12 ఫిబ్ర, 2010

కాగడా నేనా?


అది రెండు వేల ఎనిమదవ సంవత్సరం ఆ రోజు నాకింకా గుర్తు
బుక్స్ exibition లో బ్లాగర్స్ ఆంతా కలిసి ఆనందం గా గడిపిన వేళ
నేను వెంటనే ఇంటికి వచ్చి అదే ఆనందం లో''బ్లాగర్స్ దిగి వచ్చిన వేళ ''
అన్న పోస్ట్ రాస్తూ పొరపాటున ఆవిడ సున్నుండల మీద రాసిన ఆ క్షణం
ఎడమ కన్ను అదిరిన క్షణం ,తీతువు పిట్ట కూసిన క్షణం ,
గోడ మీద బల్లి నా కేసి జాలిగా చూసిన క్షణం ,నేను పట్టించు కొని ఆ క్షణం .
అంతే మర్నాటి నుంచి ఆ వెధవ కి , వాడి బ్లాగు కి పాడి కడతా ,
మీరు కుడా నా వెనక క్యు కట్టండి అని ప్రమాదా వనం సభ్యులని ఆదేశించి
నా మీద బురద చల్లడం మొదలెట్టిన ఆ క్షణం ,
యెంతో మంది బ్లాగ్ లోకపు నిరంకుసత్వాన్ని
మౌనం గా భరిస్తూ ఏమి రాసినా వహ్వా వహ్వా అంటూ
కంప్యూటర్ ముసెసాక పొగిలి పొగిలి ఏడ్చి
యి బాధల నుంచి విముక్తి చేసి స్వేచ్చగా గా భావ ప్రకటన చేసుకుని
రాసుకునే లా చేసే అద్బుతం ఏదన్నా జరగక పోతుందా అని ఎదురు చూసిన ఆ క్షణం
వొకటి కాదు రెండు బ్లాగులు వచ్చాయి . అవే కాగడా(kaagadaa .blogspot .కం),ధూమ్ మాచారె
మొదట్లో ఆ రెండు నన్ను రెచ్చ గొట్టి నిరంకుశత్వం మీద దాడి చేసేలా ప్రేరేపించినా
త్వరలోనే తమ ఉనికిని బ్లాగ్లోకం లో చాటాయి .అయితే అప్పట్లో కాగడా శర్మ వ్రాసిన
రాతలలో ని బూతు ని సాకు గా చూపి తామే ఆ బ్లాగ్ ని తొలగింప చేసామని కొంత మంది చెప్పుకుంటే ,
కాగడా నే వచ్చిన పని అయిపోయిందని అవతారం చాలించాడని కొందరు చెప్పుకున్నారు .చాలా మంది
చంకలు కొట్టు కున్నారు .ధూమ్ కుడా మౌనం వహించడం తో బ్లాక్ లోగులు తమ చెప్పు చేతల లోకి వచ్చేశారని
ఇంకా అంతా అదుర్సు అదుర్సు అంటూ కొత్త గా బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టిన సబ్యుల చేత కూడా స్టెప్స్ వేయించారు .
మళ్ళి ఇంతలో సుడిగాలి లా , మంచు తూఫాను లా ,కాగడ రంగ ప్రవేశం చెయ్యడం , ఎక్కడా కూడా బూతు పద ప్రయోగం లేకుండా తన మానన తను పేరడీలు రాసుకుంటూ ,ఎంతో మంది ప్రమాదా వనం సబ్యుల అభిమానాన్ని చుర గొంటూ ముందుకు సాగి పోతుంటే , మళ్ళి యి కాగడా పీడా ఎలా వదిలించు కోవాల అని కొన్ని విదేశి శక్తులు కుమ్ముక్కై
దానికి విరుద్దం గా వేరే బ్లాగ్ మొదలు పెట్టి అందులో బూతు కామెంట్స్ రాయించి , దాన్ని బూచి గా చూపించి యి రెండు బ్లాగుల్ని తీసేయ్యాలి వాడికి ''తలంటాలి '' అంటూ ఉద్యమాలు లేవ దీయడమే కాకుండా మద్యలో కాగడా వీళ్ళలో వొకరు అంటూ నన్ను , మలక్ ని మాత్రమె కాకుండా పాపం తన మానన కవితలు రాసుకుంటూ అజాత శత్రువు గా వుండే పద్మార్పిత ని కూడా లాగడం . ఇదంతా చూస్తూ వుంటే తన వంది మాగతులు తప్ప ఇంకా ఎవరన్న కాగాడానే అనేస్తా , కబాడ్డార్ అంటూ అదే కాగడా ని వాడుకుని తన శత్రు వర్గం లో వాళ్లకి కామెంట్ పెడితే అంతే సంగతులు అన్న సందేశాలని పంపడం.
సరే ఇంకా అసలు విషయానికి వస్తే ఇంతకూ ముందే నేను చెప్పా నేను కాగడా కాదు మొర్రో అని .ఇప్పుడు కూడా అదే చెబుతున్నా , అయినా జ్యోతులు వెలిగించ డానికి కాగడా కావాలేమో గాని సూర్య కాంతికి కాగడా అవసరమా? అయితే నేను బ్లాగ్ లోకం లో ఎటాక్ కి గురి అయినప్పుడు నన్ను సపోర్ట్ చేసిన చాలా మంది బ్లాగ్ మిత్రుల లో కాగడా కూడా చేరి పోయాడు వొక అజ్ఞాత లా .ఎవర్ని నొప్పించకుండా సరదా గా నవ్వుకోడానికి రాసే పేరడీల వరకూ నేను కాగడా అభిమాని నే . నాకు అర్ధం కాని విషయం ఏంటంటే కాగడా ఎవరు అని ఆలోచించే మనకి బ్లాగ్ లోకం లో మిగతా వాళ్ళు అంతా ఎలా వుంటారో ?యేంచేస్తారో తెలుసా?మరి చలికాలం , పొయ్యేకాలం అంటూ టైటిల్ లోనే పేరడీ ని కలిగి వున్న వారెవరు?ఏంటో మళ్ళి నేను ''అతడెవరు'' అనో ''ఆమె ఎవరు'' అనో అపరాధ పరిశోధనల మీద పోస్ట్స్ రాసుకుంటూ శేష జీవితం గడిపెయ్యలేమో చూస్తుంటే .
p .s ; ఆంధ్ర తెలంగాణా లాంటి బ్లాగ్ లోకపు యి సమస్య లో చంద్ర బాబు లాగ మౌనం గా ఉండ లేక ,
అందునా కాగడ ఎవరు లో నా పేరు కుడా లాగ బట్టి నిశబ్దాన్ని చేదిస్తూ , కాగడా పుట్టు పురోత్రాలని
జనాలకి గుర్తు చెయ్యడం కోసమే యి పోస్ట్ తప్ప రావణ కాష్టం లా నిప్పు ని కాలనివ్వడం నా ఉద్దేశం
కాదని విజ్ఞులు గమనించ ప్రార్ధన .

17 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

కాగడా నువ్వు కాకుంటే మరి నేనా?
జ్యోతి

శ్రీనివాస్ చెప్పారు...

అంటే కాగడ ఎవరు ? కాగడామొగుడెవరు? అది సరే గాని అతనెవరు ? ఆమెవరు?

మంచు పల్లకీ చెప్పారు...

ఒక్కవిషయం నాకు అర్ధం కాలేదు..
నేనిప్పటివరకు..కాగడా బ్లాగులొ కానీ, కాగడాని సమర్దిస్తూ కానీ, విమర్శిస్తూగానీ, ఎక్కడ కామెంట్ చేయ్యలేదు.. అలాగే కాగడా సపోర్టర్స్ తొ రాసుకుపుసుకు తిరిగె స్నేహం లేదు.. కాగడా వ్యతిరేకులతొ గొడవపడలేదు.. మరి నా పేరు ఎందుకొచ్చిందొ తెలీదు.. ఎదేమయినా మాంచి కాలక్షేపం గా వుంది.. కాకపొతె దానికి ఒక లిమిట్ వుంటుంది.. అది దాటనంత సేపు.. ఎంజాయ్ చెసుకొనివ్వండి..

karthik చెప్పారు...

@మంచు పల్లకీ
మీరు సరే కనీసం ఒక సంవత్సరం నుంచీ బ్లాగుల్లో ఉన్నారు.. పవన్ ఏం చేశాడు? షీలాను చూసి సిగ్గుపడుతూ మార్తాండ మీద విరుచుకు పడుతూ ఉండేవాడు అన్యాయంగా బ్లాగు రాజకీయాలకు బలైయ్యాడు..

శరత్ 'కాలమ్' చెప్పారు...

కాగడా ఎవరో తేల్చడం అన్నది శ్రీక్రిష్ణ కమిటీ బాధ్యతల్లో ఒకటి కావాలని ఇందుమూలంగా డిమాండ్ చేస్తున్నాం.

మంచు పల్లకీ చెప్పారు...

మార్థాండ మీద విరుచుపడేవాళ్ళు చాలా మంది వున్నారు.. కానీ మేము ఇద్దరమే విరుచుపడేది ఎక్కువగా రిజర్వెషన్స్ మీద.. ఈ కొణం లొ ఎవరయినా అలొచిస్తున్నరా??

Malakpet Rowdy చెప్పారు...

ఇది మనిద్దరినీ, మనతోపాటు కాగడానికూడా రెచ్చగొట్టీ వేరే వాళ్ళమీదకి వదిలే ప్రయత్నంలా ఉంది. తొందరపడద్దు.

ఏక లింగం చెప్పారు...

శ్రీకృష్ణ కమిటో, ద్రౌపది కమిటో వేసి నిర్ణీత కాలవ్యవదిలో నివేదిక వచ్చేటట్టు చేయండి. :)

మంచు పల్లకీ చెప్పారు...

ఎలాంటి విషయాలు త్వరగా తేల్చెస్తే..తర్వాత కాలక్షేపం ఎముంటుంది ?? ఇలా సవాళ్ళు విసురుకోవడమే బావుంది.. కాగడా ఎవరనే విషయం మీద లిస్ట్లు, షార్ట్ లిస్ట్లు, ఊహాగానాలు బాగనే జరుగుతున్నాయి గానీ కాగడామొగుడు గురించి ఇప్పటివరకూ ఒక్కపేరు బయటకురాలేదు.. అబ్బే ఇదేం బాలేదు..
మలక్ ఆ ఇంటర్వ్యూ పొస్ట్ ఎప్పుడేస్తావ్..

karthik చెప్పారు...

నేను కూడా మలక్ గారి పోస్ట్ కోసం వెయిటింగ్.. ఆ కాగడా మొగుడి బ్లాగులో మలక్ "We both are stepping back to our early 2009 status :))" అని రాశారు.. దాని గురించి మరింత explain చెయ్యాలని మనవి..

karthik చెప్పారు...

ఇంతకూ మనDTP cum internet cum printer" బయటికి రావట్లేదు.. మనోడు వస్తే "మలక్, కాగడా, కాగడా మొగుడు ముగ్గురు ఒకే వ్యక్తి" అని సూత్రికరిస్తాడు..

Malakpet Rowdy చెప్పారు...

Well Karthik

I was much more aggressive in early 2009 and kinda mellowed down after that ...

But looking at the recent happenings, I have a feeling that this is being done by a third party.

I'll wait and watch... But yes the post will be out soon

పవన్ చెప్పారు...

అవును
మంచు గారు చేప్పినట్టు నేను ఏక్కువ వీమర్షించెది ఆ reservations నే నాకు ఎందుకో ఒక్కడి మీద డౌటు ఉంది చుద్దాం ఏమవుతుందో.సుత్తో గుత్తో పగులిపోతుంది ఆడికి.

కార్తిక్ దన్యవాదాలు :)

నాగప్రసాద్ చెప్పారు...

రేపు ఫైనల్స్ కదా. అప్పుడే అందరికీ అంత తొందరెందుకు?

అజ్ఞాత చెప్పారు...

కాగడా ఎవరు? కాగడా మొగుడెవరు?కాగడా గర్ల్ ఫ్రెండెవరు?ఫస్టు కీపెవరు? కాగడా లావెంత? పొడుగెంత?పవరెంత? ఆ విషయాలు అక్కలకు కావాలిగాని మనకి అవసరమా అన్నలూ.

'Padmarpita' చెప్పారు...

అదేకదా!......ఈ అజాత శత్రువుపైనా ఇన్ని అభాంఢాలు? జోక్ ఆఫ్ ది బ్లాగ్:)

అజ్ఞాత చెప్పారు...

శరత్ కోసం కనుక్కుంటూన్నారేమో లే అజ్ఞాత