24 జూన్, 2012

తిండి లో కూడా వివక్షా?

                  అప్పుడే ఆఫీసు నుండి వచ్చా. అప్పటికే తొమ్మిది అవుతోంది .అంతలో సెల్ మోగింది .ఎవరా అని విసుక్కుంటూ తీసా .సినిమా ప్రోడుక్షన్ మేనేజర్ .సార్ బావున్నారా ? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో వెంకటేష్ బాబు మహేష్ బాబు  కాంబినేషన్ లో పెళ్ళిచూపుల  సీన్ వుంది  స్నేహితుడి గా వొక్క రోజు షూటింగ్ రెండు మూడు డైలాగ్స్ కుడా వున్నాయి రాగలరా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ పొద్దున్నే కార్ పంపిస్తాను అన్నాడు .యింతకు ముందు రెండు మూడు సినిమాల్లో వెయ్యడం తో కొద్దో గొప్పో పరిచయాలు ఏర్పడ్డాయి . అయితే ఆ తర్వాత రోజు నేను కచ్చితం గా ఆఫీసు లో అటెండ్ అవ్వవలసిన మీటింగ్ సంగతి గుర్తుకు వచ్చి ఆ ఆఫర్ ని సున్నితం గా తిరస్కరించా .కొంచెం సమయం యిచ్చి చెప్పి వుంటే నటించేవాడినని  యింకో సారి చూద్దామని చెప్పి ఫోన్ పెట్టేసా .ఎంతో  మంది సినిమాలో వొక్కసారి కని  పిస్తే చాలు అని అర్రులు చాస్తుంటే  వచ్చిన అవకాశాన్ని వాడుకోలేని పరిస్తితి . నటన వొక  హాబీ అంతవరకే వుద్యోగం వొక భాద్యత అందులో ప్రబుత్వ అధికారి గా అది భగవంతుడు యిచ్చిన వరం .అరె వొక్క రోజు కుడా లీవ్ పెట్టుకోలేమా అనుకుని మళ్ళి  పెద్ద గీత ముందు నటన చిన్న గీత అనుకుని మర్నాడు పని లో ములిగి పోయా .మీటింగ్ అవ్వగానే ముందు గా మా లంచ్  అయ్యాక కింద స్టాఫ్ ని లంచ్ కి పిలుస్తారు .ఈ వివక్ష అన్ని చోట్ల వ్యాపించి వుంది . నా మూడు సినిమా షూటింగ్ అనుభవాలు గుర్తుకు వచ్చాయి .
       అక్కడ కుడా కార్వాన్ (ఎసి సదుపాయం తో పాటు యితర సౌకర్యాలు అన్ని వుండి షూటింగ్ స్పాట్ లో రెస్ట్ తీసుకోవడానికి పెట్టె బస్సు )కేవలం హీరో హీరోయిన్ లేదా బ్రహ్మానందం  స్తాయి కమెడియన్ కి మాత్రమె .మిగతా వాళ్ళు అంతా అక్కడ దగ్గరలో వేసిన చైర్స్ లో కూర్చో వలసిందే . వోకో సారి అందరికి సరపడా కుర్చీలు వుండవు .అందుకే ఆక్టర్  సహాయకులు కుర్చీలు మోసుకుంటూ తిరుగుతారు .యిక్కడ కూడా  మూడు గ్రూప్స్ గా కూర్చుంటారు ,హీరో ,డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , స్టార్ కమెడియన్ వొక చోట కూర్చుంటే ,కేరక్టర్ అర్తిస్త్స్ ,యితర చోటా మోట నటులు వొక చోట .సాంకేతిక నిపుణులు మరో చోట .యిందులో మొదటి గ్రూప్ కి అరార కొబ్బరి నీళ్ళు ,ఫ్రూట్ జ్యూసులు వస్తే మిగతా వాళ్ళకి టీ మంచి నీళ్ళు  వస్తుంటాయి .యింక భోజనాల దగ్గర అయితే తేడా యింకా కని పిస్తుంది . మొదటి గ్రూప్ కి రెండు మూడు ప్రత్యేకమైన నాన్ వెజ్  తో పాటు అయిటేమ్స్ తో పాటు వడ్డన సదుపాయం వుంటుంది .రెండో గ్రూప్ కి ప్రత్యేకమైన ఐటం వుండనప్పటికి వడ్డన సదుపాయం వుంటుంది . యిక మూడో గ్రూప్ ఎవరికి వారే వడ్డిన్చుకోవాలి .యింక రామారావు గారి హయాములో అయితే అయన తిన్నాకే మిగత వారు  తినాలిట చెయ్యి కడుక్కుందుకు వచ్చినా కూర్చున్న వాళ్ళంతా చేతులు కట్టుకుని నిల బడాలి ట .ఎన్ని సార్లు సెట్ లోకి వస్తే అన్ని సార్లు లేచి నిలబడి నమస్కారం చెప్పాల్సిందే . లేక పొతే వాడి పాత్ర నిడివి తగ్గిపోవలసిందే .అయితే నా విషయం లో ఆ యిబ్బంది ఎదురవ్వ లేదు వేసింది చిన్న నిడివి వున్నా పాత్రలే అయినా నా ఉద్యోగ రీత్యా నాకు అవసరమైన దాని కన్నా ఎక్కువ మర్యాద చేసి కొండక చొ కార్వాన్ లో కుడా విశ్రాంతి తీసుకున్న సందర్భాలు వున్నాయి .
 అయితే నేను షూటింగ్ స్పాట్ లో చూసి బాధపడిన వివక్ష నా మీటింగ్ తర్వాత లంచ్ లో కుడా కనిపించి (కింద స్టాఫ్ ని తర్వాత చెయ్యమనడం )యింకో ఆఫీసర్ తో స్టాఫ్ ని కుడాయిప్పుడే  రమ్మంటే  ?అని నేను అనే లోపే వుర్కోండి సార్  యిప్పుడు మనతో లంచ్ అలవాటు చేస్తే రేపు మనతో కలిసి మందు కొడతా మంటారు . అప్పుడు చనువు పెరిగి చంక ఎక్కుతారు పని ఎలా రాబడతాం?బ్రిటిష్ వాడి పద్దతే కరెక్ట్ ఎక్కడి వాడిని అక్కడే ఉంచాలి ,లేక పొతే తాళం తప్పుతుంది . అంటూ చికెన్ వడ్డించు కోవడానికి  ముందుకు పోయాడు . ఈ వ్యవస్థ మారదు .పైకి ఎదిగిన కొద్ది ఇగో లు పెంచుకోవడమే గాని భుజం మీద చెయ్యి వేసి పని చేసే తత్త్వం ఎక్కడా రాదేమో . అయితే నే విన్నది ఏంటంటే కొల్లివుడ్ (కేరళ లో )లో లైట్ బాయ్ నుంచి హీరో వరకు వొకే చోట కుర్చుని  అందరు అవే ఇటేమ్స్ తింటారని .మరి అన్ని చోట్ల ఈ వ్యవస్థ వస్తే బానే వుంటుంది ముఖ్యం గా ఆఫీషియల్ మీటింగ్స్ లో .

4 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

KOlly wood lo money save cheyyadaaniki ala thintaaru. Peeddha budget vasthe malli vallalo kuda feelings vasthayi.

జలతారువెన్నెల చెప్పారు...

సిరివెన్నెల గారి పాట!

"ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
నడవర ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి
వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినది..."

మీ తోటి ఆఫీసర్ ని మీరు కన్విన్స్ చెయ్యాల్సింది. అతను చేసిన కామెంట్ వినేసి, మౌనం గా ఉంటే మీరు కూడా మీ తోటి ఆఫీసర్ తో ఎకీభవించినట్టే కదా? మార్పు ఎక్కడనుంచో రాదు కదా? మనలోంచే రావాలి. నా అబిప్రాయం ఇది!

the tree చెప్పారు...

good thinking sir,
we will wait for change.

thanooj చెప్పారు...

meeru rasindhi nenu nammadamledhu.meeru tap water ichchinantha udaaramga minaral water ivvagalara