11 మార్చి, 2013

నేను నా వైరస్సు

 


 
కిందటి నెల నాలుగు రాళ్ళూ వెనకేసుకున్నానని తెల్సి , వాటిని పగలగోట్టించు కోవడానికి వొక కార్పొరేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను . ఎవరన్నా  వుద్యోగం లో నాలుగు  రాళ్ళూ వెనకేసుకుంటే ,నేను వుద్యోగం లో పడి పోయి నీళ్ళు తాగక కిడ్నీ లో రాళ్ళూ వెనకేసు కున్నా  నన్న మాట.  నా రాళ్ళని అడ్డం పెట్టుకుని నాలుగు  రాళ్ళూ సంపాయించు కుందామని కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ ఉద్దేశం . ఆ సందర్భం గా రక్త పరిక్షలు అంటూ ప్రపంన్చం లో ఏ ఏ జబ్బులు వుండ  టానికి అవకాశం  వుందో అన్నిటికి రాసేసి , ఆ రిపోర్ట్స్ వచ్చాక రాళ్ళూ పగల గోడతాం  అంటే సరే రెండు రోజులు రెస్ట్  దొరుకుతుంది కదా అని ఓకే అన్నా. అన్ని రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చాయి . వొక రిపోర్ట్ లో మాత్రం యెర్ర పెన్ను తో గీసి  ఊరుకున్నారు . యిది ఏంటి అంటే డాక్టర్స్ వచ్చి చెబుతుంది అంది మలయాళీ నర్సు . అది వచ్చి ఏమి చెబుతుంది అని మళ్ళి  ఆ నర్సు ని అడిగితె దానికే తెలుస్తుంది అంటూ నవ్వుకుంటూ పోయింది .
సరే అని ఆ రిపోర్ట్ ని తీసుకుని చదువు దామని చూస్తే  హెచ్ సి వి రిఅక్టివ్ అని వుంది . గుండెల్లో రాయి పడింది . హెచ్ అయి వి తెలుసు గాని , దిని పేరు కుడా ఎప్పుడు విన లేదే కొంప తీసి దానికి సంభందించినది కాదు కదా . యింత నిబద్దత తో క్రమశిక్షణ తో జీవితం గడుపుతుంటే అటువంటిది నాకు ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ సతమవుతూ వుంటే వొక కుర్ర డాక్టర్ వస్తే ఆమె ని అడిగేసా ఈ హెచ్ సి వి అంటే ఏంటి అని . అయ్యో యిది వొక వైరస్సు అండి నాకు వుండేది యిప్పుడు లేదనుకుంటా ,హాయ్ ఏంటి నిన్న వస్త్తానని రాలేదు , excuse me  అంటూ సెల్ లో మాట్లాడుకుంటూ వెళ్లి పోయింది . అంటే యిలా సెల్ లో సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళకి వచ్చే వైరస్సా ?మనతో పాటు జీవితాంతం సహా జీవనం చేస్తుందా?అది వుంటే మనం వుండమా ?మనం వుంటే అది లేనట్టా ?యింక లాభం లేదని సెల్ లోంచి నెట్ లోకి వెళ్లి చుస్తే అది లివర్ లో వుండే వొక వైరస్ అని . లివర్ బలహీన పడితే అది బల పడి మనల్ని రోగాల పాలు చేస్తుందని అర్ధం అయ్యింది . యింక కార్పొరేట్ వాళ్ళు లడ్డు లాంటి కేసు అనుకుంటూ లివర్ స్పెషలిస్ట్ ని పిలిపించారు ..ఆయన మీ లివర్ అయితే ప్రస్తుతం ఆరోగ్యం గానే వుంది కాని ఈ వైరస్ మీకు హైదరాబాద్ లో ఉగ్రవాదులు విద్వంసం సృష్టించొచ్చు అన్న హెచ్చరిక లాంటిది , వాళ్ళ బొంద అని మనం మొన్న ఊరుకుంటే ఏం జరిగిందో తెలుసు గా ?జరగోచ్చు జరగక పోవచ్చు అలా అని మనం ఉగ్రవాదుల్ని వుపెక్షిన్చాలెం . వున్నారని తెలిసాక జల్లెడ పట్టి నిర్ములించడమే మంచిది.
 హైదరాబాద్ లో స్లీపింగ్ సెల్ల్స్ లా ఈ వైరస్ చాల మంది లో వుంటుంది , దాన్నిని పట్టించు కోక పోవడమే మంచిదని కుడా అంటున్నారు కదా డాక్టర్ కొంత మంది ?
అయన ముఖ కవళికలు మారి పోయాయి . శత్రువు తో సహజీవనం చేస్తానంటే మీ యిష్టం . అది మీ కేప్పుడైనా వెన్ను పోటు  పోడవచ్చు . యింకా ఏదో చెపుతున్నాడు . నా ఆలోచనలు ఎక్కడికో వెళ్లి పోయాయి . అవును సుధ  నా బయట వున్న  వైరస్ . ఆమె ఎప్పుడు లాలన గా మాట్లాడుతుందో ? ఎప్పుడు ద్వేషాన్ని కక్కుతుందో నా కె తెలిదు . అటువంటి ప్రియమైన శత్రువు తో నే నిభాయించు కోస్తునా ఈ అంతర్గత వైరస్ ని సంభాలించు కోలేనా ? 
ఏం నిర్ణయం తీసుకున్నారు అన్న డాక్టర్ మాట తో మళ్ళి ఈ లోకం లోకి వచ్చా . వోకో ఇంజేక్ట్షణ్ ఏడు వేలు . వారానికి వొకటి చొప్పున ఆరు నెలలు తీసుకోవాలి .
 అప్పుడు పోతుందా డాక్టర్?
అంటే వొక నలభై శాతం మంది లో పోతుంది మరి కొంతమందికి యింక అవసరం పడు తుంది .
అంటే యిద్దరిలో ఎవరో వొకరు పోయేదాకా వాడాలి అంటారు అన్నా నవ్వుతు .
మీరు చూస్తుంటే దేన్నీ సీరియస్ గా తీసుకోరనుకుంటా . లివర్ పాడైతే జీవితానికే ప్రమాదం . ఆ పైన మీ యిష్టం .
ఎప్పటి లోపు  పాడవచ్చు   డాక్టర్ ?
ఈ వైరస్సు నిద్రన శక్తి నుంచి మేలుకొని పూర్తీ గా విజ్రుభించ డానికి వొక యిరవై ఏళ్ళు పట్టా వచ్చు . ఈలోపు మీరు మందు విందు అంటే యింకా ముందే  పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పై కి అంటూ వేగిర పెటొచ్చు . అంటా మీ అదృష్టం అన్నాడు . అదేంటి మద్యాన్నం పూటే ఫుటు గా మద్యం బిగించడా?అంటా అంటున్నాడు అంతా అనడానికి ?అనుకుంటూ సరే డాక్టర్ నేను మళ్ళి స్టడీ చేసి చెబుతాను మీరు స్టేడి గా వెళ్లి రండి అంటే నా కేసి అదోలా చూసి వెళ్లి పోయాడు . తర్వాత తడిసి మోపెడైన బిళ్ళు మీద సంతకం పెట్టి బయట పడ్డా .
 సూది కోసం సోది కెళితే పాత రంకు  బయట పడినట్టు గా రాళ్ల కోసం నేను వెళితే నా నెత్తి మీద రాళ్ళూ వేసి నీ యిష్టం యింక అని వదిలారు .
యిప్పుడు కిం కర్తవ్యమ్ ? లోపల వున్నది ప్రమాదం యిస్తుందో ?ప్రమోదం యిస్తుందో ?కలదన్నది కలదో లేదో?అసలు యింతకు ముందు ఈ హెచ్ సి వి టెస్ట్ చేసేవారు కాదట .  తేలిక పొతే ఏ బాధ లేదు . తెలిస్తేనే ఈ భాదంతా . యిలా ఆలోచిస్తూ టీ . వి చూస్తుంటే వొక హోమియోపతి డాక్టర్ మా దగ్గర హెపటైటిస్  వైరస్స్ కి మంచి మందులు వున్నయి. అవి లివర్ రోగ నిరోధక శక్తి పెంచి వైరస్ ని శాశ్వతం గా నిర్ములిస్త్తాయి అంటే ఆయన దగ్గర ప్రస్తుతం వైద్యం మొదలు పెట్టా .
 అయినా నా పిచ్చి గాని యిన్నాళ్ళు బయట వైరస్సు తో నిగ్రహించుకు రావడం లేదు ?తను వుంటుంది అప్పుడపుడు మురిపిస్తూ అంతలోనే అశ్రుధారలు కార్పిస్తూ . యిది అంతే నిద్రాణం గా నిశబ్దం గా నా లివర్ లో స్తానం ఏర్పరుచుకుని . అయితే ఈ వైరస్ నాలోనే వుంటే ,యిది వుందని తెలిసి బయటి వైరస్ దూరం గా వుండడం కొస మెరుపు . నాకు తెలీని మరో విషయం తను కుడా రక్త పరీక్షలకి వెళ్లి హెచ్ సి వి అంటి బాడీస్ వున్నాయేమో చూడ మనడం . రిపోర్ట్ డ్యూ . అయినా నాకుంటే తనకి వుండే అవకాసం యెంత మాత్రం లేదని తనకి మాత్రం తెలిదా?
(కల్పితం తిరిగి చెట్టెక్కాడు )