31 జన, 2012

చాలు చెలి

        
నిశ్చలం గా సాగుతున్న నా జీవితం లోకి 
నిశబ్దం లా వచ్చావ్   ప్రేమ పెంచుకుని  
లత లాగ అల్లుకు పోతుంటే గుండె కోత కి గురిచేస్తూ
మరిన్ని పాదులని దరి చేర్చావు   
వొకటే కదా అనుకుని సర్దుకు పోతుంటే నీ చపల బుద్ది తో  
మరిన్ని పెంచేసావు .నాలోని ప్రేమని తున్చేసావు 
నేను పోదలలలో వొక పాదు గా వుండడం యిష్టం లేక  
అల్లుకోడంఆపేస్తాను .నన్ను కోల్పోయావన్న విషయం గ్రహించాకుండానే 
వాడి పోయి వీడి పోతాను .యిక్కడి తో ఆగి పోతాను .
నీ జ్ఞాపకాల పొరలలో గుర్తుకొచ్చి చూసుకుంటే 
నీకు మిగిలేవి అలనాటి మన మదుర స్మృతులే 
అయినా అది మరిపించ డానికి  , నిన్ను మురిపించడానికి 
నీ కెప్పుడు సిద్దం నీ కొత్త స్నేహితులు .
మార్పు నీ జీవితం లో వొక కూర్పు  
అది చూస్తూ కూడా ప్రేమించ డానికి లేదు నాకు వోర్పు
అనుక్షణం ప్రమోదాల కోసం ప్రమాదాల అంచున పయనించడం 
నీకే సాద్యం .
ప్రమాదాల మద్య ప్రమోదం వెత్తుకోవడం నా కసాద్యం .. 
నువ్వొక నిరంతర సుఖాన్వేషి 
నేనొక ప్రేమ పిపాసి 
రెండు సమాంతరాలు 
నా పయనం నీతో యింక చాలు 
యింకో కొమ్మ మీద వాలు  
వేరే వాళ్లతో యధా విధి గా నీ ఆనందం గ్రోలు ..


24 జన, 2012

మళ్ళి మొదలయ్యింది

 
  మొన్న వొక మిత్రుడు ఫోన్ చేసి నువ్వు రాసే కధ లోని పాత్రలన్నీ నా నిజ జీవితం లోకి నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి .నువ్వు రాసినట్టే నా జీవితం లోకివొక రాధ వచ్చి వలపులు పంచి లతలాగా అల్లుకు పోతూ వుంటే యింకో రాజు రావడం తో నా పాదుకు నీళ్ళు పొయ్యడం మానేసింది . మళ్ళి నా లతలు చిగురించి నా పాదు అల్లుకునేలా మంచి ముగింపు నివ్వు నీ కధకి ప్లీజ్ అంటూ అభ్యర్ధించాడు .
        నాకు నమ్మ బుద్ది కాలేదు.చినప్పుడేప్పుడో చూసిన కల్పన  సినిమా లో అనుకుంటా అల్లు రామలింగయ్య కధలు రాసుకుంటుంటే అతని ముందు పాత్రలు ప్రత్యక్షమయ్యి అతని తో వాదనకి దిగుతుంటాయి . అలాగా నేనేదో ఊహించి కధ రాస్తే అచ్చు అలాగే వేరే వూళ్ళో వున్న స్నేహితుడికి అవడం ఆశ్చర్యం అయినా అతని తృప్తి కోసం అలా ముగిసింది కధ కి ముగింపు గా మళ్ళి మొదలయ్యింది రాస్తున్నా . మరి యిది రాసాక వాళ్ళిద్దరి మద్యసయోధ్య కుదిరి  మోడు చిగురిస్తే మంచిదే .
       సుధ నెంబర్ తీసేసాక కష్టం మీద రెండు రోజులు గడిపా . దానికే నాకు రెండేళ్ళు అయినట్టు గా  అనిపించింది .తను ఈ రెండు రోజుల్లో ఎప్పు డన్నా ఫోన్ చెయ్యక పోతుందా అని ఆశిస్తూ ప్రతి అడ్డమైన అపరిచిత నంబర్ల ఫోన్లు ఎత్తే వాణ్ణి .వొక అమ్మాయి గొంతు సుధ లాగే వుంది .
ఏమండీ మీతో నేను రెండు నిమిషాలు మాట్లాడొచ్చా ?అడుగుతోంది .
రెండేళ్ళు మాట్లాడుకున్నాం యింకో రెండు నిమిషాలే గా కానీయ్యండి అన్నా 
మీకు ఎప్పుడన్నా అర్జెంటు గా డబ్బులు అవసరం పడి  చేతిలో డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు ?
మీ దగ్గరే తీసుకుంటా. రుణాను బందం తో మీరే పత్ని గా వస్తారని ,
క్షమించండి సార్ నేను ఐ సి ఐ సి ఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా మీకేమన్నా లోఅన్ కావాలేమో అని  ఫోన్ చేశా అంది .నేను ఐ సి అని ఫోన్ పెట్టేసా . ఈ అమ్మాయి పిచ్చి లో పడి ఎవరు ఫోన్ చేసినాఆమె నేమో అని పిస్తోంది . అయినా నా పిచ్చి గాని కొత్త అనుభందాల గుభాలిమ్పుల్ని ఆస్వాదించే ఈ సమయం లో మోడు వారిన పందిరి ఎందుకు గుర్తుకు వస్తుంది .తీగకు పందిరి కావలె గాని తెలుసా నువ్వే పందిరని ?
కార్ యింటి వైపు సాగుతోంది , యిది వరకు రోజుల్లో వాళ్ళింటి వైపు సాగేది .
చీకటి లో కారు చీకటి లో కాలమనే పడవలో లోకమనే యేరు లో ఏ దరికో ? ఏ భువికో ?
యింతలో సెల్ మోగడం తోతీసా .వొక్క సారి వెయ్యి తంత్రువులు మోగినట్టు గా
ఏంటి బంగారం ?మర్చి పోయావా ?ఏంటి రెండు రోజులనుంచి ఫోన్ లేదు ?ఊర్లో లేవా ?
ఏ గొంతు కోసం నేను పరితపించానో,ఏ గొంతు వేరే వాళ్ళకి కూడా స్పందిస్తోందని బాధ పడి వదిలేసుకున్దామని నిర్ణయించు కున్నానో , ఏ గొంతు స్వరం తో రెండేళ్ళు గా గంటలు గంటలు శృతి కల్పిశృతి తప్పానో అదే గొంతు నాకు నిదట్లో కూడా జోల పాడె గొంతు యిక శాశ్వతం గా నాకు మూగ బోయిన్దనుకున్నా ఆ గొంతు పలకరించిన ఆనందం లో నా గొంతు మూగ బోయింది .కళ్ళలో ఆనందా శ్రువులు , మాట రాని మౌనం .
 ఎంట్రా కోపం వచ్చిందా ?ఏంటోరా  అందర్నీ ప్రేమించే తత్త్వం నాది . ఎవర్ని నొప్పించ లేను , వొక్క సారి రాకూడదా కాఫీ తాగి వెళొచ్చు చూసి  కూడా ఎన్నో ఏళ్ళు  అయినట్టు వుంది తన ధోరణి లో తను చెప్పుకుంటూ పోతోంది .
నాలో ఈ రెండు రోజులనుంచి దాచుకున్న దుక్కం వెల్లువలా పెల్లుబికి వస్తుంటే ఆపు కోవడం కష్టం అయ్యి పైకే ఏడ్చేసా .ఆడ కైనా మగ కైనా ఔట్లెట్ కన్నీరే అయినప్పుడు ఆపుకోవడం దేనికి ?
ఏంటి బంగారం అంత సెన్సిటివ్  ?టెక్  ఇట్ ఈజీ రా యింట్లో మాట్లాడుకుందాం ఎదురు చూస్తూ ఉంటా సరేనా ?అంటుంటే ఉ అండం తప్ప యింకేమి అనలేక పోయా .తన మీద వున్న కోపం అంతా ప్రేమ పూర్వకం గా ఆమె పలకరించే టప్పటికి గాలికి యెగిరి పోయింది .
వాళ్ళింటికి వెళ్ళే టప్పటికి తను పిల్లలు వున్నారు . వాళ్ళు బెడ్రూం లో హోమేవోర్క్ చేసుకుంటుంటే మేము డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చుని కాఫీ  తాగుతూ వుంటే మునిపటి లాగ  కళ్ళలోకి చూస్తూ అడిగింది . ఈ రెండు రోజులు మాట్లాడకుండా ఎలా వున్నావు ?
     ఏముంది సుధా టైం దొరికితే నీతో మాట్లాడడం, లేకపోతె నీ గురించే మాట్లాడం  ఈ వలయం నుంచి నే బయట పడలేక పోతున్నా ,నీ నంబర్ డిలిట్ చేసేసా కాబట్టి  నా స్నేహితుడి తో నీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ గడిపేసా వాడు విసుకున్నా సరే .
   యింతలా అనుక్షణం  నా గురించి ఆలోచించే వ్యక్తీ నా జీవితం లో ప్రవేశించడం నా అదృష్టం  తన స్పందన యింకా పూర్తీ కానే లేదు తన సెల్ మోగింది .. హా రమేష్ తను వచ్చారు యిద్దరం మాట్లాడుకుంటున్నాం మన మద్య జరిగిన వన్ని చెప్పెసానులే .ఆ అన్నీను తను వత్తి పలుకుతోంది .
    యిదివరకులా నాకు కోపం రావటం లేదు .బాధే సౌక్యమనే  భావన రానిస్తున్ననేమో ? తను నిజం చెప్పేసింది కాబట్టి మోసం చెయ్యటం లేదన్న భావమో ?తను తప్పు చేశా అన్న నిజం చెప్పేస్తే ఆ తప్పు నా లెక్క లో తప్పు కాదేమో ?ఏమో ఆ భావం మొత్తానికి తను ఆ రమేష్ తో నా ముందే  మాట్లాడుతున్నా నేను ఆమె మోములో ఆనందాన్నే గ్రోలుతున్నా  గాని యిది వరకులా నా లో రాక్షసుడు విజ్రుభించటం లేదు . తను కూడా నా మొహం లో ప్రసాంతత ని చూసి  యిరవై నిమిషాలకే వుంటాను రా మళ్లీ మాట్లాడుతా అంటూ సెల్ పెట్టేసి నా కేసి తిరిగి అబ్బో గొప్ప మార్పే మీలో అంటూ మెచ్చు కోలు గా చూస్తోంది .అయినా యింత దూరం  వచ్చే సాక మారక చస్తామా ?ఇప్పుడున్న వాళ్ళు తప్ప మరింక కొత్త వాళ్ళు ఎడ్ అవకుండా దేవుణ్ణి ప్రార్ధించడం తప్ప .మన మనసులోనే బాధ వుంటుంది  చూసే కోణం మార్చుకునప్పుడు  ఆ బాధ అదే పోతుంది .యింతకు ముందు నే వచ్చినప్పుడు రమేష్ తో సెల్ మాట్లాడితే మనసు సహించేది కాదు దాంతో కోపం , బాధ ఉక్రోషం అన్ని కలిగేవి .యిప్పుడు నేను చూసే కోణం మార్చుకుని ఆమె మాట్లాడుతుంటే నేను కుడా లాక్కుని మాట్లాడడం తో నాలో వ్యతిరేక భావం పోయింది .మళ్లీ ఎప్పటిలాగే ఆమె నవ్వుతు మాట్లాడుతోంది .నేనుకూడా ఆమె నుంచి ఏమి ఆశించటం లేదు కాబట్టి మళ్లీ మామూలు పరిస్తితులు మొదలయ్యి మళ్లీ మా యిద్దరి మద్య  అలా మొదలయ్యింది .
        మాటల మద్యలో తను చెప్పింది రమేష్ నేలాఖరకి ఇక్కడకి వచ్చి తన పని అయ్యేదాకా వుండి అప్పుడు పోతాడని . మళ్లీ నా మనసులో అలజడి . ముందుంది నాకు అగ్ని పరీక్ష అప్పుడు కూడా యిలాగే నవ్వుతూ వాళ్ళిద్దర్నీయింట్లో వదిలేసి వీడ్కోలు పలక గలనా ? అంత ఎత్తుకు ఎదిగానా ? లేక తను నాతొ స్నేహం కంటిన్యూ చెయ్యడానికి నే వేసుకున్న ముసుగా?కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి .

8 జన, 2012

అలా ముగిసింది ?

                  
 
                     రోజులో కొంత సమయాన్ని సుధ తో సరదాగా సెల్లు కబుర్లు చెప్పుకుంటూ కొత్త ఉత్సాహం పొంది రోజంతా తాజా గా వుండడం అలవాటయ్యి పోయి , గత నాలుగు రోజులు గా తనతో మాట్లాడక మనసంతా గజి బిజీ గా తయారయ్యి  యింక ఉండ బట్ట లేక   మార్నింగ్ వాక్ కి వెళుతూ వాళ్ళింటికి వెళ్లి తనని వొకసారి చూసి పోదామని తలుపు కొట్టా. ,అప్పటికే ఎనిమిది దాటింది .నిద్ర మత్తులో లేచి తలుపు తీసింది .తను ఏదో అనే లోపే నేనే సారీ అండి మీ తాజా  కొత్త మిత్రుడు యిపాటికే మిమ్మల్ని సెల్ చేసి నిద్ర లేపి వుంటాదనుకుని వచ్హా అన్నా .అన్నానో లేదో ఆమె సెల్ మోగడం ఆమె దాన్ని చెవిలో పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళడం వొకే సారి జరిగి పోయాయి .వాళ్ళ హబ్బి యింక బెడ్ రూం లో పడుకునే వున్నాడు .నేనే అక్కడ సోఫాలో కూలబడి ఆమె యెంత ఆనందం గా ఆ ఫోన్ లో మాట్లాడుతుందో గమనిస్తున్నా .యింతకు ముందైతే వంటింటి దాక వెళ్లి ఆమె కాఫీ పెడుతుంటే మాట్లాడుకోవడం రివాజ్.యిప్పుడు కనీసం కూర్చొన్డని    కూడా అనకుండా గజేంద్ర మోక్షం లో శ్రీహరి లా సిరికిన్చేప్పాడు టైపు లో వెళ్లి పోయింది .మాటల బట్టి కొత్త వలస కొత్త స్నేహితుడని అర్ధం అవుతోంది . ఆయనా గాని కన్ఫం చేసుకోవడానికి అతని సెల్ కి కొట్టా యధా విధి గా ''మీరు కాల్ చేస్తున్న కస్టమర్ మీ మాజీ కస్టమర్ తో బిజీ గా వున్నారు '' అని అనిపించింది .యిరవై  నిముషాలు అయినా ఆమె వంటింట్లో సొల్లు కబుర్లే గాని బయటకు రావడం లేదు .వాళ్ళ  ఆయన గురక పెట్టి మరి నిద్ర పోతున్నాడు .అదృష్ట వంతుడు నిద్ర లేని నిసి  రాత్రులు నాకు  బారెడు పొద్దెక్కినా గురక పెట్టె పట్ట పగళ్ళు శ్రీవారికి . కొన్ని జాతకాలు  అంతే.
''అదేంటి రా యింకా చూపించు కాలేదా ?ఈ రోజే వెళ్లి చూపించు కో అసలే ఈ మద్య కళ్ళు  తిరుగు తున్నాయి అంటున్నావ్ ?''(అండి నుంచి రా కి ఎదిగి పోయేంత దగ్గర అయ్యారని ఆమె మాటలలో అర్ధం అవుతోంది,ఎవరి రోగం ఎవరికి అంటూ కుందో ఖర్మ )ఆమె మాటలే విని పిస్తున్నాయి
''జర్నీ సినిమా బావుందా ?అయితే ఈ రోజే మా ఆయనని తీసికెళ్ళమని చెపుతా  నువ్వు చూసింది ప్రతిది నేను చూడవలసిందే . ఎంతైనా మనిద్దరం కడ దాక జర్నీ చెయ్యవలసిన వాళ్ళం కదా ?''అంటూ విరగ బడి నవ్వుతోంది. (యింతకీ కడ దేర్స్తున్నది ఎవరు ?)ఆమె కిటికీ కి ఆనుకుని అలా సెల్ లో మాట్లాడు తోందే గాని నా ఉనికిని అస్సలు పట్టించు కోవడం లేదు . కనీసం కాఫీ పెట్టడానికి పొయ్యి కూడా వెలిగించడం లేదు .
ఇలాంటి త్రునికరణ భావం నేనెపుడు చూడ లేదు వెళ్ళిన అయిదు నిమిషాల్లోనే వేడి వేడి కాఫీ తో యిద్దరికీ తీసుకొచ్చి డైనింగ్టేబుల్ దగ్గర కళ్ళలో కళ్ళు బెట్టి మరి మాట్లాడేది .దూరం పెరిగిందనుకున్నా  గాని అక్కడ
ఆఘాదమే   వుందని అప్పుడే తెలిసింది .ఈ అవమానం భరించడం నా వల్ల కాలేదు . సోఫా లోంచి లేచి గుమ్మం వైపు రావడం ఆమె చూస్తూనే వుంది . తలుపు తీసుకుని లిఫ్ట్ నొక్కడం కూడా ఆమె కి కనిపిస్తోంది . కాని అవెం పట్టనట్టు తన కబుర్లలో పడి పోయి కనీసం నన్ను ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదు . ఆమె నవ్వు నన్ను పోరా అని ఎక్కిరించి నట్టు అయ్యింది .నీకు అవతలి వ్యక్తీ అంత యిష్టం అయినంత మాత్రాన యింటికొచ్చిన  నీ నిన్నటి వ్యక్తీ ని అంత గా గాయ పరచాలా ?నీ జర్నీ లో నేనుకూడా కొంత కాలం తోడూ గా వచ్చాను గా ?ఏమన్నా గాని ఈ మానసిక వ్యధ భరించడం కష్టం అయిపోతోంది .భగవంతుడే ఏదన్నా పరిష్కారం చూపిస్తే బావుండును .స్నానం చేసి పూజ లో కూర్చున్నా .అష్తోత్రాలు  సహస్రాలు అయిపోయాయి . కళ్ళు మూసుకుని అలా చాలా సేపు కూర్చున్నా .నా సమస్యకి వొక పరిష్కారం గోచరించింది .వెంటనే లేచిమేమిద్దరం ఆదివారపు సాయంత్రాలు వెళ్ళే గుడి కి వెళ్లి యిద్దరం కలిసి చదివే అన్నపూర్ణా స్టకం , లింగాష్టకం చదువుకుని  దర్సనం అయ్యాక గుళ్ళో కూర్చుని ''గుడ్ బై   ఫర్ ఎవెర్'' అని మెస్సేజ్ తన నెంబర్ కి పంపి  సెల్ తీసుకుని సుధ నంబర్, వాళ్ల ఆయన నెంబర్ డిలీట్ చేసేసా .ఎప్పుడు పేరు చూసి డైల్ చెయ్యడమే గాని నంబర్ గుర్తు పెట్టుకునే అలవాటు ఎప్పుడో పోయింది . నాకేమో అపరిచితుల నంబర్ నుంచి వచ్చే కాల్స్ అటెండ్ అయ్యే అలవాటు లేదు . అసలు యిప్పటి ఆమె మానసిక స్తితిలో ఆమెంతట ఆమె నాకు ఫోన్ చేసే అవకాశమే లేదు . వుండి వుంటే ఫోన్ చేసి కనీసం అలా వెళ్లి పోయారెంటి ? అని అన్నా అడిగి వుండేది . నేనే ఎప్పుడన్నా మనసు వుండ బట్టలేకఈ నాలుగు రోజుల్లో  ఆమె కి చేస్తే  అప్పుడు కూడా ఎంగేజే  అది విని మనసు బాధ పడటం   . సో యిప్పుడు ఆ పరిస్తితి లేదు కాబట్టి నా గ్రహస్తితి ఏమన్నా మారి మళ్లీ ఎప్పటి లాగ నేను  హ్యాపీ గా హాయ్ గా జోకులు వేస్తూ నా దైనందిన జీవితం గడుపు తానని నా ఆశ .యింటి  కొచ్చి గార్డెన్ లో మొక్కలకి నీళ్ళు  పోస్తున్నా . బయట మందార పూలు విచ్చు కోవడానికి సిద్దం గా వుండి అందం గా రేకలు ఊపు తున్నాయి  . కనకాంబరాలు  గాలికి తలలు ఊపుతూ నా నిర్ణయాన్ని సమర్దిస్తునట్టు గా అనిపించింది . రోజు పోస్తున్నానిన్నిలా లేదే మొన్నిలా లేదే అనిపించింది . అవును మరి ఎలా వుంటుంది ఆ టైం లో కూడా సెల్ లో ఆమె తో సొల్లు కొడుతూ ఈ ప్రక్రుతి అందాలూ పట్టించుకుంటే గా ?
                               ''రమేష్ గాన్ని వదిలేసావెంట్రా ? ''
సాయిబాబా బండి  తోసుకుంటూ అదే టైం లో వచ్చి బిక్షాటన చేసే భార్య భర్త  వాళ్ల పిల్లాడి తో అంటున్నారు .
అవును సుధది  వాళ్ల ఆయనది తీసేసా  గాని ఆ రమేష్ దే తియ్య లేదు గా ? రేపు టెంప్ట్ అయ్యి వాడి నంబర్ కి కొట్టి అదిఎంగాజ్ లో వుంటే మళ్లీ ఈ వేదన మొదలేగా . వెంటనే భగవంతుడి కి ధన్య వాదాలు చెప్పి అది కూడా తీసేసా .నంబర్లు అయితే తీసేసా, మనసులోంచి తీసేయ్య గలనా ?అలా ముగుస్తుందా మళ్లీ అలా మొదలవుతుందా ?కాలమే నిర్ణయించాలి .(అంతులేని కధ )
(మళ్లీ తొక్క లాగ ఆఖర్న కధ అని ముక్తాయింపు వొకటి అనుకుంటే నేనేం చెయ్యలేను  )4 జన, 2012

ఆమె మారదు 
 సుధ తో నా పరిచయం రెండేళ్ళు .ఈ రెండేళ్ళల్లో ఆమె ని కాచి వడ బోసాననుకున్నా మొన్నటి దాకా .మొన్నటి తో ఆ బ్రమలు తొలగి పోయాయి .ఆఫీసు కి వెళుతునప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ తనతో మాట్లాడం నా కలవాటు .ఎందుకంటె వొకసారి ఆఫీసు కి వెళ్ళాక పని వత్తిడి వల్ల  సందర్శకుల తాకిడి వల్ల మాట్లాడే అవకాశం వుండదు . మళ్ళి లంచ్ టైం లోనే కాసేపు మాట్లాడతా.  రాత్రి యింటికి వచేటప్పుడు డ్రైవ్ చేస్తూ మళ్ళి .యిలా చాలా రోజులు కొన్ని వందల గంటలు మాట్లాడి ఉంటా .అందులో సొల్లు కబుర్ల తో బాటు సోలో కబుర్లు కూడా ఉండేవి .కాలమలా సాగి పొతే బానే ఉండును .ఈ నాటి నేను రేపటికి తన నిన్నటి జ్ఞాపకాలలో మిగిలి పోతానని ఆ రోజు యింత త్వరగా వస్తుందని నేననుకోలేదు .
 ఆ రోజు కూడా యధా విధి గా కారు ఎక్కగానే  తన సెల్ కి కొట్టా .  బిజీ tone  . మళ్ళి కొట్టా . అదే స్పందన . ఆఫీసు కి వెళ్ళాక కూడా కొట్టా యింకా బిజీ tone  .యింతవరకు అలాంటి పరిస్తితి ఎదురయినప్పుడు తనే ప్రస్తుత కాల్ కట్ చేసి నా కాల్ తీసుకుని ఫలానా వాళ్లతో మాట్లాడుతున్నా మళ్ళి చెయ్యనా అనేది .యిప్పుడు ఆ మర్యాద కూడా లేదు .ఎందుకుంటుంది ?ఆ రోజు వాళ్ళింట్లో ఆమె,అతని కొత్త స్నేహితుడు రమేష్  అంత రంగిక  సమావేశానికి పానకం లో పుడక లా వెళ్ళాక . అసలు ఆ రోజు పొద్దున్నే మార్నింగ్వాక్ కి వేల్తునప్పుడే అనుకున్నా వాళ్ళింటికి వెళ్ళాలని . వాళ్ళా అయన వూళ్ళో లేనప్పుడు తగుదునమ్మ అని ఆయన స్నేహితుడు రమేష్ రావడం ఏంటి ?పిల్లలు స్కూల్ కి వెళ్ళగానే ఆమె ఆతను మాత్రమె వుంటారు.అందులో సుధ నేచర్ కి అగ్గి పుల్ల కూడా వెలిగించ నక్కరలేద్దు .ఆతను అంతకు ముందు రాత్రే వచ్హినట్టు సుధ తో రాత్రి  ఫోన్ మాట్లాడి నప్పుడే అర్ధం అయ్యింది , ముక్త సరి గా మాట్లాడితే అతిధి ప్రభావం అనుకున్నా గాని అంతరంగిక అగ్ని జ్వాలలు అని మాత్రం గ్రహించ లేక పోయా .. నే వెళ్ళే టప్పటికి పిలలు స్కూల్ కి వెళుతూ ఎదురొచ్చారు . యింట్లో నేను ఆమె , రమేష్ ముగ్గురమే . ఆమె మొఖం లో ఎక్కడా ఆహ్వానం లేదు సరి కదా అదేంటండి ఆఫీసు టైం అవటం లేదా అని పలకరింపు .నాకు కోపం సర్రున వచ్చింది వెంటనే లేదండి ఈరోజు ఆఫీసు కి పోవటం లేదు మీ విషయం తెల్చుకున్దామనే వచ్చా అంటూ లేని నవ్వు పులుము  కున్నా  అతిధి కి అనుమానం రాకుడదని .ఈలోపు తప్పదనట్ట మా వారి స్నేహితుదండి , విశాక లో మాస్టారు అంటూ పొట్టి గా నల్ల గా గడ్డం తో మాములు గా వున్నా వ్యక్తీ ని పరిచయం చేసింది .ఆతను లుంగి బనీను తో వున్నాడు .మీరింకా నాలుగు రోజులు ఉంటారా ?మనసులో మాట ప్రశ్న రూపం లో బయటకొచ్చేసింది .
రెండు రోజుల లో పని చూసుకుని వెళ్లి పోతా దేనికి అని అడిగాడు . న్యూ ఇయర్ దాక వుంటే మా అందరి తో పాటు పార్టి కి వస్తారని అని కవర్ చేశా .ఆ క్షణం లోవారం రోజుల తర్వాత  సుధ ,వాళ్ల అయన తో పాటు రమేష్ కూడా న్యూ ఇయర్ పార్టి కి వెళ్ళేంత క్లోజ్ అయి పోతారని నాకు తేలి లేదు .మాటల లో నా కర్డంయ్యిందేంటంటే  నలభ ఏళ్ళు వచ్చినా అతనీ యింకా పెళ్లి కాలేదని .యింతలో ఆతను బాత్ రూం లోకి వెళితే వంటింట్లో సుధ దగ్గరికి వెళ్లి
'' నాకిన్డెం నచ్చలేదు అన్నా'' .
నాకు నచ్చలేదు నువ్విలా రావడం , అనుమానం తో తే వచ్చావు
అవును నాకు అతని మీద నమ్మకం లేదు అందుకే రోజంతా యిక్కడే అన్నా
విందు భోజనం తిందా మనుకునప్పుడు అడ్డుపడ దానికి వచ్చిన వాడిలా కని పిస్తున్నా ఆమె కళ్ళకి
క్రోధం తో రొట్టెల కర్రని విసిరేసి మీ రెల్లి పొండి  యిక్కడ నుంచి అరిచి నంత పని చేసింది . బాత్ రూం లో నీళ్ళ చప్పుడు ఆగి పోయింది అతిధి కి కూడా అంత రంగిక విషయాల మీద మక్కువ ఎక్కువనుకుంటా నా లాగే . . నేను వీసా విసా వంటింట్లోంచి వెనకి తిరిగి వీధి గుమ్మం దాకా వచేసా .వెళ్లి పోవడానికి మనస్కరించటం లేదు .మనసేదో కీడు సంకిస్తోన్డి .వెనక్కి తిరిగి చూస్తె ఆమె వంటింటి తలుపు కూడా నా మొఖం మీద భళ్ళున వేసి లోపల తన పనిలో నిమగ్న మయ్యింది .అతిధి మళ్ళి నీళ్ళు ఆన్ చేసాడు వెళ్లి పోయాననుకుని . అప్పుడు నా మదిలో వచ్చిన ఆలోచనని అమలు పరిచా .బెడ్ రూం కి ఆనుకుని వున్నా బాత్ రూం లోకి దూరి తలుపు దగ్గర గా వేసి లోపల వున్నా  . నా ఉద్దేశం  వాళ్ళిద్దరూ నా గురించి యిప్పుడు ఏమి మాట్లాడు కుంటారా అని . సెల్ సైలెంట్ మోడ్ లో పెట్టి ఊపిరి బిగ పెట్టి చేవులిక్కరించి వింటున్నా . నే వెళ్లి పోయాననుకుని ఆమె వంటింట్లోంచి వచ్చి విధి తలుపు వేసుకున్న  శబ్దం . అతిధి నీళ్ళు ఆపేసి తుండు గుడ్డ చుట్టుకుని కామాన్ బాత్ రూం తలుపు తీసిన శబ్దం .
ఆతను దగ్గరా గా వచ్చి ఆమె నేత్తి మీద చెయ్యి వేసి ఏంటి అమ్మాయి మీ యిద్దరి మద్య అరుచుకునే అంత చనువుందా? అంటున్నాడు , అదేంటి యిందాక నా ముందు ఏవండి మీరు అని సంభోదించాడు .యిప్పుడు యింత చనువు ? బాత్ రూమం తలుపు గ్యాప్ నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర జరుగు తున్నది కని పిస్తోంది . నా గుండె వేగం గా కొట్టు కుంటోంది . ఆమె ఎలా రిఎక్ట్   అవుతుందో తెలుసు కోవాలని .  ఆమె వొక ఇంచ్ కూడా జరగటం లేదు .ఆమె మోచెయ్యి అతని తొడకి తగులు తోంది .ఆమె పెదాలు విచ్చుకుని గాలి మాటల రూపం లోకి మారి వస్తోంది .
''వెళ్ల డెమో అని భయపడ్డా''
నా కాళ్ళ కింద భూమి కంపించి నటయింది , కళ్ళు మసక బారి పొయ్యాయి , ఏమి మాట్లాడుకుంటున్నారో అర్ధం కావడం లేదు . రెండేళ్ళు గా దేవాలయం అనుకున్నది  బూతు బొమ్మలకే పరిమిత మై పోయిన గాలి గోపురం లా మారి పోయింది .రెండు ఆకారాలు దగ్గరాగా హత్తుకుని యింకో బెడ్రూం వైపు వెళ్ళడమే కని పిస్తోంది .యింక తట్టుకోవడం నా వల్ల కాలేదు .మెయిన్ తలుపు మెల్ల గా తీసుకుని శబ్దం లేకుండా బయటకు వచ్చి ఆఫీసు కి వెళ్లి పోయా .మనసులో తుఫాన్ ఆమె మాటలలోనే విసృన్ఖలత చేతలలో దేవత అనుకున్నా గాని చూసింది విరుద్దం గా వుంది .రెండు గంటలు కష్టం మీదకంట్రోలు చేసుకున్నా యింక వీలు కాలేదు ఆమె కి సెల్ కొట్టా . చాలా సేపు రింగ్ అయ్యాక ఎత్తింది , కష్టం మీద ఏంటి బిజీ నా అన్నా నొర్మల్ గామాట్లాడ దామని .  ఆమె ఎత్తడం తోటే కంగారు పడుతూ యిప్పుడే మా స్నిహితురాలు బర్త్ డే పార్టీ  కిలంచ్ కి పిలిచింది రమేష్ గారిని కూడా రమ్మంటున్నా యిప్పుడే వోకల్ల తర్వాత వోక్కల్లం స్నానం చేస్తున్నాం అంటూ అర్ధం పర్దం లేకుండా మాట్లాడు తోంది .
అదేంటి రమేష్ పదకొండు  గంటలకి  సేక్రటరియాట్ లి అప్పాయింట్ మెంట్ వుంది వెళ్ల లన్నాడే?  నా ముందే స్నానానికి వెళ్ళాడు గా మళ్ళి ఏంటి ? అన్నా .ఆమె నెరజాన తనం పూర్తీ గా తెలుస్తోంది .
అబ్బా అప్పుడు వెళ్ళింది స్నానానికి కాదులే మహానుభావా తెమలాలి మరి ఉండనా ? అంటూ ఫోన్ పెట్టేసింది .
మర్నాడు మళ్ళి పది గంటలకి ఆఫీసు కి వెళ్ళే టైం కి మనసు ఉండ బట్ట లేక మళ్ళి వాళింటికి వేళా .పవర్ కట్ వల్ల లిఫ్ట్ లేదు . మెట్లెక్కి ఐదో అంతస్తు వెళ్లి తలుపు వేసేసి వుండడం తో కొట్టడానికిచేయెత్తి ఆగా ,లోపల నుంచి తన నవ్వు . వుర్కోండి మాస్టారు మీకెప్పుడు తొందరే . ఆతను యమన్నది వినబడ లేదు . వాళ్ల ఆయన ఆఫీసు కి వెళ్లి పోయాడు కింద కార్ లేదు .యింక ఉండ బట్ట లేక తలుపు కొట్టా . అయిదు నిమిషాలు నిశబ్దం తలుపు తియ్య లేదు . మళ్ళి కొట్టా . . వుహు . యింకకొట్టా .అప్పుడు తీసింది . చూడ గానే తొట్రు పాటు చలి వేస్తోందని తలుపులు వేసేసి లోపల కూర్చున్నాం రండి .అంటూ ఆహ్వానించింది . రమేష్ తల వంచుకుని కూర్చున్నాడు .నేను మంచి నీళ్ళు తాగే మిష తో లొపలకి వెళ్లి వాళ్ల బెడ్ చూసా మొత్తం చెదిరి పోయియుద్ధం తర్వాత పీట   భూమి లా వుంది అంతకు ముందు ఏమి జరిగిందో చెప్పకనే చెప్పింది .ఆమెనివేరే మిష తో లొపలకి పిలిచి బెడ్ చూపించా ఏంటి సంగతి అని ?
అంతె ఆమె రెచ్చి పోయి  రమేష్ గారు రాత్రి మీరు బావుందన్న చీర వేసుకుని బయటకు వెళదామా? నేను స్నానం చేసి వస్తాను . అబ్బా గడ్డం గుచ్చు కుంది బాబు అంటూ చీర మాత్రం బాత్ రూం బయట కుర్చీ లో పెట్టుకుని లొపలకి వెళ్లి పోయింది . అంటె ఏమిటి ఆమె ఉద్దేశం బయటకు వచ్చి చీర కట్టుకుంతుందా ? అది పరాయి మగాళ్ళ ముందు . యింక నా వాళ్ల కాలేదు మన్యం నుంచి వచ్చిన వాళ్లకి రోగాలు ఎక్కువట జాగర్త అంటూ అరచి వెళ్ల బోతుంటే రమేష్ అనారోగ్యం కంటే అనా రోగపు ఆలోచనలు యింకా నష్టం కలిగిస్తాయి సార్ అంటూ నాకు క్లాసు పికుతున్నాడు . ఆ క్షణం లోనే నా సెల్ లో నిక్షిప్తం చేసిన వాళ్ళా రాసలీలలు చూపించి అతని నోరు ముయ్యించాలని అని పించినా తమాయించుకుని నిజమే కరెక్ట్ గా చెప్పారు అంటూ వచ్చేసా . వర్క్ మీద కాంసెంత్రషణ్ వుండడం లేదు . లోపల మోస పోయిన భావన. ఆమెని చంపెయ్యలన్నత కోపం . మళ్ళి అంతలోనే భర్త కే లేని బాధ నాకెందుకు . పోనీ సెల్ ఫోన్ లో సిం లేపేస్తే వాడి నంబర్ పోతుంది గా . వాళ్ల అయన దాంట్లో వుంటుంది గా . వాళ్ల పిల్లల దాంట్లో వుందని ఆ సాయంత్రమే నాకు తెలిసింది . వాళ్ల పిల్లాడి దగ్గరే రమేష్ ఆన్కుల్ నంబర్ అడిగి తీసుకున్ననన్న విషయం సుధ కి అప్పుడు తెలిదు .యిలా పరి పరి విధాల నా ఆలోచనలు పోతున్నాయి ..యింతలా పట్టుబడినా.  రెండు రోజులో వెళ్లి పోతానన్న ఆతను వారం దాటి వుండడం నాకేమి ఆశ్చర్యం కల్పించ లేదు . ఆమె కి ఆఫీసు కి వచ్చాక ఫోన్ చేసి చూడు నీ రాస లీల అంతా నాకు తెలుసు వీడు రేపు విశాక వెళ్ళాక సెల్ లో గంటలు గంటలు మధుర స్మృతులు నెమరేసుకుంటూ నా స్లోట్ ఆక్రమిస్తాడు . నేను నీ నిన్నటి నేను గా మారి పోతాను అని చెపితే అందరు నీలా ఎమోషనల్ గా అయిపోరులే అయినా ఎల్ లతో నీకు పనేంటి అంటూ ఫోన్ పెట్టేసింది .
ఆ తర్వాత రోజులో ఎన్ని సార్లు చేసినా ఆమె సెల్ బిజీ నే అదే సమయానికి రమేష్ సెల్ కి కొడితే అదికూడా బిజీనే
నాకు ఉక్రోషం , బాధ కోపం . వొకప్పుడు రెండేళ్ళ క్రితం నేను ఆ స్తానం లో వుండే వాణ్ణి . యిప్పుడు యింకొకరు . అదే మాట ఆమెతో లైన్ దొరికినప్పుడు అంటె తమాషా చూసావా యిద్దరి పేరు ర అక్షరం తోటే ఉంటా ఆతను చేస్తున్నాడు అంటూ కట్ చేసింది . ఇంత చేసినా ఆమె అంటె అసహ్యం కలగటం లేదెందుకు ?ఆమె మారదు నేను మారలేను
కార్ లో వస్తుంటే యిదివరకు అలరించిన నేస్తం యింకొకరికి ఆనందం యివ్వడానికి యెగిరి పోయింది నన్ను వంటర్ని చేసి .
''నువ్వెవరి యెదలో
పువ్వుల రుతువై
ఎప్పుడు వస్త్తావో తెలియదే ఎవ్వరికీ
తెలియదే ఎప్పటికి ''
ఎఫ్ ఏం లో పాట వస్తోంది
నా కళ్ళు చిప్పిలాయి . అవును నా తోటలో వసంతం వెళ్లి పోయింది .
కోయిల యెగిరి పోయింది .
ఆడ మగ మద్య అన్ని భందాలు అక్కడికే దారి తీస్తాయనుకునే నీ అభిప్రాయం తప్పు నేస్తం నా లాంటి కేవలం ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారని చెప్పాలని పించి సెల్ కొట్టా . . యధా విధి గా మీరు ''ప్రయిత్నిస్తున్నా కస్టమర్ వేరే ఎవరి తోనో బిజీ గా వున్నారు''   వోహో రాత్రుళ్ళు కూడా .బానే ఎదిగారు .కళ్ళలో నీళ్ళ వల్ల ట్రాఫిక్ మసక బారు తోంది .ఈ ఉపద్రవం నుంచి నేను బయట పడి క్షేమంగా ఇల్లు చేరగలనా ?
                ( కంచికి చేరిన కధ) 
కధ అని రాసాక మళ్ళి యిది కధేనా? అని అనుమాన పడే వాళ్ల అనారోగ్యం మనం బాగు చెయ్యలేం