14 ఆగ, 2010

రీడిఫ్ఫ్ చాట్ భాగోతం (అను పిచ్చమ్మ కధ )

http://www1.istockphoto.com/file_thumbview_approve/2044877/2/istockphoto_2044877_girl_walking_away.jpg

వికట కవి శ్రీనివాస్ రీడిఫ్ఫ్ చాట్ మాటు విషయాలు రాస్తానండం తో నా స్వీయ అనుభవాన్ని ఎందుకు పంచు కో కూడ దని పించి రాస్తున్నా .లోగడ అంటే సన్నాల్ల క్రితం నెట్ అంటే మెయిల్ చూసుకోవడమే కాకుండా అపరిచితులతో హస్కు వేసుకోవచ్చని జ్ఞానోదయం అయిన తొలినాళ్ళలో వొక సుముహుర్తాన రీడిఫ్ఫ్ చాట్ కి హైదరాబాద్ రూం లో ప్రవెశించా .నా అయిడి'' రవిగారు ''.అప్పట్లో హైదరాబాద్ రూం ఎప్పుడు చూసినా కళ కళ లాడుతూ వుండేది .అప్పటికే మలక్ పేట రౌడి ,పూజా,పిచ్చమ్మ ,చిట్టి చిలక ,పాసింగ్ క్లౌడ్ ,దాదాగిరి ,మరికొంతమంది ఐడిలు (పేర్లు గుర్తుకు రావడం లేదు ) చాలా పాపులర్ .తొందర్లోనే మనం కుడా ఆ జాబితాలో చేరాక శ్రీనివాస్ మరికొంతమంది రంగ ప్రవేశం చేసారు .అయితే అందులో చాలా మంది ఆడవాళ్ళ వివరాలు అందరికి తెలుసు గాని వొక్క పిచ్చమ్మ వివరాలు ఎవరికి తెలివు .మలక్ వివిధ అయిడి లలో వస్తు జనాల్ని ఆట పట్టించే వాడు .హుందాగా వ్యవహరించే వాడు , దారి తప్పే వాళ్ళని అదిలించి మళ్ళి దార్లో పెట్టేవాడు వొక్క ''హైదరాబాద్ రౌడి '' ని తప్ప . మలక్కే ఫ్లడ్డింగ్ కి ఆద్యు డెమో దారి తప్పి ఆసబ్యం గా చాట్ చేసే వాళ్ళని ముందు గా చాట్ లోనే హెచ్చ రించి అప్పటికి వినక పొతే తన సాఫ్ట్వేర్ మాయ జాలం తో వాళ్ళ స్క్రీన్ అంతా యితని మెసేజ్ లు మాత్రమె వచ్చేల చేసి దిమ్మ దిరిగించే వాడు .అటువంటి నిష్ణాతుడు చాట్ లో వొక సారి ఎవరి వివరాలన్న తెలుసు కోవడం పెద్ద కష్టం కాదంటుంటే పిచ్చమ్మ నా వివరాలు కని పెట్టె మగాడు ఇంతవరకు ఎవడు లేడని సవాల్ విసిరింది .ఆవిడ సవాల్ కి ప్రతి గా నే కని బేడతా అని మంగమ్మసబధం చేశా . అయితే వొక చిన్న క్లూ అయిన ఇవ్వాలంటే యాహూ లో ఇస్తానని అందులో చాట్ కి వచ్చేవారు .పేరు కూడా చెప్పే వారు కాదు .అయితే వొక సారి వాళ్ళ అమ్మాయి స్కూల్ వాళ్ళతో కలిసి అరకు విహార యాత్రకి ఫలానా రోజు వెళ్తోందని చెప్పడం వాళ్ళఅమ్మాయి పేరు చెప్పడం తో నాకు తీగ తగిలింది .నా వుద్యోగపు హోదాలో కొన్ని ప్రముఖ స్కూళ్ళ కి ఫోన్ చేసి అరకు వెలుతున్నరేమో కనుక్కుంటే వొక స్కూలు వాళ్ళు దొరికారు .ఆ తరగతి వాళ్ళ రికార్డ్స్ తెప్పించి చూస్తే అదే పేరు తో ఇద్దరు అమ్మాయిలు .వాళ్ళ తల్లి తండ్రుల పేర్లు తీసుకుని పెట్టుకున్నా .అయితే ఆమె నాకిచ్చిన గడువు పది హేను రోజులే .అప్పటికే పన్నెండు రోజులు అయిపోయాయి .ఎంతో దగ్గరగా వచ్చాను కాని యెంత దూరం లో వున్నానో తెలీటం లేదు . ఆమె అస్సలు నోరు జారటం లేదు .అయితే తను రెండు రోజులు ఫలానా భూమి అమ్మకాల పని మీద గుంటూరు వెళ్తున్నా అని గడువు ముగిసే రోజే హైదరాబాద్ వస్తానని ఆ రోజు లోపు కని పెట్టాలని లేకపోతె ఇంకా యాహూ లో కూడా చాట్ చెయ్యనని చెప్పి మరింత రెచ్చ గొట్టింది .మా ఇద్దరి మద్య ఇంతవరకు ఈ యాహూ చాట్ భాగోతమే కాని కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు . అందుకే ఆమె ని ఆఖరి సారి నాదో అబ్యర్ధన మీరు గుంటూరు నుంచి వచ్చేటప్పటికి నేను నెగ్గు తానో లేదో నాకే తెలీదు . అది గాక అసలు మీరు ఆడో ?మగో కూడా తెలీదు ఇన్నాళ్ళు నన్నో బకరాని చేసి ఆడించారేమో అన్న బాధ నాలో వుండి పోతుంది అందుకని నా ఆఫీసు ఫోన్ నెంబర్ యిది (అప్పటికి సెల్ ఫోన్ లు లేవనే గుర్తు ) మీరు వొక్క సారి మాట్లాడితే నేను మోస పోయానేమో అన్న భావం నాలోంచి పోతుంది అన్నా .సెంటిమెంట్ బానే వర్క్ అవుట్ అయ్యింది ఆమె నా ఆఫీసు కి ఫోన్ చేసారు .నేనండి పిచ్చమ్మ ని రవిగారా ?అంటే ''వాట్ నాన్ సెన్స్ హు ఇస్ బ్లడీ రవిగారు?యు మే బీ పిచ్చమ్మ దట్ డాజ్ నాట్ మీన్ యు కేన్ రింగ్ ఆప్ టు థిస్ ఆన్ లిస్తేడ్ నెంబర్ .హు ఆర్ యు ''అని బెదర గోడితే సారీ సార్ అని పెట్టేయ్య బోతే నేను నవ్వు ఆపుకోలేకా అయ్యో నేనండి పిచ్చమ్మ గారు అంటే అమ్మో భయ పెట్టేసారు కదండీ , మీ తెలివి తేటలు వుపయోగించి యి నెంబర్ గురించి ఆరా తియ్యకండి యిది పబ్లిక్ ఫోన్ అంటూ కాసేపు మాట్లాడేసి మీరు నెగ్గితే బావున్ను అని నాకు వుంది మీకో చిన్న ఆఫర్ మీరు నిజం గా నా పేరు చిరునామా కని పెడితే తప్పకుండా నేను మిమ్మల్ని వొక రోజు కలుసుకుంటాను అంటూ బోనస్ ఆఫర్ ఇచ్చి అల్ ది బెస్ట్ చెప్పి ఫోన్ పెట్టేసారు .నేను వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే ఎవరో మగ అతను ఎత్తి బంజారా హిల్స్ లో ప్రముఖ సి డీ ల దుకాణం పేరు చెప్పగానే నేను నా తెలివి వుపయోగించి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడిన ఆవిణ్ణి పిలుస్తారా అంటూ అంగ్రేజ్ లో మర్యాద గా అడిగితె వాడు మీరెవరు అంటూ అనుమానాస్పదం గా అడగ డం తో ఇంక గతి లేక వాళ్ళ ఆయన్ని మాట్లాడుతున్న అంటే సార్ అమ్మ గారు ఇప్పుడే డ్రైవర్ ని'' అయిటీసి ''ఆఫీసు కి పోనీ అన్నారు సార్ అంటే మీ దగ్గరకే వస్తున్నారు సార్ అన్నాడు . అంటే గుండెల్లో వేయి వేణువులు మోగాయి .బుర్ర చురు కు గా పని చేసి నా దగ్గర వున్నా ఇద్దరి తల్లి దండ్రుల పేర్లు తీసుకున్నా . మా స్తేనో కి'' అయిటీసి '' ఫోన్ చేసి ఆ యిద్దరిలో ఎవరన్నా వున్నారేమో కనుక్కోమన్నా . నా అయిడియా ఫలించి వాళ్ళలో వొకరి పేరు కరెక్ట్ అయ్యింది . అయితే ఆయన బయటకు వెళ్ళారని చెపితే హమ్మయ్య అనుకుని ఆ నెంబర్ తీసుకుని నేనే వెంటనే ఫోన్ చేశా .యధా విధి గా మా స్తేనో కి చెప్పినట్టే లేరని సమాధానం వచ్చింది . అయితే ఇంటి నెంబర్ యియ్య మంటే ఆయన స్తేనో మీరెవరు అంది . పచ్చి వెలక్కాయ గొంతులో పడి ఆయన చినప్పటి స్నేహితున్ని హైదరాబాద్ పని మీద వచ్చా ఇంటికి వేళ్ళన్న కలుస్తా అంటే నెంబర్ ఇచ్చింది .వోకో నెంబర్ రాసుకుంటుంటే నా గుండె శబ్దం నా కే వినిపిస్తోంది . ఆమె చెప్పడం పూర్తి కాగానే ఆ నెంబర్ కి ఫోన్ చేశా . నెంబర్ రింగ్ అవుతోంది నాకు టెన్షన్ సెకండ్స్ నిముషాలు అవ్వడానికి అంత టైం పడుతుందా ?అనిపించిన క్షణం అది .ఆమె యెక్క వలసిన ట్రైన్ కి ఇంక నాలుగు గంటల సమయమే వుంది .పిక్ అప్ పిక్ అప్ పైకే అరుస్తుంటే అప్పుడే వచ్చిన మా స్తేనో నాకేసి ఆశ్చర్యం గా చూసి వెంటనే సారీ సార్ అంటూ వెళ్లి పోయింది .ఈ ప్రయత్నం విఫలం అయితే నేను వొడి పోయి నట్టే అన్ని దారులు మూసుకు పోయినట్టే ఆమెని నే నెప్పటికి చూడలేను కూడా. ఎందుకంటె ఆమె గుంటూరు వెళ్లి వచ్చే టప్పటికి గడువు కూడా ఆయీ పోతుంది ఆమె అసలే చాలా ఎస్సర్ టివ్ అన్నంత పని చేసి నా అయిడి డిలీట్ చేసినా ఆశ్చర్యం లేదు .ఇంక వొక్క సెకండ్ లో కట్ అవుతుందనగా
హలో అంటూ ఆమె గొంతు నా నోట మాట రాలేదు టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు అతనికి కలిగిన భావన , యూరి గగారిన్ చంద్రుడి మీద కాలు మోపినప్పుడు కలిగిన భావన ,రాకేశ్ శర్మ ఇందిరా గాంధీ తో పైనుంచి మీకు ఇండియా ఎలా కనబడుతోంది అంటే సారే జహాసే అచ్చా అంటూ కళ్ళల్లో ఆనందం తో వెలి భుచ్చిన భావన వాటిని మాటల్లో ఎవరన్నా చెప్పగలిగితే అదే నా భావన కూడా ఆ క్షణం లో .మౌనం గా కళ్ళలో ఆనంద భాష్పాలు రాలుతుంటే ఏమి మాట్లాడకుండా అలానే వుండి పోయా . ఆమె గొంతు అలానే హలో హలో అంటూనే వుంది .యింక ఆమె పెట్టేయ్య బోతుంటే xxxx గారు నేను నేగ్గానండి గట్టి గా అరిచా . అంతే ఆమె మై గాడ్ ఆయి కాంట్ బిలీవ్ థిస్ ఎలా సాధ్య పడింది . యు ఆర్ అ జినియుస్ .అంటూ గంట సేపు మాట్లాడింది నేనే మీ ట్రైన్ టైం అయిపోతోంది బయలు దేరండి అని చెప్పే దాక .ఆమె అంది ఇంత గొప్ప మేధావిని ఎప్పుడు చూద్దామా అని వుంది యి గుంటూరు పని లేక పొతే యిప్పుడే కలిసే వాళ్ళం అంటూ వచ్చే శని వారం ఫలానా చోటుకి ఫలానా టైం లో ఏదో నేర్చు కోడానికి వస్తానని అక్కడ కేవలం పది నిముషాలు మాత్రమె కలుస్తానని మళ్ళి ఎప్పుడు కలిసే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పి వూరు వెళ్లి పోయింది .
ఆ శని వారం ఉదయం ఎనిమిది ముప్పైకి ఆమె చెప్పిన ప్లేస్ కి నేను నా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళితే తను కూడా డ్రైవర్ లేకుండా తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ముందే ఫలానా కార్ లో వస్తోందని చెప్పడం తో గుర్తు పట్టడం తేలికే అయ్యింది . నా అనుభవ రీత్యా ఇంత వరకు యిలా చాట్ లో పరిచయం ఆయి కలిసిన వాళ్ళు వుహలకి భిన్నం గా (బహుసా ఎక్కువ గా వుహించు కోవడం వల్ల ) కొండక చోట కొంత నిరుత్సాహ పరుస్తూ వుంటారు . కాని ఇక్కడ డామిట్ కదా అడ్డం తిరిగిందని ఆమె పసిమి ఛాయతో ఎంతో అందం గా చక్కటి చీర కట్టు తో హుందాగా నడుచు కుంటూ వచ్చి హాయ్ రవిగారు కంగ్రాట్స్ అంటూ కర చాలనం చేసి మొత్తానికి సాధించారు అంటే నేను అంతా మీ అభిమానం అంటూ ఊరుకోక ''సాధించింది గోరంతా సాధించ వలసినది కొండంతా '' అన్నా అబ్బే ఇంక సాధించ డానికి ఏమి ఉండ దండి మనం మళ్ళి ఎప్పటికి కలవం గా అంది .నేను మాట తప్పను మీరు తప్పకండి అప్పుడే యిది వొక గొప్ప జ్ఞాపకం గా మిగిలి పోతుంది అంత కంటే ముందుకు వెళితే యిద్దరికీ చిక్కులే .ఫోన్ లో ఎలాగు మాట్లాడుకుంటూనే వుంటాం గా అంటూ బాయ్ అని చెప్పి వెళ్లి పోతుంటే ఆమె కనుమరుగయ్యే దాక చూస్తూ భారం గా నా స్మ్రుతి పధం లో ఆమె రూపాన్ని నింపుకుని వెను దిరి గా .కొంత కాలం ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుకునే వారం . అయితే రోజులన్నీ వొక లాగే ఉండవని రీడిఫ్ లో వుండే వ్యతిరేక గ్రూప్ నాటిన విష బీజాలకి ఆమె మాట్లాడే ధోరణి లో వచ్చిన మార్పే తార్కాణం .కొన్నాళ్ళకి రోజు వచ్చే ఫోన్ వారానికి ఆపై పక్ష్హానికి అక్కడ నుంచి నెలకి వెళ్లి పోయి ఆగి పోయింది .ఆమె నా జ్ఞాపకాలలో శిధిలం ఆయి పోయింది .యిప్పుడు వికటకవి పుణ్యమా అని శిధిలాల లోంచి జ్ఞాపకాల్ని తవ్వి తీసా .
అయితే మేము రీడిఫ్ఫ్ చాటర్స్ అంతా మలక్ ప్రోద్బలం తో వొక సుముహుర్తన్ని కలిసి మా చాట్ కి కూడా వొక మంచి గమ్యాన్ని ఏర్పరుచుకుని కొన్ని మంచి పనులు చేసే వాళ్ళం తరచూ గా కలుసుకుని . అయితే వాటికి కూడా ఆమె దూరం గా వుండడం తో నేను తప్ప ఆమెని ఎవరు ఇంతవరకు చూడలేదు చూడ బోరేమో కూడా .
అందుకేనా నా కిష్టమైన పాట''నా నావ దాటి పోయింది ఆ వడ్డే చేరి పోయింది అట్టాగే మళ్ళి పోయేనా నన్నిడిచి వెళ్ళే పోయేనా ?''.

17 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వెన్నెల్లో ఆడపిల్ల....

Unknown చెప్పారు...

అయ్యో అజ్ఞాత పాపము సమించు గాక ఆవిడ బతికే వున్నారు
అదీ కాక మేమిద్దరం వొక సారన్నా కలుసు కున్నాం కాబట్టి
వెన్నెల్లో ఆడపిల్ల వర్తించదు .పట్టాల మీద పిల్ల అనాలేమో?
పట్టాలు దూరం గా చూస్తె కలిసి పోయినట్టు బ్రమింప చేస్తాయే గాని కలవవు
మాలాగే వొకే వూళ్ళో వున్నా ఎప్పటికి కలవం, అందుకే ఆ ఫోటో పెట్టా .

అజ్ఞాత చెప్పారు...

కథ ఏమంతగా స్పైసీగా లేదు, బాగోలేదు. కనీసం ఆమె ఫోటో పెట్టుండాల్సింది. వా .. :(

Malakpet Rowdy చెప్పారు...

రవిగారూ,

ఆ పేరు తీసేస్తేనే నయమేమో ఒకసారి ఆలోచించండి.

But you know what ... గతమంతా ఒక్కసారి గిఱ్ఱున తిరిగింది. Nice one

శ్రీనివాస్ చెప్పారు...

ఏ పేరు ఎస్ తో మొదలయ్యే పేరా లేక పి తో మొదలయ్యే పేరా

Unknown చెప్పారు...

మలక్ మీ కోరిక మీద వారిని తీసేసా .మీరు కూడా చూడని కాంతని
నేను గాన్చానన్న మధుర స్మృతీ యెదలో ఎప్పటికి పదిలం ,
శీను పీ పేరు ని తొలగిస్తే ఆవిడే వచ్చి నన్ను రెండు పీకుతుంది
అందుకే ఆ సాహసం చెయ్యటం లేదు .

వెంకట్ చెప్పారు...

హ్మ్ బాగుంది,నా ఆర్కుట్ రోజులు గుర్తొచ్చాయి :)

శ్రీనివాస్ చెప్పారు...

రౌడీ గాంచని కాంతను రవి గాంచెను :)

Malakpet Rowdy చెప్పారు...

మలక్కే ఫ్లడ్డింగ్ కి ఆద్యు డెమో
_______________________

No, not me - it was a guy called Bingo on Indiainfo who in turn borrowed the concept from Yahoo booters - I just used a different technique on Rediff

శ్రీనివాస్ చెప్పారు...

రెడిఫ్ లో ఆద్యుడు మీరే .... రెండవ స్థానం ( మీ సౌజన్యం తో )నాది :)

మీరు మలక్ నేను పనిషర్

అజ్ఞాత చెప్పారు...

వికటకవి టపాలు, మీ టపాని చదివిన తరువాత చదువు కొని ఉద్యోగం చేసుకొనె మీరు ఇటువంటి చాటింగ్ ల మీద ఇంత సమయం వెచ్చించారా అని ఆశ్చర్యమేసింది. అదే కాకుండా వారి గురించి వెతకడం కూడానా ? హతవిధి ఉద్యోగం చేసెవారె ఇలా ఉంటె పని పాటా లేకుండా ఉండె యువత ఇంక ఎలా అఘోరి స్తున్నారొ అని ఊహించటానికి భయమేస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

ఊహించటం ఎందుకూ? భయపడటం ఎందుకూ?

Unknown చెప్పారు...

అజ్నాతి గారు నేను వెచ్చి చింది నా ప్రవేటు సమయం
చాటింగ్ లోకి రాత్రి ఎనిమిది నుంచి మాత్రమె వచ్చే వాణ్ణి
శని ఆది వారాలు పగలు కూడా .అలాగే ఆమెని కలిసింది కూడా
ఆఫీసు వుండని శని వారం రోజే . సో బాద్యతల కి అడ్డం రాకుండానే
చాట్ మాటు వ్యవహారాలలో తల దుర్చే వాణ్ణి .
అయినా మడిసన్నాక కాస్తంత కళా పోషణ వుండాలి
ఊరికే తిని తొంగుంటే మనిషి కి గొడ్డు కి తెడా ఎటున్తాది .
కొసమెరపు ఏంటంటే చాట్ కి కోన సాగిమ్పే బ్లాగ్
అంటే మీరు కుడా ..........

నేస్తం చెప్పారు...

అబ్బా,ప్రశాంతం గా ఉందండి బాబు ఎట్టకేలకు విషాదం,మోసాలు,ద్రోహాలు లేని ఒక సంఘటన చదివాను :)

శ్రీనివాస్ చెప్పారు...

నేస్తం గారు నేను ఇక్కడే ఉన్నా ... లేననుకుని ఏడో అనేస్తున్నాను ఆయ్

నేస్తం చెప్పారు...

ఉన్నారు కాబట్టే అన్నాం సార్ లేకపోతే అంటాం ఏంటి :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

Interesting :-)