ఆ రోజు నువ్వు అందరి ముందు చేసిన ఘోరమైన అవమానం తో యిన్నాళ్ళ భంధం ముగిసింది ,యింక నేను స్వేచ్చా జీవిని అనుకుంటూ బయట కొచ్చా . కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టి నట్టు గా వున్ది. నా సెల్లు యిదివరకులా బిజీ టోన్ రావడం లెదు. అందరికి అందుబాటులోకి వచ్చేసా . అందరి ముందు నువ్వు చేసిన అవమానం గుర్తుకు వచ్చినప్పుడల్లా నీ మీద అసహ్యం ,కసి పెరిగి నీ ఆలోచనల్ని నా బుర్రలోంచి చెరిపేసి పదిరోజులు అప్పుడే గడిపేసా . యింక ఎప్పటికి నువ్వు నా డైరీ లో వొక పాత పేజి గా నే వుండి పోతావని బలంగా నమ్మా . ఎప్పటిలాగే వాకింగ్ కి వెళుతూ మీ యింటి ముందు చూస్తే యింటికి తాళం . కార్ కూడా లేదు . అంటే యింత అవమానం చేసినందుకు నీలో యింత కూడా పశ్చాతాపం లేదనీ , నువ్వు కుటుంబ సబ్యులతో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి మీ వూరు వెళ్లి పోయావని అర్ధం అయ్యిన్ది. అసలు ఆ సంఘటన జరిగిన వెంటనే నువ్వు సారీ చెపుతూ ఫోన్ చేస్తావని ఆశించడం లోనే నేను నిన్ను యెంత గుడ్డి గా నమ్మానో అర్ధం అయ్యిన్ది. అమలిన మైన ప్రేమ అంటే అడిగిన వెంటనే అన్ని అవసరాలు తీర్చేసి ,మూసుకు కూర్చుని అనవసర వ్యక్తుల గురిచి గాని, వారు ఎందుకు వస్తున్నారని గాని, ఆరా తియ్యకుండా ఉండడమే అని కొత్త నిర్వచనం తెలియ జెసావు. రోజు కనీసం వొక అరగంట అయినా ప్రత్యక్షం గా కలిసి మాట్లాడ కుండా ఉండలేని ఈ దౌర్భాగ్యపు అలవాటు నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా . సెల్ ఎప్పుడు మోగినా నీదేనేమో అన్న బ్రమలోంచి వాస్తవం లోకి వస్తున్నా. నీ ఆలోచనల మద్య పనులు అన్యమనస్కం గా నే చేసుకుంటుంటే ,నీ పనుల మద్య కూడా మాటవరసకి నేను గుర్తు రానప్పుడే నా కర్దమయ్యిన్ది. నీదొక బిజినెస్స్ డీల్ అని. అక్కడ పాత్రలు అవే వుంటాయి పాత్ర దారులు మారుతూ కాల గర్భం లో కలిసి పొతారు. నువ్వు మాత్రం నిరంతరం సాగి పోయే వైతరణి నదిలా మరింత పాపుల్ని జమ చేసుకుంటూ వుంటావు . నీకు చీమ కుట్టినట్టు కుడా వుండదు . నా కంటే ముందు అయిదుగురు యిదే బాట పట్టారని తెలిసినప్పుడు కూడా ఛ ఛా నిజమైన ప్రేమ వోదిడుడుకుల్ని తట్టుకుని నిలబడుతుందని అనుకున్నా. అసలు అక్కడ వున్నది ప్రేమ కాదు బిజినెస్స్ అన్నాక చివరికి ఎవరి కైనా అదే గతి కదా. ఈ మనసు ఎందుకు అది తెలుసు కోక వ్యాకులత పడుతోంది? ఏదో ఆశ . వొక చిన్న ఫోన్ కాల్ ఈ బాధని పోగొట్టేసి ఎడారి లో వసంతం తీసుకు వస్తున్దని. వొక వేళ వచ్చినా మళ్ళి నాలుగు రోజులు పోయాక నీ బిజినెస్స్ డీల్స్ చూసి మనసు తట్టుగో గలదా?
ఛి ఛి ఈ పెంట ఆలోచనల్ని దూరం గా పెట్టి బుద్దిని ఆద్యాత్మికంగా సక్రమ మైనా మార్గం లో పెట్టాలి అనుకుంటూ భక్తీ ఛానల్ పెట్టా . అందులో వొక ప్రముఖ ప్రవచన బ్రహ్మ ని మక్కి కి మక్కి కాపి కొట్టి తన ఆదాయ మార్గానికి వెసులు బాటు కల్పించు కోవాలని మాగంటి భోగేశ్వర రావు(గురువు గారు చాగంటివారికీ కిక్షమాప్పనల తో)) అనే ఆయన ఖర్మ పునర్జన్మ అనే విషయం మీద ప్రవచిస్తున్నరు. ఒరిజినల్ బ్రహ్మ గారు చెప్పిన దాన్నీ అచ్చులు హల్లులు మార్చి లైవ్ లో మేనేజ్ చెస్తున్నరు. అధర్మ బద్దమైన వాటి నీడ కూడా మన మీద పడ కూడదు . పర స్త్రీ వ్యామోహం లో పడి ,జీవిత చరమాంకం లో భార్య పిల్లల చేత కూడా అసహ్యించు కో బడి ,యింకా కూడా ఆ పర స్త్రీ మీదా వ్యామోహం పోకా వచ్చే జన్మ లో ఆమె యింటి కుక్కా గా పుడతాడు . యింతలో ఆయన చెబుతూ చెబుతూ తోడ మీదా గట్టి గా చరుచుకున్నారు . అంతే '' ఎంట్రా భోగు యింకా రాలేదే?నాలుగు ఊర్లలో ప్రవచనాలు అయ్యాక బోల్డు బట్టలు నగలు పట్టుకుని దసరా కి మా యింటికి వస్తానన్నావు గా? రా రా '' లైవ్ లో ఎవరో ఆడ గొన్తు. అరె ఎక్కడో విన్న గొంతులా వుందే అనుకుంటున్నా . మాగంటి వారు కంగారు పడుతూ యిలా కుడా ఆడవాళ్లు కైపు గా మాట్లాడినా మనం నిబ్బరం గా వుండాలి అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ జేబులో వున్నా సెల్ ఫోన్ ని ఆప దానికి ప్రయత్నం చేస్తున్నాడు . యింతలో మళ్ళి '' హోయి హోయి దీనికే కైపు అంటే మరి రేపు ఇక్కడికి వచ్చాక యింకేమంటావురా '' ?ఆప కుండా అదే తెలిసిన గొంతు సెల్ ఫోన్ లో
యింక భోగేశ్వర రావు మంచి నీళ్ళు తాగే మిష తో తెర వెనకకి పోయి'' నీ యమ్మ కడుపు మాడా . యింత దాకా నాకింది చాల దుటే ?ప్రతి వూరి లో పెంట తీసుకు వచ్చి నీ వొడిలో పోయ్యాలా?నోరుమూసుకుని పెట్టు అవతల లైవ్ ప్రోగ్రాం ''అంటూ మూతి తుడుచుకుంటూ మళ్ళి కెమెరా ముందుకు వచ్చారు . నా మనసు మాత్రం ఆ గొంతు మీదే వుంది ఎక్కడో బాగా పరిచయం వున్నా గొంతే . యింతలో నా సెల్ మోగింది మా కజిన్ నీ అర్జెంటు గా హాస్పిటల్ లో అయిసియు లో పెట్టారంటే అకడకి పరిగెత్తా. వాడికి ఆక్సిజెన్ పెడుతుంటే వాడి సెల్ యితర వస్తువులు నాకిచ్చారు పట్టుకొమ్మని . యింతలో వాడి సెల్ మోగింది . ''యిష్టమైన కష్టం '' అని డిస్ప్లేకని పిస్తోంది . వాళ్ళ వైఫ్ అయి ఉంటుందనుకుని ఎత్తా . నేను హలో అనకుండానే అవతల నుంచి ''ఎరా దసరా కి సరదా గా గడుపుదాము బోల్డు బట్టలు నగలు తెస్తనన్నావు గా రా రా . నీ కోసం యిక్కడ పరదాలు తీసి సరదాలు ఎదురు చూస్తున్నాయి ''
మళ్ళి నిందాకా మాగంటి మైక్ లో వినిపించిన వాయిస్. నాకు బాగా చిర పరిచితమై చితిమంటల దాక తీసుకు వెళ్ళిన వాయిస్ . యింకోకడ్ని వైతరణి నదిలో ముంచడానికి అయి సి యు దాక తీసుకు వచ్చిన వాయిస్ . ఎస్ అదే నా తాజా మాజీ ప్రేమికురాలి వాయిస్ . అంటే వొక్క రోజు నాతొ కూడా మా కజిన్ వచ్చి పది నిముషాలు కుర్చుని మజ్జిగ తాగిన పాపానికి నాకు తెలీకుండానే వాణ్ణి కూడా ముగ్గు లోకి దింపి రగ్గు కప్పిందన్న మాట (అయి సి యు లో అని కవి భావం ). నేను సెల్ కట్ చేశా డాక్టర్ వచ్చి పెదవి విరిచేశాడు . లాభం లేదండి మా ప్రయత్నాలు మేము యెంత చేసినా అయన స్పందించటం లెదు. మీరు ఆఖరి సారి ఏమన్నా చెప్పాలంటే చెప్పు కొండి అన్నాడు . యింతలో అతని సెల్ మోగడం తొందర లో అతని స్పీకర్ ఆన్ అవడం వొకే సారి జరిగాయి . ''ఎరా డాక్టర్ ఎప్పుడు ఆ రోగుల గోలేనా ?ఈ భోగుల గోల కూడా చూడరా. రా రా . . డైమండ్ సెట్ తొక్కా అన్నావు'' . ఆదే రాగం అదే రోగం . డాక్టర్ కంగారు గా ముందుకు సాగి పోయి శూన్యం లో కలిసి పోయాడు . నేను అయి సి యు లో మా కజిన్ దగ్గరకి వెళ్లి చెవిలో వోరేయి నీ'' యిష్ట మైన కష్టం'' యిప్పుడే చచ్చి పోయిందని కబురొచ్చిన్ది. అన్నా. అంతే అతని లో మళ్లి అతని అవయవాలు అన్ని జవసత్వాలు పుంజుకుని స్పందించడం ప్రారం భించాయి. డాక్టర్లు ఆశ్చర్యం తో నోర్లు వెల్ల బెట్టారు . ఆ తారక మంత్రం ఏమిటో చెప్పు బాబు వొక డాక్టర్ అడిగాడు . అదే రాగం అదే రోగం మంత్రం మాత్రం రహస్యం అంటూ నా కార్ వైపు వడి వ డి గా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నా . యింతలో సెల్ మోగింది . అపరిచిత నెంబర్(ఆమెది డిలీట్ చేసేసాగా). ఎత్త గానే రా రా అంటూ అదే రాగం . మీరు డైలు చేసిన నెంబర్ ఎప్పటికి మీ సెల్ యెత్తదు . అంటూ కట్ చేశా . ''ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరు సుఖ పడాలి సుఖ రోగాల బారిన పడకనా'' ఏదో కే ఎస్ ప్రకటన అనుకుంటా ఎఫ్ ఏం రేడియో లో . (సర్వే జనా సుఖినో భవంతు )