28 డిసెం, 2008

బాలానందం స్మృతులు.

మా చినప్పుడు ఆదివారం రెండు నుంచి మూడు దాక బాలానందం చిన్న పిల్లల కార్యక్రమం వచ్చేది.రేడియో అక్కయ్య గా అప్పట్లో తురగ జానకి రాణి గారు నిర్వహించే వారు.అంతకు ముందు చాలాకాలం పాటు ఆంధ్ర బాలానందం సంఘం స్థాపించిన న్యాపతి రాఘవరావు దంపతులు నిర్వహించేవారు.అప్పట్లో ఆ కార్యక్రం లో పాల్గొనడం స్కూల్ లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టేది.ప్రతి ఆదివారం విధి గా వెళ్ళడం ఒక పాటో.,కవితో, జోకో, ఎమిలేకపోతే ఒక ఉత్తరమో చదవడం జరిగేది.అప్పట్లో మేం విజయనగర కాలనీ లో ఉండడం తో 121 బస్ ఎక్కితే air దగ్గర స్టాప్. రోజు 12 గంటలకి అక్కడ చేరుకుని రేడియో అక్కయ్య సహాయకుల దగ్గర మా ప్రతిభ నిరూపించుకుని ఒక్క ఛాన్స్ కొట్టేవాళ్ళం.అలా రేగులేర్ గా వచ్చి ప్రతిభ గల వారికీ నాటకాల్లో ఛాన్స్ ఇచ్చే వారు.అప్పట్లో నేను, ఫణి సుందర్, సుబ్రమన్యెస్వరి,శ్రీనివాస మూర్తి మరికొంతమంది రేగులేర్ గా నాటకాల్లో వేసేవాల్లము.అప్పట్లో జరిగిన కొన్ని తమాషా సంఘటనలు నవ్వు తెప్పిస్తాయి.రావూరి భరద్వాజ గారు కొన్నాళ్ళు రేడియో అన్నయ్య గా పనిచేసారు.అయన తన సహాయకుల మీద నమ్మకం తో సెలక్షన్ వాళ్ళ మీద వదిలేసేవారు. ఆ కార్యక్రమం అంతా సాధారణం గా లైవ్.ఒకబ్బాయి అజేయ హిందూ సంఘటనం ఆ జన్మాంతం మన లక్ష్యం అంటు పాడుతున్నాడు లైవ్ లో.అంతే రేడియో అనయ్య గుండె ఆగినంత పని అయ్యింది ఎందుకంటె అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వాళ్ళ పాట అప్పట్లో దాని మీద నిషిద్దం వుంది.వెంటనే ఆయన తమ్ముడికి జేజేలు చెప్పంద్ర అంటు నోరు ముసేసాడు అయన గాని ఆ పిల్లవాడు అయన చెయ్యి కొరికి మరీ నన్నాపకు నే పాడుతా అంటు రెచ్చి పోతున్నాడు. ఇదంతా లైవ్ లో వచ్చేస్తుంటే అయన అదికాదమ్మా ఇంక మిగత వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి గా టైం అయి పోతోంది జేజేలు జేజేలు అంటు గట్టి గా తప్పట్లు కొట్టి పక్కకి లాక్కుపోయారు.ఇంకోసారి నే పాడదామని వెళితే ఈ వారానికి ఉత్తరం చదువు అంటు వుత్తరం ఇచ్చారు. నేను ఇంటికి వెళ్లి న వెంటనే మా పేరెంట్స్ ని ఎలా పాడను ఎలా చేసనంటూ విసిగించే వాణ్ణి మొదట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ గా వినేవారు . ప్రతి వారం అంటే పనులు మానుకుని కష్టం కాబట్టి ఆ బావుంది అనేవారు వినకుండానే.ఆ ఉత్తరం చదివిన రోజు నే ఇంటికి వెళ్లి ఎలా పాడను అంటే అద్బుతం రా బాగా పాడావ్ అని మా అమ్మ గారు అంటుంటే అప్పుడు అర్ధం అయ్యింది వాళ్ళు వినటం లేదని. అప్పట్లో leotolstayi రాసిన tomsayer ధారావాహికం గా వచ్చేది అందులో ఫణి సుందర్ మంచి పేరు తెచ్చుకున్నాడు అది రికారేదే ప్రోగ్రమ్మే కాబట్టి తప్పు వొప్పులు సరిదిద్దుకునే అవకాశం వుండేది.ఒక సారి leonardo davency నాటకాన్ని రికార్డింగ్ టైం లేక లైవ్ లో వేస్తున్నాము . అందులో మెయిన్ పాత్ర నాదే. ఇది గాలిగుమ్మటం బొమ్మ దానికి రూపకల్పన చేస్తున్నాను అని నేనంటే ఇది నిజంగా గాలి లో విచ్చు కుంతుందా అని తర్వాత పాత్రధారి అనాలి దాని బదులు గా ఇది గాలిలో చచ్చి పోతుందా అని చదివేసాడు, వెంటనే నేను తేరుకుని గాలిలో చచ్చిపోకుండా కాపాడే సాధనం అని లేని డైలాగ్ చదివి గట్టేకించాను.ఇప్పట్లో గాయకుడి గా ప్రసిద్ది చెందిన రామాచారి మాతో పాటు పాడిన వాడె బాలానందం లో.
అప్పట్లో పిల్లలో creativity ని వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వుండేవి, అంతే గాని boddudani పిల్లల చేత డాన్స్ బేబీ డాన్స్ అంటు ద్వందర్దల పాటలకి టీవీ లో డాన్స్ లు అప్పట్లో లేవు అదృష్ట వశాత్తు.

25 డిసెం, 2008

మన 'సంత' బ్లాగర్సే '

ఈ రోజు మంచి రోజు మరుపురానిది . మధురమైనది ప్రేమ సుమం ఉదయించిన రోజు.ఇదేదో christmes సందర్భంగా నే పాడు కుంటున్న పాట కాదండి,మన stallanta ఈ రోజు బ్లాగేర్సే బ్లాగేర్స్.ఇక్కడ పేర్లు రాయడం మొదలెడితే ప్లేస్ చాలదు. తెలుగు బ్లాగేర్స్ లో దిగ్గజలంతా అక్కడే{అంటే నేను కూడా ఉన్నానని గమనించ గలరు}.పుస్తకాల సంత లో మహా సందడి గా కనిపించిన స్టాల్ ఈ తెలుగు దే అని గర్వం గా చెప్పుకోవచ్చు.ఒక పక్క నిరంతరం గా వస్తున్న సందర్సకులకి సమాధానం చెపుతూ గల గల మాట్లాడుకోవడం జరిగింది.నే వెళ్ళేటప్పటికే విరజాజుల పరిమళాలు వెదజల్లుతూ విరజాజి గారు , తల పంకిస్తూ తాడేపల్లి గారు ,సందర్శకులతో శ్రీధర్ గారు బిజీ గా కని పించారు.ఇంతలొ మనసులో మాట అంటు సుజాత గారు విచ్చేసారు. ముందు కొంచెం ముభావం గా వున్నా కొంత అలవాటు పడ్డాక బోల్డు సందడి చేసారు. ఈ సందర్భం గా జరిగిన సందడిలో సందర్భాన్ని బట్టి రెండు titels నేను రిజర్వు చేసుకున్నా తర్వాత వాటి గురించి రాయడానికి. అవి ''పూర్ణం తినేసిన పూర్ణిమ'',''పరిగెత్తిన పద్మనాభం (గారు)''(ఫోటో కి అడ్డం గా లెండి )నాలుగు గంటలూ నాలుగు నిమిషాల్లా అయిపోయాయి.స్వాతి గారి సందడి చక్రవర్తి అలజడి అదో పెద్ద టీవీ సీరియల్ అవుతుంది.ఆఖర్న అరుణ గారు స్టాల్ కి అడ్డం గా ఎవరో ఆడమనిషి ఫోటో కి అడ్డంగా వస్తుంటే'' నువ్వు మనిషివా వా?బ్లాగర్ వా?''అని అడుగుతుంటే నేను రెచ్చి పోయి ఎన్నాళ్ళనుంచి సాగుతోంది ఈ యవ్వారం?అంటుంటే అందరం పగలబడి నవ్వుకుంటుంటే , నాకి తెలుగు వస్తది లేదు అంటు వెళ్లి పోయింది మేం బతికి పోయాం.జ్ఞాన ప్రసూనా గారిచ్చిన పూర్ణం బూరలు. జ్యోతి గారు తెచ్చిన సున్నున్దలనబడే రవ్వ లడ్డులు రమణి గారు వచేటప్పటికే ప్రమదావనం సభ్యులు వెళ్లి తెచ్చిన మిరపకాయ బజ్జీలు, చక్రవర్తి దంపతులు పంచిన పులిహోర వాయనం,మిగత బ్లాగేర్స్ చేసిన సందడి రాయాలంటే ముందింత తిని తీరికగా మళ్ళి రాయాలి. ఫోటోలకోసం సుజాత గారి బ్లాగ్ లోనో, జ్యోతి గారి బ్లాగలోనో, శ్రీధర్ గారు ఉందనే ఉన్నారు ఎవరో ఒకరు ఎపుడో అపుడు తియరా తలో ఫోటో ఆటో ఇటో.అందాకా ఇది చదువుకుని మిగతాది వూహించుకుని , ఫోటోస్ లో చూసి రానందుకు కన్నీళ్ళు రాల్చి , నడుము వాల్చా గలరు. సెలవు నమస్కారం చాల చక్కటి విషయాలు చెప్పా ఇప్పటికే.

20 డిసెం, 2008

బ్లాగర్స్ దిగి వచ్చిన వేళ

అనుకున్న ప్రకారం నెక్లస్ రోడ్ లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన లో సాయంత్రం 6 గంటలకి మిగతా బ్లాగ్ మిత్రులు కలుస్తారన్న ఉద్దేశం తో వెళ్ళా . నే వెళ్ళేటప్పటికే దుర్వాసుల గారు, తాడేపల్లి,శ్రీధర్,వివేన్ ఇతర మిత్రులు స్టేజి మీద ప్రదర్శనకి సిద్దమవుతూ కని పించారు.ఒక పది కుర్చీలు మాత్రమే వున్నాయి స్టేజి కి ముందు.వచ్చిన బ్లాగేర్స్ ముందు గా ఈ తెలుగు స్టాల్ కి వెళ్ళడం చేత అందరికి ఈ తెలుగు రిబ్బోన్ badge పెట్టడం జరిగింది. అందువల్ల బ్లాగర్స్ ఎవరో కని పెట్టడం సులభం అయ్యి వారిని పరిచయం చేసుకోవడం సులభమయ్యిన్డి. అలా అక్కడ కొత్త గా పరిచయమయిన బ్లాగర్స్ రమణి, వాళ్ళ అక్క వేద, నేను లక్ష్మి, పూర్ణిమ. వీళ్ళు కాక మిగతా బ్లాగేర్స్ అరుణ , జ్యోతి, కత్తి,అనిల్ ,కశ్యప్ .కుర్చీలు ఎక్కువ లేకనో ,ఆ సమయం లో జనం పల్చగా వుండడం చేతనో ఆశించినంత మంది తిలకించ లేదేమో అని పించింది. ప్రెస్ బానే వచ్చారు. మరి coverage సంగతి రేపే తెలుస్తుంది.కానీ కంప్యూటర్ లో తెలుగు వాడె విధానం బ్లాగ్స్ ఎలా సృష్టించాలి వంటి విషయాలు డిస్ప్లే చేస్తూ చూపడం జరిగింది.ఆశించినంత స్పందన లేక పాయినా కంప్యూటర్ లో తెలుగు వాడకం దిశగా కొన్ని అడుగులు పడ్డాయని చేపోచ్చు. స్టాల్ దగ్గర కూడా జనాలుఈనాడు tv9 కి మద్యన sandwich అయి నలిగిన మన స్టాల్ ని ఒక సారి తల పంకించి ముందుకు సాగి పోతున్నారు.నది దూసుకు పోతున్న నావను ఆపండి రేవు బావురు మంటోందని నావకు చెప్పండి అంటు ముత్యాల ముగ్గు లో నిదురించే తోటలోకి పాట గట్టి గా పాడాలని పించింది.కానీ స్టాల్ అంతా బ్లాగేర్స్ తో నిండి సందడి గా అనిపించింది. పూర్ణిమ , తాడేపల్లి గారు తమ కెమెరాల్లో భందించిన ఆ మధుర క్షణాల్ని మనకోసం బ్లాగ్ లో పెడతారని , అది చూసి మరింత మంది బ్లాగేర్స్ కలుస్తారని తమ తెలుగు రచనలతో వెలుగులు నింపుతారని ఆశిస్తూ పదండి ముందుకు పదండి తోసుకు.

18 డిసెం, 2008

జ్యోతిర్మయి కేసు ఇండియా లో వాదించి వుంటే?

జస్టీస్ delayed ఈజ్ జస్టీస్ denied అన్నది న్యాయ వ్యవస్థ లో ప్రాధమిక సూత్రం.జ్యోతిర్మయి కేసు లో బ్రిటన్ కోర్ట్ సంఘటన జరిగిన 8 నెలలకే నాగరాజు ని దోషి గా నిర్ధారించి జీవిత ఖైదు అది కూడా 25 ఏళ్ళ వరకు pay roll కి కూడా అవకాశం లేకుండా విధించింది.న్యాయ దేవత కళ్లు ఆనందం to చమర్చి వుంటాయి.అదే ఇండియా లో అయితే కనీసం ఛార్జ్ షీట్ కూడా ఈ పాటికి ఫైల్ చేసి వుండే వారు కాదేమో.ఒక వేళ చేసిన హంతకుడి కి శిక్ష పడేది అనుమానమే.మన దగ్గర ధనం పలుకు బడి వుంటే బార ఖూన్ మాఫ్.పరిటాల రవి హత్య కేసు లో నిందితులు వాళ్ళ అంతట వాళ్ళు చావడమే గాని ,ఇంక విచారణ సాగు తూనే వుంది.ఒక బాలకృష్ణ, ఒక వెంకట్(కేశవరావు కొడుకు),అయేషా మీరా హత్య కేసు లో నిందితుడు ఇలా చెప్పుకుంటూ పొతే చాల మందే.క్రిమినల్ కేసు ల పరిస్థితే ఇలా వుంటే ఇంక సివిల్ కేసు ల విషయం లో యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.మా విషయమే తీసుకుంటే సుమారు 5 ఏళ్ళ క్రితం పేపర్ లో ఆడ్ చూసి ఇల్లు కొనడానికి వెళ్లి ఒక వ్యక్తీ కి ఆరు లక్షలు అడ్వాన్సు గా ఇచ్చి.బ్యాంకు loan అప్లై చేస్తే ఆ ఇంటికి అరవయ్ శాతం కన్నా ఎక్కువ మున్సిపల్ దివిఅషన్స్ వున్నాయని loan reject చేసారు.అందుకని ఉభయ సమ్మతి తో రాసుకున్న వోప్పందాన్ని ఉల్లఘిస్తూ ఆ వ్యక్తీ డబ్బులు ఎగ కొడితే సివిల్ కోర్ట్ లో ఆ కేసు మొన్న నే మాకను కూలం గా తీర్పు ఇచ్చినా , అ వ్యక్తీ కి చీమ కూడా కుట్ట లేదు.మేమే మళ్ళి ఎగ్జిక్యూటివ్ పెటిషన్ వేసుకున్నాం.దీని వల్ల ఎలాంటి సందేశం వస్తోంది మనం murder చేసిన మోసం చేసిన ఏమి కాదు ఆన్న ధోరణి ప్రబలుతోన్డి. అందుకే అరబ్ చట్ట లే బెస్ట్ అని పిస్తుంది.రేప్ చేసిన వాణ్ణి బహిరంగం గా ఊరి తీయడం . దొంగ తనం చేసిన వాడి కళ్లు పికేయ్యడం.అంతెందుకు మొన్న ఆసిడ్ దాడికి గురైన స్వప్నికా వాడి మొఖం మిద మేమే పబ్లిక్ గా ఆసిడ్ పోస్తాం అదే సరైన శిక్ష అంటు ఒక పక్క మృత్యువు తో పోరాడుతూ కూడా అందంటే that ఈజ్ ది ఆర్డర్ అఫ్ ది డే.మన చట్టాల్ని కూడా నేటి పరిస్థితులకి అనుగుణం గా మార్చు కోవాలి.రేప్ చేస్తే కోసెయ్యాలి, murder చేస్తే బహిరంగ వురి, ఆసిడ్ దాడి ev teasing కి పాల్బడితే వెన్నెముక లో ఒక vertebra తిసేయ్యాలి పనికి రాకుండా పోతాడు.అదే జ్యోతిర్మయి కేసు ఇండియా లో జరిగి వుంటే ఆమెది హత్య కాదని ఆత్మా హత్యని నిందితుడు రక్షించడానికి పొతే రక్తం చిమ్మి ఐ లోవ్ u జ్యోతి అని గోడల మిద పడిందని సాక్ష్యాలూ పుట్టించి మిగత ఇద్దరి రూమ్ మేట్స్ లో ఒక బకారని ఎవర్నో ఇరికించి భారి గా పోలీస్ లు సొమ్ము చేసుకుని వుండే వారు.అందుకే ఇండియా కి ఒక అపరిచితుడి చట్టం చాల అవసరం.

7 డిసెం, 2008

అన్వేషణ అశ్రు నయనాలతో,

నేను నిన్ను విజయవంతం గా మర్చి పోయా అనే అనుకున్నా,నా జీవితం లో నువ్వొక మర్చిపోయిన తీపి జ్ఞాపకం గానే భావించ.నా చదువయిపోయాక , నా ఉద్యోగం ,నా పెళ్లి ,నా జీవితం అంటు పరుగెడుతూ నా జీవితపు తోలి సంధ్యలో కాంతులీడిన నీ ప్రేమ పుష్పాన్ని నిర్ధాక్షిణ్యం గా నా పాదాల కింద నలిపేసి ముందుకు సాగిపోయా.నా అంతరాత్మ నన్ను ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఇన్నాళ్ళు నన్ను నేనే బిజీ అంటు మభ్య పెట్టుకున్న.మొన్న ఆఫీసు పని మిద ముంబై వెళ్లి తాజ్ లో వునప్పుడు ఉగ్రవాదుల దాడికి భయపడి రూమ్ తలుపులు లాక్ చేసుకుని మంచం కింద దూరి , జీవితపు చరమంకపు క్షణాల్లో నాకు ఉహ తెలిసిన దగ్గర నుంచి ఇంతవరకు జరిగిన సంఘటనల్ని నేమరేసుకున్తునప్పుడు, అది గో అప్పుడు తెలిసింది నా లోపల లావాలా నీ జ్ఞాపకాలు పెల్లుబికినప్పుడు తెలిసింది,నువ్వు నాలో నిక్షిప్తమై పోయావని.కాలేజీ రోజుల్లో తెలిసి తెలియని వయసులో ప్రేమ , దోమ అంటు నీ వెంట పడినప్పుడు,లవ్ లెటర్ పేరు తో కొవ్వు లెటర్స్ రాసినప్పుడు,నా డబ్బు మదం తో నేను ''ఎప్పుడు ఆ వెలిసి పోఇన బట్టలేన ?''అంటు అందరిముందు రెండు చుదిదార్లు నీ అహం దెబ్బతీస్తూ ఇచ్చినా నువ్వు సున్నితం గా నవ్వుతు తిరస్కరించినప్పుడు,నా జీవిత లక్ష్యాలని నిర్దేశించి ఇది సాధించి వచ్చిన రోజు నీ లవ్ లెటర్స్, చుదిదార్లు తీసుకుంటానని నాకు మార్గ నిర్దేశం చేసినప్పుడు,నువ్వు నాలో హిమాలయ పర్వతం లాగా ఎదిగి పోయావు.సివిల్స్ లో విజయం సాధించి నే రాసుకున్న loveletters నీ , నే నీకోసం కొన్న బట్టల్ని తీసుకుని నీ ముంగిట valalani కలలు గన్నా,ఆ బడా పరిశ్రామక వేత్త మా ఇంటి కొచ్చేదాకా.''మా అమ్మాయిని కోడలి గా స్వీకరించే బాద్యత మీది, మీ వాడిని సివిల్స్ ఇంటర్వ్యూ లో పాస్ చేయించే బాద్యత నాది ''నాన్న తో అంటున్న అయన మాటలకి నాన్న తప్పకుండ బావగారు ,నేను వాణ్ణి చిన్నప్పటి నుంచి తల్లి లేక పోఇన మళ్ళి పెళ్లి చేసుకోకుండా కంటి కి రెప్పల పెంచుకున్నా , నేను జీవితం లో మొట్ట మొదటి సారి కోరే ఈ కోర్కెని వాడు కాదనగాలాడ? అంటే ఈ తండ్రి బతికుండా గలడా?అంతే నా ప్రేమ సమాధి ఐ పోయింది.అప్పటి నుంచి ఇన్నేళ్ళు నిన్ను నేను శాశ్వతం గా మర్చి పోయాననే అనుకున్నా.నీ మనసు యవనిక మీద నేను చేసింది ఉగ్రవాది దాడి కదా?ఎన్ని అవమానాలు చేశాను, యెంత అధికారం నీ మీద ప్రదర్శించాను?ఎక్కడున్నావు నేస్తం?ఈ ఉగ్రవాదుల తుటాలకి నేను బలి అయి పోయే లోపు నేను నీ మనసుకి చేసిన గాయాన్ని నా కన్నిలతో తుడిచేసి, నీ పాదాల మీద పడి క్షమాప్పన వేడుకుని , నీ వొడిలో వొదిగి పోయి, ఆఖరి శ్వాస విడవ గలిగే అద్రుష్టం ఈ జన్మ కి వుంటుందా?ఒక పక్క granide పేలిన శబ్దాలు, తూటాల పేలుళ్లు, ఇవేవీ నా లో ఏ భయాన్ని కలిగించటం లేదు కానీ నేను చని పోయే లోపు ఒక్కసారి నా కన్నిలతో నీ పాదాల్ని కడిగి మనసు బరువుని దించుకుని హాయ్ గా వేల్లిపోని.భగవంతుడు ఒక్క అవకాశం నాకిచ్చి ఇప్పుడు బతక నిస్తే నా మొదటి ప్రయత్నం నీ కోసమే నా అన్వేషణ. ఈ విశాల ప్రపంచం లో నువ్వు నా జ్ఞాపకాలతో ఎక్కడో పదిలంగా నే వుంటావు.ఇంతలొ నా రూమ్ కొడుతున్న శబ్దం. ఎవరు ఉగ్రవాదుల?ఒకటే నిర్ణయం తీసుకున్న నిన్ను మళ్ళి కలుసుకునే యోగం వుంటే నే బ్రతుకుంట, ఆ అర్హత లేక పొతే ఈ క్షణమే మరణిస్తా అనుకుంటూ తలుపు తీసా. ఎదురు గా nsg కమోన్దోస్, pl కం సర్ అంటు ఎస్కార్ట్ chesi మళ్ళి జన జీవన స్రవంతి లో పడేసారు.నే చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇంకోసారి భగవంతుడు నా కిచినట్టు గా భావిస్తూ నా అన్వేషనని అశ్రు నయనాలతో మొదలెడుతున్నా.