22 మే, 2010

అనుక్షణికం (నాల్గో బాగం)

http://images.lightstalkers.org/images/872935/01_inraj354b.jpg
ఉదయం ఎనిమిది గంటలకే ఆఫీసు కి రెడీ అయి వెళ్లి పోయా ,సుధ మొహం కుడా చూడాలని లేదు . రాత్రంతా ఆలోచిస్తే అసలు ఈమె హస్తం ఉందేమో? అన్న అనుమానం కూడా కలుగు తోంది .నేను ఆఫీసు కి వెళ్ళే దాక కూడా తను గుడి నుంచి రాలేదు అంటే ఇద్దరు కలిసి కంసాలి దుకాణానికి పోయి సగం సగం పంచుకున్టున్నరేమో ఆ నగ అమ్మేసి నన్ను వెర్రి వెదవని చేసీ .ఇంతలో సెల్ మోగుతోంది సుధా నించే ఎత్తాల ?వద్దా ?అనుకుంటూనే తీసి ఏంటి అన్నా విసుగ్గా .
ఏంట్రా అంత విసుగు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని ఇంటికొస్తే అప్పుడే వెళ్లి పోయావ్ ? అయిదున్నరకి వెళ్లి ధ్వజ స్తంబం దగ్గర ఆ నగ ప్యాకెట్ పెట్ట గానే , పది నిమిషాలకి ఎవరో చిన్న పిల్లాడు వచ్చి తీసుకెళ్ళాడు వాడిని మెల్లి గా అనుసరిస్తూ వెళ్తుంటే వాడు దానిని అప్పటికే టాక్సీ లో ఎక్కేసి అందులో వెయిట్ చేస్తున్న వొక ఆమె కి ఇవ్వ గానే కార్ తుర్రు మంది దుమ్ము లేపుకుంటూ . కనీసం ఆమె ముఖం కూడా చూడ లేక పోయా .నా వల్ల నీకు ఏ విధమైన నష్టం కలగ కూడదని అమ్మ వారి గుడి చుట్టూ నూటెనిమిది అంగ ప్రదక్షణలు చేసీ ఇప్పుడే ఇంటి కొచ్చా అంటుంటే జాలి వేసింది అనవసరం గా యి అమాయకు రాలీని అనుమానిస్తున్ననేమో అని .
సర్లే రెస్ట్ తీసుకో నేను అదెవరో కని పెట్టె పనిలో పడతా అంటూ సెల్ కట్ చేశా .అది అయిన పది నిమిషాలకే మళ్ళి ''వో కవున్ తి'' నుంచి ఫోన్ . సరే మాటల్లో పెట్టి ఎవరో కని పెట్టాలి అని ఎత్తా .
నన్ను కని పెట్టె పని పక్కన పెట్టండి గాని ముందు గా చాల థాంక్స్ నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇంత మంచి గిఫ్ట్ ఎప్పుడూ ఇవ్వలేదు , రుణాను బంధ రూపేణా పశు పత్ని సుతాలయ అంటారు , మనిద్దరి మద్య మరింత రుణ భారం పెరిగి మీ పత్ని గా వచ్చే జన్మ లో పుట్టాలని నా కోరిక , అందుకే దీనితో సరి పెట్టుకుంటే మీ ఇంట్లో పశువు గా పుట్టాలి అందుకే నా చిట్టాలో రెండో ది బ్లాక్ బెర్రీ ఫోన్ , సాయంత్రం తీసేసుకుని అక్కకి ఇచ్చేస్తే , అక్క గుళ్ళో అంద జేస్తుంది అంటుంటే బీ పీ ఫుల్ గా రైజ్ అయ్యింది , నేను తన తో అన్న మాటలు కూడా తెలిసి పోతున్నాయి క్షణాల్లో అంటే ఇద్దరు తోడూ దొంగలేమో .
ఎంటే నేను మీ ఇద్దరికీ అంత ఎర్రి పప్పు లా కని పిస్తాన్నానా? ఏదంటే అది కొని పెట్టేసి నోట్లో యేలు ఎసుకోడానికి , నీ ఇష్టమొచ్చినట్టు చేసుకో ఇంకో సారి ఫోన్ చేసావంటే ఆ పబ్లిక్ బూత్ దగ్గరికి వచ్చి మరి తంతా అంటూ ఆవేశం గా అరిచేసా
వద్దు బంగారం అనవసరం గా అక్కని అపార్దం చేసుకోకు ఇందులో ఆమె పాత్ర అస్సలు లేదు . నువ్వు మరి ఆవేశ పడితే ఇంకో పది నిమిషాల్లో నువ్వు మొన్న రాత్రి అన్నం పెడుతుంటే అమాంతం అక్క మీద పడినభంగిమ ఫోటో నీ టేబుల్ మీద వుంటుంది , అధికారి అక్రమ సంభంధం అంటూ టీ వి లో పోద్దస్తామాను ని ఫోటో చూసుకోవాలంటే నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేసింది .
ఆమె చెప్పినట్టే అరగంటలో మా ప్యూను సార్ మీకు కవర్ అని ఇవ్వడం తోటే చెమటలు పట్టాయి .విప్పి చూస్తే కొంప కొల్లేరు అయ్యే ఫోటో చక్క గా ఇద్దరి మొఖాలు తమకం తో ప్రకాశవంతం గా కని పిస్తున్నాయి .నా పియ్యే బావమరిదికి సెల్ దుకాణం వుంది అతన్ని పిలిచి వొక బ్లాక్ బెర్రీ మనకి యెంత పడుతుంది అంటే తమరి కైతే యేమి పడదయ్య అంటూ చేతులు నలుపు కుంటూ నిల బడ్డాడు అతడి పదోన్నతి ఫైల్ నా టేబుల్ మీద పెడుతూ .
అబ్బ గుర్నాధం నేను అలంటి వాణ్ణి కాదయ్యా కొంత తక్కువ లో ఇమ్మను లాభం తగ్గించుకుని అంతే గాని ఊరికే కాదు నాకు అచ్చి రాదు అన్నా
అబ్బే నా హస్త వాసి చాల మంచిది సార్ నాతొ బోని కొట్టండి మీకు తిరుగు లేదు అంటూ అసలే విసుగ్గా వుంటే మరింత విసిగిస్తున్నాడు . వెంటనే ఫైల్ తీసి రివ్యూ స్టాఫ్ స్త్రెంగ్థ్ బిఫోర్ పుట్టింగ్ అప్ థిస్ ఫైల్ అని రాసి పడేసా .
అరగంట లో బ్లాక్ బెర్రీ ఇరవై వేలు బిల్లు తో గుర్నాధం వచ్చాడు .థట్స్ బెటర్ అని చెక్ రాసి అతని కిచ్చా .సాయంత్రం ఇంటికెళ్ళి సుధ కి ఇచ్చి పొద్దునే గుడి కెళ్ళి ఇచేయ్యమంటే ఆమె ఇంకా చాలురా నా పరువు పోయినా పర్లేదు నువ్వు మాత్రం ఇంక ఏమి ఇవ్వకు తాడో పేడో తేల్చుకుందాం అంది .
చూడు నువ్వు సమస్యని నీ కోణం లోంచి మాత్రమె చూసి మాట్లాడుతున్నావు ఇక్కడ నా పరువు తో పాటు వుద్యోగం కుటుంబ వ్యవస్థ ముడి పడి వున్నాయి కాబట్టే తలొగ్గ వలసి వస్తోంది . అసలు ఆమె ఎవరో అంత ఇంటిమేట్ ఫొటోస్ ఎలా తీసిందో నాకైతే అర్ధం కావటం లేదు ,నీకు బాగా దగ్గరైన స్నేహితులు ఎవరన్న వున్నారేమో గుర్తు తెచ్చుకో మీ ఇంటి కొచ్చేవాళ్ళు ?అని అడిగా .
మా ఇంటికొచ్చేవాల్లంటే వొకప్పుడు నన్ను పెళ్లి చేసుకుందామనుకుని పెళ్లి చేసుకోలేక పోయిన మా బావ ,నా కంటే చిన్నదైనా నాతొ అన్ని పంచుకునే పెళ్ళికోసం ఎదురు చూస్తున్న తరణి , తరణి ద్వార పరిచయమైనాపొలిసు ఇన్స్పెక్టర్ రంగనాథ్ , మేము ఏమి కొత్త వస్తువులు కొనుక్కున్నామా అని అరా తియ్యడానికి వచ్చే మా వదిన . ఇంతే అంది .
వీళ్ళల్లో వొకరో ఇద్దరో కలిసి విడి విడి గానో , జాయింట్ గానో యి బాగోతం నడిపిస్తూ వున్దోచ్చేమో అనుకుంటూ ఆలోచిస్తుంటే అప్పుడే సుధ వాళ్ళ అబ్బాయి టీ వి ఆన్ చేసాడు , కలకాలం ఉండవులే కన్నీళ్ళు , కలతైనా కలలైన కొన్నాళ్ళు అంటూ నా కిష్టమైన పాట వినిపిస్తుంటే బారం గా మెట్లెక్కుతూ నా పోర్షన్ కి చేరుకున్నా .సుధ వాళ్ళ అబ్బాయి చేత డిన్నర్ పంపింది సెల్ లో మెసేజ్ పంపింది ప్రేమని రంగరించి గోరుముద్దలు తినిపించే అదృష్టం చెయ్యి జారి పోయింది కనీసం నేను సైతం నీ ధాతువు కోసం మెతుకు నొక్కటి వండి ఇచ్ఛా అన్న సంతోషం మిగలని అని .
అబ్బ యి ధాతువు యావే తీతువు లా నన్ను పట్టుకుని పీడిస్తోంది యిమేది ప్రేమో కామమో అర్ధం అవటం లేదు పోనీ కామం అనుకుని కోరిక తీర్చేస్తే మొహం మొత్తి వెళ్లి పోవచ్చేమో అని పిస్తుంది లేదా మరింత ముదిరి నా కే కావాలి నువ్వు అనుకుంటూ అనుక్షణం ఆఫీసు లో పని కూడా చేసుకోనీకుండా ఇంటికేప్పుదోస్త్తావు అంటుంటే అదో బాధ . అయినా ఇంక కొన్ని రోజుల్లో యి బంధాలు తెంచుకుని గువ్వలా యెగిరి పోవాలి నా చెలి గూటికే చేరుకోవాలి అని మనసులో నా బార్యని ,పిల్లల్ని గుర్తు చేసుకుంటూ సెల్ లో ఎఫ్ ఏం ఆన్ చేస్తే అందులో'' వూరు మారినా మనిషి మారునా ? మనిషి మారినా మమత మారునా '' అన్న పాట వస్తుంటే నిజమే యి క్షణం బార్య పిల్లలు దూరం గా వున్నారు కాబట్టి అలా అని పిస్తోంది మళ్ళి వాళ్ళ దగ్గరికి వెళితే సుధ గుర్తు రావడం లో ఆశ్చర్యం లేదు అని పించింది .
మర్నాడు లేవడం తోటే మనసంతా ఏదో ఆనందం తో నిండి పోయిన భావన .తెలియ కుండానే మనసులో ఏదో మంచి జరగా బోతోందేమో అని పిస్తోంది . వెంటనే రెడీ అయిపోయి గుడికి వెళ్ళా అప్పటికే పాపం సుధ బ్లాక్ బెర్రీ ఇచ్చేసి అంగ ప్రదక్షిణాలు చేస్తోంది .నన్ను గమనించ లేదు . నేను గుళ్ళోకి వెళ్లి స్వామి నీ ప్రేరణతోనే స్నేహితులు , శత్రువులు అందరు కలుస్తారు , ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో తెలుసుకోలేక చస్తున్నా త్వరలో నాకు ట్రన్స్ఫెర్ వచ్చేలా చూడు తండ్రి అంటూ దణ్ణం పెట్టుకుంటుంటే గంట మోగింది పూజారి శుభం సంకల్ప సిద్ది రస్తు అంటూ దీవిస్తే కళ్ళలోంచి ఆనంద భాస్పలు వచ్చాయి .అదే భగవంతుడికి బక్తుడికి మద్యజరిగే ఆంతరంగిక సంభాషణ వేరే వాళ్ళకి చెప్పినా అర్ధం కాదు , స్వచ్చమైన మనసుతో ప్రార్దించి త్వమేవ శరణం అన్న ప్రతి సారి నాకు సమాధానం దొరికించాడు . ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆఫీసు కి వెళ్లి పోయా . సుధ పాపం పోర్లుతునే వుంది . ఆఫీసు కి వెళ్ళ గానే హెడ్ ఆఫీసు నుంచి ఫాక్స్ నన్ను మా ఊరికి బదిలీ చేస్తూ వేరే వాళ్ళని ఇక్కడకి పోస్ట్ చేస్తూ వచ్చిన ఆర్డర్ అది .ఇంతలో సుధ నుంచి సెల్
వోరేయి నీ కో శుభ వార్త నీ జాతకం గుళ్ళో తెలుగు యోగి గారని ఉద్దండ పండితులు ఆయన భూత భవిస్యత్తు వర్తమానాలతో పాటు గత జన్మ రాబోయే జన్మ కూడా చెప్ప గల దిట్ట వారు కని పిస్తే కాస్త వార్ని వుబ్బేసి (ఆడవాళ్లంటే ఆయనకి అదో ఇది లే )నీ జాతకం చెప్పమన్నా . ఆయన అడిగిన సమయాన్ని లెక్క లోకి తీసుకుని యి జాతకుడికి త్వరలో రాజ యోగం , జైలు రోగం రెండూ పట్ట బోతున్నాయి అన్నారు .నేనింకా వివరాలు అడిగే లోపే ఆయన గాల్లో చేతులు తిప్పుతూ రెండు కను బొమ్మలు పైకెగరేస్తూ శూన్యం లో ఎవరి తోనో ఆవాహ ఆకర్శ వుచ్చాలయ , కవచాలయ అంటూనే గత జన్మ లో అతను నీ భర్త అనుక్షణం నిన్ను అనుమానించి వేదిన్చేవాడు దానికి శిక్ష గా యి జన్మ లో మళ్ళి నీ అంతరంగికుల ద్వార అనుకోని ఉపద్రవం లో పడి జైలు పాలు అయ్యి కొంత మానసిక క్షోభ అనుభ విస్తాడు . అంటూ గాలిలోంచి వీభూతి తీసి దీన్ని అతని మగసిరి మీద నువ్వే పోస్తే దోశ పరిహారం అయ్యి ఉదృతి తగ్గుతుంది అన్నాడు కాబట్టి నువ్వు సాయంత్రం తొందరగా వస్తే ......
ఆ తొందరగా వస్తే ఎంచేస్తావు దీనికంటే డైరెక్ట్ గా వోరేయి నీతో వొక్క రాత్రి గడపాలని వుంది అని వుంటే నీ నిజాయితీ కి సంతోషించి వోప్పుకునే వాణ్ణేమో ఇప్పుడు ఇక్కడకి యెంత పవిత్రం గా వచ్చానో అంత పవిత్రం గాను వెళ్లి పోతా నా భార్య పిల్లల దగ్గరకి , ఈ రాత్రే వెళ్ళిపోతున్నా మా ఊరికి నాకు ట్రన్స్ఫెర్ ఆర్డర్ వచ్చేసింది .ఇంక నీకు నీ అంతరంగికులకి వెయ్యి నమస్కారాలు , నీలో ఎక్కడో కొంత నీతి నిజాయితీ ప్రేమ వుందని నమ్ముతున్నా కాబట్టే చెప్పి వెళుతున్న ఇన్నాళ్ళు వండి పెట్టినందుకు థాంక్స్ హఫ్కోర్స్ సరుకులు నేనే కొన్నాననుకో అంటుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ ఫోనే పెట్టేసింది .సాయంత్రం ఆఫీసు లో ఫేర్ వెల్ పార్టీ అయిపోగానే ఆఫీసు కార్ లో ఇంటికొచ్చా సామాను తీసుకుని స్టేషన్ కి వెళ్ళడానికి .అన్ని సద్దేసుకుని తాళాలు ఇవ్వడానికి కిందకి వెళితే సుధ లేదు వాళ్ళ అబ్బాయి వచ్చి ఆంకుల్ మమ్మీ ఈ యిరవై వేలు మీకిమ్మన్డి సరుకులు బాకీ అని చెప్పమంది అంటుంటే అయ్యో భలే వాళ్ళే మీరేమన్న పరాయి వాళ్ళ బకాయి అనుకోడానికి నువ్వే ఉంచుకుని నీకు కావలిసింది కొనుక్కో అన్నా . లేదంకుల్ తీసుకోక పొతే నా మీద వట్టు అంటూ కూడా చెప్పమంది అన్నాడు సరే అమ్మని పిలు చెప్పేసి వెళ్లి పోతా అంతే మమ్మీ గంట క్రితమే గుడికి వేల్లిన్దంకుల్ మీరు వెళ్లి పోయాకే వస్తానని చెప్పిందంటుంటే కళ్ళలో నీళ్ళు తిరి గాయి యి పిచ్చి మొద్దు నాకర్ధం కాదు చాలా ఆత్మాభిమానం అనవసరం గా సరుకుల మాట ఎత్తి అవమానిన్చానేమో అనుకుంటూ నాకు వీడ్కోలు పలక డానికి వచ్చిన స్టాఫ్ చూడ కుండా కళ్ళు తుడుచుకుంటూ చెయ్యి ఊపు తున్నా .రైలు మెల్లిగా వేగం పుంజుకుంటోంది ప్లాట్ఫారం దాటి వెళ్ళిపోతోంది , ఇన్నాళ్ళు నన్ను దాచుకున్న ఆ వూరు, మమతలు పంచిన మనుషులు ,మెల్లిగా మసక బారి పోతున్నారు .నేను కూడా లోపలి వెళ్ళ బోతూ రైల్ గేటు దగ్గర రెండు కళ్ళు నన్ను గమనిస్తునట్టు గా అనిపించి తేరిపార చూస్తే తనే సుధ వెక్కి వెక్కి ఏడుస్తూ పమిట నోట్లో కుక్కుకుని చెయ్యి ఊపుతూతనే , వొక్క సారి చైన్ లాగి వెనక్కి వెళ్లి నన్ను క్షమించు నేస్తం అని అడగాలని పించింది భారం గా చెయ్యి ఊపుతూ ఆమె మసక బారి పోయే దాక అల్లాగే తలుపు దగ్గరే నిలబడి లోపలకి వెళ్ళా .ఈ గతం అంతా నెమరేసుకుంటూ ఎప్పుడూ నిద్రలోకి వెళ్ళానో నాకే తెలీదు . ఇంతలో నన్ను ఎవరో బలంగా తట్టి లేపుతుంటే మెలుకువ వచ్చింది . కళ్ళు తెరచి చూస్తే ఎదురు గా పోలీసులు యు ఆర్అండర్ అర్రెస్ట్ అంటూ ఇన్స్పెక్టర్ చెయ్యి పట్టుకుని తీసుకు పోతున్నాడు దేనికి అని అడుగు దామనే లోపు ఫస్ట్ ఎసి భోగిముందు అప్పుడే స్త్రేట్చేర్ లో పెట్టి దింపుతున్న శవం గాలికి తొలగిన ముసుగులో ఆ రాత్రి నాతొ పాటే ప్రయాణించి మధ్యరాత్రి వేల్లిపోయిన్దనుకున్న అపరిచిత .రాత్రి మీ ఇద్దరే యీ కూపే లో ప్రయాణించారు ఆమె సెల్ లో ఆఖర్న మీ నెంబర్ వుండడం తో అనుమానం మీద మిమ్మల్ని తీసుకేల్లక తప్పడం లేదు అంటూ చెపుతున్నాడు .
డాడి డాడి అంటూ స్టేషన్ లో నన్ను రిసీవ్ చేసుకోడానికి వచ్చిన పిల్లలు ఏవండి అంటూ భార్య మీరు ఇంటికి వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అంటూ సముదాయించి పొలిసు జీప్ ఎక్కా , రాజ యోగం , జైలు రోగం చెవిలో సుధమాటలు రింగు రింగు మంటున్నాయి అంటే తెలుగు యోగి చెప్పింది జరగా బోతోందా?చేతులారా రేమిడి ని వదులు కున్నానా ? హె భగవాన్ ఏం జరగ బోతోంది ?(అది తెలియాలంటే ఆగాలి మరి)

4 వ్యాఖ్యలు:

Malakpet Rowdy చెప్పారు...

cool!

uma blog చెప్పారు...

anni post lu oke saari chadivaa ....malli next eppudu post chestaaru chaalaa int gaa undi

హారం ప్రచారకులు చెప్పారు...

రవిగారు గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

శ్రీనివాస్ చెప్పారు...

కధ లో ట్విస్ట్ బాగుంది ..