25 ఏప్రి, 2009

గెలుపెవరిది?


గెలుపు ఇచ్చే కిక్ తో ఆ గెలుపుకోసం పడ్డ అలసటంతా మర్చిపోవచ్చు .అసలు గెలవము అని ముందే తెలిస్తే ?అందుకే బయట లోకం లో , బ్లాగ్ లోకం లో ప్రతి వారు మాదే గెలుపు , మాదే దీపావళి అంటు రెచ్చి పోతున్నారు.బయట ఇంతలా రెచ్చి పోతున్న వారు ఇంట్లో తలుపువేసుకుని అడుగు పెట్టాక ఇంట్లో వాళ్లతో సంభాషణ ఎలా వుంటుందో వుహత్మకంగా.
ముందుగా తెలుగుదేశం పూర్తీ మెజారిటీ సాధిస్తుంది ,మే 16 నా నిజమైన దీపావళి , నరకాసురిడి సంహారం అయి పోయింది , మహిళలంతా రెండు వేలు అందు కోడానికి సిద్దం గా వుండండి అంటు కెమెరాల ముందు మాట్లాడి చంద్రబాబు తలుపు బోల్టు పెట్టు కుని బాలయ్య తో ఏం బావ తొడలు పుళ్ళు పడేలా కొట్టావ్ , మీసాల రంగు బయట పడేలా ఎండలో తిరిగి తెగ తిప్పెసావ్ ,బండ ముక్కు బక్కాయన అవసరం తీసుకోకుండా ప్రభుత్వాన్ని స్థాపించే మెజారిటీ వస్తుందో, చస్తుందో టెన్షన్ కి bp వస్తోంది ఆ విధం గా మనం మే 16 దాక ముందుకు పోతున్నాం అంటు చెప్పుకుంటూ వుంటాడు.
ఇక కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి సంక్షేమ పదకలే మమ్మల్ని గట్టేక్కించాయి ,మే 16 తర్వాత ఇంటింటికి ఒక అంబులెన్స్, వూరు వురుకి ఒక జల యజ్ఞం ,గడప గడపి కి ఒక ముడుపు పధకాలతో రాజీవంద్ర ప్రదేశ్ అభివృద్ది బాట లో పయనించడం ఖాయం అంటు అనేసి ఇంటి కెళ్ళి తలుపెసు కోగానే అయన భార్య ఇప్పటికే సామానంతా ఇడుపులపాయకి పంపేసి ఇంకా గెలుస్తామని ఏంటండి ఆ ప్రఘల్భాలు అంటుంటే అబ్బ గట్టి గా అరవకే ఆ కాంట్రాక్టర్లు అంతా డబ్బులు వాపస్ అడుగుతారు గెలవం అంటే , ఇప్పటికే ఆంధ్ర గో బ్యాక్ అని అగ్గి రాజేస్తిమి అంటు బైబిల్ పాటించడానికి వుద్యుక్తుదవుతాడు .
నేనే కింగ్ , బావ చక్రవర్తి, తమ్ముడు సామంతుడు అంటూ ప్రజారాజ్యం తరఫున statement కెమెరాల ముందు ఇచ్చేసి తలుపేసుకుని ,ఏరా పవన్ గజాని కి ఒకసారి రెచ్చి పోయి ,పచ్చి బూతులు ప్రసంగించి మూడు kilometers కి ఒకసారి సిక్ అయ్యి హాస్పిటల్ లో జాయిన్ అయి ఏం పికావురా?మనకి డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్న వాళ్ళంతా కనీసం డిపాజిట్ అన్నా రాకపోతే పూర్తి డబ్బులు ఇచ్చేస్తామని అనవసరం గా కమిట్ అయ్యాం ఇప్పుడు చాల మందికే మనం డబ్బులు ఇచ్చేయ్య వలసిన పరిస్తితి కని పిస్తోంది అంటూ బావురు మంటాడు .
ఇంక లోక్సత్తా jp'' ఎన్నికల్లో ధనం మద్యం ఏరులై ప్రవహించింది ప్రజాసామ్యం అపహాస్యం పాలయ్యింది అని కెమెరా ముందు చెప్పి తలుపెసు కోగానే వారి భార్య ఏవండి హాయ్ గా ias ఆఫీసర్ గా ఆనందం గా వుంటుంటే మార్పూ మార్పూ అంటూ లోక్సత్తా పెట్టారు మన తరం లో మీరు కోరుకున్న మార్పు రాదేమో నండి అంటే అలా అనకు కాంతం ఈ ఎనికల్లో మా ఖాతా ఓపెన్ అయ్యింది వెయ్యి kilometerlaki కూడా మొట్ట మొదట వేసేది ఒకే అడుగు చూస్తూ వుండు మార్పు భవిష్యత్తు లో తద్యం అంటారు .
ఇవన్ని ఇలా వుంటే బ్లాగ్ లోకం లో ఒక పెద్దాయన గెలుపు మనదే , నిజమైన దీపావళి బ్లాగ్ లోకం లో ఆడవాళ్ళకి నేడే, కాగడా కడగంటి పోఇన రోజు నేడే , అతని వల్ల భాధ పడని పడుచు ఇంక ఎవరన్నా మిగిలి వుంటే నా దగ్గరకి వచ్చెయ్యండి , నేను చూసుకుంటాను,నేనే వేసుకుంటాను వీర తాడు అంటూ తన binoculer అంతా బ్లాగ్ లోకం మీద పడతుల మీద ఫోకస్ చేసి స్పందన negative గా వున్నా కూడా ఆశ వాహ దృక్పదం తోపదండి ముందుకు పదండి తోసుకు అంటూ అసలు తన వెనక ఎవరన్నా వస్తున్నారా లేదా అన్నది కూడా పట్టించు కోకుండా ముందుకు సాగి పోతూ వుంటాడు .
ఇదంతా పై నుంచి గమనిస్తున్న విధి వికట్ట అట్ట హాసం చేస్తూ వుంటుంది , రేపన్నది ఈ మానవులకి తెలిసి పొతే ఈ రోజే చచ్చి పోతారు తమ భవిష్యత్తు మీద బెంగతో, అందరిది గెలుపైతే మరి వోడేది నేనా ?అను కుంటూ అంతా విధి విలాసం అంటూ గుంభనం గా నవ్వుకుంటూ ముందుంది ముసళ్ళ పండగ అంటూ వెళ్లి పోతుంది .

13 ఏప్రి, 2009

ఒక విటుడి ఆత్మకధ


అరుణ గారి పుస్తక సమీక్ష'' ఒక సెక్స్ వర్కర్ ఆత్మకధ '' చదివాక ఒక విటుడు కూడా ఆత్మ కదా రాస్తే అన్న ఆలోచనల కి అక్షర రూపం ఇది , అంతే గాని ఇది రాసే సాధికారత గాని , లేసమంత అనుభవం (విటుడి గా) గాని లేక పోయినప్పటికీ బుర్ర కి పదును పెట్టి రాసే ప్రయత్నమే ఇది . ఇందులో లోపాలేమన్న అనుభవజ్ఞులకి గోచరిస్తే మన్నించ ప్రార్ధన .
కెరీర్ పరం గా పెళ్ళయిన దగ్గరినుంచి ఇద్దరం ఒకటే బిజీ .లంచ్ ఢిల్లీ లో చేస్తే డిన్నర్ బెంగుళూరు లో చెయ్యవలసి వచ్చేది .ఏ రాత్రి తోమ్మిందింటి కో ఇంటి కొచ్చినా, లాప్ మీద laptop ని వేసుకుని తర్వాతి రోజు ప్రణాళికలు సిద్దం చేసుకోవడం ,ఏ అర్ధరాత్రో పడుకునే ముందు r u బిజీ అని తనంటే ,we విల్ హవె టుమారో అనుకుని మిస్ అయిన సందర్బాలే ఎక్కువ .చూస్తుండగానే మద్య వయసు వచ్చేసింది ,పిల్లలతో పాటు .ఏంటో ఈ జీవితం నిస్సారం గా సాగి పోతోంది అనుకుంటూ అదేమాట మా కంపెనీ డైరెక్టర్ ఒకరి తో అనడం జరిగింది .ఆ రోజు నిద్ర లేస్తూనే బాల్కనీ లోంచి చూస్తే వుదయించే ఎర్రటి సూర్యబింబం ఎంతొ అందం గా కొత్త గా కని పించింది,ఆ రోజు నా జీవితం లో జరగ బోతున్న పెను మార్పుకి సూచనగా .గబ గబా తయారయ్యి వుదయం ఫ్లైట్ కి హైదరాబాద్ బయలు దేరా .
హైదరాబాద్ లో నన్ను రిసీవ్ చేసు కోడానికి కి వచ్చే మా డైరెక్టర్ రాలేదు , అతని స్థానం లో ఒక అందమైన ,వుహు అందం అన్నది ఆమెకి చాల చిన్న పదం ,పొద్దున్నే రెండు కొండల మద్య వుదయించే సూర్యుడి అందానికి పోటి గా ,ఆమె సోయగాల అంచులపై అద్బుతమైన ముఖారవిందం చూసి తీరవలసిందే . బ్రహ్మ తన కోసమే చెక్కు కుని పొరపాటున కిందకి జార విడిచాడా అన్నంత అద్బుతం గా .కంపెనీ పేరు వున్నా డిస్ప్లే కార్డు పట్టుకుని వుండడం తో ఆమె దగ్గరికి వెళ్లి నన్ను పరిచయం చేసుకునే లోపే ఆమె తెలుసు సార్ మధు గారు (కంపెనీ డైరెక్టర్)చెప్పారు మీరు చాల ముఖ్యమైన వారని మీకు కావలిసినవన్నీ ఈ రెండు రోజులు నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు . i am at your సర్వీసు at ఎనీ టైం అంటు మృదువుగా వత్త వలసిన చోట మాటలు వత్తి మరీ పలికింది .కార్ లో పక్కనే కుర్చునప్పుడు ఆమె వాడె ఆ పరిమళం నాలో ఏదో తెలీని మత్తుని కలగ చేసింది .ఆమె గురించి తెలుసుకుందామన్న ఆత్రం లో అడిగే లోపు నా cellమోగింది . విస్సిరి రోడ్ మీద పడేద్దమన్నంత కోపం వచ్చింది , కరెక్ట్ గా రసకందాయ పట్టు లోనే మోగుతూ వుంటుంది అదేంటో .చూస్తే మధు .నేనడిగే లోపు తనే చెప్పాడు ఆమె ఎస్కార్ట్ సర్వీసు నుంచి వచ్చిందని నా కోసమే కంపెనీ బుక్ చేసిందని . ఇంక ఏమి వినబడటం లేదు మెదడు మొద్దు బారి పోయింది . అంటే ఆమె హొయలు , వగలు , ఆ నవ్వులు , గిలిగింతలు నా కోసం కొనబడ్డవ ?విందు భోజనం లో రాయి వచ్చిన అనుభూతి .అదే ఆమె , అదే నేను , ఇంతకుముందు మనసు లో ఆహ్లాదం ఇప్పుడేమో గిల్టీ భావన .అయిన రాయి వచ్చిందని విందు భోజనం వదులు కుంటామా ?నా మనసును కప్పి పుచ్చడానికి నేను అన్వయించుకున్న ముసుగేమో .అంతవరకు చెయ్యి తగిలిస్తే ఎమనుకుంటుందో అన్న సభ్యత స్థానే చేతిలో చెయ్యి వేసి మరీ నీ అంత అందమైన అమ్మాయి చెయ్యి పట్టుకోడం ఇదే మొదలు అన్నా .ఇదే ఆఖరు కాకూడదని కోరు కుంటున్నా అంది ఆమె .ఇంకో అందమైన అమ్మాయి దా ?నీదా అన్నా కొంటెగా .అబ్బో చతురులే అంటు తను చెయ్యి నొక్కింది .అంతే అదే మొదలు ఒక కుటుంబమనే కల్ప వృక్షం , విష వృక్షం లా కనబడ టానికి . రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచి పోయాయి , నాలో నిబిడీ కృతమై , నిద్రాణ మై , నిస్తేజ మై , నిద్ర పోతున్న అంతర్గత శక్తుల్ని బయటకు తీసి స్వర్గానికి నిచ్చెనలు వెయ్యించిన్డి . కొంచే ఖరీదు ఆయినా గాని మెట్టుకు లక్ష చొప్పున వదులుతోన్డి .అది మొదలు ఎప్పుడు హైదరాబాద్ కాంపే .యెంత మోహం కమ్మిసిందంటే నేను హైదరాబాద్ ట్రన్స్ఫెర్ చేసేసుకునే అంత .తిన్నగా వాళ్ళ ఇంటికే వెళ్ళే అంత చనువు . వాళ్ళ అమ్మ(?)కి నన్ను చూస్తే ఎంతొ ఆనందం , వాళ్ళ చెల్లికి నేను తెచ్చే కానుకలంటే మోజు .నేను రాగానే వాళ్ళిద్దరూ యెంత ఎండలో ఆయినా గుడి కెళ్ళి వస్తామని చెప్పి వెళ్లి పోతుంటారు అదేంటో . కాల మిలా సాగి పోనీ , కల నిజమై ఆగి పోనీ అన్ని మరచి ఈ నిమిషం లో నీ ఎదలోనే వొదిగి పోనీ అని పాడుకుంటూ అస్వాదిస్తుంటే మళ్ళి సెల్ మోత నా గుండె కోత . ఆర్దిక మాంద్యం కారణం గా నేను సరిగా ఆఫీసు కి రాని కారణం సాకు గా చూ పి మా కంపని నన్ను వదిలించు కుందని దాని సారాంశం .తనకి చెప్పి చిన్న పిల్లాడిలా తన వడి లో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాను ,తన సుతిమెత్తని వెళ్ళని నా జుట్టులోకి జొనిపి ఛి ఛి ఏడవకు ఇది కాబోతే ఇంకోటి అంటుందని ఆశించా , ఆశ్చర్యం ఏమి స్పందించ లేదు . ఎం చేస్తోందా అని తల పైకెత్తి చూస్తే తన సెల్ నుంచి ఎవరి కో (customer కా?)sms ఇస్తూ కని పించేసరికి గుండె తరుక్కు పోయింది .ఏంటిది నేన్నింత సీరియస్ విషయం మాట్లాడుతుంటే నువ్వేమి పట్టనట్టు sms లు చేసుకున్తున్నావు అన్నా కోపంగా .అబ్బా వుండు నిన్ననే ఆ శరత్ 'హారం ' తీసుకొచ్చి ఇచ్చాడు , నువ్వేమో వడ్డానం చేయిస్తా అని చెప్పి అర్నేల్లయిన్డి ఇంతవరకు దాని గురించి ఏమి చెప్పకుండా ముందరి కాళ్ళకి భంధం వేస్తూ వుజ్జోగం పోయింది అంటా వెంటి ? తనకి నన్ను చూడాలని వుందని సందేశం పంపితే ,ఇంకో పావుగంటలో రమన్నా అంది . అంటే నన్ను దోబ్బెయ్యి అనేగా అర్ధం?అబ్బా అలా వుడు క్కుంటా వెందుకు . అమ్మకి బనారస్ చీరలు , చెల్లికి విదేశీ perfumes ఏవో తెచ్చాడట చూపించడానికి తెస్తున్నాడు అంది .చుపించుకోన్డి ఒకళ్ళకి వోకల్లు చుపించుకోన్డి మీ ఖరీదైన ప్రేమల్ని బాగా చూపించు కొండని విస విసా వచ్చేసా .
మాములు రోజుల్లో అయితే నేను కార్ లో ఇంటికొచ్చే లోపు తనే కాల్ చేసి ఏంటి బాబు మీ ఆవేశం ఏ విషయం లో కుడా తట్టు కోలేను నేను అంటు కవ్వించేల మాట్లాడి వెన్ u r హాట్ i am కూల్ అంటు చల్ల బరిచేది , అట్లాంటిది రెండు గంట లైన తన నుంచి ఫోనే లేదు . నేనే వుండ బట్ట లేక వాళ్ళింటికి వెళితే వాళ్ళ అమ్మ , చెల్లి వాడు తెచ్చిన వస్తువులు చూసుకుంటూ మురిసి పోతున్నారు . నన్ను చూడగానే అమ్మాయి , శరత్ వడ్డానం కొనుక్కోడానికి బయటకు వెళ్లారు అంటు నా కేసి విస విసా చూస్తూ చెపుతోంది అంటే నా వుజ్జోగం పాయిన సంగతి అప్పుడే దీనికి కూడా తెలిసి పోయిందా?పర్లేదు లెండి నేను వెయిట్ చేస్తా అన్నా దానికి ఆవిడ లేదు మేం కూడా వాళ్లతో డిన్నర్ లో జాయిన్ అవ్వాలి అంది అంటే పోరా కుంకా అన్న ధోరణి లో .ఇంక గతి లేక బయట పడ్డా .ఇంక అంతే నా జీవితం లో అ తర్వాత జరిగినవన్నీ చేదు అనుభవాలే , చీత్కరాలే . మొట్ట మొదటి రోజు కార్ లో నా మనసు మాట నే వినలేదు , ఇప్పుడు నా మాట నా మనసు వినడం లేదు .తన దర్శనం కోసం కుక్కలా వాళ్ళ ఇంటి ఎదురు గా గంటలు గంటలు నిలబడిన రోజులు , తను ఏ అర్ద రాత్రో వంటి మీద బట్టలు వున్నాయో వుడాయో కూడా సృహ లేకుండా పూర్తీ గా తాగేసిన స్థితిలో ఎవరెవరో తోనో కార్ లో దిగుతుంటే , ఛి ఇమే కోసమా నేను నా పిల్లాడు 'డాడి నా బొమ్మ చూడు , యి బొమ్మకే నాకు స్కూల్ లో ఫస్ట్ ప్రైజే ఇచ్చారు'అని చెపుతుంటే అస్సలు పట్టించు కోకుండా తనతో సెల్ లో మాట్లాడుతూ పోరా పోయి పడుకో అని కసిరితే వాడు చిన్న బుచ్చుకుని మంచం మీద మునగ దీసుకుని పడుకున్న సంఘటనా గుర్తొచ్చి కళ్లు చ్జేమర్చాయి .ఎందుకు ఆ భగవంతుడు యి మోహవేసం లో పడేసాడు?పొరిగింటి పుల్లకూర రుచి అని భ్రమింప చేస్తాడు?నేను , నా భార్య , పిల్లలు అంటు నిగ్రహం గా వుంటూ ఇంట్లోనే ఆనందాన్ని ఎందుకు పొంద లేక పోయాను .నాలోనే దానికి సమాధానం దొరికి నట్టు గా అని పిస్తోంది . భార్య భర్తా తమ కెరీర్ కి ఇచ్చే ప్రాధాన్యం , భంధాన్ని గట్టి గా వుంచే సెక్స్ కి ఇవ్వక పోవడమే . అదేదో బాత్రూం కి వెళ్ళే ప్రక్రియ లాగే రెండు నిమిషాలకే పరిమితం చేసేసి , ఆ రెడ్న్డు నిమిషాల్లో కుడా కాని కాని పడుకోవాలి , పొద్దున్నే auditors ని రమన్నా అనుకుంటూ ఆస్వాదించడానికి ఏ మాత్రం ఆలోచించకుండా , బయట ప్రపంచం లో మరీచికల్ని వీచకలు గా భావించి ఇంట్లో లేనిదేదో అక్కడ దొరుకుతుందన్న భ్రమలో , అవన్నీ ఆర్దిక పరమైన భంధలె గాని హార్దిక పరమైనవి కావు అని తెలుసుకునే లోపు ఆరోగ్యం పాడై పోతోంది .తమ జీవితం లో ఎంతొ ముఖ్య మైన యి కార్యక్రమానికి తగిన సమయం కేటాయించి ప్రేమ పూర్వకం గా , పెళ్ళికాని ప్రేమికుల్లా సంభాషించు కుంటూ పని మొదలెడితే బయట పనికి అవసరం వుండదు . టోకెన్ no 9 , టోకెన్ no 9 అరుపుతో ఆలోచనల నుంచి బయటకొచ్చా . dr బ్రమరం గారి కంపౌన్దర్ సారూ టోకెన్ నో 9 అంటే పలకరెంటి వెళ్ళండి సారూ ఇంకా బోల్డు మంది పెశాన్త్స్ వెయిటింగ్ అంటుంటే నేను వడి వడి గా విడి విడి గా నా వేడి ఆలోచనలకి స్వస్తి చెప్పి డాక్టర్ కేసి అడుగులు వేశా.

7 ఏప్రి, 2009

అందరు రాసే కధలివిలే

అందమైన లోకమని రంగురంగులున్తాయని అందరు అంటుంటే కామోసు అనుకుంటూ ఒక అందమైన అమ్మాయి శ్రీనగర్ కాలనీ రోడ్ల మీద తన బండి మీద దూసుకు పోతూ వుంటుంది .బ్లాగ్ చేసుకో ,ఆనందం పంచుకో అన్న బోర్డు పట్టుకుని అక్కడ దగ్గర్లో వున్న పార్క్ లో కొంత మంది ఆడామగా కూర్చుని వుంటే ,తన వృత్తి రీత్యా పని కొస్తుంది కదా అని లోపలికి వెళ్లి వాళ్ళని పరిచయం చేసుకుంటుంది .అందులో విభిన్న రకల మనస్తత్వాలు వున్న వివ్విధ రకాల మనుషులు బ్లాగ్ చేసుకుని బతుకు ఏ విధం గా బాగు చేసు కొవచ్చో చర్చించు కుంటూ టే , తను కూడా స్పూర్తి పొంది వెనక ముందు ఆలోచించక దభేల్న బ్లాగ్ లోకం లోకి తన కుడి కన్ను అదురు తున్నా పట్టించు కోకుండా దుకేసిన్డి .ఆ నిర్ణయం తన జీవితం లో పెను మార్పులు తీసుకు వస్తుందని ఆ క్షణం లో ఆమె కి తెలిదు .సరదాగా మాట్లదేసుకుని ఎప్పుడేప్పుడు బ్లాగ్ లో ఎవరికి తెలీని కధలు రాసేసి తన లో లావా లా పొంగుతున్న రచనా పటిమని , కసిని జనాలకి రుచి చూపించి వారి ప్రసంసలు యెంత వేగిరం పొందల అన్న ఆదుర్దాలో ఎవరు రాయడానికి సాహసించని టాపిక్ మీద చక్కటి కదా రాసేసిన్డి . ఇంక తాంబూలాలు ఇచ్చేసా తన్నుకు చావండని .ఇంతలొ ఒక చిలిపి కృష్ణుడు ఆ కధకి సినిమాల్లో కనిపించిన రెండు సంఘటనలు ఉదాహరణ గా చూపిస్తూ కామెంట్ రాస్తాడు .అంతే ఆక్షణం కోసమే ఎదురు చూస్తున్న వైరి వర్గం ఛి ఛి ఆడవాళ్లు బ్లాగ్ లోకం లో అర్దరాత్రి రాసుకునే స్వతంత్రం లేకుండా పోయింది . ఏవిటి ఈ బూతు వ్యాక్యనాలు?అంటు నీతి ని కూడా బూతు లా బుతద్దం లో చూపించి వారిని బెదర గొట్టే ప్రయత్నం చేస్తారు . దీంతో బ్లాగ్ లోకం మూడు గా చీలి పాయి మిత్ర పక్షం , వైరి పక్షం , కృష్ణ పక్షం గా చీలి పోతుంది .మిత్ర పక్షం లో ధూమ్ లు రౌడీ లు , కాగడాలు వీర విహారం చేస్తూ వైరి వర్గాన్ని బెంబేలు ఎత్తిస్తూ వుంటారు . అప్పుడు ఒక కోవర్ట్ ని వైరి వర్గం మిత్ర పక్షం లో జోరబెడతారు .ధూమ్ , కాగడా ఎవరో కని పెడితే మూసేసిన కంపని తెరుచుకోడానికి వలయు గొప్ప ఐడియా ఇస్తామని . దాంతో కోవర్ట్ మిత్రుడిలా ఆమె పంచన జేరి గుడచర్యం మొదలెడతాడు .
ఇంతలొ ఒక అతను తనే కాగడా అంటు ఆమెకి మెయిల్ పంపిస్తాడు . ఆమె కూడా తనే ధూమ్ అంటు ఆట పట్టిస్తూ మెయిల్ పంపుతుంది . ఇద్దరు అదే పార్క్ లో కలుసు కోవాలని నిర్ణయించుకుని బయలుదేరతారు . పార్క్ కి చేరగానే దూరం నుంచే ధూమ్ అంటూ అతనూ కాగడా అంటూ ఆమె పరిగెత్తుకు వచ్చి దగ్గర్లో ఆగి పోయి ఆయాసం తీర్చుకుంటూ వుంటారు .ఇదంతా దూరం నుంచి కోవర్ట్ షూట్ చేసి తన బ్లాగ్ లో కనిపెట్టేసా ధూమ్ , కాగడా ఎవరో కని పెట్టేసా , youtube లో వాళ్ళ కలయికని అప్లోడ్ చేసేసా అంటు వేపరీతమైన ప్రచారం చేస్తాడు . దాంతో బ్లాగ్ లోకం లో కలకలం .ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటూ జనాలు , ఈ duplicate ధూమ్ , కాగడా ఎవర్రా అని అసలైన వాళ్ళు ఆత్రం గా ఎదురు చూస్తూ వుంటారు .కోవర్ట్ నిజం గా అప్లోడ్ చేసే టైం కి అతని వెనక నుంచి రెండు చేతులు వచ్చి అతని బ్లాగ్ ని డిలీట్ చేసేస్తాయి .తర్వాత కదా ఏమి జరిగి వుంటుందో వుహిస్తూ మీ అందరు తలో చెయ్యి వేసి రాస్తే ఇది అందరు రాసే కదా అవుతుంది మరి . మీదే ఆలస్యం .ఆలస్యం అమృతం విషం . నిదానమే ప్రధానము .