30 మార్చి, 2010

టీవీ ప్రభావమే ఎక్కువ


మొన్న శనివారం సాయంత్రం ఏడుగంటలకి జీ తెలుగు లో నేను కూడా నటించిన''village లో వినాయకుడు ''ప్రసారం అయ్యింది .ఇప్పటికే అందరికి తెలుసు అన్న ఉద్దేశం తో నేను ఎవరికి చెప్పలేదు .ఇంక సినిమా అయిపోయిన దగ్గరనుంచి సెల్ మోగుతూనే వుంది .సినిమాల్లో ఎప్పుడు నటించానని . అవకాశం ఎలా వచ్చిందని వగైరా.ఇంక సోమ వారం ఆఫీసు కి వెళ్ళిన దగ్గర నుంచి వేరే విభాగాల నుంచి కూడా స్టాఫ్ వచ్చి మీరు చాలా నాచురల్ గా చేసారు సార్ , మీలో వొక గొప్ప నటుడు దాగున్నాడు అంటుంటే అది పొగడ్తో , వ్యంగ్యమో తేల్చుకోలేక వొక వెర్రి నవ్వు నవ్వి అంతా మీ అభిమానం అంటూ తప్పించు కున్నా .సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇంత మంది అభినందించలేదు .యి అభినందనల వెల్లువ కి అసలు కారణం అది టీవీ లో అదికూడా శనివారం సాయంత్రం రావడమే అని అనుభవ పూర్వకం గా తెలుసు కున్నా .
విదేశాల నుంచి కూడా ఎప్పుడో విడి పోయిన మిత్రులు కూడా గుర్తు చేసుకుని మరి మాట్లాడడం , రాజోలు లో కిందటి వేసవి ఎండలలో పడ్డ కష్టాన్ని మరిపించింది .ఏమన్నా కీర్తి కోసం పడే కష్టం కన్నా అది వచ్చినప్పుడు పొందే ఆనందం మిన్న .అమ్మో భరద్వాజ్ యి కీర్తి మన rediff నాటి కీర్తి మాత్రం కాదని గమనించ గలరు .

9 మార్చి, 2010

నిషిగంధ గారు థాంక్స్ చిన్న పదమే

అప్పట్లో chimatamusic లో పాథోస్ సాంగ్స్ వింటూ శ్రీని గార్ని మనసులో అభినందిస్తూ ఉండడమే నా నెట్ సర్ఫింగ్ ముక్యోద్దేసం .
ఏది ఏమైనా ప్రేమ వస్తూ తెచ్చే సంతోషం కంటే వెళ్తూ ఇచ్చే విషాదానికే బరువెక్కువ అని పిస్తుంది
పాథోస్ సాంగ్స్ ఉపోద్ఘాతం లో ఆఖర్న చదివిన ఆ సెంటెన్స్ చూసాక అక్షరాలూ మసగ బారాయి కళ్ళలో నీళ్ళు చిప్పిలి . వొక్క మాటలో అంత గొప్ప భావోద్వేగాన్ని నిమ్పగలిగిన ఆ మాటల ఇంద్ర జాలికులు ఎవరా అని చూస్తే ఆఖర్న నాకు కని పించిన పేరు నిషిగంధ .నా మనసులో భావాలకి ప్రతి రూపం ఆమె రాసిన అక్షరాలు .వొకే భావాలూ అంత దగ్గరిగా ఇంకొకరి దగ్గర కూడా ఉంటాయని నేను గ్రహించిన క్షణం అది .కిందకి వస్తే నిషిగంధ బ్లాగ్ అని బానర్ కని పిస్తే క్లిక్ చేశా .అంతవరకూ బ్లాగ్స్ గురించి వినడమే గాని చూసిన మొదటి బ్లాగ్ నిషిగంధ గారి దే .కాలేజీ అబ్బాయి అమ్మాయి ఆఖరి రోజు గుడి కి వెళ్లి వానకి తడిసిన మెట్ల మీద నడుస్తూ ఆమె తన మనసులో మాట చెబుదామనుకుని చెప్పలేక పోవడం గురించి ఆమె రాసిన చిన్న కధ ప్రతి వాళ్ళ జీవితం లో ఎప్పుడో అప్పుడు తారస పడిన కధే .చెప్పే విధానం లో వున్న వైవిద్యం బ్లాగర్స్ ని కట్టి పడేస్తుంది . ఆమె రచనలని విశ్లేసించడం యి టపా ఉద్దేశం కాదు కాబట్టి అసలు యి టపా రాయడం వెనక దాగి వున్నా భయం తో కూడిన భావాన్ని ఇక్కడ వ్యక్త పరుస్తున్నా .
'వొక చిన్నమాట మీతో చెప్పాలని --నిషిగంధ అని హారం /కూడలి లో చూడగానే ఎన్నాలో వేచిన హృదయం -అనుకుంటూ అడుగు పెట్ట గానే అర్ధం అయ్యింది తను బ్లాగర్స్ కి తను యి మద్య ఎక్కువగా రాయక పోవడానికి ఇస్తున్న సంజాయిషీ తో పాటు తనని అభిమానిస్తూ ప్రోత్స హిస్తున్న పాఠకులకి ధన్య వాదాలు తెలియబరిచే ప్రక్రియ లో బాగం గా రాసుకున్న పోస్ట్ అని తెలియ గానే టెన్షన్ మొదలయ్యింది .మెల్లిగా కాఫీ , టీ లేదా మీకిష్టమైన పానీయం తెచ్చుకుని అని రాసారు చిన్న సవరణ కంప్యూటర్ ముందు , కుటుంబ సబ్యులు ఇంట్లో వుండగా అలా ఇష్టమైన పానీయాలు సేవించ గలిగే స్వేచ్చా వాయువులు ఇండియా లోని కుటుంబ వ్యవస్తలో ఇంకా వ్యాపించక పోబట్టే ఇంకా అది గట్టి గా వుంది కాన కాఫీ మాత్రమే తెచ్చుకుని మీరు తల్చుకున్న అభిమానుల లిస్టు చదవడం కోసం మొదటి పేజి క్లిక్ చెయ్య గానే మొదటి గా కనబడిన అక్షరాలు పేరు తర్వాత గారు అని అంటే నా కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చేసి ఇంకేమి చదవ లేక పోయా అంత మంది అభిమానుల్లో ముందు గా తున్డమునేక దంతము అనుకుంటూ సూర్య నమస్కారం పెట్టుకున్టున్నరేమో అనుకుంటూ కలల లోంచి వాస్తవానికి వచ్చే టైం కి మొదటి పేజి అయిపోయింది ,దుర్భిణి వేసి గాలించిన ఆ గారు తప్ప రవి ని గాంచలేక పోయిన కవిని అయి పోతిని .ఇంకా రెండో పేజి చూసే సాహసం చెయ్యలేదు వెంటనే ఎందుకంటె వుహ ఇచ్చిన ఆనందం వాస్తవం ఇవ్వలేక పోవచ్చు .నేనెవరి స్పూర్తి తో నైతే బ్లాగ్ స్టార్ట్ చేసానని గర్వం గా చెప్పు కుంటానో తనే నా ఉనికిని గుర్తించక పోయి నప్పుడు బ్లాగ్ లోకం లో మన్నుటయా ?మరణించుటయా?అని మదన పడుతూ మళ్ళి తీగకు పందిరి కావలె గాని తెలుసా నీవే పందిరని అని పాడుకుంటూ ఊరడించు కున్నా. తన బ్లాగ్ లో పెట్టుకున్న నీడనిచ్చే ఆ చెట్టుకు ఎన్నో ఆకులు ఆమె కి నీడనిస్తుంటే ప్రతీ ఆకూ నన్ను గుర్తు పెట్టుకుందో లేదో అనుకుంటే ఎలా ?మానస వీణ మధుర సంగీతానికి దోహద పడే ప్రతీ తీగా నన్ను గుర్తు పెట్టుకో అంటే ఎలా?యిలా సాగి పోతున్న నా ఆలోచనలకి కళ్ళెం వేస్తూ గుండె దిటవు చేసుకుని రెండో పేజి కి వెళ్ళా .మనకి పరిచయం వున్న పేర్లు ఎర్లై ప్రవహిస్తున్నాయి .పాళీలు .అర్ధాన్గులు , అక్కయ్యలు .భావకులు మళ్ళి వారికి ధన్య వాదాలు , మనసులో మాటలు యిలా సాగి పోతున్నాయి చివరకి తుక్కాసి గ్యాంగ్ మొదలయ్యింది (వెనక వచ్చిన గ్యాంగ్ ను తుక్కాసి గ్యాంగ్ అందురు)ఎవరి పేరు చెపితే మగాళ్ళు కూడా అర్దరాత్రి స్వేచ్చా గా తిరగాలేరో వారి పేరు పక్కన నా పేరు కని పించింది పోనీ ఇటు పక్కన చూసుకుని సేద దీరు దామని చూసి కెవ్వున కేక ,యిది యాద్రుచ్చికమ?లేక బుగ్గ గిల్లి జోల పాడుటయ?పేరున్నదని సంతోషించినంత సేపు పట్టలేదు నా ఆనందం .మీరెప్పుడు అంతే వొక కంట ఆనందం వేరొక కంట విషాదం పంచుతారు మీ రచనలలో .వసంత కోకిల లా అయిపోయిన మీ పోస్త్ద్ నిత్య వసంతం లా మళ్ళి రావాలని ఆశ .ఇంతకీ నా చిన్న మాట నేనింకా చెప్పనే లేదు .పోనిలే మొత్తానికి పేరుంది అని ఎక్కడో మొదటి పేజి లో లేదే అన్న బాధని అదిమి పెట్టుకుంటే అమ్మవారు పులిగోరు రూపం లో ప్రత్యక్షమై మొదటి కామెంట్ లోనే నా పేరు వుంచడం అంతా నిత్యానంద స్వామి వారి లీల కాక మరేవిటి?
థాంక్స్ అన్నది నిజానికి చిన్న పదమే గాని గుండెల్లో నింపుకున్న అభిమానాన్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది . అందుకే నన్ను గుర్తు పెట్టుకున్నందుకు, మాటల కందని భావాలూ మంచి మనసును చెబుతాయి ,అందుకే యిది మాట రాని మౌనం మీ రచనల మీద యేన లేని అభిమానం మళ్ళి అందుకోండి వేగం , మానస వీణ లో మరో కొత్త రాగం .
ఇంత పెద్ద భావాన్ని మీ కామెంట్స్ పేజి లో దిమ్పలేక ఇక్కడే రాసుకున్నా అంతే అంతే .మీరన్నట్టు భావం పెల్లుబుకి రాయలనప్పుడే రాయ గలుగుతాం అంతే గాని టైం కంప్యూటర్ ఖాలీ గా వున్నాయని రాస్తే వచ్చేవి ...... యి విషయం లో నేను యింత కంటే ఏమి చెప్పలేను సెలవు నమస్కారం .

4 మార్చి, 2010

టెస్ట్ సిగ్నేలే రెచ్చ గోడుతుంటే?


నిన్న మా అబ్బాయి చానెల్స్ మారుస్తుంటే రాజ్ న్యూస్ , టెస్ట్ సిగ్నల్ అని కనిపిస్తే పెట్టాడు . అది కెసిఆర్ తెలంగాణా ఛానల్ అని రెండో నిమిషానికే తెలిసి పోయింది .పూర్తీ గా రెచ్చ గొట్టే దోరణిలో ప్రసారాలు సాగి పోతున్నాయి .మనం పన్నులు కడుతుంటే అన్ద్రోడు అందలం ఎక్కుతుండు , నువ్వు జాగో తమ్మి ఇంకా లేపాలి దుమ్మి ఇలా సాగి పోతోంది .మా ఇంట్లో మేము ఆంధ్రనో తెలంగాణా నో మాకే తెలీదు ఇంకా మా పిల్లల సంగతి ఏమి చెప్పాలి .ఇద్దరం ఇక్కడే పుట్టి పెరిగాం , ఇక్కడే చదువులు ఉద్యోగాలు ,మళ్ళి మా పేరెంట్స్ ఆంధ్ర అయిన ఉద్యోగ రిత్య ఇక్కడే సెటిల్ అయిపోయారు .మా లాగ ఎందరో . ఇంతకీ రాత్రి చుసిన ఆ చానెల్ తిరిగి మా వాడు మద్యాన్నం స్కూల్ నుంచి వచ్చి టీవీ ఆన్ చెయ్య డం తో అదే వస్తోంది .మా వంట ఆమె పిల్లాడికి అన్నం పెడుతూ అదే చూస్తోంది .ఆమె మా ఇంట్లో గత పది ఏళ్ళ గా చేస్తోంది .టీవీ చూసిన పది నిమిషాల్లో ఆమె ముఖ కవళికలు మారి పోయి మా అబ్బాయి తో మీ ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్ లో duplex ఇల్లు కట్టేసుకుని సెటిల్ అయిపోయి మా తెలంగాణా వాళ్ళని అద్దె ఇళ్ళలో ఉంచు తున్నారు అందిట .(మరి ఏడాది క్రితం ఫ్లాట్ కొనుక్కుంటున్నా డబ్బులు సద్ద మంటే లక్ష రూపాయలు వడ్డీ లేని అప్పు ఇచ్చాను ?ఇంకా పైసా కూడా ఇవ్వలేదు ?)మా వాడు కూడా పొండి ఆంటీ గట్ల గిట్ల అనుకుంటూ , పూరి పిట్ల చేస్తా తినటవా అనుకుంటూ మీరు మీ తెలంగాణా. అయిన మేము కుడా తెలంగాణే ఇక్కడే పుట్టాం అని సమాధానం చెప్పి ఎందుకైనా మంచిదని వాళ్ళ ముమ్మి కి messege చేసాడు ఆంటీ తెలంగాణా ఛానల్ చూసి రెచ్చి పోతోందని నువ్వు తొందర గా ఆఫీసు నుంచి రా అని ..ఆమె సరదాకే అన్నా లోపల వున్నా భావాలూ ఎగా దోసుకు వచ్చాయి .యి పది ఏళ్ళలో ఆమె లో యి భావ ప్రకటన మేమెప్పుడు చూడలేదు డబ్బు కావలిసి వచ్చినప్పుడే మాతో మాట్లాడేది .అలాంటిది టెస్ట్ సిగ్నల్ కే మూగాకి మాటొస్తే ఇంక ఫుల్ fledged గా మొదలెడితే ఇంకెన్ని విన్ద్వాన్సాలు రేపుతుందో?ఆఫీసు లో కుడా స్టాఫ్ ఆంద్ర తెలంగాణా లా విడి పోయి వోకరికేసి వొకరు అనుమానం గా చూసుకుంటున్నారు . వొక క్లెర్క్ అయితే మా ఆఫీసు సుపేరేతిన్దేంట్ ని ఎక్కువ నకరాలు చేసినావంటే మీ అన్ద్రోల్ని లేపేస్తం అనేసే దాక . అతనొచ్చి సార్ నన్ను వేరే సెక్షన్ కి త్రాన్సఫెర్ చేసెయ్యండి లేదా వాడినన్న తీసేయ్యందని మొర పెట్టు కున్నాడు .ఇంట బయట చివరికి యి బ్లాగ్ లోకం లో కూడా ఆంధ్ర తెలంగాణా అంటూ కత్తులు దూసుకునే స్తితి కి రప్పించడం వెనక లబ్ది పొందేద్ది ఎవరని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పమంటే ప్రతి వాడికి తెలుసు కొంత మంది పదవులు ఆశిస్తున్న రాజకీయ నాయకులికి,ఆంధ్ర లాయర్ల తో , వ్యాపారస్తులతో పోటి పడలేక ఎలాగన్నా వాళ్ళని తరిమేసి లబ్ది పొందుదమనుకునే స్వార్ద అసమర్దులకి మాత్రమె .తెలంగాణా వచ్చేసినంత మాత్రాన చెప్పులు కుట్టుకునే పోసయ్య , అరటి పళ్ళు అమ్ముకునే యాదగిరి , విస్త్రి చేసుకు బతికే వీరేశం , ఆటో నడుపుకునే బిక్షపతి వీళ్ళ జీవితాల్లో ఏదన్నా మార్పు వస్తుందా?ఏదో అద్బుతాలు జరగ బోతునట్టు రేపటి నుంచి యి తెలంగాణా ఛానల్ లో ఉదర గోడితే జరగ బోయే పరిణామాలకి సంకేతమే మా వంటావిడ లో విప్లవ భావాలు. సాటి తెలంగాననో లేక నిన్నటి తరం ఆంధ్రనో తేల్చుకోలేని మాలాంటి వాళ్ళ మీదే ఇలా అంటే , ''ఎండి కిశ్న నగర్ కి ఏ బస్సు ఎక్కలండి ఆయ్ '' అని అడి గే వాళ్ళ పరిస్తితి వుహించు కోడానికే భయం గా వుంది . కనీసం యి పిల్లల పరిక్షలు అయ్యేదాకా అన్నా ఆ ఛానల్ ని బాన్ చేస్తే బావుణ్ణు .