21 ఆగ, 2010

ముష్టి ప్రహాసనం

http://blog.acumenfund.org/wp-content/uploads/2009/02/beggars-in-udaipur.jpg

నిన్న వరలక్ష్మి వ్రతం రోజు గుమ్మం ముందు పార్క్ చేసిన కార్స్ బయటకు తీస్తుంటే వొక ముసలి ఆమె కార్ అద్దాలని తడుతూ అడుక్కుంటోంది .నా కెవరైనా అలా జబర్దస్తి గా అడుక్కుంటుంటే నచ్చదు , అబ్యాదిర్స్తున్నట్టుగా ఉంటేనే ఇవ్వ బుద్ది అవుతుంది .అదిగాక నైట్ డ్రెస్ లో వుంటే జేబులో డబ్బులు ఏమి వుంటాయి . అందుకే జేబులో డబ్బులు లేవు వేళ్ళు అని సైగ చేశా అద్దం తియ్య కుండానే .ఆమె నడవ లేక నడుస్తూ వెళ్లి పోతోంది . మళ్ళి జాలి వేసి ఇంట్లోకి వెళ్లి పది రూపాయల నోటు తెచ్చి బయటకు వస్తే కనబడలేదు . మళ్ళి ఆఫీసు కి టైం అయిపోతుందని నే తెమిలి ఆఫీసు కి వెళ్లి పోయా .కాని మనసులో ఎక్కడో అసంతృప్తి ఇచ్చి వుండాల్సిందని .ఆఫీసు లో పని చేసుకుంటుంటే నా ఎసెమ్మెస్ బాధిత స్నేహితురాలు (స్నేహితుల దినం రోజు నే యిచ్చిన సందేశానికి అలిగి వాళ్ళ ఆయన వెళ్ళిపోతానంటే సర్ది చెప్పుకుని ఆపుకున్న అమ్మాయి ) సెల్ కి చేస్తే ఎత్తి పూజ ఎలా చేసుకున్నావు?అని అడిగా . ఆమె పూజ చేసుకున్న తృప్తి కంటే కూడా పూజ అయిపోయిన వెంటనే చాకలి విస్త్రి బట్టలకి పిల్ల ల తో కలిసి వస్తే పులిహార , పాయసం , బూరెలు ప్లేట్లో పెడితే ఆ పిల్లల కళ్ళలో కనిపించిన ఆనదం చూసి వచ్చిన తృప్తే ఎక్కువ అంది .
నిజమే ఆకలి గొన్న వాడికి అన్నం పెట్టడం లో వచ్చే ఆనందం యిలా గంటలు గంటలు పూజ చేసినా రాదేమో?అదిగాక పొద్దున్న నేను ఇవ్వలేక పోయానే అన్న బాధ ఇంకా ఎక్కువయ్యింది .మనకి మూడ్ వచ్చినప్పుడు చేద్దామంటే గ్రహీత ఉండక పోవచ్చు అందుచేత గ్రహిత ఉన్నప్పుడే మూడ్ తెచ్చుకుని చేసెయ్యడం ఉత్తమం .

నాకు అర్ధం కాని విషయం ఏంటంటేకర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు అంటారు . అలాగే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతా అని కూడా అంటారు . అంటే వొక ముష్టి వాడు వాడి కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే అని అతనికి దానం చెయ్యకుండా ఊరుకుని మిన్నకున్డడమా?లేక మనకి తోచిన సాయం చేసి మనం వచ్చే జన్మలో ముష్టి వాడవ్వకుండా జాగర్త పడడమా?ఏంచేసినా నష్ట పోయేది ఆ ముష్టి వాడే ఎందుకంటె యిలా ప్రతి వాడు వాడికి దానం చేసేస్తూ వాడు అనుభవించాల్సిన కర్మని మరింత పొడిగిస్తూ వాణ్ణి మరింత కాలం ముష్టి వాడి గా కోన సాగిస్తుంటారు .
ఆలోచిస్తే ప్రపంచం అంతా ముష్టి వాళ్ళే అని పిస్తోంది .కొండొక చోట డబ్బులిచ్చి డ్రగ్స్ అడుక్కుంటే , మరొక చోట డ్రగ్స్ ఇచ్చి సుఖాన్ని అడుక్కుంటున్నారు .అసలు మన బ్లాగింగే వొక మత్తు. బానిస అయిన వాడు పోస్టింగ్ ఇచ్చి కామెంట్స్ అడుక్కుంటాడు .అగ్రిగటార్ డ్రగ్స్ అమ్మే వాళ్ళు .మళ్ళి వీళల్లో మా అడ్డాలో కొకైన్ మాత్రమె వాడాలి వేరేవి వాడితే వెలి వేస్తాం అనే వాళ్ళు .మా దగ్గర డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మమ్మల్ని బట్రాజు పొగడ్తల్లో మున్తెచ్చాలి , మత్తు రాక పోయినా మత్తులో జోగుతునట్టు గా నటించాలి అనే రకం.చాలా కాలం పాటు వీళ్ళ అడ్డాలో తప్ప ఇంకెక్కడా పౌడర్ దొరకక పోవడం తో జనాలు వాళ్ళని భరిస్తూ కుక్కిన పేనుల్లా అక్కడికే వెళ్ళే వారు .అయితే మత్తు బాబులు అందరూ వొకేలా వుండరు కాబట్టి వొకరోజు కాగడా వెలుగు లో అడ్డా వాళ్ళ ఆగడాలు ఎదిరించిన సదరు వ్యక్తీ ని అడ్డానుంచి వెలి వేసారు.అప్పటికే వీరి ధోరణి తో విసుగు చెందిన మరి కొంత మంది కస్టమర్లు టాట్ ఇక నుంచి అడ్డా మనదే దందా మనదే అంటూ మా దగ్గర మీరు డ్రగ్ అని తలుచుకుంటే చాలు వెంటనే ప్రత్యక్షం అయి పోతుంది అంటూ వేగమే ప్రాణం గా దూసుకు పోతున్నారు . . తొక్కలా కొకైన్ ఎవరికి కావలి మనమే ప్రపంచం లో దొరికే మత్తు పదార్దాలు అన్ని ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వాడుకునే స్వేచ్చ కలిపిస్తాం అంటూ ఆకర్షిస్తున్నారు .
వీళ్ళని చూసి నరికొంత మంది పరారై ఇంకో దుకాణం తెరిచి మాది చుడండి మాది చుడండి అంటూ వెంట పడుతున్నారు .వీళ్ళందరి దుకాణాల గురించి వొక సారి పేపర్ లో రావడం తో ఎప్పుడు తెలీని మరి కొన్ని దుకాణాల గురించి జనాలకి తెలిసింది . వదిన చేసిన మందు బహు పసందు నేడే విచ్చేయ్యండి మా దగ్గర మందు కొన్న వాడికి బొంద ఫ్రీ ఫ్రీ అంటూ అర్ధం పర్దం లేని ఆఫర్స్ తో వెనక్కి సాగి పోతున్నారు .మొత్తానికి ఈ ముష్టి ప్రహాసనం యిలా ముగించడం కడు ముదావహం .(లైట్ తీసుకునే బ్లాగర్స్ కి ధన్యవాదాలు )

14 ఆగ, 2010

రీడిఫ్ఫ్ చాట్ భాగోతం (అను పిచ్చమ్మ కధ )

http://www1.istockphoto.com/file_thumbview_approve/2044877/2/istockphoto_2044877_girl_walking_away.jpg

వికట కవి శ్రీనివాస్ రీడిఫ్ఫ్ చాట్ మాటు విషయాలు రాస్తానండం తో నా స్వీయ అనుభవాన్ని ఎందుకు పంచు కో కూడ దని పించి రాస్తున్నా .లోగడ అంటే సన్నాల్ల క్రితం నెట్ అంటే మెయిల్ చూసుకోవడమే కాకుండా అపరిచితులతో హస్కు వేసుకోవచ్చని జ్ఞానోదయం అయిన తొలినాళ్ళలో వొక సుముహుర్తాన రీడిఫ్ఫ్ చాట్ కి హైదరాబాద్ రూం లో ప్రవెశించా .నా అయిడి'' రవిగారు ''.అప్పట్లో హైదరాబాద్ రూం ఎప్పుడు చూసినా కళ కళ లాడుతూ వుండేది .అప్పటికే మలక్ పేట రౌడి ,పూజా,పిచ్చమ్మ ,చిట్టి చిలక ,పాసింగ్ క్లౌడ్ ,దాదాగిరి ,మరికొంతమంది ఐడిలు (పేర్లు గుర్తుకు రావడం లేదు ) చాలా పాపులర్ .తొందర్లోనే మనం కుడా ఆ జాబితాలో చేరాక శ్రీనివాస్ మరికొంతమంది రంగ ప్రవేశం చేసారు .అయితే అందులో చాలా మంది ఆడవాళ్ళ వివరాలు అందరికి తెలుసు గాని వొక్క పిచ్చమ్మ వివరాలు ఎవరికి తెలివు .మలక్ వివిధ అయిడి లలో వస్తు జనాల్ని ఆట పట్టించే వాడు .హుందాగా వ్యవహరించే వాడు , దారి తప్పే వాళ్ళని అదిలించి మళ్ళి దార్లో పెట్టేవాడు వొక్క ''హైదరాబాద్ రౌడి '' ని తప్ప . మలక్కే ఫ్లడ్డింగ్ కి ఆద్యు డెమో దారి తప్పి ఆసబ్యం గా చాట్ చేసే వాళ్ళని ముందు గా చాట్ లోనే హెచ్చ రించి అప్పటికి వినక పొతే తన సాఫ్ట్వేర్ మాయ జాలం తో వాళ్ళ స్క్రీన్ అంతా యితని మెసేజ్ లు మాత్రమె వచ్చేల చేసి దిమ్మ దిరిగించే వాడు .అటువంటి నిష్ణాతుడు చాట్ లో వొక సారి ఎవరి వివరాలన్న తెలుసు కోవడం పెద్ద కష్టం కాదంటుంటే పిచ్చమ్మ నా వివరాలు కని పెట్టె మగాడు ఇంతవరకు ఎవడు లేడని సవాల్ విసిరింది .ఆవిడ సవాల్ కి ప్రతి గా నే కని బేడతా అని మంగమ్మసబధం చేశా . అయితే వొక చిన్న క్లూ అయిన ఇవ్వాలంటే యాహూ లో ఇస్తానని అందులో చాట్ కి వచ్చేవారు .పేరు కూడా చెప్పే వారు కాదు .అయితే వొక సారి వాళ్ళ అమ్మాయి స్కూల్ వాళ్ళతో కలిసి అరకు విహార యాత్రకి ఫలానా రోజు వెళ్తోందని చెప్పడం వాళ్ళఅమ్మాయి పేరు చెప్పడం తో నాకు తీగ తగిలింది .నా వుద్యోగపు హోదాలో కొన్ని ప్రముఖ స్కూళ్ళ కి ఫోన్ చేసి అరకు వెలుతున్నరేమో కనుక్కుంటే వొక స్కూలు వాళ్ళు దొరికారు .ఆ తరగతి వాళ్ళ రికార్డ్స్ తెప్పించి చూస్తే అదే పేరు తో ఇద్దరు అమ్మాయిలు .వాళ్ళ తల్లి తండ్రుల పేర్లు తీసుకుని పెట్టుకున్నా .అయితే ఆమె నాకిచ్చిన గడువు పది హేను రోజులే .అప్పటికే పన్నెండు రోజులు అయిపోయాయి .ఎంతో దగ్గరగా వచ్చాను కాని యెంత దూరం లో వున్నానో తెలీటం లేదు . ఆమె అస్సలు నోరు జారటం లేదు .అయితే తను రెండు రోజులు ఫలానా భూమి అమ్మకాల పని మీద గుంటూరు వెళ్తున్నా అని గడువు ముగిసే రోజే హైదరాబాద్ వస్తానని ఆ రోజు లోపు కని పెట్టాలని లేకపోతె ఇంకా యాహూ లో కూడా చాట్ చెయ్యనని చెప్పి మరింత రెచ్చ గొట్టింది .మా ఇద్దరి మద్య ఇంతవరకు ఈ యాహూ చాట్ భాగోతమే కాని కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు . అందుకే ఆమె ని ఆఖరి సారి నాదో అబ్యర్ధన మీరు గుంటూరు నుంచి వచ్చేటప్పటికి నేను నెగ్గు తానో లేదో నాకే తెలీదు . అది గాక అసలు మీరు ఆడో ?మగో కూడా తెలీదు ఇన్నాళ్ళు నన్నో బకరాని చేసి ఆడించారేమో అన్న బాధ నాలో వుండి పోతుంది అందుకని నా ఆఫీసు ఫోన్ నెంబర్ యిది (అప్పటికి సెల్ ఫోన్ లు లేవనే గుర్తు ) మీరు వొక్క సారి మాట్లాడితే నేను మోస పోయానేమో అన్న భావం నాలోంచి పోతుంది అన్నా .సెంటిమెంట్ బానే వర్క్ అవుట్ అయ్యింది ఆమె నా ఆఫీసు కి ఫోన్ చేసారు .నేనండి పిచ్చమ్మ ని రవిగారా ?అంటే ''వాట్ నాన్ సెన్స్ హు ఇస్ బ్లడీ రవిగారు?యు మే బీ పిచ్చమ్మ దట్ డాజ్ నాట్ మీన్ యు కేన్ రింగ్ ఆప్ టు థిస్ ఆన్ లిస్తేడ్ నెంబర్ .హు ఆర్ యు ''అని బెదర గోడితే సారీ సార్ అని పెట్టేయ్య బోతే నేను నవ్వు ఆపుకోలేకా అయ్యో నేనండి పిచ్చమ్మ గారు అంటే అమ్మో భయ పెట్టేసారు కదండీ , మీ తెలివి తేటలు వుపయోగించి యి నెంబర్ గురించి ఆరా తియ్యకండి యిది పబ్లిక్ ఫోన్ అంటూ కాసేపు మాట్లాడేసి మీరు నెగ్గితే బావున్ను అని నాకు వుంది మీకో చిన్న ఆఫర్ మీరు నిజం గా నా పేరు చిరునామా కని పెడితే తప్పకుండా నేను మిమ్మల్ని వొక రోజు కలుసుకుంటాను అంటూ బోనస్ ఆఫర్ ఇచ్చి అల్ ది బెస్ట్ చెప్పి ఫోన్ పెట్టేసారు .నేను వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే ఎవరో మగ అతను ఎత్తి బంజారా హిల్స్ లో ప్రముఖ సి డీ ల దుకాణం పేరు చెప్పగానే నేను నా తెలివి వుపయోగించి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడిన ఆవిణ్ణి పిలుస్తారా అంటూ అంగ్రేజ్ లో మర్యాద గా అడిగితె వాడు మీరెవరు అంటూ అనుమానాస్పదం గా అడగ డం తో ఇంక గతి లేక వాళ్ళ ఆయన్ని మాట్లాడుతున్న అంటే సార్ అమ్మ గారు ఇప్పుడే డ్రైవర్ ని'' అయిటీసి ''ఆఫీసు కి పోనీ అన్నారు సార్ అంటే మీ దగ్గరకే వస్తున్నారు సార్ అన్నాడు . అంటే గుండెల్లో వేయి వేణువులు మోగాయి .బుర్ర చురు కు గా పని చేసి నా దగ్గర వున్నా ఇద్దరి తల్లి దండ్రుల పేర్లు తీసుకున్నా . మా స్తేనో కి'' అయిటీసి '' ఫోన్ చేసి ఆ యిద్దరిలో ఎవరన్నా వున్నారేమో కనుక్కోమన్నా . నా అయిడియా ఫలించి వాళ్ళలో వొకరి పేరు కరెక్ట్ అయ్యింది . అయితే ఆయన బయటకు వెళ్ళారని చెపితే హమ్మయ్య అనుకుని ఆ నెంబర్ తీసుకుని నేనే వెంటనే ఫోన్ చేశా .యధా విధి గా మా స్తేనో కి చెప్పినట్టే లేరని సమాధానం వచ్చింది . అయితే ఇంటి నెంబర్ యియ్య మంటే ఆయన స్తేనో మీరెవరు అంది . పచ్చి వెలక్కాయ గొంతులో పడి ఆయన చినప్పటి స్నేహితున్ని హైదరాబాద్ పని మీద వచ్చా ఇంటికి వేళ్ళన్న కలుస్తా అంటే నెంబర్ ఇచ్చింది .వోకో నెంబర్ రాసుకుంటుంటే నా గుండె శబ్దం నా కే వినిపిస్తోంది . ఆమె చెప్పడం పూర్తి కాగానే ఆ నెంబర్ కి ఫోన్ చేశా . నెంబర్ రింగ్ అవుతోంది నాకు టెన్షన్ సెకండ్స్ నిముషాలు అవ్వడానికి అంత టైం పడుతుందా ?అనిపించిన క్షణం అది .ఆమె యెక్క వలసిన ట్రైన్ కి ఇంక నాలుగు గంటల సమయమే వుంది .పిక్ అప్ పిక్ అప్ పైకే అరుస్తుంటే అప్పుడే వచ్చిన మా స్తేనో నాకేసి ఆశ్చర్యం గా చూసి వెంటనే సారీ సార్ అంటూ వెళ్లి పోయింది .ఈ ప్రయత్నం విఫలం అయితే నేను వొడి పోయి నట్టే అన్ని దారులు మూసుకు పోయినట్టే ఆమెని నే నెప్పటికి చూడలేను కూడా. ఎందుకంటె ఆమె గుంటూరు వెళ్లి వచ్చే టప్పటికి గడువు కూడా ఆయీ పోతుంది ఆమె అసలే చాలా ఎస్సర్ టివ్ అన్నంత పని చేసి నా అయిడి డిలీట్ చేసినా ఆశ్చర్యం లేదు .ఇంక వొక్క సెకండ్ లో కట్ అవుతుందనగా
హలో అంటూ ఆమె గొంతు నా నోట మాట రాలేదు టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు అతనికి కలిగిన భావన , యూరి గగారిన్ చంద్రుడి మీద కాలు మోపినప్పుడు కలిగిన భావన ,రాకేశ్ శర్మ ఇందిరా గాంధీ తో పైనుంచి మీకు ఇండియా ఎలా కనబడుతోంది అంటే సారే జహాసే అచ్చా అంటూ కళ్ళల్లో ఆనందం తో వెలి భుచ్చిన భావన వాటిని మాటల్లో ఎవరన్నా చెప్పగలిగితే అదే నా భావన కూడా ఆ క్షణం లో .మౌనం గా కళ్ళలో ఆనంద భాష్పాలు రాలుతుంటే ఏమి మాట్లాడకుండా అలానే వుండి పోయా . ఆమె గొంతు అలానే హలో హలో అంటూనే వుంది .యింక ఆమె పెట్టేయ్య బోతుంటే xxxx గారు నేను నేగ్గానండి గట్టి గా అరిచా . అంతే ఆమె మై గాడ్ ఆయి కాంట్ బిలీవ్ థిస్ ఎలా సాధ్య పడింది . యు ఆర్ అ జినియుస్ .అంటూ గంట సేపు మాట్లాడింది నేనే మీ ట్రైన్ టైం అయిపోతోంది బయలు దేరండి అని చెప్పే దాక .ఆమె అంది ఇంత గొప్ప మేధావిని ఎప్పుడు చూద్దామా అని వుంది యి గుంటూరు పని లేక పొతే యిప్పుడే కలిసే వాళ్ళం అంటూ వచ్చే శని వారం ఫలానా చోటుకి ఫలానా టైం లో ఏదో నేర్చు కోడానికి వస్తానని అక్కడ కేవలం పది నిముషాలు మాత్రమె కలుస్తానని మళ్ళి ఎప్పుడు కలిసే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పి వూరు వెళ్లి పోయింది .
ఆ శని వారం ఉదయం ఎనిమిది ముప్పైకి ఆమె చెప్పిన ప్లేస్ కి నేను నా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళితే తను కూడా డ్రైవర్ లేకుండా తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ముందే ఫలానా కార్ లో వస్తోందని చెప్పడం తో గుర్తు పట్టడం తేలికే అయ్యింది . నా అనుభవ రీత్యా ఇంత వరకు యిలా చాట్ లో పరిచయం ఆయి కలిసిన వాళ్ళు వుహలకి భిన్నం గా (బహుసా ఎక్కువ గా వుహించు కోవడం వల్ల ) కొండక చోట కొంత నిరుత్సాహ పరుస్తూ వుంటారు . కాని ఇక్కడ డామిట్ కదా అడ్డం తిరిగిందని ఆమె పసిమి ఛాయతో ఎంతో అందం గా చక్కటి చీర కట్టు తో హుందాగా నడుచు కుంటూ వచ్చి హాయ్ రవిగారు కంగ్రాట్స్ అంటూ కర చాలనం చేసి మొత్తానికి సాధించారు అంటే నేను అంతా మీ అభిమానం అంటూ ఊరుకోక ''సాధించింది గోరంతా సాధించ వలసినది కొండంతా '' అన్నా అబ్బే ఇంక సాధించ డానికి ఏమి ఉండ దండి మనం మళ్ళి ఎప్పటికి కలవం గా అంది .నేను మాట తప్పను మీరు తప్పకండి అప్పుడే యిది వొక గొప్ప జ్ఞాపకం గా మిగిలి పోతుంది అంత కంటే ముందుకు వెళితే యిద్దరికీ చిక్కులే .ఫోన్ లో ఎలాగు మాట్లాడుకుంటూనే వుంటాం గా అంటూ బాయ్ అని చెప్పి వెళ్లి పోతుంటే ఆమె కనుమరుగయ్యే దాక చూస్తూ భారం గా నా స్మ్రుతి పధం లో ఆమె రూపాన్ని నింపుకుని వెను దిరి గా .కొంత కాలం ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుకునే వారం . అయితే రోజులన్నీ వొక లాగే ఉండవని రీడిఫ్ లో వుండే వ్యతిరేక గ్రూప్ నాటిన విష బీజాలకి ఆమె మాట్లాడే ధోరణి లో వచ్చిన మార్పే తార్కాణం .కొన్నాళ్ళకి రోజు వచ్చే ఫోన్ వారానికి ఆపై పక్ష్హానికి అక్కడ నుంచి నెలకి వెళ్లి పోయి ఆగి పోయింది .ఆమె నా జ్ఞాపకాలలో శిధిలం ఆయి పోయింది .యిప్పుడు వికటకవి పుణ్యమా అని శిధిలాల లోంచి జ్ఞాపకాల్ని తవ్వి తీసా .
అయితే మేము రీడిఫ్ఫ్ చాటర్స్ అంతా మలక్ ప్రోద్బలం తో వొక సుముహుర్తన్ని కలిసి మా చాట్ కి కూడా వొక మంచి గమ్యాన్ని ఏర్పరుచుకుని కొన్ని మంచి పనులు చేసే వాళ్ళం తరచూ గా కలుసుకుని . అయితే వాటికి కూడా ఆమె దూరం గా వుండడం తో నేను తప్ప ఆమెని ఎవరు ఇంతవరకు చూడలేదు చూడ బోరేమో కూడా .
అందుకేనా నా కిష్టమైన పాట''నా నావ దాటి పోయింది ఆ వడ్డే చేరి పోయింది అట్టాగే మళ్ళి పోయేనా నన్నిడిచి వెళ్ళే పోయేనా ?''.

8 ఆగ, 2010

డాన్ శీను లో కిక్ లేదు

Don Seenu https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgTquytb9HEHps5G3VHOEyPP_djaAQG3r_LXB6DwGE6PWDzwn2wCNM9hMdTjMRb2mLK4bTxDRaqZrkSSVGuZMVOQki9Fp_Wgq7Y8it6UDjwavwgf4S_lBoqO3LaH3xB6lzgjIehcyn8_x5W/s400/Don_Seenu.jpg
నిన్న నే చూసా యీ సినిమా .నెగిటివ్ కాన్సెప్ట్ , రొటీన్ స్టొరీ .సగటు ప్రేక్షకుడు అన్వయించుకోడానికి ఏమి వుండదు .అక్కడక్కడా నవ్వు కోడానికి కొన్ని సీనులు తప్ప డాన్ శీను లో ఏమి లేదు .హీరో చినప్పటినుంచి డాన్ అవ్వాలనే అనుకుంటున్నవాడు హైదరాబాద్ వచ్చాక అక్కడ ఆల్రెడీ వున్న ఇద్దరు డాన్ లని పడగొట్టడానికి వాళ్ళలో వొకడి దగ్గర చేరిన వాడు అసలు లక్ష్యాన్ని వదిలి అవతలి డాన్ చెల్లెల్ని ప్రేమ లో పడెయ్యడానికి జర్మనీ వెళ్ళడం ఏంటో మరి?ఇంటర్వల్ దాక ఆమె ని ప్రేమలో పడేసే ప్రయత్నాలే . ఆ తర్వాత అంతా ఇండియా కి రావడం ,వచ్చాక ట్విస్ట్ ఏంటంటే ఏ విలన్ అయితే డాన్ శీను ని అవతలి విలన్ చెల్లెల్ని ట్రాప్ చెయ్య మని పంపు తాడో వాడి చేల్లెలినే శీను ట్రాప్ చెయ్యడం . మిగతా స్టొరీ అంతా ప్రెడిక్టబుల్. బ్రంహనందం సెకండ్ ఆఫ్ మద్యలో వస్తాడు .అతనితో రవితేజ మూగ వాడి గా నటిస్తూ'' పిచ్చిపూహా ''అనడం లాంటి క్రూడు జోకులు వున్నాయి .పాటలు అస్సలు ఆకట్టు కోవు . పెద్ద మైనస్సు .కేవలం రవి తేజ మార్కు నటనని ఇష్టపడే ప్రేక్షకులు కిక్ లెవిల్లో వుహించుకోకుండా కాలక్షేపం కోసం మాత్రమె చూడ దగ్గ సినిమా .

1 ఆగ, 2010

మేసేజ్ పెట్టే మంటలు

http://us.123rf.com/400wm/400/400/iofoto/iofoto0809/iofoto080900249/3569585-asian-business-man-standing-looking-at-cell-phone-messages.jpg

మొన్న రాహుల్ మహాజన్ ని ముచ్చట పడి స్వయంవరం లో పెళ్ళిచేసుకున్న రెండో భార్య మీడియా ముందుకొచ్చి , రాహుల్ తనని రాచి రంపాన పెడుతున్నాడని , జుట్టు పట్టుకుని యిడ్చి మరి కొడుతున్నాడని , అలాగే ఎక్కడెక్కడ కొట్టాడో మొహమాటం లేకుండా టీ వి వాళ్ళకి చూపించడం తో వాళ్ళు పండగ చేసుకుని రోజంతా చూపించి టిఆర్ పీ రేటింగ్ పెంచుకున్నారు .ఇంతకీ ఎందుకు కొట్టాడు రా అంటే రాహుల్ పడుకున్న టైం లో డింపి (భార్య)సెల్ లో మే సే జ్ లు చూసుకుంటుంటే రాహుల్ దిగ్గున లేచి ఎవరి దగ్గరనుంచే ఆ రహస్య సందేశాలు అని అడిగితె గబుక్కున ఆమె తన సెల్ దాచు కోవడం తో మరింత అనుమానం వచ్చి లాక్కో పొతే ఆమె విరక్కోట్టితే తిక్క దొబ్బి ఎక్కడ పడితే అక్కడ కొట్టేసాడని సమాచారం . అది విని తొక్కలా మే సే జ్ కి ఇంత ఆర్భాటమా మరీ అతి గాడు అనుకుని ఆ విషయం అక్కడతో వదిలేసాను .
ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే అని అందరికి విడి విడి గా పంపే తీరుబడి లేక అందరికి కలిపి వొకే సందేశాన్ని పంపేసా పొద్దున్నే అదే టైం కి మా పాలవాడు తుమ్ముతూ పాకెట్స్ పెడుతున్నా ,నా ఎడం కన్ను అదురు తున్నా,పక్కింటి పిల్లి గుమ్మం ముందు ఎదురైనాపాలకోసమే అనుకున్నా గాని , జరగా బోయే ప్రమాదానికి దానిని సూచిక గా పరిగణించకుండా సెండ్ బటన్ నోక్కేసా .కాఫీ తాగి వాకింగ్ కి బయలుదేరా.పావుగంట లో సెల్ మోగింది .
''గుండెల్లో ప్రేమ వుంటే ఎదురు గా వునప్పుడు చెప్పాలి గాని , యి సందేశం లోనే చెప్పాలా రవి నీ మే సే జి నేను బాత్ రూం లో వునప్పుడు వస్తే మా అయన చూసాడు , బయటకు రాగానే సూట్ కేసు సద్దుకుంటూ వాడితోనే కాపరం చెయ్యవే నేనెందుకు బాబు ని తీసుకుని వేరే వెళ్లి పోతాను అంటూ రాద్దాంతం .సవర దీసేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది . అసలే మా అయన ఏ చిన్న వంక దొరుకుతుందా దీన్ని వదిలేసి పోదామని చూసే రకం . ఆయనా నువ్వు సరదాగా మాట్లడతావే గాని చొరవ తీసుకునే మనిషివి కాదు గా'' అంటూ వొక స్నేహితురాలి దగ్గర నుంచి ఫోను.
ఇదేంట్రా బాబు గోల అనుకుంటూ మరో నాలుగడుగులు వెసానో లేదో మళ్ళి ఇంకో స్నేహితురాలి నుంచి ఫోన్ .
''రవి నీ సందేశం ద్వారా నా జ్ఞాపకాలలో శిధిల మై పోయిన నా స్నేహితున్ని గుర్తు చేసి నాకు యి ఫ్రెండ్ షిప్ డే నాడు ఆనందం కలగా చేద్దామని నువ్వు అనుకుంటే మా ఆయన దాన్ని చదివి ఎంటే నీ అపరిచిత (అతనెవరు ) స్నేహితున్ని మరచి పోయాను మీరు ,బాబే నా సర్వస్వం నన్ను నమ్మండి యి క్షణం నుంచి మీ పాద దాసిని అని అప్పుడు బొంకావ్ ? మళ్ళి వీడేమో నీకు ఆ రహస్య స్నేహితుడే ప్రపంచం అన్న సందేశం పంపాడు నన్ను నువ్వు వీ పి ని చేస్తున్నావు కదే'' అంటూ రాహుల్ మహాజన్ టైపు లో రెచ్చి పోయాడుట .
చచ్చానురా దేవుడా తుమ్ము తమ్ముడి లా హెచ్చ రించినా పెడ చెవి న పెట్టి నోక్కేసినందుకు అనుభవించాల్సిందే .అయినా ఆలోచనా తరం గాల్లో ఆయన ఎప్పుడో చెప్పారు ఆదివారం తర్వాత రక్షణ ఉండదని చిక్కులు తప్పవని ప్రమాదాలు ఏదో రూపం లో రావచ్చని ను అంతా బుస అనుకుంటూ నవ్వుకున్నా , ఇప్పుడు తెలుస్తోంది గ్రహచారం నా శీలానికే ఎసరు పెడుతోందని . ఇంతలో మళ్ళి ఫోను చేతులు వణుకుతుంటే ఎత్తి చూసా హత విధి మా శ్రీమతి కి చెల్లెలి వరస చుట్టం కం స్నేహితురాలు .హీన స్వరం తో భయం గా హలో అంటూ మళ్ళి గొంతు సవరించుకుని మేక పోతూ గంభిరాన్ని గొంతులో తెచ్చుకుని హలో చెప్పండి అన్నా అంతే ఆతర్వాత ఏమి విన్నా నో పూర్తీ గా గుర్తు లేదు .
'' ఎంటండి యిది మిమ్మల్ని యిలా అనుకోలేదు భందుత్వం తో కూడిన స్నేహం కదా అని నాలుగయిదు సార్లు మీ ఆఫీసు లో మీ చాంబర్ కొచ్చి టీ తాగినంత మాత్రాన అంత చనువు తీసుకుని ఆ సందేశం పంపుతారా ?మా ఆయన చూసుంటే? మా అబ్బాయి గట్టి గా ఆ సందేశాన్ని చదువు తుంటే పై ప్రాణాలు పైనే పోయాయి .మా అత్తా గారు గట్టి గా విష్ను సహస్ర నామం చదువు కొడం తో ఎవరికి విన పడ లేదు పక్క నే వున్నా నాకు తప్ప .వెంటనే కోపం వచ్చి అక్కకి ఫార్ వార్డ్ చేద్దామనుకున్నా కాని ఎక్కడో ఏదో మూల మీ మీద ప్రేమో అభిమానమో వుండడం తో ఆగి పోయా , యి ఫోన్ కూడా బాత్ రూం లోకి వచ్చి మాట్లాడుతున్నా రేపు సోమ వారం మీ చాంబర్ కి వచ్చి అప్పుడు చెపుతా బాయ్'' అంటూ పెట్టేసింది .
అంతే తన దాక వస్తే గాని తత్వం బోద పడదు .ఆ సందేశం మా శ్రీమతి కి తను ఫార్వర్డ్ చేసి వుంటే ?
'' ప్రబుత్వ వున్నతాది కారి రాసలీలలు సొంత భార్యే మీడియా కి రుజువులతో సహా వెల్లడించిన వైనం '' ట్టిట్టడై ట్టిట్టడై అంటూ టీ వి నైను లో హెడ్ లైన్స్ లో న్యూస్
మాస్టారు కొంచెం చూసి నడవండి వొకాయన పక్కకి జరపక పొతే ఎదురు గా దున్న పోతూ అమ్మో వుహే ఇంత భయం కరం గా వుంటే ?అంటే'' మంటలు రేపే సందేశం రాజా ఈ తుంటరి తనము నీకెలా ?'' అని మార్చి పాడు కోవలసిన రోజులన్న మాట , ఇంతకీ నేను పంపిన సందేశం యదా తధం గా ఇక్కడ ఇస్తున్నా దాంట్లోని తప్పొప్పులు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా . గ్రహాలూ తమ పని తాము చేసుకు పోతుంటాయి చట్టం లాగే .
'' to the world you may be just one person, but to one person you may be the world --- happy f ship day ''