24 జులై, 2010

మర్యాద తప్పిన రామన్న

http://movies.bharatfamily.com/movienews/images/movies/1276164346Maryada-Ramanna.jpg

ఇప్పుడే మర్యాద రామన్న చూడడం జరిగింది .రాజమౌళి ఆడియో విడుదల చేసినప్పుడే కధ హింట్ ఇవ్వడం తో ప్రేక్షకులు మానసికం గా హింస లేని రాయలసీమ కధకి సంసిద్దులై రావడం , సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకుల్ని కధనం లో విలీనం చెయ్యడం ,కీరవాణి సంగీతం ,సునీల్ నటన ,తెలుగమ్మాయిలా అందం గా కనిపించే సలోని యి సినిమాని విజయ పంధాలో నడిపిస్తాయనడం లో సందేహం లేదు .కధకి బ్యాక్ డ్రాప్ ఫ్యాక్షన్ అయినా మిగతా సినిమాల్లో లా తోడ కొట్టడాలు , రక్తం చిన్దిన్చాదాలు వుండవు .టూకీగా కధ చెప్పుకోవాలంటే హీరో నాన్న , హీరోయిన్ బాబాయిని చంపితే ఆ బాబాయి కూడా హీరో నాన్నని చంపేస్తాడు .దాంతో సునీల్ ని వాళ్ళ అమ్మ దూరం గా ఎక్కడో హైదరాబాద్ లో చినప్పటి నుంచి అతనికి యి ఫ్యాక్షన్ గొడవలతో సంబంధం లేకుండా పెంచుతుంది .హీరోయిన్ తండ్రి ,అన్నలు మాత్రం ఎప్పటికన్నా శత్రు శేషం ఉంచమని అతన్ని కూడా చంపాలని ఎదురు చూస్తూ వుంటారు .సునీల్ కి ఆస్తి గా వొక డొక్కు సైకిల్ తప్ప ఏమి వుండదు .తల్లి కూడా పోవడం తో బాబాయి పెంచుతాడు .వొక రోజు పోస్ట్ లో అతని తల్లి కి అయిదెకరాల పొలం కోర్ట్ తీర్పు ప్రకారం ఆమె కి ధారాదత్తం అయినట్టు పాస్ బుక్ తీసుకోడానికి ఆ వూరి ఏం ఆర్ వో ఆఫీసునుంచి లెటర్ రావడం తో ఎర్రగుంట్ల రైల్లో బయలుదేరతాడు .ఆ పొలం అమ్ముకుని ఆటో ట్రాలీ కొనుక్కోవాలని అతని ఆలోచన .ఆ రైల్లో సలోని పరిచయం .అందమైన భావాలకి గీతల రూపం లో చిత్రాలు గియ్యడం ఆమె అభి రుచి .ఆ పుస్తకాన్ని ఆమె రైల్లో మరచి పొతే సునీల్ తీసుకుని ఆమెకి ఇచ్చేలోపు రైలు ఎర్రగుంట్ల దాటి పోతుంది .అయితే సునీల్ పొలం అమ్మడానికి ఆ వూళ్ళో పెద్దమనిషి సాయం కోసం వెళితే అతనే హీరోయిన్ ఫాదర్ .అంతే కాకుండా ఇన్నాళ్ళు ఎవర్ని చంపడానికి ఎదురు చూస్తున్నారో అతనే సునీల్ అని కూడా వాళ్ళకి తెలిసి పోతుంది .అయితే ఆపెద్దాయనకి తల్లి లాంటి తన ఇంట్లో అతిధి మర్యాదలు మాత్రమె జరగాలని రక్తం మాత్రం గడప బయటే అని ఆచారం గా పెట్టుకుంటూ కొడుకులకి కూడా అదే ఆదేశిస్తాడు .సునీల్ కి యి విషయం తెలిసి పోవడం తో ప్రాణ రక్షా నార్దం అతిధి మర్యాదలు అయిపోయి నాక కూడా పొలం చూద్దాం రా అన్నా కూడా రాకుండా కింద పడి నడుం విరిగినట్టు నాటకం ఆడి మరికొన్ని రోజులు అక్కడే తిష్ట వేస్తాడు .అదంతా సలోని మీద ప్రేమతో నే అని వాళ్ళ బావ (బ్రహ్మాజీ )ఆటపట్టిస్తూ ఉంటాడు .సలోని కి వాళ్ళ బావతో పెళ్లి చెయ్యాలని పెద్ద వాళ్ళు అనుకున్తునప్పటికి వాళ్ళిద్దరికీ ఇష్టం వుండదు .తను మరిన్ని రోజులు వుండడం కోసం వాళ్ళిద్దరికీ నిశ్చితార్దం జరిగేలా సునీల్ ఏర్పాట్లు చేస్తాడు . అందులో ఆమెగీతలలో దాచుకున్న భావాల్ని కాబోయే భర్త ఎలా వుండాలను కుంటోన్దో పాట రూపం లో పాడడం తో ఆమె సునీల్ నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది .అయితే ఆ గీతల లోని భావాన్ని అప్పుడే గ్రహించిన బావ తన మనసు మార్చుకుని నిశ్చితార్దానికి సిద్దం అవుతాడు . గుళ్ళో నిశ్చితార్దం పెట్టి తద్వారా బయటకు వచ్చిన సునీల్ ని చంపెయ్యలని హీరోయిన్ తండ్రి అన్నల ప్లాన్ .క్లైమాక్స్ లో మళ్ళి మగధీర బ్రిడ్జ్ ని వదలలేదు రాజమౌళి .సునీల్ ప్రాణ భయం తో పరిగెడుతూ వుంటే హీరోయిన్ అతనికి యి చెక్క దాటి ఆ బ్రిడ్జే మద్యలోకి వెళ్లి చెక్క తీసేస్తే వాళ్ళు అందుకోలేరని ఇద్దరం పారి పోవచ్చని చెపితే సునీల్ ఆ చెక్క దాటుకుని వెళ్లి ఇప్పటికే నా కోసం మీరు శ్రమ తీసుకుని వచ్చారు ఇంకా ఎందుకని తను అటు వెళ్ళ గానే చెక్క లాగేస్తే ఆశ్చర్య పోవడం సలోని వంతు .సునీల్ తనని ప్రేమించాడనే అనుకుంటుంది , ఇంతలో ఆమె తండ్రి అన్నలు వచ్చి ఇంకో చెక్క వేసి ఆ బ్రిడ్జ్ మధ్యకు వెళ్లి అతన్ని చంపాలని ప్రయత్నించడం తో తండ్రి కి చెపుతుంది తను సునీల్ ని ప్రేమించానని చంపోద్దని .అప్పుడు సునీల్ నటన అద్బుతం . తనంత తానుగా చెక్కని వేసి విలన్స్ కేసి నడుస్తూ ఇంత అందమైన అమ్మాయి ప్రేమించిందని తెలిసాక పారి పొతే ఆ ప్రాణానికి విలువ లేదంటూ చెప్పిన డైలాగు ప్రేక్షకులకి కంట తడి పెట్టిస్తుంది .విలన్సు కొడుతున్నా కూడా హీరోయిన్ చెయ్యి పట్టుకుని అల్లాగే తన్నులు తినడం . హీరోయిన్ అతన్ని రక్షించడం కోసం చెయ్యి విదిలించుకుని బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దుకేయ్యడం సునీల్ కూడా వెంటనే దూకి ఆమెని రక్షించడం,తండ్రి కూడా పగని వదిలి ప్రేమకి ఆమోదం తెలపడం తో కధ సుఖాంతం అవుతుంది .
పాటల పరం గా తెలుగమ్మాయి ,రాయే రాయే రాయే సలోని బావున్నాయి . సునీల్ స్టెప్స్ కి విజిల్స్ పడ్డాయి .నలభై ఏళ్ళుగా పాడుతున్న ఎస్ పి కి మొదటి సారి గా గానం బాలుగారు అని వెయ్యడం సముచితం గా అనిపించింది (నా రవిగారు లాగ ?)మొత్తానికి యి సినిమా కుటుంబ సమేతం గా వెళ్లి ఆనందించ తగ్గ సినిమా . ఈ మద్య విడుదలైన తెలుగు సినిమాలు (శుభప్రదం ,ఝుమ్మంది నాదం , స్నేహగీతం వగైరా ) బాక్స్ ఆఫీసు దగ్గర పల్టి కొట్టడం , దగ్గరలో పెద్ద సినిమాల పోటి లేక పోవడం తో మర్యాద రామన్న హిట్ అవడం కష్టమేమి కాదేమో . .యిది నిజం గా చిన్న బడ్జెట్ తో తీసిన పెద్ద సినిమానే . కంగ్రాట్స్ టు రాజమౌళి .కొస మేరుపెంటంటే సినిమా అయిపోయాక టైటిల్సు వేస్తూ ఆ సినిమా షూటింగ్ షాట్స్ (మగధీర లా గే )చూపిస్తుంటే ప్రేక్షకులు అలాగే నిలబడి అయ్యేదాకా వుండి చూసి ఆస్వాదించడం .
ఇది పోస్ట్ చేసాక యి సినిమా 1923 లో వచ్చిన అవర్ హాస్పిటాలిటి కి మక్కి కి మక్కి కాపి అని నిర్దారించుకుని నోరు వెల్ల బెట్టా . అందుకే టైటిలు మర్యాద తప్పిన రామన్న గా మార్చేసా .

7 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

అమ్మో ఇప్పుడే అందిన అభిజ్న వర్గాల సమాచారం ప్రకారం
యి సినిమా our hospitality (1923 ) అన్న ఇంగ్లీష్ సినిమాకి స్వేచ్చానువాదం
బస్టర్ కేటన్ దాని దర్శకుడు http://www.imdb.com/title/tt0014341/plotsummary

astrojoyd చెప్పారు...

mee peru ravi yaa leka ravigaaru naa,if the 2nd one is correct means i have to adress u like"ravigaarugaaru"?pl.enlighten me sir........

కమల్ చెప్పారు...

ఇది లో బడ్జెట్ సినిమా అని మీరు డిసైడ్ అయిపోయారా...? వార్ని..! ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా..? అక్షరాల 16 కోట్ల నుండి 20 కోట్ల మద్యలో ఖర్చు అయ్యింది..! నోరెళ్ళబెట్టారా..? అదే మరి రాజమౌళి సినిమా అంటే...మాటలా..!!!

Malakpet Rowdy చెప్పారు...

సారూ,

మరీ ఇలా స్టొరీ మొత్తం చెప్పెయ్యడం బాలేదు.

ఏస్ట్రోజాయ్ గారూ,

మీ ఇబ్బంది సరే. రవిగారితో గొడవ జరిగినవాళ్ళు ఆయన్ని ఏమని పిలవాలి మరి? "రవిగారుగాడూ" అనా? :))

Unknown చెప్పారు...

అస్త్రొ గారు ఇన్తకు మున్దె చెప్పాను రవి అన్టే యహూమైల్ దొరకకపొతె గారు తగిలిన్చా అప్పటి నున్చి అలాగె (గత పది యెల్లుగా )కొన సాగిస్తున్న .
కమల్ రాజమౌలి సినిమాలకి పదహారు కొట్లు అన్టే తక్కువ బద్జెట్ కిన్దె లెక్క .
మలక్ నా కన్టే మున్దె యెనభై యెడెల్ల క్రితమె ఆ కధని యిన్ గ్లి సు లొ చెప్పెసారు

కమల్ చెప్పారు...

రవిగారు.ఒక్క మగధీరే పెద్ద బడ్జెట్, మిగతావన్ని 12 కోట్ల నుండి 20 కోట్లలోపలే రాజమౌళి చేసారు. అదీను సునిల్ సినిమా 18 కోట్లు బడ్జెట్ అంటే పెద్ద బడ్జెటే కదా..? మర్యాదరామన్న సినిమాని చిన్న బడ్జెట్ అని అనుకొని మొదట ప్రాంరంబించారు, తర్వాత తడిసిమోపెడు అయ్యింది..అదీ విషయం.

పరిమళం చెప్పారు...

:) :)