10 ఆగ, 2015

చాగంటి అయ్యో యేమిగంటి ?


Image result for chaganti pravachanam on shankara bharanam
చాగంటి వారి ప్రవచనాలు విని ఆస్వాదించి అభిమానులుగా మారిన వేలాది టీవి ప్రేక్షకుల్లో నేనోకన్ని . సరస్వతి పుత్రులు , ప్రవచన చక్రవర్తులు అనడం లో కించిత్తు సందేహం లేదు . అయితే అనుకోకుండా ఈ రోజు ఆఫీసు నుంచి వచ్చాక కాఫీ తాగుతూ టీవి ఆన్ చేస్తే వొక ఛానల్ లో శ్రీనగర్ కాలనీ లో సత్యసాయి నిగామాగం నుంచి లైవ్ లో ఆయన ప్రవచనం ప్రసారమవుతోంది . ఆహ ఏమి నా భాగ్యము అనుకుంటూ సౌండ్ పెంచి వింటున్నా .
''రాముడు మర్నాడు పట్టాభి సేకానికి సంసిద్ధుడు అవుతూ తండ్రి మాట నిలబెట్టడం కోసం అరణ్య వాసానికి వెళ్ళవలసి వస్తే రెండిటిని సమంగా స్వీకరిస్తూ  కార్యోన్ముఖుడై వెళ్ళిపోతాడు . గురు శిష్య సంభందాన్ని తెలిపే ఉదాత్త కావ్యం శంకరా భరణం . ఆ నాటి బాల శంకరం (తులసి) తన తల్లి (మంజుభార్గవి) తో కలిసి ఈనాడు వేదిక మీద నర్తిస్తుంటే కన్న తండ్రి (దర్శకుడు విశ్వనాధ్)ఎదురుగా వీక్షిస్తూ  ఆనంద భాష్పాలు  రాలుస్తుంటే  యిదొక అద్బుతమైన రోజులా నా జీవితం లో నిలిచి పోతుంది .శంకర శాస్త్రి  సంగీతానికి యెంత ప్రాధాన్యం యిస్తారో కూతురు పెళ్లి చూపు లప్పు డే  తెలుస్తుంది .అయన ఆర్దిక పరిస్తితి సహకరించక పోయినా స్నేహితుడి ప్రోత్సాహం తో పెళ్ళిచూపులకి సరే అంటాడు . అక్కడ అపశృతి పాడిన కూతురి చేత ఆరోహణ అవరోహణ చెప్పిస్తాడు . యిలా సినిమా కధ ని  ప్రవచనం లా చెప్పేస్తూ మద్యలో రామాయణ మహాభారతల ఘట్టాలతో పోలుస్తూ సాగి పోతోంది . పైగా మూడు రోజులనుంచి ఈ శంకరా భరణం సినిమా ముప్పై ఆరు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ప్రవచనాలు సాగి పోతున్నాయట . నాకు మంచి విందు భోజనం లో పంటి కింద రాయి వచ్చిన అనుభూతి కలిగింది .
మొన్ననే ఆయన ప్రవచనాల స్పూర్తి తో అరుణాచలం వెళ్లి అర్దరాత్రి గిరి ప్రదక్షిణ చేస్తే నేను మా సహచరులు ముగ్గురి తో కలిపి కేవలం నలుగురం మాత్రమె వున్నాము . మద్యలో ఆయన ప్రవచిచినట్టు గానే వూర  కుక్కలు కొంత దూరం వచ్చి వెనక్కి పొయెవి. అంతే గాని గుంపులు గుంపులు గా కాదు కదా కనీసం  నర  సంచారం లేదు . యింద్ర కీలాద్రి పర్వతం చూట్టూ  విజయవాడ  రోడ్ల మీద తిరిగితే ఎలా వుంటుందో అలాగే తిరువన్నామలై లో కూడా అనిపించిన్ది. అయితే అగ్ని లింగం అభిషేకానికి గర్భగుడిలో కుర్చునప్పుడు బయట వాతా వరణం తో సంభంధం  లేకుండా వేడి గా వుండడం భగవత్ నిదర్శనమ్. అయితే చాగంటి వారి ప్రవచనం విని వెళ్ళిన  వాళ్ళకి కొంత నిరాశ కలగడం సహజం . వారి ప్రవచనం లో కొంత అతిశయోక్తి ఉంటుందేమో అని పిస్తోంది . యిన్నాళ్ళు దైవ సంభంద విషయాల పైనే ప్రవచించిన  వారు యిప్పుడు కొత్తగా హిట్ సినిమాల మీద ప్రవచించడం వాటికి సందర్భోచితం గా రామాయణ మహాభారత ఘట్టాల్ని జోడించడం  అంత అభిలషణీయం కాదు . నేను టీవి చూస్తునప్పుడు  అప్పుడే ఆ గదిలోకి వచ్చిన మా అబ్బాయి డాడి  రేపు బాహుబలి గురించి కూడా   చెబుతారా? అంటూ తన గది లోకి వెళ్లి పోయాడు . ఏమో ఆలోచిస్తే శ్రీమంతుడు , బాహుబలి సినిమాల్లో కూడా వారు ప్రవచించ దగ్గ సన్నివేశాలు చాలానే వున్నాయని పించింది . వొక కన్నతల్లి తన చనుబాలని తన సొంత కొడుకు తో పాటు పెంచిన కొడుకు కి స్తన్యం యిచ్చి బాహుబలి అని నామ కరణం  చెయ్యడం యెంత ఉదాత్తమైన సన్నీ వేషం . అలాగే కామం మనిషిని మరణానికి గురి చేస్తుందన డానికి నిదర్శనం గా శంకారాభరణం బలాత్కార సన్నీ వేషాన్ని వుదహరిచ లేదనే అనుకుంటున్నా . ప్రేమతో కూడిన కామం గమ్యానికి అడ్డం వచ్చినా తప్పులేదని బాహుబలి నిరూపించాడు అంటూ ప్రవచిన్చలేమో ?అమ్మో మళ్ళి ఈ విషయం'' అన్నపూర్ణ సుంకర వీడియో ''(తెలుగు సినిమాల మీద) లాగ వివాదాస్పదం  కాదు గదా ?
అయినా చాగంటి వారి అభిమాని గా శంకరాభరణం శంకర శాస్త్రి  గారిభాషలో  '' తాళం తప్పుతోందయ '' అనడం లో తప్పు లేదు గా?