2 ఫిబ్ర, 2010

మనసు ప్రభావం


మనిషి ఆరోగ్యం మీద మనసు ప్రభావం చాల వుంటుంది.మన ఆలోచనే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని యి మద్యన జరిగిన కొన్ని సంఘటనల వల్ల విదితమైంది .కూతురు హత్య కి గురైందని విన్న వైష్ణవి తండ్రి ఆ బాధ తో గుండె పోటుకి గురై మరణిచడం .అంటే మనసు వ్యాకులత చెందితే రక్త ప్రసరనలలో వచ్చే మార్పులు , బాధ వల్ల దాన్ని ఆదిగ మించడానికి శరీరం ఉత్పత్తి చేసే ఎంజ్య్మేస్ శరీర ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి .సంతోషమే సగం బలం అంటే అప్పట్లో పెద్ద గా పట్టించు కోలేదు గాని ఇప్పుడు అర్ధం అవుతోంది దాని అర్ధం . మనం సంతోషం గా వుంటూ నవ్వుతు తుల్లు తు మనసుని ఆహ్లాద కరం గా వుంచుకునప్పుడు ఏ అనారోగ్యం దరి చేరదు .అదే బాధల్లో వునప్పుడు మనసులో ఆనందం మటుమాయమై ఎక్కడలేని రోగాలు వస్తాయి .ట్రాఫ్ఫిక్ లో చిక్కుకుని ఆఫీసు కి లేట్ అవుతోందని బి పి పెంచుకునే కంటే ,అదే ట్రాఫ్ఫిక్ లో ఎఫ్ ఏం radio లో పాట తో శ్రుతి కలిపి మనసుని రంజింప చేసుకుంటే డ్రైవింగ్ కూడా ఆహ్లాద కరం గా వుంటుంది.మొన్నటికి మొన్న'' అతనెవరు '' లోని ఆమె ఆ కధ ని తీసేసే వరకు తెగ వ్యాకులత చెంది మనసు పాడు చేసుకుని ,ఆరోగ్యం పాడు చేసుకుని అయ్యో యీమే ఎమై పోతుందో అన్నంత లా అనిపించి , తీసేసాక మళ్ళి నార్మసి కి వచ్చి ఆనందం గా వుండడం తో ఆరోగ్యం మళ్ళి వచ్చింది .
పూర్వ కాలం లో ఋషులు కంద మూలాలు తింటూ ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ మనసుని ప్రశాంతం గా ఉంచు కోవడం తో ఆరోగ్యం గా వుండి వందేళ్ళు బతికే వారేమో .మన మనసు మన మాట వినే వరకు ఆరోగ్యానికి ధోకా లేదు ,''ఆమె'' మాటో లేదా అతని మాటో వినడం మొదలెట్టినప్పుడే ప్రమాదం .కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళ క పొతే ఆరోగ్యం బద్రమే లేక పొతే జీవితాలు చిద్రమే .రెండో పెళ్లి కి సిద్ద పడక పొతే ఆ వైష్ణవి తండ్రి బతికి వుండే వాడేమో ?అసలు ప్రతి మనిషికి నలభై దాట గానే వేరే ఆలోచనలు పోయి అద్యాత్మికత వైపుమనసు వెళ్ళే లా భగ వంతుడు సృష్టి ని మార్పు చేస్తే యి నేరాలు ఘోరాలు పూర్తీ గా పోతాయేమో?లేదా నలభై లోపే పొడుచుకు చచ్చి పోతారో?ఎత వాత నా కని పిస్తోంది మనసు లోనే మర్మం వుందని .

8 వ్యాఖ్యలు:

'Padmarpita' చెప్పారు...

అదేనండి రవిగారు మేము చెప్పేదికూడా...మనసులోని మర్మం మన మాటవినదని:)

రవిగారు చెప్పారు...

మరి ఆమె / అతని మాట మాత్రం ఎలవిన్తున్దంటారు పద్మార్పిత గారు?
మనసు మర్మం గుట్టు విప్ప గలిగే మర్మయోగులు ఎదురు పడే దాక
ఇంతేనా?

అజ్ఞాత చెప్పారు...

కళ్ళు వెళ్ళిన చోటకల్లా ఒళ్ళు వెళితే చెళ్ళుమని పళ్ళు రాలే ప్రమాదం ఉందేమో రవిగారు.ఏదైనా కుటుంబ వ్యవస్థ దెబ్బతిననంత వరకూ ఒకే.అంతేనా పద్మార్పితగారు.

పరిమళం చెప్పారు...

అందుకే పెద్దలెప్పుడో చెప్పారు సంతోషం సగంబలం అనేకాదు కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు ...మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళ కూడదు అని :)

అజ్ఞాత చెప్పారు...

ఏది ఎక్కడికి వెళ్ళినా అన్ని జాగ్రత్తలు పాటిస్తే ఏ బాదలూ ఉండవు.

naa blogu chutamu ra randi చెప్పారు...

బాగుంది రవిగారు. అసలు ఆ అమ్మయి నిజమొ కల్పనొ తెల్చకున్దానె మమ్మల్ని చాలా సస్పెన్స్ లొ పెట్టి మమ్మల్ని చాలా భయపెట్టి, ఆ కధ కల్పనొ కాదొ చెప్పకున్దానె మమ్మల్ని వి.పి లని చెసెసారు. ఇప్పుదెమొ అమ్మాయిల బొమ్మల ముందు అబ్బాయిని సగమె నిలబెట్టి అంతా మనసులొనె ఉందంటున్నారు. మొత్తానికి అంతా మనసులొని మాయ అంటారు. "మనసు గతి ఇన్తె, మనిషి బ్రతుకిన్తె "అని పాడు కుంటామ్లెన్ది.

Malakpet Rowdy చెప్పారు...

అసలు ప్రతి మనిషికి నలభై దాట గానే వేరే ఆలోచనలు పోయి అద్యాత్మికత వైపుమనసు వెళ్ళే లా భగ వంతుడు సృష్టి ని మార్పు చేస్తే యి నేరాలు ఘోరాలు పూర్తీ గా పోతాయేమో?
____________________________________

LOL I'm 39 and it's scary :))

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ మలక్
నలభైకి ఎందుకు పద్నాలుగు ఏళ్లకు ఆ పనేదో చేస్తే ఇంకా సమస్య వుండదు కదా :)

@Ravi
Pic is super.