10 సెప్టెం, 2010

పులి బారిన పడని అదృష్టవంతుణ్ణి

మా పిల్లలు కొమరం పులి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటే నాలుగు టికెట్స్ తెప్పించా . తీరా బయలుదేరే టైం కి నాకేదో ముఖ్య మైన పని గుర్తొచ్చి మా శ్రీమతి ని పిల్లల్ని వెళ్ళమని నేను ఆగి పోయా.నా కెప్పుడు వినాయక చవితి ముందు రోజే వినాయకుడి గుడి కి వెళ్లి దర్శనం చేసుకుని కానుకలు సమర్పించి రావడం రివాజు . పండుగ రోజుల్లో , రష్ గా వునప్పుడు గుడి కి వెళ్ళడం నా కిష్టం వుండదు .ఆ పని ముగించుకుని ఇంట్లో ప్రశాంతం గా కూర్చుని పాటలు వింటున్నా.మా వాళ్ళు వస్తూనే నువ్వు అదృష్ట వంతుడువి డాడి చత్త సినిమా యెంత సేపటకి అవదు .డై హార్డ్ ఫాన్స్ కూడా కాగితాలు విసరడానికి తెచ్చుకుని విసరడానికి అవకాశం రాక వాళ్ళ నెత్తి మీదే పోసుకుని పోయారని చెపుతుంటే హమ్మయ్య వెళ్లక పోవడమే మంచి దయ్యిందని సంతోషించా .సినిమా మొదలయిన పదిహేను నిమిషాల దాక హీరో ఇంట్రోడుస్ అవడు.వొక బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ కి ఫ్లయ్యి చేస్తూ ఉంటాడుట . కామెడి లేదు.మూడు గంటల టార్చర్ అని తేల్చారు .సోమవారం నుంచి ఎదర డబ్బులిచ్చిన చూసే వాడు ఉండక పోవచ్చు . కాబట్టి ఆవేశ పడి ఆది వారం పాడు చేసుకోవద్దని నా సలహా .

8 వ్యాఖ్యలు:

శివ చెప్పారు...

"......విసరడానికి అవకాశం రాక వాళ్ళ నెత్తి మీదే పోసుకుని పోయారని చెపుతుంటే..."

Good Review point!!!

పానీపూరి123 చెప్పారు...

as expected. :-)

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అదంతా మరచిపోండి అందుకోండి మీరు మా వినాయక చతుర్థి శుభాకాంక్షలను.

సుజాత చెప్పారు...

ఓ, పులంటే ఈ పులా! మెట్లదారిలో తిరుమల వెళ్ళొచ్చారనుకున్నాను సుమా!:-))

సినిమా మొదలయిన పదిహేను నిమిషాల దాక హీరో ఇంట్రోడుస్ అవడు.వొక బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ కి ఫ్లయ్యి చేస్తూ ఉంటాడుట ....:-))

కామెడీ లేదంటారేమిటి? ఇంతకంటే కామెడీ ఏం కావాలి?

సావిరహే చెప్పారు...

nenu kuda adrustavanthudine mari !!!

:))))))))


వినాయక చవితి శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

రవి గారు: బ్లాగు టెంప్లెట్టు మార్చకూడదూ. ఎన్నేళ్ళయినా ఇదే. :)

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

రవిగారు గారూ...,happy vinakayaka chavithi

హారం

రవిగారు చెప్పారు...

శివగారు ధన్యవాదాలు ,పానిపూరి ,విజయ్ మోహన్ ,సుజాత గారు ,సావిరహే ,భారారే
మీకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు .
అజ్ఞాత టెంప్లేట్ మారిస్తే మళ్లీ బ్లాగ్ లోకం లో భూకంపాలు వస్తాయేమో అని భయం .