31 అక్టో, 2008

ఇలా ఉండి ఉంటే?

పొద్దున్నే traffic లో మెల్లిగా కదులుతోంది నా కార్ ఇంతలొ సిగ్నల్ గ్రీన్ పడడం తో ఊపు అందుకుంది. నా ముందు RTCబస్ దాని ముందు ఓ స్కూటరిస్ట్, రెడ్ పడడం తో స్చూటేరిస్ట్ తన బండి sincere గా ఆపేసాడు కానీ బస్ డ్రైవర్ దాట్టేద్దమన్న తాపత్రయం లో scooterist ని డీ కొట్టేసాడు. బస్ చక్రాలు అతని తల మీదనుంచి వెళ్లి పోయి రోడ్ అంతా రక్తమయం. నా కళ్ళముందే జరిగిన ఈ సంఘటన నుంచి తేరుకునే లోపు ఇంకో అద్బుతం జరిగింది.రక్తపు మడుగు లోంచి ఆ వ్యక్తీ మాములు గా లేచి దుమ్ము దులుపుకుని RTCడ్రైవర్ తో ఏంటయ్యా సిగ్నల్ పడినప్పుడు చూసుకుని ఆపొచ్చు గా ఎందుకంత తొందర అంటే సారీ బాబు తప్పయి పోయింది అంటున్నాడు డ్రైవర్.నా కళ్ళని నేనే నమ్మలేక పోతున్న.ఇంకొంచెం దూరం వెళ్ళానో లేదో ఒక వ్యక్తిని ఎవరో గుండాల లా వున్నారు కత్తులు పట్టుకుని తరుముతూ గుండెల్లో పొడిచేసి తాపి గా నడుచు కుంటూ వెళ్లి పోయారు. రక్తపు మడుగులో పడి పోఇన ఆ వ్యక్తీ కూడా తాపి గా లేచి ప్యాంటు షర్టు దులుపుకుని వెళ్లి పోయాడు.నేను వెంటనే tv9 వాళ్ళకి ఫోనే చేశా విషయం చెపుదామని వాళ్ళు మీరు మా స్క్రోల్లింగ్ చూడటం లేదా తిరుమల గర్భ గుడి లోంచి మాటలు వినిపిస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి మానవులేవ్వరు కూడా 80 ఏళ్ళు వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో చావరని వరమిచ్చేసారు అన్తే కాదు ప్రపంచం లో నేర ప్రవుర్తిని ప్రరదోలడానికి ఇక నుంచి ఆడ మగ ఎవరికైనా సెక్స్ కొరికలు కేవలం 25 నుంచి ముప్పయ్ ఏళ్ళ మధ్యలోనే అదికూడా కేవలం భార్య భర్తా మద్య మాత్రమే కలిగేలా వరం ?(శాపం) ఇచ్చేసారు అని ఫోనే పెట్టేసాడు.ఆఫీసు కి వెళ్ళానో లేదో మా బాస్ రూమ్ లోంచి మంద్రం గా గాయత్రీ మంత్రం వినిపిస్తోంది. అదేంటి ఎప్పుడు పోర్నో సైట్స్ బ్రౌస్ చేస్తూ వుండే బాస్ ఆలోచిస్తూ అడుగు పెట్టగానే pl కం ఇన్ రండి కూర్చోండి అంటు ఇంటర్కం లో తన స్తేనో గాయత్రీ ని పిలిచి ఒక్కసారి రాగలరా అంటు మర్యాదగా పిలిచాడు. అసలు మా బాస్ ఆడవాళ్ళని ఎప్పుడు వెటకారం గా పిలవడమే గానిఅందులో తన స్తేనో ని ఏంటి రాత్రి అంటు పిలిచేవాడు ఆమె excuseme సర్ అంటే ఐ mean ఏంటి గాయత్రీ అనబొఇ అంటు వెకిలిగా మాటల్డే ఆయనే ఈయన? గాయత్రీ లోపలికి రాగానే అమ్మ గాయత్రీ ఇకనుంచి నా ఛాంబర్ తలుపులు ఓపెన్ చేసే పెట్టండి ఆడ అయిన మగ అయిన ఇక నుంచి నాకు సమానమే ఎవరైనా ఎప్పుడైనా రావొచ్చు secrecy ఏమి అవసరం లేదు ఆఫీసు టైం అయిపోగానే వెంటనే వెళ్లి పోవచ్చు ఇక నుంచి నో లేట్ నైట్ dictations.స్వామి ఏంటి నీ లీల నిజమేనా ఇక అందరు 80 దాక గుండె జబ్బులు కాన్సర్ లు షుగర్ లు bp లు ఏమి లేకుండా ఇంతలొ బాస్ రూమ్ లో టీవీ లో హైదరాబాద్ నాంపల్లి లో బొంబ్లాస్ట్ ఆ దృశ్యాలు లైవ్ లో coverage చేస్తూ మా ప్రతినిధి జాకీర్ ఓవర్ to జాకీర్.ఇక్కడ దృశ్యాలు భయంకరం గా వున్నాయి నా వెనకనే విడిపోయిన శరీర భాగాలు ఎక్కడ పడితే అక్కడ అంటు చెప్పుకు పోతున్నాడు అతని వెనక జనం అవయవ భాగాలు మళ్ళి అతుక్కు పాయి ఎవరి మానాన్న వాళ్ళు వెళ్లి పోతున్నారు, నాకు నోట మాట రాలేదు అంటే స్వామి ,రోగాలే కాకా కత్తులు బాంబులు కూడా ఏవి చెయ్యలేవన్న మాట.ప్రపంచం తీరు తెన్నులే మరిపోఇన క్షణం .స్వామి కల్కిఅవతారం ఎత్తేలోపు ప్రపంచం నాశనం అయిపోతుందని ఈ నిర్ణయం తిసుకున్నాడ?. ఇంకెక్కడా పేపర్ లో మానభంగాలు ,murder లు ఆటన్కవాదుల విద్వాంసాలు, అంటు భూతద్దం పెట్టి వెతికినా కనబడవ్. టీవీ లో క్రైమ్ టైం షో లు ఉండవ్. అంటే స్వామి మనిషి సోమరి పోతుల ఉండకుండా పనిచెయ్యడం కోసం ఆకలి దప్పికలు నొప్పి బాధ అలాగే వుంచి లైఫ్ కి guarentee ఇచ్చాడు , అలాగే సమాజం లో ఆడవాళ్ళ బద్రత కోసం సెక్స్ నీ restrict చేసి పడేసాడు. గోవింద నీ లీలలు అమోఘం అద్బుతం .గోవింద ,గోవింద ,రవి ,రవి ,ఇదేంటి గోవింద శబ్దం లో రవి మల్లి రవి రవి ఒక్కసారి వొళ్ళంతా కుదిపిన భావన ఏంటి ఆఫీసు కి టైం అవుతుంటే ఈ మొద్దు నిద్ర మాశ్రీమతి పిలుపు, అంటే ఇంతసేపు నేను చూసింది కల?అయ్యో ప్రపంచం ఇలా వుండి వుంటే?

26 అక్టో, 2008

దీపావళి కి డబ్బు తగలెయ్యడం అవసరమా?

దీపావళి ఒక్కరోజు వెలిగించే డబ్బు తో కాశి లో ఉన్నా వాళ్ళందరికీ సంవస్తరం మొత్తం ఉచితం గ విందు భోజనం పెట్తోచుట.అంటే కాశి లోనేనా వేరే వుల్లో పెట్ట లేమా అంటే కాశి లో జటరగ్ని అన్నపూర్ణ వల్ల నార్మల్ గ వుంటుందని దాన్ని ప్రామాణికం గ తీసు కోవడం జరిగింది. ఇంతకీ అసలు పాయింట్ కి వస్తే మనం చినప్పతి నుంచి ఏ కోణం లో దేన్నైనా చూస్తా మో అదే అలవాటు అవుతుంది.మా నాన్నగారు దీపావళి కి ముందే మీరు టపాసులు కొనుక్కుంతనంటే ఇచ్చేదనికన్న ఆ డబ్బులు దాచుకుంతనంటే రెట్టింపు ఇస్తా ననేవారు.ఒక్క రోజు temptation ని తట్టుకుంటే మీ చేతి లో బోల్డు డబ్బు దాంతో మీరు మంచి వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్పేవారు.నేను అప్పట్లో స్థిత ప్రజునున్ని కాబట్టి ఆ రాత్రి నిభాయించు కోవడం తో తెల్లారి నా దగ్గర బోల్డు డబ్బు వుండేది. తమ్ముడు , చెల్లి టపాసుల రూపం లో తగలేసుకోవడం తో బిక్కం మొహం వేసుకుని దీపావళి తర్వాత రోజు నుంచి నా చుట్టూ తిరిగే వారు, అన్నా ఏదన్నా కొని పెట్టారా అని. ఆ ఆననందమే వేరు, దిబ్బు దిబ్బు దీపావళి మల్లి వచ్చే నాగుల చవితి అని దివితిని నెల మీద కొట్టి తీపి తిని దేవుడి ముందు ప్రమిదలు అమ్మ వెలిగిస్తూ ఉంటే అరుగు మీద పెట్టడం.అదే అలవాటు మా పిల్లలకి చెయ్యడం తో ఈ దీపావళి కి మా అబ్బాయి కి టపాసుల బదులు సోనీ ప్లే స్టేషన్ (7000)కొన్నా కిలం వదిలినా ఫలం దక్కిందని సంతో శిస్తుంటే వాళ్ళ మమ్మీ ఆఫీసు నుంచి వస్తు 5000 టపాసులు తెచ్చేసిన్డి దీపావళి రోజు calculations వుండకూడదని .లోకో భిన్న రుచి అంటే ఇదేనేమో. పిల్లల కళ్ళలో ఆనందానికి వెల కట్టలేం అంటుంటే ఆ ఆనందం నా సోనీ వల్ల? తను తెచ్చిన క్రాకెర్స్ వల్ల?

24 అక్టో, 2008

బకరా

బకరా
ఓ చెలి నీ కటాక్ష విక్షానాల కోసం బైక్ లో పెట్రోల్ తగలేసి నీ కాలేజీ bus పక్కన ప్రాణాలు పణంగా పెట్టి కట్ లు కొట్టి lov లెటర్ నీ చేతిలో పెట్టి నీకు దాహం వేసినప్పుడు కొబ్బరి బొండం కొనిపెట్టి అది తాగక ఇంక దాహం అంటే కూల్ డ్రింక్ తెచ్చి పెట్టి హోటల్ కి వెళ్ళినప్పుడు బిల్లు వచ్చే టైం కి నువ్వు washbasin కి పోఇన ప్రతిసారీ బిల్లు కట్టి మాల్స్ లో మరిన్ని కొనిపెట్టి నువ్వు వేరే వాళ్ళ బైక్ ఎక్కినప్పుడు కజిన్ అని నమ్మ బట్టి ఈ రోజు నువ్వు NRI పెళ్ళికొడుకు తో పెళ్లి అని చెప్ప బట్టి నాకు అర్దమయ్యిన్డి బకర అంటే ఏంటో.

21 అక్టో, 2008

కూడలి లో కాకా హోటల్

నిషిగంధ గారి బ్లాగ్ చూసి ప్రేరణ పొంది నేను కూడలి లో పాతిక రోజుల క్రితం ఒక కాకా హోటల్ పెట్టు కున్న.ఈ కూడలి లో ఒక పక్క నిషిగంధ, సుజాత , కొత్తపాళి ఇంక ఎందరో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ పెట్టుకుంటే అక్కడకి రోజు ఎంతొ మంది వచ్చి విందారగించి పోతున్నారు.కనీసం విన్దారగించాక కిళ్లీ కోసమన్నారాక పోతారా అని వాళ్ళ హోటల్ లో నా paradise పాన్ లాంటి అభిప్రాయాలూ వదిలి వెళ్తున్నా.ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా నా బ్లాగ్ దారి ఆటో ఇటో ఎటో వైపు.ఎవరన్నా రచయితా కి తన రచనల్ని చదివి సుచనలిచ్చేపాఠకులు దొరికితే ప్రసవ వేదన మర్చి పోయి బిడ్డను హత్తుకునే తల్లిలా మారి పోతాడు. అటువంటి పాఠకుల కోసం నిలువెల్ల కనులై ఈ రవి వేచేనులే.ఈ నాటి ఈ గరిబు కాకా పోడు నవాబు .అప్పుడు కాకా హోటల్ స్థానం లో నేను ఫివె స్టార్ హోటల్ పెట్టుకుంటా.ఆ రోజు వస్తుందంటావా గోపాలం శంకరాభరణం శంకర శాస్త్రి డైలాగ్ గుర్తు వస్తోంది.ఏమో ఏ కూడలి లో నో జల్లెడలోనో నా కాకా హోటల్ చూసి రుచి చూసి మళ్ళి మళ్ళి రాక పోతారా నా కాకా హోటల్ బాబాయి హోటల్ అంట ఫేమస్ కాక పోతుందా?

18 అక్టో, 2008

భవిష్యత్తులో భంధాలు

ఆధునిక సౌకర్యాలు పురాతన అనుభంధాలు రెండు కలిసి జీవిస్తే భవిష్యత్తు లో ఉండబోయే సంభాషణలకి వుహ రూపం ఈ కధనం.అన్నయ్య గారు ఎండన పడి వచ్చారు కొంచెం చల్లటి బీర్ తిసుకురమ్మన్తరెంతి?అబ్బే వద్దమ్మా ఇప్పుడే మీ వదిన ఇంట్లో ఇచ్చింది మళ్ళి ఏం తాగుతాను?వుర్కొండి అన్నయ్యగారు మీకు ఒకటే మొహమాటం పోనీ కొంచెం సోడా లో కలుపుకు తాగండి.నీ మొహం మండా సోడా లో బీర్ ఏవితే అక్కడ పెట్టి అఘోరించు మేము ఏదో వొకటి తాగుతాం నువెల్లి కొంచెం నంచుకోవడానికి ఆవకాయ తీసుకురా.ఏంట్రా విశేషాలు మీ అబ్బాయి కోడలు ఈ వారం అన్నా us నుంచి వెబ్ కాం లో మాట్లాడారా?ఏంటో ర మా అబ్బాయి పరిస్తితి తల్చుకుంటే చాల భాధ గ వుండి,మా కోడలు ఎప్పుడూ ఒరేయి రాం నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకునే రోజు ఎప్పుడూ రా అని ఒకటే నస ట.వారాంతపు సెలవల్లో కూడా వాణ్ణి ప్రశాంతం గ బతకనికుండా వయాగ్రా నువ్వు వేసుకుంటావా మా కొలీగ్ కి ఇచేయ్యమంటావా అంటే వాడు నీ దుంపతెగ ఇక్కడే ఇచ్చి చావ్వే మళ్ళి వాడేవడికో ఎందుకు ఇప్పుడున్న సంత చాలకనా అని చస్తున్నాడట అనుకో.యీ రోజుల్లో దేన్ని నమ్ముకోలెం ర ఒక్క మన బ్లాగ్ నీ తప్ప నే వుంటారా ఇంటికెళ్ళి నా బ్లాగ్ లో కృష్ణ రామ అంటు రాసుకోవాలి.

17 అక్టో, 2008

సెల్ సొల్లు

సెల్ వచ్చాక దిల్ ఖులాయించి భార్య భర్తలు మాట్లాడు కోవడానికి కూడా వీలు పడటం లేదు. ఇద్దరి అలసి పాయి ఆఫీసు నుంచి రాత్రి ఏ 8 గంటలకో ఇల్లు చేరు కుని ఇంటి విషయాలు మాట్లాడు కుందామని మొదలెట్టే లోపు ఎవరి సెల్లో మోగుట ఖాయం. పైగా అది ఏ బాస్ నుంచో కూడా వస్తుంది cug కనెక్షన్ వున్న సెల్ కాబట్టి బాస్ ఆఫీసు లో ఎక్కడ వదిలేసడో అక్కడే మొదలెట్టి ఒక గంట వాయించేస్తాడు. అది అవ్వగానే అమ్మో చెల్లో కొండొక చోట చెలో ఎవరో ఏరా ఎలా వున్నావ్ అంటు మొదలేట తారు మనం బిజీ గ వున్నాం అంటే రాత్రి 9గంటలకి ఏమి రాచ కార్యాలు వెలగ బెడుతున్నవురా అంటారు దాని కోసం ఇంకో అరగంట కేటాయించాలి.ఇవన్ని అయ్యే టైం కి టీవీ లో bigboss స్టార్ట్ అయి పోతుంది ఇంక డిన్నర్ చేస్తూ అ ప్రోగ్రాం అయ్యేటప్పటికి 11 ఆ పైన బ్లాగోపక్యనం తో కంప్యూటర్ ముందు కూర్చో కుండ పడుకోలేని జాడ్యం.ఇంకోసారి మనం ముందుగ అప్పాయింట్ మెంట్ తీసుకుని మరి సదరు వ్యక్తీ దగ్గరకి వెళితే అదే టైం లో అయన సెల్ మోగితే ఇంక అంతే సంగతులు. మీరు ఆయన తో ఏదన్నా పని వుండి వెళితే ఆ టైం లో సెల్ లో మాట్లాడిన వ్యక్తీ ఈయనగారి మూడు పాడు చేస్తే మీ పని అయినట్లే మల్లి కలుస్తాం అని వచ్చేయ్య వలసిందే. ఎత వాత చెప్పేదేమంటే ఎదురు గ మాట్లాడవలసిన వ్యక్తీ వున్నా మనం అతనితో మాట్లాడలేక పోవచ్చు అతను సెల్ లో బిజీ గ వుండడం వల్ల.ఎ సెల్ వచ్చాక సొల్లు కబుర్లు ఎక్కువై పోయాయి. మనం ఏంటో బిజీ గ వున్నా టైం లో ఏ గొట్టం గాదో చేసి నేను ఇప్పుడే hyd వచ్చాను ఇంకేంటి సంగతులు ప్రజారాజ్యం వస్తుందంతర అంటు కనీసం మనం బిజీ గ వున్నామా లేదా అని కూడా అడగ కుండ మాట్లాడేస్తూ ఉంటారు.ఇంక కార్ డ్రైవ్ చేస్తుంటే సెల్ మోగితే ఏం కొమ్పములుగుతోందో అని తీస్తే హలో ఆ సుబ్బారావు వట్టి తుస్సు ట్రింగ్ ట్రింగ్ అంటు బోర్ ట్యూన్ వినిపిస్తాడు మీకు పసందైన రింగ్ టోన్స్ కోసం కాల్ చెయ్యండి అంటు అద్వ్ట్ వినిపిస్తుంది.ఇలా చెప్పుకుంటూ పొతే చాల సొల్లు కబుర్లు చెప్పుకోవచ్చు సెల్ మిద మీ అనుభవాల కోసం కొన్ని వదిలేద్దామని ముగిస్తున్నా .

15 అక్టో, 2008

గుండె పోటు గుమ్మడి

పాత సినిమాల్లో గుమ్మడి కనిపిస్తే గుండె పోటు ఖాయం.అమ్మ నేనిక ఎంతొ సేపు బతకనమ్మ అంటు గుండె పట్టుకుని అరగంట సేపు డై లాగులు చెప్పి కానీ పోయేవారు కాదు.ఒక టైం లో గుమ్మడి శుభం టైటిల్ దాక వున్నా సినిమా ఒక్కటి కూడా వుండేది కాదు.. గుండె పోటుకు పర్యాయ పదం గుమ్మడి ఐ పోయారు.అప్పట్లో నవ్వుకోడానికి అది బానే వుండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఎపుడో అప్పుడు గుండె పట్టుకుని బబొఇ అంటు హాస్పిటల్ కి పరిగెత్తే వారే.. కాలం తెచ్చిన మార్పు ఏంటంటే అప్పట్లో గుండె పట్టుకుని అప్పగింతలు చేసుకుంటే ఇప్పుడు గుండెల్లో ఖలుక్కు మంటే అప్పు చేసి మరి కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించు కుంటున్నారు.ఒక విధం గ అది మంచిదే ఆయినా అవసరం వున్నా లేక పాయిన కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు బైపాస్ చేసేద్దాం అంటు గుండె కి కోటలు పెట్టేస్తున్నారు. ఒకసారి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాక బ్లాక్ వున్నాయి బైపాస్ చెయ్యాలి ఇంక మీ ఇష్టం అన్నాక ఎవరు గుండె దిటవు చేసుకుని చేయించు కోకుండా బయట కోస్తారు?ఇక అప్పటి నుంచి బతకడం కోసం నడవడం అని పొద్దున్న సాయంత్రం గుందేలవాసి పోయేలా నడకే నడక.అందుకని గుండెల్లో కలుక్కు మనగానే హాస్పిటల్ కి వెళ్ళడం అక్కడ వాళ్ళు angio చేద్దమనడం చేసాక పెదవి విరవడం గుండె కొయ్యడం .అలా అని గుమ్మడి లా జీవితాంతం గుండె పట్టుకుని బతకలేం గ.ఈ ప్రశ్న కి బదులేది?ఈ గుండె కి రక్షనేది?

9 అక్టో, 2008

ప్రతి రొజూ విజయదశమే

బ్లాగేర్స్ అందరికి విజయ దశమి శుభాకాంక్షలు.చెడు మీద మంచి సాధించే విజయమే విజయదశమి.ఛా మాకు తెలిదులే నువ్వు చెప్పేదాకా అనకండి.కొంచెం విశ్లేషిస్తే పుట్టుకతోనే మనిషి చెడ్డవాడు కాదు. అలాగే పొద్దున్నే లేవగానే పని గట్టుకుని ఎవడు చెడ్డపనులు చేసేద్దాం అనేమి డిసైడ్ అయి పొడు.అప్పటి కాల మాన పరిస్థితులను బట్టి చెడ్డ తలంపో మంచి తలం పో వస్తుంది.గుడిలో వచ్చిన భక్తీ భావం కోనేరు దగ్గర వుండదు.అప్పటి పరిస్తితి వేరు .భార్య పిల్లలు ఇంట్లో వుండగా పక్కింటి ప్రమీల వస్తే మాట్లాడిన సంస్కార పద్దతి లోనే తను ఒక్కడు వుండగా వచినప్పుడు కూడా వుంటుందా అంటేఅనుమానమే.కనీసం డ్రెస్ లో మీరు చాల అందం వున్నారు అన్న పొగడ్త అన్నా నోటి నుంచి జారు ఖాయం.మల్లి కాలింగ్ బెల్ మొగ గానే విజ్ఞత మేల్కొని వాళ్ళు బయటకేల్లరండి ఏమన్నా చెప్పాలా అని అడుగుతున్నా లోపల మిరే వచ్చారు మీరు మాట్లాడుకోండి అంటు అక్కడ నుంచి నిష్క్రమించడం కొంతలో కొంత చెడు మీద మంచి సాధించే విజయమే. ఏట వట చెప్పెదేమంతా నిరంతర మానసిక సంఘర్షణలో నెట్ result మంచి ఆలోచనయితే అప్పుడే విజయదశమి చెడ్డ తలంపు అయితే ఇంక విజయదశమి రానట్టే. అందు చేత మాన జీవితం లో ప్రతి రోజు విజయదషమే కావాలని అఖంక్షిస్తూ..

6 అక్టో, 2008

బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీరు

బ్రహ్మి కి పెళ్లై ఏడేళ్ళు అయిపోయింది అందుకే రిమ్మ తెగులు పుట్టింది.భార్యని పట్టించు కోడం మానేసి చాల రోజులై పోయింది.ఆమె కూడా అంతే ఎప్పుడూ laptop పెట్టుకుని తన పనేదో తాను చేసు కుంటూ ఉంటుంది. .బాబు చిన్నవాడు కావడం తో రాత్రి 8 కే నిద్ర పోతాడు. ఇంక బ్రహ్మి రాత్రి రెండు దాక నెట్ మిద పడి ఒకటే చాటింగ్,హిమాని అతని జీవితం లో ఒక నిశి రాత్రి నెటిజెన్ గ rediff chatలో పరిచయం అయి అక్కడి నుంచి యాహూ మెస్సెంగెర్ దాక ఎదిగింది.కానీ అంతకంటే ముందుకి పోలేక పోతున్నాడు ఫోనే నెంబర్ ఇవ్వదు.హైదరాబాద్ లోనే సాఫ్టువేరు ఇంజనీరు తనలాగే ఏ కంపెనీ నో తెలియదు.కానీ ఇద్దరి భావాలూ ఒకటే .భగవంతుడు యెంత అన్యాయం చేస్తుంటాడు,హిమాని ని తన జీవితం లో భార్య గా పెట్టకుండా ఆ పిచ్చి పార్వతిని పడేసాడు.హిమాని చాట్ లో యెంత రొమాంటిక్ గా వుంటుంది.గంటలు నిమిషాల్లా గడిచి పోతాయి.ఏమన్నా సరే తనిచ్చిన హింట్స్ తో రేపు saturday తనని కని pettali . tankbund కి మార్నింగ్ 11 కి వచ్చి 5 మినుట్స్ లో వెళ్లి పోతానని చెప్పింది అంతే అ 5 నిమిషాల లో నేను తానెవరో కని పెట్టి నే వెళ్లి మాట్లాడ గలగాలి.ఏంటో ఉత్సాహం తో నిద్ర పట్టడం లేదు బ్టహ్మికి.తన రెండు నెలల కృషి ఫలించే క్షణాలు దగ్గరి కొచ్చేశాయి.ఎన్నాళ్ళో వేచిన హృదయం దూరం గా రేడియో లో పాట.ట్యాంక్ బండ్ కి పదింటికే వచ్చేసాడు .వేమన విగ్రహం దగ్గర తిష్ట వేసాడు. తాను వస్తుందా వస్తే అందం గా వుంటుందా ఎక్కడకి తీసుకెళ్ళాలి ?ఏంటో ఇంట టెన్షన్ తన పెళ్లి చుపులప్పుడు కూడా ఇంట పద లేదు, ఖర్మ ఇప్పుదేవరన్న చుస్తే?అబ్బ అసలు ఎ వెదవ తెన్సిఒన్స్ లేకుండా నెట్ లో సరదాగా చాట్ చేసుకోవడం లో ఉన్నా హాయి యి రియాల్టీ షో లో లేదేమో అనిపిస్తోంది. కళ్ళ ముందు భార్య బాబు గుర్తో చ్చారు,ఛి వద్దు నే తప్పటడుగులు వెయ్యను బుడి బుడి అడుగులు వేస్తున్న నా బాబు సాక్షిగా అనుకుంటూ కళ్ళలో నిల్లు తుడుచుకుని వెనక్కి దిరిగి పోయాడు.ఆ రాత్రి తన పార్వతి ని దగ్గర గా తీసుకుని ప్రేమ గా మాట్లాడుతుంటే అబ్బ మీరు నెట్ లోనే కదన్దొఇ నిజ జీవితం లో కూడా ప్రేమ ముర్తులే మీ హిమాని సాక్షి గా అంటు పాతవాటి నవ్వుతోంది. అంతే తన పార్వాతే హిమాని .మనసు ఆనందం తో బరువెక్కింది బుడి బుడి అడుగుల బుజ్జిగాడు పడి పోకుండా మంచం ఎక్కుతున్నాడు.

4 అక్టో, 2008

వీసాల కధలు.

పిచ్చి కుదిరితేనే గని పెల్లవదు ,పెళ్లి అయితే గని పిచ్చి కుదరదు .జీవితం లో బాగా సెటిల్ అయితే గాని మంచి సంభందం దొరకదు ఆడ అయిన మగైనా. వయసు అయిపోతోందని జీవితం లో సెటిల్ అవకుండా పెళ్లి చేసుకుంటే నాన్న కొంచెం డబ్బులిస్తే మేము సినిమాకి వెళ్తాం లాంటి పరిస్తితి వస్తుంది.అయితే నేటి పోటి ప్రపంచం లో సెటిల్ అన్నా దానికి కొలమానం ?పెళ్ళికి ముందే ఒక ఫ్లాట్ ,కార్ మినిముం అయి పోయాయి .అవి సంపాయించడం లో వయసు ఆరోగ్యం రెండు కరిగి పోతున్నాయి.అందు చేత ఇదొక విష వలయం వీసాల కధలకి అది నిలయం.

హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.

ఈ మద్య తరచూ పేపర్ లో ఇంటర్నేషనల్ expo exibition fully airconditioned ఈ పేపర్ cutting తీసుకుని వస్తే ఎంట్రీ ఫ్రీ 50% discounts వగైరా లతో భారి advt వస్తున్నాయి . వాటి తో తస్మాత్ జాగర్త, న స్వీయ అనుభవం వివరిస్తా చదివాకా మీ నిర్ణయం మీరు తిసుకోగలరు.మొన్న oct 2 ఫ్యామిలీ తో ఇందిరాపార్క్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ice mega expo కి వెళ్ళాం,అక్కడ వారానికి 7 ధర్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ధర్నా చౌక్ అని పేరు.మీ కళ్ళ ముందు గమ్యం కని పిస్తున్న మీరు వెల్ల లేని పరిస్తితి.జై తొయ్యి అంటు అరుపులు baricades సో మీరు ఉసురంటు 2 km చుట్టూ తిరిగి ఎలా గో అలాగా ఎంట్రీ పాయింట్ కి రీచ్ అవుతారు ఇంక అక్కడ మీ కార్ పార్కింగ్ కోసం మీ వంతూ వచ్చే వరకు వెయిటింగ్ చేసి మీ డ్రైవింగ్ సామర్ద్యాన్ని బట్టి రెండు కార్ల ఇరుకైన సందు లోంచి scratches పడకుండా జాగర్త గ పార్కింగ్ చేసుకుని ఇంకో km నడిచి tkt కౌంటర్ కి వెళితే అక్కడ పేపర్ cutting పట్టు కొచ్చిన జనం తో కౌంటర్ వాడు ఈ cutting మద్యానం 1 గంట వరకే ఇప్పుడు tkt తీసుకోవాల్సిందే అంటదు, ఇంక అంతవరకు వచ్చాక ఎవరు వెనక్కి పోతారు సో rs 45 పెర్ హెడ్ పెట్టి tkt తీసుకుని లోపలికి వెళితే ఒక పక్క నే ac blowers పని చేస్తుంటే రెండో పక్క గాలి రాక ఒకటే సుఫ్ఫోకాషన్.హుమిదితి ఎక్కువై పోయింది.మా మామ గారు వునట్టుండి కుప్ప కూలి పోయారు.వెంటనే ౧౦౮ కి ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వాళ్ళు వచ్చి ఫిర్స్త్ ఎయిడ్ చేసి ఆక్సిజన్ పెట్టక తెప్పరిల్లరు. అక్కడనుంచి యశోద కి తీసి కెల్లా క వాళ్ళు అన్ని టెస్ట్ లు చేసి భారి గ బిల్లు వేసి ఇంకెప్పుడు అల జనాలు భారి గ వుండే గుడారాల లోకి వేల్లోద్దని వెళ్ళిన ప్రనపయము తప్పదని సెలవిచ్చారు .మాకు కీలము వదిలిన పిదప ఫలము దక్కినదని కాదు సంతోషించి ఇంక ఎప్పుడు ఇలాంటి ప్రకటనలకి మోస పోరాడని తెలుసుకున్తిమి గవిన చిట్టా గించ గలరు.

1 అక్టో, 2008

బకరా

ఓ చెలి నీ కటాక్ష విక్షానాల కోసం బైక్ లో పెట్రోల్ తగలేసి నీ కాలేజీ bus పక్కన ప్రాణాలు పణంగా పెట్టి కట్ లు కొట్టి lov లెటర్ నీ చేతిలో పెట్టి నీకు దాహం వేసినప్పుడు కొబ్బరి బొండం కొనిపెట్టి అది తాగక ఇంక దాహం అంటే కూల్ డ్రింక్ తెచ్చి పెట్టి హోటల్ కి వెళ్ళినప్పుడు బిల్లు వచ్చే టైం కి నువ్వు washbasin కి పోఇన ప్రతిసారీ బిల్లు కట్టి మాల్స్ లో మరిన్ని కొనిపెట్టి నువ్వు వేరే వాళ్ళ బైక్ ఎక్కినప్పుడు కజిన్ అని నమ్మ బట్టి ఈ రోజు నువ్వు NRI పెళ్ళికొడుకు తో పెళ్లి అని చెప్ప బట్టి నాకు అర్దమయ్యిన్డి బకర అంటే ఏంటో.

punarjanma

నాలో ఎప్పటి నుంచో జిజ్ఞాస .పునర్జన్మ వుందా?వుంటే దానికి criteria ఎన్టీ?మరణించాక మళ్ళి మానవుడిగానే పుడతారా? ఈ ప్రశ్న లన్నిటికీ సమాధానం గరుడపురాణం లో వుంది.అయితే ఈ పురాణం ఎవరైనా ఆత్మీయులు పోయినప్పుడు తప్ప వుత్తప్పుడు చదవకుడదని అంటారు.మా నాన్నగారు పోఇన సందర్భం లో నే చదవడం తటస్తిన్చిన్డి .అందులో చాల విపులీకరించి మనిషి పోఇన దగ్గరనుంచి మళ్ళి జన్మ ఎత్తే వరకు ఏ ఏ దశలు ఉంటాయో రాసారు.నెట్ లో కూడా దీనికీ సంబందించిన సమాచారం ఇంగ్లీష్ లో వుంది తెలుగు లో నాకు కనబడలేదు.నా blogers లో ఈ సబ్జెక్టు ఎవరికన్నా ఇంట్రెస్ట్ వుండి వాళ్ళకి తెలుసున్న తెలుగు సైట్స్ ఈ సబ్జెక్టు మిద వుంటే ఈ టాపిక్ మిద చర్చించడానికి ఇదే ఆహ్వానం.చచ్చినాడా శుభామ అని ని బ్లాగ్ కొస్తే ఈ చచ్చు topica అంటే వేరే టాపిక్ లోకి వెల్లిపోదాం.మీ ముదమే నాకు సమ్మతము.