21 ఫిబ్ర, 2009

నీతోనే నువ్వు సరదాగా లేనే లేవు


నాకు చాల ఇష్టమైన పాట గేమ్ సినిమా లోది , ఆ పాట సాహిత్యమ మీకోసం .

నీతోనే నువ్వు సరదాగా లేనే లేవు
నలుగురిలో నవ్వుల్నేం చూస్తావు
నువ్వేంటో అర్ధం కావు వేరేగా వుంటావు
నీ మనసెందుకు నీలోనే దాస్తావు.
ఎందు కోసమో ఆరాటం ,ఇచ్చి చూసుకో అన్నది లోకం
వొక్కసారి నువ్వు ఆలోచించు నీకోసం
ముందు వెనకనే చూడని మార్గం ,నడిచి పోఇన లౌక్యమ్ కొంచెం
పట్టివిడుపుల సర్దుకు పోనీ నీ నైజం

: ఏదేదో అనుకుంటావు ,ఇంకేదో చేస్తుంటావు ,
చిక్కులో పడుతున్టావ్ చిత్రంగా
ఏనేరం చెయ్యని నువ్వు బందీగా మిగిలావు
ఎంతొ అలజడి మోసావు మౌనం గా
అద్దం లో నీరూపు నీకు చుపెవారే
నీ దారినొదిలి కదిలారు
నీడైన నీవెంట లేనన్డి ఈనాడు
నీదే తప్పని నిందలువేసి కాలమెంత మారి పోయెరా

: పై పై నవ్వుల లోకం పైసాకే విలువిచ్చిందా
కన్నిరన్టిన స్వప్నం చెరిగిందా
వొంటరి తనమే నిన్ను వడగాలై తాకిందా
సత్యమ తెలిసి కనువిప్పే కలిగిందా
చేదేనా చేదే గాని దాన్ని మందే అనుకో
మంచెగా చేసింది నీ కధకు
బాధ లేనోడు భూమ్మీద లేనోడే
మనిషై పుడితే దేవుడికైనా కంట నీరు ఖాయమేనురా
జానేదో నేస్తం ,జరిగాకే తప్పులు చూస్తాం
నిన్నటి లెక్కను నేడే సరి జేద్దాం
గడి రాతిరి నిశబ్దం లో , నిజమేదో కనుగొందం
మరి పొద్దులో మెలుకువ గా అడుగేద్దాం
ఏళ్ళ కాలమీ అల్లరి కాలం , వొక్క తీరు గా వుండదు నేస్తం
మంచి చెడ్డలు బొమ్మ బొరుసే అనుకుందాం
పల్లమేమిటో చూసిన ప్రాణం లెక్క చేయదే ఎంతటి కష్టం
నెల తాకిన బన్తై మళ్ళి పైకోద్దాం
http://www.telugufm.com/Modules/Play/Default.aspx?pick=13313&mode=A

5 వ్యాఖ్యలు:

KiranPrabha చెప్పారు...

ఈ పాట గురించి పరుచూరి హరిప్రియ గారి విశ్లేషణ కౌముది వెబ్ పత్రికలో ఈ నెల సంచికలో చదవొచ్చు.
http://koumudi.net/Monthly/2009/february/feb_2009_kottapatalu_tenevu.htm

ఉష చెప్పారు...

చక్కని పాట చిక్కని భావాల పేట. కిరణ్ గారిచ్చిన సమాచారం మరొక అధరువు ఈ మధురిమకి మరికొంచం మాధుర్యాన్ని కలపను. ఇరువురకూ అభినందనలు+కృతజ్ఞతలు.

రవిగారు చెప్పారు...

kiranprabha గారు ,ముందుగా మీకు మనస్పూర్తి గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ,చక్కటి లింక్ ఇచ్చి బంగారానికి తావి అబ్బెలా చేసారు .నేనేదైతే రాద్దామనుకున్నా నో అదే హరిప్రియ గారు చెప్పారు.ప్రపంచం లో మనల్ని పోలిన వాళ్ళు ఏడుగురు ఉంటారని అంటారు కానీ మన లాగే అలోచించి ఆస్వాదించే వాళ్ళు ఏడువందల మందన్న వుంటారేమో అని పించింది మీ స్పందన ఉష గారి స్పందన చూసాక .కౌముది లో చాల మంచి శిర్షిక అవుతుంది చూస్తూ వుండండి ప్రతి
సారి కౌముది నెట్ లోకి రాగానే ముందు ఇదే చుసెన్తల .అయితే రాసిన రచయిత గురించి కూడా రెండు ముక్కలు చెపితే బావుండేది. రామజోగయ్య శాస్త్రి గారు సినిమాలలో రాయడానికి ముందే IIT లో చదువుకుని మంచి వుద్యోగం లో వుండేవారని చాల మందికి తెలిదు. ఆయనొక గొప్ప మేధావి.
నాకు పోస్టింగ్ లో అంత ప్రావీణ్యం లేక చరణాలు విడి విడి గా పోస్ట్ చెయ్యడానికి కొంత కష్ట పడవలసి వచ్చింది ఆయినా సరే పట్టు దలతో వొక పక్క పాట వింటూ సాహిత్యం తప్పులు లేకుండా రాయడానికి గంట పట్టింది, ఏ వోక్కరన్న ఈ పాటలోని సాహిత్యమ చదివి ఆనందించక పోతారా అని , నా కృషి ఫలించి నా బ్లాగ్ తోటలో మరువపు కిరణాల గుభాలింపులు నింపి నందుకు మీ ఇరువురి కి ధన్య వాదాలు .

...Padmarpita... చెప్పారు...

మంచి భావం ఉందండి.....

raju చెప్పారు...

hello Ravi garu namaste.... konni visayalu gurinchi chala varaku vinnnavi nijale ani anukunna gani avi enthavaruku nijamo thelisindi. mukkyamuga srungaramu gurinchi public ga Directors,nirmathalu thama karyalayam loni,chinimaloni, illalonu srungara vyaparanni nadipinchadam chala bagane undi.
adi cheliyani chala mandi amayakulu latest anukuni college ammayalanu, paakkamtivallanu prati okkarini photo lu,vedio lu cheeci mari vyaparam chestunaru. Idamtha mee chaluve? daniki meeru samadanam cheppagaligithe nenu konni prasnalu aduguthanu.