
కొన్నాళ్ళకి ఈ స్నేహం చెదిరి పోవచ్చు
ఈ ప్రేమ పారి పోవచ్చు
జ్ఞాపకాల్లో మిగిలిపోవచ్చు
నాకన్నా మెరుగైనవాళ్లు వచ్చి నిన్నుమురిపించొచ్చు
నేను నీతో మాట్లాడే ఆ సమయం శూన్యం గా నిశబ్దం లో వుండి పోవచ్చు .
మెసేజ్ లతో నిద్రలేపిన అరుణో దయాలు వివర్ణ మయ్యి గాయాలు రేపోచ్చు
మాటలు కలిపిన మధ్యన్నాలు మసకబారి పోవచ్చు
కలిసి నడిచిన సాయం సమయాలు వొంటరి గా నడిచే నన్ను చూసి నిట్టుర్చొచ్చు
నువ్వు నీ కొత్త స్నేహ భందాలతో తెగిపోయిన ఈ భందాన్ని పట్టించు కోక పోవచ్చు
నిన్నటి నా నువ్వు ,రాబోయే రేపటి కి పరాయి దానివి అయిపోతు ఈ రోజు కి సెలవు తీసుకోవచ్చు
నీ కొత్త పరిచయాల ఆనందపు కిల కిలారావాల లో నా ఆక్రోసపు మూగ వేదన వినిపించక పోవచ్చు
కాని వొంటరి గా నిసిరాతిరి నిశబ్దం లో నిండు పౌర్ణమి ని చూస్తూ నీ పెదవుల పై విరిసే ఆ చిరునవ్వే సాక్ష్యం
నువ్వు నన్ను మరువలేవని నీ జీవితపు డైరీ లో నే నీ విలువైన జ్ఞాపకాన్నని
మళ్ళి మనం యి జీవితం లో కలవ లేక పోవచ్చు
భాద్యతల బతుకు జట్కా బండి లో వేరే గమ్యాల్లో సాగి పోవచ్చు
కాలగమనం లో కరిగి పోవచ్చు
కాని నీ జీవితపు అతి మధుర ఘట్టాల అరుదైన క్షణాల్లో
నా విలువైన భాగస్వామ్యం ఉందన్న ఆనందం నా సొంతం
నిన్ను తల్చుకున్న మరు క్షణం శ్రావణ మేఘాలై వర్షించే
నా కన్నిల్లే సాక్ష్యం. సెలవ్ నేస్తం .
6 కామెంట్లు:
Chaalaa Baagaa cheppaarandee! Elaa marchipogalam ? Madi madhraanubhoithulani. Kallalo neellu chemarchaayi.
అజ్ఞాత వియోగాన్ని అనుభవించే వాళ్ళకి తప్పక కళ్ళలో నీళ్ళు
చమర్చ వలసిందే . ఎంతైనా ఫీల్ అయి రాసింది కదా ---;
Really its good......
చాలా బాగా రాసారు రవిగారు...
మనసు చలించింది. మనసులో భావాలు ఇలా చాలా బాగా వ్యక్తపరచటం నిజంగా దేవుడించిన వరం.
వెన్నెల గారు అంతా మీ అభిమానం
నా గొప్ప తనం ఏమి లేదు
మీరూ అదే పడవలో పయనిస్తున్నారు కాబట్టి
నా మూగ వేదన మీకు అర్ధం అయ్యింది .
స్నేహం లోని గొప్పతనం అదే !స్నేహితుడు/రాలు దూరమైనా గడిపిన ఆ స్నేహాన్ని కలుషితం కాకుండా వుంచుకోవటం !ఆ స్మృతులను స్వచ్చంగా గుర్తు చేసుకోవటం .అందులో నిజంగా అనుభవించిన వారు మాత్రమే వ్రాయగలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి