20 ఫిబ్ర, 2011

చిమట మ్యూజిక్ ఫంక్షన్ అదరహో

ఈ రోజు సాయంత్రం నిజం గా మరువలేని రోజు .నాకిష్టమైన పాటలు www.chimatamusic.comనుండి ఆస్వాదించే నేను ఈ రోజు ప్రత్యక్షం గా అందులోని పాటల్ని ప్రముఖ గాయని గాయకులూ ఆహుతుల సమక్షం లో పాడుతుంటే ,ఆ ఆహుతుల్లో మహామహులైన జానకి ,ఎస్ పీ బి ,లావుబలసరస్వతి ,శోభానాయుడు ,తనికెళ్ళ భరణి ,సి నారాయణరెడ్డి ,వంటి పెద్దల వెనకాలే కూర్చుని ఆస్వాదించడం మరిచి పోలేని అనుభూతి .ఝుమ్మంది నాదం కార్యక్రమం సరిగ్గా సాయంత్రం అయిదు గంటల యిరవై నిమిషాలకి మిత్ర గారు పాడిన ఘనా ఘన సుందర తో మొదలయ్యింది .అప్పటికే ముందు రోలు అన్ని నిండి పోయాయి .కార్యక్రమం మొదలైన కొద్ది సేపటికే హాలంతా నిండి పోయి మేడ పైన కూడా జనాలు కూర్చున్నారు .యింత గొప్ప కార్యక్రమానికి ఆద్యుడైన చిమట శ్రీని ఎవరా అని నాలాంటి వారిలో ఉత్కంట .అయితే ఆయన మరీ వినమ్రత వల్ల కార్యక్రమం డైరెక్ట్ గా పాటల తో మొదలై పోయింది .కనీసం ఈ కార్యక్రమ నిర్వాహకులు వీరే అని సభా ముఖం గా పరిచయం చేస్తే నాలాంటి మౌన ఆరాధకులకి తెలిసేది యిన్నాళ్ళు మన మనసులో తన సైటు ద్వార మనసులు రంజింప చేస్తున మహోన్నత వ్యక్తీ ఇతనే అని .అయితే నేను పట్టు వదలని విక్రమార్కుడిలా అక్కడి వాళ్ళని గమనిస్తూ వీళ్ళల్లో ఎవరై ఉంటారా అని వుహిస్తున్నా . వొక వ్యక్తీ హడా విడి గా వచ్చిన
వి ఐ పీ లని స్వాగతిస్తూ కని పించారు .అతనేనేమో అనుకుంటే ఆయన సంగం అకాడమి అద్యక్షుడు అని తెలిసింది .యిక వుండ బట్టలేక ఎదురు గా కూర్చున్న వ్యక్తీ ని అడిగితె ఆయన బాలు గారి కి దగ్గర గా కూర్చున్న వ్యక్తీ ని చూపించారు .అక్కడ ఆయన అతిధులతో ముచ్చటిస్తూ బిజి గా వుండడం తో పరిచయ కార్య క్రమాన్ని వాయిదా వేసుకుని వాష్ రూం కి వెళ్ళా .ప్రపంచం లో ఎవరు యింత వరకు పరిచయం చేసుకొని అత్యద్బుతమైన వేదిక మీద మా యిద్దరి పరిచయం పక్క పక్కనే నిలబడి ప్రకృతి పిలుపు తో మమేకం చెందుతుంటే జరిగింది . అనుకోకుండా ఆయన వాష్ రూం లో కనబడితే మాట కలిపా ఆయన చాలా బిజి గా వుండడం తో మాట్లాడుతూనే పని కానిస్తుంటే నేను కూడా ఆ సమయాన్ని సద్వినియోగ పరుస్తూ ఆయనని అభినందిస్తూ నా విసిటింగ్ కార్డు జేబులో పెట్టా .డౌన్ టు ఎర్త్ మనిషి .
యింక కార్యక్రమానికి వస్తే మొత్తం యిరవై ఫుల్ పాటలు పదిహేను పల్లవులు వెరసి ముపై అయిదు మూడు గంటలు మూడు నిమిషాల లాగ గడిచి పోయాయి .తనివి తీరలేదే నా మనసు నిండా లేదే అంటూ అక్కడ పాడిన పాటనే అంతా మళ్ళి మళ్ళి పాడు కోవలసి వచ్చింది . ఏ దివిలో విరిసిన పారిజాతమో ,నిన్నటి దాక శిలనైనా ,మా వూళ్ళో వొక పడుచుంది ,కుశలమా నీకు కుశలమేనా ,చినుకులా రాలి , మబ్బే మసకేసింది లే ,యింకా ఎన్నో అద్బుతమైన పాటలు .బాలు గారు , జానకి గారు ప్రతీ పాటని ఆస్వాదిస్తూ తప్పట్లు కొట్టడం వాళ్ళ గొప్ప మనసుకి తార్కాణం . వాళిద్దరూ ఎంతో లీనమై పాటలు వింటూ అలనాటి జ్ఞాపకాలని వొకరి తో వొకరు పంచు కోవడం కూడా నేను గమనించాను .తనికెళ్ళ భరణి గారి శివ స్తోత్రం శాభాసురా శంకరా చాలా బాగా రాసి పాడారని ఆయన్ని ఎదురు గా అభిననదించడం గొప్ప అదృష్టం గా భావిస్తున్నా .అయితే శ్రీని గారు తన సైటు లో తనికెళ్ళ గారి శివ స్తోత్రం పెడతారని ఆశిస్తున్నా .గాయని విజయ లక్ష్మి భక్తీ పాట పాడుతునప్పుడు కూడా ఎల్ ఆర్ యిశ్వరి పాటకి వూగి నట్టు ఊగడం ఆవిడ నైజం అని సరి పెట్టు కోవాలేమో .
శోభ నాయుడు గారు పాటల మద్యలో అయిదు నిమిషాలు మాట్లాడుతూ శ్రీనివాసరావుగారి యింటికి అమెరికా లో వెళ్లి నప్పుడు ఆణువణువూ వాళ్ళింట్లో పాటలు వినిపిస్తూనే ఉంటాయని , వొక సారి కాలిఫోర్నియా లో కార్యక్రమ నిర్వాహకులు చేసిన నిర్వాకం వాళ్ళ మూడు రోజులు డబ్బు తిండి తిప్పలు లేకుండా వున్నా పరిస్తితులలో తన యింటికి ఆహ్వానించి కావలిసిన సాయం చేసారని కొని ఆడారు . అంతే కాదు ఎస్ పి బాలు గారు యింత గొప్ప అభిమాని ని పొందడం ఆయన చేసుకున్న అదృష్టం అన్నారు .
శ్రీని గారు ఈ కార్య క్రమానికి స్నేహితులను కూడా తీసుకు రమ్మనడం తో నో , ఎలాగు కారు లో వొక్క డమే పోతున్నాము కదా అని యింకో బ్లాగు మిత్రురాల్ని వస్తారా అంటే ఆమె సకుటుంబ పరి వారం గా వచ్చారు , అక్కడ తన ఊరైన పిడుగురాళ్ళ దగ్గర శాంతినగర్ వాసుల్ని కని ఉబ్బి తబ్బిబ్బు అయి పోయారు . అయితే వాళ్ళ అబ్బాయికి ఈ పాత పాటలు నచ్చక వెళ్ళిన అరగంటకే పోదాంపోదాం అనడం తో నా గుండె ఘుభేల్ మంది .ఆ నస కాస్తా పాటలు అయి పోయి పుస్తకావిష్కరణ సమయానికి పరా కష్ట కి చేరు కోవడం తో గతి లేని పరిస్తుతలలో తిరుగు ముఖం పట్టవలసి వచ్చింది . అందు చేత వక్తలు శ్రీని గారి గురించి , ఆ పుస్తకం లోని ఆ పాత మధురాల సంగీత దర్శకుల గురించి ఏం చెప్పారో వినే భాగ్యం మాత్రం దక్కలేదు .మొత్తానికి యిది వొక మరుపు రాని మధురమైన గొప్ప అనుభూతి అన్ని విధాల .

అప్పల్రాజుకు అప్పులేసిని జనాల కధలతో తీసిన సినిమాల్లో హిట్టయినవి కంటే ఫట్ అయినవే ఎక్కువ .సీతామహాలక్ష్మి ,సిరిసిరిమువ్వ ,శివరంజని , బంగారుబాబు వంటి హిట్ సినిమాలలో కధలో భాగంగా సిని జీవితాన్ని చూపిస్తే అవుట్ అండ్ అవుట్ మొత్తం సినిమా వాళ్ళ కధే అయిన నేనింతే వంటివి బాక్స్ ఆఫీసు వద్ద ఫల్టిలు కొట్టడం తెలిసిందే . ఆ కోవకే చెందిన మరో సినిమా వాళ్ళ కధ అప్పలరాజు ది .సిని వర్గాలలో వారికి నిత్యం పరిచయం అయిన విషయాలనే కధ లో చూపించారు . అయితే సామాన్య ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే విషయాలు లేక పోవడం తో సినిమా వాళ్ళ లోటు పాటులు , అక్కడ వుండే కుళ్ళు రాజకీయాలు తెలిపే డాక్యుమెంటరి గా సినిమా వుంది .అమలాపురం లో రంభ టాకీసు లో సినిమాలు క్రమం తప్పకుండా చూస్తూ స్నేహితులతో వాటిలోని లోటు పాటులు చర్చిస్తూ ఎప్పటికన్నా ప్రముఖ డైరెక్టర్ అయిపోవాలని నాయకి అనే కాదని రాసుకుని చాన్సుల కోసం హైదరాబాద్ వచ్చేసిన అప్పలరాజు కధే సినిమా .ఫైనన్సర్ నుంచి , హీరో దాక ప్రతి వాడు కధ లో వేలు పెట్టి తను తీద్దామనుకున్న ట్రాజడి కధని చివరికి కామెడి గా మార్చేస్తే అచేతనుడై చూడడం అప్పలరాజు వంతు అవుతుంది . అయితే ఆ సినిమాకే గుర్రం అవార్డు (నంది కి పారడి ) వస్తుంది ఆఖర్న .దిల్రాజు మీద వొంటికన్ను గవర్రాజు పాత్ర ద్వారా సెట్టైర్లు బానే పేల్చారు .మొత్తం డిస్త్రిబుషణ్ అంతా చేతిలో పెట్టుకుని నెలలు నెలలు తీసిన సినిమాని పదినిమిషాలు చూసి హిట్తో ఫట్టో తేల్చేసి తోచిన డబ్బులు యిచ్చి నిర్మాతలని ముంచుతాడని చెప్పించి వేరే పాత్రతో వీడేమన్న ఆంధ్ర ప్రేక్షకుల ప్రతినిదా అని తిట్టించారు . దైవజ్న శర్మ సిని పేర్లతో సినిమా భవితవ్యం తేలుతుందని అప్పప్పల రాజు అని పేరు మార్చుకుంటే వంద రోజులు గారంటి అని చెప్పే మూడ నమ్మకాలని కూడా చూపించారు .మెకానిక్ కే సైకిల్ చైన్ యిప్పడానికి పది నిమిషాలు పడితే శివ సినిమాలో పది సెకండ్స్ లో నాగార్జున చేత్తో సైకిల్ చైన్ పీకడం వెనక రాం గోపాల్ వర్మ లాజిక్ అర్ధం కాక అప్పటి నుంచి సినిమాలు చూడడం మానేసాను అని యింకో పాత్ర తో చెప్పించారు .అనుష్క నాగార్జున ఎఫ్ఫైర్ ,సినిమా తియ్యడం లో దాన్ని ప్రోమోట్ చెయ్యడం లో సినిమా వాళ్ళు చేసే ట్రిక్కులు వంటి అంతర్గత విషయాలు కూడా చూపించారు .నో బ్రెయిన్ (ఐడియల్ బ్రెయిన్ డాట్ కం ) వంటి వెబ్ సైట్స్ డబ్బులు తీసుకుని స్టార్ రే టింగ్స్ యివ్వడం సినిమా చూడ కుండానే దాని గురించి సమీక్షలు రాయడం వంటి వి కూడా వున్నాయి . మొత్తానికి ఈ సినిమా సినిమా వాళ్ళకోసం సినిమా వాళ్ళకే అర్ధం అయ్యే సినిమా వాళ్ళ సినిమా .