12 జులై, 2009

షూటింగ్ విరామం లో యండమూరి తొ


షూటింగ్ విరామం లో యండమూరి పిల్లల్ని puzzeles వేసి చెప్పమనే వారు .అయితే అవి పెద్ద వాళ్ళు కూడా చెప్పగలిగే వాళ్ళు కాదనుకోండి . ఆ సందర్భం లోనే యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల లో తను రాసిన వొక blunder ఏమిటో చెప్పుకొన్దని నన్ను అడిగారు .అదేంటండి అది ఒక కళాఖండం అందులో తప్పు నాకైతే ఏమి కనబడలేదు అన్నా .లేదండి ఆ నవల రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఒక పాఠకుడు ఫోన్ చేసి చెప్పే దాక నేను గమనించలేదు, ఇప్పటికి అది అలా గే వుంచేసా కానీ అది తప్పే అని అదేంటో కూడా చెప్పారు . మన బ్లాగర్లు ఎవరన్నా కని పెడితే చెప్పండి చూద్దాం ఎందుకంటె ఇక్కడ చాల మంది యండమూరి అభిమానులే కాబట్టి , ఇది కూడా చిన్న ఫజల్.చిన్న క్లూ ఏంటంటే అది చెస్ కి సంభందిన్చినదే . యి సందర్భంగా అయన తొ నేను మా అబ్బాయి ,మరో మిత్రుడు నటుడు సాయి మిత్ర తీసుకున్న ఫోటో కూడా మీ కోసం .

11 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

ఆ నవల మధ్యలో మొదలెట్టి ఒక పది పేజీలు చదివుంటానేమొ - మరి దానిలోనో వేరే నవలలోనో తెలియదుగానీ, సదరు హీరోయిన్ గారు ఇద్దరు గ్రేండ్ మాస్టర్లపై ఆడి ఇద్దరి మీద గెలుస్తారు - వాడిన టెక్నిక్కు సింపుల్! మొడటి గేం లో అవతలవాడి స్టెప్పుని రెండవగేంలో రిపీట్ చెయ్యడం . కానీ ఇక్కడ రెండు లోపాలున్నాయి ...

1. మొదటి వాడితో నల్ల పావులతోనూ, రెండవాడితో తెల్ల పావులతోనూ ఆడితే మాత్రమే ఇది సాధ్యం .. కానీ నాకు గుర్తున్నంత మటుకూ నవలలో అల్లా ఉండదు.

2. ఒకడి స్తెప్పుని రెండవవాడికి రిపీట్ చేస్తే ఒకరిమీదే గెలవడం సాధ్యం - ఇద్దరి మీద కాదు ... ముఖ్యంగా గ్రేండ్ మాస్టర్లతో ఆడుతున్నప్పుడు


Again, ఇది వెన్నెల్లో ఆడపిల్లో ఏమో తెలియదుగానీ నేను చదివిన ఏదో నవలలో సీక్వెన్స్.

అయినా తులసిదళం నవలలో పిల్ల చేతికి తాయెత్తు కట్టి మోర్స్ కోడ్ లో హిప్నటైజ్ చేసి గుండే ఆపడం తో పోలిస్తే ఇది చాలా చిన్న లోపం :))

(ఎందుకంటారా -

1. చేతికి తాయెత్తు కట్టి హిప్నటైజ్ చెయ్యలేము
2. మోర్స్ కోడ్ లో హిప్నటిస్మ్ కుదరదు - అది మనకి తెలిసిన భాష అయ్యుండాలి
3. హిప్నటిజం తో గుండెని ఆపలేము )

Sujata M చెప్పారు...

@మలక్పేట్ రౌడీ గారు - :D

Padmarpita చెప్పారు...

మలక్పేట్ రౌడీ గారి జవాబు కరెక్టేనా....చెప్పి చిక్కుముడి విపొచ్చుగా రవిగారు...

సృజన చెప్పారు...

ఒక అభిమానిగా తప్పులు మీరు ఎంచండి, ఒప్పులని నేను ఆనందిస్తానండి...

పరిమళం చెప్పారు...

Nice photograph!

మంచు చెప్పారు...

This heroine - Two grandmaster game is in Sidney Sheldon's "If tomorrow comes" novel . In that the heroin challenges one grandmaster with blacks and other with whites. The bet is she gets the money if she wins/draws .. she looses money if opponent(GM) wins. Since the grandmasters are so confident they agree for that. finally the match ends in draw and she wins money from both GMs.

if Tomorrow comes is very good novel if someone wants read a good thriller.

Unknown చెప్పారు...

ఇంతకీ అ నోవెల్ లో తప్పేంటంటే రేవంత్ ,చెస్ గేమ్ లో అవతలి వ్యక్తీ pawn ని జరపగానే గుర్రం తో చెక్ చెప్పి నెగ్గినట్టు గ రాసారు నిజానికి చెస్ లో ముందు గడిలో ఏదన్నా అడ్డం వున్నా గాని రెండు అడుగులు ముందుకి ఆపైన ఒక గది పక్కకి వేసే అధికారం గుర్రానిది అటువంటప్పుడు opponent pawn జరిపాక గుర్రం తో చెక్ చెప్పాడని రాయడం absurd.అదేవిషయాన్ని తెలియ బరుస్తూ నవల విడుదలైన మర్నాడే ఒక అభిమాని యండమూరి కి లెటర్ రాస్తే తన తప్పు తెలుసుకుని కూడా అయన దాన్ని అలాగే వదిలేసానని చెప్పారు.అది విషయం .

Malakpet Rowdy చెప్పారు...

Ravigaru,

I dont understand this. One guy moves a Pawn and the other guy moves the Knight and Checkmate! I still dont understand whats wrong with this!

Unknown చెప్పారు...

malak a knight need not wait for removal of any obstruction let it be a pawn to checkmate.in that novel yandamuri wrote the moment pawn is moved there was a checkmate .

Malakpet Rowdy చెప్పారు...

నిజమేనండి. కానీ ఇక్కడ చెక్‌మేట్ అవ్వాలీ అంటే అవతల వాడు పాన్ జరపగానే సరిపోదు కదా? మనము కూడా జరపాలి.


If you are saying that the guy who moved the pawn lost thje game because he moved the pawn then the whole thing is wrong. In a game of chess, the WINNER always has the last move!

Malakpet Rowdy చెప్పారు...

If the King is already under Check from the Knight, then he will not be allowed to move the pawn in the first place!