10 జులై, 2010

బ్లాగర్ వైరాగ్యం

http://www.carlosfran.com/wp-content/uploads/2008/01/blogar-cansar.jpg

బ్లాగింగు మొదలెట్టిన కొత్తలో బ్లాగర్ కొత్త పెళ్ళికొడుకు తో సమానం .పగలు రాత్రి తేడాలేకుండా ఎప్పుడు బ్లాగ్ మీదే ద్యాస .ఎప్పుడు ఎప్పుడు రాసేద్దమా ఎప్పుడెప్పుడు కామెంట్స్ చూసేద్దమా ?అన్న ఆత్రమే .కొత్త బిచ్చగాడు పొద్దెర గడని అర్దరాత్రి అపరాత్రి కూడా ,జీవిత భాగస్వామి ఎవోయి కొంచెం పడుకోడానికి రావొచ్చు గా ?అన్నా కూడా అబ్బ ఇవాల్టికి నన్ను వదిలెయ్యండి పని వుంది అని రెచ్చి పోయి రాసేసిన రోజులు కూడా వుంటాయి .కాలం గడుస్తున్న కొద్ది మన బ్లాగ్ లో ఏమి చెత్త రాసినా కూడా వా వా అనే వంది మాగతులు కూడా తయారవుతారు .మనకి తెలీకుండానే వొక వర్గానికి కొమ్ము కాస్తూ ఆ వర్గాన్ని నొప్పించకుండా వ్యతిరేక వర్గాన్ని రెచ్చ గొడుతూ రాస్తూ ఉంటాము .కొన్నాళ్ళకి రాయడానికి సబ్జక్ట్స్ అన్ని అయిపోతాయి .బ్లాగ్ తో పెళ్లి అయ్యి సంవత్సరం దాటి పోతుంది .మొదట్లో వున్న మోజు తగ్గి పోతుంది .యి రెండు సంవత్సరాలలో బ్లాగ్ కి దగ్గరవడం వల్ల ఇంట్లో వాళ్ళకి దూరం అవుతాము.మొదట్లో వున్న ఉదృతి స్తబ్తత గా మారు తుంది .బ్లాగ్ లో రాసేదిచదివి వుహించుకున్న రూపాలు వాస్తవం లో శాపాలు గా మారతాయి .వాస్తవం కన్నా వుహే బావుంటుంది .యి లోపు ఆఫీసు లో శ్రద్దగా పని చెయ్య కుండా బ్లాగ్ లో రాసుకున్టున్నరన్న విషయం పైదాకా పోతుంది.దాంతో పైవాడు వేరే ఊరికి ట్రన్స్ఫెర్ చేస్తాడు (గవర్నమెంట్ లో అయితేనే ).ప్రైవేటు లో వుద్యోగం వుడుతుంది .కళ్ళకి జోడు ,ఇంట్లో వాళ్ళకి కొత్త తోడూ కూడా రావొచ్చు .అప్పటికి కళ్ళు తెరుచుకో బడి బ్లాగోదయం అవుతుంది .వైరాగ్యం పుట్టుకొస్తుంది .పని పాట లేని వాళ్ళు మాత్రమె బ్లాగింగు చేస్తారని చేతినిండా పని వున్న వాడు బ్లాగ్ మొఖం చూడడని పోస్టింగ్స్ రాసుకుని స్వేదబిందువులు తుడుచుకుని నిర్వేదం లో పడిపోతాం .యి స్టేజి లన్ని దాటుకొచ్చిన అనుభవజ్ఞులైన బ్లాగర్లకి యిది ప్రసూతి వైరాగ్యం అని అర్ధం అవుతూనే వుంటుంది .ఛి యిక జన్మలో భర్తని దగ్గరికి రానిచ్చేది లేదని మంగమ్మ శపధం చేసిన ఇల్లాలు మళ్ళి రెండో కాన్పు కి కూడా అలానే అంటుంది .యిది అంతే కొన్నాళ్ళు యి వందమంది కోసం ఏమిటి నా సమయం వృధా చేసేది అన్న నిర్వేదం తో బ్లాగ్ అంటే మొహం మొత్తి దూరం గా జరుగు తాము .మళ్ళి ఎవరో మిత్రులు ఫోన్ చేసి మళ్ళి బ్లాగుల్లో యుద్దాలు మొదలయ్యాయి చూసావా అనగానే సాయంత్రం ఆరు దాటగానే కల్లు పాకకి పరిగెత్తే తాగుబోతులా , కంప్యూటర్ ని చూడగానే స్వామి రారా బ్లాగోత్తమ పురుషా రా రా అని పిలుస్తున్నట్టు గా భావించుకుని రంగం లోకి దిగి పోతాం .మళ్ళి చర్విత చరణమే .నే చెప్పేదేమిటంటే యిదొక వ్యసనం అని వచ్చాకే తెలుస్తుంది తెలిసాక పెద్ద గా చేసేది ఏమి వుండదు యిదొక వ్యసనం అని పోస్ట్ రాసుకోవడం తప్ప .ఎటొచ్చి పెళ్ళయిన కొత్తలో ఉన్నంత ముద్దు ముచ్చట ఆ తర్వాత రోజుల్లో ఎలా తగ్గి పోతూ అప్పుడప్పుడు లోకి వెళ్ళిపోతుందో బ్లాగ్ లో రాతలు కూడా అదే పందాని అనుసరిస్తాయి .యిది కాలం తెచ్చే మార్పే కాదంటారా? .

14 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కరెక్టుగా చెప్పారు!

అజ్ఞాత చెప్పారు...

ఇవి మీ మనసులో మాటలా, లేక వెరెవరి పోస్ట్‌కో సెటైరా?

Unknown చెప్పారు...

దాసరి నారాయణ రావు స్టైల్లో చెప్పాలంటే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వుండవు .
యి విషయం లో యింతకంటే ఏమి చెప్పలేను. హి హి హి

అజ్ఞాత చెప్పారు...

చర్విత చర్వణం....సరియైనది....అంటే చెప్పిందే చెప్పడం...

సుజాత చెప్పారు...

@బ్లాగ్ లో రాసేదిచదివి వుహించుకున్న రూపాలు వాస్తవం లో శాపాలు గా మారతాయి .వాస్తవం కన్నా వుహే బావుంటుంది
? ఆరోజు టాంక్‍బండ్ మీద కలుద్దామని మీరన్నప్పుడే నాకు తెలుసు మీరిలా అవుతారని

మరువం చెప్పారు...

@కళ్ళకి జోడు ,ఇంట్లో వాళ్ళకి కొత్త తోడూ కూడా రావొచ్చు

LOL :))))))))))))

Malakpet Rowdy చెప్పారు...

ఆరోజు టాంక్‍బండ్ మీద కలుద్దామని మీరన్నప్పుడే నాకు తెలుసు మీరిలా అవుతారని
___________________________________

Ravigaru! U still continuing this? Wow!!!!

durgeswara చెప్పారు...

కవి గాంచని చోట రవిగాంచున్...

శ్రీనివాస్ చెప్పారు...

పూజతో మొదలెట్టి అందరినీ టాంక్ బంద్ మీదనే కలుస్తున్నారా?

Unknown చెప్పారు...

ఎరక్క పోయి రాసాను యిరుక్కు పోయాను అని
యి కామెంట్స్ గాని మా శ్రీమతి చూస్తె కద మొత్తం
చాల క్లారిటీ తో అర్ధం అవుతుంది .
భరద్వాజ్ యి నారద పాత్ర తగునా?
ఆ రోజుల్లో మీ ప్రోద్బలం తోనే గా పూజని కలిసింది .
ఇప్పుడు ఏది కర్తవ్యముకామెంట్స్ వుంచుటయా?పీకుటయా?

పరిమళం చెప్పారు...

:) :)

astrojoyd చెప్పారు...

ఇందులో కాలం తప్పేముంది ,అది ఎప్పుడు ఒకలాగానే నడుస్ట్టు వస్తోంది,వస్త్తున్న మార్పుల్ల మనసులోనూ+బాహ్యు పరిసరాలలోను/మనుషుల్లో మాత్రమే. ...ఇ పోస్ట్లో సరియిన అంతర్మధనం ఉన్నది.--జయదేవ్,చెన్నై-౧౭.

చందు చెప్పారు...

nijam chepparu sumeee !!!!

అజ్ఞాత చెప్పారు...

సోదరా...
చాలా పాయింట్లు కరెక్టుగా చెప్పారు. ఇంకా బ్లాగులో ఉత్తి పుణ్యానికి అమ్మనా బూతులు తిట్టే వెధవల గురించి మీరు రాయలేదు. అదొక భయంకరమైన పెయిన్ కదా.
well said and well written
Ramu
apmediakaburlu.blogspot.com