నేను చాలా కాలమ్ క్రితం వొక పోస్ట్ రాసాను . నేను నా వైరస్సు అంటూ. వొక సంవత్సరం పైనే గడిచి పోయింది హెపటైటిస్ వైరస్సు నాలో డిటెక్ట్ అయ్యి. అది మెల్లిగా లివర్ మీద తన ప్రభావం చూపించ సాగింది . పైకి ఏవి లక్షణాలు కనిపించక పోయినా వైరల్ లోడ్ లక్ష నుంచి యిరవై ఎనిమిది లక్షలకి పెరిగి పొయిన్ది. వొక హృదయ కాలేయ నిపుణుడి దగ్గరికి వెళితే, మీరు వెంటనే ఈ వైరస్సు కి ప్రస్తుతం అందుబాటులో వున్న పెగ్ ఇంటర్ఫెరాన్ ఇంజక్షన్ వారానికి వొకటి చొప్పున తీసుకుంటూ , రిబావారిన్ మాత్రలు రెండు పూటలా వెసుకొవాలి. లేకపోతె మీరు త్వరలో మీ తనువులోకి కొత్త లివర్ ని తెచ్చ్చు కోవాలి అన్నాడు . బలాత్కారం బలవంతం అయినప్పుడు చేసేది ఏమి వుంది అని నేను మానసికం గా యుద్దానికి సన్నద్ధం అయిపోయి ఫలానా రోజు మొదలెడదామని ఆరు నెలలకి సరి పడ మందులు (రెండు లక్షలు ) ఆర్డర్ చెయ్యడం కుడా జరిగి పొయిన్ది. యింక రెండు రోజుల్లో మొదలెట్టాలి అనగా వొక స్నేహితుడి సలహా మీద గ్లోబల్ హాస్పిటల్ లో ప్రముఖ హేపటాలజిస్ట్ డాక్టర్ ధర్మేష్ కపూర్ గార్ని కలిసి యిలా ఇంజక్షన్ ట్రీట్ మెంట్ మొదలెట్టా బోతున్నా అని చెప్పా. ఈ ట్రీట్ మెంట్ లో ఏభై శాతం రోగుల్లో మాత్రమే వైరస్సు పోతుంది అయితే భయంకర మైన సైడ్ ఎఫెక్ట్స్ . నెట్ లో హెప్ సి క్లబ్ అని కుడా వొకటి వుంది . వాళ్ళ సాధక భాధకలు అందులో చదివితే ఎవరు ఈ ట్రీట్ మెంట్ కి సహసించరు. అలా అని శత్రువు యింట్లోనే వున్నదని తెలిసాక నేను నా అందాల రాక్షసి అంటూ కాపరం చెయ్యలేము కద. అప్పుడే ఆ డాక్టర్ మీరిప్పుడే తొందర పడకండి అమెరికా లో రోజుకోక్కసారే మాత్ర వేసుకుని పన్నెండు వారాలలో పూర్తయ్యే మందు కని పెట్టారు . అది మన ఇండియా కి యింకా రాలెదు. వోకో మాత్ర వెయ్యి అమెరికన్ డాలర్స్ . అంటే మొత్తం ట్రీట్మెంట్ కి సుమారు గా యాభై లక్షలు పైన అవుతుంది . అయితే ఆ కంపని ఇండియా లో క్లినికల్ ట్రైల్స్ కి కావలిసిన వ్యక్తుల్ని అంటే వైరస్సు లక్షల లో వుండాలి లివర్ మాత్రం పూర్తీ గా పాడవ కూడదు . వ్యక్తీ మాత్రం రోగిష్టి వాడిలా వుండ కూడదు . దీనికి మీరు అంగీకరిస్తే ఉచితం గా మీకు ట్రీట్ మెంట్ యిస్తాం . మీరు మొత్తం మూడు నెలలు మా పర్య వేక్షణ లో వుంటారు . తొందరగా మీ నిర్ణయం చెపితే వాళ్ళు మీకు రక్త పరిక్షలు చేసి మీరు వాళ్ళనుకున్న పరిధి లోకి వస్తే ట్రీట్ మెంట్ మొదలెడతారు అన్నారు . అంటే నేను వాళ్ళ గూనియా పిగ్ అన్న మాట . అయితే ఆ మందు గురించి నేను నెట్ లో విస్తృతం గా చదవడం వాళ్ళ ఓకే అన్నాను . ఈ ప్రక్రియ అంతా అవడానికి రెండు నెలలు దాక పట్టింది .
ఈ ట్రీట్ మెంట్ మొదలు పెట్టె లోపు తిరపతి వెళ్లి స్వామి దర్శనం చేసుకుందామని వెళితే అక్కడ ఆయన అభిషేక దర్శనం తో పాటు యింట్లో పెట్టి పూజ చేసుకునే నారాయణ సాలి గ్రామాలూ లభించాయి . వొక పూజారి యిచ్చారు . రోజు శ్రద్దగా తులసి ఆకులతో పంచామృతాల తో అభిషేకం చేసుకుంటే మన బాగోగులు ఆ నారాయణుడే చూసుకుంటాడని నిశ్చింతగా ఉండమని చెప్పడం తో అప్పటి నుంచి యింట్లో పూజా మందిరం లో పెట్టి శ్రద్దగా అభిషేకం చేస్తూ అ తీర్ధం సెవిస్తున్నా. నేను గ్లోబల్ హాస్పిటల్ కి వెళ్ళిన రోజు యిరవై ఎనిమిది లక్షలు వున్న వైరస్సు రెండు నెలల తర్వాత అంటే కిందటి నెల జూలై మూడో తారిఖు వాళ్ళు మొట్ట మొదటి టాబ్లెట్ యిచ్చిన రోజు నాలుగు లక్షల ఎనభై వేలకి పడి పొయిన్ది. ఈ రెండు నెలల్లో నేను ఆ వైరస్సు కి సంభందించి ఏ ట్రీట్ మెంట్ మొదలు పెట్ట లెదు. మరి వైరల్ కౌంట్ ఎలా పడింది?సరే అది పక్కన పెడితే నేను ఆ మాత్ర వారం రోజులు వేసుకున్నాక చుస్తే అసలు వైరస్సే లెదు. పోయిందే ఇట్స్ గాన్ . అయినా గాని పన్నెండు వారాలు ఆ మందు వాడాలని చెప్పారు . యింతకీ ఆ మందు పేరు'' సోఫోస్ బువిర్ ''. బ్రాండ్ నేమ్'' సోవాల్ది ''(గి లీడ్ కంపెనీ). దాంతోపాటు రిబవరిన్ 200 మిల్లిగ్రామ్స్ అయిదు టాబ్లెట్స్ వెసుకొవలి.ఈ శతాబ్దపు అద్బుతమైన ఆవిష్కరణ గా ఈ మందుని చెప్పు కోవచ్చ్చు . మన దేశం లో కూడా లక్షలాది మందికి ఈ హెప్ సి వైరస్సు వుంది . అయితే రోగ లక్షణాలు బయటకి కన బడవు కాబట్టి ఎవరు పట్టించు కోరు . అది లివర్ ని మొత్తం పాడు చేసాక గాని డాక్టర్ అవసరం రాదు అయితే ఈ లోపు జరగా వలసిన నష్టం జరిగి పొతున్ది. అప్పుడు లివర్ మార్పిడి తప్ప మరో మార్గం లెదు. అయితే ఆ శ్రీనివాసుడి దయ వల్ల నాకు సరైన సమయం లో సరైన మందు దొరకడం తో బతికి పోయా .
యింతకీ ఆ వైరస్సు పోయింది సాలిగ్రామ అభిషేక తీర్దం తోనా ?లేక ఈ కొత్త గాకని పెట్టిన అమెరికా మందు తోనా?
వొక వేళా ఆ మందు తోనే అంటే మరి మందు తీసుకోక ముందు ట్రీట్ మెంట్ మొదలెట్టే రోజుకి యిరవై నలుగు లక్షల వైరల్ కౌంట్ ఎలా పోయింది?యండమూరి నవల లోలా రోగం నయం అయింది క్షుద్ర విరుగుడు వల్లా ?సైన్స్ అభివృద్ధి చెందడం వల్లా?ఎవరి వల్లా?
ఆ మందు ఎలా పని చేస్తుంది అంటే ,వైరస్సు అంటే వొక ఆర్ యెన్ ఏ . అదిరొజూ కొన్ని వందలు గా విడి పోతూ మరిన్ని వైరస్సు లను సృష్టిస్తూ లివర్ మీద దాడి మొదలుపెడుతుంది . . ఈ సోఫోస్ బువిర్ ఆ వైరస్సు విభజన ని అడ్డుకుంటుంది . వొక వైరస్సు జీవిత కాలం అయిదు రోజులు . సో అయిదు రోజుల లో చాలా భాగం తుడిచి పెట్టుకు పోతుంది . . యిది ఇండియా లో కూడా త్వరలో లభ్యం అయ్యేఅవకాశం వుంది. అయితే రేట్ విషయం లోనే గొడవ వస్తోంది . యిక్కడ దిన్ని బ్రాండ్ నేమ్ తో కాకుండా వెయ్యి రూపాయలకి వొక టాబ్లెట్ అమ్మెలా చర్చలు జరుగు తున్నాయి . అందువల్ల ఎవరన్నా హెప్ సి భాదితులు వుంటే యింకో ఆరు నెలలు వోపిక పడితే ఈ మందు ఇండియా లో కూడా అందు బాటులోకి వస్తున్ది. ఈ లోపు సాలిగ్రామ అభిషేక తీర్ధంఉండనే వుంది .