంది సో తలవంచుకుని లంచ్ అయ్యిందని పించా.
 సోఫా మీద తాను దగ్గర గా వచ్చి కూర్చుని నా భుజం మీద తల పెట్టుకుని ఏదో ప్రేమ గా మాట్లాడుతోంది. ఆమె శరీరం లో వంపుసొంపులు నా చేతుల మధ్య ఇమిడి పోయాయి. సభ్యత సంస్కారం నా వేళ్ళని కట్టేశాయి. ఇంతలో నా లో లోపలి మనిషి బయటకు వచ్చాడు. ''ఓ రేయి గొట్టం ఆమె కి ఏ ఇంటరెస్ట్ లేకపోతె నిన్నే ఎందుకు లంచ్ కి పిలుస్తుంది. పైగా వాచ్మాన్ ని పెళ్ళాం తో సహా బయటకు ఎందుకు పంపిస్తుంది. అందాలు బహిర్గతం అయ్యేలా ఆ పలచటి సారీ ఎందుకు కడుతుంది?వడ్డించే అప్పుడు వళ్ళు  వంచి మరి ఎందుకు కొసరి కొసరి తినిపిస్తుంది?యిప్పుడుఇంత  దగ్గర గా అతుక్కు పోయి కూర్చుంటే ఆమె అసభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తుందో అర్ధం చేసుకోలేని చవట పో కార్యోన్ముకుడవై ముందుకు సాగి పో . పిడికిలి విప్పు . సిగ్గెందు కింకా ముగ్గు లో దిగాక?'' నడుము మీంచి  చెయ్యి ఏ దిశగా వెళ్లిందో తెలుసు కునే లోపు ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి  అయినారు అనుకంటూ ఆమె ని ఆక్రమించడమే గుర్తు. ఆమె మాత్రం అదేదో సినిమాలో శృతిహాసన్ లాగ మొఖం లో ఏ మాత్రం హావ భావ విన్యాసాలు లేకుండా కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ వుండింది. అరగంటలో జ్వాలా ఆరిపోవడం బయట వర్షం వురమడం ఓకే సారి జరిగి పోయాయి. నేను తప్పు చేసిన భావం తో లేచి నిలబడ్డా .
 ఆమె విసురుగా వెళ్లి బెడ్ రూమ్ తలుపు వేసుకుని బోల్ట్ పెట్టేసుకుంది. వాస్తవం కళ్ళ  ముందు నిలిచింది . కర్తవ్యం బోధ పడింది. వెళ్లి తలుపు తట్టి'' ప్లీజు  ఐ ఆమ్ సారీ నా ఉద్దేశం అస్సలు అది కాదు ఏదో అలా అనుకోకుండా జరిగి పోయింది . తలుపు తియ్యి ఇంకెప్పుడు యిలా చెయ్యను. '' ప్రార్థిస్తూ అడిగా . అటు పక్క మౌనం ఆ తర్వాత ఏడుపు ''ఛీ  కలలో కూడా నువ్వు అందరి మగాళ్ల లాగే అనుకోలేదు. మబ్బులో మల్లె తోట అనుకున్నా . నా అంచనా తప్పైతే ఆత్మహత్య చేసుకోవాలని ముందే అనుకున్నా ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావో అప్పుడే నే చని పోయా, యిప్పుడు కేవలం ఈ కట్టే మాత్రమే చచ్చి పోతుంది. మగాళ్లు కాదురా మీరంతా మదం లోపల దాచుకుని కల్లా   బొల్లి మాటలతో మభ్య పెట్టె మృగాళ్లు . ప్రపంచం లో  ఆడ మగ మధ్య ప్రేమ లేదు అవసరాలే కలిపి వుంచు తున్నాయి. ఆకలి చూపులు, ఆర్ధిక అవసరాలు యివేరా కట్టి పడేసేవి. ప్రేమలు కానే  కాదు దీనికేనా నా భర్త పిల్లని వదిలేసి ఇక్కడకి వచ్చింది?నా కు తగిన శాస్తి అయ్యింది నే  పోతా ''
యింక అంతే  అటు పక్కనుంచి మౌనం. తలుపులు బాదుతున్నా స్పందన లేదు . అటుపక్కకి పోయి కిటికీ తలుపు తోసి చూసి కొయ్య బారి పోయా. ఆమె సీలింగ్  ఫ్యాన్ కి చీర తో ఉరి వేసుకుని వేలాడుతోంది. నాలిక బయటకు వచ్చేసింది కళ్ళు  పొడుచుకుని చూస్తున్నట్టు గా వుంది. అంతకు పది నిమిషాల క్రితం రంభ లా కనిపించిన ఆమె యిప్పుడు రాక్షసి లా కనబడుతోంది . నా కక్కుర్తి కి తగిన మూల్యం చెల్లించు కున్నా . యిప్పుడు పోలీసులు, ఎలక్ట్రానిక్ మీడియా. ఆమె రేపుకు ఎన్ని గంటలకి గురి అయ్యింది ఈ మృగాడి తో పాటు యెంత మంది వున్నారు వాళ్ళు ఎలా తప్పించు కున్నారు?వాచ్మాన్ కి సినిమాకి డబ్బులు ఎవరు యిచ్చారు?ఆమె వాళ్ళ భర్త కి షేర్ చేసిన లొకేషన్ అసలు ఇదేనా?లేక ప్రభుత్వాధి  కారి గా  మదం ఎక్కి ఎప్పుడు వెళ్ళే  ఆ ఫైవ్ స్టార్ హోటల్ దా ?ఆమె పాంటీ మీద వున్న  ఆ మరకలు ఏంటి?యింతకు ముందు ఈ సారు చేసిన రాసలీలలు బయట పడకుండా ఎలా మేనేజ్ చేశారు?ఇత్యాది ప్రశ్నల తో ప్రతి ఛానల్ నన్ను అమ్మేసు కుంటారు. ఆ వెదవ లోపల మనిషి లోపల నోరుమూసుకుని పడుకోకుండా   తగుదునమ్మా అని వచ్చి ఆక్రమించు కోకుండా ఉంటే యెంత బావుణ్ణు?యిప్పుడు పరువు పదవి పరుపు (పడుకోడానికి లెండి)అన్ని పోయాయి.
 మళ్ళి తలుపు దడ దడ మోగుతోంది. ఏమండీ , ఏమండీ వాచ్మాన్ వైఫ్ అనుకుంటా? తలుపు తీసి చుస్తే నా శ్రీమతి. అదేంటి ఈ వేళ మీ బాస్ తో బయట లంచ్ అన్నారు ఇంతకీ యింట్లో వండి చ్చాలా వద్దా ? తొమ్మిది అయినా లేవక పొతే లేప  వలసివచ్చింది. నా ఆనందానికి అవధులు లెవ్.  అంటే యిదంతా ఆ టీవీ లో ఉదర గొట్టే శిరీష ఎఫెక్ట్ అన్నమాట . ఏ  ఆడ పిల్ల మాట్లాడినా భయం కోల్పే ఆలోచనలే . పోనిలే బతికించాడు భగవంతుడు ఈ శిరీష ఎఫెక్ట్ మగాళ్ల మీద యింకో సంవత్సరం అన్నా  ఉంటుంది అని అనుకుంటూ ఆబ్బె లంచ్ యింట్లోనే మా బాస్ కి వంట్లో బావుండక లంచ్ కేన్సెల్ల్డ్ అని మెసేజీ పెట్టాడు అనుకుంటూ సెల్ తీసుకుని బాత్ రూమ్ లోకి దూరా . ఫస్ట్ మెసేజ్ ఆమె ది . నీ కోసం విందు భోజనం  తో వెయిటింగ్ అని .
''మరిన్ని పుట్టిన రోజులు నువ్వు జరుపుకోవాలని ఆశిస్తూ నా లోపలి మనిషిని నమ్మ లేని పరిస్థితులలో విందు కు స్వస్తి . నీ ఊహల లోనే నేను, నీ ఊపిరి మాత్రం కాలేను'' అని పంపేసి వెంటనే డిలీట్ చేసేసి ఫ్లష్ లాగి జనజీవన స్రవంతి లోకి అడుగు పెట్టటానికి బయట కొచ్చా.

17 నవం, 2016

మళ్ళి పుట్టిన ఆ రోజు

Image result for man looking moon
        రాబోయే శనిత్రయోదశి నుండి నీ జీవితం ఒక్క కుదుపుతో మార్పుకి గురవుతుంది . మిత్రుడు సహోద్యోగి శర్మ ఫోన్ లో చెప్పాడు. మంచి మార్పా లేక ?
కుదుపు మాత్రం చేదు గుళిక మార్పు మాత్రం మంచికే .
అప్పుడు నమ్మలేదు కానీ యిప్పుడు సందేహం లేదు . ఆ శని వారం యిప్పుడు తలచుకుంటే మనసు క కా వికలము అవుతుంది.
ఆ రోజు ఎప్పటి లాగే ఉదయాన్నే వాకింగ్ చేస్తూ మా ఫ్లాట్ లో కొత్తగా అద్దెకి దిగిన యువ జంట యింటికి వెళ్లి బెల్ కొట్టాను . ఆమె తలుపు తీసింది మ్యాక్సీ లో . అంతకు ముందు రోజే కిటికీ తలుపులు పట్టక దోమలు వస్తున్నాయని కంప్లైంట్ చెయ్యడం తో శనివారం కార్పెంటర్ ని పట్టుకుని చేయించొచ్చు అన్న సదుద్దేశం తో అక్కడకి వెళ్లడం జరిగింది.ముందు గా పని అంచనా కోసం వెళ్ళా.ఆమె నేను  క లి సి లోపలకి వెళ్ళాము .
" ఈ రోజు శని త్రయోదశి యిప్పుడేస్నానం చేసి బాత్ రూమ్ లోంచి వచ్చా అంటోంది".నా గుండె ఝల్లు  మంది '
ఆమె బాత్ రూమ్ లోంచి స్నానం చేసి వచ్చా అన్నందుకు కాదు శనిత్రయోదశి అని గుర్తు చేసినందుకు . శర్మ వార్నింగ్ గుర్తుకు వచ్చింది. ఆ పది నిమిషాల్లో కిటికీలు చూసి వెళ్లి పోయే దానికి ఇంతలా  గాభరా పడాలా అని అనునయించు కున్నా.  మూడు గదుల్లో కిటికీలు చూపించాక బెడ్ రూమ్ లో ఫ్యాన్ కూడా ప్రాబ్లెమ్ ఇస్తోంది అనడం తో అక్కడకి వెళ్ళాను. తాను వెనకగా వచ్చింది. యిపుడు పర్వాలేదండి వేసవి లో యిబ్బంది అవుతుంది .అంది . యింతలో నా ద్రుష్టి గోడ మీద క్యాలెండరు మీద పడింది. వాళ్ళిద్దరి పెళ్లి ఫొటోస్ తో తయారు చేసిన క్యాలెండరు. యిద్దరు చూడ ముచ్చటగా వున్నారు అన్నాను . నిజానికి ఆమె అంత  బావుండదు సన్నగా కొంచెం ఎత్తు  పళ్లతో గట్టిగా మాట్లాడితే ఒక టిబి పేషెంట్ లా ఉంటుంది. నేను ఎప్పుడయితే చూడ ముచ్చట గా వున్నారు అన్నానో ఏడుపు లంకించు కుంది . కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. నా  కేమో పై ప్రాణాలు పైనే పోయాయి. అరెరే ఊరుకోండి ఎందుకు ఏడుస్తున్నారు యిప్పుడు ఏమైయింది అని అన్నా . ఎవరన్నా అప్పుడు మమ్మల్ని చుస్తే నేనేదో అఘాయిత్యం చేస్తే ఆమె ఏడుస్తున్నట్టు గా వుంది పైగా యింట్లో ఎవరు లేరు. దానికి సమాధానం గా ఆమె మేము చూడటానికే ముచ్చట గా ఉంటాము పెళ్లి అయ్యి ఏడాది అయినా ఏ ముచ్చటా మా మధ్య లేదు . అయన ఈ మంచం మీద పడుకుంటే నేను హాల్లో సోఫాలో పడుకుంటాను . అయ్యో అదేంటి పాపం అన్నా . పాపం కాదు ఆయనలో లోపం ,నా పాలిటి శాపం . పైగా ఈ విషయం ఎవరికన్నా చెపితే విషం తాగి ఆత్మా హత్య చేసుకుంటా అని బెదిరించాడు . దాంతో మింగ లేక కక్కా  లేక ముసుకు కూర్చున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది . నా  కేం చెయ్యాలో పాలు పోకా ఆమె భుజం . మీద తట్టి ఊరుకోండి విషయం లేక పోయినంత మాత్రాన విషం అంటే ఎలా ఈరోజుల్లో ఏదన్నా సాధ్యమే అన్నా.
ఆమె దగ్గర గా వచ్చి నా ఎద  మీద తల పెట్టుకుని  నడుము చుట్టూ చెయ్యి వేసి స్వాంతన పొందుతోంది . నాకు మతి పోయింది నేను కలలో కూడా ఆమె అలా వాటేసుకుంటుందని ఊహించలేదు.   ,మెల్లిగా ఆమె చేతులు విడదీస్తూ ఊరుకోండి అన్ని సద్దుకుంటాయి అంటూ అనునయిస్తున్నా. ఇంతలో ఆమె వుండండి బయట తలుపు వేసొస్తా అంటూ గిర్రున వెళ్లి తలుపు వేసి మళ్ళీ  బెడ్ రూమ్ లోకి రావడం లిప్త కాలం లో జరిగి పోయాయి. ఈ సారి ఎదురుగా బాగా దగ్గర గా వచ్చి పన్నెండు లక్షలు ఖర్చుపెట్టి మా నాన్న పెళ్ళిచేసాడు , మళ్ళీ  యింకో పెళ్లి అంటే అయన వల్ల కాదు. కష్టమో నష్టమో యింకా అంతా  యీయన తోనే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మళ్ళీ  వాటేసుకుంటూ నేను అందం గా లేనా అంటూ కళ్ళలో కళ్ళు పెడుతూ అడిగింది. నా పరిస్థితి కుడితి లో పడ్డ ఎలుక లా అయ్యింది. గొంతు పెగలటం లేదు . ఆమె యెంత బక్కగా వున్నా నా మనసు అపభ్రంశం చెందే సూచనలు మొదలయ్యాయి. ఆమె ధోరణి లో ఆమె చెప్పుకుంటూ పోతోంది. పెళ్ళయ్యాకా యింత  వరకు ఏమి కోన లేదు నాకు ఏమి కొనాలన్నా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆమె అనుమతి తోనే  కొనాలి . ఆమె ఎందుకు రా అనవసరపు ఖర్చు అంటే యింక  అంతే . కనీసం ఒక మంచి సెల్ ఫోన్ కూడా లేదు అంటూ యింకా దగ్గర గా హత్తుకుంటోంది. టాపిక్ మారిస్తే ఫలితం ఉంటుందేమో అని అవును మీ సెల్ నెంబర్ యిస్తే అపుడప్పుడు మిమ్మల్ని వోదార్చిచ్చు గా అన్నా. ఐడియా ఫలించింది . యిస్తాను గాని మీ పేరు సుధా అని పెట్టు కుంటా అంటూ పట్టు సడలించి బెడ్ మీద వున్న  సెల్ తీసుకుని నా నెంబర్ కిఅడిగి మిస్డ్ కాల్ యిచ్చింది. హమ్మయ్య అనుకుని మీరు బయట తలుపు తియ్యండి యింక  వెళతాను ఎవరన్నా వస్తే తప్పు గా అనుకుంటారు అన్నా . అంతే  ఆమె ముఖ కవళికలు మారి పోయాయి. కదలకుండా అలాగే మౌనం గా నించుంది. ఆమె భావం నా కు అర్ధం కావటం లేదు. రీజెక్ట్డ్ ఫీలింగ్ తో ఉందా?లేక తాను అందం గా లేను కాబట్టే  వొదిలేశాడని కోపం గా ఉందా ?అబ్బా ఈ భయంకర పరిస్థితి నుండీ ఎప్పుడు బయట పడదామా అని వుంది. సమాజం లో వున్నత మైన స్థితి లో ఉండి ,మంచి కుటుంబం ,హోదా యివన్నీ గుర్తుకు వచ్చాయి . యిప్పుడు గాని ఎవరన్నా తలుపు కొడితే ?నేనుఅంత వరకే  ఊహించా అంతకు మించి న  ఉపద్రవం వేచి ఉందని అప్పుడు నాకు తెలీలేదు .
 మళ్ళీ ఆమె  ఏడుపు లంకించు కుంది . అయ్యో ఊరుకోండి అంటూ ఆమె భుజం తట్టి అనునయించా బోయా
.ఛీ ముందు వంటి మీద చెయ్య తియ్యండి , ఏదో పెద్దవారని బాధ చెప్పుకుంటే వళ్ళు తడుము తారా ?అంటూ ప్లేట్ ఫిరాయించింది. నా కాళ్ళ కింద భూమి పగిలినట్టు అయ్యిండి. కళ్ళు బైర్లు గమ్మాయి.
 అయ్యో మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు నా ఉద్దేశం అది కాదు . అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని అన్నా. ఆమె యింకా ఏడుస్తోనే వుంది. నాకేం చెయ్యాలో పాలు పోలేదు. ఆమెని అల్లాగే వదిలేసి వెళ్లి పొతే నేను తప్పు చేసినట్టు అవుతుంది అలాగని ఉందామంటే అర్జంట్గా మా స్టాఫ్ తో శనివారం కదా అని బయట ఇన్స్పెక్షన్ కి ప్లాన్ చేశా వాళ్లంతా వెహికల్ తీసుకుని  అరగంట లో వచ్చే సమయం అయిపోతోంది .
ఏంటో భగవంతుడా నా కి శిక్ష ఈమె చుస్తే మానసిక రోగి లాగ వుంది ఓకే నిమిషం ఒకోలాగా ప్రవర్తిస్తోంది. ఏమయితే అది అయ్యిందని ఆమెకాళ్లు పట్టుకుని అమ్మా  నను క్షమించు బుద్ది గడ్డి తిని అలా చేశా నన్ను క్షమించు దయ చేసి తలుపు తియ్యి పోతా  అంటూ అభ్యర్ధించా . వసు దేవుడు గాడిద కాళ్ళు పట్టుకోవడం అంటే ఇదేనేమో. మొత్తానికి కళ్ళు తుడుచుకుంటూ తలుపు తీసింది బతుకు జీవుడా అని బయట పడ్డా. అక్కడితో ఆ విషయం మర్చి పోయా .
 ఒక రెండు రోజులు పోయాకా కార్తీక పౌర్ణమి రాత్రి సత్యనారాయణ వ్రతం చేసుకుని ప్రసాదం తీసుకుని అప్పుడే సోఫాలో కూర్చుని ఉంటే సెల్ మోగింది . నెంబర్ చుస్తే మా ఫ్లాట్ లో కొత్తగా అద్దెకి వచ్చిన యువజంట లో యువకుడు. హలో అన్నా .
  మీరెక్కడ వున్నారు .
యింట్లో, కానీ బయటకు వేళ్ళ బోతున్నా, నా మనసేదో కీడు శంకిస్తుంటే అన్నా.
మేము మీ యింట బయటే వున్నాం తలుపు తియ్యండి అన్నాడు .
అదేంటి గొంతులో గౌరవం లేదు దెబ్బలాడటానికి వచ్చినట్టే వుంది . తలుపు తీస్తే యింకో గూండాలా వున్నా మరో వ్యక్తి తో వచ్చి రావడం తోనే  నీకు బుద్ది  లేదా మ్మా ఆడవాళ్ళ చెయ్యి పట్టుంటావా ?డోర్ లాక్ చేస్తావా?సెల్ నెంబర్ ఆమెది నీకెందుకు?యిప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం . పిలు మాడం  ని అంటూ అరుస్తున్నారు. నాకు మెదడు మొద్దు బారి పోయింది. ఇదేంటి అనుకోని ఈ ఉపద్రవం?అసలు జరిగిందేంటి? వీళ్లు  మాట్లాడుతున్నదేంటి?ఇన్నేళ్ల నా జీవితం లో ఎక్కడా ఒక్క మచ్చ లేకుండా బతికితే ఈ అభియోగాలు ఏంటి?అసలు గొంతు పెగలటం లేదు . అతి కష్టం మీద కూర్చోండి నేను చెయ్య పట్టుకోవడం ఏంటి?డోర్ లాక్ చెయ్యడం ఏంటి ?అసలు అలా ఏమి జరగ లేదు .
 నువ్వు యిలా చెప్పవ్ . ముందు ఆ ఫ్లాట్ కి రా అక్కడ అందరి ముందు నిజం చెప్పిస్తాం అంటూ దగ్గర గా వస్తున్నారు. యిప్పుడు వీడు సంసారానికి పనికి రాడని  చెప్పింది అంటే భర్త విషం తాగి చస్తాడు .పోనీ తప్పయ్యిందనంటే ఘోరమయిన నింద మోసినట్టు అవుతుంది. అక్కడకి వెళితే నిజం చెప్పక తప్పదు. వీడు  చచ్చి మళ్ళి  ఆమె ఆత్మ హత్య అంటే శుభకరమైన యింట్లో యిదంతా అవసరమా? ఇంతలో గూండాలాగా వున్నవాడు మేడ  మీదకి పోయి మాడం , మాడం అంటూ పైకి పోయాడు. తాను పిల్లాడికి చదువు చెప్పడం లో తలుపు వేసుకుని ఉండడం తో వీడి అరుపులు వినబడలేదు. నేను తేరుకుని ఆగు నేనే వస్తా బట్టలు మార్చుకుని అంటూ పైకి వెళ్ళా. క్లుప్తం గా శ్రీమతికి జరిగింది చెప్పా. తాను చాలా సూక్ష్మ గ్రాహి ,కూల్ గా ఉంటుంది కాబట్టి కిందకి వచ్చి పదండి నేను ఫ్లాట్ కి వస్తా మీ ఆవిడా ఏం చెబుతుందో వింటా  అంటూ వాళ్ళ తో వెళ్ళింది.
అసలు ఏమి జరుగు తోంది భగవాన్ కార్తీక పౌర్ణమి రోజు వ్రతం చేస్తే ఇదా దాని ఫలం?ఏమో వ్రతం చేశా కాబట్టే యింకా యిలా జరిగిందేమో?లేకపోతె హింసాత్మకం గా మారీ  తే యెంత అప్రతిష్ట . తనకి తెలుసు ఇన్నేళ్ల మా వైవాహిక జీవితం లో ఎప్పుడు ఇలాంటి చపల  చిత్తపు పనులు చెయ్యలేదని . నా లో వున్న  లోపం ఎదుటి వాళ్ళ జీవితం లో అనవసరమైన ఆసక్తి ప్రదర్శిండమే అని . అంతే  అంత వరకే .
తాను అరగంట లో వచ్చింది ఆ సమయం నాకు ఆరు యుగాలు గా అనిపించింది.
వస్తూనే నేను నిన్ను నమ్ముతాను యిన్నేళ్ళనుంచి చూస్తున్నాను కాబట్టి కానీ ఆ  అమ్మాయికి అంతలా పని కట్టుకుని నీ మీదే ఎందుకు చెప్పాలి ?చూస్తే ఇమ్మటూరెడ్ కిడ్ లా వుంది . లాక్ చెయ్యడం చెయ్యి పట్టుకోవడం వంటివి ఆమె విషయం లో జరిగే ఆస్కారం తక్కువే. అయినా జనం ఆడపిల్ల చెప్పిందే నమ్ముతారు కాబట్టి ఇక నుంచైనా ఎదుటి వాళ్ళ విషయాల్లో ఆసక్తి చూపకుండా యింట్లోనే ట్రేడ్ మిల్ మీద మ్యూజిక్ వింటూ వాకింగ్ చేసుకో.
నా కళ్ళలో నీళ్లు ఆగ లేదు ఎన్ని సత్యనారాయణ వ్రతాలూ కిందటి జన్మలో చేసుంటే యింత గొప్పజీవిత భాగస్వామిని యిచ్చాడు ఆ దేవుడు.
వాళ్ళని ఈ మంత్  లోనే ఖాళీ చేసేయ్య మన్నా తాను చెప్పి మేడ  మీదకి వెళ్లి పోయింది .
?మౌనం లో కార్తీక పౌర్ణమి బింబాన్ని చూస్తూ ఆద్యాత్మికం గా అంత  ఎత్తుకు ఎదగ గలనా ?ఆలోచిస్తున్నా. ఇంతలో సెల్ మోగింది . శర్మ . ఎత్తలా  వద్దా 

10 ఆగ, 2015

చాగంటి అయ్యో యేమిగంటి ?


Image result for chaganti pravachanam on shankara bharanam
చాగంటి వారి ప్రవచనాలు విని ఆస్వాదించి అభిమానులుగా మారిన వేలాది టీవి ప్రేక్షకుల్లో నేనోకన్ని . సరస్వతి పుత్రులు , ప్రవచన చక్రవర్తులు అనడం లో కించిత్తు సందేహం లేదు . అయితే అనుకోకుండా ఈ రోజు ఆఫీసు నుంచి వచ్చాక కాఫీ తాగుతూ టీవి ఆన్ చేస్తే వొక ఛానల్ లో శ్రీనగర్ కాలనీ లో సత్యసాయి నిగామాగం నుంచి లైవ్ లో ఆయన ప్రవచనం ప్రసారమవుతోంది . ఆహ ఏమి నా భాగ్యము అనుకుంటూ సౌండ్ పెంచి వింటున్నా .
''రాముడు మర్నాడు పట్టాభి సేకానికి సంసిద్ధుడు అవుతూ తండ్రి మాట నిలబెట్టడం కోసం అరణ్య వాసానికి వెళ్ళవలసి వస్తే రెండిటిని సమంగా స్వీకరిస్తూ  కార్యోన్ముఖుడై వెళ్ళిపోతాడు . గురు శిష్య సంభందాన్ని తెలిపే ఉదాత్త కావ్యం శంకరా భరణం . ఆ నాటి బాల శంకరం (తులసి) తన తల్లి (మంజుభార్గవి) తో కలిసి ఈనాడు వేదిక మీద నర్తిస్తుంటే కన్న తండ్రి (దర్శకుడు విశ్వనాధ్)ఎదురుగా వీక్షిస్తూ  ఆనంద భాష్పాలు  రాలుస్తుంటే  యిదొక అద్బుతమైన రోజులా నా జీవితం లో నిలిచి పోతుంది .శంకర శాస్త్రి  సంగీతానికి యెంత ప్రాధాన్యం యిస్తారో కూతురు పెళ్లి చూపు లప్పు డే  తెలుస్తుంది .అయన ఆర్దిక పరిస్తితి సహకరించక పోయినా స్నేహితుడి ప్రోత్సాహం తో పెళ్ళిచూపులకి సరే అంటాడు . అక్కడ అపశృతి పాడిన కూతురి చేత ఆరోహణ అవరోహణ చెప్పిస్తాడు . యిలా సినిమా కధ ని  ప్రవచనం లా చెప్పేస్తూ మద్యలో రామాయణ మహాభారతల ఘట్టాలతో పోలుస్తూ సాగి పోతోంది . పైగా మూడు రోజులనుంచి ఈ శంకరా భరణం సినిమా ముప్పై ఆరు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ప్రవచనాలు సాగి పోతున్నాయట . నాకు మంచి విందు భోజనం లో పంటి కింద రాయి వచ్చిన అనుభూతి కలిగింది .
మొన్ననే ఆయన ప్రవచనాల స్పూర్తి తో అరుణాచలం వెళ్లి అర్దరాత్రి గిరి ప్రదక్షిణ చేస్తే నేను మా సహచరులు ముగ్గురి తో కలిపి కేవలం నలుగురం మాత్రమె వున్నాము . మద్యలో ఆయన ప్రవచిచినట్టు గానే వూర  కుక్కలు కొంత దూరం వచ్చి వెనక్కి పొయెవి. అంతే గాని గుంపులు గుంపులు గా కాదు కదా కనీసం  నర  సంచారం లేదు . యింద్ర కీలాద్రి పర్వతం చూట్టూ  విజయవాడ  రోడ్ల మీద తిరిగితే ఎలా వుంటుందో అలాగే తిరువన్నామలై లో కూడా అనిపించిన్ది. అయితే అగ్ని లింగం అభిషేకానికి గర్భగుడిలో కుర్చునప్పుడు బయట వాతా వరణం తో సంభంధం  లేకుండా వేడి గా వుండడం భగవత్ నిదర్శనమ్. అయితే చాగంటి వారి ప్రవచనం విని వెళ్ళిన  వాళ్ళకి కొంత నిరాశ కలగడం సహజం . వారి ప్రవచనం లో కొంత అతిశయోక్తి ఉంటుందేమో అని పిస్తోంది . యిన్నాళ్ళు దైవ సంభంద విషయాల పైనే ప్రవచించిన  వారు యిప్పుడు కొత్తగా హిట్ సినిమాల మీద ప్రవచించడం వాటికి సందర్భోచితం గా రామాయణ మహాభారత ఘట్టాల్ని జోడించడం  అంత అభిలషణీయం కాదు . నేను టీవి చూస్తునప్పుడు  అప్పుడే ఆ గదిలోకి వచ్చిన మా అబ్బాయి డాడి  రేపు బాహుబలి గురించి కూడా   చెబుతారా? అంటూ తన గది లోకి వెళ్లి పోయాడు . ఏమో ఆలోచిస్తే శ్రీమంతుడు , బాహుబలి సినిమాల్లో కూడా వారు ప్రవచించ దగ్గ సన్నివేశాలు చాలానే వున్నాయని పించింది . వొక కన్నతల్లి తన చనుబాలని తన సొంత కొడుకు తో పాటు పెంచిన కొడుకు కి స్తన్యం యిచ్చి బాహుబలి అని నామ కరణం  చెయ్యడం యెంత ఉదాత్తమైన సన్నీ వేషం . అలాగే కామం మనిషిని మరణానికి గురి చేస్తుందన డానికి నిదర్శనం గా శంకారాభరణం బలాత్కార సన్నీ వేషాన్ని వుదహరిచ లేదనే అనుకుంటున్నా . ప్రేమతో కూడిన కామం గమ్యానికి అడ్డం వచ్చినా తప్పులేదని బాహుబలి నిరూపించాడు అంటూ ప్రవచిన్చలేమో ?అమ్మో మళ్ళి ఈ విషయం'' అన్నపూర్ణ సుంకర వీడియో ''(తెలుగు సినిమాల మీద) లాగ వివాదాస్పదం  కాదు గదా ?
అయినా చాగంటి వారి అభిమాని గా శంకరాభరణం శంకర శాస్త్రి  గారిభాషలో  '' తాళం తప్పుతోందయ '' అనడం లో తప్పు లేదు గా?


9 మే, 2015

రెడ్ సిగ్నల్


  ''మీ రోగం తగ్గిందా?మీ వైరస్ పోయిందా?చాలా కాలం పాటు మీరు బ్లాగ్ లో ఏమి రాయక పొతే పోయారేమో ?అనుకున్నాం (బ్లాగ్ లోంచి అనుకుంటా )''మొన్నొక రోజు ఆఫీసు లో ఏదో మీటింగ్ లో వుంటే వొక బ్లాగ్ అభిమాని ఫోన్ . అబ్బే అంతా వొకే నో ప్రోబ్లం , య య అంతకంటే స్టాఫ్ ముందు ఏమి మాట్లాడ లేక పోయా . అయి విల్ కాల్ యు బ్యాక్ అనడం తప్ప  . అంటే ఆమె లా ఆలోచిస్తూ'' పాపం కాలాల ఎనకాల రవిగారు వుండేవారు . కాల గర్భం లో కలిసిపోయారు . అందుకే ఆయన కలం మూగ బోయింది '' అనుకునే అందరికి తెలియ పరచడం కోసమన్నా కొంచెం తీరక తీసుకుని బ్లాగ్ బండిని ముందుకు నడిపించాలని యిలా ఈరోజు ముందుకు వచ్చా .
బ్లాగ్ లో భాగోతాలు తెలుసుకునే సమయం చిక్కటం లేదో లేక అంతకు మించిన భాగోతాలలో ములిగి పోయానో నాకే తెలిటం లెదు. లేక వోకరిది ప్రేమ .'వేరొకరిది మోసం ఆ పైన విరహం యెంత సేపు యివే కధలు అందరి వ్యధలు .
మనకోసమే కన్నీరు నింపే ప్రియురాలు అనుకుంటే మనీ కోసమే పన్నీరు కురిపించే జవరాలు ,కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మనం యిచ్చే వరాలు వాటి పర్యవసానాలు , అసలు ఎందుకు ఈ వ్యసనాలు ?హాయ్ గా ఆసనాలు వేసుకుంటూ గుండె నిండా గాలి పీల్చుకుని గుండె  ధైర్యం తో బతకక . బ్లాగ్ లో వొక యోగి అద్యాత్మికత తో ఆనందం పొందుతూ వొక్కసారి గా విరహ గీతాలు పాడుకుంటూ పాడు వాడు అయిపోగా లేంది నేను కాసేపు సుధ నుంచి బయట పడి  వేరే వ్యధల్ని రాయలేనా?.
 ఏమో రాయలేనేమో ?ప్రతి రచయితకి బుర్రలో కొన్ని పాత్రలు ఎప్పటికి స్తిర నివాసం ఏర్పరుచుకుని వాటి చుట్టూ పరిబ్రమింప చేసుకుంటాయి . అందుకే బూజు పట్టిన సుధని బయటకు తియ్యడమా లేక నా కంప్యూటర్ కి పట్టిన బూజు ని అలాగే వదిలేయ్యడమా ?అలా సాగి పోతున్న నాలోనా, ఇదేంటి యిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది ఇదేం  మాయో?
సిగ్నల్ పడడం  తో కార్ కి బ్రేక్ పడింది నా ఆలోచనల తో పాటూ . యేవో రెండు కళ్ళు నన్ను తిక్షణం గా చూస్తునట్టు మనసు చెపితే తల పక్కకి పెట్టి చూసా .   కార్ పక్కన ఆగిన బైక్ వెనకాల ఆమె నాకేసి చూస్తూ వొక చిరునవ్వు కూడా పడేసింది . నాకు నవ్వాలో నవ్వ కూడదో అర్ధం కాని స్తితిలో నవ్వి నవ్వనట్టు వొక నవ్వు పడేసా . అంటే తన సెల్ లో వొక ఫోటో తీసేసుకుని వెళ్లి పొయిన్ది. క్రేజీ  అనుకుంటూ నేను కూడా రయ్యిమని దూసుకు పోయా . సుధా వాళ్ళ యింటి ముందు నుంచి పోతుంటే ,చత్త కుండీ చూడగానే ఆగి పోయే మున్సిపల్ బండి లా నా కార్ ఆగి పొయిన్ది. సరే చాల కాలం అయ్యిందని వాళ్ళింటికి వెళ్లి బెల్ కోట్టా . ఆశ్చర్యం మొట్ట మొదటి సారి యింట్లో వొంటరి గా దర్శనం యిచ్చింది ఎవరు లేకుండా . పలకరింపులు  అయ్యయో లేదో బాత్ రూం లోంచి ఫ్లష్ లాగిన శబ్దం .
తట్టుకోలేకా ఎవరు అన్నా ?
 అబ్బా నీకింకా ఈ బుద్ది  పోలేదా ?రమేష్ అన్నయ్య  మా వారి స్నేహితుడు . రెండు రోజులు ఈ ఊర్లో పని వుంటే వచ్చాడు .
అన్నయ్యా ?స్నేహితుడా ?మీ వారు వున్నప్పుడు అన్నయ్యా  లేనప్పుడు స్నేహితుడా?
ఎహే నోర్ముసుకో నాకు మూడ్ వునప్పుడు స్నేహితుడు లేనప్పుడు అన్నయ్య  . అయినా నీ లాగ సిగ్నల్ దగ్గర అమ్మాయిల్ని చూసుకుంటూ సొంగ కార్చుకునే రకం మాత్రం కాదులే .
 నేను సిగ్నల్ దగ్గర సొంగ కార్చు కోవడం ఏంటి?
ఆమె తన ఐ ఫోన్ లో ఎవరో అమ్మాయి పేస్ బుక్ లో నేను కార్ లో సిగ్నల్ దగ్గర పళ్ళు యికిలిస్తున్న ఫోటో  పెదాల నుంచి సొంగ కారు తునట్టు గా వున్నది చూపించింది . ఆ ఫోటో కింద సిగ్నల్ పడినా అమ్మాయిని చూస్తూ ముందుకు పోక ట్రాఫిక్ జాం చేసిన సొంగబాబు అని రాసి వున్ది. దానికి అప్పుడే ముప్పై లైక్స్ . కిందేమో ఇలాంటి ఎదవలు అన్ని చోట్లా వుంటారు . వీళ్ళ కళ్ళకి గుర్రానికి కట్టినట్టు కడితే పక్క చూపులు చూడరు అంటూ కామెంట్స్ .
నాకు నవ్వాలో ఏడవాలో తెలిలేదు . ఆమె అంతట ఆమె నవ్వి నా ఫోటో తీసేసుకుని దానికి చక్కగా సొంగ తగిలించి బైక్ మిద నుంచే పేస్ బుక్ లో పోస్ట్ చేసేసుకుని తమాషా చుస్తొన్ది. అది ట్రేండింగ్ లో చూసేసి సుధా అప్పుడే రెచ్చి పోతోంది . ఏవిటి ఈ విపరీత ధోరణి ?మగాడికి రక్షణ లేకుండా పోతోంది ఆదునిక యుగం లో . యింతలో నా సెల్ మోగింది . ఎవరోఆడ   గొంతు .'' నేను ఇన్స్పెక్టర్ రాగిణి మాట్లాడుతున్నా షి  టీం కెల్లి నువ్వు జరా నీ కార్ దగ్గరకైతే రా సిగ్నల్ దగ్గర పోరిలకి బీట్ కొడతావ్? అయిదు నిమిషాల్లో రాకుంటే నీ ఆడి యెడ వుంటాదో  ఎరుకనా ?''
''ఆడనే వుండక్కా గిప్పుడే వస్తున్నా మస్తు పైసల్ తోని'' అని సెల్ పెట్టేసి నా బాచ్ మేట్ ఎస్పీ శిఫాలి కి ఫోన్ చేసి  విషయం అంతా చెప్పా . ఆమె నవ్వుని ఆపుకుంటూ మా వాళ్ళు చివరికి నిన్ను కూడా  వదలటం లేదన్న మాట సరే నువ్వు కార్ దగ్గరికి వెళ్ళు అని అభయం యిచ్చింది . అప్పటికే కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చి'' జల్ది పదివేలు యిచ్చి కేసు లేకుండా చూసుకోరి మాడం కేసు రాస్తే ఖేల్ ఖాతం'' అంటున్నాడు .
యింతలో షకీలా లా వున్న రాగిణి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ఎవరో అమ్మాయిని నా కాళ్ళ మీద పడేసి ''సార్ కి మాఫ్ చెయ్యమని అడుగు పెద్ద ఆఫీసర్ ని గిట్లా బద్నాం చేసి ఫోటోలు పెడతావ్ నీ య .''. బూతుని మింగేసి బూట్ల మీదకి తోసింది . నేను ఆమెని ''ఛి ఛి ఎవరీమె ఇదేంటి ?'' అంటూ ఆమె కేసి చూసి షాక్ తిన్నా . ఆమె కొన్ని నిమిషాల క్రితం సిగ్నల్ దగ్గర బైక్ మీద కుర్చుని నవ్వినామే . పేస్ బుక్ లో నా ఫోటో ని పెట్టినామే .
''ఛి ఛి సిగ్గులేదు ఎందుకు చేసావి పని ''. (ప్రేమనగర్ లో నాగేశ్వర రావు స్టైల్లో  అడిగా ). ఆమె నన్ను చనువు గా జబ్బ పట్టుకుని పక్కకి తీసుకు వెళ్లి చెవిలో మెల్ల గా'' ఈ పోలీసులే డబ్బులకోసం యిలా చేయిస్తారు . మీరు కుడా గవర్నమంట్ లో పొజిషన్ లో వున్నారు కాబట్టి కధ  అడ్డం తిరిగింది . నాకు రెండువేలు బొక్క . వాళ్ళకి యెనిమిది.'' అంటూ చక చకా చీకటిలో కలిసి పొయిన్ది. దూరం గా కానిస్టేబుల్ నా కార్ డోర్ తీసి నిలబడి వున్నాడు . పైనుంచి సుధా వాళ్ళ ఆయన స్నేహితుడు వుర్ఫ్ అన్నయ్య భుజాలు భుజాలు రాసుకుంటూ మేడ  పైనుంచి చూస్తున్నారు .
షకీలా ఉరఫ్ రాగిణి మత్తు కళ్ళతో ఎస్పి గారికి చెప్పకండి సార్ మీకు దావత్ యిస్తాను అంటోంది .
కార్ స్టార్ట్ చేసుకుని యింటి ముఖం పట్టాను . సిగ్నల్ రెడ్ చూపిస్తోంది . పక్కన బైక్ ఆగింది . మనసు ఎవరో నన్ను చూసి నవ్వుతునట్టుగా చెబుతోంది . అయినా నా కళ్ళు మాత్రం రెడ్ మీదే గ్రీన్ కోసం ఆత్రం గా. పక్క కార్ వాడిని ఆమె సెల్ లో భందించడం నా దృష్టిని దాటి పోలేదు . రెడ్ సిగ్నల్ నిజం గా రెడ్ సిగ్నల్.


28 సెప్టెం, 2014

అదే రాగం అదే రోగం

 

ఆ రోజు నువ్వు అందరి ముందు చేసిన ఘోరమైన అవమానం తో యిన్నాళ్ళ భంధం ముగిసింది ,యింక నేను స్వేచ్చా జీవిని  అనుకుంటూ బయట కొచ్చా . కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టి నట్టు గా వున్ది. నా సెల్లు  యిదివరకులా బిజీ టోన్  రావడం లెదు. అందరికి అందుబాటులోకి వచ్చేసా . అందరి ముందు నువ్వు చేసిన అవమానం గుర్తుకు వచ్చినప్పుడల్లా నీ మీద అసహ్యం ,కసి పెరిగి నీ ఆలోచనల్ని నా బుర్రలోంచి చెరిపేసి పదిరోజులు అప్పుడే గడిపేసా . యింక ఎప్పటికి నువ్వు నా డైరీ లో వొక పాత పేజి గా నే వుండి  పోతావని బలంగా నమ్మా . ఎప్పటిలాగే వాకింగ్ కి వెళుతూ మీ యింటి ముందు చూస్తే  యింటికి తాళం . కార్ కూడా   లేదు . అంటే యింత అవమానం చేసినందుకు నీలో యింత కూడా పశ్చాతాపం లేదనీ , నువ్వు కుటుంబ సబ్యులతో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి మీ వూరు వెళ్లి పోయావని అర్ధం అయ్యిన్ది. అసలు ఆ సంఘటన జరిగిన వెంటనే నువ్వు సారీ చెపుతూ ఫోన్ చేస్తావని ఆశించడం లోనే నేను నిన్ను యెంత గుడ్డి గా నమ్మానో అర్ధం అయ్యిన్ది. అమలిన  మైన ప్రేమ  అంటే అడిగిన వెంటనే అన్ని అవసరాలు తీర్చేసి ,మూసుకు  కూర్చుని  అనవసర వ్యక్తుల గురిచి గాని, వారు ఎందుకు వస్తున్నారని గాని, ఆరా తియ్యకుండా ఉండడమే అని కొత్త నిర్వచనం తెలియ జెసావు. రోజు కనీసం వొక అరగంట అయినా ప్రత్యక్షం గా కలిసి మాట్లాడ కుండా  ఉండలేని ఈ దౌర్భాగ్యపు అలవాటు నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా . సెల్ ఎప్పుడు మోగినా నీదేనేమో అన్న బ్రమలోంచి వాస్తవం లోకి వస్తున్నా. నీ ఆలోచనల మద్య పనులు  అన్యమనస్కం గా నే చేసుకుంటుంటే ,నీ పనుల మద్య కూడా  మాటవరసకి నేను గుర్తు రానప్పుడే నా కర్దమయ్యిన్ది. నీదొక బిజినెస్స్ డీల్ అని. అక్కడ పాత్రలు అవే వుంటాయి పాత్ర దారులు మారుతూ కాల  గర్భం  లో కలిసి పొతారు. నువ్వు మాత్రం నిరంతరం సాగి పోయే వైతరణి నదిలా మరింత పాపుల్ని జమ చేసుకుంటూ వుంటావు . నీకు చీమ కుట్టినట్టు కుడా వుండదు . నా కంటే ముందు అయిదుగురు యిదే బాట పట్టారని తెలిసినప్పుడు కూడా ఛ ఛా  నిజమైన ప్రేమ వోదిడుడుకుల్ని తట్టుకుని నిలబడుతుందని అనుకున్నా. అసలు అక్కడ వున్నది ప్రేమ కాదు బిజినెస్స్ అన్నాక చివరికి ఎవరి కైనా అదే గతి కదా. ఈ మనసు ఎందుకు అది తెలుసు కోక  వ్యాకులత పడుతోంది? ఏదో ఆశ . వొక చిన్న ఫోన్ కాల్ ఈ బాధని పోగొట్టేసి ఎడారి లో వసంతం తీసుకు వస్తున్దని. వొక వేళ వచ్చినా మళ్ళి  నాలుగు రోజులు పోయాక  నీ బిజినెస్స్ డీల్స్ చూసి మనసు తట్టుగో గలదా?
 ఛి ఛి ఈ పెంట ఆలోచనల్ని దూరం గా పెట్టి బుద్దిని ఆద్యాత్మికంగా సక్రమ మైనా మార్గం లో పెట్టాలి అనుకుంటూ భక్తీ ఛానల్ పెట్టా . అందులో వొక ప్రముఖ ప్రవచన బ్రహ్మ ని మక్కి కి మక్కి కాపి కొట్టి తన ఆదాయ మార్గానికి వెసులు బాటు కల్పించు కోవాలని మాగంటి భోగేశ్వర రావు(గురువు గారు చాగంటివారికీ  కిక్షమాప్పనల తో))  అనే ఆయన ఖర్మ పునర్జన్మ అనే విషయం మీద ప్రవచిస్తున్నరు. ఒరిజినల్ బ్రహ్మ గారు  చెప్పిన దాన్నీ అచ్చులు హల్లులు మార్చి లైవ్ లో మేనేజ్ చెస్తున్నరు. అధర్మ బద్దమైన వాటి నీడ కూడా  మన మీద పడ కూడదు . పర స్త్రీ వ్యామోహం లో పడి ,జీవిత చరమాంకం లో భార్య పిల్లల చేత కూడా  అసహ్యించు  కో బడి ,యింకా కూడా  ఆ పర స్త్రీ మీదా వ్యామోహం పోకా వచ్చే జన్మ లో ఆమె యింటి కుక్కా గా పుడతాడు . యింతలో ఆయన చెబుతూ చెబుతూ తోడ మీదా గట్టి గా చరుచుకున్నారు . అంతే '' ఎంట్రా భోగు యింకా రాలేదే?నాలుగు ఊర్లలో ప్రవచనాలు అయ్యాక బోల్డు బట్టలు నగలు పట్టుకుని   దసరా కి మా యింటికి వస్తానన్నావు గా? రా రా '' లైవ్ లో ఎవరో ఆడ గొన్తు. అరె ఎక్కడో విన్న గొంతులా వుందే  అనుకుంటున్నా . మాగంటి వారు కంగారు పడుతూ యిలా కుడా ఆడవాళ్లు కైపు గా మాట్లాడినా మనం నిబ్బరం గా వుండాలి అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ జేబులో వున్నా సెల్ ఫోన్ ని ఆప దానికి ప్రయత్నం చేస్తున్నాడు . యింతలో మళ్ళి '' హోయి హోయి దీనికే కైపు అంటే మరి రేపు ఇక్కడికి వచ్చాక యింకేమంటావురా '' ?ఆప కుండా అదే తెలిసిన గొంతు సెల్ ఫోన్ లో
యింక భోగేశ్వర రావు మంచి నీళ్ళు  తాగే మిష తో తెర  వెనకకి పోయి'' నీ యమ్మ కడుపు మాడా .  యింత దాకా నాకింది చాల దుటే ?ప్రతి వూరి లో పెంట తీసుకు వచ్చి నీ వొడిలో పోయ్యాలా?నోరుమూసుకుని పెట్టు అవతల లైవ్ ప్రోగ్రాం ''అంటూ  మూతి తుడుచుకుంటూ మళ్ళి  కెమెరా ముందుకు వచ్చారు .  నా మనసు మాత్రం ఆ గొంతు మీదే వుంది ఎక్కడో బాగా పరిచయం వున్నా గొంతే . యింతలో నా సెల్ మోగింది మా కజిన్ నీ అర్జెంటు గా హాస్పిటల్ లో అయిసియు లో పెట్టారంటే అకడకి పరిగెత్తా. వాడికి ఆక్సిజెన్ పెడుతుంటే వాడి సెల్ యితర వస్తువులు నాకిచ్చారు పట్టుకొమ్మని . యింతలో వాడి సెల్ మోగింది . ''యిష్టమైన కష్టం '' అని డిస్ప్లేకని  పిస్తోంది . వాళ్ళ వైఫ్ అయి ఉంటుందనుకుని ఎత్తా . నేను హలో అనకుండానే అవతల నుంచి ''ఎరా దసరా కి సరదా గా గడుపుదాము బోల్డు బట్టలు నగలు తెస్తనన్నావు గా రా రా . నీ కోసం యిక్కడ పరదాలు తీసి సరదాలు ఎదురు చూస్తున్నాయి ''
మళ్ళి  నిందాకా మాగంటి మైక్ లో వినిపించిన వాయిస్.  నాకు బాగా చిర పరిచితమై చితిమంటల దాక తీసుకు వెళ్ళిన వాయిస్ . యింకోకడ్ని వైతరణి  నదిలో ముంచడానికి అయి సి యు దాక తీసుకు వచ్చిన వాయిస్ . ఎస్ అదే నా తాజా మాజీ ప్రేమికురాలి వాయిస్ . అంటే వొక్క రోజు నాతొ కూడా  మా కజిన్ వచ్చి పది నిముషాలు కుర్చుని మజ్జిగ తాగిన పాపానికి నాకు తెలీకుండానే వాణ్ణి  కూడా  ముగ్గు లోకి దింపి రగ్గు కప్పిందన్న మాట (అయి సి యు లో అని కవి భావం ). నేను సెల్ కట్ చేశా డాక్టర్ వచ్చి పెదవి విరిచేశాడు . లాభం లేదండి మా ప్రయత్నాలు మేము యెంత చేసినా అయన స్పందించటం లెదు. మీరు ఆఖరి సారి ఏమన్నా చెప్పాలంటే చెప్పు కొండి అన్నాడు . యింతలో అతని సెల్ మోగడం తొందర లో అతని స్పీకర్ ఆన్ అవడం వొకే సారి  జరిగాయి . ''ఎరా డాక్టర్ ఎప్పుడు ఆ రోగుల గోలేనా ?ఈ భోగుల గోల కూడా  చూడరా.  రా రా . . డైమండ్ సెట్ తొక్కా అన్నావు'' . ఆదే  రాగం అదే రోగం . డాక్టర్ కంగారు గా ముందుకు సాగి పోయి శూన్యం  లో కలిసి పోయాడు . నేను అయి సి యు లో మా కజిన్ దగ్గరకి వెళ్లి చెవిలో వోరేయి నీ'' యిష్ట  మైన కష్టం'' యిప్పుడే చచ్చి పోయిందని కబురొచ్చిన్ది. అన్నా.  అంతే  అతని లో మళ్లి  అతని అవయవాలు అన్ని  జవసత్వాలు పుంజుకుని స్పందించడం ప్రారం భించాయి. డాక్టర్లు ఆశ్చర్యం తో నోర్లు వెల్ల బెట్టారు . ఆ తారక మంత్రం ఏమిటో చెప్పు బాబు వొక డాక్టర్ అడిగాడు .  అదే రాగం అదే రోగం మంత్రం మాత్రం రహస్యం అంటూ నా కార్ వైపు వడి వ డి  గా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నా . యింతలో సెల్ మోగింది . అపరిచిత నెంబర్(ఆమెది డిలీట్ చేసేసాగా). ఎత్త  గానే రా రా అంటూ అదే రాగం . మీరు డైలు  చేసిన నెంబర్ ఎప్పటికి మీ సెల్ యెత్తదు . అంటూ కట్ చేశా . ''ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరు సుఖ పడాలి సుఖ రోగాల బారిన పడకనా'' ఏదో కే ఎస్ ప్రకటన అనుకుంటా ఎఫ్ ఏం రేడియో లో . (సర్వే జనా సుఖినో భవంతు )