20 ఫిబ్ర, 2011

అప్పల్రాజుకు అప్పులేసిని జనాల కధలతో తీసిన సినిమాల్లో హిట్టయినవి కంటే ఫట్ అయినవే ఎక్కువ .సీతామహాలక్ష్మి ,సిరిసిరిమువ్వ ,శివరంజని , బంగారుబాబు వంటి హిట్ సినిమాలలో కధలో భాగంగా సిని జీవితాన్ని చూపిస్తే అవుట్ అండ్ అవుట్ మొత్తం సినిమా వాళ్ళ కధే అయిన నేనింతే వంటివి బాక్స్ ఆఫీసు వద్ద ఫల్టిలు కొట్టడం తెలిసిందే . ఆ కోవకే చెందిన మరో సినిమా వాళ్ళ కధ అప్పలరాజు ది .సిని వర్గాలలో వారికి నిత్యం పరిచయం అయిన విషయాలనే కధ లో చూపించారు . అయితే సామాన్య ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే విషయాలు లేక పోవడం తో సినిమా వాళ్ళ లోటు పాటులు , అక్కడ వుండే కుళ్ళు రాజకీయాలు తెలిపే డాక్యుమెంటరి గా సినిమా వుంది .అమలాపురం లో రంభ టాకీసు లో సినిమాలు క్రమం తప్పకుండా చూస్తూ స్నేహితులతో వాటిలోని లోటు పాటులు చర్చిస్తూ ఎప్పటికన్నా ప్రముఖ డైరెక్టర్ అయిపోవాలని నాయకి అనే కాదని రాసుకుని చాన్సుల కోసం హైదరాబాద్ వచ్చేసిన అప్పలరాజు కధే సినిమా .ఫైనన్సర్ నుంచి , హీరో దాక ప్రతి వాడు కధ లో వేలు పెట్టి తను తీద్దామనుకున్న ట్రాజడి కధని చివరికి కామెడి గా మార్చేస్తే అచేతనుడై చూడడం అప్పలరాజు వంతు అవుతుంది . అయితే ఆ సినిమాకే గుర్రం అవార్డు (నంది కి పారడి ) వస్తుంది ఆఖర్న .దిల్రాజు మీద వొంటికన్ను గవర్రాజు పాత్ర ద్వారా సెట్టైర్లు బానే పేల్చారు .మొత్తం డిస్త్రిబుషణ్ అంతా చేతిలో పెట్టుకుని నెలలు నెలలు తీసిన సినిమాని పదినిమిషాలు చూసి హిట్తో ఫట్టో తేల్చేసి తోచిన డబ్బులు యిచ్చి నిర్మాతలని ముంచుతాడని చెప్పించి వేరే పాత్రతో వీడేమన్న ఆంధ్ర ప్రేక్షకుల ప్రతినిదా అని తిట్టించారు . దైవజ్న శర్మ సిని పేర్లతో సినిమా భవితవ్యం తేలుతుందని అప్పప్పల రాజు అని పేరు మార్చుకుంటే వంద రోజులు గారంటి అని చెప్పే మూడ నమ్మకాలని కూడా చూపించారు .మెకానిక్ కే సైకిల్ చైన్ యిప్పడానికి పది నిమిషాలు పడితే శివ సినిమాలో పది సెకండ్స్ లో నాగార్జున చేత్తో సైకిల్ చైన్ పీకడం వెనక రాం గోపాల్ వర్మ లాజిక్ అర్ధం కాక అప్పటి నుంచి సినిమాలు చూడడం మానేసాను అని యింకో పాత్ర తో చెప్పించారు .అనుష్క నాగార్జున ఎఫ్ఫైర్ ,సినిమా తియ్యడం లో దాన్ని ప్రోమోట్ చెయ్యడం లో సినిమా వాళ్ళు చేసే ట్రిక్కులు వంటి అంతర్గత విషయాలు కూడా చూపించారు .నో బ్రెయిన్ (ఐడియల్ బ్రెయిన్ డాట్ కం ) వంటి వెబ్ సైట్స్ డబ్బులు తీసుకుని స్టార్ రే టింగ్స్ యివ్వడం సినిమా చూడ కుండానే దాని గురించి సమీక్షలు రాయడం వంటి వి కూడా వున్నాయి . మొత్తానికి ఈ సినిమా సినిమా వాళ్ళకోసం సినిమా వాళ్ళకే అర్ధం అయ్యే సినిమా వాళ్ళ సినిమా .

2 వ్యాఖ్యలు:

'Padmarpita' చెప్పారు...

సినిమా ఇంకా చూడలేదు.
వివరణ బాగుందండి!

అజ్ఞాత చెప్పారు...

Online lo inka raledu kada..anduke inka chudaledu...